బ్రహ్మవిత్ బ్రహ్మెవ భవతి
భ్రహ్మను తెలుసు కున్సవాడు భ్రహ్మె అవుతున్నాడు.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
లవకుశలు పుట్టినది కోలార్ జిల్లాలోనే..!!
సీతను రాముడు అడవులకు పంపడం, అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఆమె లవకుశులకు జన్మనివ్వడం, తర్వాత అశ్వమేధయాగ సమయంలో రామలక్ష్మణులతో లవకుశులు యుద్ధంచేయడం రామాయణంలో మనకు బాగా తెలిసిన ఘట్టాలే. ఆనాడు సీతమ్మతల్లి ఉన్న చోటు ఇదేనని కర్ణాటక రాష్ట్రం ఆవని వాసులంటారు. దానికి చాలా ఆనవాళ్లే చూపిస్తారు.
సీతమ్మతల్లికి గుళ్లు ఉండటం బాగా అరుదనే చెప్పాలి. శివుడు లేకుండా పార్వతినీ, రాముడు లేకుండా సీతనూ దేవాలయాల్లో చూడటం, వీళ్లిద్దరినీ ఒకే గర్భగుడిలో దర్శించడం ఇంకా అరుదు. కర్ణాటక రాష్ట్రం, కోలారు జిల్లా, ముల్‌బాగల్ తాలూకాలోని ఆవని అలాంటి పుణ్యక్షేత్రం. ఇక్కడి కొండమీద పార్వతీ సీతమ్మలను పక్కపక్కన దర్శించొచ్చు. ఇక్కడే రామలక్ష్మణులూ, భరతశత్రుఘ్నులతో పాటు సుగ్రీవాది వానరులూ తమ తమ పేర్లతో శివలింగాలను ప్రతిష్ఠించారు. వాల్మీకి తపస్సు చేసిన గుహనీ ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా ఆవనిలోని ప్రతి అణువూ పరమ పవిత్రమే.
రామాయణ కాలంలో గర్భవతైన సీతమ్మను రాముడి ఆజ్ఞ మేరకు అడవుల్లో వదులుతాడు లక్ష్మణుడు. తర్వాత ఆమె వాల్మీకి ముని ఆశ్రమానికి చేరుతుంది. సీతమ్మను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు వాల్మీకి మహర్షి. ఆశ్రమంలోనే లవకుశులకు జన్మనిస్తుంది సీత. లవకుశులు అక్కడే పెరుగుతూ సకల విద్యలనూ అభ్యసిస్తారు. అప్పుడు ఆశ్రమం దగ్గరలోనే ఓ చోట సీతమ్మ పార్వతీదేవిని పూజించేదట. తర్వాత రాముడు అశ్వమేధయాగం చేస్తాడు. అప్పుడు వదిలిన గుర్రాన్ని లవకుశులు కట్టేయడంతో రాముడూ ఆయన సోదరులకీ, లవకుశులకూ మధ్య యుద్ధం జరుగుతుంది.
ఆ తర్వాత విషయం తెలుసుకున్న రామభద్రుడు కన్నబిడ్డల మీద యుద్ధానికి దిగినందుకు ఎంతో వ్యధ చెందుతాడు. ఈ పాపానికి పరిహారంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సహా వానరులూ రామ పరివారమంతా అక్కడే శివలింగాలను ప్రతిష్ఠించి ప్రార్థిస్తారు. ఉత్తర రామాయణంలోని ఈ ఘట్టం జరిగిన చోటు ఇదేనని ఆవని స్థలపురాణంలో తెలుస్తోంది. అప్పుడు రాముడు ప్రతిష్ఠించిన లింగమే రామలింగేశ్వర స్వామిగా ఆవనిలో పూజలందుకుంటోంది.
లక్ష్మణేశ్వర లింగమూ, భరత శత్రుఘ్నులు ప్రతిష్ఠించిన లింగాలనూ మనం ఇప్పటికీ దర్శించొచ్చు. నిజానికి ఆవనిలో మొత్తం 1100 దాకా శివలింగాలుండేవట. తురుష్కుల దండయాత్ర కారణంగా ఇప్పుడు వీటిలో కొన్నే మిగిలి ఉన్నాయి. ఆవనిలోని శివలింగాలకు చోళరాజులు గుళ్లు కట్టించారు. పల్లవులూ, విజయనగర రాజులూ వీటిని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం దేవాలయం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది.
సీతమ్మ ఆనవాళ్లు!
సీతాదేవి పూజించినట్టుగా చెబుతున్న పార్వతీదేవి స్వయంభూ విగ్రహాన్ని ఇప్పుడు కూడా ఆవని కొండమీద ఉన్న సీతా పార్వతి ఆలయంలో చూడొచ్చు. తొలుత ఈ గుళ్లొ పార్వతీ దేవి మాత్రమే ఉండేదట. ఒకసారి ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు ఆయనకు ఆదిశక్తి కలలో కనిపించి తన విగ్రహం పక్కనే సీతాదేవి విగ్రహాన్నీ ప్రతిష్ఠించమని చెప్పిందట. శంకరులు దాన్ని శిరసావహించారు.
ఇక్కడి కొండ మీద వాల్మీకి తపస్సు చేసుకున్న గుహగా పిలిచే ఓ గుహను మనం చూడొచ్చు. లవకుశుల జన్మప్రదేశం, పవళించిన తొట్టె, ఉగ్గుగిన్నె, పసుపు కుంకుమ గిన్నెలు, నీళ్లు కాచే కాగు తదితరాల శిలామయ చిహ్నాలు ఇక్కడ కనిపిస్తాయి. సీతాదేవి బట్టలుతికిన బావి, స్నానం చేసిన కొలను, రామచంద్రుడితో లవకుశులు యుద్ధం చేస్తున్నారని తెలిసి ఆమె దుఃఖించిన చోటు తదితరాలుగా చెప్పే కొన్ని ప్రదేశాలూ దర్శనమిస్తాయి.
కొండమీద లవకుశులు, బృహస్పతి, జాంబవంతుడు, ఆంజనేయుడు ప్రతిష్ఠించిన లింగాలకు చిన్న గుళ్లున్నాయి. అడవిలోకి వెళ్లినప్పుడు సీత దాహం వేస్తోందనడంతో లక్ష్మణుడు ఒక బాణం వేసి కొలనును సృష్టించాడట. దాన్నే ధనుష్కోటిగా పిలుస్తారు. కొండ మీద చాలా కొలనులున్నాయి.
కలియుగంలో తీర్థాలు దుష్టసంపర్కం వల్ల కలుషితమవుతాయి అని భూమి మీద తీర్థాల్లో స్నానమాచరిస్తున్న దేవతలతో అన్నాడట బృహస్పతి. అందుకు ఏదైనా నివారణను సూచించమని దేవతలు అడగడంతో ఆవని క్షేత్రానికి కలిదోషం అంటదని చెప్పాడట. అందుకే తీర్థాభిమాన దేవతలంతా ఇక్కడి కోనేరుల్లో ఉంటారని చెబుతారు.
రుషిధామం...!
ఈ ఆవని క్షేత్రం ఒకప్పుడు నైమిశారణ్య ప్రాంతంలో ఉండేదట. ఇక్కడ యోగనిష్ఠాగరిష్ఠులైన అగస్త్య, కౌశిక, కణ్వ, మార్కండేయ, కపిల, గౌతమ, భరద్వాజ తదితర 2800 మంది మునులు నివసించారట. ఇక్కడ వీరంతా హావని యజ్ఞాన్ని చేశారట. దాని పేరు మీదుగా ఈ చోటుకి ఆవని అనే పేరు వచ్చిందంటారు.
ఆవని క్షేత్రాన్ని ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు దర్శిస్తూ ఉంటారు. ఇక్కడి రామలింగేశ్వరుడికి శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. రథోత్సవం సహా పుష్పపల్లకీసేవ, అర్చకులు కలశాలను తలపై పెట్టుకుని నిర్వహించే గరిగ ఉత్సవాలకు వేలాది భక్తులు హాజరవుతారు. ఈ సమయంలో గిరి ప్రదక్షిణ ప్రాధాన్యం సంతరించుకుంటుంది.
తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై ముల్‌బాగల్‌లో దిగి అక్కడి నుంచి 12 కి.మీ ప్రయాణించి ఆవని క్షేత్రాన్ని చేరుకోవచ్చు.
Sri Siva Maha Puranam -- 19 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
నాగేశ్వర జ్యోతిర్లింగము
యామ్యే సదంగే నగరేతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై
సద్భక్తి ముక్తిప్రదమీశమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే!!
సద్భక్తిని, ముక్తిని రెండింటిని ఇవ్వగలిగిన నాగనాథునికి నమస్కరించుచున్నాను. ఇక్కడ నాగ నాథుడు అంటే విశేషమయిన పూజనీయుడని అర్థం. అటువంటి నాగనాథునికి నేను శరణాగతి చేయుచున్నాను. ఈ నాగనాథ లింగము ఆవిర్భావమునకు వెనక ఉండే కారణమును ఒక విషయమును పరిశీలనం చేయాలి. శివారాధన రాక్షసులు, ప్రమథగణములు, మహాభక్తులు, భూతప్రేతాది గణములు చేస్తారు. శివారాధనమును జ్ఞానమును, ఐశ్వర్యమును అపేక్షించేటటువంటి వారు చేస్తారు. ఆపద పోవాలనుకుంటున్న వాళ్ళు శివాభిషేకం చేస్తారు.
దారుకుడు, దారుకి రాక్షస దంపతులు. వారికి బోలెడంత సంతానం ఉన్నది. వాళ్ళు ఒకనాడు ఒక సముద్రతీరమునకు చేరారు. వీరు చాలామందిని హింసించారు. ఒకానొకప్పుడు అందరి ప్రజలని బాధపెడుతూ భగవద్భక్తుల జోలికి కూడా వెళ్ళారు. ఆ భక్తులు ఔర్వుడనే మహర్షి పాదములు పట్టుకుని ఆయనను శరణాగతి చేశారు. ఔర్వుడు గొప్ప తపశ్శక్తి కలవాడు. ‘వాళ్ళు వాళ్ళ ఉద్ధతిని మార్చుకుని మంచిగా జీవితం గడిపినట్లయితే ఫరవాలేదు. వాళ్ళ ప్రవృత్తిని మార్చుకోలేము అనుకున్నప్పుడు వాళ్ళు భూమండలం మీద ఎక్కడా ఉండకూడదు. భూమండలం మీద ఎక్కడయినా రాక్షస ప్రవృత్తి కలిగినవాడు ఉన్నట్లయితే వారు ఉత్తరక్షణం మరణిస్తాడు. ఇదే నా శాపం’ అని ఔర్వుడు అభయం ఇచ్చాడు. తపశ్శక్తి కలిగిన వాడి వాక్కు బ్రహ్మాస్త్రం అయి కూర్చుంటుంది. ఈవార్త రాక్షసులకు తెలిసింది వాళ్లకి తాము బ్రతకడం ఎలా అనే బెంగపట్టుకుంది. దారుకి ‘నేను పార్వతీదేవి గురించి ఎప్పుడో ఒకసారి తపస్సు చేసాను. శాంభవి నాకు ప్రత్యక్షమయి ఒక గొప్ప వరం ఇచ్చింది. దాని వలన నేను నా వారిని ఎక్కడయినా పెట్టి బ్రతికించగలను. ఔర్వుడు మనలను భూమి మీద కదా ఉండవద్దని శాపం ఇచ్చాడు. మనందరం సముద్రం మీద ఉందాము. ఆవిడ ఇచ్చిన తపశ్శక్తితో మిమ్మల్నందరిని నేను రక్షిస్తాను పదండి’ అన్నది. దారుకి సూచనను అనుసరించి రాక్షసులందరూ సముద్రం మీద పడ్డారు. ఆ సముద్రంలో వాళ్ళు సముద్రం మీద ఓడలలో ప్రయాణించే వారిని పట్టుకుని వారిని చెరపట్టి హింసించి బాధిస్తూ ఆనందిస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు.
సముద్రం మీద ఓడలో వెళుతున్న వారిలో సుప్రియుడు అనబడే ఒక వైశ్యుడు ఉన్నాడు. భక్తికి కులంతో సంబంధం లేదు. రాక్షస దంపతులు సుప్రియుడిని పట్టుకున్నారు. సుప్రియుడికి దాసదాసీజనం ఉన్నారు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన ఒక్కడినీ తీసుకు వెళ్లి కారాగారంలో పెట్టారు. ఆయన ఇవన్నీ ఉండడం, పోవడం ఈశ్వరేచ్ఛ. నాకు ఈశ్వరుడు చాలు అన్నాడు. ఆయన కారాగారంలో ఉన్న ధూళినంతా పోగేస్తే ఒక చిన్న శివలింగం అయింది. దానిమీద చుక్క నీరు పోసి పార్థివలింగం చేశాడు. ఆరాధన చేయడం ప్రారంభించాడు. రాక్షసులు ఆరాధనకు అడ్డుపడ్డారు. నువ్వు శివారాధన చేయకూడదు, శివ అనే నామం చెప్పినా, శివున్ని ఆరాధన చేసినా, ధ్యానంలో కూర్చున్నా, భగవంతుని స్మరిస్తున్నావన్న అనుమానం ఏమాత్రం నాకు కలిగినా నీ శిరస్సు త్రుంచేస్తాము అన్నారు. అంటే ఆయన – ‘నేను ఒక్కనాటికి శివారాధన మానను. నన్ను రక్షించేవాడు శంకరుడు. నా తల త్రుంచడానికి ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాని చేతిలో నీ తల త్రుంచకలిగిన వాడు నా తండ్రి అని నాకు నమ్మకం ఉంది. నేను ఆయన పాదములు పట్టుకున్నాను అన్నాడు. వెంటనే రాక్షసుడు కత్తినొకదానిని తీసుకుని అపారమయిన ఉగ్రరూపంతో సుప్రియుడి కంఠమును నరికె య్యబోయాడు. ఆ సమయమునకు సుప్రియుడు ఈశ్వరుని పరమ భక్తితో శరణాగతి చేస్తున్నాడు. రెండు చేతులతో పరమేశ్వరునికి నమస్కారం చేశాడు. అలా చేసేసరికి ఈయన ఆరాధన చేస్తున్న పార్థివలింగంలోంచి ఒక్కసారి పరమశివుడు ఆవిర్భవించాడు. రుద్రరూపంతో ఆవిర్భవించి త్రిశూలం పెట్టి దారుకుడిని దెబ్బకొట్టడం వాడు పారిపోవడం ఆయన ఉగ్రమయిన దృష్టికి కొన్ని వందలమంది రాక్షసులు బూడిద కుప్పలై పడిపోవడం ఏకకాలమునందు జరిగిపోయాయి. చిత్రమేమిటంటే ఆ వచ్చిన పరమశివుని అర్థభాగమందు పార్వతీదేవి ఉన్నది. ఆవిడ గబుక్కున శివుని చేయి పట్టుకుని తనవారిని తాను రక్షించుకునే శక్తి ఇమ్మని దారుకి అడిగింది. ఆమెకు అటువంటి శక్తి కలిగేలా నేను ఆమెకు వరం ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇలా కాల్చేస్తే నా వరం ఏమవ్వాలి? ఆవిడ నాకు భక్తురాలు. మీరు నామీద ప్రేమతో ఆమెయందు అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి’ అన్నది.
వెంటనే శివుడు శంకరుడు అయి ఒక నవ్వు నవ్వి ‘పార్వతీ నిజమే. ఆవిడకి నీవు వరం ఇచ్చావు. కానీ వాళ్ళు రాక్షసులు. నేను వీళ్ళని విడిచిపెడితే వీళ్ళు మరల దుర్మార్గపు పనులు చేయడం మొదలుపెడతారు. వీళ్ళు మరల ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసే నిమిత్తం నేను ఇక్కడే జ్యోతిర్లింగరూపంలో కూర్చుంటాను. నీవు కూడా నీవలన బతుకున్నామని వాళ్లకి గుర్తు ఉండడానికి అమ్మవారి రూపంలో ఇక్కడే కూర్చో. నేను నాగనాథుడనే పేరుతో వెలుస్తాను. ఈశ్వరీ! నువ్వు నాగేశ్వరీ అనే పేరుతో వెలవవలసింది’ అన్నాడు. ఆవిధంగా ఇద్దరూ ఆ తటమునందు జ్యోతిర్లింగమై వెలిశారు.
ఎవరయినా వారి దర్శనం చేస్తే వారికి జన్మ జన్మలయందు పార్వతీ పరమేశ్వరుల పాదపద్మముల యందు చెక్కుచెదరని భక్తి ప్రపత్తులు కలిగేలా అనుగ్రహిస్తానని స్వామి శపథం చేసి చెప్పి నాగనాథుడిగా ఆ తీరమునందు వెలసి ఉన్నాడు. నాగనాథ క్షేత్రమునకు తప్పకుండా వెళ్ళాలి. మనస్సును నిగ్రహించి ఈశ్వరుని వైపు పెట్టడం అలవాటు అవడం అనే భక్తి ముహూర్తముల వలన రాదు. నాగనాథుడు భక్తిగా ఉండడం ఈశ్వరానుగ్రహం. భక్తి అంటే ఏమిటో సరిగ్గా తెలియడం ఈశ్వరానుగ్రహం. సరిగ్గా తెలిసిన భక్తియందు మనస్సు నిలబడడం ఈశ్వరానుగ్రహం. అటువంటి అనుగ్రహమును తన దర్శనమాత్రం చేత ఇస్తానన్నాడు.
పూర్వం పెద్దలు మనలను తీర్థయాత్రలు చేయమని ప్రోత్సహించేవారు. తీర్థయాత్ర చేసేముందు వెడుతున్న ఆ క్షేత్రం వైశిష్ట్యం తెలియాలి. తీర్థయాత్రలు చేసినప్పుడు ఆయా క్షేత్రములకు వెళ్లినపుడు వాటిని గురించి తెలుసుకుని ఆయా క్షేత్రములలో ఏ శ్లోకమును చెప్పాలో ఆ శ్లోకమును చెప్పి ఏది భగవంతుని అడగాలో దానిని అక్కడ అడగాలి. అంతేగానీ వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చాము అనుకోవడం వలన ఉపయోగం లేదు. క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు దానికి తగిన పనిని మీరు చేసి వస్తుండాలి. ఒకవేళ అలా చేయడం తెలియకపోయినా మన అమాయకత్వం చేత ఈశ్వరుడు దానిని పరిపూర్ణం చేస్తూ ఉంటాడు. ఈశ్వరశక్తియందు అదికూడా ఉంటుంది.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
భక్తి
🍁🍁🍁🍁
భక్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది.. ఐశ్వర్య భక్తి మరియు మాధుర్య భక్తి.
ఐశ్వర్య భక్తిలో భక్తుడు భగవంతుని యొక్క సర్వశక్తి తత్వాన్ని ధ్యానం చేస్తూ భక్తి లో నిమగ్న మవుతాడు. ఐశ్వర్య భక్తిలో ప్రధానంగా ఉండే భావము గౌరవము
మరియు భక్తిపూర్వక భయము. ఇటువంటి భక్తిలో, భగవంతుని నుండి దూరంగా ఉండే భావన మరియు ప్రవర్తనలో ఎలాంటి లోపాలు లేకుండా ఉంటటం అనేవి ముఖ్యముగా ఉంటాయి.
ద్వారకా వాసులు మరియు అయోధ్య వాసులు ఈ యొక్క ఐశ్వర్య భక్తికి ఉదాహరణలు; వారు శ్రీ కృష్ణుడిని మరియు శ్రీ రాముడిని తమ మాహారాజులుగా కొలిచారు.
సామాన్య ప్రజలు తమ రాజుగారి పట్ల చాలా మర్యాద మరియు అణకువ తో ఉంటారు, కానీ వారు రాజుగారి పట్ల సాన్నిహిత్య భావనలో ఉండలేరు.
మాధుర్య భక్తి లో భక్తుడు భగవంతునితో అన్యోన్యమైన వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరుచుకుంటాడు.
దీనిలో ప్రధానంగా ఉండే భావన ఏమిటంటే, "శ్రీ కృష్ణుడు నా వాడు మరియు నేను ఆయనకే చెందిన వాడిని" అని. కృష్ణుడిని తమ తోటి స్నేహితునిగా ప్రేమించిన బృందావన గోప బాలురు, శ్రీకృష్ణుడిని తమ బిడ్డలా ప్రేమించిన యశోద మాత మరియు నందబాబా, తమ ప్రియుడిగా కృష్ణుడిని ప్రేమించిన గోపికలు, మాధుర్య భక్తికి ఉదాహరణలు. మాధుర్య భక్తి అనేది ఐశ్వర్య భక్తి కంటే అనంతమైన రెట్లు ఉన్నతమైనది.
:
సబఇ సరస రస ద్వారికా, మథురా అరు బ్రజ మాహీఁ
మధుర, మధురతర, మధురతమ, రస బ్రజరస సమ నాహీఁ
(భక్తి శతకం, 70వ శ్లోకం)
"భగవంతుని యొక్క దివ్య ఆనందము అన్ని రూపాల్లో కూడా అత్యంత మధురమైనది. అయినా అందులోకూడా స్థాయిలు ఉన్నాయి - ఆయన యొక్క ద్వారకా లీలల ఆనందము మధురమైనది, ఆయన యొక్క మథురా లీలల ఆనందము ఇంకా మధురమైనది, మరియు, ఆయన యొక్క వ్రజ (బృందావన) లీలల ఆనందము అత్యంత మధురమైనది."
మాధుర్య భక్తిలో, భక్తులు భగవంతుని యొక్క పరమేశ్వర తత్వాన్ని మర్చిపోయి, శ్రీ కృష్ణుడి పట్ల నాలుగు రకాల అనుబంధాలను పెంచుకుంటారు:
దాస్య భావము — శ్రీ కృష్ణుడు నా స్వామి మరియు నేను ఆయన యొక్క సేవకుడిని, అని. శీ కృష్ణుడి వ్యక్తిగత సేవకులైన రక్తకుడు, పత్రకుడు వంటి వారి భక్తి ఈ దాస్య భావములో ఉంది.
భగవంతుడు మన తండ్రి లేదా తల్లి అనేది ఈ యొక్క భావన యొక్క రూపాంతరామే, అది దీనిలో భాగమే.
సఖ్య భావము — శ్రీ కృష్ణుడు మన స్నేహితుడు (సఖుడు) మరియు నేను ఆయన యొక్క సన్నిహిత సఖుడను. శ్రీదాముడు, మధుమంగళుడు, దంసుఖుడు, మనుష్కుడు వంటి బృందావన గోప బాలుర యొక్క భక్తి ఈ సఖ్య భావ కోవకు చెందినది.
వాత్సల్య భావం — శ్రీ కృష్ణుడు మన బిడ్డ మరియు నేను ఆయన తల్లి/తండ్రిని. యశోద మరియు నంద బాబాల యొక్క భక్తి ఈ వాత్సల్య భావము లోనిది.
మాధుర్య భావము — శ్రీ కృష్ణుడు మాచే ప్రేమింపబడిన వాడు మరియు నేను అతని ప్రియురాలిని. బృందావన గోపికల యొక్క భక్తి ఈ మాధుర్య భావము లో ఉన్నది.
అర్జునుడు సఖ్య భావములో ఉన్న ఒక భక్తుడు మరియు భగవంతునితో సుహృద్భావంగల సంభంధాన్ని ఆస్వాదించేవాడు. భగవంతుని యొక్క విశ్వ రూపాన్ని చూసిన పిదప, అర్జునుడు మహోన్నతమైన ఆశ్చర్యానికి మరియు పూజ్య భావానికి లోనయ్యాడు, అయినా తను ఎప్పుడూ అనుభవించే సఖ్య భావము యొక్క మాధుర్యాన్నే కోరుకున్నాడు. కాబట్టి, ఆయన ఇప్పుడు చూస్తున్న విశ్వరూపమును ఉపసంహారించి మరలా మానవ స్వరూపాన్ని చూపించమని కృష్ణుడిని ప్రార్ధించాడు.
🍁🍁🍁🍁
*అంభి:-*
*విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది*
◆విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతు ఉంటాడు. నరక బాధలు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మం లో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము. మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి అని శాస్త్రము చేప్తోంది, కాని ఈ కాలము లో అలాగ చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి పోతాయని పెద్దల వాక్కు.
◆ఈ భస్మ ధారణ చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాలలో.
◆బ్రాహ్మణ, క్షత్రీయులు “మానస్తోకే మంత్రము ” తో, వైశ్యులు ” త్ర్యయంబక ” మంత్రము తో , ఇతరులు శివపంచాక్షరి తో భస్మ ధారణ చెయాలి. ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది.
◆మహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని “శాంతికము ” అని అంటారు. షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని “పౌష్ఠికం” అని అంటారు. బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని “కామదం” అని అంటారు..
◆భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి.
◆యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచిన అగ్నితో గాని, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండము లో వేసి హోమము చెయ్యాలి. అనంతరం శుబ్ర్హమైన పాత్రలో విభుతిని నింపాలి.
*ఆధ్యాత్మిక జీవనము*
*రాజయోగము*
మనస్సులో ఇంద్రియార్థాల గురించి వచ్చే ఆలోచనలను నిగ్రహించి, మనస్సును ఉన్నతమైన మార్గంలో పయనించేలా చేయడమే దీనిలోని ముఖ్యమైన సాధన.
అత్యధిక సంఖ్యాకులకు ఇది ఒక అసంభవమైన అధ్భుత కృత్యం. ఈ సాధన చెయ్యడానికి ముందుగా శరీరాన్ని సమాయత్తం చేయాలి. అలా చెయ్యకుండా సాధన చేయడం వలన విపరీతమైన పరిణామాలు కలుగవచ్చును.
కాబట్టి యోగ శాస్త్ర నిర్మాతలలో ముఖ్యుడైన పతంజలి దీనిని క్రమంగా హెచ్చుతూ పోయే అనుక్రమణిక రూపంలో తయారుచేశాడు. సామాజికంగానూ, వ్యక్తిగతంగానూ *యమ, నియమ* అనే నైతిక విలువల అనుష్టానం మొదట్లో చేయాలి.
అహింస, సత్యపాలన, బ్రహ్మచర్యం, అస్తేయం, అపరిగ్రహం అనే విలువలను ఎల్లప్పుడూ పాటించాలి. శారీరక, మానసిక పరిశుభ్రతలను పాటిస్తూ, ఆత్మ సంతృప్తితో మన మీద మనం ఆధారపడడాన్ని నేర్చుకోవాలి.
ఆధ్యాత్మిక గ్రంథపఠనం, అలా పఠించిన భావాలను చింతన చేసి జీర్ణించుకోవడం, కర్మఫలాలను సంపూర్ణంగా భగవదర్పితం చేయడం సాధన చేయాలి.
*శుభంభూయాత్*
వివేక, వైరాగ్య, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం అనే సాధన చతుష్టయ సంపత్తి గలవాడే బ్రహ్మవిద్యకీ అర్హుడు
సాధనా చతుష్టయం సామ్యమెఱిగి వింతలన్నీ మదిలోన విడచినపుడే మంతనంబగు గురుభక్తి మహిమయగును
పరిపూర్ణ /పరబ్రహ్మ/ పరమాత్మ నామరూపాలు గుణధర్మాలు లింగబేధాలు షడ్వికారాలు లేనిది.
ధర్మ సంస్థాపనకై (జివోద్ధరణకై) యోగమాయచే ఒకరూపంతో అవతరించును .
అవతరించిన రూపమే పరమాత్మ అని భ్రమపడరాదు
అవతారాల వెనకున్న మహాచైతన్యం పరమాత్మ. అటువంటి పరమాత్మ తత్వమనేది సుక్స్మాతి సూక్ష్మమైనది, అవజ్ఞమానస గోచరమైనది, మాటలకి, మహిమాలకి, మాయలకి అందనిది. కేవలం నిర్వికల్ప సమాధిలో, స్వానుభవంలోనే అవగతమవుతుంది తప్ప అన్యధా అసాధ్యం .
సకల విద్యల సిద్ధాంతాల సారము గమ్యము పరమాత్మ నిత్యసత్యమై ఉన్నకాని, ఏమి లేనిది పరమాత్మ సర్వము తానైనది పరమాత్మ
ఆత్మస్వరూపమైనది పరమాత్మ
తెలియనంత వరకే బ్రహ్మవిద్య.
తెలిసిపోతే కోతివిద్యా. తెలుసుకుంటే బ్రహ్మవిద్య. లోకవాసన దేహవాసనలూ తొలగును అవిద్య తెలియకపోతే బ్రహ్మవిద్య వృధాయే లోకవిద్య. స్వానుభూతి చెందితే బ్రహ్మవిద్య బ్రహ్మమే తానై
బ్రహ్మవిత్ బ్రహ్మెవ భవతి
బ్రహ్మానందం కలుగును .
నోటిద్వారం ప్రపంచం ముక్కు ద్వారం పరమపదం తన్ను తానెరగడమే బ్రహ్మవిద్య.
బ్రహ్మవిద్యని ఎరిగినవాడే వివేకధనవంతుడు బ్రహ్మవిద్యని ఎరగనివాడే అజ్ఞానబీదవాడు ఉన్నదొక్కటే బ్రహ్మము. అదే నిత్యసత్యము.
లేని యెరుకే జీవజగదీశులు, సృష్టి స్థితి లయాలు.
గాఢనిద్రలో దేహేంద్రియ మనో బుద్ధులు పడిపోతాయి. ప్రారబ్దవశమున ఉదయం మేలుకోగానే లేస్తాయి. పగలంతా వాటిని వాడుకుంటూ తిరిగి మళ్ళీ రాత్రవగానే పడేస్తాం. ఒకరోజు లేవకుండా పొతే అదే మరణం. జననం మరణం అనేవి
దేహానికి మాత్రమే నీ స్వరూపమైన కేవలమైన ఆత్మకి జననమరణాలు లేవు.
నజాయతే మ్రియతే
అది పుట్టదు పెరగదు గిట్టదు వంటి షడ్వికారాలు లేనిది. దేహంలో ఉన్నా కానీ దేహాతీతమైనది. సూక్ష్మాతి సూక్ష్మా మైనది. అణువుకన్నా అణువు పరమాణువులాంటిది ఇంద్రియగోచరం కానిది . ఒకయోగి మాత్రమే దేహేంద్రియ మనో బుద్ధులను చక్కగా వాహనాన్ని నడిపే వాడిలాగా ఈ దేహేంద్రియ మనో బుద్ధులనే పరికరాలను ఎక్కడ ఏది వాడాలో దాన్ని వాడుకుంటూ వాటి అవసరం లేనపుడు పడేస్తాడు.
🌷🌷🕉🌷🌷🕉🌷🌷🕉🌷🌷🕉
పసి(డి) మనసులు
బాల్యం అమూల్యం. అది తెలి మీగడ తరకలా, వెండి వెన్నెలంత ఆహ్లాదకరమైనది. అది అందరూ అనుభవించే దేవుడిచ్చిన వరం. అభం, శుభం తెలియని పసి(డి) మనసుల పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వు లాంటిది. అమ్మ ఒడి బడిలో నిర్భీతిగా ఒదుగుతూ ఎదిగేది బాల్యం. అమ్మ ఒడిలోనే ప్రాథమిక విద్యాభ్యాసానికి శ్రీకారం. అమ్మ పాలతోపాటు ఆమెలోని సద్గుణాలు, ఉన్నత ఆదర్శాలు గ్రోలడమే పిల్లలకు అసలైన విద్యాభ్యాసం. తల్లి బిడ్డను పెంచే తీరులోనే వారి భవిష్యత్తు నిర్ణయమవుతుంది.
భారతీయ సంస్కృతిలోని దేవతలు, త్యాగమయ జీవితాలు, ఇతిహాసాల గురించి కథలు, పాటల ద్వారా భువనేశ్వరీ దేవి నరేంద్రుడికి చెప్పేది. ముఖ్యంగా ఆమె చెప్పిన రామాయణ, భారత కథలు ఆ పసి హృదయంలో చెరగని ముద్ర వేశాయి. ‘జీవితంలో నేను సాధించిన వాటన్నింటికీ నా తల్లికి నేను రుణపడి ఉన్నాను’ అన్నారు వివేకానంద.
పూర్వకాలంలో ఇంట్లో పెద్దవారు పిల్లలకు మానవ సంబంధాలు, వావివరసలు, విలువలు, సాహసోపేత కథల గురించి చెప్పేవారు, అవి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నింపేవి.
వీధి గాయకులు బుర్రకథ, హరికథ వంటి రూపాలలో చారిత్రక సత్యాలను, రామాయణ, భారత కథలను, వీరగాథలను సరళమైన పద్ధతిలో గానం చేస్తూ భిక్షాటన సాగించేవారు. చిన్న పిల్లలకు ఇవి ప్రాథమిక విద్యలో ఓ భాగంగా చోటు చేసుకునేవి. ఇంట్లో పిల్లలకు ప్రేమ, మానసికంగా ఊతమిచ్చే ఆనందభరితమైన వాతావరణం ఉండాలి.
పిల్లలకు ఇంట్లో దొరికే ప్రేమ, నాణ్యతలను బట్టి వారి శారీరక, మానసిక ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయి.
పిల్లలు భగవంతుడు లోకానికి ఇచ్చిన కానుకలు. వాళ్లను పెంచి పెద్దచేయడం, ప్రేమగా చూసుకోవడం ఓ అందమైన బాధ్యత. వారిని కొంతకాలమే మన దగ్గర ఉండే అందమైన బహుమతులుగా భావించాలి. పొట్లపాదుకు కాసిన ప్రతి కాయా తిన్నగా పెరగదు. కొన్ని వంకరగా ఉంటాయి. వాటిని గుర్తించి చిన్న రాయి కడితే చాలు- అవి తిన్నగా పెరుగుతాయి.
‘పిల్లలకు ప్రేమ పంచండి... మీ ఆలోచనలు కాదు. వారి ఆలోచనలు వాళ్లకు ఉంటాయి. వికసించనీయండి. పిల్లల శరీరాలకు ఆవాసం కల్పించండి... వారి ఆత్మలకు కాదు. వాళ్ల ఆత్మలు రేపటి ఇంట్లో ఉంటాయి. అక్కడికి మీరు కలలో కూడా వెళ్లలేరు. కానీ మీరు పిల్లల్లా ఉండటానికి ప్రయత్నించవచ్చు. జీవితం వెనక్కి నడవదని, నిన్నటితో నిలిచిపోదని గుర్తించండి. మీరు ఒక విల్లు అయితే- దాన్నుంచి దూసుకుపోయే బాణాలు మీ పిల్లలు’ అంటారు ఖలీల్ జిబ్రాన్. పిల్లలకు తల్లితో సమానమైన స్నేహితులు గానీ, తండ్రితో సమానమైన గురువు గానీ ఉండరు. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో సత్సంబంధాలు ఉన్నప్పుడే అవి అనంతంగా అభేద్యంగా నిలుస్తాయి.
మనదేశంలో ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజున జరుపుకొంటాం. నెహ్రూకు పిల్లలంటే అమితమైన ఇష్టం.
‘మట్టి ముద్ద లాంటి చిన్నారుల్ని బంగారు ముద్దల్లా మలచే బాధ్యతను తల్లిదండ్రులు, అధ్యాపకులు సక్రమంగా నిర్వర్తించినప్పుడే- దేశం గర్వించే భావి భారత పౌరులు తయారవుతారు’ అన్న నెహ్రూ వ్యాఖ్యలు అక్షరసత్యాలు.
ఈనాడు అంతర్యామి
✍ఎం.వెంకటేశ్వర రావు
*నిజమైన గుర్తింపు సాధనం*
ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు.
రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు.
కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు.
అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు.
రాజు చాలా ఆశ్చర్యపోయాడు.
అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు - “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది.
దీనిని ఆవు పాలు పోసి పెంచామ”ని చెప్పాడు.
రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు- “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు.
రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది.
అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు, ఉదారంగా పంపించాడు.
అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు.
కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు... అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణి లాగానే ఉన్నాయి. కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు.” అని..
రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు.
అప్పుడు అత్తగారు అన్నది- “నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు. కానీ మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచసంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నాము.
రాజు మళ్లీ తన ఉద్యోగిని అడిగాడు, “నీకు ఎట్లా తెలిసింది?” అని. అతను చెప్పాడు- “రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది.
ఒక రాణి స్తాయి వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది రాణిగారిలో ఎక్కడా లేదు....
రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియమించుకున్నాడు
కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు.
ఉద్యోగి, “నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను.” అని అన్నాడు.
రాజు మాట ఇచ్చాడు. అతడు, “మీరు రాజూ కాదు, రాజు కొడుకూ కాదు. మీ వ్యవహారం రాజు లాగా లేదు.” అని అన్నాడు.
రాజుకు చాలా కోపం వచ్చింది.
కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు.
తల్లి అన్నది- “ఇది నిజమే నాయనా. నువ్వు ఒక రైతు కొడుకువు.
మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకుని పెంచుకున్నాము.” అని.
రాజా ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ విషయం ఎట్లా తెలుసు?” అని అడిగాడు.
అప్పుడు ఉద్యోగి- “రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు. కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకిస్తున్నారు.
ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది.” అన్నాడు...
మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తీ ఉన్నా ఇదంతా బయటికి కనిపించడానికే!
*మనిషి నిజమైన గుర్తింపు సాధనం అతడి వ్యవహారమే.*
రామాయణమ్ 123
సుతీక్ష్ణ మహాముని ఆశ్రమాన్నుండి నాలుగు యోజనాల దూరం ఉన్నది అగస్త్య భ్రాత ఆశ్రమము .మార్గమంతా కడు రమణీయంగా ఉంది .
.
దూరంగా పిప్పలి వనం కనబడుతున్నది వారికి ,
ఫల పుష్పాల బరువుతో వంగిన వేలకొద్ది చెట్లు కనబడ్డాయి.గాలి బాగా వీచినప్పుడల్లా పండిన పిప్పళ్ళ వెగటైన వాసన వస్తున్నది.
.
లక్ష్మణా! ముని చెప్పినట్లుగా మనము అగస్త్యభ్రాత ఆశ్రమానికి వచ్చినట్లుగా ఉంది. బహుశా ఇది ఆయన ఆశ్రమమే అయి ఉండవచ్చు అని లోనికి ప్రవేశించారు .
.
లక్ష్మణా! ఒకప్పుడు వాతాపి,ఇల్వలుడు అనే క్రూరమైన రాక్షసులు ఇద్దరు ఉండేవారు. వాళ్ళు చాలా బలవంతులు
.
.వాళ్ళు బ్రాహ్మణులను చంపి తింటూ ఉండే వారు. బ్రాహ్మణులను చంపటానికి వారు ఒక ప్రత్యేకమైన మార్గం ఎంచుకున్నారు.
.
ప్రతిరోజూ ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి తద్దినానికి భోక్తలుగా రమ్మన్నట్లుగా ఒక నిర్దుష్టమైన భాషలో బ్రాహ్మణులను ఆహ్వానిస్తుండేవాడు,
.
వాతాపి మేక రూపం ధరించే వాడు. ఆ మేక మాంసం బ్రాహ్మణులకు శ్రాద్ధ భోజనంగా వడ్డించేవాడు ఇల్వలుడు.
.
ఆ భోజనం బ్రాహ్మణులారగించిన వెంటనే
వాతాపీ బయటకురా ! అని అరిచేవాడు ఇల్వలుడు. బ్రాహ్మణుల పొట్టలు బద్దలుకొట్టుకొంటూ వాతాపి బయటకు వచ్చేవాడు .
.
ఆ విధంగా ఎన్నో వేలమంది బ్రాహ్మణుల బ్రతుకులు బుగ్గిపాలు చేసారు సోదరులిద్దరూ.
.
ఈ విషయం అగస్త్య మహామునికి తెలిసి స్వయంగా ఆయనే ఒక రోజు భోక్తగా వెళ్ళాడు. ఎప్పటిలాగే వాతాపి ఆహారరూపంలో అగస్త్యుడి కడుపులోకి వెళ్ళాడు..రోజుటిలాగే ఇల్వలుడు అరిచాడు ,
వాతాపీ బయటకు రా అని ,అగస్త్యమహర్షి నవ్వుతూ ఇంకెక్కడి వాతాపి వాడేప్పుడో నా కడుపులో జీర్ణమయ్యాడు అని అన్నాడు .
.
ఇల్వలుడికి కోపం వచ్చి మహర్షి మీదికి దూక బోతే ఆయన చూపు వాడిని భస్మం చేసేసింది.
అంతటి మహామహిమాన్వితుడు అగస్త్యమహర్షి అని చెప్పాడు రామచంద్రుడు..
.
NB.
.
చిన్న పిల్లలకు అజీర్ణం వస్తే వారి పొట్ట నిమురుతూ మన పెద్దలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేది అందుకే
.
జానకిరామారావు వూటుకూరు
*ఈ క్రిందివి ముందు జాగ్రత్త కోసము పెడుతున్నాను. ప్రస్తుతము మనకేమి భయము లేదు. కానీ ఇవి కొన్ని రోజులు పాటిస్తే మంచిది.*
*1) AC Buses లో తిరగకండి.*
*2) దూర ప్రయాణాలు Trains లో చేయకండి.*
*3) జనసమ్మర్థమైన హోటల్స్ కు వెళ్ళకండి.*
*4) తీర్ధ యాత్రలకు, పెళ్లిళ్లకు మొదలైనవాటికి దూరంగా ఉండండి.*
*5) సినిమా హాళ్లకు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ వివిధ ప్రాంతాలనుండి వచ్చెమనుష్యులే కాక AC ఉంటుంది.*
*6) బాగా వండిన ఆహారము తినండి. పచ్చివి ఈ పరిస్థితుల్లో తినడము మంచిది కాదు.*
*7) హోటల్స్ లో టిఫిన్స్ కట్టేవాళ్ళు ఎక్కువగా ఉఫ్.. అని ఊది చెట్నీ కడతారు దాని వలన అతని లాలాజలము ద్వారా ఏదైనా రావచ్చు. కాబట్టి జాగ్రత్త.*
*8) ప్రయాణాలు చేసేటప్పుడు Seat కోసము ఎవరైనా కర్చీఫ్ ఇస్తే అది ముట్టుకోకండి. అది అతను ఏ విధముగ వాడాడో తెలియదు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వాడతారు.*
*9) చలి వేళల్లో ముఖ్యముగా మంచు వేళల్లో అసలు తిరగవద్దు. అలా తిరిగిన వైరస్ కు చల్లటి వాతావరణము చాలా అనుకూలం.*
*10) అందరూ మాస్క్ లు వేసుకొని బయటకు వెళ్ళండి.*
*కనీసము కర్చీఫ్స్ అయిన కట్టుకోండి. తులసి, ఆడించిన పసుపు, కాచిన నీళ్లలో కర్చీఫ్స్ లేదా మాస్క్ లు వేసి అరబెట్టి వాటిని వాడండి.*
*11) అదేవిధముగా తులసి, ఆడించిన పసుపు నీళ్లలో కాచిన వాటికి కొంచెం వెల్లుల్లి రసము లేదా అల్లము రసము వేసి ఉదయము కొంచెం తీసుకోండి.*
*అదేవిధముగా మిరియాల పాలు కచ్ఛితముగా పిల్లలకు ఇవ్వండి. పాలు దొరికితే పెద్దవారు స్యాంత్రము త్రాగండి. ఇలా చేసినా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.*
*12) ఇళ్లల్లో కూడా పరిస్థితులను బట్టి A.C లను వాడకండి. పరిస్తితులను బట్టి అనుమానం వస్తే ఏమి అర్దరు చేయకండి. అన్ని కొని ఇంట్లో ఉంచుకోండి.*
*13) Shake Hands ఎవరికి ఇవ్వవద్దు. స్నేహితులు లేదా ప్రేమికులు కూడా బయట తిరగ వద్దు.* *చుట్టాల ఇళ్లకు వెళ్ళకండి. వీలైతే పెళ్లిళ్లు ఎండలు ముదిరాక పెట్టుకోండి. వీలైతే చేతులకు Gloves వాడండి.*
*14) మీ పిల్లలు చదివే స్కూల్స్, కాలేజ్ లకు వేలు, లక్షలు fees కడుతున్నారు కదా.. దయచేసి వాష్ rooms లాంటివి పేరెంట్స్ చెక్ చేయండి.*
*15) బలహీనంగా ఉన్న వారు బయట అసలు తిరగవద్దు. ప్రయాణాలు అసలు చేయవద్దు.*
*16) ఎవరితో నైనా మాట్లాడేటప్పుడు కొంచెం దూరముగా ఉండి మాట్లాడండి.*
*17) బయటకు వెళ్లి వచ్చే వాళ్లు, ఇంటిలోకి వెళ్లే ముందు కాళ్ళు, చేతులు శుభ్రముగా కడుక్కోండి.*
*18) బార్స్ కు వెళ్ళేవాళ్ళు జాగ్రత్త. అక్కడ వివిధ ప్రాంతాలనుండి వచ్చే వాళ్లు ఉంటారు. మీరు ఇంటికి ఏ ప్రమాదం తెస్తారో... ఆలోజించండి. మీరు మత్తులో ఏమి తింటున్నారో.. ఎవరితో మాట్లాడుతున్నారో.*
*19) పరిస్థితులను బట్టి లాడ్జిలలో ఉండటం కూడా కొంత కాలం మానండి.*
*20) కాచి చల్లార్చిన నీటిని వాడండి.*
*21) విమాన ప్రయాణము కూడా చేయవద్దు.*
గమనిక:-
*ఈ వ్యాధి నివారణకు ముఖ్యంగా యువతీ, యువకులు సహకరించి... ఈ Message ని అందరికీ షేర్ చేయండి. కరోనా వైరస్ను మన దేశంలో నించి తరిమేద్ధాం...👆👍🤝🙏
ప్రతి రోజూ ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం….
🙏 దీపం - తేజస్సు యొక్క తత్వానికి ప్రతీక. రోజూ
రెండు సార్లు అంటే ఉదయం సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయంలో (సంధ్యాకాలంలో) తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మ స్వరూపం. మనలో కూడా నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూనే ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.
🙏 అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.
🙏 ఇక దీపం వెలిగించిన ప్రమిద బంగారంది కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపూ, కుంకుమా చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పండుగ రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.)
🙏 దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండూ లేదా మూడు వత్తులైనా వేయాలి. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతా స్వరూపమైన
ఆ దీపానికి నమస్కరించాలి.
🙏 ఏ ఇంట్లో నిత్యం రెండు పూటలా దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
🙏 ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.
🙏 తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మా! మేము తమస్సు (చీకటి) నుంచి వెలుగులోకి వెళ్ళెదము గాక!.
జై శ్రీ కృష్ణ...
దయచేసి నేను పంపించిన విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి.
👉 మీ నారాయణం వెంకటరెడ్డి 👈
90590 34010
*విద్య* మరియు *అవిద్య*
👉 నారదమహర్షి ఎల్లప్పుడూ వీణను మీటుతూ విష్ణు నామాన్ని కీర్తిస్తూ ఉంటాడు. వీణ అంటే తంతులు లేదా తీగలు బిగించబడ్డ వాద్య పరికరం. విద్యా దేవత అయిన సరస్వతి కూడా వీణను ధరించి ఉంటుంది. ఆమెను 'వీణా పాణి' అని కూడా అంటారు. నేటికీ మన దేశంలో విద్యార్థులు సరస్వతీ దేవిని తమ విద్యాభివృద్ధి కోసం పూజిస్తారు.
👉 భక్తులు కూడా తమ ఆద్యాత్మిక ఙ్ఞానంతో ప్రగతిని సాధించడం కోసం సరస్వతిని - నారద మునిని సేవిస్తారు. 'సరస్వతి' అంటే 'ఙ్ఞానము' అని కూడా అర్థము. మన వైష్ణవాచార్యులలో ఒకరైన భక్తి సిద్ధాంత సరస్వతి.. ఙ్ఞానాన్ని సూచించే లాగా తన దీక్షా నామాన్ని స్వీకరించారు. ఙ్ఞానము రెండు విధాలుగా ఉంటుంది, అవిద్య మరియు విద్య.
👉 పరతత్త్వమును గుర్తించడానికి ఉపయోగపడేది నిజమైన విద్య దీనిని బ్రహ్మ - విద్య అంటారు. అది కాకుండా మనము నేర్చుకునే ఐహికమైన చదువులన్నిటినీ 'అవిద్య' అంటారు. దీని వలన వ్యక్తులు తాత్కాలిక ప్రయోజనాన్ని అందించే
పేరు ప్రతిష్ఠలను, ఇంద్రియ తృప్తిని పొందగలుగుతారు. ఎందుకంటే...భౌతికమైన తృప్తిని పొందడానికి.. చాలా శ్రమ పడితేనే తప్ప వాళ్ళు ఆనందంగా ఉండలేరు. అందువలన అందరూ శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే యదార్థమైన ఙ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి.
*ఓం నమఃశివాయ*
#కార్తీక_మాసంలో_ఏ_తిథి_రోజున_ఏం_చేయాలి..?🙏🌷
దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే #కార్తీక_మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి...
న కార్తీక సమో మాసో
న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం
న దేవః కేశవాత్పరః
అంటే #కార్తీక_మాసం లోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం...
కార్తీక శుద్ధ పాడ్యమి : తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి గుడికి వెళ్లాలి.. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.
విదియ : సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.
తదియ : అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.
చవితి : నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.
పంచమి : దీనిని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.
షష్ఠి : ఈరోజున బ్రహ్మచారి అర్చకునికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
సప్తమి : ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.
అష్టమి : ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.
నవమి : నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.
దశమి : నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.
ఏకాదశి : దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.
ద్వాదశి : ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.
త్రయోదశి : సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.
చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.
#కార్తీక_పూర్ణిమ : కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.
కార్తీక బహుళ పాడ్యమి : ఆకుకూర దానం చేస్తే మంచిది.
విదియ : వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.
తదియ : పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.
చవితి : రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.
పంచమి :చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.
షష్ఠి : గ్రామదేవతలకు పూజ చేయాలి.
సప్తమి : జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.
అష్టమి : కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.
నవమి : వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.
దశమి : అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.
ఏకాదశి : విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
ద్వాదశి : అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.
త్రయోదశి : ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.
చతుర్దశి : ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.
అమావాస్య : పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.
🌷🙏హర హర మహాదేవ🙏🌷
*ఒక్కడే..అతనొక్కడే*
ఒక్కడిగా మొదలయ్యాడు కోట్ల మందికి స్పూర్తిగా నిలిచాడు. నిండా పాతికేళ్లు కూడా లేని వయసులో అభాగ్యుల ఆకలి గురించి ఆలోచించాడు. అనుకున్న దారిలో అడుగు వేశాడు. కోట్ల మంది ఆకలి తీర్చి హీరో అయ్యాడు.
అతనే అంకిత్ కవాత్రా.
దేశ రాజధానిలో మొదలైన అతని ప్రయాణం దేశంలోని 43 నగరాలకు, పట్టణాలకు విస్తరించింది.
పెళ్ళిలో పడిన తొలి అడుగు…
ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి, విలాసవంతమైన జీవితం గడుపున్న ఓ కుర్రాడు అకస్మాత్తుగా అనార్ధుల ఆకలి గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. దానికి తొలి అడుగు పడింది కూడా ఓ పెళ్ళిలో.
2014 ఆగస్టులో అంకిత్ ఓ సెలెబ్రెటీ పెళ్ళికి వెళ్ళాడు. పెళ్ళికి వచ్చిన అతిధులకు అద్భుతమైన విందు ఏర్పాట్లు చేశారు. దాదాపు 35 రకాల వంటలు చేశారు. భోజనం చేస్తుండగా క్యాటరింగ్ అతనితో మాటా మాటా కలిపాడు.
ఎంతమంది వచ్చారని అడిగితే.. క్యాటరింగ్ అతను “వెయ్యి మందే సర్.. కానీ వంటలు మాత్రం 5వేల మందికి చేయించారు” అని చెప్పాడు. 4వేల మంది తినే ఆహారం వృధా అయిపోతుండడంతో అంకిత్ కళ్ళు చెమ్మగిల్లాయి.
రోడ్డు మీద ఆకలితో అలమటించే వాళ్ళంతా తన కళ్ల ముందు కనిపించినట్టైంది అతనికి. వెంటనే తేరుకుని ఇక మీదడ ఎక్కడైనా ఫంక్షన్‌లో భోజనం వృధా అయితే తనకి ఫోన్ చెయ్యమని క్యాటరింగ్ అతనికి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు.
పెళ్లి జరిగిన వారం తిరిగే లోపే అంకిత్‌కి క్యాటరింగ్ అబ్బాయి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వెంటనే తన స్నేహితుడిని తీసుకుని పెద్ద పాత్రలను తన కారులో వేసుకుని వెళ్ళాడు. అక్కడ మిగిలిన ఆహారాన్ని తీసుకుని నేరుగా దగ్గరలోని మురికి వాడకి పోనిచ్చాడు.
ఆకలి బాధతో అలాగే పడుకుని ఉన్న వారందరినీ తట్టి లేపాడు. కడుపు నిండా భోజనం పెట్టాడు. వారి కళ్ళల్లో సంతోషాన్ని చూసి తన కర్తవ్యం ఏంటో తెలుసుకున్నాడు. మరుసటి రోజే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆశయం వైపు అడుగులు వేశాడు.
ఒకవేళ ఆశించిన దానికంటే ఎక్కువ భోజనం వస్తే ఎలా అని ఆలోచించాడు. దాన్ని వృధా అవ్వకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాడు.
వెంటనే అన్ని క్యాంటీన్లు, రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటళ్లు, కంపెనీల వద్దకి వెళ్ళి భోజనం మిగిలితే తనకు ఫోన్ చెయ్యమని అర్ధించాడు.
అర్ధం చేసుకున్నవాళ్లు ఖచ్చితంగా ఫోన్ చేస్తామని చెప్పి అతన్ని మెచ్చుకున్నారు. అర్ధం చేసుకోలేని మూర్ఖులు మాత్రం అవమానించి పంపేశారు. మరి కొందరైతే ప్లేట్‌కి ఇంత అని కొంత డబ్బు ఇస్తేనే ఇస్తామన్నారు.
కార్యాచరణ మొదలయ్యింది…
కాళ్లా వేళ్ళా పడి మిగిలిన ఆహారాన్ని ఇచ్చే కొందరిని సంపాదించాడు. అప్పటి వరకూ తాను కూడబెట్టిన డబ్బుని తీసుకుని ఆహారం నిల్వ ఉండే వాహనం కొనాలనుకున్నాడు. అంకిత్ అంకిత భావాన్ని చూసిన కొందరు దాతలు అతనికి సాయం చెయ్యడంతో వెంటనే 24 గంటలూ ఆహారం నిల్వ ఉంచగలిగే రిఫ్రిజిరేటెడ్ వాహనం కొన్నాడు.
తన ఆశయాన్ని స్నేహితులతో, గతంలో పని చేసిన సహ ఉద్యోగులతో పంచుకున్నాడు. మానవత్వం ఉన్నవారు అంకిత్‌కి చేయూతనిచ్చారు.
‘ఫీడ్ ఇండియా’గా ఉద్యమించాడు..
తాను ఉద్యోగానికి రాజీనామా చేసి మూడు నెలలు గడిచే లోపే ‘ఫీడ్ ఇండియా’ అనే సంస్థ స్థాపించాడు.
ఎక్కడ ఆహారం వృధా అవుతుందని తెలిసినా వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఆహారాన్ని అనాధాశ్రమాల్లోనూ, వృద్ధాశ్రమాల్లోనూ, ప్రభుత్వ పాఠశాలల్లోనూ, రోడ్డుపై ఆకలితో ఉన్నవారికీ, వికలాంగులకు నేరుగా అందించ సాగాడు.
తాను చేసే సేవకి త్వరగానే గుర్తింపు వచ్చింది. వెంటనే ‘డొనేషన్ డ్రైవ్స్’ కార్యక్రమాలు నిర్వహించి వాటికి ఫుడ్ బ్లాగర్లను, పెద్ద పెద్ద రెస్టారెంట్ ఓనర్లను, బుల్లితెర తారలను పిలిచి అందరికీ తెలిసేలా ప్రచారం చేసేవాడు.
సోషల్ మీడియాని కూడా విపరీతంగా వాడి ప్రచారం చేసేవాడు. మూడేళ్లలోనే ‘ఫీడ్ ఇండియా’ 43 నగరాలకు, పట్టణాలకు వ్యాప్తి చెందింది.
ఒక్కడిగా మొదలై వేలమందితో…
ఒక్కడిగా అడుగేసిన అంకిత్ తనలాంటి భావాలే ఉన్న ప్రతి వ్యక్తిని తనతో కలుపుకున్నాడు. ఇప్పుడు ప్రతి రోజూ 2వేలకి పైగా తనతో భాగస్వాములవుతున్నారు.
★2030నాటికి ఆకలి లేని భారతాన్ని చూడాలనే కలతో పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నారు. వృధాగా మిగిలిన ఆహారం చెత్త కుప్పల పాలై దుర్వాసన వస్తూ వ్యాధులు రాకుండా ఆపుతున్నారు.
మిథేన్ వాయువు విడుదలయ్యే #గ్లోబల్ వార్మింగ్ జరగకుండా అడ్డుకుంటున్నారు.
ప్రపంచ దేశాలకు సెలెబ్రెటీ..
ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన- 2030’ కార్యమానికి 186 దేశాల నుండి సుమారు 18000 మండి పోటీ పడగా అందులో అంకిత్ ఎంపికయ్యాడు.
వందలమంది ప్రపంచ దేశాల నాయకుల మధ్యలో ఆకలి లేని భారతాన్ని ఎలా నిర్మించాలో ఉపన్యాసం చెప్పాడు.
సామాజిక సేవతో పని చేస్తున్న 30ఏళ్ల లోపు యువత కోసం ఓ ప్రముఖ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలోనూ అంకిత్‌కు గౌరవ స్థానం దక్కింది.
బ్రిటన్ రాణి తన సింహాసనాన్ని అధిష్టించి 60
ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సామాజిక సేవ చేస్తున్న 30 ఏళ్ల లోపు యువకుల్ని పురస్కరించాలనుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వారు ఎంపిక చేసిన 60మంది యువకుల్లో మన అంకిత్ కూడా ఉన్నాడు.
రాణీ ఎలిజబెత్ చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూసేలా చేసిన అంకిత్ అంకిత భావాన్నీ మెచ్చుకోకుండా ఉండగలమా…
మరెందరో అంకిత్‌లు దేశం కోసం ముందుకి రావాలని ఆశిస్తూ, అంకిత్‌లా సమాజ సేవ చేసే ప్రతి ఒక్కరినీ అభినందించి చేయూతనిద్దాం.
------ సుభాషితాలు --------------
అంభోజాకరమధ్య నూతన నలిన్యాలింగన క్రీడ నా
రంభుం డైన వెలుంగుఱేని చెలువారన్ వచ్చి, నీటన్ గుభుల్
గుంభద్ధ్వానముతోఁ గొలంకును కలంకం బొందఁగా జొచ్చి, దు
ష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై.
భావము:- ఇలా పంపగానే, చక్రాయుధం సరోవరంలోని లేలేత పద్మాలని కౌగలించుకోడానికి వెళ్తున్న సూర్యబింబంలా వెళ్ళింది. గుభిల్లు గుభిల్లనే పెద్ద చప్పుడుతో మడుగు కలచిపోయేలా లోపలికి దూకింది. రివ్వున మనో వేగంతో ఆ చెడ్డదైన మొసలి ఉన్న చోటు సమీపించింది.
అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడు గదా, శ్రీ కాళహస్తీశ్వరా!
ఆలోచించినచో ఈ జగత్తంతా మాయేకదా! మానవుడా సంగతి తెలిసీ కూడా, భార్య, పుత్రులు, ధనము, తన శరీరము అన్నీ శాశ్వతము అని భావించి మోహము పొందుచూ, జీవనమునకు పరమార్థభూతుడవైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైననూ ధ్యానించడు కదా! ఎంత అజ్ఞానము.
తెలియని కార్యమెల్లఁగడతేర్చుట కొక్కవివేకి జేకొనన్
వలయునట్లైన దిద్దుకొనవచ్చుఁబ్రయోజనమాంద్యమేమియుం
గలుగదు ఫాలమందు దిలకం బిడునప్పుడు చేతనద్దమున్
గలిగిన జక్క జేసికొనుగాదె నరుం డది చూచి భాస్కరా!
తాత్పర్యం: భాస్కరా! మనుజుడు నుదుటి యందు బొట్టును పెట్టుకొనుచూ చేతి యందు అద్దముతో బొట్టును వంకర టింకర లేకుండా సరిచేసుకొనును. అలాగే నేర్పరి వద్దకెళ్ళి పనులను చక్కదిద్దుకొని సంతోషాతిశయమును తెలివిగలవాడు పొందునని భావం.
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ.
భావం: శత్రువుల సంహరించినవాడవు, గరుత్మంతుడు వాహనముగ గలవాడవు, ఆపదల బోగొట్టువాడవు, రంగనాధునిచే సేవింపబడిన వాడవు, దయతో నొప్పు మనస్సుగలవాడవు, సత్సంగుడవు, సీతాహృదయమును పద్మమునకు తుమ్మెదవంటివాడవు, రాక్షసులకు బీభత్స కరుడవు, శుభాంగుడవునైన భద్రాచల రామా!
శ్రోత్రం శ్రుతి నైవ న కుండలేన
దానేన పాణిర్నతు కంకణే న
విభూతి కాయః ఖలు సజ్జనానాం
పరోపకారేణ న చందనేన
అర్థము:-- సజ్జనులు చెవులను కుండలములు ధరించుటకు గాక వేద శాస్త్రములు విని సార్థక మొనరించు కుందురు. చేతులను కంకణ ములను ధరించుటకు గాక దానము చేయుటకు ఉపయోగింతురు. శరీరమును చందనాదుల పూతలచే గాక పరోపకారము చేయుట చేతనే ప్రకాశిం ప జేసు కొందురు.
నాస్తి విద్యాసమం చక్షు:
నాస్తి సత్యసమం తప:
నాస్తి రాగసమం దు:ఖం
నాస్తి త్యాగసమం సుఖం.
అర్థం:విద్యనూ పోలిన కళ్ళు, సత్యమును పోలిన తపము,
మాత్సర్యము వంటి దు:ఖ కరము ,త్యాగమును పోలిన సుఖమును లేవు.
తనయుడు చెడుగై యుండిన
జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!
తా:--ఓ కుమారా! కొడుకు చెడ్డవాడైన తండ్రి తప్ప. ఇది అందరకు తెలిసినదే. గావున ఈ సత్యమును గుర్తెరింగి నీ తల్లిదండ్రులకు చెడ్డపేరు రాకుండునట్లు నడుచుకొనుము
భీతేభ్యః శ్చా భయం దేయం : వ్యాధి తేభ్య స్తు ఔషధం :
దేయా విద్యార్థి నాం విద్యా : దేయ మన్నం క్షుధార్థి నాం :
అర్థము: భయము చెందిన వారీకి అభయ దానము, రోగ పీడితులకు
ఔషధ దానము, విద్యార్ధు లకు విద్యా దానము, ఆకలి గొన్న వారికి అన్నదానము యిచ్చుట పుణ్య ప్రదము.
చెరుకు రసంబునకన్ననును జేడెల కన్నను,తేనెకన్న,భా
సుర సుధకన్నదియ్యనైన చూత ఫలంబుల కన్న,ఖండ శ
ర్కర కన్న,ధాత్రి మధురమయి తోచు వివేకి యౌ మహా
సరసుని తోడ ముచ్చటలు సారెకు సల్పుచున్న భైరవా!
తా:--రుకురసము,ఆడవారిసాంగత్యము,తేనె,అమృతము,తియ్యనైన మామిడి పండ్లు,కలకండ వీటి అన్నిటికన్నా ప్రపంచములో వివేకి యైన సరసుని తో మాటి మాటికీ జరుపు గోష్టి చాలా తియ్యనైనది.
కొన్ని సంవత్సరాల క్రితం నేను చూసిన ఒక సంఘటన గుర్తొచ్చింది.
రైల్వే స్టేషన్ లో రైలు కోసం జనాలు ఎదురుచూస్తున్నారు.
ఒక మధ్య వయసు జంట పిల్లలతో ఒక బెంచ్ దగ్గర కూచున్నారు.
పక్కన ఒక వృద్ధ జంట కూచున్నారు.ఆయన ఎదో పుస్తకం చదువుతున్నారు.
ఎక్కడి వరకు వెళ్తున్నారు మాట కలిపాడు మద్య వయసాయన.
విజయవాడ వెళుతున్నాం.
మీరూ అడిగాడు ఆ వృద్ధుడు.
మేమూ విజయవాడ వరకే.
రిజర్వేషన్ వుందా అడిగాడు మద్యవయసాయన.
ఆ మా అబ్బాయి చేశాడు.S5 లో. చెప్పాడు పెద్దాయన.
అరే మాది కూడా S5. వాళ్ళ వి ఎదురెదురు సీట్లు అని తెలుసుకున్నారు.
'ఆ పుస్తకం ఏమిటండీ అడిగాడు' మద్యవయసాయన.
పుస్తకం అట్ట చూపిస్తూ *"రామాయణం"*
చెప్పాడు పెద్దాయన.
'ఇపుడు ఎంత వరకు చదివారు' అడిగాడు మధ్యవయసాయన.
'సీతా సమేతంగా రామ లక్ష్మణులు అడవికి వెళ్లారు. అక్కడ మద్యలో గుహుడు కలిశాడు.'
'ఆ అవన్నీ ఈ వయసులో ఇపుడు నాకు ఎందుకు లెండి రిటైర్ అయ్యాక తీరిక గా చదువుకుంట' అన్నాడు మద్యవయసాయాన.
ఆ వృద్ధుడు నవ్వి మళ్లీ పుస్తకం చదవటం లో మునిగిపోయాడు.
రైలు ఇక్కడ 3 నిమిషాలు మాత్రమే ఆగుతుంది.
జనాలు కాస్త ఎక్కువగానే వున్నారు.
త్వరగా రైలు ఎక్కేయలి
పిల్లలు, జాగ్రత్త, ఆ లగేజి అంతా ఒకేచోట పెట్టు.
అటు ఇటు వెళ్లకండి.
రైలు రాగానే జనాలు తోసుకుని వస్తారు.
బొమ్మల్లా కుచోకుండ న వెంటే రండి....
భార్య కీ ఆదేశాలు జారీ చేస్తున్నాడు మథ్యవయసాయన.
మరి కాసేపట్లో రైలు వచ్చింది.
లగేజీ తీసుకుని రా రా అలా నిలబడిపోతవేంటి అని భార్యను అరుస్తూ ముందుకు కదిలాడు మద్యవయసాయన.
జనాలని తోసుకుంటూ ముందు ఆయన ఎక్కేసాడు.
వెనకే భార్య పిల్లలు వస్తున్నారు లే అనుకున్నాడు.
తీరా ఎక్కి చూశాక భార్య, పిల్లలు కనపడలేదు,
లగేజి బెర్త్ మీద పెట్టి, పెద్దాయన కి లగేజి చూస్తుండండి అని చెప్పి వెనక్కి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి చూసాడు. *ఇంకా అతని భార్య పిల్లలు ఎక్కడం లోనే వున్నారు.*
అంతలో రైలు కూత పెట్టింది.
కసురుకుంటు భార్య చేయిని పట్టుకుని లోపలికి లాగేసాడు. పిల్లలని కూడా లోనికి లాగేసాడు.
ఇందుకే మిమ్మల్ని బయటికి తీసుకు రాను.
లోక జ్ఞానం లేదు, నీకు రైలు ఎక్కడం కూడా రాదా, నా వెంటే ఎక్కు అంటే వినపడద.
నిన్ను కాదు మి నాన్నని అనాలి. నిన్ను నాకు అంటగట్టారు అని గెట్టిగా అరుస్తున్నాడు.
రైలు కదిలింది.
కాసేపటికి ఆయన శాంతించాడు. వాళ్ళ ఎదురు బెర్త్ లో కూచున్న వృద్ధుడు మళ్లీ రామాయణం చదవటం మొదలు పెట్టాడు.
'ఎముందండి ఆ పుస్తకం లో ఎప్పుడో జరిగిందట, రాసారట, ఇంత technology వచ్చింది. ఇంకా ఆ పుస్తకం పట్టుకుని చదువుతున్నారు,' అన్నాడు మద్యవయసాయన.
పెద్దాయన అతని వైపు చూసి చిన్నగా నవ్వి,
"ఇందాక రైలు ఎక్కేపుడు మీరు ఎంత కంగారు పడ్డారు. మీ భార్య, పిల్లలు, లగేజీ ని రైలు ఎక్కించటానికి కాస్త ప్రయాస పడ్డారు.
నేను, నా భార్య కాస్త ముసలి వాళ్ళం అయిన కూడా మేము హడావిడి లేకుండా రైలు ఎక్కేసాం."
"ఫ్లాట్ ఫారం మీద వున్నపుడు మీరు అడిగారు, పుస్తకం ఏమిటి అని. నిజానికి నేను రామాయణం మొదటి సారి చదువుతున్నాను. సీతా సమేతంగా రామ లక్ష్మణులు అడవికి వెళ్లారు. అక్కడ మద్యలో గుహుడు కలిశాడు అని చెప్పాను."
"అవును, గుహుడు పడవలో వాళ్ళను ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు చేర్చాడు." అంతేగా అన్నాడు మద్యవయసాయన.
*"ఆ ఆ అంతే కాకపోతే, ముందుగా పడవని సీతమ్మ ఎక్కింది, తరువాత లక్ష్మణుడు ఎక్కాడు, ఆఖరున రాముడు ఎక్కాడు. తరువాత పడవ ముందుకు కదిలింది. ఈ వృత్తాంతం అంతా నేను ఫ్లాట్ ఫారం మీదనే చదివాను. ముందు మనల్ని నమ్ముకుని మనతో వచ్చిన వారిని బాగా చూసుకోవాలి. తరువాత మన గురించి మనం ఆలోచించాలి. అని దాని భావం. అందుకే రైలు ఎక్కెపుడు ముందు నా భార్యని ఎక్కించా, లగేజి తీసుకుని తన వెనక నేను ఎక్కేసా... మనం ఎలా బతకాలి అని ఏ technology మనకి చెప్పదు"* అన్నాడు పెద్దాయన.
మద్యవయసాయన కి తల కొట్టేసినట్టు అయింది.
మళ్లీ భార్యని ఒక్క మాట అనలేదు.
రైలు దిగే వరకు కామ్ గా కూచున్నాడు.
😀📖🙏👌
జై శ్రీరామ్.
మానవ జన్మ చాలా గొప్పనైనది ఈ జన్మ లొనే మనం పుణ్యాన్ని సమపార్జించుకొని ఉత్తమ జన్మలను కానీ తిరిగి జన్మ లేనటువంటి మోక్షసన్ని కానీ పొందుటము.
ఉడతా భక్తిగా మనం చిన్న ఉపకారం చేసినా రామచంద్రమూర్తి తలుచుకు తలుచుకొని వారిని ఉదరిస్తాడు మరి అలాంటిది తన బంటు అయిన హనుమంతుని దేవాలయానికి మనకి తోచిన సహాయం చేస్తే ఇక ఆ రామచంద్రమూర్తి రక్ష మనకు లభిస్తుంది.
మా పూర్వీకులు జొన్నలగడ్డ వంశానికి చెందినవారు గుంటూరు జిల్లా భర్తీపూడి లో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం నిర్మించారు.ఎంతో చక్కగా ఆలయంలో పూజలు అన్నీ నిర్వహిస్తూ వుంటారు.
ఇప్పుడు అందరి సంకల్పం అక్కడ స్వామి దేవాలయానికి ప్రహరీ గోడ నిర్మించాలని దానికి దాదాపు ఐదు లక్షల దాకా వ్యయం అవుతుంది.
మనమందరం స్వామి ప్రహరీ గోడకి సహాయం చేసమనుకోండి ఆ స్వామి మన ప్రహరీ గోడ చుట్టూ కాపలా వుండి మనకు రామరక్ష దొరికేట్టు చేస్తాడు.మనకి ఇప్పుడు కావాల్సింది అదే కదా!
మీరు ఎక్కువ ఏమి ఇవ్వక్కర్లేదు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 5 రూపాయలనుంచి మొదలు పెట్టి ఆ స్వామి మీ మనడులోకి దూరి ఎంత ఇప్పిస్తే అంత ఇవ్వండి చాలు భక్తిగా
మీరు క్రింద ఇస్తున్న అకౌంట్ నెంబర్ కి అయినా డబ్బు పంపచ్చు లేకపోతే మా గూగుల్ పే,మరియు ఫోన్ పే నంబర్లకు పంపచ్చు
మా ఫోన్ నెంబర్ 9948931150,అకౌంట్ హోల్డర్స్ నేమ్ జొన్నలగడ్డ జ్యోతి
సర్వేజనా సుఖినోభవంతు,
శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి
9948931150జై శ్రీరామ్.
మానవ జన్మ చాలా గొప్పనైనది ఈ జన్మ లొనే మనం పుణ్యాన్ని సమపార్జించుకొని ఉత్తమ జన్మలను కానీ తిరిగి జన్మ లేనటువంటి మోక్షసన్ని కానీ పొందుటము.
ఉడతా భక్తిగా మనం చిన్న ఉపకారం చేసినా రామచంద్రమూర్తి తలుచుకు తలుచుకొని వారిని ఉదరిస్తాడు మరి అలాంటిది తన బంటు అయిన హనుమంతుని దేవాలయానికి మనకి తోచిన సహాయం చేస్తే ఇక ఆ రామచంద్రమూర్తి రక్ష మనకు లభిస్తుంది.
మా పూర్వీకులు జొన్నలగడ్డ వంశానికి చెందినవారు గుంటూరు జిల్లా భర్తీపూడి లో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం నిర్మించారు.ఎంతో చక్కగా ఆలయంలో పూజలు అన్నీ నిర్వహిస్తూ వుంటారు.
ఇప్పుడు అందరి సంకల్పం అక్కడ స్వామి దేవాలయానికి ప్రహరీ గోడ నిర్మించాలని దానికి దాదాపు ఐదు లక్షల దాకా వ్యయం అవుతుంది.
మనమందరం స్వామి ప్రహరీ గోడకి సహాయం చేసమనుకోండి ఆ స్వామి మన ప్రహరీ గోడ చుట్టూ కాపలా వుండి మనకు రామరక్ష దొరికేట్టు చేస్తాడు.మనకి ఇప్పుడు కావాల్సింది అదే కదా!
మీరు ఎక్కువ ఏమి ఇవ్వక్కర్లేదు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 5 రూపాయలనుంచి మొదలు పెట్టి ఆ స్వామి మీ మనడులోకి దూరి ఎంత ఇప్పిస్తే అంత ఇవ్వండి చాలు భక్తిగా
మీరు క్రింద ఇస్తున్న అకౌంట్ నెంబర్ కి అయినా డబ్బు పంపచ్చు లేకపోతే మా గూగుల్ పే,మరియు ఫోన్ పే నంబర్లకు పంపచ్చు
మా ఫోన్ నెంబర్ 9948931150,అకౌంట్ హోల్డర్స్ నేమ్ జొన్నలగడ్డ జ్యోతి
సర్వేజనా సుఖినోభవంతు,
శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి
9948931150
**దశిక రాము**
**హిందూ ధర్మం** 84
(అక్రోధః)
కోపం ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది. సంబంధ భాంధవ్యాలను నాశనం చేస్తుంది. కోపిస్ఠి వ్యక్తి దగ్గరకు వెళ్ళడానికి భార్యాపిల్లలు కూడా ఇష్టపడరు. ఈయనతో ఏం చెప్పినా కసురుకుంటారని తమలో తామే అనుకుని, అతను ఎప్పుడు కోపం ప్రదర్శిస్తాడోనని భయపడుతూ, నిరంతరం చస్తూ బ్రతుకుతూ ఉంటారు. మిత్రులు, చుట్టాలు, దగ్గరివాళ్ళు కూడా చనువుగా ఉండడానికి ఇష్టపడరు. ఉదాహరణకు ఎంతదగ్గరివారైనా ఏదైనా ముక్యమైన శుభకార్యం మీద పిలవాల్సి వస్తే, వారం ముందు రండి ని చెప్పకుండా, శుభకార్యం రోజు తప్పకుండా రండి అంటారు. అతను ముందే వస్తే, ఎవరి మీద కసురుకుంటాడో, ఎక్కడ గొడవపడతాడోనని భయం. తెలిసితెలిసి ఆందోళన కొనితెచ్చుకోవడం ఎందుకను భావిస్తారు. ఎదైనా ఒక విషయం పంచుకుందామనుకున్నా, కోపిష్టి వ్యక్తితో పంచుకోరు. ఆయన అంతేనండి, ఆయనకు ఏం చెప్తే ఏం అంటాడో, ఎందుకొచ్చిన గొడవ, మౌనంగా ఉంటే సరిపోతుంది అనుకుంటారు. ఒక ఆఫీస్ యజమాని కోపంగా ఉంటే, ఆ రోజు ఆఫీస్ స్టాఫ్ మొత్తం బిక్కుబిక్కుమంటూ గడుపుతుంది. అదే అతను ఎప్పుడు కోపధారి అయితే, ఇక పరిస్థితి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
కోపం వల్ల వ్యక్తికి ఎంత చెడు జరుగుతుందో, అతని చుట్టుప్రక్కల ఉన్నవారికి అంతకంటే ఎక్కువ ఆందోళన కలుగుతుంది. కోపిష్టి వ్యక్తి ప్రశాంతంగా ఉండలేడు సరికదా ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగిస్తాడు. అటువంటి కోపాన్ని విడిచిపెట్టమని చెప్తున్నారు మహర్షులు. కోపం వచ్చిన ప్రతీసారీ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. నేను ఎప్పుడు తప్పు చేయలేదా? ఒకవేళ నేను ఈ తప్పు చేస్తే, ఇలాగే ప్రవర్తిస్తానా? అని ప్రశ్నలు వేసుకోవాలి. కోపం ఎప్పుడు బలహీనులకే వస్తుంది. బలవంతులు ఎప్పుడు కోపగించుకోరు, ఎందుకంటే ఓర్పు కలిగినవాడే నిజమైన బలవంతుడు.
కొన్ని సందర్భాల్లో కోపం ప్రదర్శించకపోతే పనులు జరగవు. అలాంటప్పుడు కోపం నటించాలే కానీ, కోపానికి గురి కాకూడదు. కోపం అనేదే ఒక దుర్గుణం. దుర్గుణాన్ని విడిచిపెట్టాలే కానీ అదుపు చేసుకోకూడదు అంటారు గురువులు. అక్రోధః - కోపం లేకుండుట - మనుమహర్షి ధర్మానికి చెప్పిన పది లక్షణాలలో ఒకటి.
తరువాయి భాగం రేపు......
🙏🙏🙏
సేకరణ**దశిక రాము**
**హిందూ ధర్మం** 84
(అక్రోధః)
కోపం ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది. సంబంధ భాంధవ్యాలను నాశనం చేస్తుంది. కోపిస్ఠి వ్యక్తి దగ్గరకు వెళ్ళడానికి భార్యాపిల్లలు కూడా ఇష్టపడరు. ఈయనతో ఏం చెప్పినా కసురుకుంటారని తమలో తామే అనుకుని, అతను ఎప్పుడు కోపం ప్రదర్శిస్తాడోనని భయపడుతూ, నిరంతరం చస్తూ బ్రతుకుతూ ఉంటారు. మిత్రులు, చుట్టాలు, దగ్గరివాళ్ళు కూడా చనువుగా ఉండడానికి ఇష్టపడరు. ఉదాహరణకు ఎంతదగ్గరివారైనా ఏదైనా ముక్యమైన శుభకార్యం మీద పిలవాల్సి వస్తే, వారం ముందు రండి ని చెప్పకుండా, శుభకార్యం రోజు తప్పకుండా రండి అంటారు. అతను ముందే వస్తే, ఎవరి మీద కసురుకుంటాడో, ఎక్కడ గొడవపడతాడోనని భయం. తెలిసితెలిసి ఆందోళన కొనితెచ్చుకోవడం ఎందుకను భావిస్తారు. ఎదైనా ఒక విషయం పంచుకుందామనుకున్నా, కోపిష్టి వ్యక్తితో పంచుకోరు. ఆయన అంతేనండి, ఆయనకు ఏం చెప్తే ఏం అంటాడో, ఎందుకొచ్చిన గొడవ, మౌనంగా ఉంటే సరిపోతుంది అనుకుంటారు. ఒక ఆఫీస్ యజమాని కోపంగా ఉంటే, ఆ రోజు ఆఫీస్ స్టాఫ్ మొత్తం బిక్కుబిక్కుమంటూ గడుపుతుంది. అదే అతను ఎప్పుడు కోపధారి అయితే, ఇక పరిస్థితి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
కోపం వల్ల వ్యక్తికి ఎంత చెడు జరుగుతుందో, అతని చుట్టుప్రక్కల ఉన్నవారికి అంతకంటే ఎక్కువ ఆందోళన కలుగుతుంది. కోపిష్టి వ్యక్తి ప్రశాంతంగా ఉండలేడు సరికదా ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగిస్తాడు. అటువంటి కోపాన్ని విడిచిపెట్టమని చెప్తున్నారు మహర్షులు. కోపం వచ్చిన ప్రతీసారీ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. నేను ఎప్పుడు తప్పు చేయలేదా? ఒకవేళ నేను ఈ తప్పు చేస్తే, ఇలాగే ప్రవర్తిస్తానా? అని ప్రశ్నలు వేసుకోవాలి. కోపం ఎప్పుడు బలహీనులకే వస్తుంది. బలవంతులు ఎప్పుడు కోపగించుకోరు, ఎందుకంటే ఓర్పు కలిగినవాడే నిజమైన బలవంతుడు.
కొన్ని సందర్భాల్లో కోపం ప్రదర్శించకపోతే పనులు జరగవు. అలాంటప్పుడు కోపం నటించాలే కానీ, కోపానికి గురి కాకూడదు. కోపం అనేదే ఒక దుర్గుణం. దుర్గుణాన్ని విడిచిపెట్టాలే కానీ అదుపు చేసుకోకూడదు అంటారు గురువులు. అక్రోధః - కోపం లేకుండుట - మనుమహర్షి ధర్మానికి చెప్పిన పది లక్షణాలలో ఒకటి.
తరువాయి భాగం రేపు......
🙏🙏🙏
సేకరణ
**దశిక రాము**
**మహాభారతము**
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
129 - ఉద్యోగపర్వం.
సంజయ రాయబారసమయంలో, ధర్మరాజు కోరికపై శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు :.
' సంజయా ! కురుపాండవులు యిరువురూ,నాకు యిష్టులే. వారు కలిసిమెలిసి వుండాలని కోరుకునేవాళ్లలో నేను మొదటివాడిని. నాకే కాదు, యిరువర్గాలకూ సంధి అంటే సుముఖమే. కానీ, ధృతరాష్ట్రుడికి, రాజ్యం పంచే ఉద్దేశ్యం లేదు.
' ధర్మరాజు ధర్మం తప్పడని నీవు ముందుగానే చెప్పావు కదా ! మరి, అకారణంగా ఆ అజాతశత్రువు యుద్ధానికి సిద్దపడుతున్నాడని, యెలా అభియోగం మోపుతున్నావు, ధర్మజునిపై. మోక్షానికి కర్మ చెయ్యడమే మార్గమని కొందరూ, జ్ఞానమే మార్గమని కొందరూ అంటుంటారు. దేహం నిలబడడానికి, కర్మలు అవసరమే. ఉదరపోషణ వుండాలి కదా ! సన్యాసిని గృహస్తు సమయానికి, పిలిచి భోజనం పెడితేనే కదా ఆయన ఆత్మ దేహంతో ఉండేది. జ్ఞానమార్గం బోధించడానికి.
దేవతలు కూడా కర్మానుచరణ చేస్తూనే వున్నారు. వాయువు చలనము, సూర్యుని ఉదయాస్తమయాలు, భూభ్రమణము, చంద్రుని హెచ్చుతగ్గులు యివన్నీ వారి వారి కర్మలలో భాగాలేకదా ! భూమిని మోసే భూమాత, జలాలను తీసుకువెళ్లే నదీమతల్లులు, వర్షించే మేఘుడు, గతితప్పని నక్షత్రాలు, రుద్రులు, ఆదిత్యులు అందరూ వారి వారి పరిధిలో కర్మాచరణలో వున్నవారే ! '
' సంజయా ! నీవుకూడా ధర్మములు అన్నీ తెలిసినవాడివని అభిప్రాయంలో వుండగా, కేవలం కౌరవశ్రేయస్సుకోరి, వుచిచానుచితాలు మరచి, పాండవులను నిందించి అవమానిస్తున్నావు. పాండవులకు, యుద్ధం చెయ్యకుండా వారి రాజ్యభాగం వారికి పంచి యిస్తే, కౌరవులను, సంహరించే ప్రశ్నే వుత్పన్నము కాదుకదా ! మీ ధృతరాష్ట్రుడు పుత్రశోకం గురించి వ్యాకుల పడవలసిన అవసరం లేదుకదా ! శాంతి, క్షమా అనే విషయాలు నీవుచెప్పావు. రాజధర్మం గురించి చెప్పడం మరచిపోయావు. రాజ్యం వీరభోజ్యం. ఇప్పుడు యుద్ధంచేసి వీరి రాజ్యం పొందకుండా, వీరిని రాజధర్మాన్ని తప్పమని, ధృతరాష్ట్రుని మాటగా నీవు వీరిని నిరుత్సాహపరుస్తున్నావు.
' సంజయా ! కౌరవులు దొంగబుద్ధి కలవారు. వారి తండ్రిగా ధృతరాష్ట్రుడు, అయన పంపిన నీవు, అదే ప్రోత్సహిస్తున్నారు. అంటే ఆచోరగుణంలో అందరూ భాగస్వాములు అవుతున్నారు. యుద్ధం అనివార్యమే అని నాకు అనిపిస్తున్నది. ఈ విషయం నీవు కూడా కౌరవసభలో స్పష్టంగా చెప్పు. రాజ్యభాగం వదులుకునే వుద్దేశం లేకపోతె, యింకా విలువైనవి పోగొట్టుకునే అవకాశం వుంది అని కూడా చెప్పు. '
' సంజయా ! ద్రౌపదిని దుశ్శాసనుడు పరాభవించినపుడు, నిండుసభలో, ధృతరాష్ట్రుడు నోరు మెదపనప్పుడే, యీదుష్టబుద్ధికి వారిలో బీజంపడింది. ఒక్క విదురుడు తప్ప యెవరూ, ఆనాడు మాట్లాడలేదు. నీకు యివన్నీ తెలిసికూడా ధర్మరాజుకు నీతివాక్యాలు చెబుతున్నావు. కర్ణుడు, యేమన్నాడు ? ద్రౌపదిని దుర్యోధనుని దాసిగా వుండమన్నాడు. మరెవరినైనా భర్తగా, చూసుకోమన్నాడు. ఆనాటి కర్ణుని పలుకులు అర్జునుని గుండెలు వ్రక్కలు చేసినా, భిక్షాటనం చేసుకుంటూ, క్షత్రియ కుమారుడు జీవించాలా ? అదేకదా నీవు చెబుతున్నది ?
' సంజయా ! వీరు అరణ్యవాసానికి వెళుతున్న వేళ, దుశ్శాసనుడు, వీరిని నపుంసకులు అని యెగతాళి చేయలేదా ? దాన్నే నిజం చేస్తూ,వీళ్ళు తిరిగి అరణ్యమార్గం పట్టాలా ? అదేనా ధృతరాష్ట్రుని మాటగా, నీవు చెబుతున్నది ? వేయిమాటలేల ? ఈ దుష్ట ఆలోచనను, కౌరవసభలోనే యెండగట్టాలి. నేనే ఆ పని చక్కబెట్టడానికి హస్తినకు వస్తున్నానని వారికిచెప్పు. పాండవుల రాజ్యభాగం వారిది వారికి యిచ్చారా, సంధి కుదురుతుంది. లేదా యుద్ధం అనివార్యం. సంధి కుదిరిందా, కౌరవులు బ్రతికిపోతారు. లేదా అర్జునుని గాండీవానికి బలవుతారు. భీముడి గదాఘాతాలకు అసువులు బాస్తారు. '
' దుర్యోధనుడు ఒక దుష్టకోపిష్టి వృక్షమైతే, ధృతరాష్ట్రుడు, దానికి వేరు వంటివాడు. కర్ణుడు బోదె, శకుని, దుశ్శాసనులు దాని కొమ్మలు, పూలు, పుష్పాల వంటివారు. ఇంకొక ప్రక్కధర్మరాజు ఒక ధర్మవృక్షం. అర్జునుడు బోదె, భీమ, నకుల సహదేవులు కొమ్మలు, ఫల పుష్పాలు, నేను, వేదములు, బ్రాహ్మణులూ దానికి వేళ్ళవంటివారం '
' కౌరవులు కీకారణ్యం వంటి వారైతే, పాండవులు పులులు సింహాల వంటివారు. పులులు, సింహాలు వుంటేనే అరణ్యానికి రక్షణ. అరణ్యంలోనే పులులు, సింహాలకు రక్షణ. కాబట్టి, ఒకరికిఒకరు, కురు పాండవులు అండగా వుంటేనే, యిరువురికీ క్షేమం. '.
అని ఈ విధంగా అనేక దృష్టాంతరాలతో, శ్రీకృష్ణుడు, సంజయుడు పాండవులను యుద్ధం నుండి మనసు మరల్చడానికి చేసిన ప్రయత్నం నుండి త్రిప్పికొట్టాడు. అంతా సావధానంగావిన్న సంజయుడు, ' ధర్మజా ! శలవు. నేను హస్తినకువెళ్లి జరిగినదంతయు పూసగ్రుచ్చినట్లు చెబుతాను. నేను నాకర్తవ్య నిర్వహణలో, మీకు బాధకలిగించే మాటలు అన్నందుకు నన్ను క్షమించు. మీకు శుభం కలుగుగాక ! ' అన్నాడు.
దానికి ధర్మరాజు, ' సంజయా ! నీవు ఉభయులకూ ఆప్తుడవు. నిన్ను చూస్తే, విదుర మహాశయుని చూసినట్లే వుంటుంది. నీపరిధులకు లోబడి నీవుచెప్పావు. దూతవాక్యాలు దూతకు ఆ క్షణకాలం ఆపాదిస్తాముకానీ, శాశ్వతంగా కాదు. అక్కడ అందరినీ అడిగానని చెప్పు. అక్కడ దుఃఖిస్తున్న పామరజనానికి చెప్పు, త్వరలో మేము మళ్ళీ మా రాజ్యం సంపాదించుకుని, వారిని క్షేమంగా చూసుకుంటామని. ' అని చెప్పాడు.
' సంజయా ! చివరగా చెబుతున్నాను. మా రాజ్యం మాకు యివ్వడానికి వారికి యిష్టం లేకున్నా, కనీసం మా అయిదుగురకూ, ఆస్థలము, మాకంది, వారణావతము, వృకస్థలము, అయిదవదిగా, ఇంకొక నగరం కలిపి, ఇవ్వమని చెప్పు. లేదంటే, అయిదు గ్రామాలు యిచ్చినా చాలు. మేము మిత్రధర్మం తో వారితో వుంటాము. ' అని వీడ్కోలు చెప్పాడు.
సంజయుడు శ్రీకృష్ణ, పాండవుల వద్ద శలవు తీసుకుని హస్తినకు చేరాడు. ,
స్వస్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.
🙏🙏🙏
సేకరణ
**దశిక రాము**
**శ్రీమద్భాగవతము**
చతుర్థ స్కంధం -24
పూర్వ సఖుని ఉవాచ
వైదర్భి తాను భర్తతో సహగమనం చేయటానికి పూనుకున్నది. అంతలో పురంజనునకు పూర్వసఖుడు, జ్ఞాని అయిన అవిజ్ఞాతుడు అనే బ్రాహ్మణుడు ఆమెను కలవడానికి…వచ్చి ఆమెను మంచిమాటలతో ఓదారుస్తూ ఇలా అన్నాడు “వనితా! నీ వెవరు? ఎవరి దానవు? ఇత డెవరు? ఇతని కోసం ఎందుకు దుఃఖిస్తున్నావు?” అని ప్రశ్నించి ఇంకా ఇలా అన్నాడు “నేను నీ మిత్రుడను. ఈ సృష్టికి పూర్వం నీవు ఎవరి స్నేహంతో ఎడతెగని సౌఖ్యములను అనుభవించావో ఆ స్నేహితుడను నేను. నీవు నన్ను ఎరిగినా, ఎరుగక పోయినా నన్ను పూర్వమిత్రునిగా తెలుసుకో.
నీవు, నేను పూర్వం మానస సరస్సులో నివసించే హంసలం. మనం మిత్రులమై మన నివాసాన్ని విడిచి వేయి సంవత్సరాలు సంచరించాము. నీవు నన్ను వదలిపెట్టి క్షుద్రసుఖాలను, అధికారాన్ని కోరి భూమండలంలో తిరిగావు. అప్పుడు కామినీ నిర్మితం, పంచారామం, నవద్వారం, ఏకపాలకం, త్రికోష్ఠకం, షట్కులం, పంచవిపణం, పంచప్రకృతి, స్త్రీనాయకం అయిన ఒక పురాన్ని చూశావు. అది ఎలాంటిదో వివరిస్తాను విను. పంచారామాలంటే పంచేంద్రియార్థాలైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనేవి ఐదు. నవద్వారాలంటే ముక్కు మొదలైన తొమ్మిది రంధ్రాలు. ఏకపాలకం అంటే ప్రాణం. త్రికోష్ఠాలు అంటే భూమి, జలం, అగ్ని అనేవి. షట్కులం అంటే నాలుక, కన్ను, చెవి, ముక్కు, చర్మం, మనస్సు అనే జ్ఞానేంద్రియాలు. పంచవిపణాలు అంటే వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు. పంచప్రకృతి అంటే పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు. కామిని అంటే బుద్ధి. ఇటువంటి పురం(దేహం)లో స్త్రీకాముకుడవు, అజ్ఞుడవు అయి నీవు ప్రవేశించావు. నీవు ఆ కామినికి చిక్కి ఆమెతో క్రీడిస్తూ, ఆమె సంగమం చేత స్మృతిని కోల్పోయి ఈ మహాపాపదశను పొందావు. కాబట్టి…నీవు విదర్భరాజు పుత్రికవు కావు. ఈ మలయధ్వజుడు నీకు మగడు కాడు. పూర్వజన్మలో పురంలో నివసించిన ఆ పురంజనుడవు కావు. నీవు ఈ జన్మలో ఇతని భార్యను అని, పూర్వజన్మలో పురుషుడను అని అనుకోవటం కూడా అసత్యమే. ఇదంతా నేను నా మాయచేత సృష్టించాను. మనం ఇద్దరం పూర్వం హంసలం (పరమ పరిశుద్ధులం) అని చెప్పాను కదా! మన స్వరూపాన్ని చూడు. నేనే నీవు. నీవే నేను. అంతేకాని వేరుకాదు. పండితులు మనలో తేడాను చూడరు. ఒక్కటే అయినా అద్దంలో ప్రతిబింబించే రూపమూ, బింబరూపమూ వేరుగా తోచినట్లు మన ఇద్దరికీ భేదం లేకున్నా భేదం ఉన్నట్లు కనిపిస్తుంది” ఈ విధంగా అవిజ్ఞాతుడు చేసిన బోధవల్ల తేరుకొని అతని ఎడబాటువల్ల తాను కోల్పోయిన జ్ఞానాన్ని వైదర్భి రూపంలో ఉన్న పురంజనుడు పొందాడు” అని చెప్పి నారదుడు ప్రాచీనబర్హిని చూచి “ఈ ఆధ్యాత్మతత్త్వాన్ని రాజుకథ నెపంతో నీకు చెప్పాను” అని చెప్పగా…ప్రాచీనబర్హి నారదమహర్షితో ఇలా అన్నాడు “నీ మాటలు పండితులు తప్ప కర్మబద్ధులమై దుఃఖించే మేము ఎలా తెలుసుకోగలం? కాబట్టి నాకు వివరించి చెప్పు” అనిన ప్రాచీనబర్హితో నారదుడు ఇలా అన్నాడు “రాజేంద్రా! ఏ కారణం చేత ఒక పాదం కలది (చెట్టు), రెండు పాదాలు కలది (మానవుడు, పక్షి), మూడు పాదాలు కలది, నాలుగు పాదాలు కలది (జంతువు), పెక్కు పాదాలు కలది (కీటకం), పాదాలు లేనిది (పాము) అయి పెక్కురకాలుగా చేతనతో కూడిన జీవునివల్ల దేహం వ్యక్తమవుతుందో ఆ కారణంచేత పురంజనుడు పురుషు డయ్యాడు. ఆ పురుషునికి నామ క్రియాగుణాలచే తెలియబడ్డ అవిజ్ఞాతుడు అనే మిత్రుడే ఈశ్వరుడు. పురుషుడు తొమ్మిది ద్వారాలతోను, రెండు చేతులతోను, పాదాలతోను కూడిన దోషరహితమైన దేహంలో ప్రవేశించాలని కోరుకుంటాడు. కాబట్టి పురం అంటే దేహం. పురుషుడు బుద్ధిని ఆశ్రయించి ఇంద్రియాలచేత విషయసుఖాలను అనుభవిస్తాడు. అహంకార మమకారాలను పొందుతాడు. కాబట్టి ఉత్తమ స్త్రీ అంటే బుద్ధి. ఆ బుద్ధికి స్నేహితులు అంటే జ్ఞాన, కర్మ కారణాలైన ఇంద్రియ గుణాలు. చెలికత్తెలంటే ఇంద్రియ వ్యాపారాలు. అయిదు తలల పాము అంటే పంచవృత్తి అయిన ప్రాణం. పదకొండుమంది మహాభటులు అంటే జ్ఞాన కర్మేంద్రియాలు పది, వాటిని ప్రేరేపించే మనస్సు (బృహద్బలుడు). తొమ్మిది ద్వారాలతో కూడిన ఆ పురాన్ని చుట్టి వచ్చిన పాంచాల దేశాలు అంటే శబ్దం మొదలైన పంచ విషయాలు. నవద్వారాలు అంటే రెండు కన్నులు, రెండు ముక్కు రంధ్రాలు, ఒక నోరు, రెండు చెవులు, గుదం, మగగురి. అందులో రెండు కన్నులు, రెండు ముక్కు రంధ్రాలు, ఒక నోరు ఈ ఐదు తూర్పున ఉండే ద్వారాలు. కుడి చెవి దక్షిణ ద్వారం. ఎడమచెవి ఉత్తర ద్వారం. గుదం, శిశ్నం అనేవి రెండు పడమటి ద్వారాలు. అందులో ఒకేచోట నిర్మింపబడిన ఖద్యోత, ఆవిర్ముఖి అంటే కన్నులు. విభ్రాజితం అంటే రూపం. ద్యుమంతుడు అంటే నేత్రేంద్రియం. నళిని, నాళిని అంటే ముక్కు రంధ్రాలు. సౌరభం అంటే గంధం. అవధూత అంటే ఘ్రాణేంద్రియం. ముఖ్య అంటే నోరు. విపణం అంటే వాగింద్రియం. రసజ్ఞుడు అంటే రసనేంద్రియం. ఆపణం అంటే సంభాషణం. బహూదనం అంటే పలురకాలైన అన్నం. పితృహువు అంటే కుడిచెవి. దేవహువు అంటే ఎడమ చెవి. చంద్రవేగుడు అంటే కాలాన్ని సూచించే సంవత్సరం. గంధర్వులు అంటే పగళ్ళు. గంధర్వీజనులు అంటే రాత్రులు. పరీవర్తనం అంటే ఆయుఃక్షయం. కాలకన్యక అంటే ముసలితనం. యవనేశ్వరుడు అంటే మృత్యువు. అతని సైనికులు ఆధివ్యాధులు. ప్రజ్వారుడు అంటే వేగంగా చావును కలిగించే జ్వరం. శీతం, ఉష్ణం అనే ఈ జ్వరం రెండు రకాలు. దక్షిణ పాంచాలం అంటే పితృలోకాన్ని పొందించేదీ, ప్రవృత్తి రూపకమూ అయిన శాస్త్రం. ఉత్తర పాంచాలం అంటే దేవలోకాన్ని పొందించేదీ, నివృత్తి రూపకమూ అయిన శాస్త్రం. శ్రుతధరుడు అంటే చెవి. ఆసురి అనే పేరు కలిగిన పడమటి ద్వారం శిశ్నం. గ్రామకం అంటే రతి. దుర్మదుడు అంటే యోని. నిరృతి అనే పేరు కలిగిన పడమటి ద్వారం గుదం. వైశసం అంటే నరకం. లుబ్ధకుడు అంటే మలద్వారం. సంధులు అంటే చేతులు కాళ్ళు. అంతఃపురం అంటే హృదయం. విషూచి అంటే మనస్సు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.
పుణ్యాత్మా! విను. భార్యాపుత్రులు అనే గుణలిప్తమైన బుద్ధితత్త్వం ఏయే విధంగా వికారాన్ని పొందుతుందో, ఏయే విధాలుగా ఇంద్రియాలు వికారాన్ని పొందుతాయో ఆ గుణాలు కలిగి ఆ వృత్తులను అనగా తమస్సత్త్వరజోధర్మలైన మోహ, ప్రసాద, హర్షాలను బలవంతంగా పురంజనుడు అనుకరించేవాడు” అని చెప్పి యోగివర్యుడైన నారదుడు రాజశ్రేష్ఠుడైన ప్రాచీనబర్హితో ఇలా అన్నాడు
ఇంకా రథం అంటే శరీరం. గుఱ్ఱాలు అంటే ఇంద్రియాలు. రెండు యుగాలు అంటే సంవత్సరం, దాని చేత ఏర్పడిన వయస్సు. రెండు చక్రాలు అంటే పుణ్యపాప కర్మలు. మూడు జెండాలు అంటే త్రిగుణాలు. పంచబంధనాలు అంటే పంచప్రాణాలు. పగ్గం అంటే మనస్సు. సారథి అంటే బుద్ధి. గూడు అంటే హృదయం. రెండు నొగలు అంటే శోకమోహాలు. పంచప్రహరణాలు అంటే ఐదు ఇంద్రియార్థాలు. పంచవిక్రమాలు అంటే కర్మేంద్రియాలు. సప్త వరూధాలు అంటే రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే ఏడు ధాతువులు. స్వర్ణాభరణం అంటే రజోగుణం. అక్షయ తూణీరం అంటే అనంత వాసనాహంకార ఉపాధి. ఏకాదశ సేనాపతి అంటే పది ఇంద్రియాలు, మనస్సు. ఆసురీవృత్తి అంటే బాహ్య విక్రమం. పంచేంద్రియాల చేత హింసాదులను చేసి విషయాలను అనుభవించడమే వేట. పురుషుడు దేహంతో స్వప్న సుషుప్తి జాగ్రదవస్థలతో ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికాలైన బహువిధ దుఃఖాలచేత కష్టాలను అనుభవిస్తాడు. అజ్ఞానం చేత కప్పబడి నిర్గుణుడు ఐనా ప్రాణేంద్రియ మనోధర్మాలను తనలో ఆరోపించి కామలేశాలను ధ్యానిస్తూ, అహంకార మమకారాలతో కూడ వందయేండ్లు కర్మలను ఆచరిస్తాడు. పురుషుడు తాను స్వయంప్రకాశుడనీ, ప్రకృతికి పరుడైన పరమాత్ముడనీ, గురుడనీ తెలుసుకోలేక ప్రకృతి గుణాలలో…ఎప్పుడైతే అలా ప్రకృతి గుణాలలో ఆసక్తుడు ఔతాడో, అప్పుడు మానవుడు గుణాభిమాని అయి, త్రిగుణాలకు సంబంధించిన కర్మలలో మునిగి తేలుతూ, కర్మవశుడు అయి ఉంటాడు. …సాత్త్విక కర్మల వల్ల ప్రకాశ భూయిష్ఠాలైన లోకాలను, రాజస కర్మల వల్ల దుఃఖ భూయిష్ఠాలైన లోకాలను, తామస కర్మల వల్ల తమశ్శోకమోహ భూయిష్ఠాలైన లోకాలను పొందుతాడు. ఒకప్పుడు పురుషుడై, ఒకప్పుడు స్త్రీయై, ఒకప్పుడు నపుంసకుడై ఆయా కర్మలకు తగినట్లు దేవ, మనుష్య, తిర్యక్ రూపాలతో జన్మిస్తాడు. ఈ విధంగా కామాసక్తుడైన పురుషుడు పుడుతూ, చస్తూ, మళ్ళీ పుడుతూ ఉన్నత స్థానాలను, నీచ స్థానాలను పొందుతూ ఉంటాడు.అని ఇంకా ఇలా అన్నాడు. ఆకలి బాధతో కుక్క ఇంటింటికీ తిరిగి దైవికంగా కఱ్ఱ దెబ్బలనో, దొంగకూడునో తిన్నట్లు జీవుడు దైవికంగా ప్రాప్తించిన ప్రియాప్రియాలను మూడు లోకాలలోను అనుభవిస్తాడు.
ఇటువంటి దుఃఖాలకు ప్రతిక్రియ లేదు. ఒకవేళ ఉన్నా అది తాత్కాలికమే. బరువు మోసే నిరుపేద తన తలమీది బరువును భుజం మీదికి మార్చుకున్నా దాన్ని మోయటం వల్ల కలిగే దుఃఖాన్ని తప్పించుకోలేడు. అలాగే జీవుడు మూడు రకాలైన దుఃఖాన్ని తప్పించుకోలేడు.
కలలో మళ్ళీ కల వచ్చినట్లు పురుషుడు దుఃఖాన్ని కలిగించే కర్మం, ప్రతీకార కర్మం అవిద్యచేత కలిగి….సహవాసం వల్ల నాశనం చెందేవి కావు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. రాజా! విను. దేహం స్వప్నం వలె అజ్ఞానంవల్ల ప్రాప్తిస్తుంది కాబట్టి అసత్యమైనదే కదా! దానిని ప్రయాసపడి తొలగించుకోవటం ఎందుకు అని అనరాదు. ప్రయోజనం లేకపోయినా కలలో ఉపాధితో కూడిన మనస్సు పురుషుని ఆశ్రయించి మెలకువ వచ్చిన తరువాత కూడా స్వప్న సంసారాన్ని విడిచిపెట్టదు. అలాగే వైరాగ్య చేత అజ్ఞానాన్ని తొలగించుకోలేక పోయినా, భార్యను శరీరాన్ని విడిచిపెట్ట లేకపోయినా సంసారం నుండి విడుదల లేదు. పరమ పురుషార్థం అనదగిన ఆత్మకు ఏ కారణం వల్లనైనా అనర్థాలను కలిగించే సంసారం కలుగుతుందో, ఆ కారణాన్ని జగద్గురుడైన వాసుదేవుని పాదపద్మాలమీది భక్తి నశింపజేస్తుంది. పుణ్యాత్మా! వాసుదేవుని మీది పరిశుద్ధమైన భక్తి, శాశ్వతము లైన వైరాగ్య జ్ఞాములను కలిగిస్తుంది. ఆ భక్తికి నెలవు గోవిందుని గొప్ప కథలను ఆశ్రయించి ఉంటుంది. కావున ఆ భక్తి ఎల్లప్పుడు వాసుదేవుని కథలను వినడం వలన, గానం చేయడం వలన కలుగుతుంది. ఇంకా…సాధుశీలురు, విమల మనస్కులు భగవంతుని గుణాలను కీర్తించటం చేత, వినటం చేస్త పరిశుద్ధమైన మనస్సు కలిగిన భక్తుల సభలలో మహాత్ముల నోట వెలువడిన రసవంతాలైన, గొప్పవైన విష్ణుకథలు అనే ప్రవాహాన్ని ఎంతో ఇష్టంతో…
చెవులు అనే దోసిళ్ళతో తనివి తీరా త్రాగే పుణ్యులకు ఆకలి, దాహం, భయం, శోకం, విమోహం సోకవు.
కావున ఇటువంటి సత్సంగం లేకుండా స్వయంగా భగవంతుని గుణాలను వర్ణించడం, కథలని వినడం వలన భక్తి కలుగదు. సహజాలైన ఆకలి దప్పుల చేత బాధపడే జీవులకు సోమరితనం వల్ల, రసావేశం లేనందువల్ల హరికథామృత పానంలో ఆసక్తి కలుగదు. ఇది నిశ్చయం” అని చెప్పి నారదుడు మళ్ళీ ఇలా అన్నాడు. పుణ్యాత్మా! బ్రహ్మ, మహేశ్వరుడు, మనువులు, దక్షుడు మొదలైన ప్రజాపతులు, సనకాది మునులు, పులస్త్యుడు, భృగువు, పులహుడు, క్రతువు, అత్రి, మరీచి, అంగిరసుడు, వసిష్ఠుడు, నేను వేదాంతులం, వాచస్పతులం, తపోయోగవిద్యా సమాధులు అనే ఉపాయాలతో ఆలోచించేవారం. అయినా సర్వసాక్షి అయిన పరమాత్ముని చూడలేము.
అది ఎలా అంటే…మిక్కిలి విస్తారమైనదీ, అంతు లేనిదీ, అద్వితీయమైనదీ అయిన వేదాన్ని అనుసరించి మంత్రాలచేత పెక్కు దేవతలను ఆరాధిస్తూ ఇంద్రాది దేవతలను ఇష్టదైవతాలుగా భజించేవారు సర్వేశ్వరుడైన పరమాత్మను దర్శింపగలరా? రాజా! విను. మనస్సులో భావింపదగిన భగవంతుడు ఎప్పుడు, ఎవరిని అనుగ్రహిస్తాడో వాడు మహితాత్ముడై…లోక వ్యవహారంలోను, వైదిక కర్మాచరణంలోను నెలకొన్న బుద్ధిని త్యజిస్తాడు. కాబట్టి రాజేంద్రా! పరమార్థాల వలె కనిపిస్తూ, ఆసక్తి కల్పిస్తూ, వినటానికి ఇంపై, అవాస్తవాలైన ఈ వివిధ కర్మలను పరమార్థాలు అని అనుకోకు. మలిన బుద్ధులు జనార్దనుని ప్రతిపాదించే వేదాన్ని కర్మపరమని వాదిస్తారు. వారు వేదతత్త్వం తెలిసినవారు కారు. తూర్పువైపు కొనలు గల దర్భలను భూమండలమంతా పరచి అహంకారంతో, అవినయంతో అనేక పశువులను బలి చేశావు. కర్మ స్వరూపాన్ని విద్యాస్వరూపాన్ని తెలిసికోలేక పోయావు. ఆ కర్మ విద్యాస్వరూపాలను గురించి చెపుతాను విను. హరికి సంతోషాన్ని కలిగించేదే కర్మ. భగవంతునిపై మతిని నెలకొల్పేదే విద్య. హరియే దేహులకు ఆత్మ. హరియే పరమాత్మ. భద్రతను కోరేవారికి హరిపాద మూలమే శరణం. హరిని పరమ ప్రియునిగా భావించి కొలిచే వారికి ఆవంత ఐనా దుఃఖం కలుగదు. భగవత్సరూపాన్ని తెలిసికొన్నవాడే విద్వాంసుడు. అతడే గురువు. అతడే హరి” అని చెప్పి నారదుడు ఇంకా ఇలా అన్నాడు. రాజా! నీ ప్రశ్నకు పూర్తిగా సమాధానం చెప్పాు. ఇక ఒక రహస్యం వివరిస్తాను. సావధానంగా విను.అందమైన పూలతోటలో హాయిగా విహరిస్తూ చిన్నారి పూలతేనెలకు, కమ్మని సువాసనలకు, జుమ్మనే తుమ్మెద పాటలకు ప్రీతి చెందుతూ ఒక మగలేడి ఆడులేడితో కలిసి నెమ్మదిగా సంచరిస్తున్నది. దాని మనస్సు ఆడలేడి మీదనే నిమగ్నమై ఉంది. ఆ మగలేడికి ముందుభాగంలో ప్రాణాలకు హాని కలిగించే తోడేళ్ళ గుంపు తిరుగుతున్నది. ఇంతలో వెనుకనుండి ఒక బోయవాడు విడిచిన వాణి బాణం లేడి పృష్ఠభాగాన్ని చీల్చి వేసింది. తప్పించుకొనే దారిలేక ఆ మగలేడి అడవిలో మృత్యువు పాలయింది. రాజేంద్రా! విను. పురుషుడు ఆ మగలేడి వంటివాడే. పురుషుడు స్త్రీల యిండ్లను ఆశ్రయించి క్షుద్రమై, కామ్యపరిపాకం నుండి పుట్టిన జిహ్వ, ఉపస్థ మొదలైన కామ జనిత సుఖలేశాన్ని అన్వేషిస్తాడు. స్త్రీయందే మనస్సు నిల్పి మనస్సును కొల్లగొట్టే స్త్రీల మాటలను వినగోరుతాడు. కళ్ళముందే తోడేళ్ళ గుంపులాగా ఆయుస్సును హరించే రాత్రింబవళ్ళను లెక్కచేయడు. వెనుకనుండి బోయవాని వంటి యముడు శరీరాన్ని చీల్చివేస్తుండగా జీవుడు విహరిస్తాడు. కాబట్టి నీవు ఈ జీవుని లేడివంటి చేష్టలు కలవానిగా భావించు. బాహ్యవ్యాపారా లైన శ్రౌతస్మార్తాది రూపకర్మలను హృదయంలో నిగ్రహించు. అతి కాముకుల గాథలతో కూడిన సంసారాన్ని విడిచిపెట్టి, సర్వజీవులకు దిక్కైన భగవంతుని సేవించు. సంపూర్ణ విరక్తిని పొందు” అని నారదుడు చెప్పగా ప్రాచీనబర్హి ఇలా అన్నాడు.మునీంద్రా! భగవంతుడవు, మేటి జ్ఞానివి అయిన నీవు చెప్పిన ఆత్మ తత్త్వాన్ని… విని బాగా ఆలోచించాను. నాకు కర్మను బోధించిన ఆచార్యులకు ఈ ఆత్మతత్త్వం తెలియదు. తెలిస్తే కర్మని ఉపదేశింపరు కదా! ఆ ఆచార్యుల ఉపదేశం చేత నాకు ఆత్మతత్త్వం విషయంలో కలిగిన మహాసంశయం నీ వల్ల పటాపంచలయింది” అని ఇంకా ఇలా అన్నాడు. పుణ్యాత్మా! ఇంద్రియ వృత్తులలో అప్రవృత్తులై ఋషులు మోహించే అర్థం గురించి నాకు సంశయం కలుగుతున్నది. పురుషుడు ఏ దేహం చేత కర్మలు చేస్తాడో ఆ దేహాన్ని ఈ లోకంలోనే విడిచిపెట్టి తాను మరొక దేహాన్ని ధరించి మరొక లోకాన్ని చేరి అక్కడ కర్మఫలాన్ని అనుభవిస్తాడని వేదవేత్తలు చెపుతారు. ఇది ఎలా పొసగుతుంది?
అంతేకాదు. చేసిన వేదోక్తమైన కర్మ ఆ క్షణంలోనే నశిస్తుంది కదా! ఇంక జీవుడు మరొక దేహం పొంది లోకాంతరంలో ఎలా అనుభవించగలడు?” అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు ప్రాచీనబర్హితో ఇలా అన్నాడు “రాజా! లింగశరీరాన్ని ఆశ్రయించి ఉండే జీవుడు కలలో జాగ్రద్దేహాభిమానాన్ని విడిచి, అటువంటిదో లేక అటువంటిది కానిదో అయిన మరొక శరీరం పొందుతాడు. మనస్సులో సంస్కార రూపంలో ఆ హితమైన కర్మని ఆచరిస్తాడు. అలాగే జీవుడు ఏ లింగ శరీరం చేత కర్మని చేస్తాడో ఆ లింగశరీరం చేతనే లోకాంతరంలో ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. భిన్న దేహాన్ని పొందడు. ఇవ్వటం, పుచ్చుకొనడం మొదలైన వానిలో స్థూల దేహానికి కర్తృత్వం ఉన్నదని భ్రమించకూడదు. జీవుడు అహంకారంతోను మమకారంతోను కూడినవాడు. ఆ జీవుడు మనస్సు చేత ఏ దేహాన్ని పొందుతాడో, ఆ దేహం చేతనే ప్రాప్తించిన కర్మని అనుభవిస్తాడు. అలా కాకుంటే కర్మ పునర్జన్మకు కారణం కావటం పొసగదు. కాబట్టి మనః ప్రధానమైన లింగశరీరానికే కర్తృత్వం పొసగుతుంది” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. జ్ఞానరూపాలు, కర్మరూపాలు అయిన ఇంద్రియాల కర్మ ప్రపంచంచేత చిత్తాన్ని ఊహింపవచ్చు. అలాగే చిత్త వృత్తులను బట్టి పూర్వదేహం చేత చేయబడిన కర్మలను
ఊహించవచ్చు. అది ఎలాగంటే దేహం చేత అనుభవింపబడనిది, చూడబడనిది, వినబడనిది అయినట్టిది, వాసనాశ్రయుడైన జీవునికి పూర్వ దేహంలో అనుభవింపబడినది, చూడబడినది, వినబడినది అవుతుంది. అనుభవింపబడిన విషయం మనస్సులో స్ఫురించదు. ఈ మనస్సే జీవులకు శుభాశుభాలకు కారణమైన పూర్వపర దేహాలను తెలుపుతుంది. ఈ మనస్సులో చూడబడనిది, వినబడనిది అయిన విషయం కలలో కనిపించే మాట నిజమే. కాని ఆ కల దేశకాల క్రియలను ఆశ్రయించి ఉంటుంది. సమస్త విషయాలు క్రమాన్ని అనుసరించి మనస్సుచేత అనుభవింపబడతాయి. శుద్ధ సత్త్వగుణం కలిగి వాసుదేవుని ఉత్తమ గుణాలను ధ్యానించటంలో నిమగ్నమైన మనస్సులో, గ్రహణం నాడు చంద్రమండలంలో రాహువు కనిపించినట్లు ప్రపంచం సర్వం కనిపిస్తుంది” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “స్థూలదేహం ద్వారానే లింగదేహం కర్తృత్వ భోక్తృత్వాలు పొందటం చేత స్థూలదేహం నశించగానే జీవునికి కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. కాబట్టి ముక్తి కలుగుతుంది అని చెప్పటం సరికాదు. లింగశరీరం ఎందాక ఉంటుందో అందాక స్థూలదేహంతో జీవునికి సంబంధం ఉంటుంది. గాఢనిద్ర, మూర్ఛ మొదలైన వానిలో అహంకారం ఉన్నప్పటికీ ప్రకాశించదు. అమావాస్యనాడు చంద్రునిలాగా బాల్యంలో అహంకారం స్పష్టపడదు. స్థూలదేహంతో ఎడబాటు ఉండదు. కాబట్టి అర్థం లేకపోయినా విషయాసక్తుడైన వానికి కలలో అనర్థ దర్శనం కలిగినట్లు సంసారం (జన్మ) ఉడుగదు. ఈ విధంగా లింగ శరీరాన్ని ఆశ్రయించి చైతన్యాన్ని కలిగించే పురుషుడే జీవుడు అని చెప్పబడతాడు. ఇంకా…పురుషుడు ఈ లింగశరీరం చేత ఒక స్థూలదేహాన్ని విడిచి, మరొక దేహాన్ని పొందుతూ, తిరిగి దానిని విడిచిపెడుతూ సుఖ దుఃఖ భయ మోహ శోకాలను ఈ లింగదేహం చేతనే అనుభవిస్తాడు. జలగ తన ముందున్న తృణాన్ని పట్టుకొని ఆ తరువాతనే వెనుకటి తృణాన్ని విడిచిపెడుతుంది. అలాగే జీవుడు కొంతకాలం బ్రతికి చనిపోతూ మరొక దేహం పొందిన తరువాతనే పూర్వదేహాన్ని విడిచిపెడతాడు. కాబట్టి మనస్సే జన్మకు హేతువు. రాజా! కాబట్టి మనస్సే జీవులందరికీ జన్మకారణం. కర్మ వశాన అవిద్య కలుగుతుంది. అవిద్య చేత దేహానికి కర్మబంధం కలుగుతుంది. కర్మబంధం వల్ల బహు జన్మలను పొందక తప్పదు సుమా! రాజా! విను. కనుక అటువంటి అవిద్యను నాశనం చేయడానికి లక్ష్మీపతి, సృష్టి స్థితి లయ కారకుడు, కమలలోచనుడు, పరమేశ్వరుడు అయిన వాసుదేవుని ఈ జగత్తుకంతటికీ ఆత్మరూపంగా భావించి సేవిస్తూ ఉండు”.అని ఈ విధంగా భక్త శ్రేష్ఠుడైన నారదుడు ప్రాచీనబర్హికి జీవేశ్వరుల తత్త్వాన్ని తెలిపి సిద్ధలోకానికి వెళ్ళాడు.రాజర్షి అయిన ప్రాచీనబర్హి ప్రజారక్షణకు కొడుకులని నియోగించి, తప్పస్సు చేయటానికి కపిలాశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో ముక్తసంగుడై, ఏకాగ్రచిత్తంతో, సద్భక్తియోగంతో గోవిందుని పాదపద్మాలను ఆరాధించాడు. బ్రహ్మ రుద్రాదులకు పొంద శక్యంకాని అవ్యయానందమయమైన పదాన్ని పొందాడు” అని మైత్రేయుడు విదురునితో చెప్పి…
(మైత్రేయుడు విదురునితో) ఇంకా ఇలా అన్నాడు. “నారదముని బోధించిన హరికీర్తిని కొనియాడే ఈ ఆధ్యాత్మ పారోక్ష్యం లోకాన్ని పవిత్రం చేస్తుంది. మనశ్శుద్ధిని కలిగిస్తుంది. అన్నిటికంటే గొప్పదైన ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి దీనిని చదివేవాడు, విన్నవాడు లింగశరీరాన్ని విడిచి సమస్త బంధాలను త్రెంచుకొని విదేహ కైవల్యాన్ని పొందుతాడు. సంసారంలో భ్రమించడు” అని చెప్పిన మైత్రేయునితో విదురుడు ఇలా అన్నాడు.
🙏🙏🙏
సేకరణ
**దశిక రాము**
**త్రిపురారహస్య జ్ఞానఖండసారము**
అమ్మదయ గలవారు మాత్రమే దీనిని చదవగలరు
భార్గవరాముని నిర్వేదము
PART-13
Chapter 2
శ్రీరామునివలన పరాభవమునొందిన భార్గవరాముఁడు అత్యంతము నిర్వేదము నొంది మార్గమున ఇట్లు చింతించుచు పోవఁజొచ్చెను. ''అహో నాచిత్తసమ్మోహ మేమని చెప్పదును? ప్రబలశత్రువైన క్రోధముచేత మోహమను పెద్దగోతిలో కూలి ఇట్లయితిని. తపస్సునకు మృత్యువు క్రోధమే. క్రుద్ధుఁడైన వానినుండి ఆలోచన యన్నది దూరముగా తొలఁగిపోవును. క్రుద్ధుండైనవాఁడు పిశాచమువలె ఏనీచకార్యమును జేయఁడు? వారి కీరువురకును భేదము కొంచెముకూడ లేదు. మాత్రండి నెవరో సంహరింపఁగా నేను ఎందఱనో సంహరించితిని. శత్రువులు పెరుగుచుండఁగా ప్రభువునకు రాజ్యసౌఖ్య మెట్లుండదో అట్లే నాకును ఈకోప మున్నంతవఱకు సుఖముండదు. మనుష్యభక్షకునివలె నేను చాల నీచకృత్యమును గావించితిని. అభిమానము క్రోధమునకు మూలము. ఆయభిమానము వలననే నేను పెద్దయజగరమువంటి క్రోధసర్పముచేత మ్రింగఁ బడితిని''.
ఇట్లు చింతించుచు పోవుచున్న పరశురాముఁడు దారిలో జ్వలించుచున్న యగ్నిపర్వతమువలె తేజోరాశిమయుఁడైన యొకపురుషుని గాంచెను. అతఁడు పుల్లపంకజలోచనుఁడై పుష్టసుందరసర్వాంగుఁడై యుండెను. అతఁడు మలినాంగుఁడై జుట్టు విరఁబోసికొని పిచ్చివాని వలె నున్నను మహాపురుషునివలె మహర్షివలె భాసించుచుండెను. వర్ణాశ్రమాదిచిహ్నములు ఏమియు లేక దిగంబరుడై మదపుటేనుఁగు వలె నిలిచియున్న యావిప్రుని జూచి పరశురాముఁడు చాల సంశయము నొందెను. ''ఎవ రీతఁడు? మంచి లక్షణములు చెడులక్షణములు కలిగి విలక్షణమైన వర్తనము కలవాఁడుగా నున్నాఁడు. ఇతఁడు మహాపురుషుఁడా లేక ప్రమత్తుఁడా? వేషాంతరము నొందియున్ననటునివలె వీనిని నిశ్చయించి గుర్తింపలేకున్నాను. మదించినవాఁడైనచో ఇతఁడు తేజోముయుఁడుగా ఎట్లుండును? ఇతఁడు సత్పురుషులను ధర్మమునుండి తప్పించి చెఱచువాఁడా లేక స్వరూపమును కప్పిపుచ్చుకొనియున్న మహాపురుషుఁడా? వీని నెట్లయినను ప్రయత్నించి పరీక్షింపవలె''.
ఇట్లు తలంచి పరశురాముఁడు నవ్వుచు వానినిజూచి ''పురుషవరేణ్యా, ఎవరు నీవు? మహాపురుషునివలె కన్నించుచున్నావు. నీయీ స్థితి ఎట్టిదో చెప్పుము '' అపి పలికెను. అమాట విని ఆతఁడు పెద్దగా మాటిమాటికి నవ్వుచు రాళ్లు రువ్వుచు పిచ్చివానివలె వర్తించుచు ఏదో మాటాడుచు పారిపోఁజొచ్చెను. భార్గవుఁడు ఆతనివెంట పరువెత్తి పట్టుకొని ''ఈతఁడెపరో తెలియుట లేదు. ఇంకను వీనిని పరీక్షించి నాకోరికను తీర్చుకొందును'' అని తలంచి ఆతనిని అనేక విధముల ఆక్షేపింప మొదలుపెట్టెను. ఎంతగా ఆక్షేపించినను ఎంతగా పరిభవించినను ఆతని స్థితియందుఁగాని ముఖర్ణమునందుఁ గాని కొంచెమైనను మార్పు రాలేదు. అప్పుడు పరశురాముఁడు అతఁడు మహాపురుషుఁడే అని నిశ్చయించుకొని ఆయన పాదములయందు వ్రాలి ప్రార్థించెను.
PART-13
🙏🙏🙏
సేకరణ
ఓ అర్జునా ! నానావిధములైన ఏ ప్రాణులు ఉత్పన్నమగుచున్నవో వాటినన్నంటిని ఈ "ప్రకృతి"యే గర్భము ధరించు "తల్లి". నేను బీజముల స్థాపించు తండ్రిని.
సత్వ (అరిషడ్వర్గముల యందు ఆసక్తి లేకుండుట) ,రజో (కోరికలయందు ఆసక్తి సదా కలిగియుండుట), తమో ( జన్మసాఫల్యము సిద్ధాంతము తెలియకుండుట) మూడు గుణములు ప్రకృతినుండి జనియించి అవినాశియైన జీవుడను శరీరములో బంధించుచున్నవి. సత్వగుణము నిర్మలమైనది, వికారరహితమైనది. సత్వగుణమువలన ఉద్భవించు సుఖములతో వాటి మీద అభిమానముచే జీవుని బంధించుచున్నది. రజోగుణమువలన కలుగు కోరికలాసక్తి వలన కర్మలచేత మరియు ఫలముచేతను జీవుని బంధించుచున్నది. మోహకారకమగు తమోగుణము జీవాత్మను సోమరితనము, నిద్రాదులచే బంధించుచున్నది (ADHYAYAMU 14TH)
నరకము నరులకు జూపిన
నరకుడె తల్లివలన మరణమునేపొందన్
ధర పండుగదిన మయ్యెను
నరు లానందమ్ముతోడ నడకలుసలుపన్.
నరనరమున విద్వేషము
వరధార్మిక జీవనమున వరలెడువానిన్
పరిమార్చుట మోదమ్మయె
ధర ధర్మోత్సాహదీప్తి తద్దయుగ్రాలన్.
పలుభామలు వెతలందుచు
విలవిలలాడంగజేయు వికటాత్ముండే
కలనను భామామణిచే
ఇలగూలెనరకుడె సత్యమిది యనతుదకున్.
ఖలులకు గుణపాఠమ్మిది
కలకలములరేపమానగా తగుకథయై
ఇలకున్ పాఠమ్మగుగా
తలపోయగ సత్యమిదియె తరతరములకున్.
రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం.
యంత్రములు - ఫలితాలు
యంత్రము అనగా ముందుకు వెళ్లేవి, ముందుకు నడిపించునవి అని అర్ధం. అంటే ఎవరైతే ఒక దైవ యంత్రాన్ని ఆరాధిస్తూ ఉన్నారో వారికి భగవదానుగ్రహం కలిగించును. అమ్మవారి లలితా సహస్రనామాలకు మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర, మహాసనా లని అమ్మవారి నామాలకి చెప్పబడుచున్నది అంటే అన్ని యంత్రములకు ప్రతినిధి అమ్మవారే.
ఇక భగవంతుని ప్రాణ శక్తి యంత్రరూపంగా ఉంటుంది. ఏ దేవాలయం నిర్మాణం జరిగినా ధ్వజస్ధంబం నిలబెట్టినా, దేవతా విగ్రహం ప్రతిష్టకంటే ముందు యంత్ర ప్రతిష్ట చేస్తారు. కారణం యంత్రానికి ఉండే అమోగమైన శక్తి ఆ దేవతామూర్తిలో ప్రవేశించి అమోగమైన చైతాన్యాన్ని కల్గిస్తున్నది. భారతదేశమున ఆదిశంకరాచార్యుల వారు అనేక దైవక్షేత్రాలలో శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన చేయబట్టి లోకం అంతా శాంతి సుభిక్షాలతో పాడిపంటలతో వర్ధిల్లిచున్నది అటువంటి శక్తి ఒక యంత్రానికి ఉన్నది.
అయితే అట్టి యంత్రాలు ఏమేం రకాలు ఉన్నాయో వాటి ప్రయోజనములు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
యంత్రములు ప్రయోజనములు
సంకట హర గణీశయంత్రము సర్వకార్యసిద్ధి
కుబేరయంత్రము ధనప్రాప్తి,ఆరోగ్యము
శ్రీ లక్ష్మీ గణేశ యంత్రము ధనప్రాప్తి
అష్ట లక్ష్మీ యంత్రము సౌభాగ్యము
వ్యాపారాకర్షణ యంత్రము సకలవ్యాపారవృద్ధి
స్ధిర లక్ష్మీ యంత్రము ధనము స్ధిరమగును
సౌభాగ్య లక్ష్మీ యంత్రము సౌభాగ్యప్రాప్తి
మహసౌర యంత్రము ఆరోగ్యసిద్ధి
నవగ్రహ యంత్రము నవగ్రహశాంతి
సర్వకార్య సిద్ధి యంత్రము కార్యసిద్ధి
మన్యు యంత్రము శతృపలాయనము.
మృత్యుంజయ యంత్రము అపమృత్యు భయనివారణ
ధన్వంతీరా యంత్రము ఆరోగ్యసిద్ధి
మహకార్తికేయ యంత్రము శతృజయం
మహ సుదర్మన యంత్రము ఆరోగ్యము,భయనివారణ
వాహనదుర్ఘటన నివారణ యంత్రము వాహనరక్షణ,వాహనసౌఖ్యము
నరగోష నివారణ యంత్రము దృష్టిదోష,నరగోష నివారణ
సరస్వతీ యంత్రము విద్యా ఉన్నతి
సంతాన గోపాల యంత్రము సంతానప్రాప్తి
కళ్యాణ గౌరీ యంత్రము వివాహప్రాప్తి
జనాకర్షణ యంత్రము సర్వజనవశ్యము
ధనాకర్షణ యంత్రము ధనప్రాప్తి
విద్యాభివృద్ధికర యంత్రము సర్వవిద్యాభివృద్ధి
ఉద్యోగప్రాప్తి యంత్రము ఉద్యోగప్రాప్తి
మత్స్య యంత్రము గృహదోషశాంతి
వాస్తుదోషహర యంత్రము వాస్తుదోష నివారణ
కూర్మ యంత్రము వాస్తుదోష నివారణ
అష్ట ధిక్పాలక యంత్రము దృష్టి దోషాది శాంతి
కార్యసిద్ధి యంత్రము సర్వకార్య సిద్ధి
మంగళ యంత్రము కుజదోష నివారణ
లక్ష్మీ ప్రాప్తి యంత్రము ధనాభివృది.
కనక ధారా యంత్రము ఐశ్వర్యప్రాప్తి
వైభవ లక్ష్మీ యంత్రము సర్వశుభకార్యసిద్ధి
కాత్యాయనీ యంత్రము వివాహప్రాప్తి
సుఖసమ్యద్ధి యంత్రము ఇష్టప్రాప్తి
గాయత్రి యంత్రము సద్బుద్ధిప్రసిద్ధి
దుర్గా సప్తశతీ యంత్రము జగన్మాత అనుగ్రహం ఉపాసనాసిద్ధి
రామ రక్షా యంత్రము సర్వదా రక్షణ
శతృ విజయ యంత్రము కార్యజయం
పుత్రే వివాహ యంత్రము వివాహ ప్రాప్తి
దత్తాత్రేయ యంత్రము దుష్టగ్రహబాధా నివారణ
సాయిరక్షా యంత్రము బాబా అనుగ్రహం
గర్భ ధారణ యంత్రము సంతాన ప్రాప్తి
శుభవాభ యంత్రము సర్వశుభప్రాప్తి
సర్వకార్య సిద్ధి యంత్రము కార్య సిద్ధి
బీసా యంత్రము విదేశీయానం
స్వస్తిక్ యంత్రము శుభప్రాప్తి
విజయ యంత్రము సర్వత్రావిజయం
శారదా యంత్రము విద్యాసక్తి
లగ్న యోగ యంత్రము వివాహప్రాప్తి
వాస్తు గణపతి యంత్రము వాస్తుదోష నివారణకు....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557