*తల్లి*. అన్న నీకగు నేకదంతుడు నండ నుండును వెళ్ళిరా. నిన్ను జేర్చును పాఠశాలకు నిర్భయమ్ముగ నుండుమా. *గణపతి*. చిన్ని తమ్ముడ! రార! పోదము శీఘ్రమున్ బడి జేర్చుదున్. అన్ని వేళల తోడు నీడగ నన్ననై చరియించెదన్. *కుమారుడు*. నన్ను మన్నన జేసినాడవు నాయకా! గణనాయకా! నిన్ను వీడను సోదరా! నిను నిత్యమున్ భజియించుదున్. అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి