26, జులై 2024, శుక్రవారం

వినాయకుడు విశేషాలు*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

     *వినాయకుడు విశేషాలు*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*వరసిద్ధి సుబుద్ధి మనోనిలయం*

*నిరత ప్రతిభా ఫలదాన ఘనం।*

*పరమేశ్వర మాన సమోదకరం*

*ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ॥*


*వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు.*


*కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు.*


*త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడిగా ఆవిర్భవించాడు.*


*ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భుజుడై అలరారాడు.*


*కలియుగంలో తొండంతో, ఏకదంతుడై సంపద బొజ్జతో ఉన్న గణనాథుడు దర్శనమిచ్చాడు.*


*బదరీనాథ్ వద్ద వినాయకుని గుహలు ఉన్నాయి. ఆ గుహలో వ్యాసమహర్షి భారతం చెప్తూంటే, ఘంటాన్ని ఆపకుండా గణపతి భారతం రాశాడట.*


*కేదార్ నాథ్ యాత్ర చేసే యాత్రికులు వారి మార్గంలో ఉండే గౌరీకుండ్ వద్ద బాలగణేశుని ఆలయాన్ని దర్శిస్తారు.*


*శ్రీ శైలంలో సాక్షిగణపతిని చూడనిదే యాత్ర పూర్తికాదని చెప్తారు.* 


*శబరిమలలో కన్నెమూల గణపతి ప్రసిద్ది చెందింది.*


*మధురలో క్షిప్రగణపతిని ప్రతిభక్తుడు దర్శించి పూజిస్తాడు.*


*ప్రథముడైన గణపతిని ముందుగా పూజించిన తర్వాతే ఇష్టదైవాలను ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోంది. విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం.*


*ఏ నోములు, వ్రతాలు, పూజలు చేసినా హరిద్రా గణపతికే మొదటిపూజ.*


*గణపతికి గరిక అంటే ఇష్టము. గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి.*


*శ్రీ మహాగణపతికి పూజ చేసి బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి.*


*వినాయక చవితినాడు మాత్రమే తులసీదళాలతో వినాయకుడిని పూజిస్తారు. మరి ఏ ఇతర రోజుల్లోనూ వినాయకుని తులసీదళాలతో పూజించకూడదు.*


*విఘ్నేశ్వరుడు తర్పణ ప్రియుడు. గణపతికి 21 రోజులు బెల్లం పానకంతో తర్పణ చేస్తే తాము అనుకున్న పనులు ఎటువంటి విఘ్నము అవాంతరాలు లేకుండా సాధించగలుగుతారు.*


*గణపతికి ప్రతిరోజూ గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయటపడతారు.*


*శని భగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి.*


*గం గం గణేశాయ నమః।*

*ఓం నమః శివాయ॥*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: