2, నవంబర్ 2026, సోమవారం

3 నవంబర్ 2026 పంచాంగం

 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

మంగళవారం,నవంబర్.3,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం -బహుళ పక్షం

తిథి:నవమి మ2.54 వరకు

వారం:మంగళవారం(భౌమ్యవాసరే)

నక్షత్రం:ఆశ్రేష ఉ7.39 వరకు

యోగం:శుక్లం మ2.14 వరకు

కరణం:గరజి మ2.54 వరకు తదుపరి వణిజ రా2.03 వరకు

వర్జ్యం:రా7.05 - 8.37

దుర్ముహూర్తము:ఉ8.19 - 9.05

మరల రా10.28 - 11.19

అమృతకాలం:ఉ6.08 - 7.39 మరల తె4.13 - 5.45

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30

సూర్యరాశి:తుల||చంద్రరాశి:కర్కాటకం

సూర్యోదయం:6.00|| సూర్యాస్తమయం:5.29

సర్వేజనా సుఖినో భవంతు -శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻

పరమాత్మ

  ఆత్మ అంటే ఎవరు ? నేను నేనేనా? చైతన్యము ఆత్మ ప్రాణము పరమాత్మ అన్ని ఒక్కటేనా?


ఈ ప్రశ్నలు అత్యంత లోతైనవి మరియు వేదాంతపరమైనవి (Philosophical & Spiritual). మానవ చరిత్రలో ఎంతో మంది ఋషులు, తత్వవేత్తలు వీటికి సమాధానాలు వెతికారు. ఒక్కో అంశాన్ని విడివిడిగా మరియు వాటి మధ్య ఉన్న సంబంధాన్ని సరళంగా తెలుసుకుందాం:

​1. ఆత్మ అంటే ఎవరు?

​వేదాంతం (ముఖ్యంగా అద్వైత వేదాంతం) ప్రకారం, ఆత్మ అనేది మన శరీరానికి, మనసుకు, బుద్ధికి అతీతంగా ఉండే ఒక శాశ్వతమైన, చైతన్యవంతమైన శక్తి.

​ఇది పుట్టదు, చావదు, ఎవరి చేత నశింపబడదు (భగవద్గీతలో "నైనం ఛిందంతి శస్త్రాణి...").

​మన శరీరంలో ఉంటూ మనల్ని నడిపిస్తున్న అంతర్లీన నిజస్వరూపమే ఆత్మ. శరీరం తాత్కాలికం, కానీ ఆత్మ శాశ్వతం.

​2. నేను నేనేనా?

​ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనం సాధారణంగా "నేను" అంటే ఈ శరీరం అనుకుంటాం, లేదా పేరు, రూపం, మన ఆలోచనలు, భావోద్వేగాలు అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే:

​మీరు అనుకునే "నేను" రెండు భాగాలుగా ఉంటుంది:

​అపరా ప్రకృతి (మారుతున్న రూపం): ఈ స్థూల శరీరం, మనసు, బుద్ధి, అహంకారం. ఇవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి (వయసు మారుతుంది, ఆలోచనలు మారుతాయి).

​పరా ప్రకృతి (మార్పులేని సత్యం): మీలోని అసలైన "నేను" ఆత్మయే.

​కాబట్టి, పైకి కనిపించే పేరు-రూపాలు తాత్కాలికమే అయినా, వాస్తవానికి మీలోని అంతర్జ్యోతి ఆత్మ రూపాన్నే మీరు కలిగి ఉన్నారు. "అహం బ్రహ్మాస్మి" (నేను ఆ బ్రహ్మ స్వరూపాన్నే) అనే మహావాక్యం ఇదే చెబుతుంది.

​3. చైతన్యము, ఆత్మ, ప్రాణము, పరమాత్మ – అన్నీ ఒక్కటేనా?

​ఇవి వేర్వేరుగా అనిపించినా, వేదాంత దృక్పథంలో అన్నీ ఒకే శక్తి యొక్క వివిధ రూపాలు లేదా స్థాయిలు:

​చైతన్యము (Consciousness): ఇది విశ్వవ్యాప్తంగా, అలాగే ప్రతి జీవిలోనూ ఉన్న "తెలుసుకునే శక్తి" లేదా "జ్ఞాన స్వరూపం". మనం మేల్కొని ఉన్నామని, ఆలోచిస్తున్నామని మనకు తెలిసేలా చేసేది ఈ చైతన్యమే. ఆత్మ చైతన్య స్వరూపమైనది.

​ప్రాణము (Life Force / Energy): ఇది శరీరానికి ఊపిరినిచ్చేది, శ్వాసను నడిపించే శారీరక శక్తి (Energy). ప్రాణం అనేది శరీరాన్ని నడిపే ఒక యంత్రాంగం లాంటిది. ప్రాణం పోయినా ఆత్మ నశించదు, అది కేవలం శరీరాన్ని మారుస్తుంది.

​ఆత్మ (Soul / Individual Self): జీవిలోని అంతర్గత చైతన్యమే ఆత్మ. ఇది ఒక శరీరంలో ఉన్నప్పుడు దానిని 'జీవాత్మ' అంటారు.

​పరమాత్మ (Supreme Soul / God): విశ్వాన్ని నడిపించే సర్వోన్నత శక్తి లేదా సర్వవ్యాపకమైన చైతన్యమే పరమాత్మ.

​ఒక చిన్న ఉదాహరణ:

ఒక పెద్ద సముద్రాన్ని పరమాత్మ అనుకుంటే, అందులో ఒక కప్పులో ఉన్న నీటిని ఆత్మ అనవచ్చు. కప్పు పగిలిపోతే (శరీరం నశిస్తే) ఆ నీరు తిరిగి సముద్రంలో కలిపినట్లే, జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవుతుంది. అలాగే ఆ నీటిలో ఉండే తడిదనాన్ని చైతన్యం అనీ, ఆ నీరు కదలడానికి ఉపయోగపడే శక్తిని ప్రాణం అనీ భావించవచ్చు.

​ముగింపు:

​ఈ పదాలన్నీ ఆ పరమ సత్యాన్ని వేర్వేరు కోణాల్లో నిర్వచించేవే. స్థూలంగా చెప్పాలంటే—మనలోని ప్రాణం శరీరాన్ని నడిపిస్తే, ఆ ప్రాణానికి మరియు శరీరానికి వెలుగునిచ్చే చైతన్యమే ఆత్మ; ఆ ఆత్మలన్నింటికీ మూలమైన మహాసముద్రమే పరమాత్మ.

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 02.11.2026 Monday


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాస కృష్ణ పక్ష అష్టమి తిథి ఇందు వాసర ఆశ్రేష నక్షత్రం శుభ యోగః కౌలవ తదుపరి తైతుల కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు. 



శ్రాద్ధ కర్మ తిథి : నవమి

 


 

నమస్కారః , శుభోదయం

02-11-2026 సోమవారం రాశి ఫలితాలు

 శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

02-11-2026 సోమవారం రాశి ఫలితాలు


మేషం


ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.           

---------------------------------------


వృషభం


సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో విశేషమైన ఆధరణ పెరుగుతుంది.         

---------------------------------------


మిధునం


కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలు సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.                

---------------------------------------


కర్కాటకం


కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. బంధు వర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.       

---------------------------------------


సింహం


ఉద్యోగాలు ఆశించిన రీతిలో రాణించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.         

---------------------------------------


కన్య


వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.             

---------------------------------------


తుల


చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ పని తీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.              

---------------------------------------


వృశ్చికం


బంధు మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. దూరప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది.           

---------------------------------------


ధనస్సు


ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.                   

---------------------------------------


మకరం


ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. ఆత్మీయుల నుంచి అందిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.             

---------------------------------------


కుంభం


ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఉంటాయి. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక నిర్ణయాల వలన నష్టాలు తప్పవు.                

--------------------------------------- 


మీనం

 

వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహమున శుభకార్యాల నిర్వహణపై చర్చలు చేస్తారు.  

---------------------------------------