28, ఏప్రిల్ 2024, ఆదివారం

జలాండము (HYDROCELE ) నివారణా యోగాలు -

 జలాండము (HYDROCELE ) నివారణా యోగాలు  -


 * కొబ్బరికోరు ఆముదములో వెచ్చచేసి కడుతున్న చాలాకాలం నుంచి ఉన్న బుడ్డలు కూడా హరించును .


 *  మిరియాలు , ఉలవలు , తెలకపిండి వీటిని సమాన భాగాలుగా నూరి వెచ్చచేసి కట్టిన బుడ్డలు తగ్గును.


 *  గచ్ఛ ఆకు వేడిచేసి కట్టుచున్నను బుడ్డలు హరించును .


 *  ఉలవలు , వెల్లుల్లి , ఇంగువ, గచ్ఛపప్పు వీటిని సమపాళ్లలో నలగగొట్టి కషాయము కాచి నేతితో సేవించుచున్న బుడ్డలు తగ్గును.


 *  గచ్చ చిగుళ్లు ఆముదముతో వేడిచేసి బుడ్డలపైనా వేసి కడుతున్న బుడ్డలు తగ్గును.


 *  సైన్ధవ లవణం పది గ్రాములు , జిల్లేడు ఆకులు ఇరవై గ్రాములు తీసుకుని మెత్తగా నూరి అండవృద్ధి పైన లేపనం చేయుచున్న వృషణముల వాపులు హరించి మరలా వ్యాధి రాదు .


 *  ముద్దకర్పూరము , గవ్వపలుకు సాంబ్రాణి రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని బాగా నూరి బుడ్డపై పట్టు వేసిన బుడ్డ తగ్గును. 


    పైన చెప్పిన యోగాలలో మీకు సరిపోయే  ఏదో ఒక యోగాన్ని ఎంచుకొని ఉపయోగించుకోగలరు.


   

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

అన్నానికి దోషం

 



*అన్నానికి దోషం అంటడమంటే ఏమిటి ? అదెలా పోగొట్టుకోవాలి ?*

               ➖➖➖✍️

```

ఎడమ చేతితో తినే తిండికి, నిలబడి తినే తిండికి రాక్షస శక్తులు వస్తాయి. 


ఒకరి ఎంగిలి ఒకరు పంచుకు తింటే అది కూడా దోషాన్నమే.  


అన్నానికి జాతి దోషం,ఆశ్రయ దోషం, నిమిత్త దోషం అని మూడు రకాల దోషాలుంటాయి. 


జాతి దోషం అంటే సహజంగానే ఆ పదార్థానికి ఉన్న దోషము. 

అవి ఉల్లి,వెల్లుల్లి,ముల్లంగి లాంటివి. 

వీటిలో తామస గుణములు ఉంటాయి కనుక ఇవి వర్జనీయములు. 


సాత్త్విక సాధన చేసి భగవంతుడు కావాలి అనుకునే వారు వీటిని వదిలేయాలి. 


ఆశ్రయ దోషం అంటే పాత్రను బట్టి దోషము. పాలు శ్రేష్టమైనవి. కాని అవి రాగి పాత్రలో పోసి భగవంతునికి నివేదిస్తే అవి కల్లుతో సమానం. అది పాత్ర దోషం. 


నిమిత్త దోషం అంటే అవి పుట్టే చోటు బాగుండాలి. 

మారేడు దళాలు శివునికి ప్రీతి. కాని ఆ చెట్టు శ్మశానంలో ఉంటే అది దోషం. 

అంటే దుష్టమైన ప్రాంతంలో పెరిగినా దోషమే. 

కాకి, పిల్లి, కుక్క మొదలైనవి ముట్టుకున్న భోజనము కూడా దోషమే. 


మనము బయట నుంచి తెచ్చిన వస్తువులు ఎలా పండిస్తున్నారో, ఎక్కడ నుంచి తెస్తున్నారో తెలీదు. 

అందుకని భగవంతునికి నివేదించి భోజనం చెయ్యాలి. 

మన దగ్గరకు రాక మునుపు అవి ఏమైనా, 

మన దాకా వచ్చాక జాగ్రత్త అవసరం కనుక భగవంతునికి నివేదించడం వలన ఆ దోషాలు పోతాయి. 


అందుకే ‘దోషము లేని అన్నము ఇవ్వమ్మా’ అని వేడుకోవాలి. 

‘ప్రతి రోజు నీకు నివేదన చేసి తినే భాగ్యం కల్పించు తల్లీ’ అని కోరుకోవాలి.  


బియ్యాన్ని రామ నామముతో ఏరుకొని ఆ బియ్యంతో వండుకొని తింటే ఇంక దానికి దోషము ఉండదు.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 944065 2774.

లింక్ పంపుతాము.

దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

పంటలకు పురుగు పట్టి,

 ®️చైనాలో పిచ్చుకలు ఒక సంవత్సరంలో 6.5kg ధాన్యం తింటున్నాయని, ఈ ధాన్యాన్ని అంతా కాపాడితే సుమారు 60వేల మందికి ఆహారం దొరుకుతుందని ఆలోచించి సుమారు 30 లక్షల పిచ్చుకలను చంపేశారు. చెట్లపై వాలకుండ డబ్బాలతో కొట్టి పారద్రోలారు, వాటి గుడ్లను పగలగొట్టారు. 

®️పిచ్చుకలను చంపేసి వాటి సంఖ్యను తగ్గించడం వలన పంటలకు పురుగు పట్టి, తినడానికి తిండి దొరక్క ఆ తర్వాత 1958-61 సంవత్సరాలలో తీవ్రమైన కరువు ఏర్పడింది.


®️సుమారుగా 4.5 కోట్ల మంది ఆకలితో చనిపోయారు. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి సోవియట్ యూనియన్ నుండి కొన్నివేల పిచ్చుకలను దిగుమతి చేసుకున్నారు. 


®️కాబట్టి అభివృద్ధి ఒక్కటే కాదు, చెట్టు, పుట్ట, పిట్ట ప్రతీది మానవ మనుగడకు అవసరమే.®️👆

ప్రధాన తేడా

 అమెరికా కి ఇండియా కీ ప్రధాన తేడా


20 యేండ్ల క్రితం సాధారణ ఉద్యోగి లా గూగుల్ లో జాయిన్ అయిన సుందర్ పిచాయ్ కి ఆ కంపనీ పెట్టిన వాళ్లే పక్కకి తప్పుకొని CEO పదవి అప్పజెప్పారు. 


బిల్ గేట్స్ లాంటి టెక్నాలజీ దిగ్గజమే పక్కకి తప్పుకొని తాను పెట్టిన మైక్రోసాఫ్ట్ కంపనీ కి మన సత్య నాదేళ్ళ కి CEO పదవి అప్పజెప్పాడు.


అతి పెద్ద సాఫ్ట్ వేర్ ఎగుమతుల కంపనీ, ఎన్నో పాలిటిక్స్ ఉండే కాంగ్నిజెంట్ కూడా తెలుగు అతను రవి కుమార్ కి CEO పదవి అప్పజెప్పారు. 


అమెరికా లో ఎవరికైనా టాలెంట్ ఉంది అని గమనిస్తే ఎక్కువ భాగం తాము పక్కకి తప్పుకొని మరీ వేరే వాళ్ళ టాలెంట్ ని గుర్తించి వాడుకొని తాము ఇంకొంచెం పైకి ఎదుగుతారు. 


ఇండియా లో ఎక్కువ భాగం - ఎవరికైనా టాలెంట్ ఉంది అని గమనిస్తే మనకి ఎక్కడ పోటీ అవుతాడేమో అని ఏదో రకం గా తొక్కేసి తాము కూడా ఇంకొంచెం దిగజారుతారు. 


ఇండియా లో ఉన్నంత టాలెంట్ ప్రపంచం లో ఎక్కడా లేదు.

మన దేశ జనాభా ప్రస్తుత సగటు వయస్సు 28 సంవత్సరాలు. అత్యంత ఎక్కువ యువత ఉంది, ఎక్కువ టాలెంట్ మరియూ స్కిల్ ఉంది మన దేశం లోనే కానీ వాటిని తగురీతిలో గుర్తుంచి వాడుకునేవాళ్ళు తక్కువ. 


మన దగ్గర ఉన్న టాలెంట్ హబ్ లకి వాళ్ళ కులపోళ్ళకి, వాళ్ళ చెప్పు & చేతల్లో ఉండే వారిని అధిపతులగా నియమిస్తారు. టాలెంట్ ఉండి అమెరికా, కెనడా, యూరప్ మీద అవగాహన ఉండి ఇండియా అంటే ప్రాణం ఇచ్చేంత ఇష్టం ఉండి నిజమైన స్కిల్ డెవలప్ చేసే వ్యక్తి కి కనీసం గేట్ పాస్ కూడా ఇవ్వరు..! 


మారండ్రా అయ్యా, భవిష్యత్ భారతానికి పునాదులు వేయండ్రా. నవ భారతాన్ని నిర్మించండి వినూత్న రీతిలో 🙏🏽


- పూర్తి వ్యక్తిగత అభిప్రాయం

మీరు మామూలు మడిసి కాదు.

 వీణ చిట్టి బాబు🙏

 

ఎప్పుడో.. చాలా ఏళ్ల క్రిందటి సంగతి.. జగద్విఖ్యాతులైన

వీణ చిట్టిబాబుగారికి తంజావూరులో ఒక కచేరి ఏర్పాటు అయింది. మదరాసు నుండి వీణ తీసుకొని, రైలులో తంజావూరు చేరుకున్నారు ఆయన. అక్కడి సభా నిర్వాహకులు రైల్వే స్టేషనుకు వచ్చి,చిట్టిబాబు గారికి స్వాగతం పలికి, ఒక రిక్షాలో వారిని హోటలుకు చేర్చారు. అప్పట్లో తంజావూరు వంటి ఊళ్లలో రిక్షాయే అందరికీ ప్రయాణ సాధనం.


రిక్షా అతనితో "మళ్లీ సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా వచ్చి,సారును కచేరీ జరిగే హాలుకు తీసుకు రావాలి" అంటూ చెప్పి, నిర్వాహకులు చిట్టిబాబుగారి వద్ద సెలవు తీసుకున్నారు.


   చిట్టిబాబుగారు ఆరోజు మధ్యాహ్నమంతా హోటల్ లో విశ్రాంతి తీసుకొని, సాయంత్రానికి కచేరీకి సిద్ధం అయ్యారు.


రిక్షా అతను సకాలానికి హోటలుకు వచ్చి, సామాను మోసే అలవాటుకొద్దీ వీణను తీసుకోబోతే, ఎవరి చేతికీ తన వీణ ఇవ్వటం అలవాటులేని చిట్టిబాబుగారు, అతనితో విషయం చెప్పి,తన బాగ్ అతని చేతికి ఇచ్చి, వీణతో రిక్షా ఎక్కారు.రిక్షా వేదికను సమీపించాక, దిగుతూ రిక్షా అతనితో, "బాబూ! ఇక్కడ నాకచేరీ సుమారు మూడు గంటలసేపు ఉంటుంది. అప్పటివరకూ నువ్వు ఇక్కడ చేసేదేమీ లేదు కనుక, ఈలోపుగా నీ బేరాలు చూసుకొని, తిరిగి తొమ్మిదిన్నరకు వచ్చి,నన్ను హోటల్లో దించితే సరిపోతుంది" అని, వేదికనెక్కారు చిట్టిబాబుగారు.


వేదికను దివ్యంగా అలంకరించారు నిర్వాహకులు.. హాలంతా శ్రోతలతో నిండి ఉంది. 'విరిబోణి' అటతాళ వర్ణంతో అరంభమైన కచేరీ, ఒక్కొక్క అంశంతో ద్విగుణీకృతమైన రక్తిని సంతరించుకుంటూ సాగిపోయింది.సహజసుందరులైన చిట్టిబాబుగారు, చిరునవ్వుతో అలవోకగా అంగుళులు కదిలిస్తూ వీణపై పలికించిన రాగ, తాన, స్వర ప్రస్థారాలకు మైమరచిపోయి, కరతాళ ధ్వనులతో తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు జనం.సహకార వాద్యాలైన మృదంగ, ఘట విద్వాoసులూ లబ్ధప్రతిష్టులే.. అద్భుత రీతిలో తమ సహకారం అందించారు వారు..


ఎలా గడచిపోయాయో తెలియదు.. మూడు గంటలు..

'పవమాసన సుతుడుబట్టు..' అంటూ వైణికులు మంగళం ఎత్తుకున్నాక గానీ ఈలోకంలోకి రాలేదు శ్రోతలు.

  

నిర్వాహకుల ఆనందానికి హద్దులు లేవు.ఘన సత్కారం అందించారు... సభానంతరం.. చిట్టిబాబుగారిని అభినందించేందుకు వేదికపైకి బారులుకట్టారు జనం.


ఆ జనంలో.. చివరినుండి ఒక చిరిగిన బనీనుతో,మాసిన గడ్డంతో అందరినీ తోసుకువస్తున్న ఒక వ్యక్తిని అడ్డుకున్నారు ముందున్న జనం. "ఎవడివయ్యా నువ్వు? ఏంకావాలిక్కడ? ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నచోటికి నీకేం పని? వెళ్లు వెనక్కి.." అంటూ గసురుతున్నారు..


"అయ్యా! ఒక్కపాలి ఆ వీనాయనతో మాటాడాల.. ఎల్లనీయండి.." అంటూ వేడుకుంటున్న ఆ వ్యక్తిని చూశారు చిట్టిబాబుగారు. నిర్వాహకులతో, అతనిని తన దగ్గరకు పంపమని ఆదేశించారు. దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారాయన! ఆ వ్యక్తి.. తనను అక్కడకు తెచ్చిన రిక్షా అతను.


దగ్గరకు రాగానే వినయంగా నమస్కరిస్తూ.. "అయ్యా! మీరు మామూలు మడిసి కాదు.. దేవుడు పంపిన మహిమగలోరు.. మీరు పైకి ఎల్లినాక, నేను బేరాలకి ఎల్దామనుకొని గుడా, కూసింతసేపు ఇందారని ఎనకమాల సుట్టగాలూస్తా నుంచొన్నా.. ఆయ్యా! తమరి ఈన ఎంత పున్నెం సేసుకుందో.. ఏయో లోకాలకి నన్ను తీసుకెల్లిపోనాది.. ఇయాల వాయించింది మీరు గాదు.. బగవంతుడే.. కాసేపు ఇందామనుకొన్న నేను.. సివరి దాకా కదలనే లేకపోయా.. నేనెంత అదురుష్టమంతున్నో... నా రిక్షాల మిమ్మల్ని తెచ్చాను.. అయ్యా! నిజం సెప్తున్నా.. నేను రోజుకి పది రూపాయలు సంపాయిస్తా.. అందులో అయిదు రూపాయలు ఇంట్ల ఇచ్చి, ఐదుపెట్టి మందు తాగతా.. అలా అయితేనే మడిసిని..కానీ ఇయాల మీ ఈన ఇన్న తరువాత నాకింక జీవితంల తాగాలనిలేదు బాబు.. కడుపు నిండిపోనాది.. అయ్యా! ఇదిగో.. ఈ పేదోడి ఆనందం కోసం.. ఈ అయిదు మీరు ఉంచుకోవాల." అంటూ తన గుప్పిట, నలిగిపోయిన అయిదు రూపాయల నోటుతీసి, చిట్టిబాబుగారి చేతిలో పెట్టి,మారు మాట్లాడనీయక, వెనుతిరిగి వెళ్ళిపోయాడు.


చిట్టిబాబుగారి నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి.

చేష్టలుడిగి, చూస్తూ ఉండిపోయారు. "నిజంగా నా జీవితంలో మరువలేని రోజు ఇదే.. ఏ సంగీత జ్ఞానం, స్వరపరిచయం లేని సామాన్య వ్యక్తి నా సంగీతాన్ని మెచ్చి, ఇచ్చిన ఈ బహుమానం, వెలకట్టలేనిది. ఒక కళాకారుడి జన్మకు ఇంతకంటే సార్థకత ఏముంటుంది?" అనుకున్నారు.


చిత్రమేమిటంటే.. తనకొచ్చిన అవార్డులు, ప్రశంశాపత్రాల మాట ఎలాఉన్నా, ఆ రిక్షాఅతను ఇచ్చిన అయిదు రూపాయల నోటును మాత్రం చిట్టిబాబుగారు, తాను పరమపదించేవారకూ భద్రంగా దాచుకున్నారుట. .🙏

 

నీతి:- మనం ఏ స్థాయి కి వెళ్ళినా ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించిన... మనకంటూ ఉన్న కొన్ని మధురానుభూతులను ఎన్నటికీ మరచిపోరాదు.

 

      🌹సేకరణ 🌹


                   -

శ్రీ కాళహస్తీశ్వర శతకము

 శు భో ద యం🙏


శ్రీ కాళహస్తీశ్వర శతకము

                       (200)

(400 సంవత్సరాల కిందట శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరైన  "ధూర్జటి" మహాకవిచే ఆవిష్కరించబడినది.


వెనుకం జేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్

వెనుకన్ ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్

నను నేఁజూడగ నావిధుల్దలంచియున్ నాకే భయం బయ్యెడుం

జెనకుం జీఁకటియాయెఁ గాలమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!


తాత్పర్యం

శ్రీ కాళహస్తీశ్వరా! నా ఈ జన్మముననే మునుపు ఆయా యౌవనాది దశలయందు చేసిన దుష్కర్మముల నాలోచించిన కొలది రోత కల్గుచున్నది.  రానున్న దుర్మరణము తలుచుకొనగా - ఈ ఉన్న కాలమైన సదుపయోగము చేసికొని నిన్ను ఆరాధింపనిచో జీవితమునందు ఏమి మంచి సాధించనివాని నగుదునే?? నేను చేసిన పనులను తల్చుకొనిన నన్ను చూడగా నాకే భయము కల్గుచున్నది. ఏది ఏమైనను కాలమునకు (నా ఆయువునకు) అత్యంత బాధాకరమగు చీకటి క్రమ్ముకొనివచ్చుచున్నట్లగుచున్నది. మిగిలిన ఈ కొంతకాలమైన నిన్ను ఏకాంతముగ ఆరాధించి నీ అనుగ్రహము పొందుటకు యత్నము చేయుదును.


(శివ భక్తుడైన శ్రీ ధూర్జటి ఆత్మ నివేదన -మీలో కొందరిని 'పద్య భాగం'  అలరింపచేయలేక పోయివుండవచ్చు గాక. కానీ భావం ద్వారా నైనా ఆయన హృదంతరాళాల్లోని ఆర్తిని మీరు గ్రహించి వుంటారు. ఎందుకంటే చాలా సందర్భాలలో..మనకు కూడా వర్తిస్తుంది కనుక!


శతకసాహిత్యం సౌజన్యంతో-

ఆదివారం, ఏప్రిల్ 28, 2024*

 శుభోదయం 🌹🙏పంచాంగం       ఓం శ్రీ గురుభ్యోనమః

*ఆదివారం, ఏప్రిల్ 28, 2024*

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

       *చైత్ర మాసం - బహళ పక్షం*   

తిథి      : *చవితి* ఉ6.26 వరకు

              తదుపరి పంచమి

వారం   : *ఆదివారం* (భానువాసరే )

నక్షత్రం  : *మూల* రా2.49 వరకు

యోగం : *శివం* రా12.45 వరకు

కరణం  : *బాలువ*  ఉ6.26 వరకు

           తదుపరి *కౌలువ* సా6.04 వరకు

వర్జ్యం   : *ఉ10.47 - 12.23*  

            మరల *రా1.12 - 2.49*

దుర్ముహూర్తము :  *సా4.33 - 5.23* 

అమృతకాలం    :  *రా8.24 - 10.00*

రాహుకాలం       : *సా4.30 - 6.00*

యమగండ/కేతుకాలం : *మ12.00 - 1.30*

సూర్యరాశి: *మేషం* || చంద్రరాశి: *ధనుస్సు*

సూర్యోదయం: *5.40* || సూర్యాస్తమయం: *6.14*

*సర్వేజనా సుఖినో భవంతు*

డా. కొండపల్లి శేషగిరిరావు

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹చిత్ర కళ అనగానే గుర్తుకు వచ్చే ఒక గొప్ప లెజెండ్ డా. కొండపల్లి శేషగిరిరావు గారు. కొన్ని దశాబ్దాలుగా తెలుగు వారి హృదయాల్లో గూడుకట్టుకున్న పేరు అది. 

 ఆయన శతజయంతి వేళ 

 జీవిత విశేషాలు కొన్ని శ్రీభారత్ వీక్షకులకు అందించారు వారి కోడలైన ప్రముఖ రచయిత్రి డా. కొండపల్లి నీహారిణి గారు. తెలుగు చిత్ర కళ ఎంతో అభివృద్ధి చెందిందంటే దానికి ఆద్యులు ఆయనే. వారి చిత్ర కళా కృషి, ప్రపంచ గుర్తింపు పొందిన వారి చిత్రాల గురించి నీహారిణి గారి మాటల్లో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

ఒక సత్యం

 నిజం!🌹  నిజం!🌹  నిజం!🌹


వాట్సాప్ ద్వారా వచ్చిన ఒక సత్యం!! వ్రాసిన వారి పేరు తెలియదు. వారి సౌజన్యంతో!!


🌹జీవితంలో ఎవరికోసం ఈ పాకులాట...? ఏది నీ అసలు జీవితం...!*🌹


   మరణానంతరం మన అంత్యక్రియలు జరిగిన తరువాత ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా...? కొద్ది గంటల్లో రోదనధ్వనులన్నీ పూర్తిగా సద్దుమణుగుతాయి. కుటుంబసభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో నిమగ్నమవుతారు.


మనవలు, మనవరాళ్లు ఆటపాటల్లో మునిగి పోతారు. ఓ యువతీ యువకుల జంట  ముసిముసినవ్వులు నవ్వుకుంటూ...  పరస్పరం ఫోన్ నెంబర్లు ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. మరికొందరు దగ్గర్లో ఉన్న టీషాపులో బాతాఖానీకి బయల్దేరుతారు.


అప్పటివరకూ ఆప్యాయత ఒలకబోసిన పక్కింటాయన శ్రాద్ధకర్మల సందర్భంగా వదిలిన పిండోదకం, విస్తరాకులు తన ఇంటి ముంగిట పడ్డాయని చిర్రుబుర్రులాడుతాడు. ఈ లోగా దగ్గరి బంధువు ఒకాయన ఆఫీసులో సెలవు దొరకని కారణంగా అంత్యక్రియలకు హాజరవ్వలేక పోయానని కుటుంబ సభ్యులతో మొక్కుబడిగా వాపోతాడు.


మరుసటిరోజు వెళ్ళిపోయినవాళ్ళు వెళ్ళిపోగా... మిగిలిన వాళ్ళల్లో ఒకాయన మధ్యాహ్న భోజనాల్లో ఉప్పెక్కువైందని అలుగుతాడు. మరొకాయన దానికి వత్తాసు పలుకుతాడు. నువ్వు జీవితాంతం ఒళ్ళు హూనం చేసుకొని, కడుపు కట్టుకుని కూడబెట్టిన కోట్లు విలువ జేసే ఆస్తుల్ని పంచుకొనే విషయంలో… నీ పుత్రరత్నాలు పేచీ పడతారు. నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అణా పైసలతో లెక్కలేసి వాటాలు తేల్చేసుకుంటారు. అప్పటికింకా నువ్వు పోయి నిండా నాల్రోజులు కూడా కాలేదు సుమా…!


మెల్లగా బంధు, మిత్రులందరూ ఒక్కక్కళ్ళుగా జారుకొంటారు. విదేశాల నుండి వచ్చిన బంధువులైతే పదకొండో రోజు తరువాత తిరుగు ప్రయాణానికి ఇప్నట్నించే రహస్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.


నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నెంబరుకు వచ్చే ఫోన్లని నీ కొడుకో, కూతురో విసుగ్గా ఆన్సర్ చేస్తారు. కుదిరితే నీ ఆస్తిపాస్తులు, రావలసిన బాకీల గురించి తెలివిగా కూపీ లాగుతారు. అంతలో తమ ఎమర్జెన్సీ లీవు అయిపోవడంతో కొడుకులు, కూతుళ్ళు నీ భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు.


నెల తిరగక ముందే మీ జీవిత భాగస్వామి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వడం జరుగుతుంది. 


అంతకు ముందే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యథాతథంగా సినిమాలు, షికార్లు చుట్టబెట్టేస్తుంటారు. మొత్తంగా నెలలోపే నీ చుట్టూ ఉన్నవారు, నీకు అత్యంత ఆత్మీయులు, నువ్వు లేకుండా బతకలేమన్నవాళ్ళు  అందరూ తమ తమ విధుల్లో ఎంతగా మునిగిపోతారంటే  నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావనే విషయమే మర్చిపోయేంతగా…!


ఒక పండుటాకు ఓక మహావృక్షం నుండి ఎంత సునాయాసంగా, ఎంత వేగంగా రాలిపోతుందో అంతే వేగంగా 'నీవారు' అనుకున్న అందరి స్మృతి పథంలోంచి నువ్వు కనుమరుగై పోతావు. నీ మరణానంతరం కూడా అవే వర్షాలు, అవే రాజకీయాలు, బస్సుల్లో సీటు కోసం అవే తోపులాటలు. పండుగలు ఒకదాని వెంట మరోటి వస్తూనే ఉంటాయి. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకున్న నీ పెంపుడు జంతువులు మరో యజమానిని వెతుక్కుంటాయి.


అంతలో నీ సంవత్సరీకాలు రానే వస్తాయి. నీ పెళ్ళి కంటే ఆడంబరంగా జరిగే ఆ తంతును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా...! నీ జ్ఞాపకార్థం అతిథులకి పంచబోయే స్టీలు శాల్తీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయంపై కొడుకులు, కోడళ్ళ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది. ఈ కార్యక్రమంతో నీకు ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే. నీ గురించి మాట్లాడుకునే వారు గానీ, నిన్ను తలచుకునే వారు గానీ దాదాపుగా ఉండరు.


ఇప్పుడు చెప్పండి…? ఈ విషయంలో స్త్రీలుగానీ, పురుషులుగానీ ఎవరైనా సరే  ఇన్నాళ్ళూ మీరు పాకులాడింది ఎవరికోసం...? దేని కోసం తెగ హైరానా పడిపోయావు...? నువ్వు కట్టించిన భవనంలో నివసించే వారు సైతం నీ ఉనికిని మర్చిపోయారంటే, నీ తపనకూ, తాపత్రయానికీ ఏమన్నా అర్థం ఉందా…? జీవితంలో ముప్పాతిక భాగం నీవాళ్ళనుకునే వాళ్ళకోసం, వారి మెప్పు పొందటం కోసం, వారి భవిష్యత్తు కోసం బతికావు కదా…! వాళ్ళకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక ఉందా…? ఇవన్నీ కొద్ది తేడాతో అందరికీ వర్తిస్తాయి. కాబట్టి, నీ కోసం నువ్వు తపించు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ... బతికినన్నాళ్ళు సంతృప్తిగా బతకటంలోనే అర్థం, పరమార్థం ఉంది కదూ...! 


ఈ సమాచారం మిమ్మల్ని  ఆలోచింపజేసేదిలా ఉందని మీకు తెలియజేయడం కొరకు ఇవ్వడం జరిగినది. మనకున్న అన్ని అశాశ్వతమైన బంధాలకంటే కేవలం భగవత్భందం గొప్పదైనది  అని  గ్రహించాలి.


{వాట్సాప్ ద్వారా వచ్చిన ఒక సత్యం!! వ్రాసిన వారి పేరు తెలియదు. వారి సౌజన్యంతో!!}


🌹సేకరణ 🌹

తామరాకు మీద నీటిబొట్టు

 💎🌅  *_-|¦¦| శుభోదయమ్ |¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


   శ్లో𝕝𝕝 *అర్థేన భేషజం లభ్యమ్-ఆరోగ్యం న కదాచన|*

        *అర్థేన గ్రంథసంభారః-జ్ఞానం లభ్యం ప్రయత్నతః*||


తా𝕝𝕝 *డబ్బుతో మందులను కొనవచ్చు కానీ ఆరోగ్యం కొనలేము....డబ్బుతో పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు, కానీ అది ఎంతో కష్టపడి ప్రయత్న పూర్వకంగా సంపాదించాల్సిన జ్ఞానాన్ని కొనలేదు*.....


        


  👇 //---------- ( *భజగోవిందం* )---------// 👇


శ్లో𝕝𝕝   *నళినీ దలగత జలమతి తరలం*

        *తద్వాజ్జీవితమతిశయచపలం*  

        *విద్ధి వ్యాద్యభిమానగ్రస్తం* 

       *లోకం శోకహతం చ సమస్తం* ||4||


భావం: తామరాకు మీద నీటిబొట్టు ఎంత చెంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది, అల్పమైనది. అంతేకాదు ఈ *మానవ జీవితం అంతా రోగాలతోనూ 'నాది' అన్న మమకారంతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైందని తెలుసుకో*.

టెస్ట్ పాస్ అయ్యావు

 😄😃😄😃😄


*టీచర్*: ఇండియా గేట్ అంటే ఏమిటి ?

*స్టూడెంట్*: బస్మతీ బియ్యం.


*టీచర్*: చార్మినార్ అంటే ?

*స్టూడెంట్*: సిగరెట్లు.


*టీచర్*: తాజ్ మహల్ అంటే ?

*స్టూడెంట్*:   "' టీ "' ,  సర్.


*టీచర్* (కోపంగా):  అజ్ఞానపు శుంఠ ! మన జాతీయ కట్టడాలను అపహాస్యం చేశావు. నువ్వు టెస్ట్ ఫెయిల్ అయ్యావు. వెళ్ళి మీడాడీది సిగ్నేచర్ తీసుకురా. 


స్టూడెంట్ మరుసటి రోజే టీచర్ చేతికి ఓమంచి ఆకర్షణీయమైన పార్సిల్ స్టూడెంట్ వినమ్రతతో అందించాడు.


*టీచర్*: ఏమిటిది ?

*స్టూడెంట్*:  సిగ్నేచర్ సర్ ! మీరు మా డాడీది సిగ్నేచర్ తీసుకుని రమ్మన్నారు. ఫుల్ బాటిల్ నే పట్టుకొచ్చాను. 🍾


టీచర్ చెమ్మగిల్లిన కళ్ళతో స్టూడెంట్ తలను ఆప్యాయంగా నిమురుతూ అన్నాడు *" నేనంటే నీకు ఇంత అభిమానం ఉందేమిట్రా, పిచ్చిసన్నాసీ ? నా హృదయాన్ని ద్రవింపచేశావు. టెస్ట్ పాస్ అయ్యావు, ఫో !!! "*


😅😂😆

సేకరణ:- శ్రీ S.T.G. శ్రీనివాస ఆచార్యుల వాట్సాప్ పోస్ట్.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5125* *శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం  -‌ చతుర్థి - మూల -‌‌ భాను వాసరే* *28.04.2024.* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

రాశి ఫలితాలు

 28-04-2024 

భాను వాసరః ఆదివారం 

రాశి ఫలితాలు

************

మేషం

ఆప్తుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. వృత్తి ఉద్యోగ  విషయాల్లో చర్చలు సఫలమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

వృషభం

అకారణంగా ఇతరులతో విరోధాలు  కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాట విభేదిస్తారు.  సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున  విలువైన వస్తువుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్ధిక నష్ట సూచనలున్నవి

---------------------------------------

మిధునం

శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పితృ వర్గం వారితో మాటపట్టింపులు ఉంటాయి. ఋణదాతల నుండి ఒత్తిడి  పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కర్కాటకం

నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి లాభాలు అందుతాయి. కుటుంబ విషయంలో  ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.

---------------------------------------

సింహం

ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది. ఇంట బయట  దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలలో   ఆలోచనలు కలసి రావు. ధన పరమైన విషయాలలో నిదానంగా వ్యవహరించుట మంచిది.

---------------------------------------

కన్య

ఖర్చుకు తగిన ఆదాయం లభిస్తుంది. ఇంటాబయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు  నష్టాలు అధిగమించి లాభాల బాట పడతాయి. ఉద్యోగమున  అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి.  స్థిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

---------------------------------------

తుల

కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర  దేశ సంచారం చేయవలసి వస్తుంది. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభించవు

---------------------------------------

వృశ్చికం

ధనాదాయం బాగుంటుంది. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత  లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు.

---------------------------------------

ధనస్సు

దాయాదులతో స్ధిరాస్తి  వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని  వ్యవహారాలలో ఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు. నిరుద్యోగులు లభించిన ఉన్నత  అవకాశాలను జారవిడువకుండా  చూసుకోవాలి. ఇంటా బయటా   గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

---------------------------------------

మకరం

సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభ  వార్తలు అందుతాయి.

---------------------------------------

కుంభం

అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక  ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధన  విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి  ఉద్యోగాలలో  నిలకడ లోపిస్తుంది. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.

---------------------------------------

మీనం

జీవిత భాగస్వామి బంధువుల  నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు.

---------------------------------------

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.28.04.2024

ఆది వారం (భాను వాసరే) 

*************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ చైత్ర మాసే కృష్ణ పక్షే 

చతుర్ధ్యాం )(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

చైత్ర మాసే  కృష్ణ పక్షే  చతుర్ధ్యౌపరి పంచమ్యాం

భాను వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.40

సూ.అ.6.14

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

చైత్ర మాసం 

కృష్ణ (బహుళ)పక్షం చవితి ఉ. 6.22 వరకు.

తదుపరి పంచమి. 

ఆది వారం. 

నక్షత్రం మూల

రా. 2.57 వరకు. 

అమృతం రా. 8.32 ల 10.08 వరకు. 

దుర్ముహూర్తం సా. 4.33 ల 5.23 వరకు.

వర్జ్యం  ఉ.10.54 ల 12.30 వరకు. 

వర్జ్యం రా. 1.20 ల 2.57 వరకు. 

యోగం శివం రా.12.32 వరకు.  

కరణం  బాలవ ఉ. 6.22  వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ.12.00 ల 1.30 వరకు. 

*********** 

పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ   పంచమి. 

 **************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 28.04.2024   Sunday 


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు చైత్ర మాస కృష్ణ పక్ష: చతుర్ధి తిధి భాను వాసర: మూల నక్షత్రం శివ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


చవితి ఉదయం 08:20 వరకు .

మూల రా.తె 04:47 వరకు. 

సూర్యోదయం : 05:56

సూర్యాస్తమయం : 06:32


వర్జ్యం : రాత్రి 03:10 నుండి 04:47 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 04:51 నుండి 05:42 వరకు.



అమృతఘడియలు : రాత్రి 10:18 నుండి 11:55 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

పేపర్ బోట్

                                    పేపర్ బోట్

                                ------------------------

 చదివే పేపర్ అయిపోకూడదనిపిస్తుంది

 ఉష్ట్ర పక్షిలా దానిలో తల దూర్చి

 ప్రపంచాన్ని మర్చిపోవాలనిపిస్తుంది!

 

చదవడం పూర్తయ్యాక దాని సమాచారమంతా

మెదడులో చేరి మనసును తొలిచేస్తుంటుంది!

ఈ సమాజం ఏమి మారలేదని

దుర్మార్గులు,దుష్టులు ఎప్పటిలాగే రాజ్యమేలుతున్నారని

బడుగులు,బలహీనులు అణగారి పోతున్నారని

అది ప్రతిరోజు తేట తెల్లం చేస్తుంటుంది!


అంతాబానే ఉందని,ఒకప్పటి రోజులు

ఇప్పుడు లేవని నన్ను నేను నమ్మించుకుంటూ

ఉదయాన్నే తాపీగా,కాఫీతో పాటు పేపర్ తీసుకుంటా!

చదివేకొద్దీ ప్రశాంతమైన సరస్సులో

బండ రాళ్లు వేసినట్టు మనసంతా అల్లకల్లోలమైపోతుంది!


చదవడం పూర్తయి పేపర్ మడిచే సమయానికి

ఎదో ఒక క్రోధం నిలువెల్లా ఆక్రమిస్తుంది!

దాని వెనకాలే ఏమి చేయలేని అశక్తత ఆవరిస్తుంది!

మార్పుకోసం మహోధృతంగా ఉద్యమించిన

యవ్వనకాలమంతా  వృధాగా తోస్తుంది!

ఎక్కడవేసిన గొంగడి అక్కడే అంటూ

ఆ పేపర్ ఎగతాళిగా నవ్వుతున్నట్టనిపిస్తుంది!


ప్రపంచంతో అనుసంధానం పెరిగి

ప్రసారమౌతోన్న అపరిమిత  జ్ఞానంతో

మరింత గందరగోళం పెరిగి

ఏది నిజమో, ఏది అబద్దమో అర్ధంగాక

ఊర కుక్కలంతా ముట్టడించి మొరుగుతున్నట్టనిపిస్తుంది!


కూర్చున్న కుర్చీలోనే కూరుకుపోతూ

చేష్టలుడిగి భూస్థాపితమైపోతున్నట్టనిపిస్తుంది!

                  *************

                               సత్య భాస్కర్ ఆత్కూరు ,9848391638  


   

(సాహిత్య ప్రస్థానం -మే సంచికలో ప్రచురణ)