ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
21, జనవరి 2026, బుధవారం
*శ్రీ కృష్ణదేవరాయల వైభవ గాథ..*
*శ్రీ కృష్ణదేవరాయల వైభవ గాథ..*
ఆంధ్ర భోజ! శ్రీకృష్ణదేవరాయా!
నీ పరిపాలన ఓ చరిత్ర, నీ వంశం రాజసానికి చిహ్నం,
విదేశీయులు సైతం కొనియాడిన అసమాన వంశం.
హంపి నగరపు సౌరభానికి నీవే నిత్య నిదర్శనం.
కవిత్వ కథన రంగ విన్యాస చరితా!
అష్టదిగ్గజాల సరసన వెలిగే రాజమార్తాండా!
'ఆముక్తమాల్యద'తో విరిసిన సాహిత్య పారిజాతమా!
నీవు తెలుగు తల్లి ముద్దుల రాజకుమారుడవు.
రణరంగ విన్యాస శత్రు భయంకరా!
గజపతులకు నీవు గజసింహ స్వప్నానివి.
చేతిలో కత్తి పడితే విజయం నీ చెంతనే..
రణరంగంలోనూ కవిత్వాన్ని పండించిన సాహితీ శిఖరమా!
లాలిత్య సౌందర్య సంపద వృక్షమా!
సంస్కృతాంధ్ర భాషలలో ఆరితేరిన ప్రవీణా!
అష్టాదశ వర్ణనలలో మేటి అనుభవజ్ఞుడా!
కవన రంగంలో నీవు సాహితీ సార్వభౌముడివి.
'మూరురాయరగండ' బిరుదాంకితుడా!
సకల ఆంధ్ర రాజ్య పరిపాలన విజేతవు నీవు.
నీ చరితం సువర్ణ హిమ శిఖరం..
దేశ చరిత్రలో నీది సుమధుర, సుస్థిర స్థానం.
మత సామరస్య పర్యవేక్షక సార్వభౌమా!
హిందూ-ముస్లిం ఐక్యతను చాటిన బోధకుడా!
హైందవ ధర్మ రాజ్య పరిరక్షకా..
ఆంధ్ర వైభవ పరంపరలో నీ నామం చిరస్థాయి.
శిల్ప సౌందర్య కళాపోషకా!
సకల కళా సమ్మేళనానికి నీవే రూపానివి.
విజయ నగర వైభవ సంస్కృతికి నీవే నిదర్శనం.
భావి తరాలకు నీ పరిపాలనే ఆదర్శం.
గొప్ప ఆలయాలను నిర్మించిన నిర్మాతవు,
శైవ, వైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించిన పుణ్యమూర్తివి.
కలియుగ దైవానికి మణి మాణిక్యాలర్పించిన భక్తుడివి,
సిరులను కురిపించే సువర్ణ హస్తం నీది.
అద్భుత చెరువులెన్నో తవ్వించావు,
రైతుల ఇంట సిరులను సాక్షాత్కరించావు.
భూమిపుత్రుడిని ఆదరించి..
ధాన్యలక్ష్మిని సగర్వంగా నిలిపిన అన్నదాతవు.
నలుదిక్కులా వ్యాపార వృద్ధిని పెంచావు,
రత్నరాసులు వీధుల్లో రాశులుగా పోయించావు.
అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించి,
నేటి ఆర్థిక వ్యవస్థకు నీ పరిపాలనే అసలైన దర్పణం!
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235
సత్యమేవ జయతే
*సత్యమేవ జయతే అమృత వాక్యమే..*
పాత పుస్తకంలోని ఆ పేజీ జ్ఞాపకమొస్తుంది
విశాల మనసును నీటి చుక్కలా తడుపుతుంది
నా కళ్ళ ముందర శాంతి పక్షిలా ఎగురుతూ
తాకితే మునివేళ్లకు తీయని అనుభూతినిస్తుంది..
ఒక మెరుపులా ఆ వాక్యం ఆకర్షించి
మేధస్సులో రసాయనంలా ఉప్పొంగి
గడిచిన కాలాన్ని యంత్రంలా వెనక్కి తిప్పి
కాలానికి తోడుగా సజీవంగా నడుస్తుంది..
ఎన్ని చరిత్రలు చూసిందో తన కళ్ళముందు
ఎన్ని కలలు తిరగరాశాయో ఆ సత్యాన్ని
ఎన్ని సిరా చుక్కలు కాగితాలపై వర్షించాయో
ఇప్పటికీ నిత్య నూతనంగా కనిపిస్తూనే ఉంది..
ఎంత సారాన్ని వడబోసి పుట్టిందో
ఉద్గ్రంథాలను తిరగేస్తే కనిపించిందో
అశాంతి మనసుల్లో ఆయువును పోసిందో
త్రాసులో సత్యం వైపే గర్వంగా నిలబడింది..
సంగ్రామంలో చేతికర్రలా ఆయుధమై నిలిచి
శత్రువులో సైతం భీతిని పుట్టించి
ప్రపంచ దేశాల్లో పరమ పవిత్రంగా వెలుగుతూ
ఒక మంత్రంలా విశ్వమంతా ఘోషిస్తుంది..
సత్యమేవ జయతే అమృత వాక్యమై
జగతికి అందిన సందేశాత్మక రూపమై
యుగాలు మారినా తరగని సంప్రదాయమై
జగతిపై నిలిచి ధర్మచక్రంలో దర్శనమిస్తుంది..!
కొప్పు*సత్యమేవ జయతే అమృత వాక్యమే..*
పాత పుస్తకంలోని ఆ పేజీ జ్ఞాపకమొస్తుంది
విశాల మనసును నీటి చుక్కలా తడుపుతుంది
నా కళ్ళ ముందర శాంతి పక్షిలా ఎగురుతూ
తాకితే మునివేళ్లకు తీయని అనుభూతినిస్తుంది..
ఒక మెరుపులా ఆ వాక్యం ఆకర్షించి
మేధస్సులో రసాయనంలా ఉప్పొంగి
గడిచిన కాలాన్ని యంత్రంలా వెనక్కి తిప్పి
కాలానికి తోడుగా సజీవంగా నడుస్తుంది..
ఎన్ని చరిత్రలు చూసిందో తన కళ్ళముందు
ఎన్ని కలలు తిరగరాశాయో ఆ సత్యాన్ని
ఎన్ని సిరా చుక్కలు కాగితాలపై వర్షించాయో
ఇప్పటికీ నిత్య నూతనంగా కనిపిస్తూనే ఉంది..
ఎంత సారాన్ని వడబోసి పుట్టిందో
ఉద్గ్రంథాలను తిరగేస్తే కనిపించిందో
అశాంతి మనసుల్లో ఆయువును పోసిందో
త్రాసులో సత్యం వైపే గర్వంగా నిలబడింది..
సంగ్రామంలో చేతికర్రలా ఆయుధమై నిలిచి
శత్రువులో సైతం భీతిని పుట్టించి
ప్రపంచ దేశాల్లో పరమ పవిత్రంగా వెలుగుతూ
ఒక మంత్రంలా విశ్వమంతా ఘోషిస్తుంది..
సత్యమేవ జయతే అమృత వాక్యమై
జగతికి అందిన సందేశాత్మక రూపమై
యుగాలు మారినా తరగని సంప్రదాయమై
జగతిపై నిలిచి ధర్మచక్రంలో దర్శనమిస్తుంది..!
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235ల ప్రసాద్
నంద్యాల
9885066235
*నా ఉన్నతికి హుందా నా భాష…!*
*నా ఉన్నతికి హుందా నా భాష…!*
నన్నయ్య నారు పోయగా,
తిక్కన్న తీపు తొడగగా,
ఎర్రన్న వర్ణమై విరసిల్లగా,
నా తెలుగు సస్యశ్యామలమాయె...
పాల్కురికి అచ్చతెలుగు తోడవగా,
శివతత్వం చిందులేయగా,
తెలుగు పదం పాదాలు కలిపి,
కావ్యమై పరవళ్లు తొక్కింది..
శ్రీనాథుని సీసంలో రోషంగా,
పలనాటి పౌరుషంగా,
చాటువై పద్యాల్లో మేటిగా,
గంభీరంగా జలజల ప్రవహించింది…
పోతన సేద్యంలో నాగలిగా,
తెలుగు నేలపై భక్తిని పండించి,
భాగవతపు వెన్నను అందించి,
తెలుగు రీతుల మాధుర్యమే పంచింది..
అష్టదిగ్గజాలు పల్లకి కాగా,
ప్రబంధమే గండపెండెరంగా,
కృష్ణరాయల చేతుల్లో,
వినువీధుల్లో అంబారీపై అందాలనెక్కింది..
బద్దెన సుద్దులు చెప్పగా,
వేమన్న బుద్ధులు విప్పగా,
శతకమై అమరత్వాన్ని పొంది,
పిల్లల నోట తియ్యటి మాటగా నిలిచింది…
నేడు సరళత్వము పొందగా,
ఆధునికమై అందాలనెక్కగా,
విశ్వవీధిలో వింజామరలు,
వీస్తూ ప్రపంచమంతా పరవళ్లు తొక్కుతోంది…
కందుకూరి సంస్కరణ చేయగా
గురజాడ ముత్యాల హారాలు కూర్చగా
గిడుగు గోడై నిలవగా
నవ్యమై నవ శకాన్ని ప్రారంభించింది..
జ్ఞానపీఠాలు కిరీటంలా ధరించగా
అన్ని ప్రక్రియలలో ఆరితేరగా
పద్యమై గేయమై పాటలై పారగా
నేలంతా తెలుగు పలుకులతో వికసించింది..
ఇదే నా భాష ఇదే నా శ్వాస,
నా జాతికి చిహ్నంగా,
నా ఉన్నతికి హుందాగా,
నన్ను నడిపిస్తుంది నిత్యం ఇది సత్యం..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235
Dr. Mir Jafer Ali Hashmi
Dr. Mir Jafer Ali Hashmi
B U M S (Osm)
Consultant in :
Allergic Asthma.
Arthritis.
Epilepsy ( Fits ).
Kidney Stones.
Herbal Medicine
Safe and Cure 💯.
Mob:+91 8790467286.
9392050866.
మాఘ పురాణం - 3 వ* _*అధ్యాయము*_
🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️
*🌷బుధవారం 21 జనవరి 2026🌷*
_*మాఘ పురాణం - 3 వ*
_*అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*21వ తేదీ బుధవారం*
*వేకువఝామున*
*చదువు కొనుటకు*
```
గురుపుత్రి కథ,
ఒక ఋషి కూతురి గురించి చెబుతుంది. ఆమె తండ్రి అడవిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు తల్లి చనిపోవడంతో, గురువు వద్ద చదువుకునేందుకు పంపబడుతుంది. గురువు ఆమెను తన కూతురిలా చూసుకుంటాడు, ఆమె తెలివితేటలతో అన్ని విద్యలు నేర్చుకుని రాజును వివాహం చేసుకుని రాణి అవుతుంది. మంచితనంతో ప్రజలను ప్రేమించి పాలించే రాణిగా, కుమారుడు పుట్టి రాజు మరణించాక కుమారుడితో కలిసి రాజ్యాన్ని పాలిస్తుంది. చివరికి కుమారుడు రాజు అయి సంతోషంగా పరిపాలించగా,
ఈ కథ మంచితనం ఎల్లప్పుడూ మంచి ఫలితాలనిస్తుందని, మంచి వ్యక్తులుగా మారేందుకు ప్రేరేపిస్తుంది.
```
*గురు పుత్రికా కథ*```
మంగళదాయినీ! సర్వమంగళా! మాఘ మాసం స్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తయై తన భర్తతో హరి సాన్నిధ్యము నందినది. అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి ‘స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి! మాఘస్నానమున పాప విముక్తి నందిన విధానమేమి? వివరముగ చెప్పగోరుచున్నా’ననగా శివుడిట్లు పలికెను.
‘దేవీ వినుము, పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు, గురు సేవచేస్తూ విద్యాభ్యాసం చేస్తూవుండే వాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూవుండేవాడు.
ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా అడవికి వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురు పుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది, పద్మాలు,వానిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలోనున్న కలువలు, జల సంచారము చేయు జలప్రాణుల విహారము, మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా వుంది.
గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది. ‘ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖ పడాలని వున్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది మన మిద్ధరమును పడుచువారము, మన కలయిక సుఖ ప్రదమగును ఆలసించక నావద్దకు రమ్ము, నా శరీరము దూదికంటే మెత్తగానున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము, రమ్ము రమ్మ’ని పిలిచెను.
సుమిత్రుడు ‘మంచిదానా! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురు పుత్రికవు మనము సోదరీ సోదరులము, నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్య చంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరక వాసము చేయవలసి యుండును. కావున యింటికి పోదమురమ్ము, గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము’ అని పలికెను.
గురుపుత్రిక ఆ మాటలను విని ‘ఓయీ! కన్యారత్నము, సువర్ణము. విద్యా దేవత, అమృతము స్వయముగ చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికిరాను. నేనిచటనే నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి దీని ఫలితము అనుభవింపుము’ అని నిష్టురముగ మన్మధావేశముతో మాటలాడెను.
సుమిత్రుడును యేమి చేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మధశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయని లోనికెగెను. తండ్రియామెను కాశ్మీర దేశవాసి యగు బ్రాహ్మణనుకిచ్చి వివాహము చేసెను.
కొంత కాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. ‘అయ్యో! సుఖములనంద వలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా’ అని పలువిధములుగా దుఃఖించుచుండెను.
ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి ‘జ్ఞానస్వరూపా! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెద’నని ధైర్యము చెప్పెను.
సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరల దుఃఖించెను.
యోగి సుదేవుని, భార్యపుత్రికలను చూచి క్షణకాలము ధ్యాన యోగము నందియిట్లు పలికెను...
‘ఓయీ! వినుము నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యౌవనవతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతి హత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ రోషము వలన ఈమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము..
ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతము నాచరించువారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్య బలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగ రమించెను. ఈ దోషమువలన నీమె తమ కర్మఫలముల యిట్లననుభవించుచున్నది చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా!’
సుదేవుడు యోగిమాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుబడెను. ఈ జన్మలో కన్యయై సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుటనువిని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి ‘తండ్రీ! నా కుమార్తె చేసిన పాపము యేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట యెట్లు జరుగును? దయయుంచి చెప్పు’డని పరిపరి విధముల ప్రార్థించెను.
అప్పుడా యోగి ‘ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు, ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము: మాఘమాసమున ప్రాతఃస్నానము చేసి నదీ తీరమున గాని సరస్సు తీరమున యిసుకతో గౌరీదేవిని జేసి షోడశోపచారములతో పూజింప వలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని (Gouri Devi) సమర్పించవలయును. ఈ విధముగ ఈమెచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును.
మాఘ శుద్ద తదియ నాడు రెండు క్రొత్త చాటలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫల పుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి, దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీ పూజచేసి ముత్తైదువల కిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింప వలయును. మాఘమాసమున ప్రాతఃకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణు లోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరివ్రతమాచైంచిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను వారియునుహ్రహమునొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నందుదురు. అని యోగి వివరించి తన దారినబోయెను.
సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘ స్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలోగాని, సరస్సునగాని, కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను.```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*మాఘపురాణం మూడవ* *అధ్యాయము సంపూర్ణము*
*🌷సేకరణ🌷*
*న్యాయపతి నరసింహారావు*

