*శరన్నవరాత్రాంతర్గత దేవీస్తుతి*
ది:15-10-2023
శా॥
ప్రాతర్వేళల బాలగా నతుల సంభావించి నిన్గొల్వ సం
ప్రీతిన్ బాలల నంగరాగముల నుల్లేఖించి యా రూపులన్
పూతభ్రాజిత చిత్తవృత్తులను నిన్ బూజించగా మించుచున్
రీతిన్ యుక్తిని బ్రోచు తల్లి! కొనుమా! ప్రేమన్ నమోవాకముల్ -3
శా॥
పాదాబ్జమ్ముల లాక్షనుంచి మయిలేపమ్ముల్ దగం బూసి యా
మోదమ్మొప్పగ స్వర్ణభూషలొదుగన్ భూషించి కీర్తించుచున్
వాదమ్ముల్ వినిపించ వీణియలు దివ్యాహ్నమధ్యమ్మునన్
భూదేవుల్ నిను చండిగా గొలువగా బ్రోవంగదే మమ్ములన్ -4
శా॥
మూలాధారము నాదిగా దలచుచున్ మూర్ధన్యపర్యంతమున్
హేలాలీల విధానమంది గరిమన్ హేమంపు శ్రీచక్రమున్
వీలైనట్టి విధిన్ నవావరణముల్ పెంపొంది సాయంత్రమున్
చాలన్ భక్తిగ బూజసేయ గొను నో సాధ్వీ నినున్ మ్రొక్కెదన్
*~శ్రీశర్మద*
8333844664
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి