ఆకార మిచ్చుచు నర్చనమ్మిడి నిరా
కార! నే చేసితి నేరమయ్య!
వాక్కులకందని వాడవంచని తెల్సి
సల్పితి స్తోత్రముల్ జడుడ నగుచు!
నెందెందు వెదకిన నందందె గలవని
తెలిసియు జేసితి తీర్థయాత్ర!
తెలిసియు తెలియక నలసత దప్పులన్
సలిపి యుండగ వచ్చు ఛాందసమున!
అన్ని రూపులు నీవెగా అభవ!ఘనుడ!
భవ!యనిర్వచనీయుడా!వందనీయ!
విశ్వమంతయు నీదెగా విభుడ!యనఘ!
తలను వంచితి జగదీశ!తత్వ మెఱిగి!
-------కోడూరి శేషఫణి శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి