10, ఆగస్టు 2022, బుధవారం

ఆయుఃక్షీణకరములు

 శ్లోకం:

*బాలార్కో ప్రేతధూమశ్చ*

  *వృద్ధా స్త్రీ పల్వలోదకమ్ l*

*రాత్రౌ దధ్యన్నభుక్తిశ్చ*

   *ఆయుఃక్షీణం దినే దినే ll*


భావం: ఉదయపుటెండ, కాటిపొగ, తనకన్నా వయసులో పెద్దయైన స్త్రీని వివాహమాడుట, చిన్నగుంటలో నిలచిన నీరు త్రాగడము, రాత్రులందు పెరుగుతో భోజనము - ఇవన్నీ ఆయుఃక్షీణకరములు.

-------------------------------------

*శుభోదయం* 😊🙏🏼

రాఖి పౌర్ణమి

 🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉

 *ॐ* *ఓం నమః శివాయ* *ॐ*

రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు:


భారతీయ సంప్రదాయములో రాఖి పౌర్ణమి విశిష్టమైన స్థానం కలిగివుంది. ఈ పండుగను రక్షాబంధనం (రాఖీ) పండుగ గానూ, జంద్యాల పూర్ణిమ, వైఖానస మహర్షి జయంతి గాను, హయగ్రీవ జయంతి గాను , వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటుంటారు. అందం, బంధం కలగలసిన పండుగ రాఖీ పౌర్ణమి. ఈ పండుగకు పురా ణాల ప్రకారం ఎన్నో అర్థాలున్నా, అన్నా చెల్లెళ్ల బాంధవ్యానికి, బాధ్యతకు ప్రతీకగానే దీనికి ఎక్కువ గుర్తింపు ఉంది. రాఖి పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, శ్రా వణ పౌర్ణమి, రక్షికా పూర్ణిమ...ఇలా పలు రూపాల్లో ఈ పండుగను జరుపుకోవడం విశేషం. అన్నదమ్ములు నూతన యజ్ఞో పవీతాన్ని ధరిస్తే అక్కాచెల్లెళ్లు వారికి హారతి ఇచ్చి కుంకుమ దిద్ది, తీపిని తినిపిస్తారు. నిండు చంద్రుని పూర్ణిమ శోభల ను పుడమి స్వీకరించే రోజు. రసమయమైన చంద్రకళలు షోడశం గా పూర్ణంగా అందే ఈ దినం ధ్యా నానికి ఆరాధనకీ అనుకూలమైన యోగకాలంపూర్ణిమ నిండు చంద్రుని శోభలను పుడమి స్వీకరించే రోజు. రసమయమైన చంద్రకళలు షోడశంగా, పూర్ణంగా అందే ఈ దినం ధ్యానానికి ఆరాధనకీ అనుకూలమైన యోగకాలం.


దేవతలు అంతా కలిసి తమలో ఎవరు గొప్పవారని పరీక్షలు జరిపి, ఆ పరీక్షలో అందరికన్న శ్రీమహావిష్ణువే గొప్పవాడని నిర్ణయించారట! బ్రహ్మకి కోపం వచ్చి ‘విష్ణుమూర్తి శిరస్సు తెగిపడుగాక’ అని శాపమిచ్చాడట. అలా శిరస్సు కోల్పోయిన విష్ణుమూర్తి దేవతలు చేసిన ఒక యజ్ఞానికి గుర్రపు తలతో వచ్చాడట. తర్వాత ఆయన ధర్మారణ్యానికి వెళ్లి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు ఈశ్వరుడు వచ్చి పూర్వపు శిరస్సును ప్రసాదించాడట. ఇది స్కందపురాణ గాథ. పురాణాల్లో ఎలా వున్నా జ్ఞానదాతగా, గురువుగా, పౌర్ణమినాడు పూజలందుకునే దేవుడాయన.


శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది. ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. మరి


అది లక్ష్మీమయమైన మాసంలో వచ్చినది కనుక సంపదలు ఇచ్చే శక్తి ఉంది. దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని విద్యాప్రదమైన అవతారం హయగ్రీవ అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం. మనిషికి ప్రధానమైనది జ్ఞానం, జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు, శాస్త్రాలకు మూలం వేదం. ఆవేదాన్ని లోకానికి అందించిన అవతారం హయగ్రీవ అవతారం. విద్య చదువుకున్న వారికందరికి కంకణం కడుతారు, వారు రక్షకులు అవుతారు అని. జ్ఞానికి రక్షగా ఉంటారని. ఆ జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికి రక్ష. ఆ కంకణ ధారణ అనేదే రక్షబంధనం అయ్యింది. వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభంచేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు. ఆతరువాత వేద అంగములైన శిక్షా, వ్యాకరణం, నిరుక్తం, కల్పకం, చందస్సు మరియూ జ్యోతిష్యం అనే షడంగములను అధ్యయనం చేస్తారు. విద్యారక్షకుడైన భగవంతుడిని ఉపాసన చేసుకొని మొదలు పెడుతారు. వేదాన్ని కొత్తగా నేర్చే వారే కాక, వేదాన్ని నేర్చినవారు తిరిగి ఇదే రోజునుండి మరచిపోకుండా నవీకరణం చేసుకుంటూ అధ్యయణం మొదలు పెడుతారు. హయగ్రీవుడిగా అవతరించి లోకాన్ని ఉద్దరించిన రోజు.


మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం.


'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,

తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'


దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది. బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి.

పరమాచార్య వైభవమ్

 *శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ - 553*

🙏🌻🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻🙏


🌈 *పూజ సంకల్పం - పరమార్థం* 🌈


💫 పరమాచార్య స్వామివారు చిత్తూరు దగ్గరలో మకాం చేస్తున్నారు. ఆరోజు తెలుగు నూతన సంవత్సరం. మహాస్వామివారి దర్శనానికి చాలామంది భక్తులు వచ్చారు. దర్శనం అలా కొనసాగుతూనే ఉంది. దాదాపు మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది కాని పరమాచార్య స్వామివారు ఇంకా మొదటి కాల పూజ కూడా ప్రారంభించలేదు. స్వామివారి ఆంతరంగిక శ్రీమఠం సేవకులొకరు అప్పటికే పూజకు ఆలస్యమైందని వినయంగా మనవి చేశారు.


💫 వెంటనే మహాస్వామివారు, “మనం ఈ నూతన సంవత్సరాన్ని చంద్రమౌళీశ్వర పూజతో ప్రారంభిద్దాము. పూజని సంకల్పంతో మొదలుపెడదాము” అని చెప్పి పూజకు ఉపక్రమించారు.


💫 అక్కడ కూర్చున్న అంతమంది భక్తులను ఉద్దేశించి ఒక ప్రశ్న వేశారు మహాస్వామివారు. “ప్రతిరోజూ చేసే చంద్రమౌళీశ్వర పూజలో చదివే సంకల్పం యొక్క అర్థం పరమార్థం ఎవరికైనా తెలుసా?” అని.


💫 ఒకరు చెప్పారు అది పరమాచార్య స్వామివారికోసం అని. మరొకరు పరమాచార్య మరియు పుదు పెరియవ కోసం అని చెప్పారు. వేదముల యొక్క సంరక్షణ కోసం అని మూడవ వ్యక్తి అభిప్రాయపడ్డాడు. నాల్గవ వ్యక్తి ప్రముఖ శ్లోకాన్ని అనుసరించి, అది పాలకులు, బ్రాహ్మణులు, గోవుల యొక్క క్షేమం కోసం అని తెలిపాడు. 


💫 అప్పుడు మహాస్వామివారు సంకల్పం చెప్పే శాస్త్రి గారిని పిలిచి సంకల్పం యొక్క అర్థము, ఉద్దేశ్యము అనువదించి అందరికి తెలుపవలసిందిగా ఆజ్ఞాపించారు. అపుడు మేము, అక్కడున్న అందరమూ అర్థం చేసుకున్నాము. 


🙏 *శ్రీమఠంలో రోజూ జరిగే పూజ యొక్క ప్రయోజనం కుల, మత, వర్ణ, లింగ, ధనిక, పేద  వివక్ష లేకుండా సర్వ మానవాళి కోసం.*


--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి


❀┉┅━❀🕉️❀┉┅━❀

*జయ జయ శఙ్కర హర హర శఙ్కర*

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*

🙏🌻🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻🙏

దారి మర్చిపోయాను

 🔻అప్ప్పారావు తన పెంపుడు కుక్క తొ విసిగిపోయి


దూరంగా వొదిలి వచ్చాడు


♦️కుక్క వెంటనే ఇంటికి వెనక్కి వచ్చేసింది.


♦️మర్నాడు అప్పారావు చాలా దూరం తీసుకుపోయి వదలి వొచ్చాడు.


కుక్క గంటలో మళ్లీ ఇంటికి వచ్చేసింది.


♦️కోపం యెక్కువై ఈ సారి ఇంకా దూరం చాలా కష్టమైన

చొట్లొ వదిలేసి బయలుదేరాడు.


♦️సగం దూరం వచ్చి పెళ్ళానికి ఫోన్ చేసాడు కుక్క


వచ్చిందా అని.


ఇంటికి వచ్చేసిందని పెళ్లాం చెప్పినది


♦️అప్పారావు చెప్పాడు "దాన్ని పంపించు.

నెను ఇంటికి దారి మర్చిపోయాను"


🤣🤣🤣🤣🤣

ఉచ్ఛారణ

 *ఉచ్ఛారణ విషయంలో సూచనలు*


వ్యాకరణ శాస్త్రం ప్రకారం *వేఙ్కట, చఞ్చల,* *పణ్డిత, సన్తాన, సమ్పద* వంటి పదాలను ఈ రకంగా రాయడమే సముచితం. కానీ ఈ రోజుల్లో విద్యార్థులకు వీటిని చదవడమే చేతకావడం లేదు.

కనుక మేము ఈ గ్రంథంలో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు *వేంకట, చంచల, పండిత, సంతాన* *సంపద* వంటి రూపాలనే ముద్రించాము.

ఈ పద్ధతి వ్యాకరణానికి విరుద్ధమైనా సరే విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా చేయవలసి వచ్చింది.


అయితే ఇలాంటి సందర్భాల్లో *సున్నాను "N" గా పలికారా? "M" అని ఈనాటి విద్యార్థులు అడుగుతున్నారు. అలాంటి వారికోసం కొన్ని సూచనలను అందించవలసి వచ్చింది.


1 సున్నాకు స్వతంత్రంగా ఉచ్చారణ శక్తి లేదు.

దానికి కుడి పక్క ఉండే హల్లుని బట్టి దాని ఉచ్చారణ మారుతూ ఉంటుంది. సున్నాకు కుడిపక్కన అచ్చులు రావు. 


2 సున్నాకు కుడి పక్కన కవర్గ అక్షరాలు 

(క, ఖ,గ, ఘ, ఙ) వస్తే, ఆ సున్నాను *ఙ్* గా పలకాలి. 

*ఉదా:* *సంఘటన = సఙ్ఘటన*


3 సున్నాకు కుడిపక్కన చవర్గ అక్షరాలు 

(చ, ఛ, జ, ఝ, ఞ) వస్తే దాన్ని *ఙ్* గా పలకాలి.

*ఉదా:* *సంజయ = సఙ్ జయ.


4 సున్నాకు కుడిపక్కన టవర్గ అక్షరాలు వస్తే

(ట, ఠ, డ, ఢ, ణ) వస్తే దాన్ని *ణ్* గా పలకాలి.

*ఉదా:* *పాండవ = పాణ్ డవ*


5 సున్నాకు కుడిపక్కన తవర్గ అక్షరాలు 

(త, థ, ద, ధ, న) వస్తే దాన్ని *న్* గా పలకాలి.

*ఉదా:* *సంధాన = సన్ ధాన*


6 సున్నాకు కుడిపక్కన పవర్గ అక్షరాలు వస్తే

(ప, ఫ, బ, భ, మ) వస్తే దాన్ని *మ్* గా పలకాలి.

*ఉదా:* *సంభావితస్య = సమ్భావితస్య*


7 సున్నాకు కుడిపక్కన వత్తు అక్షరాలు వస్తే వాటిలో మొదటి అక్షరం ఏ వర్గకు సంబంధించిందో,   

ఆ వర్గ పంచమాక్షరాన్ని ఉచ్చరించాలి.

ఉదా: *సంక్షోభ = సఙ్ క్షోభ*


8 సున్నాకు కుడిపక్కన వర్గపంచమాక్షరాలు వస్తే

గూడా పై నియమాలే వర్తిస్తాయి. 

ఉదా: *సంన్యాస = సన్యాస*  

         *సంమార్జన = సమ్మార్జన*

సున్నాకు కుడి పక్కన *ఙ, ఞ, ణ* అనే అక్షరాలు సాధారణంగా రావు.


9 సున్నాకు కుడిపక్కన *య* నుండి *హ* వరకు గల అక్షరాలు వస్తే, దాన్ని *మ్* గానే పలకాలి.

కానీ ఇక్కడ ఉన్న ఉచ్చారణ విధానాన్ని గురుముఖంగా నేర్చుకోవలసిందే.

ఉదా: *సంయత* (వ్రాత) = సమ్ యత 

              (ముక్కుతో ఉచ్చారణ)

  *సంహార = సమ్ హార (ముక్కుతో ఉచ్చారణ)


10 ఇక 'హ'కారం క్రింద "ణ, న, మ" వచ్చినప్పుడు

ఉచ్ఛారణ విషయంలో కొన్ని జాగ్రత్తలు వ్యాకరణ పరంగా తీసుకోవాలి. 

ఉదా: *ప్రాహ్ణ* (వ్రాత) = *ప్రాణ్ హ* ఉచ్చారణ

        *వహ్ని* (వ్రాత) = *వన్ హి* ఉచ్చారణ

        *బ్రహ్మ* (వ్రాత) = *బ్రమ్ హ* 

('హ'కారంతో *ఙ, ఞ* లు కలిసిన పదాలు లేవు)


11 'ఫ'కారాన్ని 'F' లాగా పలుకరాదు. 

*ఙ, ఞ, జ్ఞాన* - వంటి వాటి ఉచ్చారణలను సంప్రదాయం తెలిసిన వారి దగ్గర నేర్చుకోవాలి.


12 వత్తు అక్షరాలను (సంయుక్తాక్షరాలను) 

వ్రాసేటప్పుడు దేన్ని ముందు వుచ్చరించాలో దాన్ని ముందు రాస్తారు. దాన్ని సగమే పలకాలి.

ఉదా: *పద్మ (వ్రాత) = పద్ మ (ఉచ్చారణ)

*నిస్త్రైగుణ్య* (వ్రాత) = నిస్ + త్ + రైగుణ్య       

 (ఉచ్చారణ).

అనుకున్నది సాధిస్తాడు

 🙏🕉️శ్రీ మాత్రే నమః శుభోదయం 🕉️🙏.                   ❣️మనము కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు..రావలసిన సమయం వచ్చినప్పుడు ఏదీ ఆగదు❣️రాలేదని కుంగిపోకూడదు వచ్చిందని పొంగి పోకూడదు జరిగేవన్నీ కర్మలో బాగమే జరిపించేది అంతా ఆ భగవంతుడే❣️విజయానికి మరియు ఆనందానికి కొలమానం మనశ్శాంతి❣️తనని తాను విశ్లేషించుకుంటూ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లే మనిషి త్వరగా అనుకున్నది సాధిస్తాడు❣️ఎవరు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించండి ఇచ్చిన వారిని మనసులో దాచుకోండి ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా!!❣️ అదీ సహాయమైనా సహకారామైన బాధ అయినా నమ్మకద్రోహం అయినా ప్రేమ అయినా ఏదీ ఉంచుకోవద్దు❣️జరిగిన దానిని గురించి ఎప్పుడూ చింతించకు! మనకు జరిగిన మాంచి మనకు అనందాన్ని ఇస్తే జరిగిన చెడు మనకు అనుభవాన్ని ఇస్తుంది ❣️❣️❣️మీ అల్లంరాజు భాస్కర రావు

శ్రీ విజయ ఆయుర్వేదిక్

గోకవరం బస్ స్టాండ్

Rajhamundry

9440893593🙏🙏🙏🙏🙏

పాతాలలోకాలు

  *⚛🌷ప్రస్తుత ప్రపంచ పటంలో పాతాలలోకాలు ...7 అవి..🌷⚛*


*అతల...వితల.... సుతల.... తలాతల... మహాతల... రసాతల... పాతాల లోకాలు*


*అతలలోకం----యూరప్*


*వితలలోకం----ఆసియా*


*సుతలలోకం----ఆస్ట్రేలియా*


*తలాతలలోకం---అంటార్కిటికా*


*మహాతలలోకం---నార్త్ అమెరికా*


*రసాతలలోకం----ఆఫ్రికా*


*పాతాలలోకం---సౌత్ అమెరికా*


*అంటే పాతాల లోకం మనదేశం నుండి దూరం 15000 కిలోమీటర్లు అన్నమాట.*


*పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం.*


*దానికి కారణం, భూగోళంలో భారతదేశానికి సరిగ్గా  అవతల వైపున అమెరికా ఖండం ఉంది.*


*భారతదేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారని అనేకుల అభిప్రాయం. ఇందుకు శ్రీ రామాయణం నుంచి కొన్ని విశేషాలు చూద్దాం.*


*సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యం గా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాడు కాలిఫోర్నియగా పిలువబడుతోందని నడిచేదేవుడుగా పిలువబడిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉపన్యాసంలో చెప్పారు.*


*కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)  (సగర పుత్రులు బూడిద కుప్పలు గా  మారిన ప్రదేశం) మరియు హార్స్‌ల్యాండ్ (Horseland) ( యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీనదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.*


*వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే అని, దానికి పురాతన నామం మహాబలిభూమి అని, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందిందని కొందరు పండితులు చెప్తారు.*


*ఈ మలిపునగర్ కు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం. ఇక్కడే అలుమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈనాటి హిందువులు నిర్మించుకున్నారు.*


*అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన ప్రదేశం ఇండోనేషియాలోని బాలీ అనే వాదన కూడా ఉంది. బాలీకు అడుగు భాగాన, భూమికి అవతలివైపు దక్షిణ అమెరికా ఖండం ఉంది. (చిత్రంలో చూడవచ్చు) అక్కడి నుంచే వామన మూర్తి బలిచక్రవర్తిని త్రొక్కిన కారణంగా ఆ ప్రదేశం పేరు బాలిగా రూపాంతరం చెందిందని అక్కడి హిందువులు చెప్తారు. ఎలా చూసినా బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. పాతాళంలో అధికంగా కనిపించేది విలాసవంతమైన జీవనం. అందుకే అక్కడ ఆధ్యాత్మికత కంటే భౌతికతకే (materialism) ప్రాధాన్యం లభించింది.*


*ఇంకో ఆశక్తికరమైన విషయం రామ-రావణ యుద్ధ సమయంలో రావణుడికి సోదర వరుస అయిన మహిరావణుడు, రామలక్ష్మణులను అపహరించి, సొరంగ మార్గం ద్వారా పాతాళానికి తీసుకునివెళతాడు.*


*ఇంతకముందు చెప్పుకున్నట్లే పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా సొరంగ్రం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము.*


*మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళిన సొరంగం మధ్యప్రదేశ్‌లో ఛింద్వారా జిల్లా పాతాల్‌కోట్ లోయలో ఉందని అక్కడి స్థానికులు చెప్తారు. ప్రాంతం ఏదైనా ప్రస్తుతానికి మనకది అప్రస్తుతం. అదే సొరంగం ద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు, అక్కడ తన స్వేదం ద్వారా పుట్టిన, తన పుత్రుడైన మకరధ్వజుని కలవడం, వారిద్దరి మధ్య యుద్ధం జరగడం, మకరధ్వజుడు ఒడిపోవడం, ఆ తర్వాత ఆంజనేయస్వామి వారు పంచముఖ ఆంజనేయునిగా అవతారం స్వీకరించి, మహిరావణుడిని సంహరించి, రామలక్ష్మణులను కాపాడుతారు.*


*రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు. మధ్య అమెరికా, హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని ‘Lost City of the Monkey God‘ గా పిలుస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారని Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు వెళ్ళడించారు. అది అతను 1939 లో కనుగొన్నాడు. దాని గురించి ఆయన పూర్తి వివరాలు వెళ్ళడించే లోపే మరణించారు.*


*హిందువులకు మెక్సికన్లకు సంబంధం వున్నదా? అమెరికా అంటే పాతాళమా?*


*“సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ:” – అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు. దేవతలకు మన మానం ప్రకారం వారి పగలు ఆరు నెలలు, రాత్రి ఆరు నెలలు. వారి ఒక దినం మన ఒక సంవత్సరం. అలాగే మానవులకు పగలయినప్పుడు పాతాళంలో అది రాత్రి. (ఇప్పుడు మనకు పగలయితే వారికి రాత్రి అవుతుంది, సరిగ్గా 12 గంటలు ఆ పైనే మనకు వారికి సమయ వ్యత్యాసం) రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు సగరుని చరిత్ర చెబుతూ సాగర కుమారులు 60వేల మంది కూడా ఎలా భూమిని వెదుకుతూ వెళ్ళారో, భూమిని తొలుచుకుంటూ ఎలా పాతాళానికి వెళ్ళారో సవిస్తారంగా వివరిస్తారు. వారు అలా పాతాళంలో కపిల ముని ధ్యానభంగం చెయ్యడం, ఆయన ఆగ్రహం చవి చూసి భస్మమై పోవడం, వారి భస్మాల పైన భూమి నుండి గంగను అవతరింప చేసి పారించి పాతాళంలో వారి భస్మరాశులపై ప్రవహింప చేసి వారిని తరింపచేస్తాడు భగీరధుడు. మన భూమినుండి 50000 యోజనాల  దూరంలో పాతాళం వున్నట్టు చెబుతారు. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం.*


*మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది. అహిరావణుని వృత్తాన్తంలో కూడా హనుమంతుడు పాతాళానికి ప్రయాణించి అక్కడ అతడిని మట్టు పెట్టి రామలక్ష్మణులను విడిపించినట్టు ఐతీహ్యం. అలాగ మరెన్నో కధలు భూ-పాతాళ రాకపోకల గురించి వున్నాయి. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, ఉన్నాయి.*

తల్లిదండ్రులకు పిల్లలపై శ్రద్ద, నియంత్రణ

 తల్లిదండ్రులకు చేతులు జోడించి 🙏 నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా


అయ్యా......

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నా


తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.


క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.


పిల్లలకి బడిలో భయంలేదు. ఇంట్లో భయం లేదు. అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది. వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.


గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది. ఇది నిజం.


గురువంటే భయం లేదు, గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది?


కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు! 


6వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగినజీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళేవారిని వచ్చేవారిని కామెంట్స్ చేయడం. అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి.


దరిద్రం ఏంటంటే, కొంతమంది తల్లిదండ్రులే మావాడు చదవకున్నా ఏమికాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు.


ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు. 


పెన్ను ఉంటే పుస్తకం ఉండదు, పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు, తెచ్చుకోరు. భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం. ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.


కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తాదా?


భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట! అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం.


స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్టకూడదు, కనీసం మందలించకూడదు ప్రేమతో చెప్పాలట. ఇదెలా సాధ్యమ్?


మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?


మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.


       తల్లిదండ్రులకు నా మనవి... పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది. ఎక్కడో... ఒకటో అరో... ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు. 99శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు. ఇది యదార్ధం. ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు

       

          మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని దారుణంగా కొట్టేవారు. అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు. మా బాగు కోసమే అని అనుకునేవారు.

        

        ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..


పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10 % , కానీ 90% మాత్రం తల్లిదండ్రులే..!🙏


పిల్లల్ని గారాబం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది.. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు. 


ఇప్పుటి తరం 70% పిల్లలు..

👉తల్లిదండ్రులు కారు, బండి తుడవమంటే తుడవరు..

👉మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..

👉లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..

👉కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు.

👉రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు...

👉గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు..

👉తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ , నూడుల్స్, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..

👉ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..

👉ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

👉అతిథులు వస్తే కనీసం గ్లాసేడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు..

👉20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు..

👉బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం వీరికి.. 

👉కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు..

👉వారిస్తే వెర్రి పనులు..

👉మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,

కానీ కారణం మనమే..

ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..


చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి. రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..

గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..


వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది

కష్టం గురించి తెలిసేలా పెంచండి

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..


ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.. మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు..


అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..


భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..


మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం.. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం..


👉కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...


గర్భవతులైన తరువాత వారి బాధలు వర్ణనా తీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..


03వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు..

05వ తరగతి వారికి అల్సర్, బీపీలు..

10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి..

వీటన్నికి కారణం మనం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..అందుకే తల్లిదండ్రులు మారాలి..


రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి...

సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?


కేవలం గుడికి వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు.


సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు..

పిల్లలకు..👇

👉 బాధ్యత

👉 మర్యాద

👉 గౌరవం

👉 కష్టం

👉 నష్టం

👉 ఓర్పు

👉 సహనం

👉 దాతృత్వం

👉 ప్రేమ

👉 అనురాగం

👉 సహాయం

👉 సహకారం

👉 నాయకత్వం

👉 మానసిక ద్రృఢత్వం

👉 కుటుంబ బంధాలు

👉 అనుబంధాలు  

👉 దైవ భక్తి

👉 దేశ భక్తి


కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..

మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం, ఆనందం కోసం న్యాయంగా బ్రతుకుదాం.


ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..


భావితరాల పిల్లల కోసం ,పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు.


 🙏చదివినవారందరి విన్నపం...దయచేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి.

🙏🙏🙏🙏🙏🙏🙏

వంకాయకి కాదు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*నేను మహా ప్రభువులకి మంత్రిని కాని వంకాయకి కాదు కదండీ!* 

               🌷🌷🌷

అనగనగా ఓ రాజు గారికి వంకాయంటే మహా మక్కువట. తెగ తినేవారట ప్రతి రోజూ.

ఓ నాడు వంకాయ కూర తింటూ మంత్రి గారితో అన్నారుటా "ఆహా మంత్రీ! ఏం కూరండీ ఇది!వంకాయా? అమృతమా?" అని.

"అవును మహా ప్రభూ.. తమలాగే వంకాయది కూడా రాచ పుటక. అది మహత్తరం. అందుకే దాని నెత్తిన దేముడు కిరీటం పెట్టాడు" అన్నాడట మంత్రి.

ఇలా రాజ్యంలో కాసిన వంకాయలన్నిటితో రకరకాల భక్ష్యాలు వండించుకుని రాజుగారు ఆరగిస్తూ ఉండగా, రోజులు గడుస్తూ ఉండగా, ఒక కొన్నిరోజులకి రాజు గారికి వంకాయంటే మొహం మొత్తిందట. తినగా తినగా గారెలు చేదెక్కినట్టే వంకాయాను. వంకాయ కూర వడ్డించగానే పళ్ళెం విసిరికొట్టి "ఛాత్.. ఇదేం కూర? చెత్త కూర. అసలు ఆ రంగేమిటి? రుచీ పచీ లేని దాని వైనమేమిటి?" అన్నారుట.

పక్కనే ఉన్న మంత్రి గారు" అవునవును మహాప్రభో, అది చెత్త కూర.. చెత్తాతి చెత్త కూర. అందుకే దేముడు దాని నెత్తిన మేకు కొట్టాడు" అన్నాడుట.

ముక్కున వేలేసుకున్న రాజు గారడిగారుటా "అసలు నీది నాలుకా? తాటి పట్టా? మంత్రీ.. 

కిరీటం కాస్తా మేకైపోయిందా? హాత్తెరీ!" అని. దానికి నవ్వి మంత్రి ఏమన్నాడో తెలుసా....?

"ఏలిన వారు చిత్తగించాలి.. నేను మహా ప్రభువులకి మంత్రిని కాని వంకాయకి కాదు.


/పలుకు తేనియలు/     

 శ్రీ వి.వి.అప్పారావు                      

సేకరణ: సుధాకర్ కురువాడ