27, నవంబర్ 2023, సోమవారం

 శు భో ద యం🙏


నీపంచం బడియుండఁగాఁ గలిగిన న్భిక్షాన్నమే చాలు ని

క్షేపంబబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప నా

శాపాశంబులఁజుట్టి త్రిప్పకుము సంసారార్థమై బంటుగాఁ

జేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా!

శ్రీకాళహస్తీశ్వర శతకము-ధూర్జటి!


 భావము:

శ్రీ కాళహస్తి క్షేత్రమున వెలసిన  పరమేశ్వరా! 

నన్ను నీ దగ్గరగా వుండనీయవయ్యా!నీ వనుగ్రహించే భిక్షాన్నమే నాకు మహాప్రసాదము . ఈ సంసారసాగరంలో ,ఆశాపాశాలతో బంధించి నన్ను బాధపెట్టకు.దయతో నీ సేవకునిగా చేపట్టు. "అని కవి శివుని ప్రార్ధిస్తున్నాడు.


శివభక్తులైన కవులందరినీ ఆకర్షించే  పరమేశ్వరుని లీల భిక్షాటన ,ఆదిశంకరాచార్యులతో సహా!

"సదా మోహాటవ్యాం చరతి   యువతీనాం కుచగిరౌ/

నటత్యాశా శాఖా స్వటతి ఝటితిీ స్వైర మభితః/

కపాలిన్ భిక్షో మే హృదయ కపి మత్యంత చపలం/

దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో//.

అన్నారు.


ఓ కపాలీ!విభూ!శివా!నీవు ఆదిభిక్షుకుడవు.ఎల్లప్పుడూ సంసారమనే వ్యామోహపు అడవిలో సంచరిస్తూ ,భార్య పిల్లలు అనే సంసారగత  ఆశా ,మోహములను కొమ్మలయందు దుముకుచూ ,పరుగులిడుచూ అతి చంచలమైన నా మనస్సనెడి కోతిని భక్తి యనెడి త్రాటితో గట్టిగా కట్టి నీవశం 🙏చేసుకో ..

(నీవు ఆది భిక్షుడవు కదా?నీ వెంట ఈ కోతిని త్రిప్పుకొనమని ధ్వని.)

శివానందలహరి .

("స్తోత్రకదంబము" నుండి)🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌟

కామెంట్‌లు లేవు: