13, నవంబర్ 2020, శుక్రవారం

రామాయణమ్ 123

 రామాయణమ్  123


సుతీక్ష్ణ మహాముని ఆశ్రమాన్నుండి నాలుగు యోజనాల దూరం ఉన్నది అగస్త్య భ్రాత ఆశ్రమము .మార్గమంతా కడు రమణీయంగా ఉంది .

.

దూరంగా పిప్పలి వనం కనబడుతున్నది వారికి ,

ఫల పుష్పాల బరువుతో వంగిన వేలకొద్ది చెట్లు కనబడ్డాయి.గాలి బాగా వీచినప్పుడల్లా పండిన పిప్పళ్ళ వెగటైన వాసన వస్తున్నది.

.

లక్ష్మణా! ముని చెప్పినట్లుగా మనము అగస్త్యభ్రాత ఆశ్రమానికి వచ్చినట్లుగా ఉంది. బహుశా ఇది ఆయన ఆశ్రమమే అయి ఉండవచ్చు అని లోనికి ప్రవేశించారు .

.

లక్ష్మణా! ఒకప్పుడు వాతాపి,ఇల్వలుడు అనే క్రూరమైన రాక్షసులు ఇద్దరు ఉండేవారు. వాళ్ళు చాలా బలవంతులు

.

.వాళ్ళు బ్రాహ్మణులను చంపి తింటూ ఉండే వారు. బ్రాహ్మణులను చంపటానికి వారు ఒక  ప్రత్యేకమైన మార్గం  ఎంచుకున్నారు.

.

ప్రతిరోజూ ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి తద్దినానికి భోక్తలుగా  రమ్మన్నట్లుగా  ఒక నిర్దుష్టమైన భాషలో బ్రాహ్మణులను ఆహ్వానిస్తుండేవాడు, 

.

వాతాపి మేక రూపం ధరించే వాడు. ఆ మేక మాంసం బ్రాహ్మణులకు శ్రాద్ధ భోజనంగా వడ్డించేవాడు ఇల్వలుడు.

.

ఆ భోజనం బ్రాహ్మణులారగించిన వెంటనే 

వాతాపీ బయటకురా ! అని అరిచేవాడు ఇల్వలుడు. బ్రాహ్మణుల పొట్టలు బద్దలుకొట్టుకొంటూ వాతాపి బయటకు వచ్చేవాడు .

.

ఆ విధంగా ఎన్నో వేలమంది బ్రాహ్మణుల బ్రతుకులు బుగ్గిపాలు చేసారు సోదరులిద్దరూ.

.

 ఈ విషయం అగస్త్య మహామునికి తెలిసి స్వయంగా ఆయనే ఒక రోజు భోక్తగా వెళ్ళాడు. ఎప్పటిలాగే వాతాపి ఆహారరూపంలో అగస్త్యుడి కడుపులోకి వెళ్ళాడు..రోజుటిలాగే ఇల్వలుడు అరిచాడు ,

వాతాపీ బయటకు రా అని ,అగస్త్యమహర్షి నవ్వుతూ ఇంకెక్కడి వాతాపి వాడేప్పుడో నా కడుపులో జీర్ణమయ్యాడు అని అన్నాడు .

.

ఇల్వలుడికి కోపం వచ్చి మహర్షి మీదికి దూక బోతే ఆయన చూపు వాడిని భస్మం చేసేసింది. 

అంతటి మహామహిమాన్వితుడు అగస్త్యమహర్షి అని చెప్పాడు రామచంద్రుడు..

.

NB.

.

చిన్న పిల్లలకు అజీర్ణం వస్తే వారి పొట్ట నిమురుతూ మన పెద్దలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేది అందుకే

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: