ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
9, జూన్ 2026, మంగళవారం
బుధవారం🌷* *🪷10, జూన్, 2026🪷* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌷బుధవారం🌷*
*🪷10, జూన్, 2026🪷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*
*అధిక జ్యేష్ఠ మాసం - కృష్ణ పక్షం*
*తిథి : దశమి* రా 12.57 వరకు ఉపరి *ఏకాదశి*
*వారం : బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : ఉత్తరాభాద్ర* ఉ 09.21 వరకు ఉపరి *రేవతి*
*యోగం : ఆయుష్మాన్* ఉ 06.30 *సౌభాగ్య* రా.తె 04.03 వరకు
*కరణం : వణజి* మ 01.52 *భద్ర* రా 12.57 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు:*
ఉ05.30-07.30 & 09.00-10.00
అమృత కాలం:*శేషం ఉ06.12 వరకు*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : రా 08.49 - 10.20*
*దుర్ముహూర్తం :ప11.41 - 12.33*
*రాహు కాలం :మ12.07- 01.45*
గుళికకాళం : *ఉ 10.29 - 12.07*
యమగండం : *ఉ 07.12 - 08.51*
సూర్యరాశి : *వృషభం*
చంద్రరాశి : *మీనం*
సూర్యోదయం :*ఉ 05.41*
సూర్యాస్తమయం :*సా 06.50*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.34 - 08.11*
సంగవ కాలం :*08.11 - 10.48*
మధ్యాహ్న కాలం :*10.48 - 01.25*
అపరాహ్న కాలం :*మ 01.25- 04.03*
*ఆబ్ధికం తిధి : అధిక జ్యేష్ఠ బహుళ దశమి*
సాయంకాలం :*సా 04.03- 06.40*
ప్రదోష కాలం :*సా 06.40- 08.51*
రాత్రి కాలం :*రా 08.51 - 11.45*
నిశీధి కాలం :*రా 11.45- 12.29*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*
■■■■■■■■■■■■■■■■■■■■
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
వానలు
*"వానలు" ఇన్నివిధాలుగా*
*వుoటాయని తెలుసా...?*
*వానలు పలురకాలు:👇*
*1. గాంధారివాన:*
కంటికి ఎదురుగా ఉన్నది
కనిపించనంత జోరుగా
కురిసే వాన...
*2. మాపుసారివాన:*
సాయంత్రం కురిసే వాన...
*3. మీసరవాన:*
మృగశిరకార్తెలో కురిసే వాన...
*4. దుబ్బురువాన:*
తుప్పర/తుంపర వాన...
*5. సానిపివాన:*
అలుకు (కళ్లాపి) జల్లినంత
కురిసే వాన...
*6. సూరునీల్లవాన:*
ఇంటి చూరు నుండి ధార
పడేంత వాన...
*7. బట్టదడుపువాన:*
ఒంటి మీదున్న బట్టలు
తడిపేంత వాన...
*8.తెప్పెవాన:*
ఒక చిన్న మేఘం నుంచి
పడే వాన...
*9.సాలువాన:*
ఒక నాగలిసాలుకు
సరిపడా వాన...
*10. ఇరువాలువాన:*
రెండు సాల్లకు & విత్తనాలకు
సరిపడా వాన...
*11.మడికట్టువాన:*
బురదపొలం దున్నేటంత
వాన...
*12.ముంతపోతవాన:*
ముoతతోటి పోసినంత
వాన...
*13. కుండపోతవాన:*
కుండతో కుమ్మరించినంత వాన...
*14. ముసురువాన:*
విడువకుండా కురిసే వాన...
*15.దరోదరివాన:*
ఎడతెగకుండా కురిసే వాన...
*16. బొయ్యబొయ్యగొట్టేవాన:*
హోరుగాలితో కూడిన వాన...
*17.రాళ్లవాన:*
వడగండ్ల వాన...
*18.కప్పదాటువాన:*
అక్కడక్కడా కొంచెం
కురిసే వాన...
*19.తప్పడతప్పడవాన:*
టపటపా కొంచెంసేపు
కురిసే వాన...
*20.దొంగవాన:*
రాత్రంతా కురిసి తెల్లారి
కనిపించని వాన...
*21.కోపులునిండేవాన:*
రోడ్డు పక్కన గుంతలు
నిండెంత వాన...
*22.ఏక్దారవాన:*
ఏకధారగా కురిసే వాన...
*23.మొదటివాన:*
విత్తనాలకు బలమిచ్చే వాన...
*24.సాలేటివాన:*
భూమి తడిసేంత భారీ వాన...
అత్యాశ లేని చోట
*"అత్యాశ లేని చోట ఆనందం ఉంటుంది.*
*ఆరాటం లేని చోట ప్రశాంతత ఉంటుంది.*
*కాబట్టి మన జీవితం ఎలా ఉంచుకోవాలో మన చేతుల్లోనే ఉంది."*
*"చేసిన తప్పులకు చింతించడం వలన మనసుకు ప్రశాంతత కలగదు.*
*మరలా మరలా చేయకుండా ఉండడం వల్లనే ప్రశాంతత కలుగుతుంది."*
*నేను అనే ఆలోచన వచ్చేటప్పుడల్లా ఆన్ని ఒత్తిడులూ, సమస్యలూ నీ చుట్టూ సుడులు తిరుగుతుంటాయి. అలా కాకుండా ఈ ప్రపంచం నాది కాదు. ఈ దేహం నాది కాదు. ఈ ఊపిరి నాది కాదు... ఇవన్నీ నాకు భగవంతుడు ఇచ్చినవే తప్ప నా సొంతం కావు.. అని నువ్వు గ్రహిస్తే సమస్యలన్నీ బాధలన్నీ పారిపోతాయి. ఈ మానసిక స్థితితోనే నీ విధులు నువ్వు సాగించు. నీకు కావలసినంత "ప్రశాంతత" లభిస్తుంది".*
*వెయ్యి వ్వర్థమైన మాటలు వినడం కన్నా*
*ప్రశాంతతను ప్రసాదించే ఒకే ఒక మంచి మాట వినడం *"అత్యాశ లేని చోట ఆనందం ఉంటుంది.*
*ఆరాటం లేని చోట ప్రశాంతత ఉంటుంది.*
*కాబట్టి మన జీవితం ఎలా ఉంచుకోవాలో మన చేతుల్లోనే ఉంది."*
*"చేసిన తప్పులకు చింతించడం వలన మనసుకు ప్రశాంతత కలగదు.*
*మరలా మరలా చేయకుండా ఉండడం వల్లనే ప్రశాంతత కలుగుతుంది."*
*నేను అనే ఆలోచన వచ్చేటప్పుడల్లా ఆన్ని ఒత్తిడులూ, సమస్యలూ నీ చుట్టూ సుడులు తిరుగుతుంటాయి. అలా కాకుండా ఈ ప్రపంచం నాది కాదు. ఈ దేహం నాది కాదు. ఈ ఊపిరి నాది కాదు... ఇవన్నీ నాకు భగవంతుడు ఇచ్చినవే తప్ప నా సొంతం కావు.. అని నువ్వు గ్రహిస్తే సమస్యలన్నీ బాధలన్నీ పారిపోతాయి. ఈ మానసిక స్థితితోనే నీ విధులు నువ్వు సాగించు. నీకు కావలసినంత "ప్రశాంతత" లభిస్తుంది".*
*వెయ్యి వ్వర్థమైన మాటలు వినడం కన్నా*
*ప్రశాంతతను ప్రసాదించే ఒకే ఒక మంచి మాట వినడం ఉత్తమం..!*ఉత్తమం..!*
_తండ్రీ పరమేశ్వరా
_తండ్రీ పరమేశ్వరా!🌹_
కొందరికి
సిరి సంపదలు చూసి
అనందిస్తారు
ఇంకొందరికి
ఆస్థి పాస్థులు
ఆభరణాలు
అనందం కలిగిస్తాయి
మరికొందరికి
బంధు మిత్రులు
పరివారం వల్ల
అనందం కలుగుతుంది
నాకు మాత్రం
మీ పాదాలను తనివి తీరా
చూస్తే అనందం కలుగుతుంది
వాటిని ఎప్పుడెప్పుడు
తాకి పరవశించాలా అని
అతురత కలుగుతుంది
ఉబికి వచ్చే కన్నీటితో
మీ పాదాలు కడగాలని
మనసు ఉవ్విళ్లూరుతుంది
_హరః నమః పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకర!🙏_
సంస్కారాలను ఇవ్వాలనుకుంటారా
(సేకరణ)
వివాహం అనంతరం తొలిసారి పుట్టింటికి వచ్చిన కుమార్తెకు వారంరోజుల పాటు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారు।
ఆ వారం రోజులూ అమ్మాయికి నచ్చినవే అన్నీ చేశారు। తిరిగి అత్తింటికి వెళ్తున్నప్పుడు తండ్రి ఒక ఎంతో సువాసనగల అగరబత్తుల ప్యాకెట్‌ను ఆమెకు ఇస్తూ ఇలా అన్నాడు — “బిడ్డా, నువ్వు అత్తింట్లో పూజ చేసేటప్పుడు ఈ అగరబత్తిని తప్పకుండా వెలిగించు.”
అప్పుడు తల్లి చెప్పింది —
“మొదటిసారి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తున్న కూతురికి అగరబత్తులాంటి వస్తువు ఇస్తారా?”
అంతలోనే తండ్రి జేబులో చేయి వేసి, తన దగ్గర ఉన్న డబ్బంతా కూతురి చేతిలో పెట్టాడు।
అత్తింటికి చేరుకున్న తర్వాత, కోడలికి పుట్టింటి వారు ఏమిచ్చారో అని అత్తగారు చూసారు। అందులో ఆ అగరబత్తుల ప్యాకెట్ కూడా కనిపించింది। అప్పుడు ఆమె ముఖం చిట్లిస్తూ — “సరే, రేపు పూజలో ఇవి వెలిగించు” అని చెప్పింది।
మరుసటి ఉదయం అమ్మాయి పూజకు కూర్చొని అగరబత్తుల ప్యాకెట్ తెరిచింది। అందులో ఒక చిన్న లేఖ కనిపించింది।
ఆ లేఖలో ఇలా వుంది…
“బంగారం… ఈ అగరబత్తి తాను కాలిపోతూ కూడా మొత్తం ఇంటిని సువాసనతో నింపుతుంది। అంతేకాదు, చుట్టుపక్కల వాతావరణాన్నీ పరిమళభరితంగా, ఆనందంగా మారుస్తుంది…!!
ఎప్పుడైనా నీకు భర్తపై కోపం రావచ్చు, కొన్నిసార్లు అత్తమామలపై మనసు నొచ్చుకోవచ్చు। మరికొన్ని సందర్భాల్లో మరిది, మరదళ్లపై కూడా అలక రావచ్చు। కొన్నిసార్లు ఎవరో చెప్పిన మాటలు నిన్ను బాధించవచ్చు, లేదా పొరుగువారి ప్రవర్తనతో నీ మనసు కలత చెందవచ్చు। అలాంటి ప్రతి సమయంలో నా ఈ కానుకను గుర్తు పెట్టుకో…
ఈ అగరబత్తిలా నీవూ కాలిపోతూ, నీ బాధలను భరించుకుంటూ, అత్తింటినే నీ పుట్టింటిలా భావించి, నీ ప్రవర్తనతో, నీ మంచితనంతో ఆ ఇంటిని పరిమళభరితంగా, ఆనందభరితంగా మార్చు…”
ఆ లేఖ చదివిన కూతురు ఆపుకోలేక బిగ్గరగా ఏడవసాగింది। అత్తగారు పరుగెత్తుకుంటూ వచ్చారు। భర్త, మామగారు కూడా పూజగదిలోకి వచ్చారు।
“ఏమైంది? చేతికి ఏమైనా కాలిందా?” అని భర్త అడిగాడు।
“ఏమైందో చెప్పమ్మా?” అని మామగారు అన్నారు।
అత్తగారు చుట్టూ ఏదైనా సమస్య ఉందేమో అని చూసారు।
అప్పుడు తండ్రి అందమైన అక్షరాలతో రాసిన ఆ లేఖ ఆమె కంటపడింది। లేఖ చదివిన వెంటనే అత్తగారు కోడలిని హత్తుకుని, ఆ లేఖను మామగారి చేతిలో పెట్టారు।
కళ్లజోడు లేకపోవడంతో మామగారు ఆ లేఖను తన కుమారుడితో చదివించారు।
మొత్తం విషయం అర్థమైన వెంటనే ఆ ఇంట్లో ఉన్న అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు।
అప్పుడు అత్తగారు అన్నారు — “ఈ లేఖకు వెంటనే ఫ్రేమ్ వేయించాలి। మా కోడలికి వచ్చిన అత్యంత విలువైన కానుక ఇదే। పూజగది పక్కనే దీనిని పెట్టాలి.”
ఆ తరువాత ఆ ఫ్రేమ్‌లోని ఆ మాటలు, వాటి అర్థం, ఆ ఇంటినే కాదు… చుట్టుపక్కల వాతావరణాన్నీ ఎప్పటికీ పరిమళభరితంగా ఉంచాయి… అగరబత్తుల ప్యాకెట్ అయిపోయిన తరువాత కూడా…
మీరు కూడా మీ కుమార్తెకు ఇలాంటి సంస్కారాలను ఇవ్వాలనుకుంటారా…?
నేను ఈ సందేశాన్ని ఎక్కడో నుంచి కాపీ చేసి మీకు పంపుతున్నాను। నచ్చితే మీ ఆత్మీయులకు పంపండి… ఎవరి ఇల్లు అయినా పరిమళభరితంగా మారవచ్చు।
సమస్త తల్లిదండ్రులకు మరియు పూర్వీకులకు అంకితం…
🙏 కూతుళ్లు రెండు కుటుంబాలను పరిమళభరితం చేస్తారు 🙏
మిత్రధర్మం
*****
*మిత్రధర్మం*
=========
(సామాజిక కధ)
(నేను రాసిన ఈ కథ మాధురి అంతర్జాల పత్రిక నిర్వహించిన 2024 కథల పోటీలో బహుమతి పొంది, ఆ పత్రికలో మే 2025 న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
రోడ్లు భవనాల శాఖ, ప్రాంతీయ కార్యాలయం ముందు, ఖరీదైన నా ఆడీ కారును ఆపమని, అందులోంచి దర్జాగా దిగాను. గోల్డ్ ఫ్రేమ్ కళ్లజోడు, మెడలో చేంతాడంత బలంగా ఉన్న బంగారు గొలుసు, వేళ్ళుకు ఉంగరాలు, చేతులకు బ్రాస్లెట్, ఖరీదైన దుస్తులు వేసుకున్న నన్ను చూస్తే ఎవరైనా సులువుగా గుర్తు పట్టేస్తారు, నేనో పెద్ద కాంట్రాక్టరునని! ఎదురు పడినవాళ్లు పెట్టిన నమస్కారాలుకు ప్రతి నమస్కారం చేస్తూ, ఆఫీసు సూపర్నెంట్ గది ముందు ఆగాను.
"ఓ, కాంట్రాక్టరు రామారావు గారా ! రండి సార్ రండి. మీ మేనేజర్ తో నేనే చెప్పాను. తమరిని ఓ సారి రమ్మని. కూర్చోండి సార్." అంటూ ఆహ్వనించిన సూపర్నెంట్ ధర్మారావుతో,
"మర్యాదలు తర్వాత, ముందు నా కోటి రూపాయల కాంట్రాక్టు బిల్లు ఎందుకు ఆగింది?" సూటిగా అడిగాను.
"సార్, కిందటి వారమే కొత్త ఆఫీసర్ జాయిన్ అయ్యారు. ఆయనే పెండింగ్ పెట్టాడు మీ బిల్లును"
"ఎందుకు? అంటే ఆయనను నేను ఇంతవరకూ కలుసుకోలేదనా ? లేక పెర్సంటేజ్ పెంచమనా?"
"అయ్యయ్యో, ఈయన చాలా నిక్కచ్చి మనిషి సార్. అవినీతి, అన్యాయం సహించడని డిపార్ట్మెంట్ లో ఆయనకు పేరుంది..........." చెప్పుకుపోతున్నాడు ధర్మారావు.
ఈ లోగా 'సార్ వచ్చారు' అని ఎవరో అనడంతో అందరూ హడావుడిగా లేచి నిలబడ్డారు. అందరితో పాటు నేనూ లేచి నిలబడ్డాను.
చామనచాయ, ఓ మోస్తరు ఎత్తు, పాపిడి లేకుండా అంగుళం ఎత్తులో కత్తిరించబడి నిటారుగా నిలబడ్డ తలవెంట్రుకలు, కుడి కన్నుకు, చెంపకు మధ్యలో లోతైన గాయం తాలూకు మచ్చతో ఉన్న ఆ ఆఫీసర్ ని చూడగానే ఈయన్ను ఎక్కడో చూసినట్టుందే అనుకుని,
"ఔనూ, ఈ ఆఫీసర్ ఎక్కడివాడు ? ఈయన పేరేమిటి ?" కుర్చీలో కూర్చుంటూ అడిగాను.
"పేరు శ్యామల రావు, బ్రహ్మచారి. తల్లి తండ్రులు చిన్నతనంలో చనిపోతే, సవతి అన్నగారు కొన్నాళ్ళు చూసి, తర్వాత అనాథాశ్రమంలో చేర్చాడుట. కష్టపడి చదివి ఇదిగో ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యారుట" చెప్పాడు ధర్మారావు.
అయితే, చెంపమీద ఆ గాటు, ఆ హెయిర్ స్టైల్ అలాగే ధర్మారావు చెప్పిన వివరాలు బట్టి చూస్తే ఈ శ్యామలరావు, తన చిన్ననాటి స్నేహితుడు శ్యామలరావేనా ? అనుకుంటూ గతంలోకి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్లాను.
***** ***** ***** *****
మా ఊర్లో ఐదవ తరగతి వరకే ఉండడంతో, ఆరవ తరగతి మా పిన్నిగారి ఊరైన రౌతులపూడిలో చేరాను. అదిగో, ఆక్కడే పరిచయమయ్యాడు, బెంచీమీద తన పక్కనే కూర్చున్న శ్యామలరావు.
చాలా ముభావంగా ఉండేవాడు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉండేవాడు. ఏమడిగినా ముక్తసరిగా సమాధానం ఇచ్చేవాడు.
ఆ తర్వాత కొన్నాళ్ళకు తెలిసింది. శ్యామల రావు తల్లి తండ్రులు ఏదో ప్రమాదంలో చనిపోయారని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న తన సవతి అన్నగారి వద్ద ఉన్నాడనీ, ఒదిన పరమగయ్యాళి అని.
అంతేకాదు, ఏడాది క్రితం ఏదో గొడవపడి వాళ్ళ ఒదిన తోసేస్తే ఇతను కత్తిపీట మీద పడ్డాడని, ఆ చెంపమీద గాయం అదేననీ.
అంతే, ఆ రోజు నుంచి అతని మీద జాలి పెరిగి పోయింది నాకు. శ్యామలరావుని సొంత సోదరుడులా భావించి అన్ని విధాలా సహాయపడ్డాను. ఈ బంధం సుమారు ఆరు నెలలు బాగానే సాగింది. కానీ ఆ రోజు మా బంధాన్ని విడదీసిన రోజు. ఆ రోజు ఏం జరిగిందంటే...
***** ***** ***** *****
"సార్, మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు " అన్న ధర్మారావు పిలుపుతో ఈ లోకం లోకి వచ్చేను.
ఆఫీసర్ గదిలోకి వెళ్లి అతనికి నమస్కారం పెట్టిన నాకు అతని మొహం చూడగానే అర్ధమైపోయింది, అతను నా బాల్య స్నేహితుడు శ్యామలరావేనని.
"సార్, నా పేరు రామారావు. జిల్లాలో క్లాస్ ఒన్ కాంట్రాక్టరుని. ఔనూ, మీరు చిన్నప్పుడు రౌతులపూడిలో కొన్నాళ్ళు చదువుకున్నారా ? మీకు జ్ఞాపకం ఉందా ? మనిద్దరం పక్క పక్కనే కూర్చునేవాళ్లం" ఆనందంగా చెప్పాను.
"అక్కడ కొన్నాళ్ళు చదువుకున్న మాట వాస్తవమే కానీ మీరెవరో నాకు తెలియదు. ఇలా పాత పరిచయాల పేరుతో తమ బిల్లులు పాస్ చేయించుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు కానీ, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి" కొంచెం విసుగ్గా అన్నాడు శ్యామల రావు.
ఆ మాటతో చిర్రెత్తిపోయిన నేను,
"నా సంస్థకు చెందిన కోటి రూపాయల కాంట్రాక్టు బిల్లు ఒకటి మీ దగ్గర పెండింగ్ ఉంది. అది పాస్ చేయడానికి మీ పెర్సంటేజ్ ఎంతో చెబితే....." అంటూ ఐదు లక్షల రూపాయలున్న నా సూట్ కేస్, టేబుల్ పైన పెట్టి తెరవబోయాను.
"సీ మిష్టర్, నేను ఇలాంటి అవినీతిని ప్రోత్సాహించను. మా రూల్స్ ప్రకారం పాస్ చేస్తా. ఇక మీరు బయలుదేరవచ్చు" కొంచెం కఠినంగా చెప్పాడు శ్యామలరావు.
అవమాన భారంతో, విసురుగా ఆ గదిలోంచి బయటకు వచ్చాను.
***** ***** ***** *****
ఇంటికి వెళ్తూ, కారులో కూర్చొని ఆలోచించా. ఛీ ఈ శ్యామలరావు ఎంత కృతఘ్నుడు? చిన్ననాటి స్నేహితుడునన్న విషయం కూడా మరిచాడు మిత్రద్రోహి. అధికారంతో వచ్చిన అహంభావం కామోసు? ఆ రోజునే కనుక వీడిని నేను కాపాడి ఉండకపోతే ఈ రోజు నాకు ఈ బాధ ఉండేది కాదు...... ముప్పై సంవత్సరాలనాటి ఆ పాత సంఘటన మళ్లీ ఒకసారి నా కళ్ళముందు మెదిలింది.
***** ***** ***** *****
ఆ రోజు సాయంత్రం నేను, నా ఫ్రెండ్ సోమరాజు మా ఊరి ఏటి గట్టున కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఈలోగా దూరంగా ఎవరో ఏటిలోకి దూకినట్టు కనపడింది. వెంటనే వెళ్లి అతడిని కాపాడాము. తీరాచూస్తే వాడు శ్యామలరావు.
"నన్ను ఎందుకు కాపాడేవురా ?" అడిగాడు శ్యామలరావు తడి బట్టలు పిండుకుంటూ.
"శ్యామూ ! ఏమయ్యిందిరా ? ఎందుకు ఇలా చేసావు. మేమంతా లేమా ?" అన్నాను.
"సాయంత్రం మా ఒదిన, అన్నయ్య దెబ్బలాడుకున్నార్రా. నేను ఇక్కడుంటే తను పుట్టింటికి పోతానని మా ఒదిన గొడవ పెడుతోంది. అందుకే నేనే మా అమ్మనాన్నల వద్దకు పోదామని ఇందులోకి దూకేను" ఏడుస్తూ చెప్పాడు శ్యామలరావు.
వాడికి ధైర్యం చెప్పి, వాడిని తీసుకుని, ఆవేశంగా ఏదో పెద్ద ఆరిందాలా వాళ్లింటికి వెళ్లాను.
"ఏమిటండీ మరీ అన్యాయం. మీకు నీతి నియమాలు ఏమీ లేవా? పిల్లాడని కూడా చూడకుండా ప్రతీరోజూ హింసిస్తారా ? మీరు
ఇలాగే ఉంటే మా చిన్నాన్న కరణం తెలుసుగా ? ఆయనతో చెబుతా" అని బెదిరించి, వాడిని లోపలికి పంపాను.
అంతే....అదే ఆఖరి సారి చూడడం వాడిని. ఆ తర్వాత రోజు నుంచి ఆ ఇంటికి తాళం వేసి ఉండేది. ఓ పది రోజుల తర్వాత తెలిసింది, వాళ్ళ అన్నయ్య వచ్చి, శ్యామలరావు టీసీ తీసుకుని వెళ్లి పోయాడని, ఆయన కూడా బదిలీ చేయించుకుని ఆ ఊరు వదలి వెళ్లి పోయాడని.
ఇప్పుడు నాకు అర్ధమౌతోంది, నేను ఆ రోజు శ్యామలరావుని రక్షించి తప్పుపని చేసానని. అంతే కాదు వాళ్ళ ఒదిన కూడా వీడి ప్రవర్తన వల్లనే అలా మారిపోయి ఉంటుందని.
"సార్, ఇంటికి వచ్చేసాం" అన్న డ్రైవర్ పిలుపుతో గతంలోంచి బయటకొచ్చి, ఇంట్లోకి నడిచాను.
***** ***** ***** *****
మర్నాడు ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉండి, నా పెండింగ్ బిల్లు పాస్ చేయించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నా.
ఈలోగా సెల్ మోగింది. ఫోన్ ఎత్తగానే,
"ఎవరూ, రాంబాబేనా మాట్లాడేది ?" అన్నాడు అవతల వ్యక్తి. ఈ మధ్య కాలంలో నన్ను ఎవరూ ఆ పేరుతో పిలవలేదు.
"రాంబాబూ, నేనేరా శ్యామూని" ఆశ్చర్య పోవడం నావంతు అయ్యింది.
"ఓర్నీ నువ్వా ? పోనీలే గుర్తు పట్టేవు. సంతోషం" అన్నాను వెటకారంగా.
"అలా అనకు. ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం నువ్వు ఆ రోజు ఇచ్చిన ధైర్యమే. అంతేకాదు నువ్వు నన్ను రక్షించిన రోజునే అనుకున్నా. నేను చేయాల్సింది చాలా ఉంది, అందుకే భగవంతుడు నాకు నీ ద్వారా పునర్జన్మ ఇచ్చాడని. అంతేకాదు ఆ రోజునే నిశ్చయించుకున్నా. నాలాగ ఇంక అనాథ పిల్లలు ఎవరూ బాధపడకూడదని. కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చేను. నీకు తెలుసా ? నా జీతంలో సగం అనాథ శరణాలయాలకు విరాళంగా ఇస్తానని, ఎక్కడ స్వార్థం పెరిగి పోతుందేమోనని వివాహం కూడా చేసుకోలేదనీ!" ఎంతో గర్వంగా చెప్పాడు శ్యామలరావు.
"బాగానే వుంది కానీ, నా బిల్లు సంగతి ఏం చేసావో అది చెప్పు."
"అదే చెబుతున్నా రాంబాబూ, మనం విడిపోయిన ఆ రోజున నువ్వు మా ఇంటికి వచ్చి చెప్పిన నీతి నియమాలు, న్యాయం అనే మాటలు నా బుర్రలో నాటుకుపోయాయి. నేను ఇప్పటికీ వాటిని అనుసరిస్తున్నాను. నాణ్యత తక్కువగా ఉన్న కారణంగా నీ బిల్లులో పదిహేను శాతం కట్ చేసి పాస్ చేస్తున్నా. నీకు ఇంకో విషయం చెప్పాలి. ఇలాగే కమీషన్లకు కక్కూర్తిపడి కట్టిన నాణ్యత లేని ఓ వంతెనపై ప్రయాణం చేస్తున్న సమయంలో, ఆ వంతెన కూలి నా తల్లిదండ్రులు మరణించారు. అందుకే నేను నాణ్యతకే ప్రాముఖ్యత ఇస్తా. నాకు తెలుసు నీ కాంట్రాక్టులో ఆ మొత్తం మా వాళ్ళకు ఇవ్వవలసిన లంచాలు కోసం కోట్ చేసావని. అందుకే, ఇంక నువ్వు ఎవరికీ లంచం ఇవ్వనవసరం లేదు. అవినీతికి చోటివ్వకు. నాణ్యతలో రాజీపడకు" కరాఖండిగా చెప్పాడు శ్యామలరావు.
"అది సరే కానీ, మరి నిన్న మీ ఆఫీసులో అసలు నేనెవరో తెలియనట్లు ఎందుకు ప్రవర్తించావు?" అడిగాను ఉడికిపోతూ.
"అది నా వృత్తి ధర్మం"
"మరి, ఇప్పుడు ఫోన్ చేసి ఇన్ని నీతి వాక్యాలు చెప్పడంలో నీ ఉద్దేశ్యం?" అడిగాను అయోమయంగా.
"ఇది మన మిత్రధర్మం" అంటూ ఫోన్ కట్ చేసాడు శ్యామలరావు.
ఆశ్చర్యంలోంచి తేరుకున్న నాకు , మ్యూజిక్ సిస్టంలో వస్తున్న "ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి" అని ఘంటసాల గారు పాడిన పాట వినబడింది. ఎందుకో కానీ అది నన్ను ఉద్దేశించే పాడుతున్నట్టు అనిపించింది.
వెంటనే నిన్నటి సూట్ కేస్ తీసుకుని సోఫాలోంచి లేచాను.
"ఆ డబ్బు తీసుకుని మళ్లీ ఎక్కడికి బయల్దేరారు ?" అరుస్తోంది నా శ్రీమతి లోపలినుంచి.
"అనాధ పిల్లల ఆశ్రమానికి..." గర్వంగా చెప్పి కారు ఎక్కాను.
***** ** శుభం ** *****
భగవంతుడు
భగవంతుడు పరమ ప్రేమస్వరూపుడు, దయామయుడు.
*తన భక్తులు పిలచిన తక్షణమే వచ్చి ఆదుకుంటాడు.
*తెల్లవారక మునుపే తనను ఎవరైనా స్మరిస్తారేమో పిలుస్తారేమో అని మన పిలుపు కోసం కాచుకు కూర్చుంటాడట!
*కానీ మనం సూర్యోదయం అయిపోయి 8 దాటాక లేచి ఏ పేపరో లేదా వాకింగో లేదా సెల్ నో చూసుకుని ఉంటుంటాం.
*లేచిలేవగానే భగవంతుని స్మరిద్దామనో లేదా వేగంగా కాలకృత్యాలు తీర్చుకుని ధ్యానమో, జపమో, తపమో చేద్దామని అనుకోము.
*రోజంతా నానా వృథా మాటలతో చేష్టలతో కాలం గడిపేస్తుంటాం కానీ భగవంతుని స్మరించడానికి మాత్రం సమయం ఉండదు.
*పైగా ఏదైనా సమస్య వస్తే దైవము మీద పడతాం! ఇచ్చిన, వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యపరచి భగవంతుని మీద నిందలు వేస్తే ఎలా?
*అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదని అంటుంటారు కదా! కనుక వేకువనే లేచి భగవంతుని పిలవండి, తలవండి, స్మరించండి, భజించండి. ఆయన మంగళ రూపమును ధ్యానించండి.
*మీ అరికాలిలో ముళ్ళు కూడా గుచ్చుకోకుండా చూసుకుంటాడు.
.
పంచాంగం 09.06.2026 Tuesday,
ఈ రోజు పంచాంగం 09.06.2026 Tuesday,
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధికజ్యేష్ఠ మాస కృష్ణ పక్ష నవమి తిథి భౌమ వాసర పూర్వాభాద్ర నక్షత్రం ప్రీతి యోగః తైతుల తదుపరి గరజి కరణం.
రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.
యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.
శ్రాద్ధ తిథి: నవమి.
నమస్కారః , శుభోదయం
భగవద్గీత
--------------------------భగవద్గీత. ------------------------
చతుర్దోధ్యాయః
జ్ఞాన కర్మ సన్యాస యోగము
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః ।
జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతిమచిరేణాధిగచ్ఛతి ।। 39 ।।
ప్రతిపదార్థ:
శ్రద్ధావాన్ — శ్రద్ధగల వ్యక్తి; లభతే — సాధించును (పొందును); జ్ఞానం — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం; తత్పరః — దాని యందే లగ్నమై; సంయత — నియంత్రణ కలిగి; ఇంద్రియః — ఇంద్రియములు; జ్ఞానం — అలౌకిక జ్ఞానం; లబ్ధ్వా — పొందిన తరువాత; పరాం — అత్యున్నత; శాంతిం — శాంతి; అచిరేణ — తక్షణమే; అధిగచ్ఛతి — పొందును
తాత్పర్యము :
గాఢమైన శ్రద్ధావిశ్వాసాలు కలవారు మరియు తమ మనో-ఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసము చేసినవారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్ఠమైన అలౌకిక జ్ఞానంతో వారు అతిత్వరగా శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు.
వివరణ:
శ్రీ కృష్ణుడు ఇప్పుడు జ్ఞాన విషయంలో, శ్రద్ధావిశ్వాసాలను పరిచయం చేస్తున్నాడు. అన్ని ఆధ్యాత్మిక సత్యాలూ తక్షణమే అర్థం కావు; కొన్నింటిని ఆధ్యాత్మిక పథంలో ఉన్నతమైన స్థాయి చేరుకున్న తరువాతే అనుభవించగలము. మనం ప్రస్తుతం అర్థం చేసుకోగలిగే లేదా పరీక్షించగలిగే విషయాలనే ఒప్పుకుంటే, ఉన్నతమైన ఆధ్యాత్మిక రహస్యాలను అందుకోలేము. మనం ప్రస్తుత సమయంలో అర్థం చేసుకోలేనివాటిని ఒప్పుకోవటానికి విశ్వాసము/నమ్మకము అనేవి చాలా సహకరిస్తాయి. జగద్గురు శంకరాచార్యులు, శ్రద్ధ అన్న పదాన్ని ఈ క్రింది విధంగా నిర్వచించారు:
గురు వేదాంత వాక్యేషు దృఢో విశ్వాసః శ్రద్ధాః
‘గురువు మరియు శాస్త్రముల పట్ల దృఢ విశ్వాసమునే శ్రద్ధ అంటారు.’ ఒకవేళ ఇలాంటి శ్రద్ధ తప్పుడు వ్యక్తి మీద పెడితే, అది భయానక పరిణామాలకు దారితీయవచ్చు. కానీ అదే శ్రద్ధ ఒక నిజమైన గురువు మీద పెడితే అది శాశ్వత సంక్షేమం దిశగా మనలను తీస్కువెళుతుంది.
అదే సమయంలో, గుడ్డి విశ్వాసం మంచిది కాదు. ఏదో ఒక గురువు మీద అటువంటి శ్రద్ధ ఉంచే ముందు, మన బుద్ధిని ఉపయోగించి ఆ గురువు పరమ సత్యాన్ని ఎఱిఁగినవాడని, మరియు దానిని ఆయన వేద ప్రమాణంగా ఉపదేశిస్తున్నాడని నిర్ధారణ చేసుకోవాలి. దీనిని నిశ్చయించుకున్న తరువాత, ఇటువంటి గురువు మీద మన నమ్మకాన్ని పెంచుకోవటానికి కృషిచేయాలి మరియు వారి మార్గదర్శకత్వంలో భగవంతునికి శరణాగతి చేయాలి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటుంది:
యస్య దేవే పరా భక్తిః యథా దేవే తథా గురౌ,
తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః (6.23)
‘గురువు మరియు భగవంతుని పట్ల భక్తిపై నిస్సంకోచమైన దృఢమైన విశ్వాసం కలవారికి వేదముల జ్ఞాన సారం, వారి హృదయంలో తెలియచేయబడుతుంది.’
పాదారవింద శతకం - 2*
*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*పాదారవింద శతకం - 2*
*శ్లోకము - 06*
*యయోః పీఠాయంతే విబుధముకుటీనాం పటలికా*
*యయోః సౌధాయంతే స్వయముదయభాజో భణితయః ।*
*యయోః దాసాయంతే సరసిజభవాద్యాశ్చరణయోః*
*తయోర్మే కామాక్ష్యా దినమను వరీవర్తు హృదయమ్ ॥*
*భావము :*
*సకల దేవతల కిరీటములు అమ్మకు పాదపీఠముగా ఏర్పడినాయి. చతుర్వేదముల సారమే అమ్మ పాదములు. కమలములోనుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు అమ్మకు దాసానుదాసులు. అట్టి అమ్మ పాదయుగళమందు నా హృదయము నిత్యనివాసముండుగాక!*
🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
మంగళవారం రాశి ఫలితాలు
శ్రీ గురుభ్యోనమః 🙏
09-06-2026 మంగళవారం రాశి ఫలితాలు
మేషం
ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. పనులు చకచకా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.
---------------------------------------
వృషభం
ప్రయాణాల మధ్యలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దైవచింతన కలుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. వ్యాపారాలు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు.
---------------------------------------
మిధునం
బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహమున బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.
---------------------------------------
కర్కాటకం
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.
---------------------------------------
సింహం
ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.
---------------------------------------
కన్య
నూతన ఉద్యోగ యోగం ఉన్నది. కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణబాధలు తొలగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి.
---------------------------------------
తుల
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.
---------------------------------------
వృశ్చికం
ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అధిక శ్రమతో కానీ పనులు పూర్తి కావు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
---------------------------------------
ధనస్సు
సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
---------------------------------------
మకరం
వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాలలో శ్రమ మరింత అధికం అవుతుంది.
---------------------------------------
కుంభం
బంధువుల నుండి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
---------------------------------------
మీనం
నూతన ఋణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.
---------------------------------------
దర్శించగలిగితే
*కుంచమో...*
*ఒక వైశ్యునికి శివుడంటే మహాప్రీతి. కాని వ్యాపారకారణానికి ఎప్పుడూ బోర్లించని కుంచం బోర్లించి వచ్చినవారితో మాట్లాడుతూ తెల్లని బియ్యాన్ని తీసుకుని తడిపి పక్కన ఉంచుకుని, వాటితో కుంచాన్ని శివలింగంగా భావించి,*
*ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః*
*ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః*
*ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః*
*ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః*
*ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః*
*ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః*
*ఓం శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః*
*ఓం జ్వలాయ నమః ఓం జ్వలలింగాయ నమః*
*ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః*
*ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః*
*ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః*
*అంటూ శివనామాలతో పూజ చేస్తుండేవాడు. కొన్నాళ్ళకు అది శివలింగమైపోయింది.*
*****************
*మేక పెంటికయొ...*
*మేకలు కాచుకునే ఒక భక్తుడికి, ఒకసారి శివాలయంలో వేదమంత్రాలతో అర్చకులు అభిషేకం చేస్తుంటే, తాను కూడా శివలింగానికి అలా అభిషేకం చెయ్యాలని కోరిక కలిగింది.*
*మేకల పాలుతీసి శివలింగమెలా? అని ఆలోచిస్తూ వెళుతుంటే, ఒక మేక, పెంటికలు గుత్తిగా విడిచి పెడుతున్నది. అందులోనుండి దొర్లి దొర్లి ఒక పెంటిక నిలబడి ఉంది. అతనికి అది శివలింగం వలె కనపడి, అతను మేక పాలను ఆవుపాలవలె భక్తితో ‘శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ’ అంటూ దాని మీద పోసేసాడు. అతని భక్తికి ఆ మేక పెంటిక శివలింగమైంది.*
*కాటం అంటే మేక పెంటిక. కాటంలో నుండి పుట్టాడు కనక కాటేశ్వరుడయ్యాడు. క్రమంగా మోటుగా ఉందని కోటేశ్వరుడు అయ్యాడు.*
*సందేహముల్ మాన్పినా కన్నారన్ భవదీయ మూర్తి సగుణాకారంబుగా జూపవే!*
*’భక్తికి ఇంత లొంగిపోయావు కదా ఈశ్వరా! నిన్నెక్కడ ఉన్నావని చెప్పను? ఎలా అభిషేకం చెయ్యను? నిన్ను చూడాలని ఉంది, కనపడవా?’ అని ధూర్జటి గుండెలు బాదుకుని ఏడ్చాడు.*
*శివుడు మోక్షమిచ్చి, సమస్తమైన కోర్కెలు తీర్చగలిగినవాడు. శివుడు శివుడే, శివలింగం శివలింగమే. అటువంటి మహానుభావుడు అనంతః అపవర్గప్రదః - ఆయన మోక్షం ఇవ్వగలవాడు. మృడః - సమస్తమైన కోరికలూ తీర్చకలిగినవాడు.*
*ఎక్కడ లేడు...*
*అన్నింటా ఉన్నాడు...*
*దర్శించగలిగితే.....*
