12, జులై 2022, మంగళవారం

భారద్వాజ గోత్రం?!

 భారద్వాజ గోత్రం?!


1944లో ధర్మపురి జిల్లాలోని కృష్ణగిరి పక్కన ఉన్న కావేరీపట్టణంలో పూజ్యశ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఒక నెల పాటు మకాం చేశారు. అప్పుడు నేను ఆ ఊరి పోస్టు మాష్టరుగా పనిచేసేవాణ్ణి. స్వామివారి రోజూ వ్యవహారాల్లో నిమగ్నమైన ఎందఱో సామాన్య ప్రజలు, భక్తులు, ప్రముఖులు, ప్రభుత్వ అధికారులలో నేను కూడా ఒకడిని. మఠం యొక్క కార్యక్రమాల్లో ఎంతో సన్నిహితంగా నిమగ్నమయ్యే అవకాశంతో బాటు, ఎన్నోమార్లు పరమాచార్య స్వామివారు కారుణ్య దృష్టిని పొందగలిగిన భాగ్యవంతుణ్ణి.


తరువాతా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. మరొక ప్రాంతంలో మకాం చేస్తున్నప్పుడు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. స్వామివారు ఇస్తున్న తీర్థ ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన వందల మంది భక్తులతోపాటు నేను కూడా వరుసలో నిలబడి ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నాను. నా వంతు రాగానే, తీర్థం ఇస్తున్న స్వామివారు నన్ను చూసి, ఏదో అడుగుతున్నట్టుగా నన్ను చూసి కళ్ళు చిట్లించారు. స్వామివారు భావం అర్థం చేసుకుని, కావేరీపట్టణం పోష్టుమాష్టరుగా పనిచేస్తున్నప్పుడు నేను చేసుకున్న దర్శనం గురించి స్వామివారికి తెలిపాను. స్వామివారు చేతితో ఆశీర్వదిస్తూ, చక్కని చిరునవ్వుతో, “భారద్వాజ గోత్రం?” అని అన్నారు. ఇదంతా కేవలం రెండు క్షణాలలోనే జరిగిపోయినా, నాకు కలిగిన ఆనందం, అతిశయం వర్ణించడానికి మాటలు సరిపోవు.


ఈ సంఘటన ఎప్పుడూ నా మనస్సులో మెరుపులాగా జ్ఞప్తికి వస్తున్నా, పరమాచార్య స్వామివారి ఔదార్యం మరువలేనిది. వేలమంది స్వామివారిని దర్శించుకుంటారు, సేవ చేసుకుంటారు. కాని నన్ను చూడగానే, స్వామివారు నా గోత్రం చెప్పి, నన్ను ఆశీర్వదించడం స్వామివారి అమోఘమైన జ్ఞాపకశక్తికి, ఉనతమైన దాక్షిణ్యానికి, మొహోన్నతమైన సిద్ధికి తార్కాణం. ఏది ఏమైనా, అది వర్ణనాతీతం.


--- ఆర్.బి. గోపాలకృష్ణన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

గుండెపొటు గురించి

 గుండెపొటు గురించి సంపూర్ణ వివరణ  -  


    ఉపిరితిత్తులలో శుభ్రమైన రక్తమును అన్ని భాగాలకు సరఫరా చెసి చెడురక్తమును మరలా ఊపిరితిత్తులకు పంపించు సాధనం గుండె . ఇది ఒక పంపుసెట్ వలే పనిచేయును . శుభ్రపడిన రక్తమును తీసుకువెళ్ళునవి ధమనులు , చెడురక్తమును తీసుకెళ్ళునవి సిరలు అంటారు. నూనె , చక్కెర, తియ్యటివి , డాల్డా , నెయ్యి , మాంసం , చేపలు , గుడ్లు మొదలైన వాటిని అత్యధిక మోతాదులో విపరీతముగా వాడుట వలన ధమనులలో కొవ్వు ఏర్పడును . దీనిని కొలెస్టరాల్ అని పిలుస్తారు . 


                   ఈ కొలెస్టరాల్ పెద్ద రక్తనాళాల్లో పేరుకుని పొవడం వలన రక్తనాళం లోపలి వ్యాసార్థం తగ్గి గుండె పనిచేయుటకు కావలసినంత రక్తం సరఫరా కాదు . రక్తము నందలి ఉండు ఆక్సిజన్ గుండెకు అందకపోవడం వలన రక్తం గ్రహించుటకు గుండె అధికశ్రమ చేయవలసి ఉంటుంది. దీనివలన ఎడమవైపు రొమ్ములో నొప్పి కలుగును. దీనిని గుండెపొటు అంటారు. ఈ నొప్పి ఒక్కోసారి భరింప శక్యం కానంతగా ఉండును. ఇది ఎడమవైపు రొమ్ము నుండి ఎడమ భుజానికి అచట నుండి ఎడమ చేతి మణికట్టుకు కూడా పాకుతుంది. ఈ నొప్పితో ఊపిరి ఆడదు . చేతులు , కాళ్లు చల్లగా ఉండును. అధికంగా చెమటలు పట్టును . 


                  ఇది అత్యంత ప్రమాదకరం అయినది. ఇది ప్రాణాలు తీయుటలో మనదేశంలో మూడొవ స్థానము నందు కలదు. శారీరక శ్రమ ఎక్కువ చేయు వారిలో ఇది ఎక్కువ కనిపించును. 


  ఈ వ్యాధి నివారణోపాయాలు  - 


 *  నూనె , నెయ్యి , డాల్డాతో  తయారుచేసిన తీపి పదార్దాలు , చాకోలెట్స్ , అతి కారపు పదార్దాలు , మాంసం , చక్కెరలు వాడకూడదు . 


 *  తాజా ఆకుకూరలు , కూరగాయలు , ముఖ్యముగా ఎర్ర ఉల్లిగడ్డ , వెల్లుల్లి , సోయాబీన్స్ మొదలైన వాటిని విరివిగా వాడవలెను . 


 *  వెల్లుల్లి శ్వాసకోశ వ్యాధుల నివారణలో ఎంతో ప్రాముఖ్యత వహించును. TB వ్యాధి నివరణలో కూడా వాడతారు. రక్తమును శుభ్రపరచడంలో అత్యంత గుణకారిగా పనిచేయును . రక్తనాళాలను శుభ్రపరచును. రక్తమును పలుచబరిచి రక్తనాళాలలో సులభముగా ప్రసరించుటకు తోడ్పాటు అందించును. 


 *  ప్రతినిత్యం 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు తేనె లేదా బెల్లములో వేసి నలిపి తింటుంటే శ్వాసకోశ , హృదయ వ్యాధులు నివారణ అగును. 


 *  పీచుపదార్థం పుష్కలంగా కలిగిన ఆహారపదార్దాలు , అతిగా పాలిష్ పట్టని బియ్యం , పైన పొట్టు తియ్యని ఆపిల్ , కమలాలు , బత్తాయి కొనల పైన ఉండు తెల్లని పొరతో సహా తినవలెను . 


 *  ఎర్ర ఉల్లిగడ్డ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చును. సోయాచిక్కుడు , విటమిన్ E , క్యాల్షియం , మెగ్నీషియంలు గుండెపొటు రాకుండా కాపాడును . 


                    

                          

పరోపకారం

 శ్లోకం:☝️

*అష్టాదశ పురాణానాం*

  *సారం సారం సముద్ధృతం l*

*పరోపకారః పుణ్యాయ*

  *పాపాయ పరపీడనం ll*


భావం: పద్ధెనిమిది పురాణముల సారమును పిండగా పిండగా తేలినది యేమంటే పరోపకారం చేస్తే పుణ్యమని - పరపీడన చేస్తే పాపము చుట్టుకొంటుందని. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా మరచిపోయి నట్లుంటాం మనం!