8, ఆగస్టు 2023, మంగళవారం

Car engine heating prblm


 

Mango chetny


 

Malladi


 

Tirumala


 

Modiji


 

కర్మలే జన్మకు కారణం

 *శుభోదయం*

🙏💐🙏💐🙏


*కర్మలే జన్మకు కారణం. ఎలా?*

*జీవుడు దేవుడు ఎప్పుడు అవుతాడు?*


విత్తనము బీజంగా మారాలంటే దానిపై ఒక పొర ఉంటుంది... సారవంతమైన నేలలో ఆ బీజాన్ని నాటి, దానికి నీరు అందించినప్పుడు అది మొక్కగా మారి భూమిని చీల్చుకుని బయటకు వస్తుంది. ఇది సృష్టి.. 


అలాగే జీవుడు అహం (నేను) భావన (బీజం) తో  ఉన్నప్పుడు  అది మనసు  ఇంద్రియాలతో కలిసి కర్మ (మొక్క) గా మారుతుంది.. 


మొక్క వృక్షంగా మారి విత్తనాలుగా, ఆ విత్తనాలు మరెన్నో మొక్కలుగా ఎలాగైతే మారుతున్నాయో, అలాగే *అహం కర్మగా, కర్మ జన్మగా మారుతుంది..*


*విత్తనానికి బీజ పొర తొలగితే మొక్క లేదు.* 


*జీవుడికి అహంభావన పొర తొలగితే కర్మ లేదు.* 


*కర్మ లేకపోతే జన్మ లేదు.. జన్మలేని జీవుడు దేవుడే అవుతాడు..* 


అంటే 


*"నేను - అహం" (నేను అనే భావన) వదలితే జీవుడు దేవుడౌతాడు..* 


*ఓం నమో భగవతే శ్రీ రమణాయ*

🙏🙏🙏🙏🙏🙏

విజయం కోసం ధైర్యం తో

 *1824*

*కం*

ఓటమి తో కూలబడక

దీటగు విజయమ్ముకొరకు తేకువతోడన్

పాటుపడగ తధ్యం బగు

మేటివిజయ మనియెరుగుము మేకొని సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఓటమి తో కూలబడకుండా సరిపడే విజయం కోసం ధైర్యం తో  కష్టపడి తే తప్పకుండా గొప్ప విజయం లభిస్తుంది అని మేల్కొని తెలుసుకొనుము.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

⚜ శ్రీ కల్యాణేశ్వర్ నాద్ మందిర్

 🕉 మన గుడి : 






⚜ బీహార్ : మిథిలా


⚜ శ్రీ కల్యాణేశ్వర్ నాద్ మందిర్

  


💠బీహార్ రాష్ట్రమందు మధుబని జిల్లాలో ఇండో నేపాల్ సరిహద్దు వద్ద గల మిథిలా నగరము జనక చక్రవర్తి రాజధాని.


💠 ఈ ఆలయం దాని వైభవం, ప్రాచీనత మరియు చరిత్రకు ప్రసిద్ధి చెందింది, ఎందుకంటే ఈ ఆలయాన్ని జనక మహారాజు స్థాపించాడు 

 

💠 జనక మహారాజు మహాశివభక్తుడై తీవ్ర తపమాచరించుటచే జనకుని తపస్సుకు సంతోషించిన శివుడు  స్వయంగా కల్యాణేశ్వరుడుగా ,  గిరిజగా పార్వతి  ప్రత్యక్షమై అందరికి క్షేమాన్ని అనుగ్రహించారు. అప్పుడే ఈ గ్రామంలో కల్యాణేశ్వర్ మహాదేవ్ అనే పేరుతో మహాదేవుడు స్థాపించబడ్డాడు


💠 అంత శివుని వారి కులదైవముగా అచటనే ఉండమని కోరినాడు.జనక మహారాజు కోరిక మన్నించిన పరమశివుడు , అతని భక్తికి మెచ్చి తన శివ ధనుస్సు ను ఇచ్చి అనుగ్రహించాడు.

ఆ శివధనస్సు ను ఎక్కుపెట్టిన వాడే తనకి అల్లుడు కాగలిగినవాడు అని, తన కూతురు కల్యాణం లోక కల్యాణం కాగలదు అని వరం ప్రసాదించాడు శివుడు.


💠 ఇక్కడ జనకుడు నగరము నలువైపుల నాలుగు శివాలయములు నిర్మించెను.

దేవశిల్పి విశ్వకర్మ ఈ ఆలయమును నిర్మించెనందురు . 


💠  జనక మహారాజు మిథాలకు రాజు, అందుకే అతన్ని మిథిలేష్ అని కూడా పిలుస్తారు మరియు జనక్ పురి ఆ రాజ్యానికి రాజధాని.

మహాదేవ్ ఆలయాన్ని నిర్మించిన తర్వాత, జనకమహారాజు మిథాలా ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి పూజలు చేయడానికి ప్రతిరోజూ జనక్‌పూర్ నుండి వచ్చేవాడు అంటారు.


💠 ఈ పట్టణమున కల్నాబాబా లేక కల్నా పరమహంస అను ప్రముఖ బాబా కల్యాణేశ్వర్ ఆలయమందు ఉంటు తనను వేడిన జనుల సమస్యలు తీర్చుతూ ఉండేవాడు.


💠 ఈ ఆలయం రామాయణ కాలానికి సంబంధించినది కాబట్టి బీహార్ ప్రభుత్వం దీనిని బీహార్‌లో పర్యాటక కేంద్రంగా ప్రకటించింది.


💠 తులసీదాస్ ఈ ఆలయాన్ని తన రామచరితమానస్ అనే పుస్తకంలో వర్ణించారు, ఈ ఆలయాన్ని మిథాల ప్రాంతానికి ద్వారం అని పిలుస్తారు

 

💠 ఈ ఆలయ ప్రాంగణంలో అనేక దేవతల ఆలయాలు నిర్మించబడ్డాయి, ముఖ్యంగా శివుని  కుటుంబానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.  

బాబా భోలేనాథ్ కుటుంబంలో పార్వతీ , వినాయకుడి మరియు కార్తికేయుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.


💠 ఈ ఆలయం మధుబని జిల్లా పరిధిలోని కల్నా గ్రామంలో ఉంది. మధుబని జిల్లా కేంద్రం నుండి దీని దూరం కేవలం 30 కి.మీ.

ఐక్యమత్యం




 *ఈ తేనె టీగ లకు ఉన్న ఐక్యమత్యం మనుషుల్లో కనబడటం లేదు....ఒక బలమైన వర్గానికి చెందిన పెద్ద ఈగ తమ తోటి తేనె టీగని పట్టుకొని తినేయడం చూసిన మిగిలిన తేనె టీగలు అన్నీ అప్రమత్తం అయి కలిసి కట్టుగా ఆకారంలో బలంలో తమకంటే ఎన్నో రెట్లు పెద్దది అయిన ఆ ఈగ పై దాడి చేసి చంపేశాయి ....నేటి సమాజంలో ఇటువంటి ఐక్యమత్యం లేదు  ప్రతి మనిషి తన సౌఖ్యం చూసుకోవడం వలన సమాజం అక్రమార్కుల పాలనలోకి వెళ్ళి పోయింది....భవిష్యత్ భద్రతా దళం🤘...!!*✊✊✊✊✊✊✊✊✊✊✊✊

సనాతన ధర్మానికి ముఖ్యులు

 ఓం నమఃశివాయ. సనాతన ధర్మము.

 ఏమిటి యీ ధర్మము. ఎవ్వరికీ ధర్మము.యెవ్వరు యీ సనాతన ధర్మానికి ముఖ్యులు అవుతారు.

       బ్రాహ్మణ్యం సర్వ ధర్మజ్ఞము. లోకానామ్ కీర్తివర్ధనం

        వానప్రస్థం యెవ్వరు విషయము లో యీ ప్రస్తావన.

సర్వ సంగపరిత్యాగి అనివొక్క బ్రాహ్మణులకు మాత్రమే అని ఎందు కంటారు.

అంటే మనసా వాచా కర్మణా వైరాగ్య భావనలు తో అందరిలో వున్న అన్నింటితో వున్న తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలిగే మనస్తత్వము బ్రాహ్మనుకి వుండాలి.

దేనిమీదా ఆశక్తి వుండకుందా సర్వము లో పరబ్రహ్మము నే చూస్తూనే

పునారాహిత్య జన్మము ను కోరుకుంటూ తను అందరికీ ఆదర్శం గా నిలవాలి . అట్లా కాకుండా పేరు ప్రఖ్యాతలు కోసమో దన సంపాదన కోసమో వుంటున్న  బ్రాహ్మన్యము ఎంతవరకు సమంజసం. అలాంటివారు ఏటువంటిసనాతాన ధర్మాన్ని అనుసరి స్తున్నారు

పూజ్యులైన వాసిస్ట విశ్వామిత్ర  వాల్మీకి

బ్రుగు అత్రి లాంటి అతి పూజ్య  మహర్షులు రాజులు ప్రాధేయపడినా పాదా భి వందనములు చేసినా ఎన్ని లెఖ కట్టలేని చీని చీనాంబరములు ఆశ జూపినా అరన్యాలనే ఆశ్రయించారు. వైరాగ్యము తోనే వుంటూ గుప్తము గానే వున్నారు.

అశ్వద్ధామ ,బలి వ్యాసో హనుమాన్ విభీషణ కృప పరశురామస్య  ........ చిరంజీవన.

యీ కలియుగము న ప్రతి క్షణం వొక్క  భగవంతుని చింతన తప్ప అన్య విషయాలు కానీ అన్య చింతనలు కానీ లేకుండా తాను చూస్తున్న వింటున్న ఏ విషయాలకు కూడా చలిచక ఆ పరమేశ్వరుని తో కలసి జీవిస్తు వున్నటువంటి మహాను భావులే సర్వసంగ పరిత్యాగులవుతారు అని నా భావన. అందరూ అలా వుంటూ మొక్షపద సామ్రాజ్యాన్ని పొందటానికి ప్రయత్నము చేయాలని చేస్తారని ఆశిస్తూ.

ఓం నమఃశివాయ.

వొక విధము గా యిది వయస్సు తో సంబంధము లేక పోయినా 65 సంవస్థరములు దాటిన వారు గూర్చి మాత్రమే వ్రాయటం జరిగినది.

సర్వే జనా సుినోభవంతు.

ఓం నమఃశివాయ.

  గి

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 5*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 5*


*"ధ్యానం లో అనిర్వచనీయ ఆనందం"* 

              🌷🌷🌷

సన్యాసం పట్ల అనురక్తి శివుని పట్ల అభిరుచి పెరిగే కొద్దీ నరేంద్రుని ధ్యానాభ్యాసం కొనసాగింది.  ఒక రోజు స్నేహితులతో కలసి ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు హఠాత్తుగా అక్కడకు ఒక నల్లత్రాచుపాము ప్రాక్కొంటూవచ్చింది. పామును చూడగానే మిత్రులు  దూరంగా  వెళ్ళి అతణ్ణి పిలిచారు. నరేంద్రుడిలో చలనం లేదు. పరుగెత్తుకెళ్లి ఇంటివారితో విషయం చెప్పారు. 


వారు మేడమీదికి వెళ్లి చూసేసరికి నరేన్ నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. అతడి ముందు పాము పడగవిప్పి నిలబడివుంది. ఏం చేయ పాలుబోక వారు దిగ్భ్రాంతిలో ఉండగా, అదృష్టవశాత్తు పాము దానంతట అదే వెళ్లిపోయింది. అప్పటికీ నిశ్చల స్థితిలోనే ఉన్న నరేంద్రుని వద్దకెళ్లి అతణ్ణి లేపారు. "పాము రాగానే ఎందుకు పారిపోలేదు?" అని వారు అడిగాగ అందుకు అతడు, "పామును నేను చూడలేదు. అది రావడం నా కసలు తెలియదు.


 అనిర్వచనీయ ఆనందంలో మునిగి ఉన్నాను" అని జవాబిచ్చాడు.


అమ్మా ఏమిటో తెలియడం లేదు. నేను ఎన్నడో సన్న్యాసినై ఉండివుంటానని అనిపిస్తోంది. తప్పులు చేయకుండా, అల్లరి చేయకుండా ఉంటే శివుడు  నన్ను స్వీకరిస్తాడా?" అని అడిగేవాడు. అందుకు భువనేశ్వరీదేవి, "అవును" అని  జవాబిచ్చేది.


 కాని నరేంద్రుడి ప్రశ్న భువనేశ్వరీదేవి మనస్సును కలవరపరచేది. 'ఇతడు కూడా శివాన్వేషణలో సన్న్యాసి అయిపోతాడా?' అనే దిగులు ఆమె చోటుచేసుకొంది. 'అలా జరగడానికి ఆస్కారంలేదు. అలాంటి విషయాల గురించి యోచించగల వయస్సు కాదిది' అనుకొని ఊరడిల్లేది.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వృద్ధాప్యం పాదాల నుండి పైకి

 *వృద్ధాప్యం పాదాల నుండి పైకి మొదలవుతుంది!*

       

*మీ పాదాలను చురుకుగా బలంగా ఉంచండి. మన వయస్సు పెరుగుతున్నప్పుడు మరియు వృద్ధాప్యం చెందుతున్నప్పుడు, మన పాదాలు ఎల్లప్పుడూ చురుకుగా బలంగా ఉండాలి. మనం నిరంతరం వృద్ధాప్యం చెందుతున్నందున మన జుట్టు బూడిదరంగు (లేదా) చర్మం కుంగిపోవడం (లేదా) ముఖంపై ముడతలు పడటం గురించి మనం భయపడకూడదు. దీర్ఘాయువు సంకేతాల మధ్య ప్రముఖ యుఎస్ మ్యాగజైన్ "ప్రివెన్షన్" ద్వారా సంగ్రహించినట్లుగా సుదీర్ఘమైన ఫిట్ లైఫ్ బలమైన కాళ్ల కండరాల పైన అత్యంత ముఖ్యమైనవి మరియు అవసరమైనవిగా నిరూపణ చేయబడ్డాయి. మీరు కేవలం రెండు వారాల పాటు మీ కాళ్ళను కదపకపోతే మీ కాళ్ళ బలం 10 సంవత్సరాలు తగ్గుతుంది. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయం నుండి జరిపిన ఒక అధ్యయనంలో వృద్ధులు, యువకులు రెండు వారాలపాటు నిష్క్రియాత్మకత వల్ల కాళ్ల కండరాల బలం మూడవ వంతు బలహీనపడవచ్చు. ఇది 20-30 సంవత్సరాల వృద్ధాప్యానికి సమానం. మన కాలి కండరాలు బలహీనపడటం వలన, మనం తరువాత తెలుసుకుని వ్యాయామాలు చేసినప్పటికీ, కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల, నడక వంటి రెగ్యులర్ వ్యాయామం చాలా ముఖ్యం. మొత్తం శరీర బరువు / లోడ్ అలాగే ఉండి కాళ్లపై విశ్రాంతి తీసుకుంటుంది. పాదాలు ఒక రకమైన స్తంభాలు, మానవ శరీరం యొక్క మొత్తం బరువును భరిస్తూ ఉంటాయి. ఆసక్తికరంగా, ఒక వ్యక్తి యొక్క బలం ఎముకలలో 50% & కండరాలలో 50%, రెండు కాళ్లలో ఉంటాయి. మానవ శరీరంలోని అతి పెద్ద బలమైన కీళ్ళు మరియు ఎముకలు కూడా కాళ్లలో ఉన్నాయి. రోజు 10 వేల  అడుగులు నడవండి. బలమైన ఎముకలు, బలమైన కండరాలు మరియు సౌకర్యవంతమైన కీళ్ళు ఐరన్ ట్రయాంగిల్ ను ఏర్పరుస్తాయి. ఇవి అత్యంత ముఖ్యమైన భారాన్ని కలిగి ఉంటాయి. 70% మానవ కార్యకలాపాలు మరియు ఒకరి జీవితంలో శక్తి దహనం (burning of calories) రెండు పాదాల ద్వారా జరుగుతుంది. ఒక వ్యక్తి చిన్న వయస్సులో ఉన్నప్పుడు, అతని/ఆమె తొడలు 800 కిలోల చిన్న కారును ఎత్తడానికి తగినంత బలాన్ని కలిగి ఉంటాయి. పాదము శరీర లోకోమోషన్ కాళ్లు రెండూ కలిపి మానవ శరీరంలోని 50% నరాలను, 50% రక్తనాళాలను మరియు 50% రక్తం వాటి ద్వారా ప్రవహిస్తున్నాయి. ఇది శరీరాన్ని కలిపే అతి పెద్ద ప్రసరణ నెట్‌వర్క్. ఒకవేళ  పాదాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది, కనుక బలమైన కాలు కండరాలు ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా బలమైన హృదయాన్ని కలిగి ఉంటారు. వయస్సు పాదాల నుండి పైకి మొదలవుతుంది. ఒక వ్యక్తి యవ్వనంలో ఉన్నప్పటి కంటే  వయస్సు పెరిగే కొద్దీ మెదడు మరియు కాళ్ల మధ్య సూచనల ప్రసార ఖచ్చితత్వం వేగం తగ్గుతుంది. కాబట్టి దయచేసి నడవండి. అదనంగా, బోన్ ఫెర్టిలైజర్ కాల్షియం అని పిలవబడేది కాలక్రమేణా త్వరగా తగ్గి పోతుంది. ఇది వృద్ధులను ఎముక పగుళ్లకు గురి చేస్తుంది. వృద్ధులలో ఎముక పగుళ్లు ముఖ్యంగా మెదడు త్రోంబోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను సులభంగా ప్రేరేపిస్తాయి. తొడ ఎముక విరిగిన సంవత్సరం లోపు 15% మంది వృద్ధ రోగులు సాధారణంగా చనిపోతారని మీకు తెలుసా. కాళ్లు వ్యాయామం చేయడం 60 ఏళ్లు దాటినప్పటికీ చాలా ఆలస్యం కాదు. కాలంతో పాటు మన పాదాలు/ కాళ్లు క్రమంగా వయస్సు మీద పడుతున్నప్పటికీ మన పాదాలకు / కాళ్లకు వ్యాయామం చేయడం అనేది జీవితకాల పని. 10,000 అడుగులు నడవండి. కాళ్లను క్రమం తప్పకుండా బలోపేతం చేయడం ద్వారా ఒకరు మరింత వృద్ధాప్యాన్ని నివారించవచ్చు లేదా తగ్గించవచ్చు. 365 రోజులు నడవండి. దయచేసి మీ కాళ్లకు తగినంత వ్యాయామం అందేలా మరియు మీ కాలికండరాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడానికి రోజూ కనీసం 30-40 నిమిషాలు నడవండి.*


*మీరు ఈ సమాచారాన్ని మీ మంచి కోరే స్నేహితులు మరియు కుటుంసభ్యులతో పంచుకోండి*🙏

పద్యము హృద్యమై చెలగి

 



ఉ. 

పద్యము హృద్యమై చెలగి భవ్యముగా ప్రభవించ హేతువై 

పద్యము పాడగా దగిన బాటల నాటకరంగమందు తా 

రాద్యవిధాన మేర్పరచి యౌర! భళా! యను కేక లందగా 

వేద్యుడు చెళ్ళపిళ్ళ సుకవీశుడె మూలము తెల్గుగడ్డపై 

*~శ్రీశర్మద*

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 12*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 12*



🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

 *చోళరాజునకు విష్ణుమూర్తి ఘోరశాపమిచ్చుట* 


గోపాలుడు ఏమి కొంప మునుగుతుందో నను భయముతోనే వచ్చాడు. చోళరాజు భార్య వానిపై మండిపడుతూ ‘‘ఓరీ! మనసు పడి కొంటిమిగదా ఆ క్రొత్త ఆవును? మనకు దాని ఉపయోగమేమిటి!

ఒక్కరోజయినా నీవు ఆ ఆవుపాలు సరిగా పతికి తెచ్చితివా? పాలు యివ్వనందుకు అది పాడుయావు అందువేమో, అది పాడుయావు గాదు. నాకు దీనిలోగుట్టు తెలిసియే యున్నది. 


నీవు ఏమియూ తెలియని నంగనాచివలెనున్నావు కాని, నీవు ఆ యావు పాలను ప్రతిదినము త్రాగి వేయుచున్న సంగతి ఎందులకు దాచెదవు? లేకున్న ఆ చిక్కని పాలను చక్కగా అంగడిలో అమ్ముచు ధనము గడించుచుంటివా!’’ అని ఆరోపణలతో కోప వాక్యములు పలికినది.


ఆ నిందా వాక్యములు వినజాలక, అతడు ‘‘తల్లీ! మనస్సాక్షిగా చెప్పుచున్నాను వినుము. నేనేవిధముగా కూడ అన్యాయము చేయలేదు తల్లీ! దీని కంతకూ నేనే మాత్రమునూ బాధ్యుడను గాను. 


ప్రతి దినము సాయంకాలము నేను తక్కినయావులవలెనే ఆ యావు నుండి గూడ పాలు తీయుదమని వెడలుటయు, వింతగా దాని చన్నులు పాలులేని కారణముగ ఎండి పోవుటయు జరుగుచున్నది. కారణమేమియో నాకున్నూ తెలియరాకున్నది’’ అనినాడు.


రాణి గొల్లవాని మాటలు నమ్మలేదు. ‘‘ఓరీ నీ మాటలు నమ్ముట కష్టము. ఇదిగో చెప్పుచున్నాను వినుము – నీ మాటలను కట్టిపెట్టి నేటి నుండి ఆ యావుపాలు తీసికొని రావలసినదే! లేకున్న కఠినాతి కఠినముగ నిన్ను శిక్షించుట జరుగును.


 ఒడలు దగ్గరపెట్టుకొని మసలుకొనుము’’ అని మందలోని ఆ క్రొత్త యావు విషయమై మందలించినది. మందలించుటయేమి – హెచ్చరించినది.


 ‘‘సరే ఇక నుండి నేను మీరు చెప్పినట్లే నడచుకొనగలవాడనన్నాడు వినయముగా గోపాలుడు.


రోజూలాగే ఆనాడు కూడా గోపాలుడు ఆవులమందను మేత కొరకు శేషాచలము మీదకు తోలుకొని వెళ్ళినాడు. రాజుగారి భార్య తనకు చీవాట్లు పుష్కలముగా పెట్టి వుండుట వలన ఆ రోజు అతడి దృష్టి ఆ క్రొత్త ఆవు వైపు దాని పొదుగు వైపే వున్నది. 


ఆ యావు కదలికతో తన దృష్టిని గూడ కదలించుచుండెను, జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూయున్నాడు. ఆ క్రొత్త యావు మెల్లమెల్లగా వెళ్ళి ఆ పుట్టను చేరినది. చేరి క్షీరధారను పుట్టలోనికి కార్చుట మొదలు పెట్టినది. 


ఇది చూసిన గోపాలునకు యాశ్చర్యము, కోపము కలసి వచ్చినవి. ఒడలు మండిపోయింది గోపాలునకు ఓహో రోజూ యిది ఈ విధముగాచేయుచున్నదా? అని అనుకొన్నాడు. ఆవు దగ్గరకు వెళ్ళినాడు. 


పొదుగును పుట్ట పై యుంచి పాలను పుట్టపాలు చేయుచున్నందులకు అతనికి అరికాలి మంట నెత్తికెక్కినది.


కోపము హెచ్చినచో విచక్షణాశక్తి తరిగిపోవునుగదా! 


అతని చేతిలోనున్నది మరొకటి కాదు. గండ్రగొడ్డలాయె. గోపాలుడు దానిని ఎత్తి ఆవు నెత్తి పై కొట్టబోయినాడు. 


తనకుపకారము చేయుచున్న ఆవుకు ఆపద రాబోవుట చూచి శ్రీమన్నారాయణుడు వెంటనే పుట్టలో నుండి పైకి వచ్చి ఆవునకు అడ్డుపడగా గొల్లవాని గొడ్డలి వ్రేటు నారాయణునికే తగిలెను.


ఆయన తల పై తగిలి అదేపనిగా రక్తధారలు వెలువడజొచ్చినవి. ఆశ్చర్యకరమైన ఆ రక్తధారలు చూసి చూడగానే ఆ గోపాలుని కళ్ళు తిరిగి నేలపై బడి మూర్చపోయినాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


*శ్రీ ముద్రాంకిత గోవిందా, శ్రీవత్సాంకిత గోవిందా;* *ధరణీనాయక గోవిందా,* *దినకరతేజా గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,* 

*గోవిందా హరి గోవిందా,*

*వేంకట రమణా గోవిందా.* 12||


*జై శ్రీమన్నారాయణ*

*ఓం నమో వేంకటేశాయ*🙏

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 12*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 12*



🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

 *చోళరాజునకు విష్ణుమూర్తి ఘోరశాపమిచ్చుట* 


గోపాలుడు ఏమి కొంప మునుగుతుందో నను భయముతోనే వచ్చాడు. చోళరాజు భార్య వానిపై మండిపడుతూ ‘‘ఓరీ! మనసు పడి కొంటిమిగదా ఆ క్రొత్త ఆవును? మనకు దాని ఉపయోగమేమిటి!

ఒక్కరోజయినా నీవు ఆ ఆవుపాలు సరిగా పతికి తెచ్చితివా? పాలు యివ్వనందుకు అది పాడుయావు అందువేమో, అది పాడుయావు గాదు. నాకు దీనిలోగుట్టు తెలిసియే యున్నది. 


నీవు ఏమియూ తెలియని నంగనాచివలెనున్నావు కాని, నీవు ఆ యావు పాలను ప్రతిదినము త్రాగి వేయుచున్న సంగతి ఎందులకు దాచెదవు? లేకున్న ఆ చిక్కని పాలను చక్కగా అంగడిలో అమ్ముచు ధనము గడించుచుంటివా!’’ అని ఆరోపణలతో కోప వాక్యములు పలికినది.


ఆ నిందా వాక్యములు వినజాలక, అతడు ‘‘తల్లీ! మనస్సాక్షిగా చెప్పుచున్నాను వినుము. నేనేవిధముగా కూడ అన్యాయము చేయలేదు తల్లీ! దీని కంతకూ నేనే మాత్రమునూ బాధ్యుడను గాను. 


ప్రతి దినము సాయంకాలము నేను తక్కినయావులవలెనే ఆ యావు నుండి గూడ పాలు తీయుదమని వెడలుటయు, వింతగా దాని చన్నులు పాలులేని కారణముగ ఎండి పోవుటయు జరుగుచున్నది. కారణమేమియో నాకున్నూ తెలియరాకున్నది’’ అనినాడు.


రాణి గొల్లవాని మాటలు నమ్మలేదు. ‘‘ఓరీ నీ మాటలు నమ్ముట కష్టము. ఇదిగో చెప్పుచున్నాను వినుము – నీ మాటలను కట్టిపెట్టి నేటి నుండి ఆ యావుపాలు తీసికొని రావలసినదే! లేకున్న కఠినాతి కఠినముగ నిన్ను శిక్షించుట జరుగును.


 ఒడలు దగ్గరపెట్టుకొని మసలుకొనుము’’ అని మందలోని ఆ క్రొత్త యావు విషయమై మందలించినది. మందలించుటయేమి – హెచ్చరించినది.


 ‘‘సరే ఇక నుండి నేను మీరు చెప్పినట్లే నడచుకొనగలవాడనన్నాడు వినయముగా గోపాలుడు.


రోజూలాగే ఆనాడు కూడా గోపాలుడు ఆవులమందను మేత కొరకు శేషాచలము మీదకు తోలుకొని వెళ్ళినాడు. రాజుగారి భార్య తనకు చీవాట్లు పుష్కలముగా పెట్టి వుండుట వలన ఆ రోజు అతడి దృష్టి ఆ క్రొత్త ఆవు వైపు దాని పొదుగు వైపే వున్నది. 


ఆ యావు కదలికతో తన దృష్టిని గూడ కదలించుచుండెను, జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూయున్నాడు. ఆ క్రొత్త యావు మెల్లమెల్లగా వెళ్ళి ఆ పుట్టను చేరినది. చేరి క్షీరధారను పుట్టలోనికి కార్చుట మొదలు పెట్టినది. 


ఇది చూసిన గోపాలునకు యాశ్చర్యము, కోపము కలసి వచ్చినవి. ఒడలు మండిపోయింది గోపాలునకు ఓహో రోజూ యిది ఈ విధముగాచేయుచున్నదా? అని అనుకొన్నాడు. ఆవు దగ్గరకు వెళ్ళినాడు. 


పొదుగును పుట్ట పై యుంచి పాలను పుట్టపాలు చేయుచున్నందులకు అతనికి అరికాలి మంట నెత్తికెక్కినది.


కోపము హెచ్చినచో విచక్షణాశక్తి తరిగిపోవునుగదా! 


అతని చేతిలోనున్నది మరొకటి కాదు. గండ్రగొడ్డలాయె. గోపాలుడు దానిని ఎత్తి ఆవు నెత్తి పై కొట్టబోయినాడు. 


తనకుపకారము చేయుచున్న ఆవుకు ఆపద రాబోవుట చూచి శ్రీమన్నారాయణుడు వెంటనే పుట్టలో నుండి పైకి వచ్చి ఆవునకు అడ్డుపడగా గొల్లవాని గొడ్డలి వ్రేటు నారాయణునికే తగిలెను.


ఆయన తల పై తగిలి అదేపనిగా రక్తధారలు వెలువడజొచ్చినవి. ఆశ్చర్యకరమైన ఆ రక్తధారలు చూసి చూడగానే ఆ గోపాలుని కళ్ళు తిరిగి నేలపై బడి మూర్చపోయినాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


*శ్రీ ముద్రాంకిత గోవిందా, శ్రీవత్సాంకిత గోవిందా;* *ధరణీనాయక గోవిందా,* *దినకరతేజా గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,* 

*గోవిందా హరి గోవిందా,*

*వేంకట రమణా గోవిందా.* 12||


*జై శ్రీమన్నారాయణ*

*ఓం నమో వేంకటేశాయ*🙏

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శివానందలహరీ

 శివానందలహరీ 


సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా

న మన్యే స్వప్నే  వా తదనుసరణం తత్కృత ఫలమ్

హరి బ్రహ్మాదీనా మపి నికటభాజా మసులభం 

చిరం యాచే శంభోశివ తవ పదాంభోజ భజనమ్  




అల్పమౌ ఫలముల నందించు చున్నట్టి

            వేల్పులు వెదుకంగ వేలు  గలరు

వారిచ్చు ఫలములన్ వారల విభవమున్

            కలనైన  క్షణమైన తలచ బోను  

నిరతంబు సేవలన్ నీచెంత నుండెడి

            హరి పద్మజాదుల యమరు లకును           

ప్రాప్తించ నట్టి నీ పదపద్మ సేవనే

             నిరతంబు కోరుదు  నియతి తోడ

కరుణతోడను నాకు నా కలిమి నిమ్ము

శంకరా ! భవ ! సర్వేశ ! శశివిభూష !

సర్వశుభకర! త్రిపురారి ! సాంబ ! దేవ !

భక్తమందార! పరమేశ! పాహి పాహి            04 @

చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి

 నిత్యాన్వేషణ:


చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారికి ఎందుకు అంత పేరు ప్రఖ్యాతులు లభించాయి?


దీనికి ముందుగా దివాకర్ల తిరుపతిశాస్త్రిగారు ఒక సందర్భంలో చెప్పిన మాటని చెప్పాలి.

ఎప్పుడూ తగాదాలాడుకుంటూ వుండే దివాకర్ల తిరుపతిశాస్త్రిని, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిని కలిపి అంటుకట్టి కీర్తిని, డబ్బుని నొల్లుకుంటూ గడపమని దేశం మీదకి వదిలారు గురువుగారు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి.

అలా అవధానాలు చేసుకుంటూ, చేసుకుంటూ పోలవరం జమీందారు వద్ద ఆస్థాన పండితునిగా ప్రవేశించాడు, దివాకర్లాయన. బందరు హైస్కూల్ లో తెలుగు టీచరయ్యారు చెళ్లపిళ్ల. కలిసి దేశం తిరగటం తగ్గింది.

నరసరావుపేటలోనో లేదా నూజివీడులోనో శతావధానానికి పిలుపు వచ్చింది. తను రాలేనని, దివాకర్ల ఒక్కడినే వెళ్ళమని చెళ్లపిళ్లవారు ఉత్తరం రాశారు. తిరుగుటపాలో దివాకర్ల "నువ్వు వస్తేనే సభ రక్తి కడుతుంది. జనం ఆనందిస్తారు. నేను ఒక్కడినే వెళితే ' ఎవరో వైదీకపు పోతుపేరంటాలు వచ్చి వెళ్లింది' అంటారు. అందుకని నువ్వు వస్తేనే వెళ్తాను" అని రాశారు.

దివాకర్లవారి సమాధానాన్ని బట్టి మీకు అర్థమై వుండాలి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారికి ఎందుకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయో!

చెళ్లపిళ్లవారు ధారాళంగా మాట్లాడగలరు. ఏకబిగిన 5, 6 గంటలపాటు కూడా.

మధ్య మధ్యలో సాహిత్య చమత్కారాలు, పిట్టకథలు, శృంగార జోక్స్, ప్రత్యర్ధులపై ఆశు ఎత్తుపొడుపులు….. ఓ… జల్లు జల్లులుగా పడుతుండేవి. వేరు వినోదాలు లేని ఆ రోజులలో జనం నోరు తెరుచుకొని వింటూ వుండేవారు. మీరు కథలు గాథలు చదివితే ఆయన శైలి, ఆయన ముచ్చట్లు, ఆయన చమత్కారాలు అన్నీ వివరంగా తెలుస్తాయి.

యివన్నీ కాక సాహిత్యంలో యోధానుయోధులైనవారు కలకాలం సాహిత్యంలో నిలిచిపోయే పేరుపెంపులు గలవారు ఆయన శిష్యులు.

యీ కారణాలు చాలవా, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారికి అతిశయించిన పేరుప్రఖ్యాతులు కలగటానికి!

షడూర్ములు'

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


షడ్భిరూర్మిభిరయోగి యోగిహృద్

భావితం న కరణైర్విభావితమ్ |

బుద్ధ్యవేద్యమనవద్యమస్తి యద్

బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని ॥


𝕝𝕝 *తాత్పర్యము* 𝕝𝕝


*ఆకలి, దప్పిక, దుఃఖము, క్షీణించడం, మరణించడం, భ్రాంతి అనే ఆరింటినీ 'షడూర్ములు'అందురు*. 


*ఈ షడూర్ములకు అతీతమూ......యోగీశ్వరుల హృదయాలు - ధ్యానించేదీ* ఇంద్రియాలకు, బుద్ధికి సైతం అగోచరమూ, ఎదురులేనిదీ అయిన " *ఆ పరబ్రహ్మం* " గూర్చి హృదయంలో ధ్యానించు !


🧘‍♂️🙏🪷 ✍️VKS©️MSV🙏

వదులుకోవడమే

 శ్లోకం:☝️

*తపః స్వధర్మవర్తిత్వం*

  *మనసో దమనం దమః |*

*క్షమా ద్వంద్వసహిష్ణుత్వం*

   *హీరకార్యనివర్తనం ||*


భావం: ధర్మం(కర్తవ్యం)లో నిమగ్నమై ఉండటమే _తపస్సు_. మనస్సును అదుపులో ఉంచుకోవడం _దమం_. సుఖ-దుఃఖ, లాభ-నష్టాలలో సమాన దృక్పథం కలిగి ఉండటమే _క్షమ_. చేయకూడని పనులు వదులుకోవడమే (చేయకపోవడమే) _లజ్జ_.

పంచాంగం 08.08.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 08.08.2023 Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస కృష్ణ  పక్ష: అష్టమి తిధి భౌమ వాసర: భరణి నక్షత్రం గండ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


అష్టమి రాత్రి 03:53 వరకు.

భరణి రాత్రి 01:34 వరకు.

సూర్యోదయం : 06:01

సూర్యాస్తమయం : 06:43

వర్జ్యం : పగలు 11:01 నుండి 12:38 వరకు.

దుర్ముహూర్తం: పగలు 08:33 నుండి 09:24 వరకు తిరిగి రాత్రి 11:14 నుండి 11:59 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం : పగలు09:00 నుండి 10:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

ప్రవచనం

 ఈ బ్లాగరు హిందూ ధర్మం టి.వి. లో చేసిన ప్రవచనం


https://youtu.be/4BcGF2xVs54

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 



                             శ్లోకం:41/150 


సిద్ధయోగీ మహర్షిశ్చ 

సిద్ధార్థ స్సిద్ధసాధకః I 

భిక్షుశ్చ భిక్షురూపశ్చ 

విపణో మృదురవ్యయః ॥ 41 ॥  


* సిద్ధయోగీ = సిద్ధించిన యోగము కలవాడు, 

* మహర్షిః = ఋషులలో గొప్పవాడు, 

* సిద్ధార్థః = సిద్ధించిన ప్రయోజనము కలవాడు, 

* సిద్ధసాధకః = సిద్ధమగునట్లు సాధించువాడు, 

* భిక్షుః = భిక్షాటనము చేయువాడు, 

* భిక్షురూపః = భిక్షుకుల రూపమున ఉన్నవాడు, 

* విపణః = వస్తువుల క్రయవిక్రయములు చేయువాడు, 

* మృదుః = మెత్తనైనవాడు, 

* అవ్యయః = నాశము లేనివాడు.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

Photo






 

Beeaty of life

 



*