8, ఆగస్టు 2023, మంగళవారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 5*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 5*


*"ధ్యానం లో అనిర్వచనీయ ఆనందం"* 

              🌷🌷🌷

సన్యాసం పట్ల అనురక్తి శివుని పట్ల అభిరుచి పెరిగే కొద్దీ నరేంద్రుని ధ్యానాభ్యాసం కొనసాగింది.  ఒక రోజు స్నేహితులతో కలసి ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు హఠాత్తుగా అక్కడకు ఒక నల్లత్రాచుపాము ప్రాక్కొంటూవచ్చింది. పామును చూడగానే మిత్రులు  దూరంగా  వెళ్ళి అతణ్ణి పిలిచారు. నరేంద్రుడిలో చలనం లేదు. పరుగెత్తుకెళ్లి ఇంటివారితో విషయం చెప్పారు. 


వారు మేడమీదికి వెళ్లి చూసేసరికి నరేన్ నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. అతడి ముందు పాము పడగవిప్పి నిలబడివుంది. ఏం చేయ పాలుబోక వారు దిగ్భ్రాంతిలో ఉండగా, అదృష్టవశాత్తు పాము దానంతట అదే వెళ్లిపోయింది. అప్పటికీ నిశ్చల స్థితిలోనే ఉన్న నరేంద్రుని వద్దకెళ్లి అతణ్ణి లేపారు. "పాము రాగానే ఎందుకు పారిపోలేదు?" అని వారు అడిగాగ అందుకు అతడు, "పామును నేను చూడలేదు. అది రావడం నా కసలు తెలియదు.


 అనిర్వచనీయ ఆనందంలో మునిగి ఉన్నాను" అని జవాబిచ్చాడు.


అమ్మా ఏమిటో తెలియడం లేదు. నేను ఎన్నడో సన్న్యాసినై ఉండివుంటానని అనిపిస్తోంది. తప్పులు చేయకుండా, అల్లరి చేయకుండా ఉంటే శివుడు  నన్ను స్వీకరిస్తాడా?" అని అడిగేవాడు. అందుకు భువనేశ్వరీదేవి, "అవును" అని  జవాబిచ్చేది.


 కాని నరేంద్రుడి ప్రశ్న భువనేశ్వరీదేవి మనస్సును కలవరపరచేది. 'ఇతడు కూడా శివాన్వేషణలో సన్న్యాసి అయిపోతాడా?' అనే దిగులు ఆమె చోటుచేసుకొంది. 'అలా జరగడానికి ఆస్కారంలేదు. అలాంటి విషయాల గురించి యోచించగల వయస్సు కాదిది' అనుకొని ఊరడిల్లేది.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: