16, అక్టోబర్ 2023, సోమవారం

శ్రీకృష్ణస్తుతి

 శ్రీకృష్ణస్తుతి


కస్తూరి తిలకమ్ము ఘన లలాటమ్మందు

           కల్గి వక్షమ్మందు  కౌస్తుభమును 

నాసాగ్రమందున నవ మౌక్తికంబును

           కరతలమ్మందున గానమురళి 

కనక కంకణములు కరకమలంబులన్ 

           సర్వాంగముల హరిచందనమ్ము

శుక్తి కంఠంబున మౌక్తిక మాలలు

           విభవాన దాల్చియు వెల్గు చుండి

గోపికా పరివేష్టిత రూపి యయ్యు

విజయ దరహాస చంద్రికా విలసనమున

నిల్చు 'గోపాలచూడామణిన్' వ్రజేశు

చిద్విలాసుని కృష్ణుని చేరి కొలుతు


✍️గోపాలుని మధుసూదన రావు 

భక్తకవి పోతన

 భక్తకవి పోతన

 సీ. 'కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి'

                పరికించి చూచిన భక్తవరుడు

     'ఎవనిచే జనియించు నీ జగమ్మ 'నుచును 

               'కరిచేత' తెల్పిన పరమబుధుడు

     'రాజులు గల్గరే ! రాజ్యంబు లేలరే !

               యవనిలో  నుండిరే!' యనిన ఘనుడు

      కన్నీరు నింపిన కమలాసనునిసతి 

                న్నోదార్చి పొగడిన యోగివరుడు

తే. భక్తి వైరాగ్య కావ్యమౌ భాగవతము

      రచన జేసియు నత్యంత రమ్యముగను 

      తెలుగు వారికి నిచ్చిన  దివ్య సుకవి

      పోతనకు మించి యెవ్వరు పుడమి గలరు ?

అట్టి కవివర్యునకు భక్తి నంజలింతు


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

Panchaag


 


సుసందేశం

 " సృష్టిలో ప్రకృతి రమణీయత, సకల జీవరాశి సుమనోవికసనకు చక్కటి నిదర్శనం "                 

విశ్వ నిత్య సుచైతన్య దివ్య తేజో ప్రకాశమై వెలుగొందు మానవాళి సృష్టి, మహోన్నత దివ్య దీప్తి ! శరన్నవరాత్రుల సుమనోహర శోభ వర్ణనాతీతం, జగన్మాత దివ్య శుభాశీస్సుల సుప్రకాశం ! సుహృద్భావ సువ్యక్తిత్వ సుచైతన్య విశ్వ సురక్షాత్మాత్మక సద్భావనకు, అమ్మ నిత్య    సుసందేశం ! విశ్వ వ్యాప్త మహోన్నత వసుధైక కుటుంబక వ్యవస్థ సత్వర స్థాపనకు చక్కని సోపానం !                             

✍️గుళ్లపల్లి ఆంజనేయులు

విజయదశమి సందర్భంగా

 విజయదశమి సందర్భంగా విజయవాడ నవరాత్రి మహోత్సవాలలో ఇవాళ గాయత్రి అలంకరణకు మా తమ్ముడు శతావధాని డా రాంభట్ల పార్వతీశ్వర శర్మ డిడి సప్తగిరి ఛానల్ ద్వారా ప్రత్యక్ష వ్యాఖ్యానం....


https://youtu.be/b1rLrTPtzEQ?si=GEVdaIrO777XfLyL


శరన్నవరాత్రి

 https://youtu.be/B5zXqM4rFT8?si=gCarZ5h0kIqGNoMM


శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹 శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న ఈ సమయంలో..ఈ నవరాత్రులు జరుపుకోవలసిన అవసరం గురించి, ఆ జగన్మాతను అర్చించవలసిన విధానం గురించి ఈ ఎపిసోడ్ లో ఎంతో చక్కగా వివరించారు ప్రముఖ సాహితీవేత్త డా. మసన చెన్నప్ప గారు. ఆ పరాశక్తి లీలలు అనుపమానం. చాలా పవిత్రమైన ఈ నవరాత్రులలో ఆమె గురించి తెలుసుకోవడం పూర్వ పుణ్య విశేషం. నవరాత్రులు ఎందుకు ఎలా వచ్చాయో చెన్నప్ప గారి మాటల్లో నే వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

విదురనీతి

 విదురనీతి

శ్లో)పితా హి తే సమాసీన ముపాసీతైవ మామధః

 బాల: సుఖైధితోగేహే నత్వంకించన బుధ్యసే||


అ)నీ తండ్రి కూడ నేనాసనం పైన కూర్చుండగా తాను క్రింద ఉండి సేవించేవాడు. నీవు బాలుడవు, సుఖంగా పెరిగి నావు. నీవు కట్టుబాట్లే మీ తెలియకున్నావు


 ఉద్ధవగీత

శ్లో)ఇతి శేషాం మయా దత్తాం శిరస్యాధాయ సాదరమ్ | ఉద్వాసయేచ్ఛేదుద్వాస్యం జ్యోతిర్జ్యోతిషి తత్పునః ॥ 


అ)ఇట్టి ప్రార్థనద్వారా నా నిర్మాల్యమును ఆదరముతో శిరస్సున ధరింప వలెసు, విసర్జన చేయదలచిచో ప్రతిమయందు విన్యస్త మైనజ్యోతిని మరల తన హృదయస్థజ్యోతియందు లీనము చేయవలెను

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *తృతీయాశ్వాసము*


                      *25*



*వ్యాస జననం*


మత్స్యగంధి పడవ నడిపే తరుణంలో ఒక రోజు ఆ పడవలో వశిష్ట మహాముని కుమారుడైన శక్తి మహాముని కుమారుడు  పరాశరుడు ప్రయాణిస్తూ మత్స్య గంధిని చూసి మోహించి ఆమెతో సంగమించగా వారిరువురికి వ్యాస భగవానుడు జన్మించాడు. పుట్టగానే  వ్యాసుడు తల్లికి నమస్కరించి తనను తలచిన మరుక్షణం ఆమె ఎదుట ఉంటానని మాటిచ్చి తపసు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ పై వైశంపాయనుడు దేవ దానవ అంశలతో  పాండవులు కౌరవులు పుట్టారని చెప్పగా  జనమేజయుడు దేవాంశతో పుట్టిన వారు యుద్ధం ఎందుకు చేశారని సందేహం వెలుబుచ్చాడు. సమాధానంగా వైశంపాయనుడు పరశురామ దండయాత్రకు క్షత్రియులంతా బలి కాగా రాజుల భార్యలు వంశాభివృద్ధి కొరకు ఆకాల ధర్మం అనుసరించి ఉత్తములైన బ్రాహ్మణుల అనుగ్రహంతో సంతానవతులైయ్యారు. మరలా రాజులు ధర్మపరిపాలన సాగించగా భూమి సుభిక్షంగా ఉండి ప్రజల ఆయుర్ధాయం పెరిగి మరణాలు తగ్గాయి భూభారం ఎక్కువైంది. భూదేవి త్రిమూర్తుల వద్దకు వెళ్ళి భూభారాన్ని తగ్గించమని వేడుకొనగా వారు భూదేవితో దేవతల అంశంతో పాండవాది రాజులు రాక్షసాంశతో కౌరవాది రాజులు పుట్టి పరస్పరం కలహించుకొని కురుక్షేత్రమనే యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో జనక్షయం జరిగి భూభారం తగ్గకలదని భూదేవితో చెప్పారు.

*రాశి ఫలితాలుq

 *సోమ వారం* *16-10-2023*

 *ఇందు వాసరః*

   *రాశి ఫలితాలు*

*మేషం*

స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. 

*వృషభం*

ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  గృహమున వివాహది శుభకార్యములు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది.

*మిధునం*

ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు నుండి బయట పడతారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

*కర్కాటకం*

పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు.  ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

*సింహం*

చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు.  అనారోగ్య సమస్యలు వలన వ్యాపారములు కొంత మందగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధు  మిత్రులతో అకారణ మాటపట్టింపులు కలుగుతాయి.

*కన్య*

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నపటికీ అంచనాలు అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

*తుల*

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి ఆకస్మిక ధనలాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

*వృశ్చికం*

ఇంటా బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఋణ ఒత్తిడి వలన  మానసిక సమస్యలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

*ధనస్సు*

వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దూరపు బంధువులు నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. 

*మకరం*

రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభ సూచనలున్నవి.  విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట బాధ్యతల నుండి కొంత ఉపశమనం పొందుతారు.

*కుంభం*

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యయప్రయాసలతో కానీ కొన్ని పనులు పూర్తికావు. బంధు మిత్రులతో మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు.

*మీనం*

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు.  నిరుద్యోగ ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ధన పరంగా ఆశించిన పురోగతి పొందుతారు.

🕉️

⚜ శ్రీ గుఫావాలా శివమందిర్

 🕉 మన గుడి : నెం 209






⚜ డిల్లీ   : ప్రీత్ విహార్


⚜ శ్రీ గుఫావాలా శివమందిర్


💠 తూర్పు ఢిల్లీలోని భారీ మరియు అందమైన ఆధ్యాత్మిక శివాలయంలోని మా వైష్ణో గుహ భక్తులకు చాలా ఇష్టం. 

ఈ కారణంగా గుఫా వాలా శివ మందిరం లేదా శివ మందిరం గుఫా వాలా వంటి పేర్లతో భక్తులలో ఈ ఆలయం పేరు చాలా ప్రసిద్ధి చెందింది .


⚜ చరిత్ర ⚜


💠 1987 లో ఇక్కడ చాలా చిన్న శివాలయం ఉండేది. ఆలయ అధిపతి వినోద్ శర్మ ఒకసారి వైష్ణో దేవిని దర్శించుకోవడానికి కత్రా జమ్మూకాశ్మీర్ లోని  చేరుకున్నారు. 

అక్కడికి వెళ్ళిన తర్వాత, కొన్ని కారణాల వల్ల వైష్ణో దేవి దర్శనానికి వెళ్ళలేని వారు చాలా మంది ఉన్నారని అతను గ్రహించాడు. 

అలాంటి వారి కోసం ఢిల్లీలో వైష్ణోదేవి దేవాలయం తరహాలో ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచన వచ్చింది. దీని తర్వాత గుహ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.


💠 ఈ ఆలయానికి ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.  

భక్తులకు సుఖశాంతులు, శాంతి, మంచి ఆరోగ్యం లభిస్తాయి.  


💠 ఆలయంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న భారీ వినాయకుడు & హనుమాన్ విగ్రహం ఉంది.  ఒక పెద్ద గుహ వైష్ణో దేవి ఆలయ అనుభూతిని ఇస్తుంది మరియు గుహ లోపల మా వైష్ణో దేవి మరియు హనుమంతుని విగ్రహం ఉంటుంది.


💠 గుహ నుండి నిష్క్రమణ వద్ద భైరవనాథ్  విగ్రహం ఉంది.  ఈ గుహను పెద్ద ఎత్తున అలంకరించారు మరియు గుహ పైభాగంలో శివుని విగ్రహం నిర్మించబడింది.  

ఇక్కడ మరొక చిన్న గుహ ఉంది మరియు గుహ యొక్క ప్రధాన ఆకర్షణ మా కాత్యాయని దేవి, మా జ్వాలాదేవి మరియు మా చింతపూర్ణి దేవి విగ్రహాలు.


💠 శివుని దర్శనం కోసం సోమవారం పెద్ద సంఖ్యలో శివభక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.  వైష్ణో గుహ యొక్క అద్భుతమైన దృశ్యాలను చూడటానికి సాయంత్రం ఉత్తమ సమయం.


💠 ఆలయంలో 56 వేల కిలోగ్రాముల బరువున్న శివలింగాన్ని స్థాపించారు, ఇందులో 12 రూపాలు (జ్యోతిర్లింగాలు) ఉన్నాయి. 

ఇది 24 అడుగుల వెడల్పు మరియు 16 అడుగుల ఎత్తు. 

ఇక్కడ సంతానం లేని దంపతుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. 


💠 ఇది వైష్ణో దేవి ఆలయ అనుభూతిని ఇస్తుంది. పై హాలులో మాత వైష్ణో దేవి విగ్రహంతో పాటు మహాకాళి, మహావైష్ణవి, సరస్వతి అనే మూడు విగ్రహాలు ఉన్నాయి. దీని తరువాత, జ్వాలా దేవి  యొక్క మహాజ్యోతి ఉంది, ఇది సంవత్సరంలో 365 రోజులు రోజుకు 24 గంటలు మండుతూనే ఉంటుంది.

 

💠 గుహ పైభాగంలో శివుని విగ్రహం నిర్మించబడింది. గుహ నుండి బయటకు వచ్చిన తరువాత, పైకి వెళుతున్నప్పుడు, ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటైన భారీ నందితో పాటు  వపంచేశ్వర్ శివ లింగంతో పాటు పన్నెండు శివలింగాలు ఉన్నాయి. 


💠 శివ మందిర్ గుఫావాలాలో అనేక పండుగలు జరుపుకుంటారు.  

నవరాత్రుల సమయంలో ఈ ఆలయం భక్తులకు ప్రధాన ఆకర్షణ.  

దుర్గాపూజ మరియు నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  ఆలయాన్ని పూలతో, దీపాలతో అలంకరిస్తారు.

ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు మానసిక ప్రశాంతతను, హృదయాన్ని ప్రసాదిస్తుంది.



💠 సమయం - 

ఉదయం 5.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు మరియు సాయంత్రం 5.00 నుండి రాత్రి 9.00 వరకు


గుహ సమయాలు - 

ఉదయం 7.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు మరియు రాత్రి 5.00 నుండి 9.00 వరకు


💠 ఆనంద్ విహార్ బస్టాండ్ మరియు ఆనంద్ విహార్ రైల్వే టెర్మినల్ ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 

నేతృత్వమనేది

 *1961*

*కం*

నేతృత్వంబొకమోహము

నేతగమారిన తదుపరి నెయ్యములరుగున్.

భాతృత్వానందములును

నేతృత్వపు మాయచేత నీల్గును సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నేతృత్వమనేది ఒక మోహము,నేతగా మారితే స్నేహాలు కూడా చెడిపోవును. సోదరసమ్మోదనులు కూడా నేతృత్వపు మాయచేత నశమగును.

*సందేశం*:--  నాయకత్వం అనే మాయాపదవి దక్కితే మిత్రహితబంధువులంతా శత్రువులుగా మారిపోతారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

వెలకట్టలేని బలము

 *1960*

*కం*

వెలగట్టగ తగని బలము

వెలతోకొనలేని దైన వినుత వరంబౌ

విలువొందిన కాలంబును

విలువెరుగక వ్యర్థ పరచి వెగడకు సుజనా 

*భావం*:-- ఓ సుజనా! వెలకట్టలేని బలము, వెలతో కొనలేని గొప్ప వరముగా విలువల నొందిన కాలమును వ్యర్ధము చేసి తరువాత బాధపడకు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శరన్నవరాత్రాంతర్గత దేవీస్తుతి*

 *శరన్నవరాత్రాంతర్గత దేవీస్తుతి*

           ది:15-10-2023


శా॥

ప్రాతర్వేళల బాలగా నతుల సంభావించి నిన్గొల్వ సం

ప్రీతిన్ బాలల నంగరాగముల నుల్లేఖించి యా రూపులన్ 

పూతభ్రాజిత చిత్తవృత్తులను నిన్ బూజించగా మించుచున్ 

రీతిన్ యుక్తిని బ్రోచు తల్లి! కొనుమా! ప్రేమన్ నమోవాకముల్  -3


శా॥

పాదాబ్జమ్ముల లాక్షనుంచి మయిలేపమ్ముల్ దగం బూసి యా 

మోదమ్మొప్పగ స్వర్ణభూషలొదుగన్ భూషించి కీర్తించుచున్ 

వాదమ్ముల్ వినిపించ వీణియలు దివ్యాహ్నమధ్యమ్మునన్ 

భూదేవుల్ నిను చండిగా గొలువగా బ్రోవంగదే మమ్ములన్  -4

శా॥

మూలాధారము నాదిగా దలచుచున్ మూర్ధన్యపర్యంతమున్ 

హేలాలీల విధానమంది గరిమన్ హేమంపు శ్రీచక్రమున్ 

వీలైనట్టి విధిన్ నవావరణముల్ పెంపొంది సాయంత్రమున్

చాలన్ భక్తిగ బూజసేయ గొను నో సాధ్వీ నినున్ మ్రొక్కెదన్ 

*~శ్రీశర్మద*

8333844664

వేదమంత్రములురమణీ

 -- పృథివీ శాంతా - సా గ్ని. నా శాంతాః -- 

వేదమంత్రములురమణీ యార్థ  ప్రతిపాదకములు 

వేదకావ్యశరీరములు వేదమంత్రములు బహువిధ కవితారచనలకు మూలరూపములు. వృత్తులకు రీతులకు శయ్యలకు అలంకారములకు ప్రథమోదాహరణ భూతములు. మంత్రములు ప్రభుసమ్మితములుగా శాసించాఫ్ గలవు. సుహృత్సంమితముగా ఉపదేశించగలవు. కాంత వలె పరోక్షముగ రమణీయ ముగ కర్తవ్యము నుపదేశింప గలవు. 

          "పృథివీ శాంతా సా గ్నినా శాంతా " అను శాంతి మంత్రము అగ్నితో పృథివీ శాంతరూపిణి యగుఁనని వర్ణించుచున్నది. అగ్ని దహించును గాని శాంతి నిచ్చునా అని సందేహము కలుగుట సహజము. ఇచ్చట అగ్ని పదముచే యజ్ఞపురుష రూపము సాక్షాత్కరించు అగ్ని ఉపదేశించుచున్నాడు " అగ్ని మీళే పురోహితం "" అను మంత్రముచే ఉపదేశింపబడు సర్వారాధ్యుడైన అగ్నియే యిచట గ్రహింపబడుచున్నాడు. యజ్ఞపురుషుడు సకలలోక కళ్యాణ కారకుడు. 

         "యజ్ఞా: కళ్యాణ హేతవః " మానవుడు ఎంత ప్రయత్నించినను పృథివిని అనగా నిఖిల ప్రపంచమును శాంతింప జేయలేడు. సర్వలోక కళ్యాణ కారకము నిఖిల ప్రాణి కోటికి క్షేమంకరము శాంతిప్రదము యఙన్సము మాత్రమే. యజ్ఞముమంత్ర మూర్తి. ఋగ్యజు స్సామాత్మక మంత్రమయము. శ్రీరూప సర్వసంపదతో యజ్ఞమునిండియుండును. యజ్ఞగృహము నుండి వెలువడిన సర్వసంపత్తి నిఖిల ప్రాణికోటికి హృదయ ప్రసాదజనకము. గ్రహ నక్షత్ర తారాదులతో వెలయు నిఖిల భూగోళమును సంస్కరించు దివ్యశక్తి అట్టి స్వర సంపత్తితోగూడి యజ్ఞగుండమునుండి వెలయు దివ్యాహుతులు , ధూమములు. ధూమములు లోకవిశుద్ది హేతువులు. అతివృష్టి అనావృష్టి పెను తుఫానులు మొదలగు లోకోపద్రవములను నివారించునట్టివి. ఈ విధముగా అగ్ని పృథివిని అనగా భూగోళమును శాంత మూర్తిని గావించుచున్నది. Paవిత్రీకరించుచున్నది. 

              లోకకళ్యాణ హేతువైన యింతటి పరమార్థమును వేదమాత " పృథివీ శాంతా సాగ్ని నా శాంతా " అనుచిన్న చిన్న పదములతో ఉపదేశించుచున్నది. ఇట్లు  లోకమున ఏ ఇతర వాజ్ఞ్మయముపదేశించును ? అసలు అగ్ని స్వరూపము - యజ్ఞ పురుష మాహాత్మ్యముతద్రహస్యము

ముందు తెలియవలెను. ఒక వేళ తెలిసినను ఆ మహత్తర గంభీరార్థమును లలిత ముగ్దమనోహరముగా మధుమయ ఫణుతులతో చెప్పగలిగి యుండవలెను. అట్లు చెప్పగలిగినవి సర్వజ్ఞములు సుమధురవచోగుంఫితములు స్వరసంస్కార సంపన్నములు విద్యా శస్త్రాస్త్ర రూపములు మననత్రాణాత్మకములు శ్రుతి సౌందర్య దాయకములు వేదరూపమున ఆవిర్భవించిన దివ్యశక్తులగు 

మంత్రములే వేదములే 

" ఏకో మంత్ర స్తథాధ్యాత్మ మధిదైవ మధిక్రతు , 

అసంకరేణ సర్వార్వ : భిన్న శక్తిరవ్యవస్థితః ( వాక్యపదీయం 2-256)

అని వాక్యపదీయకారుడగు శ్రీ భర్త్రుహరి పండితునిచే కీర్తింపబడిన మంత్రములు మహార్థసుందరములు. సదారాద్యములు. 

( దేవీదాస్ )

సుభాషితమ్

 

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


             *_శ్లోకమ్-_*


 *_నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం_*

*_జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే_*

*_జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తంజగత్_*

*_తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే....._*


*_దక్షిణాముర్తి స్తోత్రమ్-4 -_*


*ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో, ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగునో, ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు*.....


🧘‍♂️🙏🪷 ✍️🙏

శ్రీ గుఫావాలా శివమందిర్

 🕉 మన గుడి : నెం 209





⚜ డిల్లీ   : ప్రీత్ విహార్


⚜ శ్రీ గుఫావాలా శివమందిర్


💠 తూర్పు ఢిల్లీలోని భారీ మరియు అందమైన ఆధ్యాత్మిక శివాలయంలోని మా వైష్ణో గుహ భక్తులకు చాలా ఇష్టం. 

ఈ కారణంగా గుఫా వాలా శివ మందిరం లేదా శివ మందిరం గుఫా వాలా వంటి పేర్లతో భక్తులలో ఈ ఆలయం పేరు చాలా ప్రసిద్ధి చెందింది .


⚜ చరిత్ర ⚜


💠 1987 లో ఇక్కడ చాలా చిన్న శివాలయం ఉండేది. ఆలయ అధిపతి వినోద్ శర్మ ఒకసారి వైష్ణో దేవిని దర్శించుకోవడానికి కత్రా జమ్మూకాశ్మీర్ లోని  చేరుకున్నారు. 

అక్కడికి వెళ్ళిన తర్వాత, కొన్ని కారణాల వల్ల వైష్ణో దేవి దర్శనానికి వెళ్ళలేని వారు చాలా మంది ఉన్నారని అతను గ్రహించాడు. 

అలాంటి వారి కోసం ఢిల్లీలో వైష్ణోదేవి దేవాలయం తరహాలో ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచన వచ్చింది. దీని తర్వాత గుహ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.


💠 ఈ ఆలయానికి ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.  

భక్తులకు సుఖశాంతులు, శాంతి, మంచి ఆరోగ్యం లభిస్తాయి.  


💠 ఆలయంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న భారీ వినాయకుడు & హనుమాన్ విగ్రహం ఉంది.  ఒక పెద్ద గుహ వైష్ణో దేవి ఆలయ అనుభూతిని ఇస్తుంది మరియు గుహ లోపల మా వైష్ణో దేవి మరియు హనుమంతుని విగ్రహం ఉంటుంది.


💠 గుహ నుండి నిష్క్రమణ వద్ద భైరవనాథ్  విగ్రహం ఉంది.  ఈ గుహను పెద్ద ఎత్తున అలంకరించారు మరియు గుహ పైభాగంలో శివుని విగ్రహం నిర్మించబడింది.  

ఇక్కడ మరొక చిన్న గుహ ఉంది మరియు గుహ యొక్క ప్రధాన ఆకర్షణ మా కాత్యాయని దేవి, మా జ్వాలాదేవి మరియు మా చింతపూర్ణి దేవి విగ్రహాలు.


💠 శివుని దర్శనం కోసం సోమవారం పెద్ద సంఖ్యలో శివభక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.  వైష్ణో గుహ యొక్క అద్భుతమైన దృశ్యాలను చూడటానికి సాయంత్రం ఉత్తమ సమయం.


💠 ఆలయంలో 56 వేల కిలోగ్రాముల బరువున్న శివలింగాన్ని స్థాపించారు, ఇందులో 12 రూపాలు (జ్యోతిర్లింగాలు) ఉన్నాయి. 

ఇది 24 అడుగుల వెడల్పు మరియు 16 అడుగుల ఎత్తు. 

ఇక్కడ సంతానం లేని దంపతుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. 


💠 ఇది వైష్ణో దేవి ఆలయ అనుభూతిని ఇస్తుంది. పై హాలులో మాత వైష్ణో దేవి విగ్రహంతో పాటు మహాకాళి, మహావైష్ణవి, సరస్వతి అనే మూడు విగ్రహాలు ఉన్నాయి. దీని తరువాత, జ్వాలా దేవి  యొక్క మహాజ్యోతి ఉంది, ఇది సంవత్సరంలో 365 రోజులు రోజుకు 24 గంటలు మండుతూనే ఉంటుంది.

 

💠 గుహ పైభాగంలో శివుని విగ్రహం నిర్మించబడింది. గుహ నుండి బయటకు వచ్చిన తరువాత, పైకి వెళుతున్నప్పుడు, ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటైన భారీ నందితో పాటు  వపంచేశ్వర్ శివ లింగంతో పాటు పన్నెండు శివలింగాలు ఉన్నాయి. 


💠 శివ మందిర్ గుఫావాలాలో అనేక పండుగలు జరుపుకుంటారు.  

నవరాత్రుల సమయంలో ఈ ఆలయం భక్తులకు ప్రధాన ఆకర్షణ.  

దుర్గాపూజ మరియు నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  ఆలయాన్ని పూలతో, దీపాలతో అలంకరిస్తారు.

ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు మానసిక ప్రశాంతతను, హృదయాన్ని ప్రసాదిస్తుంది.



💠 సమయం - 

ఉదయం 5.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు మరియు సాయంత్రం 5.00 నుండి రాత్రి 9.00 వరకు


గుహ సమయాలు - 

ఉదయం 7.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు మరియు రాత్రి 5.00 నుండి 9.00 వరకు


💠 ఆనంద్ విహార్ బస్టాండ్ మరియు ఆనంద్ విహార్ రైల్వే టెర్మినల్ ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 

బతుకమ్మ సంబరాలు*






 *తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.... వేములవాడ శ్రీ రాజన్న దేవాలయంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలు*

*అత్యధికంగా పాల్గొన్న మహిళలు*

👇👇👇👇

https://youtu.be/jParRjPwvPw?si=kR72fk3m3bIUcu7Y

ఆత్మ విద్య

 ఆత్మ విద్య -మీ జన్మ రహస్యం :-మనం అద్దె ఇళ్ళలో ఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని, ఇల్లు ఖాళీ చేయమని ఆదేశిస్తే, వెంటనే సామను అంతా సర్దుకుని వేరు ఇల్లు వెతుక్కుంటాము. 

ఎక్కడకు వెళ్ళినా పోగు చేసుకున్న సామాను అంతా తీసుకువెళతాము. 


అలాగే ఈ శరీరం కూడా ఓ అద్దె ఇల్లు. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, అన్నేళ్ళు ఉంటాము.  ఋణం తీరిన తర్వాత, ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు గెంటివేయబడుతుంది. దానికి ఆ  తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు.


అప్పడు అది, తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని, వెళుతుంది

అవే సంచితకర్మలు.


ప్రారబ్ధ కర్మలు - అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు ప్రయాణిస్తుంటాడు . ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఈ కర్మలు అయితే పక్వానికి వస్తాయో , లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి, జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది. అంటే జన్మల పరంపరలో జీవుడు చేసిన కర్మలలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారబ్ధ కర్మ.


 ఈ దేహం ప్రారబ్ధ కర్మ ఆధారంగా ఏర్పడింది.  ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. అంతవరకు ఆ ఫలాలను అనుభవించవలసిందే. 


ప్రారబ్ధం తీరిన క్షణమే, మరుక్షణం కూడా కాదు, ఆ క్షణమే ఆత్మ, దేహాన్ని విడిచిపెట్టేసి, మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది.


ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుంది. ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, ఆప్తులు, బంధవులు మొదలైన వారంతా ఒక జన్మలో మన కర్మల ఆధారంగా మనమే ఎంచుకున్నాము. 


ఆయా వ్యక్తులతో మనకున్న ఋణం కారణంగా, వారి నుంచి సేవ పొందడమో, లేదా సేవ అందించడమో చేస్తాము. ఆ ఋణమే బంధము.  


ఈ శరీరం ఏర్పడడానికి కారణమైన ప్రారబ్ధకర్మలన్నీ ఈ జీవితం ముగిసేనాటికి ఖర్చయుపోగా , జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలు కలుస్తాయి.


  ఈ  మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో, అంటే అనుభవించడాన ికి సిద్ధమవుతాయో, అవి ప్రారబ్ధాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది. 


ఈ చక్రం ఇలానే  కొనసాగుతుంది .


 అందుకే ఆదిశంకరులు భజగోవింద స్తోత్రంలో


పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం


అని అన్నారు.


మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లుగర్భంలో పిండంగా ఎదగడం.... అంటూ అందులో స్పష్టం చేశారు  ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్ధం అంటాము ,  అంటే ఇదే. 


మనం ఒకనాడు తెలిసో, తెలియకో చేసిన పాపపుణ్య కర్మల ఫలం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాము. 


 విత్తనం చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు. అలానే చేసిన పని కూడా. కాబట్టి సాధ్యమైనంతవరకు సత్కర్మలే చేయాలి 


సేకరణ మానస సరోవరం

పరమేశ్వరానుగ్రహమే



జ్ఙానోపార్జనకు  మూలం పరమేశ్వరానుగ్రహమే!


            "  ఏవేదంబు  పఠించె  లూత ; భుజగం బేశాస్త్రముల్   నేర్చె ;తా


                నేవిద్యా  భ్యసనం బొనర్చె  కరి ;  చంచే  మంత్ర  మూహించె  ; బో


                 ధావిర్భావ  నిధానముల్  చదువులయ్యా?  కావు ;  నీపాద    సం


                 సేవాభాగ్యమెగాక,  జంతు తతికిన్    శ్రీ  కాళహస్తీశ్వరా! 


                      శ్రీ కాళ హస్తీశ్వర శతకము:  మహా కవి  ధూర్జటి .


                  

               అధ్యాత్మిక  జ్ఙాన సంపత్తికి  చదువులతో  పనే లేదు. దానికి పరమేశ్వరారాధనమే సాధనమని  మహాకవి ధూర్దటి యభిప్రాయము. పరమేశ్వరుని పాదములను భక్తితో  సేవించిన వారికి  జ్ఙానము  తదనుగ్రహముచేతనే  కలుగునని ధూర్జటి

యభిప్రాయము. 


                 పరమ శైవుడైన ధూర్జటి లోకజ్ఙుడు. తన లౌకిక జ్ఙాన మంతయు రంగరించి  లోకోపకృతికై యతడు  రచించిన శతకము

శతక వాఙ్మయమునకు శిరోభూషణమై  యలరారు చున్నది. తగుమోతాదు మందుతో  వైద్యుడు రోగికి రోగముడిపినట్లు. భవరోగమును నివారించుటకు తగిన యాధ్యాత్మిక  ఔషధ గుళికలై శ్రీ కాళహస్తీశ్వర శతకములోని పద్యములు  భక్తులకు సాయపడుచున్నవి. ఆదిశంకరుల భజగోవింద శ్లోకములవలె  లౌకిక విషయ మిళితములై  యీపద్యములు జిజ్ఙాసువులకు

కర్తవ్య బోధను చేయుచు ఆధ్యాత్మికమార్గ విహరణమునకు  తోడ్పడుచున్నవి. 


                     ప్రస్తుత పద్యమున  భక్తి యొక్కటే ముక్తికి సాధనము. అదియే సమస్తమైన  జ్ఙానమునకు మూలము. అనేవిషయాన్ని సోదాహరణంగా ప్రతిపాదిస్తున్నాడు.


                 పరమేశ్వరానుగ్రహమువలన , అమేయ భక్తివలన  ,సాలెపురుగు ,పాము , ఏనుగు , తిన్నడను బోయ మోక్షము నందినారుగదా! దానినే దృష్టాంతముగా చూపుచున్నాడు.


                    సాలెపురుగు  ఒకచిన్నక్రిమి. అది యేవేదం చదివిందీ? వేదాలు జ్ఙానసంపత్తిని యిచ్చేవి. అయితే అవేవీ చదివే అవకాశమే 

ఆక్రిమికిలేదు. అయినా దానిమోక్షమార్గానికి  అది అడ్డంకాలేదు. నిరాటంకంగా మోక్షమందుకొన్నది.


                            పాము: ఇదీ సరీసృపము. దీనికిగూడా  చదివే అవకాశమే పూజ్యం. అందుకే కవియంటున్నాడు,పాము  యేశాస్త్రాలు

చదివిందీ? పాపం  దానికి అవేవీ తెలియవు. అయినా పరమేశ్వర భక్తితో మోక్షం సుగమం చేసికొంది.


                           ఏనుగు  చేసిన విద్యాభ్యాస మేమిటి? కేవలము అహంకారమే మూర్తీభవించిన రీతిగా అడవిని దిరుగు ఏనుగునకు

విద్యనేర్పువారెవ్వరు? అదిసాధ్యము గానిపనిగదా! అయిననూ  విద్యావిహీనత  దాని మోక్షమార్గమునకు ఆటంకము కాలేదు. పరమేశ్వరుని పాదభక్తియే దానికి పరమపద సోపానమైనది.


                  ఇక బోయ!  వాడు పుట్టుకతోనే మృగ సమానుడు. వానికి  మంత్ర తంత్రములేవియు దెలియవు. తెలిసినదంతయు ఒక్కటే, 

వేటాడుట, ఎఱచిఁ దెచ్చి నివేదించుట.పుక్కిట బట్టి తెచ్చిన జలముల నభిషేకించుట. శంకరుని కంటి కి వైద్యముగా  కన్నుకు బదులు తన కన్నర్పించుట. ఈసమర్పణాగుణమే పరమేశ్వరానుగ్రహమునకు కారణమై  మోక్షమార్గమునకు నడిపినది.  కావున దైవారాధనకు చదువులతో  పనిలేదు భక్తి కలిగిన చాలును. అదిలేనిచో  నెంత చదివినను వ్యర్ధమే!


                                          స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💄🌷

Break fast ideas for week days


 

Intellectual


 Life doesn't give you everything in order.
All it throws at you is a mess.

Its your positivity, creativity, and fun that put things in order, and bring beauty to it.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం  - ద్వితీయ - స్వాతి - ఇందు వాసరే* (16.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/glpxGcV2FKs?si=AJakF6S10jNHWk9H



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

*శ్రీ చక్రం

 *ॐ*              *శ్రీ చక్రం*


*నవావరణలు - మొదటి ఆవరణ*

*9 PERIPHERIES - 1st PERIPHERY*

-------------------------------------------------


         *త్రైలోక్యమోహన చక్రము* 

  *TRILOKYA MOHANA CHAKRAM* 


    మూడు రేఖల చతురస్రములో రేఖలపై

1. సిద్ధి దేవతలు (శ్వేత వర్ణ రేఖపై), 

2. బ్రాహ్మీ మొదలైన అష్ట శక్తులు (రక్తవర్ణ రేఖపై), 

3. సర్వసంక్షోభిణ్యాది దశముద్రాధి దేవతలు (హరిద్రవర్ణ రేఖపై) ఉంటారు. 


    There are three lines in the square and a total of 28 Yogini Devathas occupying various positions in the square. 

    These deties are the parts of Devi carrying various functions in the living being ( *jiva*).


*I.* *The First line in the square - White in colour.*


The Yoginis are 


1. *ANIMA*

2. *LAGHIMA* 

3. *GARIMA* 

4. *MAHIMA* 

5. *EESITWAM*

6. *VASITWAM*

7. *PRAAKAAMYAM*

8. *BHUKTI*

9. *ICHA*

10. *PRAAPTHI*

11. *SARVAKAAMA SIDDHI*.


    The Sanskrit names are indicative of the functions of Yogini Devathaas.

    Some of the Characteristic functions represented by these Yoginis are

1. *NIYATHI*(Praarabdha)

2. *SRINGAARA*(Beauty)

3. *FEAR*

4. *FEROCIOUSNESS*

5. *BHEEBHATSAM*

6. *HAASYAM*(Witty)

7. *COURAGE*

8. *KINDNESS*

9. *WONDER*

10. *PEACE*


*II.* *The Second line of the square - Blood red colour*.

The Yoginis are


1. *BRAAHMI*,

2. *MAAHESWARI*,

3. *KAUMAARI*,

4. *VAISHNAVI*,

5. *VAARAAHI*,

6. *MAAHENDRI*,

7. *CHAAMUNDE*,

8. *MAHAALAKSHMI*.


These Yoginis control

1. *KAAMA*

2. *KRODHA*

3. *LOBHA*

4. *MOHA*

5. *MADA*

6. *MAATHSARYA*

7. *PUNYA* and 

8. *PAAPA (Sin)*  in an individual.


*III.* *The Third line of the square - Yellow in colour.*


The Yoginis are 

1. *SARVA SAMKHSHOBHINI*

2. *SARVA VIDRAAVINI*

3. *SARVA AAKARSHINI*

4. *SARVA VASANKARI*

5. *SARVONMAADINI*

6. *SARVA MAHAANKUSE*

7. *SARVAKHECHARI*

8. *SARVA BIJE*

9. *SARVA YONE*

10. *SARVA THRIKHANDE*


    These are called Mudraas and can be indicated by signs using the hands.

By regular practice of these Mudraas we improve our health and get peace of mind. 

    *Some of these have influence on the heart,muscles,brain and other vital organs*.


*The parts of Devi(organs) i.e., Yogini Devathaas presant in the human body* are

1. *MUULAADHAARA CHAKRAM*

2. *SWAADHISTAANA*

3. *MANIPUURA*

4. *ANAAHATHA*

5. *VISUDDHI*

6. *AAGJNA*

7. *SAHASRADALA PADMAM (Center and top of the head)*

8. *ADHAH SAHASRADALA PADMAM (situated below Muulaadhaara)*

9. *LAMBIKAAGRAM (throat chakram)*

10. *COMBINATION OF ALL THESE*.


Thus, Devi's organs are also part of the human system.This is to indicate that there is *no difference between an INDIVIDUAL and DEVI*.

*However, we are limited and Paraa Sakthi is infinite*.

                 =x=x=x= 


https://youtu.be/7AK410uhgf8

 


-- *RAAMAAYANAM SARMA*

          *BHADRACHALAM*

Gaatram


 

శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం,60వ శ్లోకం*


 *యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ।* 

 *ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ।। 60* 


 *ప్రతిపదార్థం* 


యతతః — స్వీయ-నియంత్రణ అభ్యాసం చేసేటప్పుడు; హి — దానికి; ఆపి — కూడా; కౌంతేయ — అర్జునా , కుంతీ పుత్రుడా; పురుషస్య — పురుషుని యొక్క; విపశ్చితః — బుద్ధి విచక్షణ కలవారు; ఇంద్రియాణి — ఇంద్రియములు; ప్రమాథీని — అల్లకల్లోలమైన; హరంతి — లాక్కోనిపోవును; ప్రసభం — బలవంతంగా; మనః — మనస్సుని.


 *తాత్పర్యము* 


 ఓ అర్చనా! ఇంద్రియములు ప్రమతనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగిపోవునంతవరకును అవి అతని మనసును ఇంద్రియార్ధముల వైపు బలవంతముగా లాగికొను పోవుచునే ఉండును.


 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

మహానుభావుడు

 *మార్గం చూపిన మహానుభావుడు..*


"గత వారం రోజులుగా ఇక్కడే ఉన్నానండీ..దత్తదీక్ష తీసుకునే వాళ్లకు మీరు మాలవేయడం..దీక్షాధారులు అందరూ మూడుపూటలా క్రమశిక్షణతో స్వామివారి హారతులు తీసుకోవడం..మీరు చేస్తున్న అన్నదానం అన్నీ దగ్గరుండి చూస్తున్నాను..చక్కగా..ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం..నాకూ మరో రెండు రోజులు ఉండాలని ఉన్నది..కానీ ఇంటి దగ్గర పరిస్థితి అనుకూలంగా లేదు..నేను రేపు మా ఊరు వెళ్లాలని అనుకుంటున్నాను..ఈ స్వామివారి మందిరానికి రావడం ఇది రెండోసారి..మూడు నాలుగు నెల క్రితం ఇక్కడికి వచ్చి వెళ్ళాను..ఈ స్వామివారి సమాధి ని దర్శించుకున్న తరువాత నాకు వ్యక్తిగతంగా అనుభవాలు కలిగాయి..నేను మళ్లీ వచ్చినప్పుడు మీతో వాటిని పంచుకుంటాను..ఏది ఏమైనా ఈ వారం రోజులూ..మీరూ..మీ సిబ్బందీ నాకు చాలా సహకారం ఇచ్చారు ..రేప్పొద్దున బైలుదేరుతాను.." అన్నాడా యువకుడు..


అప్పటికి లాక్ డౌన్ ప్రకటించి మూడు రోజులు అయింది..ప్రజా రవాణా పూర్తిగా స్తంభించి పోయింది..ఇతనేమో తన ఊరికి వెళ్లాలని అనుకుంటున్నాడు..పోనీ..అదేమన్నా మొగిలిచెర్ల కు దగ్గరలో ఉన్న ఊరు కాదు..అనంతపురం వెళ్ళాలి..అనుకున్న విధంగా వెంట వెంటనే బస్సులు దొరికినా..మొగిలిచెర్ల నుంచి కనీసం 10 గంటల పైగా ప్రయాణం ఉన్నది..ఆమాటే అతనితో చెప్పాను.."మీరు ఇప్పుడు ప్రయాణం చేయడం మంచిది కాదు..ఎక్కడి కక్కడ వాహనాలు ఆపేస్తున్నారు..మీరు ముందుగా పామూరు చేరాలి..ఉదయం 11 గంటల లోపే ప్రయాణం చేయాలి..బాగా ఇబ్బంది పడతారు.." అన్నాను..రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ.."మొగిలిచెర్ల దత్తాత్రేయుడు దారి చూపించాలి..రేపు ఉదయం ఇక్కడి నుంచి బైలుదేరుతాను..ఇక స్వామివారే నన్ను మా ఊరు చేర్చాలి.." అన్నాడు..నేనేమీ మాట్లాడలేకపోయాను.."మీ ఇష్టం.." అని చెప్పి.."సాధ్యమైనంతవరకూ జాగ్రత్తగా వుండండి..ప్రభుత్వం వారు మన మంచికోసమే ఈ లాక్ డౌన్ పెట్టారు..అందువల్ల..ప్రభుత్వం వారు నిర్దేశించిన సమయాల్లోనే మీరు ప్రయాణం చేయండి..మీకూ మంచిది.." అని చెప్పాను.."అలాగే స్వామీ.." అన్నాడు..


ఆ ప్రక్కరోజు ఉదయం 5 గంటల వేళ అతను అనంతపురం వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు..అదే సమయం లో స్వామివారి మందిరం వద్ద దత్తదీక్ష తీసుకున్న ఒక స్వామి..తాను పామూరు వెళుతున్నానని మా అర్చకస్వామితో చెప్పాడు..పామూరు వరకూ ఈ యువకుడిని తీసుకెళ్లమని అర్చకస్వామి అతనిని కోరారు..అలా ఆ యువకుడు మా కందరికీ వీడ్కోలు చెప్పి ..అనంతపురం బయలుదేరాడు.."అయ్యా..ఇతను అనంతపురం రేపటికి చేరతాడేమో..అదికూడా అన్నీ అనుకూలిస్తే.." అని మా సిబ్బంది అన్నారు..ఆ తరువాత మా పనుల్లో మేము ఉండిపోయాము..


ఆరోజు మధ్యాహ్నం పన్నెండున్నరకు స్వామివారికి నైవేద్యం పెట్టి..హారతి ఇచ్చారు అర్చకస్వామి..మందిరం వద్ద ఉన్న దీక్షాధారులు హారతి కళ్లకద్దుకొని..అన్నదాన సత్రం వైపు వెళ్లారు..ఇంతలో నా ఫోన్ మోగింది.."అయ్యగారూ..నేనండీ..ఉదయం అనంతపురం వెళ్లాలని బైలుదేరానే..అతనిని.." అన్నాడు.."ఏ ఊరు వరకూ చేరారు?.." అన్నాను.."అనంతపురం లోని మా ఇంటి నుండి మాట్లాడుతున్నాను.." అన్నాడు..ఒక్కసారిగా అంతులేని ఆశ్చర్యం వేసింది.."ఎలా సాధ్యమైంది?.." అన్నాను.."అంతా ఆ స్వామి దయ అయ్యగారూ..ఉదయం మొగిలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరం వద్ద నుంచి పామూరు వరకూ దీక్ష లో ఉన్న స్వామి నన్ను వదిలిపెట్టారు కదా..ఒక్క నిమిషం లోపే మరో అతను నా దగ్గరకు వచ్చి తాను బద్వేలు వెళుతున్నానని..వచ్చేపనైతే తనతో తోడుగా రమ్మని అడిగాడు..బద్వేలు లో వదిలాడు..అక్కడనుంచి పాల కేంద్రం వాళ్ళ బండి ఎర్రగుంట్ల కు వెళుతున్నదట..ఎవరన్నా వస్తారా అని అడుగుతున్నాడు..వెంటనే అది ఎక్కాను..ఎర్రగుంట్ల చేరాను..అక్కడి నుండి మరొకరు నన్ను అనంతపురం చేర్చారు..ఏమిటో అయ్యగారూ..ప్రభుత్వం వారు సూచించిన సమయం 11 గంటల లోపే నేను మా ఇంట్లో వున్నాను..ఏ కష్టం కలుగలేదు..అసలు నాకే నమ్మబుద్ది కావడం లేదు..అంతా స్వామివారి దయ..ఆయనే నాకు మార్గం చూపించారు..ప్రతి ఊరిలోనూ నన్ను ఎక్కించుకొని ఒక్కొక్క చోట వదిలిపెట్టింది కూడా సాక్షాత్తూ మన స్వామివారే..ఆ స్వామికి ఎన్ని దండాలు పెట్టినా సరిపోదు.." అన్నాడు..


అతను స్వామివారిపై పరిపూర్ణ విశ్వాసం ఉంచాడు..అదే అతనికి శ్రీరామ రక్ష అయింది..మాకు మరొక అనుభవం తెలుసుకునే అవకాశం కలిగింది..


మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి వద్ద  నిరంతరము మేము ఏదో ఒక రూపం లో అనుభవాలు పొందుతూనే ఉంటాము..ఈరోజు నుంచి స్వామివారి వద్ద భక్తులు పొందిన అనుభవాలు..స్వామివారి లీలలు మరికొన్ని రోజుల పాటు చదువుకుందాము..ఇలా వ్రాసి పోస్ట్ చేయడానికి కూడా స్వామివారి కరుణా కటాక్షణాలే కారణం..అవే లేకపోతే..ఒక్క అక్షరం కూడా వ్రాయలేను..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////     💐 WISDOM PEARLS 💐.                                     Q--- What is the cause of sorrow?                         A--- Dissatisfaction.         Q--- What harms most?                                  A--- Pride.                          Q--- What is worse than death?                       A--- Ignorance.                  Q--- Who can conquer every thing?                        A--- The truthful and patient.                               Q--- Who is really blind?                                   A--- The unbeliever.           Q--- What is the great enemy?                                A--- Desire.                          Q--- Which is the greatest sin?                     A --- Violence.                    Q --- Who will prosper in life ?                                The one with humility.      Q --- Who will lose everything?                       A --- The arrogant.            Q --- What is GOD?             A --- Your own good deeds.                                 -------0 Wise Words 0------.                                    The best thing to give.       ---- to your enemy is , forgiveness.                     ---- to an opponent, tolerance.                              ---- to a friend, your ear.                                      ---- to your child, good example.                            ---- to your father reverence.                          ---- to your mother, conduct that will make her proud of you.                                    ----to yourself, respect.      ---- to all men, charity.     ---- Benjamin Franklin.         Dt 16--10--2023, Monday, Good morning.

పంచాంగం 16.10.2023 Monday,

 ఈ రోజు పంచాంగం 16.10.2023  Monday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష: ద్వితీయా తిధి ఇందు వాసర: స్వాతి  నక్షత్రం నిష్కంభ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


విదియ రాత్రి 01:11 వరకు.

స్వాతి రాత్రి 07:31 వరకు .

సూర్యోదయం : 06:13

సూర్యాస్తమయం : 05:50

వర్జ్యం : రాత్రి 01:20 నుండి 03:00 వరకు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:25 నుండి 01:11 వరకు తిరిగి మధ్యాహ్నం 02:44 నుండి 03:31 వరకు.


రాహుకాలం : ఉదయం  07:30 నుండి 09:00 వరకు 


యమగండం : పగలు 10:30 నుండి 12:00 వరకు.  



శుభోదయ:, నమస్కార:

నవగ్రహా పురాణం🪐* . *55వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *55వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*రాహుగ్రహ జననం*


కశ్యప పత్నులు - అదితీ , దితి , దనూ , వినత , కద్రువ , సింహిక , కాల మొదలైన వాళ్ళు ఆశ్రమంలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు.


*"మనందరం తల్లులమయ్యాం కానీ , సింహిక మాత్రం ఇంకా మాతృత్వానికి నోచుకోలేదు !"* అంది దను. 


*"ఎలా కలుగుతారు దనూ , దానికి పిల్లలు ? మన సింహిక మరీ నెమ్మది ! సంతానం. కరుణించమని మన అదితిలాగా దేవుణ్ణి అడగదు ! మనలాగా పతి దేవుణ్ణి అడగదు !”* దితి నవ్వుతూ అంది.


దితి మాటలకు అందరూ నవ్వారు.


*"సరే ! ఆ మాత్రం నేనూ అడగగలను. ఎవర్ని అడగాలో చెప్పండి. అడిగి పిల్లల్ని కని , నా శక్తి చూపిస్తాను !"* సింహిక ఆవేశంగా అంది. *"చెప్పండి ! ఎవర్ని అడగాలి ? దేవుణ్ణా ? లేక పతి దేవుణ్ణా ?”*


*"ఆ దేవుణ్ణి ప్రార్థించినా , 'పతి దేవుణ్ణి ప్రార్థించు సాధ్వీ' అంటాడు. కాబట్టి కనిపించే దేవుడూ , కరుణించే దేవుడూ పతి దేవుడు ఉన్నారుగా ! ఆయన్నే అడుగు !”* కాల నవ్వుతూ అంది.


అందరూ నవ్వారు. చిరునవ్వు నవ్వుతూ అదితి సింహికతో ఇలా అంది. *“మన పతిదేవుడు మహా తపశ్శక్తి సంపన్నులు. భగవంతుడిని ప్రార్థించే అవసరం ఉంటే ఆయనే చెప్తారు. ఆయననే అర్థించు , సింహికా ! నీకు మాతృత్వం సిద్ధిస్తుంది !".*


కశ్యప ప్రజాపతి నదీతీరంలో చెట్టు క్రింద ధ్యాన నిష్ఠలో ఉన్నాడు. సింహిక వచ్చి , ఆయన ముందు కూర్చుంది. కశ్యప ప్రజాపతి నిమీలిత నేత్రాలతో సమాధిలో ఉన్నాడు.


సింహిక కొన్నిక్షణాల పాటు ఆయన ధ్యానం ముగించడం కోసం నిరీక్షిస్తూ కూర్చుంది.


*"స్వామీ !”* అంది , ఇంకా వేచి చూసే ఓపిక నశించిన సింహిక.


కశ్యప మహర్షి కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. సింహికను ప్రశ్నార్థకంగా చూశాయి.


*"సింహికా ! ఏమిటి ఇలా వచ్చావు ?"* కశ్యపుడు అడిగాడు.


*"మిమ్మల్ని... మిమ్మల్ని...వరం కోరటానికి వచ్చాను...”* అంది సింహిక కొద్దిగా తడబడుతూ.


*"వరమా ?”* కశ్యపుడు చిరునవ్వు నవ్వాడు. 


*"ఇవ్వాలి , తప్పకుండా ! ఇస్తారా ?" .*


*"ఇస్తాను , సింహికా అడుగు !"* కశ్యపుడు నవ్వాడు.


*"నాకు... నాకు... పుత్రుడు కావాలి..."* 


*"కోరదగిన కోరికే !"* కశ్యపుడు నవ్వాడు.


*"నా పుత్రుడు మహాశక్తిమంతుడై ఉండాలి ! మహా బలశాలి అయి ఉండాలి ! చూడగానే అందరూ భయపడేలా భీకరంగా ఉండాలి !"* సింహిక ఉత్సాహంగా అంది. 


*"భీకరంగా ఉండాలా ? ఎందుకు సింహికా ? మళ్ళీ ఆలోచించుకొని , అడుగు !"*


కశ్యపుడు సూచించాడు. *"మళ్ళీ ఆలోచించను ! మళ్ళీ అడగను ! నాకు భయం గొలిపే భీకరాకారుడైన పుత్రుణ్ణి ఇవ్వండి !"* సింహిక మొండిగా అంది.


*"సరే... ఇలా దగ్గరగా రా !"* అన్నాడు కశ్యపుడు. సింహిక అతని దగ్గరగా జరిగింది. 


కశ్యపుడు తన హస్తాన్ని ఆమె శిరస్సు మీద ఉంచాడు. *"వరమిస్తున్నాను ! నువ్వు కోరిన పుత్రుడు త్వరలో నీ ఒడిలో ఆడుకుంటాడు !"*


సింహిక గర్భవతి అయింది. ఆ శుభవార్తని ఆనందంగా అక్కచెల్లెళ్లందరికీ చెప్పింది.


*"సింహిక తల్లికాబోతోంది , స్వామీ !”* అంది అదితి కశ్యప ప్రజాపతితో. *“సంతానం కోసం తహతహలాడిపోయింది. పాపం ! చక్కటి కొడుకు కలగాలని దీవించారు కదా !"*


కశ్యపుడు నవ్వాడు. *"నీ చెల్లెలు చూడచక్కని కొడుకు కావాలనలేదు. చూడగానే భయం కలిగించే వికారరూపుడు కావాలంది. అడగరాని వరాన్ని అడగరాని సమయంలో అడిగింది , సింహిక , మండే అగ్నిలాంటి ముఖంతో , భయభ్రాంతుల్ని చేసే బాలుడు ఆమెకు జన్మిస్తాడు !"*


*"అయ్యో... అలాగా...”* అదితి నిరుత్సాహంతో అంది.


*"సింహిక కోరికకు మూలకారణం దైవేచ్ఛ అని నాకు అనిపిస్తోంది ! విచారించాల్సిన అవసరం లేదు !"* అన్నాడు కశ్యపుడు తేలిగ్గా. 


సింహికకు నవమాసాలు నిండాయి. సకాలంలో ఆమె ఎర్రటి దేహకాంతితో ధగధగలాడే బాలుణ్ణి ప్రసవించింది.


సింహికా తనయుడి బారసాలకు దక్ష దంపతులతో బాటు , ఇంద్రాదులూ , నారదుడూ , బ్రహ్మ దేవుడూ విచ్చేశారు.


బాలుడి ఆవిర్భావ కారణాన్ని బ్రహ్మ కశ్యపుడికి వివరించాడు. నవగ్రహాలలో 'ఒకడుగా నెలకొనడానికీ , పూజలు అందుకుని , ప్రాణుల మీద తన ప్రభావం చూపడానికీ జన్మించాడనీ , సుశిక్షితుడిగా రూపొందించమనీ చెప్పాడు. *"భవిష్యత్తులో బాలకుడు పరిగ్రహిస్తాడు ; పరిత్యజిస్తాడు. త్యజించడం అతని లక్షణంగా ప్రాచుర్యం పొందుతాడు. ఆ కారణంగా బాలుడికి 'రాహువు' అని నామకరణం చేయి !"* అన్నాడు బ్రహ్మ. 


బ్రహ్మదేవుడి ఆనతిని పాటిస్తూ కశ్యప ప్రజాపతి సింహిక కుమారుడికి 'రాహువు’ అని పేరు పెట్టాడు.


కశ్యపాశ్రమంలో , తల్లి సింహిక పోషణలో , మిగిలిన పండ్రెండుగురు తల్లుల పాలనలో రాహువు వృద్ధి చెందుతున్నాడు. కశ్యపుడు సకాలంలో రాహువుకు విద్యాబోధన ప్రారంభించాడు.


*"ఇప్పటి దాకా మీరు ఎనిమిది గ్రహాల జన్మ గాథలు విన్నారు. ఇక , తొమ్మిదవ గ్రహమైన కేతువు ఆవిర్భావం గురించి తెలుసుకుందాం...”* నిర్వికల్పానంద ఉపోద్ఘాతం. రూపంలో అన్నాడు.


*"గురువుగారూ , రాహువు గురించీ , కేతువు గురించీ ఎవరు ఏది చెప్పినా - ఆ ఇద్దరికీ అతి సమీప సంబంధం ఉన్నట్టుగా తోస్తూ ఉంటుంది. రాహువు లాగే కేతువు కూడా కశ్యప ప్రజాపతి కుమారుడేనా ?”* విమలానందుడు అడిగాడు.


*"అడగాల్సిన ప్రశ్నే అడిగావు విమలానందా ! అయితే దీనికి ఇదమిత్థంగా అవునని కానీ , కాదని గానీ సమాధానం చెప్పలేం. ఎందుకంటే కేతుజననం గురించి పురాణాల్లో , ఇతిహాసాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కశ్యప ప్రజాపతి కుమారుడుగా ఆయన పత్ని దనూదేవికి 'కేతుమంతుడు' అనే కుమారుడు జన్మించాడు. మహాభారత కాలంలో ఆ కేతుమంతుడే 'అమితౌజుడు'గా జన్మించాడని చెప్పబడింది. దనూ కశ్యప దంపతుల పుత్రుడైన కేతుమందుడే 'కేతుగ్రహం' అనే భావన కూడా ఉంది. అందుకే రాహు కేతువులు సోదరులుగా కలిసి మెలిసి ఉండేవారనీ అనుకోవడం జరిగింది.*


*"అయితే అష్టాదశ పురాణాలలో ఒకటైన విష్ణు ధర్మోత్తర పురాణంలో కేతువు గురించి ఐతిహ్యం మరొక విధంగా ఉంది. ఆ పురాణం ప్రకారం - బ్రహ్మదేవుడు మృత్యు దేవతను సృష్టించాడు. భూభారం తగ్గడానికి వీలుగా ప్రాణుల్ని సంహరించ మంటాడు. ఆమె తిరస్కరించి రోదిస్తుంది. వేడిగా నిట్టూర్చుతుంది. ఆ నిట్టూర్పు పతాకాకారంలో అగ్నికీలగా వెలువడుతుంది. తద్వారా కేతువు పుట్టాడు. కేతువుగా , ధూమకేతువుగా ఉంటాడని బ్రహ్మ శాసిస్తాడు...”.*


నిర్వికల్పానంద శిష్యులకు అర్ధం కావడానికన్నట్టు ఆగాడు.


*"కేతువు జన్మ వృత్తాంతంలో మరొక అంశాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. అది క్షీరసాగర మథనం తర్వాత మోహిని ద్వారా దేవ దానవులకు జరిగిన అమృత వితరణ సన్నివేశం. ఆ సన్నివేశంలో రాహువు ఒక్కడే దేవతగా మారు వేషంలో అమృతం స్వీకరించినట్టు వర్ణించబడింది.*


*"స్కంద మహాపురాణంలో మరో విధంగా ఉంది. 'తదా రాహుశ్చ కేతుశ్చ ద్వావేత దైత్య పుంగవౌ , దేవానాం రూపమాస్థాయ అమృతార్ధం త్వరాన్వితా ఉపవిష్ణా తదా పంక్త్యాం దేవానామమృతార్ధినౌ"* - అంటే రాహువు , కేతువూ అనే దైత్యపుంగవులు అమృతం కోసం దేవతల రూపాలు ధరించి , దేవతల పంక్తిలో కూర్చున్నారు - అని అర్థం..."


*"అలా అయితే ఏ అభిప్రాయాన్ని మనం స్వీకరించాలి, గురువు గారూ ?”* చిదానందుడు అడిగాడు.


*"ఏదైనా తీసుకోవచ్చు !"* శివానందుడు తేలిగ్గా అన్నాడు.


నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *“ఆ అభిప్రాయం సరైంది కాదు , శివానందా ! - నీకు నచ్చిన ప్రతిపాదనను నువ్వూ , చిదానందుడికి నచ్చింది అతనూ స్వీకరిస్తే - విషయంలో అభిప్రాయభేదం శాశ్వతంగా ఉండిపోతుంది. సూక్ష్మంగా ఆలోచించి , పురాణాలలోని భిన్నమైన ప్రతిపాదనల మధ్య సమన్వయం సాధించి , ఏదో ఒక ప్రతిపాదనను స్వీకరించాలి. ఆ ప్రతిపాదన యుగయుగాలుగా వేళ్ళు తన్నిన విశ్వాసానికి విఘాతం కలిగించకుండా ఉండాలి. మనం 'కేతువు' జన్మవృత్తాంతంలో ఆ సమన్వయ పద్ధతిని పాటించి , రెండు అభిప్రాయాలనూ కలిపి , ఒక్కటిగా చేయడానికి ప్రయత్నం చేద్దాం !".*


*"బాగుంది గురువుగారూ... మీరన్న ఆ సమన్వయాన్ని ఎలా సాధిస్తారు ?"* విమలానందుడు అడిగాడు.


*"ఎలా సాధించగలమో ప్రత్యేకంగా వివరించకుండా కేతువుకు అటు కశ్యప ప్రజాపతితోనూ , ఇటు మృత్యువుతోనూ సంబంధం కొనసాగిస్తూ ఆయన జన్మ - వృత్తాంతం చెప్పుకుందాం... వినండి. ఒకప్పుడు ప్రాణులకు మరణాలు లేని కారణంగా భూభారం అమితంగా పెరిగిపోయింది. భూదేవి ప్రమాదాన్ని శంకించింది...”* నిర్వికల్పానందం ప్రారంభించాడు.


*రేపటి నుండి కేతుగ్రహ జననం ప్రారంభం*

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 65*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 65*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*వివాహ ప్రయత్నాలు*


ఒక వంక మిత్రుల ప్రయత్నాలు ఇలా ఉండగా ఇంట్లో భిన్నమైన పరిస్థితిని నరేంద్రుడు ఎదుర్కోవలసి వచ్చింది. తండ్రి బ్రతికి ఉన్నప్పుడే ప్రారంభమైన వివాహ ప్రయత్నాలు మళ్లీ కొనసాగాయి; ఆతణ్ణి మరీ ఇబ్బందికి  గురిచేశాయి. తండ్రి ఉన్నప్పుడు అతడు వివాహాన్ని తిరస్కరించడం పెద్ద సమస్యగా తోచలేదు. కాని ఇప్పుడది విశ్వరూపం దాల్చింది. కోరినంత కట్నంతో వధువును ఇవ్వడానికి సిద్ధమయినప్పుడు, ఈ దారిద్ర్య పరిస్థితిలో ఆతడు తిరస్కరించడం ఇంట్లోవారు జీర్ణించుకోలేకపోయారు. 


పేదరికపు గుప్పిట నుండి విడివడడానికి కనిపిస్తున్న ఒకే దారిని అతడు మూసి వేస్తున్నాడని వారు భావించారు. చివరకు తల్లియైన భువనేశ్వరి ఒక అడుగు ముందుకువేసి ఒక పిల్లను చూసి నిశ్చయం కూడా చేసింది. ఆ తరువాత నరేం ద్రుడు గట్టిగా తిరస్కరించలేకపోయాడు. జరుగబోయేది జరుగనీ అనుకొని, తనను నమ్ముకొని ఉన్నవారి కోసం వివాహం చేసుకోవడానికే నిశ్చయించుకొన్నాడు.


 నరేంద్రుని వివాహం గురించి శ్రీరామకృష్ణులకు తెలిసింది. వెంటనే ఒక బండి బాడుగకు తీసుకొని తిన్నగా నరేంద్రుని ఇంటికి వెళ్లారు. నరేంద్రుడు బయటికి వచ్చి ఆయనను కలుసుకొన్నాడు. అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు ఆతడి చేతులు పుచ్చుకొని, నేను విన్నది నిజమేనా అని అడిగారు. నరేంద్రుడు తలదించుకొని, "అవును. నేను వివాహానికి సమ్మతించాను" అన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు నరేంద్రుని చేతులను నొక్కి పట్టుకొని, "ఈ వివాహం జరగదు.ఇవి నా మాటలు సుమా!” అంటూ బండి ఎక్కి వెళ్లిపోయారు. అవాక్కై నిలబడి పోయాడు. నరేంద్రుడు!🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 55*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 55*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*నిమేషోన్మేషాభ్యాం ప్రళయ ముదయం యాతి జగతీ*

*తవేత్యాహు స్సంతో ధరణిధరరాజన్య తనయే |*

*త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః*

 *పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః ‖*


ధరణిధర రాజన్యతనయే = హిమవంతుని కుమార్తెవైన తల్లీ


సంతోః = సత్పురుషులు


తవేత్యాహుః = ఇలా అంటున్నారు


నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి = నీవు కనులు తెరిస్తే సృష్టి, మూస్తే లయము, దృష్టి నిలిపివుంచితే స్థితి అని.


త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషా స్తవ దృశః = రెప్ప తెరవటం వలన సృజింపబడిన లోకాలను, రెప్ప వేస్తే కలగబోయే ప్రళయం నుండి కాపాడుకోవటానికి రెప్ప వేయకుండా చూస్తున్నావా తల్లీ! 


అనగా అమ్మవారు జాగ్రత్ స్వరూపిణి అని. *భూరి కుటుంబిని* అన్నారు అమ్మవారిని. ఈ జగత్తంతా ఆమె సంతతియే, ఆమె కుటుంబమే. కనుక తల్లిగా తన బిడ్డలను ఆమె సదా రక్షణ చేస్తూ వుంటారు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అక్టోబర్ 16, 2023 సోమవారం (ఇందువాసరే)

 నిత్య పంచాంగం

🌞🌸🌞🌸🌞🌸🌞🌸🌞

శ్రీ విద్యా గణేశ ప్రసన్న

శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః

శ్రీ శ్రీ పాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతి 

శ్రీ గురు దత్తాత్రేయాయ నమః

శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్ ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్||

              🌺 *పంచాంగం* 🌺

అక్టోబర్ 16, 2023 సోమవారం (ఇందువాసరే) 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షణాయనము 

శరదృతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం 

తిధి : విదియ ఉ 11:51 తదుపరి తదియ 

నక్షత్రం: స్వాతి రా 7:24 తదుపరి విశాఖ 

యోగం: విశ్కంబం కరణం : బాలవ 

సూర్యరాశి:కన్యా చంద్రరాశి:తుల 

సూర్యోదయం:6:09 సూర్యాస్తమయం:5:54 

రాహుకాలం : ఉ 7:30 - 9:00 

యమగండం : ఉ 10:30 - 12:00 

వర్జ్యం : రా 1:10 – 2:49 

దుర్ముహూర్తం: మ 12:25 - 1:12 తిరిగి 2:46 - 3:33 

అమృతకాలం: ఉ 10:24 - 12:05 

*ప్రీతిద్వితీయ* 

శుభమస్తు🙏

*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*

🙏 లోకాఃసమస్తాః సుఖినోభవంతు