26, జులై 2024, శుక్రవారం

సుప్రభాతసోయగం

 శు  భో  ద  యం🙏


-సుప్రభాతసోయగం!-


కమ్మ కస్తురి గుళికలు తమ్మి లేమ

నిదుర మంపున బుక్కిట నించి మేలు

కాంచి వేకువ నుమిసెనా గమల ముకుళ

కోటరంబుల నెలదేటి కొసమ లెగసె!

                                  పారిజా ..2-64


ప్రాభాత సమయంలో ప్రకృతిలో

కనిపించే సుందర దృశ్యాలను వర్ణించే సందర్భంలో యీపద్యంచోటుచేసికొన్నది.

        పద్యంచిన్నదే కాని పనితనంచాలాయెక్కువగాఉంది.సాయంసమయంలో పద్మంలో మధుపానంకోసం వచ్చినతుమ్మెదలు ఆమత్తులో ఆలాపడిపోయి సమయంమరచిపోయాయి.సూర్యాస్తమయంకాగానే పద్మం ముకుళించుకొనిపోయింది.తుమ్మెదలు అందులోబందీలయిపోయాయి.తెల్లవారింది.పద్మం రేకులు విప్పింది.తుమ్మెదలు ఒక్కొక్కటిగా పారిపోతున్నాయి.ఆదృశ్యం.యెలాఉందంటే, పద్మినీజాతివనితలు రాత్రి కస్తురిగుళికలు బుగ్గన బెట్టుకొని పరుండి,ఉదయం వాటిని ఉమియుచున్నారా? యనునట్లున్నదని కవిగారి యూహ!

              ఇది ఉత్ప్రేక్షాలంకారము.


కస్తురి నలుపు- తుమ్మెదలూనలుపే!

కమలములకు-అమ్మాయిలకుపోలిక,

ఉమియుధ్వనికి-ఝంకారమునకు పోలిక.


               స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: