**అద్వైత వేదాంత పరిచయం**
8.6 దైవం :
ఈ సందర్భంలో యింకో అంశాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. భక్తి అంటే దేవుని మీద ఆరాధన అన్నాం. కాని దేవుడు ఎవరో తెలియకపోతే, అతని మీద భక్తి ఎలా ఏర్పడుతుంది? ముక్కూమొహం తెలియని వ్యక్తి మీద ప్రేమ ఎలా పుడుతుంది? అందుకే ఇప్పుడు పెళ్ళికి ముందే ప్రేమిస్తున్నాను’ అంటారు, పెళ్ళి చేసుకుంటారు. ఆ తర్వాత ఇంకా ఎక్కువ అర్థం చేసుకుని, ‘ నాకర్థమయ్యాడు, అందుకే ప్రేమించ లేకపోతున్నాను,’ అంటారు. దేవుని విషయంలో కూడా అంతే. దేవుడి స్వభావం తెలియందే
ఎలా ప్రేమిస్తాము?
అందుకని మనం దేవుని స్వభావం గురించి టూకీగా చర్చిద్దాం. శాస్త్రం దేవుణ్ణి గురించి మూడు నిర్వచనాలు యిస్తుంది, సాధకుని పరిపక్వతని బట్టి, మేధాశక్తిని బట్టి. ఆ మూడు స్థాయిలు ఏమిటో చూద్దాం.
8.6.1 మొదటి నిర్వచనం :దేవుడు సృష్టికర్త. సంస్క ృతంలో జగత్‌కర్తా ఈశ్వర: అంటారు. నిమిత్తకారణం అని కూడా అంటారు. దీన్ని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఏమిటది? ఏ అందమైన వస్తువుని చూసినా, దాని వెనుక దాన్ని సృష్టించిన మేధావి ఉంటాడు. ఆ వస్తువు ఎంత బ్రహ్మాండంగా
ఉంటే, అతని తెలివితేటల్ని అంతగా కీర్తిస్తాము. అంటే ఒక మామూలు వస్తువుని తయారుచేయటానికి ఒక మానవ మేధస్సు కావాలంటే, ఇంత క్రమబద్ధంగా ఉన్న, ఇంత లాభదాయకంగా ఉన్న ఈ అద్భుతమైన జగత్ వెనుక ఎవరు ఉన్నట్టు? ఎవరో కలుపుమొక్కని ఇలా నిర్వచించారు` ‘కలుపు మొక్క యొక్క లాభం యింకా కనుగొనలేదు’. అది అనవసరం కాదు,కాని మనకే యింకా దాని ప్రయోజనం తెలియలేదు అంతే.అంటే సృష్టిలో అనవసరమైన వస్తువంటూ ఏదీ లేదు. సృష్టి ఇంత లాభదాయకంగా, ఇంత అద్భుతంగా ఉందంటే, దాని వెనుక ఎవరో తెలివైన సృష్టికర్త
ఉన్నారన్నమాట. ఆ తెలివైన జగత్‌కర్త ఈశ్వరుడు. ఈశ్వరుడిని జగత్‌కర్తగా భావిస్తే, ఆ ఈశ్వరుడిని ఒక వ్యక్తిగా భావిస్తాము. ఎందుకంటే మనకి తెలిసిన తెలివైన వ్యక్తి మనిషి. అందుకని చాలా తెలివైన వ్యక్తిగాదేవుడిని ఊహించుకుంటాం. అతనిని సర్వజ్ఞునిగా, సర్వశక్తిమంతుడిగా ఊహించుకుంటాం. మనచుట్టూ కనబడడు కాబట్టి అతన్ని మేఘాలపైన వున్నట్టు ఊహించుకుంటాం. ఈ దేవుడు మనకి వ్యక్తిగత దేవుడు. మనకి తోచిన నామ, రూపాలు ఇచ్చుకుంటాం.రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి,శివుడువగైరా. ఈ దేవుడిని మనం ఏకరూప ఈశ్వర అందాం. ఒక రూపం దాల్చినదేవుడు.ఆరంభ దశలో ఉన్న భక్తుడికి ఈ దేవుడు.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి