26, జులై 2024, శుక్రవారం

వినాయకుడు విశేషాలు*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

     *వినాయకుడు విశేషాలు*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*వరసిద్ధి సుబుద్ధి మనోనిలయం*

*నిరత ప్రతిభా ఫలదాన ఘనం।*

*పరమేశ్వర మాన సమోదకరం*

*ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ॥*


*వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు.*


*కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు.*


*త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడిగా ఆవిర్భవించాడు.*


*ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భుజుడై అలరారాడు.*


*కలియుగంలో తొండంతో, ఏకదంతుడై సంపద బొజ్జతో ఉన్న గణనాథుడు దర్శనమిచ్చాడు.*


*బదరీనాథ్ వద్ద వినాయకుని గుహలు ఉన్నాయి. ఆ గుహలో వ్యాసమహర్షి భారతం చెప్తూంటే, ఘంటాన్ని ఆపకుండా గణపతి భారతం రాశాడట.*


*కేదార్ నాథ్ యాత్ర చేసే యాత్రికులు వారి మార్గంలో ఉండే గౌరీకుండ్ వద్ద బాలగణేశుని ఆలయాన్ని దర్శిస్తారు.*


*శ్రీ శైలంలో సాక్షిగణపతిని చూడనిదే యాత్ర పూర్తికాదని చెప్తారు.* 


*శబరిమలలో కన్నెమూల గణపతి ప్రసిద్ది చెందింది.*


*మధురలో క్షిప్రగణపతిని ప్రతిభక్తుడు దర్శించి పూజిస్తాడు.*


*ప్రథముడైన గణపతిని ముందుగా పూజించిన తర్వాతే ఇష్టదైవాలను ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోంది. విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం.*


*ఏ నోములు, వ్రతాలు, పూజలు చేసినా హరిద్రా గణపతికే మొదటిపూజ.*


*గణపతికి గరిక అంటే ఇష్టము. గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి.*


*శ్రీ మహాగణపతికి పూజ చేసి బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి.*


*వినాయక చవితినాడు మాత్రమే తులసీదళాలతో వినాయకుడిని పూజిస్తారు. మరి ఏ ఇతర రోజుల్లోనూ వినాయకుని తులసీదళాలతో పూజించకూడదు.*


*విఘ్నేశ్వరుడు తర్పణ ప్రియుడు. గణపతికి 21 రోజులు బెల్లం పానకంతో తర్పణ చేస్తే తాము అనుకున్న పనులు ఎటువంటి విఘ్నము అవాంతరాలు లేకుండా సాధించగలుగుతారు.*


*గణపతికి ప్రతిరోజూ గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయటపడతారు.*


*శని భగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి.*


*గం గం గణేశాయ నమః।*

*ఓం నమః శివాయ॥*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

దేవస్థానాల్లో వాలంటీర్ గా

 *దేవస్థానాల్లో వాలంటీర్ గా చేయాలనుకునే వారికోసం...*


ప్రతి శనివారం, ఆదివారం రోజుల్లో *అన్నవరంలో సేవ* ఉంది. వాలంటీర్ గా

ఎవరైనా వెళ్లాలని 7893159871 కాల్ చేయండి. 


*రామేశ్వరంలో* హుండీ లెక్కింపు ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు 7893159871 కాల్ చేయండి.


 మహాశివరాత్రి సందర్భంగా *పట్టిసీమ, కోటప్పకొండ శ్రీశైలంలో, పంచరామాల్లో సేవలు* ఉన్నవి. వాలంటీర్ గా వెళ్లగలిగే వారు ఎవరైనా ఉంటే కనుక తెలియజేయండి

789315981. 


 *సింహాచలంలో*, ప్రతి శనివారం, ఆదివారం సేవ ఉన్నది. ఎవరైనా ఉంటే కనుక తెలియజేయండి

7893159871 


*శ్రీపురంలో సేవ* చేయడానికి సేవకులు కావలెను. 

7893159871


 *ద్వారకా తిరుమలలో సేవ* ఉన్నది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు, 7893159871 కాల్ చేయండి. 


*భద్రాచలంలో సేవ* చేయటానికి సేవకులు కావలెను 7893159871 కాల్ చేయండి. 


*తిరుపతిలో సేవ* చేయటానికి సేవకులు కావలెను 7893159871


*మద్ది ఆంజనేయ స్వామి గుడి వద్ద సేవ* చేయడానికి సేవకులు కావలెను 7893159871 కాల్ చేయండి


*అయోధ్య మరియు కాశి* రాగలిగే వారు ఎవరైనా ఉంటే గనుక కాల్ చేయండి. భోజనానికి , రూముకి , ట్రైన్ చార్జీలతో కలిపి, మూడు రోజుల సేవకి ₹3500/- 


*కాణిపాకంలో సేవ* చేయడానికి సేవకులు కావలెను 7893159871.


*రామనారాయణ టెంపుల్, విజయనగరం సేవ*, శనివారం, ఆదివారం సేవ చేయుటకు  కావలెను. 

7893159871 


కాశీకి అస్తికలు అనే కాన్సెప్ట్ తో మొదలుపెట్టిన ఈ సంస్థ ఉచితంగా అస్థికలు తీసుకు వెళ్ళే కార్యక్రమం చేస్తుంది. స్వయంగా వెళ్లలేని వారెవరైనా సరే చనిపోయిన మీ ఆప్తుల అస్తికలు వీరికి ఇస్తే, ఈ సంస్థ వారు పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేయగలరు దీనికి డబ్బులు అవసరం లేదు. 

బీద ధనిక  కుల వర్గ భేదము ఏమీ లేవు. 

 కాశీలో కార్యక్రమం చేసి లైవ్ వీడియో పంపిస్తారు. కనుక  ఎవరైనా అస్తికలు గంగలో కలపాలని ఉండి స్వయంగా వెళ్లలేని వారు ఉంటే కనుక వీళ్ళకు తెలియజేయండి  ఫ్రీగా తీసుకువెళ్లి కార్యక్రమం అన్ని పూర్తి చేసి వస్తారు. 7893159871 కాల్ చేయండి. 


భక్తితో (డబ్బులు ఆశించకుండా) సేవ చేయాలి అనుకునేవారికి ఈ మెసేజ్ పంపించండి. 


జై శ్రీ రామ!

జై శ్రీ మన్నారాయణ!

హరే కృష్ణ!

హర హర మహాదేవ శంభో శంకర

కురియగజేసినావుగద

 చంపకమాల:

*****+*****

సిరిగల తల్లివీవుగద చిన్మయ హాసము జేయుచుందువే!

మరిమరినీదుకీర్తనల,మన్ననసేసెడువారలెందరో!!

మరువరు నీదుసాయమును, మార్గముజూపినతల్లినీవనన్!

కురియగజేసినావుగద, కూరిమిబెంచెడురీతి నీకృపన్!!

సర్వలఘుకందము

 సర్వలఘుకందము


*జలరుహభవ నుత చరణుడు*

*సలిలపు శయమునఁ దెనమణి జగము నరయుచున్*

*దెలి చిరునగవుల వశయగు*

*కలిమిచెలిని గలసి మనలఁ గరుణఁ గనవలెన్!*


🙏🙏🙇‍♂️🙏🙏

 *_సింహశ్రీ_*

తెలుగు సామెతలు

 ⚡ *మరుగున పడుతున్న కొన్ని 209 తెలుగు సామెతలు..మీకోసం!*


1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5. అనువు గాని చోట అధికులమనరాదు

6. అభ్యాసం కూసు విద్య

7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

12. ఇంట గెలిచి రచ్చ గెలువు

13. ఇల్లు పీకి పందిరేసినట్టు

14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

19. కోటి విద్యలూ కూటి కొరకే

20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

22. పిట్ట కొంచెం కూత ఘనం

23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక

25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె

27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29. ఆది లొనే హంస పాదు

30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

32. ఆకాశానికి హద్దే లేదు

33. ఆలస్యం అమృతం విషం

34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

35. ఆరోగ్యమే మహాభాగ్యము

36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట

37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు

40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41. ఏ ఎండకు ఆ గొడుగు

42. అగ్నికి వాయువు తోడైనట్లు

43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

48. అప్పు చేసి పప్పు కూడు

49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

51. బతికుంటే బలుసాకు తినవచ్చు

52. భక్తి లేని పూజ పత్రి చేటు

53. బూడిదలో పోసిన పన్నీరు

54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,

గిల్లితే యేడుస్తాడు

55. చాప కింద నీరులా

56. చచ్చినవాని కండ్లు చారెడు

57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

58. విద్య లేని వాడు వింత పశువు

59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

61. చక్కనమ్మ చిక్కినా అందమే

62. చెడపకురా చెడేవు

63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు

64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ

65. చింత చచ్చినా పులుపు చావ లేదు

66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,

ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67. చిలికి చిలికి గాలివాన అయినట్లు

68. డబ్బుకు లోకం దాసోహం

69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

71. దాసుని తప్పు దండంతో సరి

72. దెయ్యాలు వేదాలు పలికినట్లు

73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

75. దొంగకు తేలు కుట్టినట్లు

76. దూరపు కొండలు నునుపు

77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

78. దురాశ దుఃఖమునకు చెటు

79. ఈతకు మించిన లోతే లేదు

80. ఎవరికి వారే యమునా తీరే

81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

83. గాజుల బేరం భోజనానికి సరి

84. గంతకు తగ్గ బొంత

85. గతి లేనమ్మకు గంజే పానకం

86 గోరు చుట్టు మీద రోకలి పోటు

87. గొంతెమ్మ కోరికలు

88. గుడ్డి కన్నా మెల్ల మేలు

89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు

90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా

92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93. గుడ్ల మీద కోడిపెట్ట వలే

94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు

97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100. ఇంటికన్న గుడి పదిలం

101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ

102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

105. కాకి ముక్కుకు దొండ పండు

106. కాకి పిల్ల కాకికి ముద్దు

107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109. కాసుంటే మార్గముంటుంది

110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును

112. కలి మి లేములు కావడి కుండలు

113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114. కంచే చేను మేసినట్లు

115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !

116. కందకు కత్తి పీట లోకువ

117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

118. కీడెంచి మేలెంచమన్నారు

119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా

123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

124. కూటికి పేదైతే కులానికి పేదా

125. కొరివితో తల గోక్కున్నట్లే

126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127. కొత్తొక వింత పాతొక రోత

128. కోటిి విద్యలు కూటి కొరకే

129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

131. కృషితో నాస్తి దుర్భిక్షం

132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

135. ఉన్న లోభి కంటే లేని దాత నయం

136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137. మెరిసేదంతా బంగారం కాదు

138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

141. మనిషి మర్మము.. మాను చేవ...

బయటకు తెలియవు

142. మనిషి పేద అయితే మాటకు పేదా

143. మనిషికి మాటే అలంకారం

144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా

148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149. మొక్కై వంగనిది మానై వంగునా

150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు

151. మొసేవానికి తెలుసు కావడి బరువు

152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159. నవ్వు నాలుగు విధాలా చేటు

160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161. నిదానమే ప్రధానము

162. నిజం నిప్పు లాంటిది

163. నిమ్మకు నీరెత్తినట్లు

164. నిండు కుండ తొణకదు

165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు

166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి

167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

172. ఊరు మొహం గోడలు చెపుతాయి

173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

174. పాము కాళ్ళు పామునకెరుక

175. పానకంలో పుడక

176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు

178. పండిత పుత్రః పరమశుంఠః

179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

183. పెళ్ళంటే నూరేళ్ళ పంట

184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట

186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది

187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188. పిచ్చోడి చేతిలో రాయిలా

189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం

191. పిండి కొద్దీ రొట్టె

192. పిట్ట కొంచెము కూత ఘనము

193. పోరు నష్టము పొందు లాభము

194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు

195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199. రామాయణంలో పిడకల వేట

200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు

203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

204. రౌతు కొద్దీ గుర్రము

205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

207. సంతొషమే సగం బలం

208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు….

🙏

బ్రాహ్మణ సంక్షేమ వేదిక

 బ్రాహ్మణ సంక్షేమ వేదిక వార్తలు :


హైదరాబాద్, ఉప్పల్ , నల్లచెరువు ఎదురుగా ఉన్న శ్రీ సాయిత్రిశక్తి దేవాలయం లో   మొదటి అంతస్తు లోని  FUNCTION HALL లో అతి తక్కువ ధరకు అన్ని సౌకర్యాలతో  బ్రాహ్మణుల కుటుంబాల వారు శుభకార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని ఆలయ యాజమాన్యం ప్రకటించింది.


సౌకర్యాలు:

హాల్, కుర్చీలు, పెళ్లిపందిరి, పురోహితులు, టెంట్ హౌస్ సామాగ్రి, సన్నాయి వారు, ఫోటో & వీడియో గ్రాఫర్, మైక్ & Light సెట్స్, Labors, Water Supply, Carpets, పెళ్లి సామాగ్రి   


భోజన ఏర్పాట్లు :

అన్నం, బిర్యానీ Or (పులిహోర), పూర్ణాలు, రెండు కూరలు,పప్పు, సాంబారు, అప్పడం, నెయ్యి, బజ్జిలు, స్వీట్స్,పెరుగు, ఐస్ క్రీం  


200 మంది అతిధులు  హాజరైతే పైన వివరించిన సౌకర్యాలతో RS 1,75,000 (ఒక లక్ష డెబ్భై ఐదువేలరూపాయలు) ఖర్చుతో వేడుక నిర్వహించుకోవచ్చును.  


400 మంది అతిధులు హాజరైతే పైన వివరించిన సౌకర్యాలతో RS 3,00,000 (మూడు లక్షల రూపాయలు) ఖర్చుతో వేడుక నిర్వహించుకోవచ్చును.


సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ : 93980  38442 


ధన్యవాదాలు

బాలశ్రీనివాసులు

బ్రాహ్మణ సంక్షేమ వేదిక 

9059550280 


NOTE : ఈ ఫంక్షన్ హాల్ సేవలను సద్వినియోగం చేసుకొనే వారు బ్రాహ్మణ సంక్షేమ  వేదిక ID కార్డు లేదా ధ్రువపత్రం తప్పని సరిగా ఉండాలి

వినయాంజలి

వినయాంజలి 


సీ. బమ్మెర గ్రామాన ప్రభవించి యుర్విపై

               భక్తి పంచిన యట్టి  భాగవతుడు

    పద్యముల్  సేద్యమున్ పరవశంబున జేసి

               సన్నుతుండైనట్టి  సవ్యసాచి

    మకరంద సాహిత్య మాధుర్యరసమును 

               తెలుగుజాతి కిడిన వెలుగు రేఖ

    భక్తి సాహిత్యంబు పంచియున్ మేనున

               పులక లెత్తించిన నలువపట్టి 

తే. రాజులకు కావ్య మీయక రక్తి తోడ 

     భక్తితో రామవిభునకు ముక్తి గోరి

     కావ్య మంకింత మొనరించి ఘనత గాంచె

     భక్త పోతన పావన భాగవతుడు       


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

🌸శ్రీ లక్ష్మీ స్తుతి

 🌸శ్రీ లక్ష్మీ స్తుతి🙏 


సీ. శ్రీదేవి ! ప్రియకరీ ! క్షీరాబ్ది కన్యకా !

           శ్రీకరీ ! నుతియింతు క్షేమ మొసగ

భూదేవి ! శ్రీలక్ష్మి ! భువనరక్షాకరీ !

        భూరి కృపాకరీ ! సారసాక్షి ! 

సద్భక్తితోడను సతతంబు సేవింతు

        చంద్రసహోదరీ ! సకలజనని ! 

మాధవీ ! మమ్ముల మమతతో గావుము 

        పద్మాక్షి ! యిందిరా ! పద్మహస్త !

తే. పాలకడలిన పుట్టిన పసిడితల్లి !

     ఆదిశంకరు స్తుతులెల్ల నాలకించి 

      కనకవర్షంబు నిచ్చిన కనకలక్ష్మి !

      తల్లి ! వరలక్ష్మి ! మాపైన దయను చూపు.


సాహితీ శ్రీ జయలక్ష్మి

ఆకార మిచ్చుచు

 ఆకార మిచ్చుచు నర్చనమ్మిడి నిరా

     కార! నే చేసితి నేరమయ్య!

వాక్కులకందని వాడవంచని తెల్సి

         సల్పితి స్తోత్రముల్ జడుడ నగుచు!

నెందెందు వెదకిన నందందె గలవని

         తెలిసియు జేసితి తీర్థయాత్ర!

తెలిసియు తెలియక నలసత దప్పులన్

       సలిపి యుండగ వచ్చు ఛాందసమున!


అన్ని రూపులు నీవెగా అభవ!ఘనుడ!

భవ!యనిర్వచనీయుడా!వందనీయ!

విశ్వమంతయు నీదెగా విభుడ!యనఘ!

తలను వంచితి జగదీశ!తత్వ మెఱిగి!


-------కోడూరి శేషఫణి శర్మ

శ్రీ గణనాథోద్భవము

 శుభోదయం!

*శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహా పురాణము.

6చం.

సకియలు జెప్ప పార్వతియు చక్కని పల్కులటంచు మెచ్చుచున్!

పకపక నవ్వి యామె నిజ వర్ష్మపు నలుంగున జేసె చేతనున్!

చకచక సృష్టిజేసి బహు చక్కని బాలకు జూపి మెచ్చుచున్!

ఇకమన కెల్లవేళలను నీఘను డొప్పును రక్షకుండనన్..!


  భావము: చెలికత్తెలు చెప్పగా పార్వతి నవ్వుచూ వెంటనే తన శరీరమునకు నాలుగు పెట్టిన పిండితో వెంటనే చక్కని బాలుని బొమ్మను చేసి మెచ్చుచూ వారికి చూపి ఇక ఎప్పుడూ ఈ ఘనుడే మనకు రక్షకుడనెను.

                             ☘️☘️☘️🌷☘️☘️☘️

ఉత్పలమాల

 ఉత్పలమాల:

**********

అమ్మలు ప్రేమమూర్తులుగ,నాకలి దీర్చెడు యన్నపూర్ణలై

బొమ్మలతోడ పిల్లలకు,బోధనసేయును నీతిగాథలన్

సొమ్ములకన్న మిన్నగను,శోభగబెంచును వారికెప్పుడున్

కమ్మగ కృష్ణలీలలను,కళ్ళకు కట్టిన రీతి జెప్పులే!

పద్యతాంబూలం

 పద్యతాంబూలం


పలురూపంబుల గొలిచితి, 

పలునామంబులను బొగడి, ప్రచలిత మతినై, 

పలుదిక్కుల వెదకితి నిను, 

పలుచన జేసితిని గాదె, పరిపరివిధముల్..


🙏🕉️🙏


- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్

క్రొత్తపలుకు-6

 క్రొత్తపలుకు-6


బుద్ధి లేక యున్న సుద్దులందరు నేర్పు 

బుద్ధి గలిగె నేని పూతచరిత 

పొందవచ్చుగాక నందఱితోబాటు 

కీర్తి నొంద మేలు గెలిచి నిలచి 

*~శ్రీశర్మద*

ఋణానుబంధమున

 శ్లో:-ఋణానుబంధ రూపేణ 

             పశు పత్ని సుతాలయా: 

             ఋణ క్షయే క్షయం యాంతి

             తత్ర      కా     పరిదేవనా ?


వసుధ ఋణానుబంధమున 

         వర్తిలు పుత్ర కళత్ర వాసముల్ 

పశువులు మానవాళికిని 

          పాయకనుండియు నెల్ల వేళలన్ ,

వసుధ ఋణంబు దీరగను 

          వాటికవే మరి వీడు చుండ , యా 

మసలిన బంధమున్ దలచి

           మానవు  డేలను చింత చెందగన్ ?    


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

ముక్కు పుడక

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


             *ముక్కు పుడక*

                ➖➖➖✍️


*ఆడవారు ముక్కుపుడక ఎందుకు ధరించాలి......!!!*

*మంగళసూత్రంలా ముక్కెర కూడా?!*


*ఆడవారు ముక్కుపుడక ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఆడవారు ముక్కుపుడక ధరించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో మీకు తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి….* 


*సంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కుపుడక తప్పనిసరి అని అనేది ఆచారం. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు. ఏడు, పదకొండు సంవత్సరాలకు ముక్కు కుట్టిస్తారు. కానీ చిన్న వయస్సులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట.*


*ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒకరాయి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి.* 


*అలాగే ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది. అందువల్ల ముక్కుకు ఎడమవైపున అర్ధ చంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెప్తున్నారు.* 


*మరోవైపు ముక్కు ఎడమవైపున ముక్కుపుడక ధరించడం ద్వారా ఆడవారికి గర్భకోశవ్యాధులు తగ్గుతాయట. పురుటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖ ప్రసవం అవడానికి సహకరిస్తుందట. కన్ను, చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయట. చెవికి సంబంధించిన వ్యాధులు అనగా చెవిపోటు, చెవుడు వంటివి కలుగకుండా ముక్కుపుడక సహాయపడుతుంది. అంతేకాదు దీన్ని ధరించడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు ధరిచేరవు ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెప్తున్నారు.*


*ఇంకా అందం కోసం ముక్కుపుడకను ధరించే మహిళలు ఎక్కువ.* 


*భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది.* 


*దేవతలందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు.*


*అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు.* 


*తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు.*✍️


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సర్వం మాయం.

 ♦️       *సర్వం మాయం.*      ♦️👇

▪️తాజా అన్నం మాయం.

▪️తాజా కూరలు మాయం.

▪️కోడళ్ళ పనితనం మాయం.

▪️అత్తమామల మాటసాయం మాయం.

▪️అల్లుళ్ళ గౌరవ హోదా మాయం.

▪️పోస్టుమాన్ మాయం.

▪️ఆసాంతం వినే వైద్యుడు మాయం.

▪️చీర, రవిక మాయం.

▪️పుస్తక పఠనం మాయం.

▪️రేడియోకి శ్రోతలు మాయం.

▪️పెరడు బావి మాయం.

▪️సైకిలు మాయం. 

▪️ఎండావకాయ మాయం.

▪️కుంపటిపై దిబ్బరొట్టి మాయం.

▪️మట్టి వాసన మాయం.

▪️పిడతకింద పప్పు బండి మాయం.

▪️వందరోజులాడే సినిమాలు మాయం.

▪️అర్ధరాత్రయినా నిశ్శబ్దం లేని నిశిరాత్రులు మాయం.

▪️వెంట ఉండే ఉపాధ్యాయుడు మాయం.

▪️కుంకుడు కాయ, సీకాకాయ మాయం.

▪️వాకిట అలుకుళ్ళు, ముగ్గులు, పూల మొక్కలు మాయం.

▪️పిచ్చుకలు, సీతాకోకచిలుకలు మాయం. 

▪️సత్తు గిన్నె చారు మాయం.

▪️స్కూల్లో మైదానం మాయం.

▪️సంఘంలో పరోపకారం మాయం.

▪️వానపాము మాయం.

▪️చెరువుల్లో ఆటలు మాయం. అసలు చెరువులే మాయం.

▪️ చింతపిక్కలాట, అచ్చంగిల్లాట, తొక్కుడు బిళ్ళలు ఆటలు, కోతికొమ్మచ్చి, కబడ్డీ మాయం.

▪️గోడిం బిళ్ల / కర్ర - బిళ్ల మాయం, దాక్కుంటే దొంగాట మాయం.

▪️అవ్వలు, బామ్మలు కబుర్లు, కథలు మాయం.

▪️థూళి లేని గాలి మాయం.

▪️పాళీ ఉన్న పెన్ను మాయం.

▪️ పెద్దల మాటలు మాయం, పెద్దల సలహాలు మాయం, ఖాళీ ఉన్న స్నేహితుడు మాయం.

▪️నిలకడగా కురిసే వాన మాయం.

▪️నిర్మానుష్యమైన ఏకాంతం మాయం.

▪️కంటికి నిద్ర మాయం.

▪️వెన్నెల చూడాలనే కన్నులు మాయం.

▪️ ఏకాగ్రత మాయం.

▪️హారన్ మోత లేని వీధి మాయం.

♦️దోమలు లేని పార్కులు మాయం.

▪️తోటమాలి కొలువే మాయం.

▪️దాచుకుందా మంటే వడ్డీరేటు మాయం. అసలే మాయం.


▪️"ఒక అల్లం పెసరె" అని కేక వేసే పాక హోటల్ మాయం.

▪️సగం సగం పంచుకునే తేనీరు మాయం.

▪️నిఖార్సయిన చెగోడీ, వడియం, అప్పడం మాయం. కూర్చుని తినే పంక్త భోజనాలు మాయం.

▪️ప్రేమ ప్రకటించే  ప్రేమ లేఖలు మాయం.

▪️సాయం కాలం మల్లెపువ్వులు పెట్టుకుని కాటన్ చీరతో స్వాగతించే ధర్మపత్ని మాయం. ఎందుకూ...పంచ కట్టు, లుంగీతో, చక్కటి షేవింగ్ తో ఉండే భర్త మాయం.

▪️ఆఫీసు నుండి రాగానే నాన్నా నాకేమి తెచ్చావు అని ఎదురుపడే‌ సంతానం మాయం.

▪️ఏమండీ రాత్రికి ఏమి చేయమంటారు అని అడిగే ధర్మపత్ని మాయం. ఈ పండక్కి నాకేం కొనిస్తారని భార్య కోరికలు మాయం.

**ఆత్మీయతలు మాయం, అనుబంధాలు మాయం,

▪️ కుటుంబ సభ్యులు నలుగురు కూర్చొని మాట్లాడే కాలం మాయం................. అందుకే ఎవరికి వాడు, ఎవరి చారవాణి లోకి వాళ్ళు మాయం. మాయం మాయం

▪️ *మనదైన సమయం  మాయం.* సర్వం మాయం.

▪️ *అంతా అయోమయం.*

🙏🙏🤝🤝

ఏడు కొండలు ఎక్కానయ్యా.

 🕒ఏడు కొండలు ఎక్కానయ్యా...


*🕞వెంకటాద్రి,గరుడాద్రి,శేషాద్రి, నారాయణాద్రి,అంజనాద్రి,వృషభాద్రి,నీలాద్రి.*


🕝సప్తగిరులు సంతోషం గా ఎక్కాను,నిన్ను చూద్దామని.


🕦టోకెన్,రూమ్ తీసుకుని వైకుంఠం క్యూ  కాంప్లెక్స్ చేరుకుని నడుస్తూనే వున్న,నీ నామ జపం స్మరిస్తూనే వున్నా.


🕥తోసుకుంటూ,తొక్కుకుంటూ,నడుచు కుంటు నీ సన్నిధానం లోకి చేరా.


🕧ఈ సారి మరి ఉదృత మైన తొక్కిసలాట,నలిగి పోయా,ప్రాణం అలసి పోయింది.


🕧నీ ముందుకు వచ్చేసానయ్య,చూద్దామని కళ్ళు విప్పి,ఆత్రం గా ఆశగా చూసా.


*🟣ఒక్క గుంజు గుంజి అవతలకు నెట్టేశారు.*


🕥భాద గా బయటకి  వచ్చా,దిక్కు తోచక దిక్కులు చూస్తూ, నిల్చున్నా.


*🔵నామాల సామి ఒకరు వచ్చి,అయ్యా దర్శనం అయిందా అన్నారు,లేదయ్య అన్నాను*.


🕥నా గుండెల మీద చేయి వేసి,కళ్ళు మూసుకుని ఇప్పుడు చూడు అన్నాడు,ఆశ్చర్యం నీ రూపం కనిపించింది,మనస్సులోనే మొక్కుకున్న.


*🙏అప్పుడు అన్నాడు,నేను నీ హృదయం లోనే వున్నానయ్య అని*.


✍✍మూర్తి's కలం....

కాలమిస్ట్,9985617100.

వేదాంత శాస్త్ర సిద్ధాంతం*

 *వేదాంత శాస్త్ర సిద్ధాంతం* 


వేదాంత సిద్దాంతాన్ని అనుసరించి బ్రహ్మయే జగత్కారణం అని భగవత్పాదులు చెప్పిన విషయంలో ఏ విధమైన ఆక్షేపం లేదు. జగత్తులో ప్రతివాడూ ప్రతీ విషయాలను అనుభవిస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. ఈ ఆస్వాదింపబడే విషయాలను శాస్త్రంలో భోగ్యం అంటారు. వాటిని భుజించేవాడు, ఆస్వాదించేవాడూ భోక్త కాబట్టి చేతనుడైన జీవుడే భోక్త అని అర్ధం. భోగ్యం అంటే శబ్ద, స్పర్శ, రసాది విషయ సమూహమనీ అంటారు. అద్వితీయమైన బ్రహ్మనే ఈ జగత్తుకు ఉపాదాన కారణంగా చెపుతున్నారు. అందువల్ల కార్యకారణాలు రెండూ ఒకటి అవుతున్నాయి. అంటే భోగ్యవస్తువులకే భోక్తృత్వం కూడా లభిస్తోంది. అంటే భోగ్యమైన అన్నం మనలను తింటోందా? లేక మనం అన్నాన్ని తింటున్నామా అన్నట్లు. 

కాబట్టి వేదాంతంలో చెప్పబడే భోక్త భోగ్యవిభాగం కుదరదుగదా అని ఆక్షేపణ. బ్రహ్మము జగత్తుకు ఉపాదాన కారణం అని అన్నట్లయితే ఈ భోక్త

రూపంలోనూ భోగ్య రూపంలోనూ కనిపించే జగత్తు అంతా బ్రహ్మము కంటె భిన్నమైనదికాదు. మనం భోగ్యం అనుకునే శబ్దాది విషయాలన్నిటికీ భోక్త యొక్క రూపం కలుగుతుంది. అందువల్ల ఇక భోక్త, భోగ్యము విభాగము ఉండదు. అంటే ఈ విభాగం లోకంలో మనం చూస్తున్నట్లుగానే వుంటుంది - అని లోక దృష్టాంతాన్ని చూపి సమాధానం చెపుతున్నారు. అంటే సముద్రంలో ఉండే నురుగు, అలలు, బుడగలు అనేవి వేరుగా కనిపించినా వాటి అన్నింటికీ కారణమైనది సముద్రము ఒక్కటే. ఈ జగత్తు తనకు ఉపాదాన కారణమైన

బ్రహ్మము కంటే భిన్నము కాకపోయినా ప్రపంచంలోని రూపాలలో స్వస్వరూపాలలో భేదం కనిపించవచ్చు.

లేకపోతే లోక వ్యవహారం ఎట్లా నడుస్తుంది? ఏదో ఒక తర్కాన్ని చెప్పటం తప్పుగదా! వీటన్నిటికీ వేదం మాత్రమే ప్రమాణం. కార్యం అసత్యమైతే కారణం కూడా అసత్యమే అవుతుంది గదా! వేదవాక్యం ఎట్లా ప్రమాణమవుతుంది అంటే భగవత్పాదులు ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడిన ఒక విషయాన్ని చెప్పారు. కార్యకారణాలకు వుండే భిన్నత్వం కేవలం శ్రుతి ప్రమాణమే అనకుండా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కూడా చూపించారు. కుండ పుట్టిన తరువాత కూడా అది మట్టి కంటే భిన్నం కాదు. అంటే కార్యం పుట్టిన తరువాత కూడా కారణం కంటె భిన్నం కాదు. ఈ జగత్తుకు కారణమైన బ్రహ్మతో సమానమైన అన్వయత్వం చెప్పబడ్డది. కాబట్టి కార్యకారణాలు భిన్నముకావు. కారణమైన బ్రహ్మ మూడు కాలాలలో వున్నట్లే కార్యమైన జగత్తు కూడా మూడు కాలాలలోనూ వుంది.

వీటన్నిటికీ వేదవాక్య ప్రమాణం అని ఎట్లా చెప్పగలరు అని కుతర్కం చేస్తే ప్రయోజనం వుందా? అంటే లోకసిద్ధమైన స్వప్న వృత్తాంతాలకు, పురాణేతిహాసములలోని స్వప్నఫలితాలకు కలిగిన ప్రమాణత్వాన్ని కూడా తెలిపి అన్వయించ వచ్చును. కాని విశ్వసించని సంశయాత్మకు ఏమి చెప్పినా యేమి ప్రయోజనము? తాతగారు చెప్పినది మనుమడు నమ్మకపోతే, ఆ సమయానికి తాతగారు గతిస్తే తాతగారే లేరు కదా ఇంక ఆయన చెప్పింది అవసరమా?! అని అనగలమా? *'సంశయాత్మ వినశ్యతి'* అని అనుకోవలసినదే.

కాబట్టి శాస్త్రార్థ విచారణ, తమ ప్రజ్ఞను ఉపయోగించి, ప్రయోజనాన్ని బలపరచి భగవత్పాదులు ప్రతిపాదించిన అథ్వైత సిద్ధాంతాన్ని, శృతి వాక్యాలను అన్వయించుకొని శాస్త్రాన్ని బాగా అర్ధం చేసుకోవాలి.

 

|| हर नमः पार्वतीपतये हरहर महादेव ||                                --- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు* .

గురువుయందున్న విద్యను

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


     శ్లో𝕝𝕝 *యథా ఖనన్ ఖనిత్రేణ*

            *నరో వార్యధిగచ్ఛతి* |

          ‌ *తథా గురుగతాం విద్యాం*

            *శుశ్రూషురధిగచ్ఛతి* ||


తా𝕝𝕝 మనుష్యుడెట్లు గునపముతో త్రవ్వి భూమి నుండి నీరు పొందునో అట్లే *గురువుయందున్న విద్యను ఆ గురువుకి శుశ్రూష చేసి పొందవలెను*....

శ్లోకం

 👆శ్లోకం 

స్వయంభూః శంభురాదిత్యః                        పుష్కరాక్షో మహాస్వనః |                          అనాదినిధనో ధాతా                               

విధాతా ధాతురుత్తమః ||


ప్రతిపదార్ధ: 

స్వయంభూ : - తనంతట తానే ఉద్భవించిన వాడు.

శంభు: - సర్వశ్రేయములకు మూలపురుషుడు.

ఆదిత్య: - సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు. పుష్కరాక్ష: - పద్మముల వంటి కన్నులు గలవాడు.

 మహాస్వన: - గొప్పదియగు వేదరూప నాదము గలవాడు.

 అనాదినిధన: - ఆద్యంతములు లేని వాడు. 

ధాతా - నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమై యున్నవాడు.

 విధాతా - కర్మఫలముల నందించువాడు. 

ధాతురుత్తమ: - సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు.

పంచాంగం 26.07.2024 Friday.

 ఈ రోజు పంచాంగం 26.07.2024 Friday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస కృష్ణ పక్ష షష్థి తిధి భృగు వాసర: ఉత్తరాభాధ్ర నక్షత్రం సుకర్మ యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


షష్థి రాత్రి 11:32 వరకు.

ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 02:31 వరకు.


సూర్యోదయం : 05:57

సూర్యాస్తమయం : 06:48


వర్జ్యం : రాత్రి 01:46 నుండి 03:16 వరకు


దుర్ముహూర్తం : పగలు 08:31 నుండి 09:23 వరకు తిరిగి మధ్యాహ్నం 12:48 నుండి 01:40 వరకు.


అమృతఘడియలు : పగలు 10:04 నుండి 11:33 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

సుప్రభాతసోయగం

 శు  భో  ద  యం🙏


-సుప్రభాతసోయగం!-


కమ్మ కస్తురి గుళికలు తమ్మి లేమ

నిదుర మంపున బుక్కిట నించి మేలు

కాంచి వేకువ నుమిసెనా గమల ముకుళ

కోటరంబుల నెలదేటి కొసమ లెగసె!

                                  పారిజా ..2-64


ప్రాభాత సమయంలో ప్రకృతిలో

కనిపించే సుందర దృశ్యాలను వర్ణించే సందర్భంలో యీపద్యంచోటుచేసికొన్నది.

        పద్యంచిన్నదే కాని పనితనంచాలాయెక్కువగాఉంది.సాయంసమయంలో పద్మంలో మధుపానంకోసం వచ్చినతుమ్మెదలు ఆమత్తులో ఆలాపడిపోయి సమయంమరచిపోయాయి.సూర్యాస్తమయంకాగానే పద్మం ముకుళించుకొనిపోయింది.తుమ్మెదలు అందులోబందీలయిపోయాయి.తెల్లవారింది.పద్మం రేకులు విప్పింది.తుమ్మెదలు ఒక్కొక్కటిగా పారిపోతున్నాయి.ఆదృశ్యం.యెలాఉందంటే, పద్మినీజాతివనితలు రాత్రి కస్తురిగుళికలు బుగ్గన బెట్టుకొని పరుండి,ఉదయం వాటిని ఉమియుచున్నారా? యనునట్లున్నదని కవిగారి యూహ!

              ఇది ఉత్ప్రేక్షాలంకారము.


కస్తురి నలుపు- తుమ్మెదలూనలుపే!

కమలములకు-అమ్మాయిలకుపోలిక,

ఉమియుధ్వనికి-ఝంకారమునకు పోలిక.


               స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్రీదత్త పురాణము ప్రథమ భాగం

 శ్రీదత్త పురాణము

ప్రథమ భాగం

నై మిశారణ్యములో మునులకు దత్త ప్రత్యక్షం


ఓం శ్రీ గణేశాయనమః ఓం శ్రీ సరస్వత్యైనమః  

ఓం శ్రీ గురుభ్యోనమః జై శ్రీగురుదేవదత్త


శ్లో "ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదమ్ |

      మంత్ర మూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా ॥


శ్లో "గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ॥

      గురుసాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః ॥




 శ్లో " *మాలాం కుండించ డమరుం శూలం శంఖం సుదర్శనం|*

        *దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహమ్ |*

      

 శ్లో " *దత్తాత్రేయ హరేకృష్ణ ఉన్మత్తానంద దాయక|*

          *దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగర ||*



శుక శౌనకాది మునులందరూ కలసి నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. నిరాటంకంగా హోమాలు జరుగుతున్నాయి. ఒకరోజు విరామ సమయంలో ప్రశాంత వాతావరణంలో మునులందరూ ధ్యానంలో నిమగ్నమైయున్నారు. అందరూ పద్మాసనములు వేసుకొని రెండు చేతులూ ఒడిలో సంధించి అరమోడ్పు కన్నులతో అంతర్ దృష్టిని భ్రూ మధ్యస్థానంలో బంధించి శ్వాస ప్రక్రియలను క్రమ మార్గంలో వుంచి తేజ స్వరూపుడైన నారాయణుని నిష్టతో ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తున్నారు. మనఃశరీరాలను స్తంభింపజేసి శిలా ప్రతిమలై అత్యంత నిష్టలో ధ్యానంలో వున్నారు. అంతలో చల్లని గాలి ఆ ప్రాంతాన్ని పరిమళ భరితంతో ముంచెత్తింది. కోటి సూర్యులకాంతితో ఒక దివ్యజ్యోతి వారి నడుమ సాక్షాత్కరించింది. అదొక అద్భుత కాంతి. కేవలమైన తేజస్సు. ఆకారం లేని తేజస్సు, కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనం కలగలిపిన మహా మహస్సు. ధ్యానంలో వున్న మునులందరూ దివ్యమైన అనుభూతితో కళ్ళు తెరిచారు. ఎదురుగా కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజం.ఆ తేజస్సు దశదిశలా వ్యాపించింది. మంగళవాయిద్యాలు మనోహరంగా వినిపిస్తున్నాయి. శౌనకాది మునులందరూ

ఆ కాంతిపుంజాన్ని చూడలేక కన్నులు మూసుకున్నారు. చేతులు జోడించి ఆర్తితో “మహానుభావా ! తేజ స్వరూపా! నువ్వు అనుగ్రహించి మా ఎదుట నిలిచినా నిన్ను దర్శించలేని అశక్తులము. అద్భుతమైన ఆ తేజస్సును మా కన్నులు తట్టుకోలేకపోతున్నాయి. మనస్సులు మాత్రం పరమానందంలో మునిగివున్నాయి. ఈ అనుభూతిని మేమెన్నడూ అనుభవించనిది. దయామయా నీ రూపాన్ని దర్శించగల్గే శక్తి మాకు ప్రసాదించు” అంటూ మునులందరూ సాష్టాంగ ప్రణామములు ఆచరించారు. అప్పుడు ఆ తేజస్సు నుండి ఇలా వినిపించింది. మహామునులారా ! కన్నులు తెరవండి. మునులందరూ కన్నులు తెరిచారు. అదే తేజోస్వరూపం. ఎరుపూ, నలుపూ, తెలుపూ కలయికగా కాంతి. ఆ కాంతిలోనే

శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. అత్రి, భృగు, మరీచి మొదలగు మహర్షులందరూ పరివేష్టించి యున్నారు.

చతుర్వేదాలను పఠిస్తున్నారు. ఆ నీల నీరదశ్యాముడు చిరునవ్వులు చిందిస్తున్నాడు. వక్ష స్థలంలోని కౌస్తుభమణితో వాసుదేవుని ముఖం మరింత కాంతిమంతం అయింది. నాలుగు భుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం నాలుగు  

 తంతువులు

చేతుల్లో విరాజిల్లుతున్నాయి. కటికి పట్టు పీతాంబరం వ్రేలాడుతూ వుంది. దాని అంచులకున్న బంగారుకాంతులు ధగధగలాడుతూ స్వామి పాదాలకు ఒక వింత శోభని కలిగిస్తున్నాయి. శిరస్సున వజ్రకిరీటం, చెవులకు మకరకుండలాలు భుజాలకు మణిమయమాలలు, చేతి వ్రేళ్ళకు రత్నాలతో పొదిగిన ఉంగరాలు, మెడలో వనమాల, బంగారు యజ్ఞోపవీతం. వక్షస్థలంలో ఒకవైపు లక్ష్మి మరొకవైపు శ్రీవత్సలాంఛనం. బంగారుకొండ మీద కూర్చున్నట్లుగా గరుత్మంతుని మీద ఠీవిగా కూర్చుని దర్శనమనుగ్రహించాడు. సనక సనందనాదులు నారద తుంబురులూ స్తుతిగీతాలు ఆలపిస్తున్నారు. జయవిజయులు ఇరువైపులా సేవలు అందించుచున్నారు. విష్వక్సేనాదులు జయజయ ధ్యానాలు

పలుకుతున్నారు. మహామునులందరూ ఆనందపరవశులై చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆ నీల మేఘశ్యాముడు మల్లికార్జునుడుగా మారిపోయాడు. వెండికొండమీద నంది వాహనాన్ని అధిష్టించి పరమశివుడుగా మారిపోయాడు. శిరస్సున చంద్రరేఖ. జటాజూటం నుండి దుముకుతున్న గంగమ్మ, శరీరంనిండా వీభూతి ధరించి సర్వాంగాలకు సర్పములను ఆభరణములుగా ధరించి ఒకచేతిలో త్రిశూలం, మరొక చేతిలో ఢమరువు, మరొక చేతిలో కమండలం, మరొక చేతిలో జపమాల, కటి భాగాన పులితోలు, నాగజందెం నాగహారములు శరీరం నిండా రుద్రాక్షలను నాగకుండలాలు నాగమంజీరాలు, సర్ప భూషిత సర్వాంగుడు, నందీశ, భృంగీశ, గణేషులూ, వీరభద్ర, షణ్ముఖులు, మాతృగణాలు

ప్రమథగణాలు అందరూ పరివేష్టించి యుండగా దర్శనమిచ్చాడు.

ఆశ్చర్యచకితులై మునులందరూ చూస్తున్నారు. అంతలో ఆ తేజోమండలం చతుర్ముఖుడుగా మారిపోయింది. తెల్లకమలంపై ఎర్రని రంగులో సృష్టికర్త. నాలుగు ముఖాలు, నాలుగు వేదాలు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి. బ్రహ్మర్షులందరూ చుట్టూ కూర్చుని ఉపనిషత్ వాక్యాలను వల్లిస్తున్నారు. మలయ మారుతంలాగా వీణానాదం వినిపిస్తోంది. దివ్యమాలలను ధరించి అర్థ నిమాలిత నేత్రుడై జపమాల త్రిప్పుతూ ధ్యానం చేస్తూ బ్రహ్మదర్శనమిచ్చాడు.

శౌనకాది మునులందరూ కన్నార్పకుండా చూస్తున్నారు. ఆ కాంతి పుంజం త్రిమూర్తుల కలయికగా మారిపోయింది. మూడు రంగులు మూడు మూర్తులూ కలగలిసి కనిపిస్తున్నాయి. ఆరు చేతులు దర్శనమిచ్చాయి. శంఖము, చక్రము, త్రిశూలం, ఢమరువు, మాల, కమండలము చేతులలో కనిపించాయి. సకల దేవతలు సేవిస్తున్నారు.

సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు, మను, వసు, రుద్రులూ నక్షత్రగ్రహాది దేవతలు కిన్నర కింపురుష సిద్ధ సాధ్య

గరుడోరగ దివ్యజాతులూ ఆ త్రిమూర్తి స్వరూపుడ్ని పరివేష్టించి సోత్రాలు చేస్తున్నారు. సప్తసముద్రాలు సకల నదీనదాలు

పర్వతాలు సకల సృష్టీ సకలజీవరాసులూ ఆ దివ్య స్వరూపంలో సాక్షాత్కరించాయి. శౌనకాది మునులందరూ ఆశ్చర్య, ఆనందాల నుండి తేరుకొని సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ “మహానుభావా, త్రిమూర్తి స్వరూపా, మా జన్మలు ధన్యమయ్యాయి. చరితార్థులమయ్యాము. మా జపములు తపస్సు నేటికి ఫలించింది. మహా మహా యోగీశ్వరులకు కూడా లభించని దివ్యదర్శనాన్ని అనుగ్రహించావు. కరుణా స్వరూపా! ధన్యులమయ్యాము. దేవాధిదేవా! భక్తితో మేము చేసే షోడశోపచారములు స్వీకరించి మమ్ములను కృతార్థులను చేయమని వినయముతో అభ్యర్థించారు. త్రిమూర్తి స్వరూపుడు చిరునవ్వుతో తలఊపాడు. మునులందరూ స్వామిని పూజించి సేవించి ఇలా స్తుతించారు. చక్రాసి గదాధరా! శార్హధరా! సకల కారణ కారణా! కారణాతీతా! అవక్ర పరాక్రమా! పురుషోత్తమా! సృష్టి, స్థితి,లయ, కారకా! జగత్ర్కీడా వినోదీ! త్రిమూర్తి స్వరూపా! నమోనమః చిదగ్ని స్వరూపా! వేదాంతులు నిన్ను పరబ్రహ్మవనీ సాంఖ్యవిధులు నిన్ను పురుషోత్తముడవనీ, యోగులు పరమాత్మ అనీ, మీమాంసకులు ధర్మమనీ, విజ్ఞానులు శూన్యమని,

చార్వకులు పంచభూతాత్మకమనీ అంటూస్తుతిస్తున్నారు. వేదాలు నిన్ను విశ్వస్వరూపడవంటున్నాయి. మళ్ళీ కాదు అంటున్నాయి. నీ స్వరూపాన్ని నిర్ణయించలేక నీరసపడుతున్నాయి. వాచామగోచరా! తేజోమయా! నమోనమః ఏ సాధనము లేకపోయినా నీకు అసాధ్యమన్నది లేదు. నిజానికి సాధ్యము. అసాధ్యము రెండూ నీవే. వెలుగులకు వెలుగువి. సకల ప్రాణికోటిలోని జీవశక్తివి. సృష్టిలో నీవుకానిది, నీవు లేనిది ఏదిలేదు. సకలవ్యాపకా! ఆది దేవా! దివ్య

పీతాంబరం ధరించావు. సువర్ణకాంతులు జిమ్మే శరీరం నిండా బూడిద ధరించావు. కోటి సూర్యులకాంతిలో వెలిగిపోతున్నావు నీ పాదాలను స్మరిస్తే చాలు భవరోగాలు నాశనమౌతాయి. కర్మఫలప్రదాతా! కర్మసాక్షి! అరిషడ్వర్గాలను జయించి సమాహితచిత్తులై నీ పురాణగాధను విన్నవారు సంసార సముద్రాన్ని అవలీలగా దాటుతారు. ఆనంద స్వరూపా! అమృతమయా! నమోనమః

నీ శ్రీమన్నారాయణుని నాభి కమలము నుండి ఉద్భవించి రజోగుణ ప్రధానుడవై కర్మఫలానుసారంగా నీవు సకల చరాచర సృష్టిని చేస్తున్న వేళ భవబంధ విముక్తులైన బ్రహ్మర్షులు యోగీశ్వరులూ నిన్ను స్తుతిస్తుంటారు. సృష్టి విధాతా! నామస్మరణలో భక్తుల పాపాలను పటాపంచలు చేసి భవసాగరాన్ని అనాయాసంగా తరింపజేసే సత్వగుణ ప్రధానా! స్థితి కారణా! శ్రీమన్నారాయణా! ముముక్షువులందరూ నిన్నే ధ్యానిస్తుంటారు. ఉపమన్యువు అభ్యర్థిస్తే సాక్షాత్తూ పాలసముద్రాన్నే ప్రసాదించిన దయామయుడవు. తమోగుణ ప్రధానుడవై ప్రళయవేళ సకల సృష్టిని ఉపసంహారించే

మహాకాల స్వరూపా! భయంకరా! అభయంకరా! శంకరా! నమోనమః నైమిశారణ్యవాసులు చేసిన ఈ స్తోత్రమునకు త్రిమూర్తి స్వరూపుడు సంతుష్టుడయ్యాడు. మునీశ్వరులారా నా దర్శనముతో మీరు కృతార్ధులయ్యారు. ఏమికావాలో కోరుకోండి అన్నాడు. సృష్టి, స్థితి, లయ, కారకా ధన్యులమయ్యాము. నీ విరాడ్రూపాన్ని దర్శింపజేసావు. ఇంతకన్నా మేము కోరుకోవలసింది ఏముంది. అయినా అడగమన్నావు కనుక అడుగుతున్నాము. ఇన్ని ఆకారాలలో మాకు

కనిపించావు వీటిలో నీ అసలైన రూపం ఏది? నీ నివాసం ఎక్కడ? నీ జన్మకర్మల వృత్తాంతం ఏమిటి? నువ్వు త్రిమూర్తులకు అతీతుడవని పరాక్రముడవనీ విన్నాము ఇది నిజమా ? కాదా ? మా అజ్ఞానాన్ని మన్నించి మాసంశయాలు తొలగించు. నిశ్చల జ్ఞానాన్ని ప్రసాదించు. అవ్యయ ఆనందాన్ని అందించు అన్నారు. మునీశ్వరులారా! మీరు ఎన్నో జన్మల నుండి జపతపాలను యజ్ఞాలను నియమనిష్టలతో ఆచరిస్తూ జీవితాలు గడుపుతున్నారు. అందుకు సంతోషించి ఇలా దర్శనం అనుగ్రహించాను. నా నామ రూపాలు జన్మకర్మలు అడిగారు

కదా యోగోపదేశం చేయటానికి సాధన సాగించటానికి తగిన పుణ్యఫలం అందించటానికి నేను అత్రిమునికి పుత్రుడుగా జన్మించి దత్తాత్రేయుడు అనే నామంతో సకల లోకాలలో సంచరిస్తూ వుంటాను. ఇది ఒక అవతారం. ఇంకా ఎన్నో జన్మలు, ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు నాకు ఉన్నాయి. వాటిని చెప్పటం వెయ్యినోళ్ళు కలిగిన వానికైనా అసాధ్యము. కాని వీనిలో కొన్నింటిని సూతమహర్షి చెప్పగలడు. అతడు వ్యాసమహర్షి ప్రత్యక్ష శిష్యుడు. గురు అనుగ్రహం వల్ల సకల పురాణాలు అతనికి కరతలామలకములు. ప్రవచనంలో కూడా నేర్పరి. అతడిని అడిగి నా జన్మకర్మలుతెలుసుకోండి. ఈ యాగాన్ని పూర్తి చేసి పూర్ణఫలాన్ని పొందండి. ముమ్మూర్తులా నాకు అభిన్నుడైన గురువు సన్నిధిలో ప్రత్యక్ష, పరోక్ష జ్ఞానాన్ని పొంది చివరికి పరమానంద స్వరూపులు కండి. మీరంతా ఏక కంఠంతో చేసిన స్తోత్రము నన్ను ఆనందింపజేసింది. ఇది భక్తి ముక్తిదాయకంగా యోగసిద్ధిదాయకంగా విరాజిల్లుతుంది. భక్తిశ్రద్ధలతో ఇది పఠించిన వారికి సకలాభీష్టాలు నెరవేరును అని చెప్పి ఆ కాంతిపుంజం అదృశ్యమైంది. శౌనకాది మునులందరూ దివ్యానుభవంలో ఆనంద పారవశ్యంలో మునిగితేలుతున్నారు. అంతలో నైమిశారణ్యంలోని బ్రహ్మచారులు అక్కడకు వచ్చారు. వారంతా సమిధలు, ఫలాలు సేకరించుకోవటానికి అడవికి వెళ్ళి వాటిని తీసికొని అక్కడ దర్శించిన అద్భుత దృశ్యములను మహర్షులకు చెప్పాలన్న ఆతృతతో ఆశ్రమంలోకి పరుగు పరుగున ప్రవేశించారు. ఆనంద సాగరంలో వున్న మునులకు నమస్కరించారు.

గురువర్యులారా! రోజూ చూసే అరణ్యం ఈ రోజు వింతగా మారిపోయింది. ఎక్కడా కౄరమృగాలు లేవు. పళ్ళూకాయలతో విరగకాచిన చెట్లు, రంగురంగుల పూవులతో లతలు. కలువల్ని, తామరల్ని గట్టు చేరుస్తున్న సరోవరాలు, హంసలు ఆనందంతో కళకళలాడుతున్నాయి. అడవిలో ఎటుచూచినా పురివిప్పిన మయూరముల నాట్యాలు. ఇదివరకటి అడవిలా లేదు నందనవనంగా మారి వుంది. ఈ వింత మీకు చెబుదామని కారణమేమిటో మీరు చెపుతారని పరుగు పరుగున వచ్చాం అన్నారు.

ఈ సందడిలో తేరుకున్న మునులు నలువైపులా దృష్టి సారించారు. శిష్యులు చెప్పింది నిజమే. నందనవనంలా మారింది నైమిశారణ్యం. ఇది అంతా స్వామి సాక్షాత్కార మహిమ అని గ్రహించారు. జరిగినదంతా శిష్యులకు వివరించారు. మా అదృష్టమే అదృష్టమంటూ పరవశించిపోయారు. వటువులకు ఒకవైపు ఆనందం ఒకవైపు దుఃఖం పొంగివచ్చాయి. తమ గురువులకు స్వామి సాక్షాత్కారం లభించినదని ఆనందమూ, తాము ఆ సమయంలో లేకపోయామే అనే దుఃఖమూ పొంగివచ్చాయి. సరిగ్గా ఇదే సమయానికి మనం అడవికి వెళ్ళాలా, ఎంత దురదృష్ట వంతులం. అయ్యయ్యో మళ్ళీ ఎన్ని జన్మలకి ఈ అవకాశం లభిస్తుంది. ఇంత కాలంగా చేస్తున్న వేదాధ్యయనం ఆశ్రమ సేవ, జపతపములు. గురుసేవ పరిపక్వం కాలేదు కాబోలు అని దుఃఖించారు. అలా విలపిస్తున్న శిష్యులను మునులందరూ జాలిపడి ఓదార్చారు

పరిపరివిధాలుగా. “మీ గురు శుశ్రూష ఫలం వృధాగాపోదు. శిష్యులు కనుక మా పుణ్యంలో మీకూ భాగం ఉంటుంది. సత్సాంగత్యం, సత్ఫలాలను ప్రసాదిస్తుంది. సమయం వచ్చినపుడు మీకూ ఆ ఫలాలు దక్కుతాయి. పరాత్పరుడు కటాక్షిస్తాడు.” అని ఊరడించేసరికి శిష్యులంతా ఊరడిల్లారు. సాయాహ్న విధులను ముగించుకొని ఎవరి కుటీరములలోకి వారు వెళ్ళి విశ్రమించారు.



*శ్రీ వెంకటరమణస్వామి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 389*


⚜ *కర్నాటక  : కరిఘట్ట - మండ్యా*


⚜ *శ్రీ వెంకటరమణస్వామి ఆలయం*



💠 కన్నడలో "కరి" అంటే నలుపు మరియు

"ఘట్ట" అంటే కొండ. పురాతన గ్రంథాలలో ఈ కొండను "నీలాచల" అంటే "నీలి పర్వతం" అని పేర్కొన్నారు.

ఈ కొండ సముద్ర మట్టానికి 2,697 అడుగుల ఎత్తులో ఉంది. కొండపైన వైకుంఠ శ్రీనివాస/విష్ణువుకు అంకితం చేయబడిన పురాతన ఆలయం ఉంది.


💠 నల్లని విగ్రహం అందంగా ఉంది మరియు 6 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంది, దీనిని భృగు మహర్షి ప్రతిష్టించాడు. ఆలయంలో కలిగే ప్రకంపనలు మరియు భక్తిని వ్యక్తపరచలేము, కానీ అనుభవించవలసి ఉంటుంది. సమస్యాత్మకమైన వ్యక్తులు ఇక్కడ పూజ/ఆచారాలు చేస్తే వారి జీవితంలో సానుకూల మార్పు వస్తుందని నమ్ముతారు.


💠 ప్రధాన దేవతకు ఎడమవైపున యోగ శ్రీనివాసుడు మరియు కుడి వైపున భోగ శ్రీనివాస విగ్రహాలు ఉన్నాయి.

 శ్రీనివాసుని భార్య పద్మావతి దేవి ప్రత్యేక గర్భగుడిలో ప్రతిష్టించబడింది.

శ్రీనివాసుడు కొండపై కొలువై ఉన్నందున ఈ కొండను చిక్క తిరుపతి అని కూడా పిలుస్తారు.


🔆 ఈ కొండ వెనుక రహస్యం 


💠 ఈ పురాణం త్రేతాయుగానికి తిరిగి వెళుతుంది, సీతను రక్షించేందుకు రామచంద్రుడు లంకకు వంతెన నిర్మిస్తున్నాడు. వంతెనను నిర్మించడానికి, మొత్తం వానర సైన్యం రాళ్ళు మరియు బండరాళ్ల కోసం వెతుకుతోంది. శక్తివంతమైన కోతులు నిర్మాణం కోసం కొండలను తీసుకువచ్చాయి. వానరుల రాజైన సుగ్రీవుడు కూడా అలాంటి కొండను వెతుక్కుంటూ వచ్చాడు. వెతుకుతూ ఉండగా తిరుమలలోని ఏడు పవిత్ర కొండలను చూసి శేషాచల పర్వత శ్రేణిలోని నీలాచల కొండను పెకిలించాడు.

ఈ పవిత్ర కొండను మోస్తూ, అతను కావేరీ నది యొక్క పవిత్ర సంగమం మీదుగా వెళ్ళాడు.

 ఈ ప్రదేశంలో తపస్సు చేస్తున్న విష్ణుభక్తులు ఆయన నీలాచలాన్ని మోయడం చూశారు. వారు వెంటనే అతన్ని ఆపి, నిర్మాణ ప్రయోజనం కోసం పర్వతాన్ని తీసుకోవద్దని అభ్యర్థించారు. వారు ఈ పవిత్ర కొండ యొక్క గొప్పతనాన్ని ఆయనకు వివరించారు. శేషాచల మహిమలను విన్న సుగ్రీవుడు ఈ ప్రదేశంలోనే కొండను విడిచిపెట్టి ఇతర కొండ కోసం అన్వేషణ కొనసాగించాడు. ఇదే కొండను ఇప్పుడు కరిపుట్ట అని పిలుస్తారు. 'కరి' అంటే నలుపు.


💠 పురాణం యొక్క మరొక సంస్కరణ ప్రకారం, మేఘునాథుని బాణంతో లక్ష్మణుడు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు, సంజీవని పర్వతాన్ని తీసుకురావాలని హనుమంతుడిని కోరాడు. సంజీవని పర్వతం కోసం వెతుకుతున్న సమయంలో హనుమంతుడు తిరుపతికి చెందిన నీలాచలాన్ని సంజీవనిగా భావించి లంకకు తీసుకెళ్లడం ప్రారంభించాడు. 

అతను కావేరీ సంగమం మీదుగా వెళుతుండగా, ఋషులచే తాను మోస్తున్న కొండ సంజీవని కాదని, దానిని వెతకడానికి హిమాలయాలకు మరింత వెళ్లాలని చెప్పారు. 


💠 ఈ ప్రదేశాన్ని చిక్క తిరుపతి అని కూడా అంటారు. కన్నడలో మాతృభాష 'చిక్క' అంటే చిన్నది. దీనికి సంబంధించి ఒక పురాణం కూడా ఉంది. ఒకసారి దేవతలకు, రాక్షసులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. ప్రాణభయంతో రాక్షసులు యుద్ధభూమి నుండి పారిపోయి భృగు ముని భార్య ఖ్యాతిని ఆశ్రయించారు. స్వతహాగా దయగల ఆమె వారికి తన ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చింది. వారిని బయటకు పంపమని దేవతలు ఆమెను అభ్యర్థించినప్పటికీ కీర్తి నిరాకరించింది.


💠 దేవతలు శ్రీమహావిష్ణువుపై మొరపెట్టుకున్నారు, సుదర్శన చక్రాన్ని ఉపయోగించి ఆమె తలను శరీరం నుండి వేరు చేసి చంపాడు. 

తన భార్య నుండి విడిపోయానని భావించిన మహా ఋషి విష్ణువును భూలోకంలో పుట్టి భార్య నుండి విడిపోవాలని శపించాడు. పరమేశ్వరుడు దయతో ఈ శాపాన్ని స్వీకరించాడు.


💠 తాను ఒక స్త్రీని, ముఖ్యంగా బ్రాహ్మణుని భార్యను మరియు అతని భక్తురాలిని చంపవలసి వచ్చినందుకు భగవంతుడు బాధపడ్డాడు. అందుకే ఈ పాపం నుండి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి భగవంతుడు ఈ నీలాచల పర్వతం మీద ఉన్న అశ్వత్థ వృక్షం క్రింద తపస్సు చేసాడు. 


💠 విష్ణువును శపించి తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయమని నరసింహుడు భృగు ముని సలహా ఇచ్చాడు. సలహా ప్రకారం, భృగు ముని విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి మణికర్ణికా నది ఒడ్డున తపస్సు చేయడం ప్రారంభించాడు.

 భగవంతుడు అతని తపస్సుకు సంతృప్తి చెందాడు మరియు అతనిని అనుగ్రహించాడు. భృగు ముని ఈ పర్వతం మీద ఉండి భక్తులను అనుగ్రహించమని భగవంతుడిని వేడుకున్నాడు.

తన భక్తుని కోరికను తీర్చడానికి, శ్రీనివాసుడు ఇక్కడ ఒక దేవత రూపంలో వెలిశాడు 


💠 కొండపై గడ్డి పదునైనది మరియు దీనిని "దర్బే" అని పిలుస్తారు, దీనిని స్వామికి అర్పిస్తారు. వరాహ అవతారం సమయంలో విష్ణువు ఈ కొండపైకి వచ్చి అతని శరీరాన్ని కదిలించాడని మరియు అతని వెంట్రుకలు కొన్ని రాలిపోయి ఈ పదునైన "దర్బ"గా మారాయని పురాణాలు చెబుతున్నాయి.


💠 త్రేతాయుగంలో వైఖానస మహర్షిచే ప్రతి సంవత్సరం నిర్వహించబడే సాంప్రదాయక ఉత్సవం ప్రారంభించబడిందని నమ్ముతారు . ఈ పద్ధతి కొనసాగుతోంది మరియు కుంభ మాస పాల్గుణ (ఫిబ్రవరి-మార్చి) సమయంలో పెద్ద సంఖ్యలో యాత్రికులు హాజరయ్యే వార్షిక జాతర జరుగుతుంది.



💠మైసూర్ నుండి 20 కి.మీ., బెంగళూరు నుండి 130 కి.మీ.

ఆముక్తమాల్యద

 

*పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించే ఒక కథ*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


              *ఆముక్తమాల్యద*

                 ➖➖➖✍️

```

పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు.


గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తి చేయాలో తెలియక    ఆరాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రదిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది.


ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.


గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు.


ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు. ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు.


వారి కథే- 

శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’ లోని  ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం.


సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో, 

ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.


ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు. కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.


తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం.


ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం.


ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు.


ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది. రాజ్య సంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మ జ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.


ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది.


అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు.

*****************



ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.


ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? 

ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం. గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


అనగనగా

 🔔  *అనగనగా...* 🔔


    ఒక కొడుకుకి తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అతని తండ్రి ఆతనిని ఎప్పుడు నువ్వు ఫ్యాన్ స్విచ్  ఆఫ్ చేసి వేళ్ళు , T .V .స్విచ్ ఆఫ్ చేసి వేళ్ళు, టేబుల్,ఇల్లు శుభ్రంగా ఉంచుకో అని పదే పదే చెప్తు ఉండేవాడు .ఆ మాటలు ఆ కొడుకుకి నచ్చేవి కావు.ఇంట్లో ఉండటానికి ఇష్టం ఉండేది కాదు.


   🍁 నిన్నటి వరకు ఆ తండ్రి మాటలు ఇష్టం లేక పోయిన వినేవాడు కానీ ఈ రోజు అతనికి ఒక ఉద్యోగానికి పిలుపు వచ్చింది . ఉద్యోగం రాగానే వేరే చోటుకి వెళ్లిపోవాలి అని మనసులో అనుకున్నాడు.


  🍁ఇంటర్వ్యూకి బయలుదేరాడు తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్న  కొడుకుకి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికి  దైర్యంగా సమాధానం చెప్పు ఒక వేళ నీకు తెలియకపోతే ఆ ప్రశ్నలని కూడా నువ్వు ధైర్యంగా ఎదురుకో అని చెప్పి ఖర్చులకు కొంచం ఎక్కువగానే డబ్బులు ఇచ్చి పంపాడు.


   🍁ఆ కొడుకు ఇంటర్వ్యూ జరుగుతున్న అడ్రస్ కు వెళ్ళాడు. అంత పెద్ద బిల్డింగ్ కి సెక్యూరిటీ లేదు.గేట్ యొక్క గడి కొంచం వెళ్తున్న వాళ్ళ చేతికి తగిలేటట్లు ఉంది దానిని సరిచేసి లోపలికి వెళ్ళాడు .లోపల గేట్ కి రెండు పక్కల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి .ఆ మొక్కలకు నీళ్లు పట్టి టూబ్ ని నడిచే దోవలో పడేసి ఆ తోట వాడు మోటార్ ఆఫ్ చేయటానికి వెళిపోయాడు .ఆ టూబ్ ని చేతిలోకి తీసుకోని ఒక మొక్క యొక్క మొదళ్ళ మీద నీరు పడేటట్లు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు.


  🍁రిసెప్షన్ లో ఎవ్వరు లేరు. ఇంటర్వ్యూ కి 1 ST ఫ్లోర్ అని బోర్డు రాసి పెట్టి ఉంది .మెల్లగా మెట్లు ఎక్కాడు దారిలో నిన్న రాత్రి వేసిన లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఎవ్వరు ఆఫ్ చేయకుండా ఉన్నాయి .లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్తున్నావు అని తండ్రి చెప్పిన మాటలు వినపడుతున్నట్లుగా సడన్ గా అనిపించి వెంటనే మెట్ల వద్దకు వెళ్లి లైట్స్ స్విచ్లను ఆఫ్ చేసి పైకి వెళిపోయాడు.


 🍁1ST ఫ్లోర్ లో ఒక పెద్ద హాలు లో చాలా మంది కూర్చొని ఉన్నారు. అంత మందిని చూసి నాకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని మనసులో అనుకుంటూ ముందుకు అడుగు వేసాడు, అక్కడ ఫ్లోరుపై ఉన్న MAT పై WELCOME తల క్రిందులుగా ఉంది దానిని కాలితో సరిచేసి లోపలికి వెళ్ళిపోయాడు.ఆ హాల్ లో ముందు వరుసలో  చాలా మంది కూర్చొని ఉన్నారు ,వెనుక వరుస కాళిగా ఉంది కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉంది . గది లో ఎవ్వరు లేనప్పుడు ఫ్యాన్ ఎందుకు అని వాళ్ళ అమ్మ అన్నట్లు మాటలు వినపడ్డాయి వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూ కి వచ్చిన వారితో కలిసి కూర్చున్నాడు.

🍁ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక దారిలో నుంచి లోపలికి పంపి వేరే దారిలోనుండి బయటకి పంపిస్తున్నారు ,దానివల్ల లోపల ఎటువంటి ప్రెశ్నలు అడుగుతున్నారో అనే విషయం తెలుసుకోలేక పోయాడు.లోపల ఏమి ప్రశ్నలు అడుగుతారో అనే భయంతోనే లోపలికి వెళ్లి నిలబడ్డాడు.అతని సర్టిఫికెట్స్ తీసుకున్న అధికారి తెరచి చూడకుండానే మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరతారు అని ఆ అధికారి అతన్ని అడిగాడు .ఇది కూడా ఒక ప్రశ్న లేక ఉద్యోగం లో చేరతారా అని అడిగారో అర్ధం కాకుండా ఆలోచిస్తూ నిలబడాడ్డు .

🍁అధికారి ఏంటి ఆలోచిస్తున్నావు ఇక్కడ మేము ఎవ్వరిని ఎలాంటి ప్రశ్నలు అడగలేదు వచ్చే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో , ఎలా ప్రవర్తిస్తున్నారో చూడటానికి అక్కడక్కడా కెమెరాలు పెట్టాము .ఇక్కడికి వచ్చిన అందరూ వేస్ట్ అవుతున్న వాటర్ ని కానీ, టూబ్ లైట్స్ ని కానీ, ఫ్యాన్ ని కానీ ఆఫ్ చేయలేదు కానీ మీరు ఒకరే అనింటిని సరిచేస్తూ లోపలికి వచ్చారు.మేము మిమల్ని ఉద్యోగం లోకి తీసుకుంటున్నాము అని ఆ అధికారి చెప్పాడు.

🍁నాన్న చెప్పే మాటలు అన్ని నాకు విసుకు తెప్పించేవి,కానీ ఆ మాటలే ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించాయి అని సంతోష పడ్డాడు. తండ్రి మీద ఉన్న కోపం మొత్తం పోయింది . ఉద్యోగం లో చేరేటప్పుడు నాన్న ని కూడా ఇక్కడికి తీసుకురావాలి అని మనస్సులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు 

 🍁తండ్రి మన కోసం ఎం చెప్పినా ,ఎం చేసినా మన భవిష్యత్తు కి మంచి జరగాలనే చేస్తాడు.

🍁ఉలి దెబ్బలకి శిల బాధపడుతుంది అనుకుంటే రాయి శిల్పం కాదు . ఆ బాధని తట్టుకున్నపుడే ఆ రాయి శిల్పంగా మారుతుంది .



🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

మాట సాయం చేయండి.

 👉👉ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. 

ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు.. 

ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! 

కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.


నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే.. 

నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం...

ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో...

ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.


ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!

రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా* *అదిలించాడు. అంతే!    రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది.


పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా! ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!


పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం.


కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం...


 కష్టంలో ఉన్న మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి.

ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి..  మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం.

అన్న నీకగు

 *తల్లి*.                                      అన్న నీకగు నేకదంతుడు నండ నుండును వెళ్ళిరా.                    నిన్ను జేర్చును పాఠశాలకు నిర్భయమ్ముగ నుండుమా.                              *గణపతి*.                                          చిన్ని తమ్ముడ! రార! పోదము శీఘ్రమున్ బడి జేర్చుదున్.                       అన్ని వేళల తోడు నీడగ నన్ననై చరియించెదన్.                                 *కుమారుడు*.                                       నన్ను మన్నన జేసినాడవు నాయకా! గణనాయకా!                             నిన్ను వీడను సోదరా! నిను నిత్యమున్ భజియించుదున్.                       అల్వాల లక్ష్మణ మూర్తి.

న్యస్తాక్షరి- శి-వ-రా-త్రి# ఆద్యక్షరి*

 న్యస్తాక్షరి- శి-వ-రా-త్రి# ఆద్యక్షరి*

 *శివస్తుతి*


శివుడు తాండవ మాడగా సిరులు గురియు


వరదలై పారు వరములు భక్తతతికి 


రావు భయములు శంకలు, రాజమౌళి 


త్రిభువనమ్ములు మురిపించు తేజమొదవ. 



అల్వాల లక్ష్మణ మూర్తి.