13, నవంబర్ 2020, శుక్రవారం

నరులకు జూపిన

 నరకము నరులకు జూపిన

నరకుడె తల్లివలన మరణమునేపొందన్

ధర పండుగదిన మయ్యెను

నరు లానందమ్ముతోడ నడకలుసలుపన్.


నరనరమున విద్వేషము

వరధార్మిక జీవనమున వరలెడువానిన్

పరిమార్చుట మోదమ్మయె

ధర ధర్మోత్సాహదీప్తి తద్దయుగ్రాలన్.


పలుభామలు వెతలందుచు

విలవిలలాడంగజేయు వికటాత్ముండే

కలనను భామామణిచే

ఇలగూలెనరకుడె  సత్యమిది యనతుదకున్.


ఖలులకు గుణపాఠమ్మిది

కలకలములరేపమానగా తగుకథయై

ఇలకున్ పాఠమ్మగుగా

తలపోయగ సత్యమిదియె తరతరములకున్.


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం.

కామెంట్‌లు లేవు: