21, జులై 2023, శుక్రవారం

పునర్జన్మ న విద్యతే*

 *ప్రాతఃకాలే స్త్రీ ప్రసంగే*   *మధ్యాహ్నే  ద్యూత  ప్రసంగం*  

 *రాత్రౌ చోర  ప్రసంగేన      పునర్జన్మ న విద్యతే*

 

అర్థము:--ప్రోద్దునపూట స్త్రీ లను గురించి,మధ్యాహ్నం జూదము గురించి రాత్రి దొంగల గురించిన ప్రసంగము చేసిన పునర్జన్మ వుండదు. ఇదేమి విచిత్రమైన శ్లోకం ???  


ఉదయం రామాయణం (సీత కథ) ,మధ్యాహ్నం లో భారతం ( జూదం కలిగిన కథ ), రాత్రి భాగవతం శ్రీకృష్ణ ( మానస చోరుడు ) ప్రసంగం ఈ వినాలని ఆ శ్లోక భావం

మూత్రపిండములలో రాళ్లు

 మూత్రపిండములలో రాళ్లు కరిగించు గొప్ప ఔషధ యోగములు  - 


 *  కానుగ గింజలలోని పప్పు మూడు గ్రాములు తీసుకుని పొడిచేసి 60 మిల్లీలీటర్ల ఆవుపాలలో కలిపి లోపలికి తీసుకొనుచుండిన మూత్రపిండాలలోని రాళ్లు పడిపోవును .


 *  యవాక్షరం , బెల్లం సమాన భాగాలుగా కలిపి రెండు గ్రాముల చొప్పున రోజుకొకసారి ఒక వారం నుంచి పదిరోజులపాటు తినిన రాళ్లు కరిగి పడిపోవును . దీనితో పాటు బూడిదగుమ్మడికాయ రసం కూడా వాడిన ఫలితం తొందరగా కనిపించును.


 *  వేపాకు నీడలో ఎండించి కాల్చి భస్మం చేసి పూటకు ఒకటిన్నర గ్రాము చొప్పున ఒకరోజు నిలువ ఉంచిన నీళ్లతో కలిపి తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాయి కరిగిపోవును . రెండుపూటలా తీసికొనవలెను .


 *  రణపాల ఆకు రసము 6 గ్రాములు కాచిన వెన్న 13 గ్రాములు కలిపి ప్రతినిత్యము తాగుచున్న రాళ్లు కరుగును.


 *  పల్లేరు చూర్ణం ఒక స్పూన్ , కొండపిండి చూర్ణం ఒక స్పూన్ ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాళ్లు నివారణ అగును.


 *  పొద్దుతిరుగుడు పువ్వు చెట్టు వేర్లు పొడి 25 గ్రాములు తీసుకుని ఒక లీటర్ తియ్యటి మజ్జిగతో కలిపి తీసుకొనుచున్న రాళ్లు కరుగును.


 *  పూటకు రెండు వెల్లుల్లి రేకల గుజ్జు తినుచున్న మూత్రాశయపు రాళ్లు కరుగును. అలా అప్పుడప్పుడు తినుచున్న రాళ్లు పుట్టవు .


  మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు  -


 తినవలసిన ఆహారపదార్దాలు  -


  పాతబియ్యపు అన్నం , యవలు , గోధుమలు , ఉలవలు , పెసలు , మజ్జిగ , ఆవునెయ్యి , ఆవుపాలు , పెసరకట్టు , ఉలవకట్టు , అల్లం , తియ్యని కల్లు , చక్కెర , ముదురు గుమ్మడికాయ , బూడిద గుమ్మడికాయ , పొట్లకాయ , కొండపిండికూర , పల్లేరుకూర , చిర్రికూర , పెరుగుతోటకూర , ఖర్జురము , వెదురుమొలకలు , కొబ్బరికాయ , తాటిముంజలు , నక్కదోసకాయ , మేకమాంసం .


 తినకూడని ఆహార పదార్ధాలు  -


    మలబద్ధకర ఆహారాలు , చద్ది అన్నం , బిరుసుఅన్నం , తాంబూలం , ఎక్కువ ఉప్పు గల ఆహారపదార్థాలు , ఎక్కువ నూనె , పిండివంటలు , నువ్వులపిండి , పులుసు , ఇంగువ , నువ్వులు , ఆవాలు , మినుములు , మామిడికాయ , వెల్లుల్లి మొదలగు వేడివస్తువులు , మలబద్దకాన్ని కలిగించు వస్తువులు , కోడిమాంసం , పందిమాంసం , చేపలు , మద్యం , మైథునం , అతిశ్రమ , మూత్రము , వీర్యము నిరోధము చేయరాదు . 


         పైన చెప్పిన ఆహారపదార్ధాలు పాటిస్తూ ఔషధాలను వాడగలరు .


  

   మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


 ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

        9885030034                     


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


 కాళహస్తి వేంకటేశ్వరరావు .


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

నిత్య సుమంగళి మండోదరి

 🕉️ నిత్య సుమంగళి మండోదరి....!! 🕉️


🌿మయాసురుడనే రాక్షసుడు గొప్పశిల్పి.  అతడికి మయబ్రహ్మ అని కూడా పేరు. ఆయన భార్య హేమ. ఆమె గంధర్వకాంత. వారి సంతానమే మండోదరి. ఆమె అత్యంత సౌందర్యవతి. సుగుణవతి. 


🌸తనకు ఒక అందమైన భవనం నిర్మించి ఇమ్మని అడగడం కోసం మయుడి వద్దకు వెళ్లిన రావణుడికి అనుకోకుండా మండోదరి కంట పడుతుంది. 

మొదటి చూపులోనే ఆమెను మోహించేస్తాడు. 


🌿అతని బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వనంటే ఇవ్వనంటాడు. అయితే,..

ఆ దంపతులను నయానా భయానా ఒప్పించి, ఆమెను వివాహం చేసుకుంటాడు రావణుడు. 


🌸వలచి మరీ ఆమెను పెళ్లాడిన రావణుడు  మొదట్లో బాగానే ఉన్నాడు కానీ, కొద్దికాలానికే తిరిగి పరకాంతల పొందుకోసం వెంపర్లాడసాగాడు. 


🌿ఎంత గొప్ప శివభక్తుడయినా, వేదాలు చదివినా, ఎంతటి పరాక్రమవంతుడయినా, అతనికి పరస్త్రీ వ్యామోహమనే అవలక్షణం ఉందని గ్రహించిన మండోదరి, అతన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించి విఫలం అవుతుంది. 


🌸చేసేదేమీ లేక ఓరిమితో సహిస్తుంది.  భర్తతో కలిసి తాను కూడా శివపూజ చేస్తుంటుంది.  


🌿రావణుడు సీతను అపహరించుకునిపోయి.. బంధించినప్పుడు కూడా మండోదరి వ్యతిరేకించింది. ఆమెను రాముడి దగ్గరకు పంపించేయమని భర్తను ప్రాధేయపడింది. 


🌸చివరికి రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించినప్పుడు రాముడితో యుద్ధం జరగబోయేముందు రోజు కూడా మండోదరి రావణాసురుడికి తన ఆలోచనను మానుకోమని బోధ చేసింది. 


🌿కాని ఆమె ప్రయత్నాలన్నీ  చెవిటివాని ముందు ఊదిన శంఖంలా మారాయి. యుద్ధంలో రావణుడిని చంపేసిన తర్వాత  యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది. 


🌸మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉన్న దృశ్యం ఆమెనెంతో కలచి వేసింది. రాముణ్ణి శపిద్దామని బయలుదేరుతుంది. 


🌿అయితే, శాంతమూర్తిలా ఉన్న రాముడిని చూసి ఆమె తన మనసు మార్చుకుంటుంది. రాముడు సాక్షాత్తూ విష్ణువు అవతారమని గ్రహించి, స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాలనూ స్వయంగా చూసి నిండు మనస్సుతో నమస్కరించింది. 


🌸ఆయన మన్ననలు అందుకుంది. అభిమానానికి పాత్రురాలయింది. తన పతి శరీరానికి అంత్యక్రియలు నిర్వర్తించుకునేందుకు అనుమతి ఇమ్మని అర్థించింది. రాముడామె మాటను మన్నించాడు. 


🌿విభీషణుని పిలిచి, రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు జరపవలసిందిగా సూచిస్తాడు. 

అంతేకాదు, మహా పతివ్రత అయిన మండోదరికి వితంతువు అయే దుస్థితి పట్టకూడదని ఆమెకు నిత్య సుమంగళి యోగం కలుగుతుందని, ఆమె పేరు విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయనీ వరం ఇస్తాడు. 


🌸ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, భర్త చెడ్డవాడని కుంగిపోతూ కూచోకూడదు. చేతనైనంతలో ఆ చెడు లక్షణాలనుంచి భర్తను పక్కకు మళ్లించి, సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలి. 


🌿భర్త చేసే చెడుని నివారించేందుకు అనుక్షణం పాటుపడాలి. సాధారణంగా ఎటువంటి స్త్రీఅయినా  తట్టుకోలేని శోకం ఎప్పుడు అనుభవిస్తుందంటే..భర్త అలాగే కడుపున పుట్టిన కొడుకు దిగజారిపోయినప్పుడు 

ఆ దుఃఖానికి అవధి ఉండదు. 


🌸మండోదరి మహా పతివ్రత. మయుడు, హేమల కుమార్తె. పది తలలు ఉన్న రావణాసురుని పట్టమహిషి. ఇంత గొప్పది. రావణుడి వక్షస్థలాన్ని చీల్చుకుని, 

గుండెను ఛేదించుకుని బాణం బలంగా భూమిలోకి దిగి తిరిగి రామచంద్రమూర్తి అక్షయ తూణీరంలోకి ప్రవేశిస్తే నెత్తురోడుతూ రావణుడు భూమ్మీద పడిపోయి ఉంటే... 


🌿గద్దలు, రాబందులు పైన ఎగురుతుంటే... దేవతలందరూ జయజయధ్వానాలు  చేస్తుంటే... మండోదరికి కబురందించి పల్లకి పంపి పిలిపించారు. ఆవిడ యుద్ధభూమికొచ్చింది. 


🌸రావణుడి శరీరానికి కొద్దిదూరంలో ఒక చెట్టుకింద రామలక్ష్మణులు, పక్కన విభీషణుడు నిలబడి ఉన్నాడు. 

సాధారణంగా ఆ పరిస్థితులలో ఉన్న ఏ స్త్రీ అయినా  వెంటనే... రాముడెక్కడ? అని అడుగుతుంది లేదా తన భర్తను చంపేసాడన్న కోపంతో రాముడిని  నింద చేస్తూ

విరుచుకుపడుతుంది....అని అనుకుంటారు.


🌿కానీ మండోదరి ఎంత ధర్మాత్మురాలంటే...

పల్లకీ దిగి రావణుడి దగ్గరకెళ్ళి... ఏడుస్తూ...‘‘వీళ్లందరికీ అమాయకత్వంతో తెలియని విషయం ఒకటున్నది రావణా!  రాముడు నిన్ను చంపాడని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నీ భార్యను కనుక నాకు తెలుసు... 


🌸నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే. ఒకానొకనాడు నీవు తాచుపామును తొక్కిపెట్టినట్లు నీ ఇంద్రియాలను తపస్సు కోసం తొక్కిపట్టావు. నువ్వు బలవంతంగా వాటిని కోరికలకోసం తొక్కిపెట్టావు. 

తొక్కి పెట్టిన కాలుకింద నుంచి తప్పించుకున్న పాములా పగతో నీ ఇంద్రియాలు నిన్ను కాటేసాయి.


🌿 యుక్తాయుక్త విచక్షణ తెలియలేదు...అయినా నాలోలేని ఏ అందం నీకు సీతమ్మలో కనిపించింది?’’  ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. అంత శోకంలో కూడా అలా మాట్లడడం భార్యగా ఒక్క మండోదరికే సాధ్యపడింది.


🌸ఎటువంటి నిష్పక్షపాత తీర్పు చెప్పిందో చూడండి! అదీ ఈ జాతివైభవం. ఈ ఒక్కమాట లోకానికి అందితే జాతి చేయకూడని పొరబాట్లు చేయదు..

అజపాజపము

బ్రాహ్మణులు నిత్యము గాయిత్రి జపము చేయటము సహజము.  అది నిత్యనైమిత్తిక కర్మాగా ప్రతివాని భాద్యత.  కాగా ఇంకొక విధమైన గాయత్రి జపము కలదు.  దీనికి హంస గాయత్రి అని పేరు.  ఈ గాయత్రీ జపముకు మనము ప్రత్యేకించి ఆసనముమీద కూర్చొని చేయవలసిన పనిలేదు.  కేవలము సంకల్పము చేసినంతమాత్రమునే జపము చేయగలము. దానిని గురించిన వివరములు గీతాప్రెస్ గోరకపూర్ వారి ప్రచురణ "నిత్యకర్మ-పూజా ప్రకాశిక" అను గ్రంధము నుండి సేకరించి పొందుపరచుచున్నాను. ఈ గ్రంధము బ్రాహ్మణులైన ప్రతివారి గృహములో వుండదగినదిగా నేను తలుస్తాను. విప్రులు ఆచరించవలసిన అనేక కర్మలగూర్చి ఈ గ్రంధములో పేర్కొనినారు.  కాగా ఈ గ్రంధము వెల రూ. 150/-

అజపాజపము

ఈ దేహమును మానవశరీరము అత్యంత మహత్యపూర్ణమైనది. మిక్కిలి దుర్లభమైనది. ఒకవేళ శాస్త్రములయందు పేర్కొనబడినట్లుగా ఉపయోగించుకొనిన యెడల మనుష్యుడు బ్రహ్మమును కూడా పొందగలడు. ఇందులకై శాస్త్రములయందు అనేక సాధనములు పేర్కొనబడినవి. వాటిలో అన్నింటికంటే మీదుమిక్కిలి సులభమైన, సుగమమైన సాధనము - ‘అజపాజపము’. భగవంతునికి జీవులపట్ల ఎంతటి అంతులేని, అపారమైన కరుణ గలదో, ఈ సాధనమువలన మనకు బోధపడగలదు. అజపాజపమును గూర్చి సంకల్పము చేసినమీదట ఇరువది నాలుగు గంటలలో ఒక క్షణకాలము కూడా వ్యర్థము కాజాలదు. మనము మేలుకొని ఉన్నా సరే, స్వప్నంలో ఉన్నాసరే లేక సుషుప్తిలో ఉన్నా సరే, ప్రతి ఒక స్థితిలోనూ 'హంస' అనెడు జపము శ్వాసక్రియద్వారా మిక్కిలి సహజముగా, అనాయాసముగా అంటే ఎటువంటి ప్రయత్నము లేకుండా జరుగుచునే ఉండును. ఇందలి మరొక విశేషమేమనగా సంకల్పము చేసినంతలోనే ఈ జపము ఆ వ్యక్తిద్వారా చేయబడినట్లుగా అంగీకరింపబడును. లేదా ఆమోదింపబడును.

చేయబడిన అజపాజపమును సమర్పించెడు సంకల్పము:

ఓం గోవింద గోవింద గోవింద(2) అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీశ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలి ప్రథమచరణే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య (ఆగ్నేయ) ప్రదేశ్, శ్రీకృష్ణా గోదావర్యోర్ మధ్యదేశే (శ్రీకృష్ణాకావేర్యోర్ మధ్యదేశే) లక్ష్మీనివాసగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ । అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే .... నామ సంవత్సరే .... అయనే...... ఋతౌ మాసే .... పక్షే వాసరే ప్రాతఃకాలే ….... గోత్రః ..... ●●●● శర్మా అహం హ్యస్తన సూర్యోదయాదారభ్య అద్యతన సూర్యోదయ పర్యంతం శ్వాసక్రియయా భగవతా కారితం 'అజపాగాయత్రీ జపకర్మ' భగవతే సమర్పయే॥

॥ ఓం తత్సత్ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు ॥

2. వర్తమాన దినమునందు అజపాజపము చేయుట గురించిన సంకల్పము :

నిన్నటి దినమునందు చేయబడిన అజపాజపమును భగవదర్పితము చేసిన పిదప నేటి దినము సూర్యోదయము నుండి మొదలుకొని మరుసటి దినము సూర్యోదయమయ్యేవరకు జరుగవలసిన అజపాజపమును గురించిన సంకల్పమును ఈ విధముగా చెప్పవలెను -

1. అజపా నామ గాయత్రీ యోగినాం మోక్షదాయినీ। తస్యాః సంకల్పమాత్రేణ జీవన్ముక్తో న సంశయః ॥ (ఆచారభూషణం  ఆచారరత్నమునందు అంగిరుని వచనము) ఓం విష్ణుర్విష్ణు ర్విష్ణుః - అని కూడా చెప్పవచ్చును.

ఓం గోవింద..... నుండి ......అహం వరకు పూర్వమువలెనే చెప్పిన పిదప నాటి సంకల్పమును ఇట్లు చెప్పవలెను -అద్య సూర్యోదయాదారభ్య శ్వస్తన సూర్యోదయ పర్యంతం షట్ శతాధికైక వింశతి సహస్ర (21,600) సంఖ్యాకోచ్ఛ్వాస నిఃశ్వాసాభ్యాం హంసః సోహం రూపాభ్యాం గణేశ బ్రహ్మ విష్ణు మహేశ జీవాత్మ పరమాత్మ గురు ప్రీత్యర్థం అజపా గాయత్రీజపం కరిష్యే | ||

అటు తర్వాత కొంత తడవు భగవన్నామ సంకీర్తనము చేయవలెను. అనంతరము ప్రాతఃస్మరణీయ శ్లోకములను పఠించవలెను. అజపాజపము - విశేషవిధానము

 *"మణిపూర్ లో ఇద్దరు అమ్మాయిలను నగ్నంగా ఊరేగించారు"* 

*"మోడీ ఏం చేస్తున్నాడు?"* 

*"సీఎం బీరెన్ సింగ్ ని పీకేయ్యాలి"*

-------------------


అవునా.. నిజమా.. ఇంత పని జరిగితే మోడీ చూస్తూ కూర్చున్నాడా!? 


Yes, రేప్ జరిగింది. నగ్న ఊరేగింపు జరిగింది.. 

వీడియోల ఆధారంగా ఒక నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. 

డజన్ల కొద్దీ ఇతరులను కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నారు.


కానీ అసలు నిజం అది కాదు.


ఇది అమ్మాయిల మీద అత్యాచారం కాదు.


ఇక్కడ జరుగుతున్న ఘర్షణ లో., బల ప్రదర్శన లో.. ఆ అమ్మాయిలు ఒక చిన్న అధ్యాయం మాత్రమే.


-------------------

*అసలు ప్రశ్నలు:*

-------------------

*వేల కొద్దీ ఆటోమాటిక్ వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?* (చైనా నుంచి)


*లోకల్ గా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు?* (చర్చ్)


*ఎవరి దన్ను తో చేస్తున్నారు?* (కాంగ్రెస్ దన్నుతో)


*ఎందుకు చేస్తున్నారు?* (క్రిస్టియన్ల కోసం ఇంకో కాశ్మీర్ ని సృష్టించడానికి)


-------------------

అసలు సమస్య:

-------------------

మణిపూర్ జనాభా లో..

*41.39% హిందువులు,*

*41.29% క్రిస్టియన్లు &*

*8.4% ముస్లింలు.*


మెజారిటీ హిందువులు మైతీ తెగకు చెందిన వారు. మైదాన ప్రాంతాల్లో ఉంటారు.


మెజారిటీ క్రిస్టియన్లు కుకీ తెగకు చెందిన వారు. కొండ ప్రాంతాల్లో ఉంటారు.


కాశ్మీర్ కి ఆర్టికల్ 370 ఉన్నట్టు..

మణిపూర్ కి ఆర్టికల్ 371C ఉంది.


70% రాష్ట్రంలో హిందువులు భూములు కొనడానికి లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని ఒక క్రిస్టియన్ సామ్రాజ్యం నిర్మించింది చర్చ్.


రాష్ట్రం మరో కాశ్మీర్ గా మారుతోందని గ్రహించి.. అక్కడి హిందువులు బీజేపీ కి ఓటు వేశారు.


దాదాపుగా చేజారి పోయిన రాష్ట్రంలో..

*ఆల్రెడీ మైనారిటీ లోకి జారి పోయిన హిందువులకు* చివరి దన్ను గా.. 


హిందువులైన మైతీ తెగ కు ST రిజర్వేషన్ ఇచ్చి, ఆ 371C ని పీకేసి ఎవరైనా ఎక్కడైనా భూములు కొనుకోవచ్చు అన్నాడు సీఎం బీరేన్ సింగ్ (కోర్టు కూడా).


మణిపూర్ లో జరుగుతున్న అసలు యుద్ధం ఇదీ. 👆


బయటి వారికి ఎలాంటి అనుమతులు లేని మణిపూర్ కొండ ప్రాంతాలు కుకీ తెగకు (క్రిస్టియన్లు), చర్చ్ కి పెట్టని గోడలు.


ఈ రిజర్వేషన్ తో సాధారణ హిందువులు కూడా కొండ ప్రాంతాల్లో ఆస్తులు కొనుక్కో వచ్చు.


ఇది చర్చ్ కి నచ్చ లేదు. కుకీ లను రెచ్చగొట్టింది.


కాంగ్రెస్ రాజకీయ లబ్ది కోసం దీన్ని ఎగదోసింది.


చైనా ఆయుధాలు సప్లై చేసింది.


కుకీలు ఊర్ల మీద పడ్డారు. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేశారు. అసలు కథ ఇది.


తమ వారు వందల మంది చనిపోయి, ఇళ్లు తగలబడి పోయిన ఉద్రేకం లో ఉన్న ఒక మైతీ గుంపు చేతికి ఈ ఇద్దరు కుకీ అమ్మాయిలు దొరికారు.


ఇంత రాజకీయాన్ని తప్పు దోవ పట్టించటానికి ఇంతకంటే ఎమోషనల్ అవకాశం ఇంకేం దొరుకుతుంది? అంది పుచ్చుకున్నారు రాజకీయులు, వారి చెంచా మీడియా.


-------------------

*ప్రజలుగా మనం చేసే 3 తప్పులు:* 

 -------------------


1. 70 ఏళ్లుగా జనాభా లెక్కలు మొత్తం వారికి అనుకూలంగా మారిపోయి., మనం మైనారిటీ అయిపోయి, అది ఇంకో కాశ్మీర్ / బంగ్లా దేశ్ గా మారుతుంటే నిద్ర పోవడం


2. ఇప్పటికైనా "గ్యాంగ్ రేప్ / నగ్న ఊరేగింపు" లాంటి న్యూస్ సెన్సేషన్ కి మాత్రమే రియాల్టీ అవ్వడం తప్ప.. "అసలు నిజానికి" రియాక్ట్ కాకపోవడం


3. మన రక్షణ కోసం నిలబడ్డ బీరెన్ సింగ్ / మోడీ లాంటి వాళ్లనే తప్పు పట్టడం ద్వారా అసలు దొంగలు కాంగ్రెస్ & చర్చ్ కి అవకాశం ఇవ్వడం.


-------------------

*రాజకీయం:*

-------------------

మన మనసులో ఒక soft spot ఉంటుంది. అది రబ్ చేస్తే ఎమోషనల్ అవుతాం. ఆ స్పాట్ రాజకీయ నాయకులకు *బా...గా* తెలుసు. ఎలక్షన్ సంవత్సరంలో ఇంకానూ..


"ఇద్దరు అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేసి నగ్నం గా ఊరేగించారు" అనగానే మొదట స్త్రీలు అంతా అప్సెట్ అవుతారు. 


*"140 ని చంపారు."*

*"300 మంది గాయ పడ్డారు."*

*"55,000 మంది ఇళ్లు తగలబెట్టారు."*


     లాంటివి మనకు ఆనను కూడా ఆనవు. 


అర్జెంట్ గా మన ఎమోషన్ చల్లార్చు కోవడానికి ఒక పంచింగ్ బ్యాగ్ కావాలి. 


"ముఖ్య మంత్రి రాజీనామా చెయ్యాలి"

"మోడీ అఖిల పక్ష సమావేశం పెట్టాలి"

"ఫలానా పార్టీ ని దింపెయ్యాలి"..

        లాంటివి.


సరే, ఇవన్నీ చేస్తాం.

ఏం జరుగుతుంది!?


అసలు ఈ సిచ్యుయేషన్ (గొడవలకు అసలు కారణమైన జనాభా నిష్పత్తి మార్పు) కి కారణం అయిన కాంగ్రెస్ చేతి కే మళ్లీ అధికారం వస్తుంది.


కాశ్మీర్ ముస్లిం రాజ్యంగా మారినట్టు మణిపూర్ 100% క్రిస్టియన్ రాజ్యంగా మారుతుంది.


అంటే ఇలాంటి ఉదంతాలు ఇంకా ఇంకా జరుగుతాయి.


       - SR Hindu.

@everyone

Laxmi Devi







 

బాంధవ్యాలు

 ఈరోజుల్లో చాలామందికి తెలియని బాంధవ్యాలు..


1. పితా (తండ్రి); 

2. పితామహా (తాత);

 3. ప్ర పితామహా (ముత్తాత); 

4. మాతా (తల్లి);

 5. పితామహి (బామ్మ); 

6. ప్రపితామహి (బామ్మ అత్తగారు): 

7. సాపత్ని మాతా (సవతి తల్లి);

 8. మాతామహ (తల్లి తండ్రి); 

9. మాతా పితామహ (తల్లి తాత); 

10. మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత); 

11. మాతామహి (అమ్మమ్మ): 

12, మాతుః పితామహి (అమ్మమ్మ అత్త): 

13. మాతుః ప్రపితామహి (అమ్మమ్మ అత్తగారి అత్త); 

14. ఆత్మపత్ని (తన భార్య); 

15. సుతః (కుమారుడు); 

16. భ్రాత (సోదరుడు); 

17. జ్యేష్ట పితృవ్యః (పెద తండ్రి); 

18. కనిష్ట పితృవ్యః (పిన తండ్రి); 

19 మాతులః (మేనమామలు); 

20. తత్పత్నిః (వారి భార్యలు); 

21. దుహిత (కుమార్తె); 

22. ఆత్మ భగినీ (తోబుట్టువులు); 

23. దౌహిత్రజ (కూతురు బిడ్డలు); 

24. భాగినేయకః (మేనల్లుళ్లు); 

25. పితృష్వసా (తండ్రి తోబుట్టువులు); 

26. మాతృష్వసా (తల్లి తోబుట్టువులు); 

27. జామాతా (అల్లుళ్లు); 

28. భావుకః (తోబుట్టువు భర్త); 

29. స్నుష (కోడలు); 

30. శ్వశురః (మామగారు); 

31. తత్పత్నీః (వారి భర్యలు); 

32. స్యాలకః (బావమరుదులు); 

33. గురుః (కుల గురువు); 

34. ఆర్ధినః (ఆశ్రితులు).

శివగాథలు - మౌనోపదేశము*

 *ఓం నమో భగవతే శ్రీరమణాయ🙏* 


*శివగాథలు - మౌనోపదేశము* 


🌷🌷🕉🌷🌷


దక్షిణామూర్తి స్తోత్రానికి అనువాదంగా భగవాన్ తమిళంలో పద్యాలు, వాటి తాత్పర్యం వ్రాస్తూ ఆ దక్షిణామూర్తి అవతార కారణమగు మూలకథను సంగ్రహించి, అవతారికలో వ్రాసారు.


ఆ మధ్య నేను (సూరి నాగమ్మ) ఆ అవతారికకు తెలుగు అనువాదం వ్రాసాను. భగవాన్ అది చూసి చిరునవ్వుతో, "ఇదుగో, నేను ఈ స్తోత్రానికి సంబంధించినంతవరకే కథ సంగ్రహించి వ్రాసానుగానీ, అసలు కథ చిత్రంగా ఉంది" అంటూ ఇలా చెప్పసాగారు (శ్రీరమణాశ్రమ లేఖలు, దక్షిణామూర్తి ప్రాదుర్భావం: 07-02-1947).


త్రిమూర్తులలో మొదటివాడైన బ్రహ్మ సృష్టికర్త. విశ్వాన్ని నిర్మించి, దానిలో జీవరాశులను నింపుటకు తన మనసునుంచి కొందరు శక్తిమంతులైన ప్రతినిధులను సృష్టించాడు. వసిష్ఠుడు, నారదుడు, ఋభువు, దక్షుడు వారిలో కొందరు. ఆయన వారిని గృహస్థులై, సంతానాభివృద్ధి చేయమన్నాడు. దక్షుడు, వసిష్ఠుడు వంటివారు తండ్రి ఆనతిని శిరసా వహించి, ఆయన అనుగ్రహంచేత విశిష్ఠ స్థానాలను పొందారు. నారదుడు, ఋభువు ఇంకా మరికొందరు సృష్టి కార్యంలో ఆసక్తి లేక, విరాగులై సంచరించారు. అటువంటివారే సనక సనందులు కూడా. వీరు నలుగురు కూడా బ్రహ్మ మానసపుత్రులే. వీరి పేర్లు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతలు. తండ్రి సంకల్పం నుంచి అవతరించగానే, అనగా బాల్యంలోనే వీరు విరాగులైనారు. నలుగురికీ ఒకటే నిర్వేదం. 'ఈ సంసారం నుంచి బయటపడుట ఎలా? ఏ జ్ఞానంచేత అన్ని సంశయాలు తీరి మరియు తపన, ఆరాటం శమించి శాంతి లభిస్తుంది? ఈ ఉపాయాన్ని సులభంగా అందించగలిగేవారు ఎవరా' అని అన్వేషణ ప్రారంభించారు. అలా సంచరిస్తూ నందనవనం ప్రవేశించారు.


అక్కడ దేవసభలో సిద్ధ సాధ్య కిన్నెర కింపురుష గంధర్వ విద్యాధరాధి దివ్యశక్తి సంపన్నులు; తపశ్శక్తి సంపన్నులైన మునులు అంతా సమావేశమై, గోప్యమైన సంగతులను చర్చించుకొంటున్నారు. అలౌకిక ప్రకాశంతో, అమాయకత రూపుదాల్చినట్లున్న ఈ నలుగురు బాలకులను చూసి, ఆ సభను అలంకరించిన ప్రముఖులతో సహా అంతా లేచి ఎదురేగి, సాదరంగా ఆహ్వానించారు. అర్ఘ్య, పాద్యాలను ఇచ్చి పూజించి, "సంసార తరణోపాయాన్ని బోధించవలసింది" అని అభ్యర్థించారు. విచారించగా, అక్కడి సభలోనివారంతా ప్రాపంచిక విషయాలనే సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు, వారికెవరికీ బ్రహ్మవిద్య గురించిన అవగాహన లేదని సనకాదులు గ్రహించారు.


ఆ స్థితిలో మార్గదర్శికై విచారిస్తున్న వారివద్దకు నారద మహర్షి ఏతెంచారు. ఇహపర సంబంధమైన ఎటువంటి సమస్యలకైనా తరణోపాయాన్ని చూపగల ఘటనాఘటన సమర్థుడాయన. ఆయన పనిలో శ్రద్ధవుంది, సామంవుంది, పేచీవుంది, వేడికోలువుంది, చమత్కారంవుంది, సాఫల్యంవుంది. అన్నిటినీ, అందరినీ కలుపుకొనిపోగల లోకకళ్యాణం సంపూర్ణంగా వుంది. నిజంగా నారదునివంటి మహానుభావులే లేకుంటే, పురాణగాథలన్నీ లవణం (ఉప్పు) లేని శాకపాకాలు (కూరలు) గా ఉండేవేమో! బాల చతుష్టయం ఆయనను పూజించి, తన మనోభావాన్ని తెలిపింది.


ఇంకేం? అంతకంటే ప్రీతిగొలిపే పనేముంటుంది నారదునికి? ఇప్పటికే సృష్టికార్యంలో ఇచ్చలేని బ్రహ్మకుమారులను మోక్షపథగాములను చేయడమే కాకుండా, దక్షశాపానికి కూడా గురయ్యాడు. అయితే ఆయనకు అదే భయకారణం కాలేదు. సత్కార్యాచరణ చేసేవారు కష్టనష్టాలను ఓర్చుకొంటూ, తమపని చేసుకొని పోతుంటారు. "రండి, బ్రహ్మజ్ఞానాన్ని బోధించుటకు బ్రహ్మదేవునికన్నా ఎవరు మిన్న? ఆయననే ఆశ్రయిద్దాం" అని వారిని సత్యలోకానికి తీసుకొని వెళ్ళాడు. కన్నులకు ఇంపైన సన్నివేశం అక్కడ వారికి సాక్షాత్కరించింది. చతుర్ముఖుడు, పితామహుడు అయిన బ్రహ్మ తన కమలాసనంలో కూర్చుని వున్నాడు. చదువులతల్లి సరస్వతి శ్వేత పద్మాసనంపై, శుభ్రవస్త్రాన్వితయై కూర్చుని పరమేశ్వర స్తుతిపరమైన గానం చేస్తుండగా, ఆమెకు ఎదురుగా ఆసీనుడైన విరించి ఆ పాటకు తాళం వేస్తున్నాడు. అనగా వారు నామసంకీర్తనం చేస్తున్నారన్నమాట.


నామసంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనమ్. ప్రణామో దుఃఖశమనః నామసంకీర్తనం పాపాలను నశింపచేసి, దుఃఖాన్ని శమింపచేస్తుంది. దేవతలకైనా అదే ఉపాయం. మరి సృష్టికర్తకు పాపమూ, దుఃఖమూనా? ఉండవు. కానీ లోకానికి ఆదర్శవంతం కదా! బాలురైన సనకాదులు ఆ విధాత (బ్రహ్మ), విధియువతి (సరస్వతి)లను చూసి, "ఆధ్యాత్మ తత్త్వజ్ఞాన సంపన్నుడు ఇలా స్త్రీ సాంగత్యంలో ఉండడమా? ఈయన మనకేమి బోధ చేయగలడు?” అని ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టారు. బ్రహ్మజ్ఞానమును పొందడానికి అర్హులైనప్పటికీ, గురుస్వరూపాన్ని నిర్ణయించుటలో వారు పరిపక్వత చెందలేదు. అందుచేతనే ఈ 'ప్రమాదం సంభవించింది.


అక్కడనుంచి వారు సరాసరి వైకుంఠం చేరారు. “అల వైకుంఠ పురంబులో నగరిలో ఆ మూల సౌధంబులో” అన్నట్లు స్వామి ఎక్కడో లోపల అంతఃపురంలో ఉండి, అనేక మణిమయ ప్రాకారాలు దాటితేగానీ కనిపించడు. ఈ లోపు ఎన్నెన్ని ద్వారాలో, ఎందరెందరు ద్వారపాలకులో? చొరవగల నారదుడు దాటుకొనిపోయి ఇట్టే తిరిగి వచ్చాడు. "బాగు, బాగు. అక్కడ బ్రహ్మదేవుడు భార్యకు ఎదురుగానైనా, కొంచెం దూరంలోనే కూర్చున్నాడు. ఇక్కడ చక్కటి శేషతల్పంపై విష్ణుమూర్తి శయనించి ఉంటే, పత్ని లక్ష్మీదేవి మురిపెంగా ఆయన పాదాలు వత్తుతోంది. ఒట్టి సుఖలాలసుడుగా కనిపిస్తున్నాడు.


పైగా ఈ అంతఃపుర వైభవాన్ని, నగర విలాసాన్ని చూస్తే ఎవరికీ ఆధ్యాత్మిక జిజ్ఞాస కలుగదు సరికదా, భోగాపేక్ష కలుగుతుంది. గంపెడు సంసారమున్న ఈయన జ్ఞానబోధ ఏమి చేయగలడు? ఇక మూడవవాడైన ముక్కంటినే ఆశ్రయిద్దాం. నిరాడంబరుడని ప్రసిద్ధి కదా!" అంటూ త్వరపెట్టాడు.


బాలురు కూడా త్వరపడి నారదుని అనుగమించారు. అత్యంత శ్రమకోర్చి హిమశైలాలను దాటుతూ, ఉన్నతమైన కైలాస పర్వతారోహణం చేసారు. అక్కడి దృశ్యాన్ని చూసి నిరుత్తరులైనారు. బ్రహ్మ తాళం వేస్తుండగా, విష్ణువు తదనుగుణంగా మృదంగం, అలాగే ఇతర దేవతలు ఇతర వాయిద్యాలను ప్రయోగిస్తున్నారు. మధ్యలో ఆదిదంపతులైన శివపార్వతులు ఒకరితో ఒకరు ఏకమై, మమేకమై ఒకే శరీరంగా కనిపిస్తున్నారు. భూతగణాలు కేరింతలు వేస్తుండగా, అంతా తైతక్కలాడుతున్నారు. సనకాదులకు పూర్తిగా ఆశాభంగమైంది. "ఇది మరీ చోద్యం, ముందువారే నయం. ఈయన స్త్రీ సాంగత్యాన్ని వదలడానికే వీలు లేకుండా ఉన్నాడు. వీరి సంగతే ఇలా ఉంటే, ఇక మనకెవరు బోధించేది?” అంటూ విషాదంతో కదిలారు.


నర్తనకేళిలో నిమగ్నమై ఉన్నా, పరమశివుడు వీరి రాకపోకలను గమనిస్తూనే ఉన్నాడు. "స్త్రీ సాంగత్యంచేతనే జ్ఞానం నశిస్తుందా? వీరి అపోహ వీరిని జ్ఞానదూరులను చేసింది" అని జాలిపడి, వారిని ఉద్ధరించుటకు నడుం కట్టాడు. పార్వతిని వదలి తానొక్కడే బయలుదేరాడు. సనకాదులు మనోభీష్టానికి తగిన రూపధారణ చేసాడు. తాపసులను కూడా సంమోహపరచే ఆకృతి అది. షోడశ (పదహారు) సంవత్సరాల యువకునివలె కళాప్రపూర్ణ ముఖబింబంతో శాంతికాంతులను ప్రసరిస్తూ, సనకాదులు వస్తున్న త్రోవలో ఒక విశాల వటవృక్షపు మొదట్లో, ఎడమ పాదాన్ని కుడి మోకాలిపై ఉంచి, చిన్ముద్ర ధరించి, దక్షిణాభి ముఖుడై, యోగిరాట్ చక్రవర్తివలె సమాధి అవస్థలో ఆసీనుడైనాడు. ఆయన మహిమాతిశయంచేత ఆ ప్రాంతమంతా అలౌకిక శాంతి, తృప్తి, వెలుగులతో నిండిపోయింది.


ఆ వాతావరణానికి ఆకర్షితులైన సనకాదులు అక్కడకు వచ్చి, సూదంటు రాయివలె ఉన్న ఆ దక్షిణామూర్తిని చూచేకొద్దీ వారి మనసులు చల్లబడి, అంతకు ముందెన్నడూ అనుభవించని హాయిని, అనుభూతిని చెందసాగారు. ఆయన పాదాలవద్ద చతికిలపడ్డారు. ఏ ప్రయత్నం లేకుండానే స్వస్థితి అయిన సమాధిలో నెలకొన్నారు. ఆత్మసాక్షాత్కారం పొందారు. సంశయాలన్నీ దూరమయ్యాయి.


భిద్యంతే హృదయగ్రంథిః ఛిద్యంతే సర్వ సంశయః 

హృదయగ్రంథి తెగిపోయింది. సంశయాలు సమసిపోయాయి. 

గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చ్ఛిన్నసంశయాః 

గురువు బోధ మౌనం, శిష్యులు సంశయాలు పటాపంచలు.


వీరు అడిగిందేమీ లేదు, ఆయన చెప్పిందీలేదు. కానీ, ఫలితం అమోఘం.. శిష్యులు ఆత్మజ్ఞానులైనారు. వాగ్రూప ఉపదేశం సామాన్యులకు. కొంత పక్వచిత్తులకు కన్నుగీటితే చాలు, తెలుసుకుంటారు... 'నయనదీక్ష' అన్నమాట. అతిపక్వచిత్తులకు కేవల సాన్నిధ్యమే అత్యంతికం. ఆ పూర్ణమౌనంలోనే మనసు హృదయమగత చెంది, సద్వస్తువును గ్రహిస్తుంది.


"చిత్రం వటతరోర్మూలే వృద్ధాశ్శిష్యా గురుర్యువా”


చిత్రం! మర్రిచెట్టు మొదట కూర్చొన్న గురుడు యువకుడు. శిష్యులు వృద్ధులు... భళారే విచిత్రం! మరి బాలురైన సనకాదులను వృద్ధులు అనడం ఉచితమేనా? ఆ జ్ఞానంలో పుట్టినవారు బాలురతో సమానం. అలా కానివారు బాలురైనా, జరామరణాలకు గురయ్యే వృద్ధులవంటివారేనని వివరణ.


మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిప్లైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥


మిక్కిలి వృద్ధులైనా తనను చేరి సేవించుచూ, బ్రహ్మనిష్ఠను పొందిన ఋషిమునిగణాలచే పరివేష్ఠితుడై చిన్ముద్రతో, రూపుదాల్చిన ఆనందమే అయినట్టి యువకుడు మౌనంచేతనే పరబ్రహ్మమును ప్రకటిస్తున్నాడు. ఇక ఆయన వాక్కు ఎంతటి అమోఘమైనదో కదా!) అటువంటి సంబరంతో మెరిసి పోయేవానిని, తనయందే క్రీడించుచు తృప్తుడై ఉన్నవానిని, ఆచార్యులకు ప్రభువైన శ్రీదక్షిణామూర్తిని సేవించెదను.


*ఓం అరుణాచల శివ🙏*

🌷🌷🕉🌷🌷

Heavy Rain

 Heavy Rain is very likely to occur  at isolated  places over  HYD, Medchal-Malkajgiri, Rangareddy districts of GHMC limits in next 24 hours. Please dial 040-21111111 or 9000113667 for assistance over tree falls and flood rescue. Please stay indoors. Issued by GHMC DRF in public interest

దైవసాన్నిధ్య

 QUOTE OF THE DAY

🌷Practising the Presence of God🌷

July 21

Once when I was meditating I heard His voice, whispering: “Thou dost say I am away, but thou didst not come in. That is why thou dost say I am away. I am always in. Come in and thou wilt see Me. I am always here, ready to greet thee.”

🌷– Sri Sri Paramahansa Yogananda
“Man’s Eternal Quest”


నేటి సూక్తి

🌷దైవసాన్నిధ్య అభ్యాసము🌷

July 21

ఒకసారి నేను ధ్యానం చేస్తూ ఉండగా దేవుని కంఠస్వరం, ఇలా నెమ్మదిగా వినిపించింది: “నేను దూరంగా ఉన్నానని నీవు అంటావు. కానీ నీవు లోనికి రాలేదు. అందుచేతనే నేను దూరంగా ఉన్నానంటావు. నేను సర్వదా లోపలే వున్నాను; లోపలికి వస్తే నన్ను చూడగలవు. నేను ఎల్లప్పుడూ ఇక్కడే నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను.”

🌷– శ్రీ శ్రీ పరమహంస యోగానంద,
“మానవుడి నిత్యాన్వేషణ”

నారాయణుని కి,

 నారాయణుని కి, నారాయణి కి అబేధం..ఆ సిద్ధాంతం చాలా విచిత్రంగా ఉంటుంది..శివుని భార్య శివాని, రుద్రుని భార్య రుద్రాణి ,భైరవుని భార్య భైరవి,నారాయణి నారాయణుని భార్య అనకూడదు..నారాయణుని చెల్లెలు నారాయణి..వాళ్ళు ఇద్దరూ ఒక్కలా ఉంటారు..ఇద్దరూ అలంకార ప్రియులు..ఏ విధంగా నారాయణుడు పరమ శివుని శరీరంలో సగ భాగాన్ని పొందాడో అదే విధంగా నారాయణి అయిన అమ్మవారు పరమశివుని శరీరంలో సగభాగాన్ని పొందడానికి శ్రీమన్నారాయణుని వద్ద ఉపదేశం పొందినది..మనకు అనుమానం రావచ్చు..శ్రీమన్నారాయణుడు అప్పటికే సగం శరీరాన్ని పొందితే మిగిలిన శరీరం అమ్మవారు పొందితే మరి శివునికి అస్తిత్వం ఏది? ఒక సగం నారాయణుడు,ఒక సగం అమ్మవారు..శివుడు అలా ఎలా ఇస్తాడు?! అంటే అది ఒక పదార్థం వలె శరీరాన్ని కత్తి పెట్టి కోసెయ్యడం కాదు.దాని వెనుక ఒక ఆధ్యాత్మికమైన రహస్యం ఉంటుంది..ఎంతమంది ఎక్కినా పుష్పక విమానంలో ఒకరికి చోటు ఉంటుంది అంటారు.. అలా ఎంత మంది పరమాత్మ లోకి చేరుతున్నా  పరమాత్మ లో అవకాశం ఉంటుంది..మూర్తి స్వరూపం మారుతూ ఉంటుంది..అమ్మవారు ప్రక్కన చేరితే 14 వది అయిన అర్ధనారీశ్వర స్వామి,13 వ స్వరూపం హరిహర మూర్తి..పరమ శివునికి 63 లీలా మూర్తులు ఉన్నాయి..






శివుని పంచ వింశతి లీలలు : 

1. చంద్రుని ధరించడం, 

2. ఉమా దేవిని కూడటం, 

3. ధర్మదేవతా రూపమైన వృషభాన్ని ఆరోహించడం, 

4. నృత్యం చేయడం, 

5. పార్వతీ దేవిని పరిణయమాడటం, 

6. భిక్షాటనం, 

7. మన్మథ దహనం, 

8. యముని జయించడం,

 9. త్రిపురాలను కాల్చడం, 

10. జలంధరాసుర సంహారం, 11. గజాసుర వధ, 

12. వీరభద్రావతారం, 

13. విష్ణువుకు శరీరంలో సగభాగం ఇవ్వడం, 

14. పార్వతికి అర్ధ శరీరం ఇవ్వడం, 

15. మాయాకిరాత రూపం ధరించడం, 

16. కంకాళ రూపి కావడం, 

17.చండీశ్వరుని అనుగ్రహించడం, 

18. హాలా హలాన్ని కంఠంలో ధరించడం, 

19. విష్ణువుకు చక్రం ఇవ్వడం, 

20. విఘ్నాలను హరించడం, 

21.ఉమాకుమారులతో కలసి ఉండటం, 

22. ఏకపాద రుద్రుడు కావడం, 

23. సుఖాస నాశీనుడు కావడం, 

24. దక్షిణా మూర్తి అవతారం, 25. లింగోద్భవుడు కావడం.


ప్రస్తుతానికి 24 లీలలే లభించాయి. 63 లభించలేదు.

కర్పూరం కథ

 *మనం పూజలో వాడే కర్పూరం కథ తెలుసా..!?*


కర్పూరం భారతీయులు ఎక్కువగా పూజాది కార్యక్రమాల్లో వాడే పదార్థం. ఇది అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పి నివారణకి కర్పూరం బాగా పనిచేస్తుంది. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్‌గా కర్పూరాన్ని ఉపయోగిస్తారు. కర్పూరం కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కర్పూరాన్ని కాటుకలో వాడుతారు.అయితే కర్పూరంలో అనేక రకాలున్నాయి. వీటితో అనేక ప్రయోజనాలూ ఉన్నాయి. అసలు కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారు. కర్పురంలోని రకాలు, వాటితో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.


కర్పూరం ఎన్ని రకాలు?


కర్పూరం చెట్టు గురించి కర్పూరంతో ఆరోగ్యం గురించి, కర్పూరం సువాసన గురించి తెలుసుకుందాం..కర్పూరం అనేది మనకి తెలిసినంత వరకు సుగంధం గానూ, కొన్ని వంటకాలలోనూ, పూజా కార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ, పారదర్శకం గానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము. ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నమొముం క్యాంఫొర (కుటుంబం: లారేసీ ) అనే చెట్టు నుండి లభ్యమవుతుంది.


కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మల నుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండం మీద గాట్లు పెడతారు. ఆ గాట్ల లోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి.. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో వీటిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌ లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.


కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా ఉపయోగ పడుతుంది.


పచ్చ కర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరం తోనే చేస్తారు.


హారతి కర్పూరం: టర్పంటైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారు చేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.


రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.


భీమసేని కర్పూరం: సహజంగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాల కోసం విరివిగా వాడుతూ ఉంటారు.


సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘం లాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.


హిమవాలుక కర్పూరం: ఇది మంచులాంటి రేణువుల్లా ఉంటుంది.


ఘనసార కర్పూరం: ఇది మేఘం లాంటి సారం కలిగి ఉంటుంది.


హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.


ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి. కర్పూరం వలన అనేక ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.


ఇది కూడా చదవండి: తిన్న కాసేపటికే ఆకలేస్తుంటే మాత్రం కారణం ఇదే..!

కర్పూరంతో కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:


1. గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.


2. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.


3. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.


4. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్‌గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లు అన్నిటిలోనూ, చర్మం పై పుతగా పూసే లేపనములలోను, శ్వాసనాళాలలో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.


5. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధి వల్ల ఏర్పడిన గాయం మీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.


6. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.


7. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.


8. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.


9. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు.


10. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.


11. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.


12. అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.


13. పురుగుల మందులు, చెడు వాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెద పురుగులు నిర్మూలనకు ఉపయోగిస్తుంటారు.

నిత్యావ్వేషణ

 నిత్యావ్వేషణ:


శుక్లాంబధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్।

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే॥


అన్న శ్లోకం కొన్ని వందల యేళ్లనుండీ భారతీయుల నోళ్లల్లో నానుతూ వస్తోంది. అయినా, ఏ మాత్రమూ తన తీపిని కోలుపోలేదు. దీని అర్థాన్ని నిర్ణయించే ముందు, ఈ శ్లోకం వాఙ్మయంలో ఎక్కడెక్కడ ఉందో పరిశీలిద్దాం.


పద్మపురాణం. వేదవ్యాసుడు రచించినటువంటి పద్మపురాణం లో నాలుగవదైప పాతాళఖండంలో పురాణమాహాత్మ్యకథనం అనే అధ్యాయంలో శివరాఘవసంవాదంలో శివుడు చెప్పినట్లుగా ఈ శ్లోకం[1]ఉంది. ఇందులో శివుడు పురాణశ్రవణమెలా చేయాలి అన్న దానిని వివరిస్తూ, పురాణాన్ని వ్యాఖ్యానించే వ్యక్తిని భక్తిగా ఇంటికి రావించాలనీ, అతడిని సత్కరించాలనీ ఇత్యాది విధివిధానాన్ని చెబుతూ, ముందుగా దేవతలను పూజించాలని చెబుతూ ఈ శ్లోకాన్ని చెప్పాడు. అయితే దీని తరువాత వచ్చిన శ్లోకపంక్తి - సభాసదశ్చ సంపూజ్య గణేశం ప్రార్థయేత్తతః అని. అంటే, తరువాత గణేశుడిని ప్రార్థించవలెను అని దానర్థం. తరువాత పార్థించడమేమిటి? పైన శ్లోకంలో ప్రార్థించాము కదా అని ఒక ప్రశ్న. పై శ్లోకాన్ని ఉపయోగించే శివుడు ప్రార్థించమంటున్నాడు అని ఒక అన్వయం చెప్పవచ్చు. కాదు, పై శ్లోకం విష్ణుపరమని ఆయన ఉద్దేశం, కనుక పైదీ క్రిందదీ వేరూ అని కూడా వాదన చేయవచ్చును. శ్లోకమున్నది కానీ అది విష్ణుపరమా, గణపతి పరమా అన్న అర్థం పద్మపురాణం లో లేదు అని ప్రస్తుతానికి రూఢి చేసుకుందాం.

స్కాందము. పురాణాలలో అతిపెద్దదైన స్కందపురాణంలో ఐదవదైన అవంతీఖండంలో విష్ణుభక్తి మాహాత్మ్యాన్ని వివరిస్తూ బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా ఈ శ్లోకం[2] ఉంది. ఈ శ్లోకం తరువాతి శ్లోకం ఇప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి మరొకటి - లాభస్తేషాం జయస్తేషాం అన్నది. ఇది జనార్దనుడి మీద శ్లోకమని అందరికీ తెలిసినదే. తరువాత శ్లోకం - అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజ్యతే యః సురైరపి, సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః అని ఉన్నది. అంటే, దేవతలు సైతం, తమ కోరికలు తీరడానికి ఎవరిని పూజిస్తారో, అటువంటి సర్వవిఘ్నాలనూ హరించేటువంటి గణాధిపతికి నమస్కారము అని. ఇది వినాయకప్రార్థన అనుకుంటే, పైన ప్రారంభశ్లోకం వినాయకుడిదే అని ఎలా అంటారు? కనుక అది విష్ణుసంబంధమైనదే అనవచ్చు. లేదా, ఏం, రెండుసార్లు వినాయకుడి ప్రార్థన రాకూడదని నియమమున్నదా? రావచ్చు అని కూడా చెప్పవచ్చు. అదే స్కాందపురాణంలో మూడవదైన బ్రహ్మఖండం మొదటి అధ్యాయమైన సేతుమాహాత్మ్యవర్ణనము ఈ శ్లోకంతోనే[3] మొదలవుతోంది.

విష్ణుసహస్రనామము. సుప్రసిద్ధమైన విష్ణుసహస్రనామంలో ప్రారంభంలో ఈ శ్లోకం వినవస్తుంది. ఇక్కడ కొంతమంది ఇది వినాయకుడి ప్రార్థనే అని అంటే, కొంతమంది ఇది వినాయకుడి ప్రార్థన కాదు, అలా అని విష్ణుమూర్తి ప్రార్థన కూడా కాదూ, వైకుంఠంలో వైష్ణవగణాలకు అధిపతి అయిన విష్వక్సేనుడని ఒకాయనున్నాడూ, ఆయనకూడా ఏనుగుతలను కలిగి, విఘ్నాలను పోగొడతాడూ అంటూ ఇది విష్వకేనస్తుతి అంటూ తృతీయమార్గంలో అన్వయాలు చేసారు. అయితే నేను పరిశీలించిన కొన్ని మహాభారతప్రతులలో, అనుశాసనికపర్వంలో ఎక్కడైతే విష్ణుసహస్రనామం చెప్పబడిందో ఆ చోట ఈ శ్లోకం లేదు[4]. కనుక ఇది వైష్ణవపరమా, వినాయకపరమా అన్నది తెలియదు.

ఇతరగ్రంథాలు. మనకు తెలిసినటువంటి నోములూ, వ్రతాలూ, ఇతర పూజావిధివిధానాల వాఙ్మయం ఈ శ్లోకంతోనే మొదలవుతుంది. దానితో పాటుగా, ఫలదీపిక వంటి జ్యోతిష్యగ్రంథాలూ, అహిర్బుధ్న్యసంహిత, సాత్త్వతసంహిత ఇత్యాది సంహితాగ్రంథాలూ, వందలాదిగా దేవతా స్తోత్రాలూ ఈ శ్లోకాన్ని తమ మొట్టమొదటి శ్లోకాలలో ఒకటిగా పెట్టుకున్నాయి. అయితే, పెద్దల నోళ్లనుండి వినేటపుడు వినాయకుడి అర్థమే ధ్వనిస్తుంది కానీ, విష్ణుమూర్తి అర్థం ధ్వనించదు వీటిల్లో.

ఇప్పుడు అసలు ఈ శ్లోకానికున్నటువంటి అర్థాన్ని పరిశీలిద్దాం.


శుక్ల = తెల్లనైనటువంటి, అంబర = వస్త్రమును, ధరం = ధరించినవాడినీ; విష్ణుం = విష్ణువునూ; శశి = చంద్రుడితో సమానవైనటువంటి/చంద్రసంబంధమైనటువంటీ, వర్ణం = రంగు కలిగినవాడినీ; చతుర్భుజం = నాలుగు భుజాలతో విరాజిల్లేవాడినీ; ప్రసన్న = నిర్మలమైనటువంటి, వదనం = ముఖము కలిగినవాడినీ; సర్వ= సమస్తములైన, విఘ్న= ఒక పని చేసేటప్పుడు వచ్చే అడ్డంకుల యొక్క, ఉపశాంతయే = ఉపశాంతి (శాంతించుట) కొరకు; ధ్యాయేత్ = ధ్యానము చేయవలెను.


వినాయకుడి పరంగా అన్వయాలు -


ఈ శ్లోకం వినాయకుడిది అని చెప్పడానికి ప్రధానమైన ఆధారాలు రెండు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆదౌ పూజ్యో గణాధిపః అన్న సూక్తిననుసరించి, ఈ శ్లోకం చాలా రచనలలో మొదటగా చేరి ఉండటం. రెండు, సర్వవిఘ్నోపశాంతయే అన్న వాక్యం. ప్రసిద్ధంగా గణపతి విఘ్నాలకు అధిపతి. విఘ్నాలను తొలగించడం కోసం మన పెద్దవాళ్లు గణపతిని చిలవలు పలవలుగా ప్రార్థించారు. ఈ ప్రార్థన విష్ణువును చేసినట్లుగా ఎక్కడా కనపడదు.


మరి, వినాయకుడికి అన్వయించడానికి ఈ శ్లోకంలో ఉన్న అడ్డాలు ఏమిటంటే -


విష్ణుం అన్న పదం - వినాయకుడిని మనకు తెలిసినదానికి విరుద్ధంగా లకుమికరా (లక్ష్మీప్రదుడా - లక్ష్మీగణపతి మనకు తెలుసును) అనీ, ఆంజనేయావతారం (హనుమంతుడి అవతారమనీ) అన్నట్లు మనకు తెలుసు. కానీ విష్ణువన్న పదం వినాయకుడికి వాడబడటం, అదీ ఇంత సూటిగా అని ఇంకెక్కడా మనము చూడము. అయితే, దీనికి పెద్దలు చెప్పిన వివరణలు - ఒకటి, వినాయకుడూ విష్ణువూ ఒక్కరే అన్న సమన్వయమైన అర్థాన్ని ఈ శ్లోకమిస్తోందని. రెండు, విష్ణువంటే ఇక్కడ విష్ణుమూర్తి అని కాదు, వ్యాపనశీలః విష్ణుః అనే వ్యుత్పత్తిననుసరించి వినాయకుడు సర్వాంతర్యామి అన్న అర్థం ఇందులో ఉందని. ఈ అన్వయం సమంజసమైనదే. 


ఈ విష్ణుం అన్న పదం అడ్డం వచ్చిందని భావిస్తూ మరికొంత మంది ఈ శ్లోకానికి శుక్లాంబరధరం దేవం శశివర్ణం చతుర్భుజం అన్న పాఠాంతరాన్ని[5] పెట్టి, ఏ గొడవా లేదని ఊరుకున్నారు.

శశివర్ణము - వినాయకుడు ఏ రంగులో ఉంటాడు అంటే, అథర్వణవేదంలోని గణపత్యుపనిషత్తు ఆయన్ను "రక్తం, లంబోదరం, శూర్పకర్ణకం, రక్తవాససం, రక్తగంధానులిప్తాంగం, రక్తపుష్పైస్సుపూజితం" అని వర్ణించింది. గణపతి ఎర్రగా ఉంటాడట, ఎరుపు బట్టలే వేసుకుంటాడట, ఎరుపుగంధం పూసుకుంటాడట, ఎర్రని పుష్పాలతో పూజించబడతాడట. మరి ఈ శ్లోకంలో ఆయన్ను తెలుపు బట్టలు ధరించినవాడనీ, తెల్లగా ఉంటాడనీ అన్నారే? అంటే, గణపతికి రూపాలనేకం ఉన్నాయి. తొమ్మిది రూపాలను కొంతమంది చెబితే, కొంతమంది ఇరవై రూపాలను చెప్పారు. కొన్నింటిలో గణపతికి మూడవకన్ను ఉంటే, కొన్నింటిలో చంద్రవంక ఉంటుంది. అంచేత గణపతి తెల్లగా ఉండడనీ, తెలుపు బట్టలు కట్టుకోడనీ చెప్పలేము. కనుక ఇది గణపతికి సాధ్యమయ్యేదే. అంతే కాక, మనకు సత్వము, రజస్సు, తమస్సు అని మూడు గుణాలు తెలుసు. వాటిలో సత్త్వము జ్ఞానానికి సంకేతం. దానికి వాడే రంగు తెలుపు. అందుచేత, సత్త్వస్వరూపమైనటువంటి వినాయకుడు, జ్ఞానప్రదాత అయి, తెలుపు రంగులో ఉంటాడని విరవణ.

గణపతి అన్వయాన్ని సమర్థిస్తూ, ప్రసన్నవదనం అనే పదానికి ప్రసన్నో మత్తవారణః అని ఒక వ్యుత్పత్తిని నేను పెద్దవారి వద్ద విన్నాను. అంటే ప్రసన్న వదనుడంటే ఏనుగుముఖం కలవాడు అని. అయితే ఈ వ్యుత్పత్తి ప్రసిద్ధ సంస్కృతనిఘంటువులలో నాకు తారసపడలేదు.

గణపతి పరంగా ఈ శ్లోకార్థమిది - తెల్లని బట్టను ధరించినవాడినీ, సర్వవ్యాపకుడినీ, తెల్లని వర్ణంలో ఉండేవాడినీ, నాలుగు భుజాలు కలవాడినీ (అయిన వినాయకుడిని) సమస్తమైన విఘ్నాల ఉపశాంతి కోసం ధ్యానము చేయవలెను.


విష్ణుమూర్తి పరంగా అన్వయాలు -


ఈ శ్లోకం విష్ణుమూర్తిదే అని చెప్పడానికి ప్రధానబలం విష్ణుం అన్న పదమే. విష్ణువు త్రిమూర్తులలో ఒకడు కదా, ఆయన్ను విఘ్నోపశాంతికై ప్రార్థన చేయకూడదా అని కొంతమంది చేసే వాదం.


తెలుపు రంగు. బాగానే ఉంది, మరి విష్ణువు నలుపు రంగులో ఉంటాడని కదా ఆయన్ను నీలమేఘశ్యాముడన్నాం. పచ్చనిబట్ట కట్టుకుంటాడని కదా పీతాంబరుడన్నాం. మరి శుక్లాంబరమూ, శశివర్ణమూ ఆయనకెలా అన్వయిస్తారు? అంటే, దానికి వచ్చిన సమాధానం - కృతయుగంలో విష్ణువు తెల్లగానే ఉండేవాడూ అని. దీనికి ఒక ఉదాహరణ - సత్యనారాయణ వ్రతకల్పంలో కథాప్రారంభంలో నారదుడు వైకుంఠానికి వెడతాడు కదా. అక్కడ శేషతల్పంపై పరుండిన విష్ణువుని చూసి ఆయన తెల్లని రంగులో ఉన్నాడని స్తోత్రం చేస్తాడు. అలాగే, పీతాంబరుడని ఆయన్ను అన్నంతమాత్రాన తెలుపుబట్ట కట్టుకోడని ఏముందీ అని ఒకటి.

విష్ణుపరంగా ఈ శ్లోకానికి చేకూరిన బలం అప్పయదీక్షితులు. ఈయన మహాపండితుడు. శివుడంటే పంచప్రాణాలైనా, శివుడికీ కేశవుడికీ భేదం లేదన్న అద్వైతమార్గావలంబి. ఈయన వరదరాజస్తవమని కంచివరదరాజు మీద ఒక స్తోత్రం వ్రాసాడు. అందులో 27వ శ్లోకంలో ఇలా అన్నాడు - 


యుక్త్యాగమేన చ భవాన్ శశివర్ణ ఏవ

నిష్కృష్ట సత్త్వ గుణమాత్ర వివర్త మూర్తిః।

ధత్తే కృపాంబుభరతస్త్విషమైంద్రనీలీం

శుభ్రోఽపి సాంబురమితః ఖలు దృశ్యతేఽబ్దః॥


అంటే, విష్ణుమూర్తి తత్త్వపరంగా, యుక్తిగా ఆలోచిస్తే తెలుపువాడేనట. దయ అనే రసాన్ని నిలువెల్లా నింపుకోవడం చేత, నీటిని నింపుకున్న మేఘం యొక్క రంగు - అంటే నీలవర్ణంలోకి మారిపోయాడట. 


ఇంకొక విశేషమేమంటే, ఈ వరదరాజస్తవానికి అప్పయ్యదీక్షితులే వ్యాఖ్యనూ వ్రాసారు. అందులో అంటారు కదా - ఆగమేన, ఆప్తవచనేన చ శశివర్ణమ్. ప్రసిద్ధం హి శివరాఘవసంవాదస్థమ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ఇతి వచనమ్ అని. అంటే, విష్ణువు తెల్లని వాడే. దానికి ప్రమాణంగా పైన మనం చూసిన పద్మపురాణంలోని శివరాఘవసంవాదంలో ఉన్న శుక్లాంబరధరమన్న శ్లోకముంది కదా అని. కనుక, అప్పయదీక్షితుల ప్రకారం శుక్లాంబరధరం అన్న శ్లోకం విష్ణుముర్తిదే కానీ, విష్వక్సేనుడిదో వినాయకుడిదో కాదు.

మరి విష్ణువు పరంగా ఈ శ్లోకాన్ని చూస్తే - తెల్లని వస్త్రాన్ని కట్టుకున్నవాడినీ, తెలుపు రంగులో ప్రకాశించేవాడినీ, నాలుగు భుజాలు కలవాడినీ, ప్రసన్నమైన వదనం కలవాడినీ (అయినటువంటి విష్ణుమూర్తిని) సమస్తవిఘ్నోపశాంతికోసం ధ్యానం చేయవలెను. అని అర్థం చెప్పుకోవాలి.


ఇతరమైన అన్వయాలు -


విష్ణువూ, విష్వక్సేనుడూ, గణపతిలతో ఈ శ్లోకం గొడవ అయిపోయిందనుకుంటే పొరపాటే. దీని కథ ఇంకా ఉన్నది.


జైనులు ఈ శ్లోకాన్ని తమ దైవమైన శ్వేతాంబరజినుడికి అన్వయిస్తూ చెప్పుకుంటారని వేటూరి ప్రభాకర శాస్త్రిగారు వ్రాసారు[6].

దేవతలకైతే ఫరవాలేదు, కొందరు కొంటెగాళ్లు ఈ శ్లోకాన్ని జంతువులకు అన్వయింప చేసారు.

ఒక పండితుడు ఈ శ్లోకాన్ని తెల్లపిల్లికి ఎలా చెప్పాడో చూడండి - శుక్లా గౌరీ అంబా యస్య స శుక్లాంబో గణేశః, తం రాతి వాహనీయత్వేనాదత్తే ఇతి శుక్లాంబరో మూషికః, తం భక్షణార్థం ధరతీతి శుక్లాంబరధరో మార్జారః, శశివర్ణః శుభ్రః, చతుర్భుజత్వం తు స్పష్టమేవ, భక్ష్యాలాభేన ప్రసన్నవదనోఽపీతి గౌరమార్జారధ్యానమ్. అంటే, గౌరవర్ణంలో ఉన్న స్త్రీని తల్లిగా కలవాడు శుక్లాంబుడు - గణేశుడన్నమాట. ఆయన్ని రాతి అంటే వాహనంగా మోసేది - ఎలుక. శుక్లాంబరధర అంటే ఎలుకట. ఆ ఎలుకని తినడం కోసం ధరించేది శుక్లాంబరధరము అంటే పిల్లి. అది తెల్లనిది, ఆహారం దొరకడం చేత ప్రసన్నవదనం కలది, నాలుగు భుజాలు కలదీ అయినటువంటి తెల్లపిల్లిని విఘ్ననివారణ కోసం ధ్యానించవలెనూ అని.

ఇంకొకడు దీనిని గాడిద పరంగా అన్వయించాడు. అదీ చూద్దాం. శుక్లాంబరధరః అంటే తెల్లని బట్టల మూటను ధరించేదీ; ఎక్కడపడితే అక్కడ తిరిగేది కనుక విష్ణువు అయినదీ; పసుపూ, గౌరవర్ణమూ కలిసిన తెలుపు రంగులో ఉండేదీ; నాలుగు భుజాలు కలదీ; అసలు బుద్ధి లేని పశువు కావడం చేత ఏ చింతా దానికి ఉండదు కనుక ఎప్పుడూ ప్రసన్నంగానే ఉండేదీ అయిన గాడిదను విఘ్నోపశాంతి కోసం ధ్యానించవలెను అని.

ఇటువంటి చమత్కారాలకేం గానీ, ఈ శ్లోకం ఇంతకీ ఎవరిది అని భక్తులను అనుకోమంటారు అంటే -


తర్కాలూ, పాండితీప్రదర్శనలూ, దైవశ్లోకాన్ని జంతువులకు అన్వయించి చెప్పే చమత్కారాలూ చూసి బావుందనుకోడానికే కానీ, దైవభక్తిని అవి ఏనాటికీ అతిశయించలేవు. భక్తి అన్నిటికన్నా గొప్పది.

ఈ దేశంలో దేవతల రూపాలు వేరు కానీ సమన్వయిస్తే అందరూ ఒకటే. అందుచేతనే ఇన్నిన్ని వ్యాఖ్యానాలను సాధ్యపరిచారు. పుష్పదంతుడని ఒక మహాకవి శివభక్తుడు. ఆయన శివుడి మీద "శివమహిమ్నస్తోత్ర" అని వ్రాస్తే ఒక పండితుడు దానికి విష్ణుపరంగా వ్యాఖ్యానం చెప్పాడు. ఇందాకా మనం చూసిన అప్పయ్య దీక్షితులు సైతం "నారాయణ" అన్న పదానికి శివుడి పరంగా వ్యాఖ్య చేద్దామని ప్రయత్నించి, అందులో "ణ"కారం అడ్డు తగులుతోంటే, ణత్వం బాధతే అన్నాడట. రూపధ్యానంలో తేడా ఉంది, కానీ తత్త్వ ధ్యానంగా పరతత్త్వమొక్కటే. అదే అసలు హైందవమతస్వరూపం.

అదలా ఉంచితే, ఈ శ్లోకం అర్థాన్ని సంప్రదాయబద్ధంగా రూఢి చేసుకుని, ఇతర దేవతార్థాలనూ గౌరవించడం సరైన పద్ధతి. నేను శాంకరస్మార్తసంప్రదాయానికి చెందినవాడిని. మా పెద్దలు దీన్ని వినాయకుడి అర్థం లోనే చెబుతారు. నేనూ అదే నమ్ముతాను. ఆ శ్లోకం చదివేటప్పుడు ఆ రూపాన్నే ధ్యానిస్తాను. చెప్పవలసినపుడూ అలానే చెబుతాను. అలా అని, విష్ణువుకు ఉన్న అన్వయాన్ని తోసిపుచ్చను. గౌరవిస్తాను, ఆనందిస్తాను కూడా. దీన్ని విష్ణువు పరంగానో, విష్వక్సేనుడి పరంగానో నమ్మేవారు ఆ రకంగా భావన చేయడం, గణపతి అర్థాన్ని సమాంతరంగా గౌరవించడం సరైన పద్ధతి, నా దృష్టిలో.

ఈ ఇబ్బంది ఈ శ్లోకానికే అనుకోలేము. విష్ణువన్న పదానికి రాముడని, రాముడన్న పదానికి విష్ణువనీ, దశరథుడంటే విష్ణుమూర్తి అనీ అర్థాలు సరైన మార్గంలోనే సాధించవచ్చు. ఆ సాధించడం భాషలోని పరిధిని విస్తరించే గుణానికి సంబంధించిందే కానీ, అందులో పడి అసలు భావనను పాడుచేయడం కోసం ఉన్నది కాదు. భావన చేయలేనపుడు సాహిత్యానికి విలువ లేదు.

ఇక నా గతి ఏమిటి?’ దేవహూతి

 🌸☘️🌸☘️🌸☘️🌸


ఆడపిల్లలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. భర్త సన్యసించి మోక్షగామియై తపోవనాలకి వెళ్ళిపోయాడు. ఇక నా గతి ఏమిటి?’ అని చింతించిన దేవహూతి ఒకనాడు ధ్యాననిష్ఠుడై వున్న కపిల మహర్షిని సమీపించింది. 

 

తల్లి రాకలోని ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు ప్రసన్న మందహాసం చేసి ”అమ్మా… నీ మనస్సులో చెలరేగుతున్న సంక్షోభాన్ని గుర్తించాను. స్వాయంభువ మనువుకి పుత్రికగా జన్మించావు. కర్ధమమహర్షి వంటి ఉత్తముడిని భర్తగా పొంది లోటులేని సంసారజీవనం సాగించావు. పదిమంది సంతానానికి జన్మనిచ్చి మాతృమూర్తిగా గృహిణిగా గృహధర్మాన్ని నిర్వర్తించావు. నీలాంటి ఉత్తమ జన్మ అనునది కోటికి ఒక్కరికి వస్తుంది. ‘లేదూ…’ అన్నది లేకుండా చక్కటి జీవితాన్ని గడిపిన నీకు యీ దిగులు దేనికమ్మా?” అని అడిగాడు. 


నాయనా… నువ్వన్నది నిజమే. నా తండ్రి స్వాయంభువ మనువు అల్లారుముద్దుగా నన్ను పెంచాడు. ఏ లేటూ లేకుండా తండ్రి నీడలో నా బాల్య జీవితం గడిచింది. అటుపై గృహస్థాశ్రమంలో నా భర్త చాటున ఏ కొరతా లేకుండా నా వైవాహిక జీవితం గడిచింది. తొమ్మిది మంది ఆడపిల్లలకి, ఒక సుపుత్రుడికి తల్లినైనందున నా గృహస్థజీవితం కూడా సంతృప్తిగా గడిచింది. నా అంతటి భాగ్యశాలి లేదనుకొని సంతోషిచాను. 

 

కానీ, నాయనా… నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు నా తండ్రి. నన్ను సంతానవతిని చేసి, వారి వివాహాలు చేసి తన బాధ్యత తీరిందని తపోవనాలకి వెళ్ళిపోయాడు నా భర్త. వివాహాలు కాగానే భర్తల వెంట నడిచి తమ బాధ్యత తీర్చుకున్నారు నా కూతుళ్ళు… ఒక్కగానొక్కడివి, దైవాంశా సంభూతడివైన నీ పంచన నా శేషజీవితం గడపవచ్చనుకుంటే … నువ్వు పుడుతూనే యోగివై, విరాగివై, అవతార పురుషుడివై, సాంఖ్యయోగ ప్రబోధకుడివై నా ఆశల మీద నీళ్ళు చల్లావు. 

 

నా తండ్రి, నా భర్త, కుమార్తెలు, కుమారుడు… ఎవరి బాధ్యత వాళ్ళు తీర్చుకొని నన్ను ఒంటరిదాన్ని చేశారు. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులకి కన్యాదాన ఫలం దక్కింది. నన్ను వివాహమాడినందుకు నా భర్తకి గృహస్థాశ్రమ ధర్మఫలం, కన్యాదానఫలం దక్కింది. వివాహాలైన నా కూతుళ్ళకీ, కుమారుడివైన నీకూ పితృఋణఫలం దక్కుతుంది. ఏ ఫలం, ఫలితం ఆశించకుండా బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి మీ అందరికీ సేవలు చేసిన నాకు దక్కిన ఫలం ఏమిటి నాయనా? ఇక ముందు నా గతి ఏమిటి?” అని వాపోయింది దేవహూతి గద్గద స్వరంతో. 


కపిలుడు మందహాసం చేసి ”అమ్మా! నువ్వేదో భ్రాంతిలో యిలా మాట్లాడుతున్నావు. ఇలాంటి భ్రాంతికి కారణం నిరాహారం కావచ్చు. నువ్వు ఆహారం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది కదమ్మా” అన్నాడు. దేవహూతి విస్మయంగా కుమారుడి వైపు చూచి ”నిరాహారిగా ఉండనిచ్చావా నన్ను? నీ మాట కాదనలేక నాలుగు కదళీఫలాలు భుజించాను కదయ్యా” అంది. ”అరటిపళ్ళు తిన్నావా? ఎక్కడివమ్మా?” ఆశ్చర్యంగా అడిగాడు కపిలుడు. దేవహూతి మరింత విస్తుబోతూ ”అదేమిటయ్యా … మన ఆశ్రమంలో రకరకాల ఫలవృక్షాలను నాటాము. వాటికి కాసిన పళ్లని ఆరగిస్తున్నాము. ఆ ఫలవృక్షాల్లో ఏ ఋతువులో కాసే పళ్ళు ఆ ఋతువులో పండుతున్నాయి కదయ్యా” అంది. కపిలుడు తలపంకించి ”ఓహో… ఋతుధర్మమా?” అన్నాడు. ‘అవునన్నట్లు’ తలవూపింది దేవహూతి. 

 

కపిలుడు తల్లి కళ్ళలోకి చూస్తూ ”ఋతుధర్మం అంటే…?” అనడిగాడు. ఆ ప్రశ్న విని నిర్ఘాంతపోయింది దేవహూతి. ”అమ్మా… ఋతువుకొక ధర్మం వుంది. అది ఏ కాలంలో ఏవి ఫలించాలో వాటిని ఫలింపజేస్తుంది. అలా ఒక్కొక్క ఋతువులో అందుకు తగ్గ ఆహారాన్ని మనకి ప్రసాదిస్తున్న ఋతువు తన ధర్మానికి ప్రతిఫలంగా మననించి ఏమాశిస్తోంది? కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాం?” అని ప్రశ్నించాడు కపిలుడు. ఆ ప్రశ్నలకి తెల్లబోతూ ”ధర్మానికి కృతజ్ఞత ఎలా చెప్తాం? ఋతువుకి తగ్గవాటిని ఫలింపజేయడం ఋతుధర్మం కదా?” అని ఎదురు ప్రశ్నించింది. 

 

కపిలుడు మందహాసం చేసి ”అంటే, ఋతువు ఎలాంటి ఫలం, కృతజ్ఞత ఆశించకుండా తన ధర్మాన్ని నెరవేరుస్తోందన్న మాట! మరి, అరటి సంగతేమిటి? అరటిచెట్టు కాయలిస్తోంది. పళ్లు యిస్తోంది. అరటి ఊచ యిస్తోంది. ఈ మూడూ మనకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అలాగే అరటి ఆకులు మనకి ఆరోగ్యానిస్తున్నాయి. శుభ కార్యాల సంధర్భాల్లో అరటి పిలకలు తెచ్చి ద్వారాల ముందు నిలుపుతున్నాం. ఇన్ని విధాలా ఉపయోగపడుతున్న అరటికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తోంది? దాని ఆకులు నరుకుతున్నాం. కాయలు నరుకుతున్నాం. అరటిబోదె నరుకుతున్నాం. చివరికి దాన్ని తీసిపారేస్తున్నాం. మనం ఇన్ని విధాలుగా హింసించి కృతఘ్నులం అవుతున్నా అరటిచెట్టు తన ధర్మాన్ని తాను నెరవేరుస్తుంది… 


మననించి ప్రతిఫలం, కృతజ్ఞత ఆశించకుండా ఋతువులు, చెట్లు వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తున్నాయి. మరి, ఇన్నింటి మీద ఆధారపడిన యీ దేహం తన ‘దేహధర్మం’ నిర్వర్తిస్తోందనీ, ఆ దేహధర్మం ప్రతిఫలం, కృతజ్ఞతల కోసం ఆశపడేది కాదని గ్రహించలేవా తల్లీ…” అని ప్రశ్నించాడు కపిలుడు సూటిగా. నిశ్చేష్ఠురాలైంది దేవహూతి. 

 

కపిలుడు మందహాసం చేసి ”అమ్మా… నువ్వు బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి సేవలు చేశానన్నావు. ‘నువ్వు’ అంటే ఎవరు? ఈ నీ దేహమా? దేహం ఎప్పటికైనా పతనమైపోయేదే కదా! నశించిపోయే దేహం కోసం చింతిస్తావెందుకు? ఒక శరీరాన్ని నీ ‘తండ్రి’ అన్నావు. మరొక శరీరాన్ని నీ ‘భర్త’ అన్నావు. మరికొన్ని దేహాలని ‘సంతానం’ అన్నావు. ఈ దేహాలన్నీ నువ్వు సృష్టించావా? లేదే! నీ తల్లి, తండ్రి అనే దేహాలని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ భర్త దేహాన్ని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ ఈ దేహం ఎలా తయారైందో, నీ సంతానంగా చెప్పుకుంటున్న ఆ దేహాలు నీ గర్భవాసంలో ఎవరు తయారుచేశారో నీకు తెలియదు. నీ దేహమే నువ్వు నిర్మించలేనప్పుడు నీది కాని పరాయి దేహాలపై వ్యామోహం ఎందుకమ్మా?” అని అన్నాడు. దేవహూతి నిర్విణ్ణురాలైంది. కపిలుడు మందహాసం చేసి ఆమెకు సాంఖ్యయోగమును ఉపదేశించసాగాడు. 

 

”అమ్మా… మనస్సు అనేది బంధ – మోక్షములకు కారణం. ప్రకృతి పురుష సంయోగం చేత సృష్టి జరుగుతుంది. ఆ పురుషుడే ప్రకృతి మాయలో పడి కర్మపాశం తగుల్కొని దుఃఖ భాజనుడవుతాడు. నేను, నాది, నావాళ్ళు అన్న ఆశాపాశంలో చిక్కుకొని జనన మరణ చక్రంలో పడి అలమటిస్తూ అనేక జన్మలెత్తుతాడు. జన్మ జన్మకో శరీరాన్ని ధరిస్తాడు. ఏ జన్మకి ఆ జన్మలో ‘ఇది నాది, ఈ దేహం నాది, నేను, నా వాళ్ళు’ అన్న భ్రమలో మునిగివుంటాడే గాని, నిజానికి ఏ జన్మా, ఏ దేహం శాశ్వతం కాదు. తనది కాదు. దేహంలోని జీవుడు బయల్వెడలినప్పుడు, మృత్యువు సంభవించినప్పుడు ఆ దేహం కూడా అతడిని అనుసరించదు. ఇంక, ‘నా వాళ్ళు’ అనుకునే దేహాలు ఎందుకు అనుసరిస్తాయి? దేహత్యాగంతోటే దేహం ద్వారా ఏర్పడ్డ కర్మబంధాలన్నీ తెగిపోతాయి. ఆఖరికి ఆ దేహంతోటి అనుబంధం కూడా తెగిపోతుంది. ఇలా తెగిపోయే దేహబంధాన్ని, నశించిపోయే దేహ సంబంధాన్ని శాశ్వతం అనుకుని దానిపై వ్యామోహం పెంచుకునేవారు ఇహ-పర సుఖాలకి దూరమై జన్మరాహిత్య మోక్షపదాన్ని చేరలేక దుఃఖిస్తుంటారు. కానీ ఆ జీవుడే తామరాకు మీది నీటిబిందువువలె దేహకర్మబంధాలకి అతీతుడై దేహధర్మానికి మాత్రం తాను నిమిత్తమాత్రుడై ఉంచి ఆచరించినట్లయితే కర్మబంధాలకు, దేహబంధాలకు అతీతంగా ఆత్మరూపుడై ద్వందా తీతుడవుతాడు. 


అరటి పిలక మొక్క అవుతుంది. ఆకులు వేస్తుంది. పువ్వు పుష్పిస్తుంది. కాయ కాస్తుంది. కాయ పండు అవుతుంది. అది పరుల ఆకలి తీర్చడానికి నిస్వార్థంగా ఉపయోగపడుతుంది. అనంతరం ఆ చెట్టు నశించిపోతుంది. దానిస్థానంలో మరొక మొక్క పుడుతుంది. ఈ పరిణామక్రమంలో ఏ దశలోనూ ‘తనది’ అనేదేదీ దానికి లేదు. పుట్టడం, పెరగడం, పుష్పించడం, పరులకి ఉపయోగపడడం, రూపనాశనం పొందడం… ఇది దాని సృష్టి ధర్మం. ”మానవజన్మ కూడా అంతే… దేహాన్ని ధరించడం.. దేహానికి వచ్చే పరిణామ దశలను నిమిత్త మాత్రంగా అనుభవించడం… దేహియైనందుకు సాటి దేహాలకి చేతనైనంత సేవ చెయ్యడం… చివరికి జీవుడు త్యజించాక భూపతనమై, శిధిలమై నశించిపోవడం… ఇంతకు మించి ‘నేను… నాది… నావాళ్ళు’ అన్న బంధం ఏ దేహానికీ శాశ్వతం కాదు. 


ఇక దేహంలోకి వచ్చిపోయే ‘జీవుడు’ ఎవరంటే …. పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అను పంచభూతముల సూక్ష్మరూపమే జీవుడు. ఈ జీవుడు ‘జ్యోతి’ వలె ప్రకాశిస్తూ ‘ఆత్మ’ అనే పేరిట భాశిస్తుంటాడు. ఇలాంటి కోట్లాది ‘ఆత్మ’ల ఏకత్వమే ‘పరమాత్మ’… ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే నిరాకారుడు. ఇతడే ‘భగవంతుడు’. ఆది, అనాది అయినవాడు యీ ‘భగవంతుడు.’ ఈ భగవంతుడు ‘ఆత్మ’గా ప్రకాశిస్తుంటాడు. 

 

ఇతడు ఇఛ్ఛాపూర్వక సృష్టికి సంకల్పించినప్పుడు… అప్పటి వరకు నిరాకారమైన తాను ‘సాకారం’గా తనని తాను సృష్టించుకుంటూ ‘దేహం’ ధరిస్తాడు. ఆ ‘దేహం’లోపల ‘జీవుడు’ అన్న పేరిట ‘ఆత్మ’గా తాను నివసించి ఆ దేహాన్ని నడిపిస్తాడు…. ఆడిస్తాడు… ఒక్కదేహం నించి కోట్లాది దేహాలు సృష్టిస్తాడు. అన్ని దేహాల్లో ‘ఆత్మపురుషిడిగా’ తానుంటూ ఆ దేహాల ద్వారా ప్రపంచ నాటకాన్ని నడిపి వినోదిస్తాడు. ఒక్కొక్క దేహానిది ఒక్కొక్క కథ… కధకుడు తానైనా ఏ కథతోనూ తాను సంబంధం పెట్టుకోడు. తామరాకు మీది నీటిబొట్టులా తాను నిమిత్తమాత్రుడై దేహాలను, వాటి కథలను నడిపిస్తాడు… ఏ దేహి కధని ముగిస్తాడో ఆ దేహం రాలిపోతుంది. దేహం పతనమైనప్పుడు అందులోని ఆత్మ బయటికి వచ్చి తను నివసించడానికి అనుకూలమైన మరో దేహం దొరికేవరకూ దేహరహితంగా సంచరిస్తూ వుంటుంది. ”ఇలా దేహాలను సృష్టించి ఆడించేవాడు కనకే ఆ పరమాత్మని ‘దేవుడు’ అన్నారు. ఈ దేవుడినే పురుషుడు అంటారు. ఇతడు నిర్వికారుడు, నిర్గుణుడు. కనుక ఇతడిని ‘నిర్గుణ పరబ్రహ్మము’ అంటారు. ఇతడిలో అంతర్గతంగా వుండి సృష్టికి సహకరించేది ప్రకృతి. 


”ఈ జీవసృష్టి పరిణామక్రమంలో భగవంతుడు త్రిమూర్తుల రూపాల్లో తానే సృష్టి స్థితి లయములను నిర్వర్తిస్తున్నా… ఏదీ ‘తనది’ అనడు… ఏ దేహంతోనూ సంబంధం కలిగి వుండడు. అట్టి పరమాత్ముడి సృష్టిలో పుట్టి నశించిపోయే ఈ దేహం ఎవరిది? ఎవరికి దేనిపై హక్కు, అధికారం ఉంటుంది?” 

 

కపిలుడు అలా వివరంగా ఉపదేశించి ”అమ్మా… దేహం ఉన్నంతవరకే బంధాలు – అనుబంధాలు. అట్టి దేహమే అశాశ్వితం అన్నప్పుడు దానితోపాటు ఏర్పడే భవబంధాల కోసం ప్రాకులాడి ఏమి ప్రయోజనం? తల్లీ, అందుకే జ్ఞానులైన వారు తమ హృదయ మందిరంలో శ్రీహరిని నిలుపుకొని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మా! మనస్సే బంధ మోక్షములకు కారణం అరిషడ్వార్గాలను జయించగలిగితే మనస్సు పరిశుద్దమవుతుంది. పరిశుద్దమైన మనస్సులో వున్న జీవుడే పరమాత్ముడు అన్న విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తి చేత భగవంతుడు దగ్గరవుతాడు. ‘దేహముతో సహా కనిపించే ప్రపంచమంతా’ మిధ్య అని, అంతా వాసుదేవ స్వరూపమే నన్న దృఢభక్తితో సర్వ వస్తువులలో, సర్వత్రా పరమాత్మమయంగా భావించి, అంతటా ఆ పరంధాముడిని దర్శించగలిగితే… దేహం ఎక్కడ? దేహి ఎక్కడ? నేను – నాది అనే చింత నశించి … భక్తిమార్గం ద్వారా అతి సులభంగా మోక్షం లభిస్తుంది … అమ్మా, ‘మోక్షం’ అంటే ఏమిటో తెలుసా? ఏ ‘పరమాత్మ’నించి అణువుగా, ఆత్మగా విడివడ్డామో… ఆ ‘పరమ – ఆత్మ’లో తిరిగి లీనమైపోవడం. తప్పిపోయిన పిల్ల తిరిగి తల్లిని చేరుకున్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని, ఎలాంటి సంతృప్తిని పొందుతుందో… అలాంటి బ్రహ్మానందాన్ని అనుభవించడం” అని ఉపదేశించాడు. 

దేవహూతికి ఆత్మానందంతో ఆనందభాస్పాలు జాలువారాయి. అప్పటివరకూ తన పుత్రిడిగా భావిస్తున్న కపిలుడిలో ఆమెకి సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడు దృగ్గోచరమయ్యాడు. 

 

”నారాయణా… వాసుదేవా… పుండరీకాక్షా… పరంధామా… తండ్రీ… నీ దివ్యదర్శన భాగ్యం చేత నా జన్మధన్యమైంది. లీలామానుష విగ్రహుడివైన నీ కీర్తిని సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు కూడా వివరించలేడు. సర్వశాస్త్రాలను ఆవిష్కరించిన చతుర్వేదాలు సహితం నీ మహాత్తులను వర్ణించలేవు. పరబ్రహ్మవు, ప్రత్యగాత్మవు, వేదగర్భుడవు అయిన నీవు నా గర్భమున సుతుడవై జన్మించి నా జన్మను చరితార్థం చేశావు. సృష్టిరహాస్యాన్ని బోధించి, నా అహంకార, మమకారాలను భస్మీపటలం గావించి నాకు జ్ఞానబోధ గావించావు. తండ్రీ… ఈ దేహముపైన, ఈ దేహబంధాలపైన నాకున్న మోహమును నశింపజేసి అవిద్యను తొలగించావు. ఇక నాకే కోరికలు లేవు. పరమాత్ముడివైన నీలో ఐక్యం కావడానికి, జన్మరాహిత్యమైన తరుణోపాయాన్ని ఉపదేశించి అనుగ్రహించు తండ్రీ…” అని ప్రార్థించింది దేవహూతి ఆర్థ్రతతో. కపిలుడు మందహాసం చేసి ”తల్లీ! సర్వజీవ స్వరూపము శ్రీమన్నారాయణుడు ఒక్కడే. కన్పించే యీ సృష్టి సమస్తం నారాయణ స్వరూపం. చరాచర జీవరాసులన్నిటియందూ శ్రీమన్నారాయణుని ప్రతిష్టించుకొని ‘సర్వం వాసుదేవాయమయం’గా భావించు. నీకు జీవన్ముక్తి లభిస్తుంది” అని ప్రబోధించి తానే స్వయంగా ఆమెకు మహామంత్రమైన ”ఓం నమో నారాయణాయ” ఉపదేశం చేశాడు. 


ఓం నమో నారాయణాయ

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Jaya jaya Durga


 

Photo










 

రాశి ఫలాలు rasi phalaalu

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*శుక్రవారం, జూలై 21, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*అధిక శ్రావణ మాసం - శుక్ల పక్షం*

*తిధి*      :  *చవితి* పూర్తి  


.                *🌹రాశి ఫలాలు🌹* 

 

*మేషం*


సంతానం  కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో  వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా   పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో  రాణించవు.  ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. 


*వృషభం*


కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి.  నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు  నిర్ణయాలు  పనిచేయవు. ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి.  నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది.


*మిధునం*


నూతన పరిచయాల వలన  ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు. పాత బుణాలు తీరి ఊరట పొందుతారు.  కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి  ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి. 


*కర్కాటకం*


దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా   ఉండదు. ఒక  వ్యవహారంలో  ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి.  చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు  నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.


*సింహం*


ఆకస్మిక ధన ప్రాప్తి   కలుగుతుంది. కుటుంబ సభ్యుల  ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో  గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారమునకు సన్నిహితుల   నుంచి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో  పదోన్నతులు   పెరుగుతాయి.


*కన్య*


ధన వ్యవహారాలలో చిన్న పాటి  ఇబ్బందులు  ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు  కొంత నిరాశ  కలిగిస్తాయి. చుట్టుపక్కలవారితో  ఊహించని విభేదాలు  కలుగుతాయి.  భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలకు జోక్యం చేసుకోకపోవడం మంచిది.


*తుల*


కీలక వ్యవహారాలలో కుటుంబ  సభ్యుల సహాయ సహకారాలు  అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం  లభిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి  శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.


*వృశ్చికం*


చేపట్టిన  పనులలో  విజయం సాధిస్తారు. స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు   బంధువుల   నుంచి కీలక నమాచారం అందుతుంది. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల  ఆదరణ పెరుగుతుంది.


*ధనస్సు*


వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా  పాల్గొంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు  పూర్తి చేస్తారు.  వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. 


*మకరం*


ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ఇంటా బయట  కొన్ని పరిస్థితులు  మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో  కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా  వ్యవహరించాలి. ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు.


*కుంభం*


ఉద్యోగమున అదనపు  బాధ్యతల నుండి కొంత  ఉపశమనం లభిస్తుంది. పాత ఋణాలు తీరుతాయి. ప్రయాణాలలో  నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధికంగా అనుకూల వాతావరణం  ఉంటుంది.  గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారమున భాద్యతలు  సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.


*మీనం*


ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు  లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరుల  సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.  ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄


సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

ఇష్టం బగునదె


*కం*

ఇష్టం బగునదె మనసగు

కష్టము నది స్వంతమయ్యు గమనించంగా

స్పష్టంబగు నీ సూక్ష్మము

సుష్టుగ గుర్తించకున్న శుంఠగు సుజనా.

*భావం*:-- ఓ సుజనా!ఇష్టమైన దే మనస్సు కు నచ్చుతుంది,అది కష్టం తోనే దక్కుతుంది, గమనించగా స్పష్టంగా అర్థమయ్యే ఈ చిన్న విషయాన్ని బాగా గుర్తించకపోతే మూఢుడవగుదువు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

ఎవ్వారల కష్టంబుల

నవ్వారలు భారమంచు నాక్రోశించున్.

దవ్వున నును కొండలవలె

చివ్వున నొరులొందు సుఖము చిత్రణె సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఎవరి కష్టాలు వారి కి భారంగా అనిపించి ఆందోళన చెందుతారు. దూరంలో ఉన్న కొండల నునుపు వలె ఇతరులు నీకంటే సుఖంగా ఉన్నట్లు కనబడతారంతే.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 120*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 120*


🔴 *రాజనీతి సూత్రాణి - ప్రథమధ్యాయము* :

‘’

📕 *నీతి శాస్త్రప్రయోజనం, రాజు, శత్రువు, మిత్రులు* 📕


1. తచ్చ రాజ్యతంత్రసమాయత్తం నీతిశాస్త్రేషు (రాజ్యంతంత్రం అంతా నీతి నీతిశాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది.) 


2. రాజ్యతంత్రెన్ష్యాత్తౌ తంత్రాన్వాపౌ (తంత్రావాపాలు రెండూ రాజ్యతంత్రం మీద ఆధారపడి ఉంటాయి. తన రాష్ట్రంలో జరిగితే వ్యవహారం తంత్రం. పరరాష్ట్రంలో జరిగేది ఆవాపం.) 


3. తంత్రం స్వవిషయకృతేష్వాయత్తమ్ (తన రాజ్యావ్యవహారాలకు సంబంధించినది. తంత్రం.) 


4. ఆవాపో మండనివిష్ట (ఇతర రాజ్యాలకు సంబంధించినది ఆవాసం.) 


5. సంధివిగ్రహయోనిర్మండలః (సంధికి గాని విగ్రహానికి గాని కారణమైనది "మండలం".) 


6. నీతిశాస్త్రానుగో రాజా (నీతిశాస్త్రాన్ని అనుసరించేవాడే రాజు.) 


7. అనంతరప్రకృతిః శత్రుః (సరిహద్దురాజ్యం రాజు శత్రువు.) 


8. ఏకాంతరితం మిత్రమిష్యతే 

(మధ్య ఒక రాజ్యం అడ్డున్న రాజ్యానికి రాజైనవాడు మిత్రుడు. వీళ్లిద్దరూ సహజ శత్రుమిత్రులు.) 


9. హేతుతః శత్రుమిత్రే భవిష్యతః (చిన్నకారణాన్న పట్టి కూడా శత్రువులు, మిత్రులూ అవుతుంటారు.) 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 121*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 121*


🔴 *రాజనీతి సూత్రాణి - ప్రథమధ్యాయము* :


📕 *జషాడ్గుణం* : 📕


1. హీయమానః సంధి కుర్వీత. (బలం తగ్గిపోతున్నవాడు సంధి చేసుకోవాలి. బలం పూర్తిగా తగ్గిపోయాక కాదు.) 


2. తేజో హి సంధానహేతుస్తదర్థానామ్ (సంధి వల్ల ప్రయోజనం సంధి కుదరాలంటే రెండు పక్షాలవాళ్ళకీ తేజస్సు (బలం) ఉండాలి.) 


3. నాతప్తలోహో లోహేనా సంధీయతే (కాల్చకుండా లోహం లోహంతో అతకదు.) 


4. బలవాన్ హీనేన నిగృహ్నీయాత్, న జ్యాయాసా సమేన వా (బలంగా ఉన్నవాడు తనకంటే తక్కువ బలమున్నవాడితో విరోధం పెట్టుకోవాలి. ఎక్కువ బలం ఉన్న వాడితో గాని సమునితో గాని విరోధం పెట్టుకోకూడదు.) 


5. గజేన పాదయుద్ధమివ బలవద్విగ్రహః ఆమపాత్రమప్యామేన వినశ్యతి (బలవంతునితో యుద్ధం ఏనుగుతో యుద్ధం చేయడం వంటిది. సముడితో కూడా విరోధం పెట్టుకోకూడదు. రెండు పచ్చి కుండలు వంటివి ఒకదానితో ఒకటి ఢీకొన్న రెండిటికీ ప్రమాదమే.) 


6. అరిప్రయత్నమభిసమీక్షేత (శత్రువు చేస్తున్న ప్రయత్నాలు ఒక కంట కనిపెడుతూ ఉండాలి.) 


7. సంధాయైకతో వాయాయాత్  (చాలా మంది శత్రువులున్నప్పుడు ఒకరితో సంధి చేసికోని రెండవవాని మీదికి యుద్ధానికి వెళ్లాలి.) 


8. అమిత్రవిరోధాదాత్మరక్షామావసేత్ (శత్రువులు విరోధం చూపుతున్నప్పుడు శత్రువులతో విరోధంకంటే ఆత్మరక్షణకు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.)


9. శక్తిహీనో బలవంత మాశ్రయేత్ (శక్తి లేనివాడు బలవంతుణ్ణి ఆశ్రయించాలి.) 


10. దుర్బలాశ్రయో దుఃఖమావహతి (దుర్భలుడ్ని ఆశ్రయిస్తే లేని కష్టాలు తెచ్చి పెట్టుకున్నట్లు అవుతుంది.) 


11. అగ్నివద్రాజానమాశ్రయేత్ 

(రాజును అగ్నిని ఆశ్రయించినట్లు ఆశ్రయించాలి. అగ్నితో వ్యవహరించినట్లు వ్యవహరించాలి.) 


12. రాజ్ఞ ప్రతికూలం నాచరేత్ (ఆశ్రయించిన రాజుకు ప్రతికూలంగా ప్రవర్తించకూడదు.) 


13. ఉద్దతవేషధరో న భవేత్ (ఆ రాజు ఎదుట ఆడంబరపూర్వకమైన వేషం ధరించకూడదు.) 


14. న దేవచరితం చరేత్ (దేవతలు ప్రవర్తించినట్లు ప్రవర్తించకూడదు.) 


15. ద్వయోరపీర్ష్యతో ద్వైధీభావం కుర్వీత (ఇద్దరు తనతో విరోధం పెట్టుకున్నప్పుడు ద్వైధీభావం అనగా ఒకరితో సంధిచేసుకుని రెండోవవానితో విరోధం సాగించాలి.) 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్* 


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️

ఇల్లు కట్టి చూడు

ఇల్లు కట్టి చూడు 

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత తెలియని తెలుగువారు వుండరు అంటే అతిశయోక్తి కాదు. నిజానికి ప్రతి మనిషి తన ఆర్ధిక స్థితినిపట్టి తదనుకూలమైన ఇంట్లో ఉంటాడు. ఒక సగటు మధ్యతరగతి వానిషికి వుండే ఒకే ఒక కోరిక తాను అద్దె ఇంట్లోంచి తాను కట్టుకున్న సొంత ఇంట్లోకి వెళ్లాలన్నదే.  ఈ రోజుల్లో మధ్యతరగతి వారి ఈ కోరికలను దృష్టిలో ఉంచుకొని చాలా బ్యాంకులు, హోసింగ్ సొసైటీలు  ఇల్లు కట్టుకోవటానికి అప్పులు ఇస్తున్నాయి. మధ్యతరగతి వారుకూడా వారు కట్టే అద్దె కన్నా కొంచం ఎక్కువ ఇన్స్టాల్మెంట్ కడితే ఏ 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఇల్లు అప్పుతీరుతుందని తెలిసి కూడా ఇల్లు కట్టుకోవటానికి లేదా కొనుక్కోవటానికి అప్పు తీసుకుంటున్నారు. వారి ఆలోచన ఎలా ఉన్నదంటే మనం అద్దె ఇంటికి ఎన్ని ఏళ్ళు అద్దె కట్టినా కూడా మన సొంత ఇల్లు కాదుగా ఇలా అప్పు తీసుకొని కట్టుకుంటే కొన్నేళ్ళకు మన ఇల్లు మనది అవుతుంది.  మనం ఇంస్టాల్మెంటును అద్దేలాగా కట్టామని అనుకుంటే సరి అని అనుకుంటున్నారు. ఇక బ్యాంకువారు ఇల్లు కుదువ పెట్టుకున్నారు కాబట్టి వారి అప్పుకు ఎలాంటి డోఖా లేదని అప్పులు ఇస్తున్నారు. ఉద్యోగస్తులు ప్రతి నెల జీతం కరెక్టుగా వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందిలేకుండా ప్రతినెలా ఇన్స్టాల్మెంటు కడుతుంటారు. 

ఒక సగటు మనిషి అద్దె ఇంట్లోంచి సొంత ఇంట్లోకి వెళ్లే సమయంలో కలిగే ఆనందం వర్ణనాతీతం. ముందు నుంచే కలలు కనటం ప్రారంభిస్తాడు. నేను ఈ గదిలో ఇది పెట్టుకుంటాను, ఆ గదిలో అది ఉంచుకుంటాను. .  నా బెడ్ రూము చాలా విశాలంగా వున్నది ఒక మంచి మంచం కొంటాను.  అవునండి ఇంకా ఈ డొక్కు మంచం మీదనేనా చక్కగా డబులు బెడ్ కొనుక్కుందాం అని భార్య కూడా వత్తాసు పలుకుతుంది.  నాన్న మేము కూడా అని పిల్లలు వాళ్లకు కావలసిన, వాళ్ళు నచ్చిన వాటి గురించి చెపుతుంటారు. నిజం చెప్పాలంటే కొత్త ఇంట్లోకి పోదాం అనుకున్న నాటినుంచి వాళ్ళ ఆలోచనలు ఆకాశాన్ని అంటుతాయి. ఇంటి ముందర ఆ చెట్టు పెట్టుకుంటాను ఈ చెట్టు పెట్టుకుంటాను అని అనుకుంటూ ప్రతి రోజు తీపి కలలు కంటూ గడుపుతారు.

ముందుగా స్థలాన్ని చదును చేసి ఇంటి ప్లాను ప్రకారంగా స్తంభాలను (PILLARS) పోసి తరువాత పిల్లర్లను కలుపుతూ సిమెంట్ బెడ్ పోసి తరువాత తగినంత ఎత్తుకు పిల్లర్లు లేచిన తరువాత దానిమీద స్లాబు వేసి ఇక ఇటుకలతో చుట్టూ గదులు కట్టటం తరువాత ప్లాస్టరింగ్, ప్లోరింగుతో ఇల్లు ఒక రూపానికి వస్తుంది.  తరువాత రంగులు అద్దటంతో ఇంటి నిర్మాణం పూర్తీ అవుతుంది. తరువాత గృహప్రవేశంతో కొత్తఇంట్లోకి వెళతారు. సొంత ఇల్లు ఒక యోగం అని లేక ఒక భోగం అని అనుకుంటూ క్రొత్త జీవితాన్ని మొదలుపెడతారు. ఇది సంగతి. 

ఇక విషయానికి వస్తే సాధక మిత్రమా మన సాధన కూడా కొత్త ఇంటి నిర్మాణం లాంటిదే. ఇంటికి ఏ రకంగా అయితే పిల్లర్లు ఏర్పాటు చేస్తుకుంటారో అదే విధంగా ఒక మోక్షార్ధి ముందుగా నాలుగు స్తంభాలలాంటివి ఏర్పాటు చేసుకోవాలి. మోక్షం అనేది ఆ నాలుగు స్తంబాల మీద కట్టిన భవనం లాంటిదే.  ఆ నాలుగు స్తంబాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 

ఈ నాలుగు సాధనాలను మన మహర్షులు సాధనా చేతుష్టయం అని అన్నారు.  అవి 1)వివేకం, 2) వైరాగ్యం, 3) షట్ సంపత్తి 4) ముముక్షుకత్వము. 

ఈ నాలుగు సాధించిన తరువాత సాధకుడు మోక్షానికి అర్హత పొందుతాడు. నిజానికి ఈ నాలుగు సాధనాలు సాధించటం అంత సులువైన పని కాదు యెంతో పట్టుదలతో, అకుంఠిత దీక్షతో, నిర్విరామ కృషితో నిత్య సాధనతో మాత్రమే సాధించగలం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎడారిలో పయనిస్తూ సముద్రమును వెతకటం లాంటిది. మన మహర్షులు పలు మారులు ఒక్క మాటే వక్కాణిస్తున్నారు అదే " మనః ఎవ కారణాః మనుష్యాణాం బంధహ ఏవ మోక్ష" పైన తెలిపిన సాధనాలు అన్నీకూడా మనస్సును అదుపులో వుంచుకోవటానికి చేయవలసిన పనులే. ఇంకా వివరంగా చెప్పాలంటే మనసును బాహ్య విషయాలమీదకు వెళ్లనీయకుండా కేవలం భగవంతుని మీదనే ఉంచుకోవటం.  ఒక్కొక్క దాని గురుంచి ముందు కండికలలో తెలుసుకుందాం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ 

అనుభవించవలసినదే

 త్రయః కాలకృతాః పాశాః

శక్యన్తే న నివర్తితమ్।

వివాహో జన్మ మరణం యథా

యత్ర చ యేన చ॥


తా𝕝𝕝 *వివాహము, జన్మ, మృత్యువు ఈ మూడు కాలపాశములు* *ఎప్పుడు ఎక్కడ ఎవడిచే అనుభవించబడవలెనో* *అప్పుడు అక్కడ అతడు అనుభవించవలసినదే!!!*

*ఇవి మార్చడానికి అసాధ్యమైనవి.*

ప ద్య సౌ ర భం !

 శు భో ద యం🙏


ప ద్య సౌ ర భం !


భళిరాయెన్నడుజారెనీభువికి,రంభారాగిణీ రత్నమే/

,ఖలయో? నిర్జరవల్లభప్రియవధూకంఠశ్రవద్దామమో?

మలయాశాలత మారుతోల్లలిత శంపావీచికాడోలికా/

చలదుత్ఫుల్ల జలేజమాలికయొ?,చెంచత్ చెంచలాతన్వియో?


భావం:ఔరా! ఏమీసౌందర్యము!రంభారాగీణీత్యాదిదేవకాంతలనడుములనుండిభువికిజారిపడిన రతనాలమొలనూలా?

?(వడ్డాణమా)

             దేవేంద్రునిపట్టపురాణిశచీదేవి మెడనుండిజారినపారిజాతసుమమాలయా?మలయానిల చంపాడోలికలలోనూయలలూగు విరసినపద్మమాలయా!

        ఆకాశమున చమక్కున మెఱయు మెఱపుతీగెయా? ఎవరీమె?


        "ఇంతకీ యెవరీమె? అలనాటియందాల మల్లీశ్వరి(భానుమతి) నవరసభరితమైన యీచిత్రంలో ఒకరసవద్ఘట్టంకోసం యీపద్యం రచింపబడింది.రచయితయెవరు?

కృష్ణశాస్త్రియనికొందరు,కాదుకాదు,మల్లాది రామకృష్ణశాస్త్రియనికొందరూ వాదులాట!

             ఇరువురిలో నెవరూకిమ్మనరు.

ఎలావివాదం తెగేది? పోనీండి.సందర్భంతెలిసికొందాం.

                రాయలుపాలించేకాలంలో జరిగినకథ! మల్లీశ్వరీ,నాగరాజులు,బావా, మరదళ్ళు.చిన్నటనుండీ ప్రేమతో పెనవేసికొన్నది వారిబంధం.

            ఒకనాడాజంట సంతకుపోయివస్తూ,వర్షంకారణంగా,

ఒకసత్రంలో ఆగిపోయారు.కుర్రజంటవారిసరదాలువేరు.బావకోసం ఆమె"పిలచినబిగువటరా?"-అనిపాడుతూ నాట్యంచేయసాగింది.అప్పుడే మారువేషంతోనచ్చినరాయలు,ఆపల్లెటూరిపిల్లపాటకూ,ఆటకూ ముగ్ధుడైపోయాడు.నాట్యానంతరం రాయలవెంటవచ్చిన నందితిమ్మనగారు ఈపద్యాన్ని ఆశువుగా చదువుతారు.రాయలాజంటను సత్కరిస్తాడు.ఇదీ పద్య సందర్భం!


కఠినపదాలకు అర్ధం:

భళిరా? -ఆశ్చర్యార్ధకం-ఔరా!

మేఖల-వడ్డాణము.నిర్జరవల్లభప్రియ-ఇంద్రునిభార్యశచీదేవి;

కంఠశ్రవద్దామమో-మెడనుండిజారిపడినపూమాలయా?

మలయాశ-దక్షిణదిశ; మారుతము-గాలి;ఉల్లలిత-మిగులనందగించిన;

శంపావీచికాడోలికా-మెరపుతీగెలఊయలలో; చలత్-కదిలే;

ఉత్ఫుల్ల-బాగుగావిరసిన;

జలేదమాలికయొ-పద్మమాలయా?

చెతత్-కదలాడే; చెంతలా తన్వియో-మెరపుకన్నియయా?


         మహాకవులరచనలను మరలమరల మననంచేయాలి.అప్పుడు దానిసారం,వంటబడుతుంది.

                            స్వస్తి!

పంచాంగం 21.07.2023 Friday,

 ఈ రోజు పంచాంగం 21.07.2023 Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస శుక్ల పక్ష: తృతీయ తిధి భృగు వాసర: మఘ నక్షత్రం వ్యతీపాత యోగ: గరజి తదుపరి వణిజ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


తదియ ఉదయం 06:58 వరకు.

మఘ మధ్యాహ్నం 01:57 వరకు.

సూర్యోదయం : 05:55

సూర్యాస్తమయం : 06:49

వర్జ్యం : రాత్రి 10:56 నుండి 12:44 వరకు.

దుర్ముహూర్తం: పగలు 08:30 నుండి 09:21 వరకు తిరిగి మధ్యాహ్నం 12:48 నుండి 01:39 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

జీవిత పరమార్థం*

 


*జీవిత పరమార్థం*


*"విస్తరాకును"* ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని *'భోజనానికి'* కూర్చుంటాము.

భోజనము తినేవరకు *"ఆకుకు మట్టి"* అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం *'ఆకును' (విస్తరిని)* మడిచి *'దూరంగా'* పడేస్తాం. 

*"మనిషి జీవితం"* కూడా అంతే ఊపిరి పోగానే *"ఊరి బయట"* పారేసి వస్తాము.

*'విస్తరాకు'* పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే *'పొయేముందు ఒకరి ఆకలిని'* తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న *'తృప్తి'* ఆకుకు ఉంటుంది.

*'విస్తరాకుకు'* ఉన్న ఆలోచన భగవంతుడు *"మనుషులకు"* కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ....

*'సేవ'* చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ *'సేవ'* చేయండి.

మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని *"వాయిదా"* వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే *'కుండ'* ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు *'విస్తరాకుకు'* ఉన్న *'తృప్తి'* కూడా మనకి ఉండదు..

 ఎంత *'సంపాదించి'* ఏమి లాభం? *'ఒక్కపైసా'* కూడా తీసుకుపోగలమా?

 కనీసం  *'మన ఒంటిమీద బట్ట'* కూడా మిగలనివ్వరు..


అందుకే *'ఊపిరి'* ఉన్నంత వరకు *"నలుగురికి"* ఉపయోగపడే విధంగా *'జీవించండి'*

*ఇదే జీవిత పరమార్ధం*


                *_🌹శుభమస్తు🌹_*

  🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

అడగకుండానే

 *

*కం*

అడిగెడివారికి దానము

లిడువారలు పుడమినుండు లెక్కగనెపుడున్.

అడగక నక్కర లెరుగుచు

వెడదగ దానమ్ముజేయు విబుధుడు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అడిగేవారికి దానంచేసేవారు ఈ భూలోకంలో లెక్కించదగిన వారుందురు. కానీ అడగకుండానే అవసరం తెలుసుకుని విశేషం గా(వెడద= విస్తృతము/ ఎక్కువ) దానం చేసేవాడు దేవుడు (అనబడతాడు).

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం :23/150 


గంభీరఘోషో గంభీరో 

గంభీరబలవాహనః I 

న్యగ్రోధరూపో న్యగ్రోధో 

వృక్షకర్ణస్థితి ర్విభుః ॥ 23 ॥  


* గంభీరఘోషః = గంభీరమైన (కంఠ) ధ్వని కలవాడు, 

* గంభీరః = లోతైన స్వభావము కలవాడు, 

* గంభీర బలవాహనః = పైకి కనిపించని బలమైన వాహనము కలవాడు, 

* న్యగ్రోధరూపః = వటవృక్షము (మర్రిచెట్టు) యొక్క రూపమైనవాడు, 

* న్యగ్రోధః = తానే వటవృక్షమువలె వ్యాపించి యుండువాడు, 

* వృక్షకర్ణస్థితిః = చెట్టుయొక్క ఆకులపై నివసించువాడు, 

* విభుః = సమస్తమునకు అధిపతి.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

Before sleep



 

స్వామివారి అల్లరి పనులు

 స్వామివారి అల్లరి పనులు


పరమాచార్య స్వామివారికి కూడా చిన్నపిల్లలకు మల్లే అల్లరితనం ఎక్కువ. ఎన్నో అల్లరి పనులు చేసేవారు. అవి చాలా సరదాగా ఉండేవి.


ఒకరోజు రాత్రి, మరక్కన్ను అనే అతను కాపలా కాస్తున్నాడు. రాత్రి రెండుగంటలు అనుకుంటా. కుర్చీలో కూర్చుని అలాగే నిద్రపోయాడు. నిద్రలేచిన మహాస్వామివారు బయటకు చూశారు; మరక్కన్ను నిద్రపోవడం చూశారు. అతడిని కాని అక్కడున్న ఎవ్వరిని కాని స్వామివారు నిద్రలేపలేదు. ప్రతి గంటకు సమయాన్ని సూచిస్తూ చక్క సుత్తితో అక్కడున్న కంచును మ్రోగించడం కాపలా ఉన్న వ్యక్తి పని. స్వామివారు ఆ చెక్క సుత్తిని తీసుకుని వెళ్ళిపోయారు.


కొద్దిసేపటి తరువాత మరక్కన్ను లేచి మూడు గంటల గంట కొట్టడానికి సుత్తి కోసం వెతికాడు. అక్కడ ఉంటే కదా అది దొరికేది. తనకంటే ముందు లేచి వెళ్ళేది స్వామివారు మాత్రమే కాబట్టి కాస్త భయపడ్డాడు.


తెలవారగానే, మేనేజరు విశ్వనాథ అయ్యర్ గారి దగ్గరకు వెళ్లి దాదాపు ఏడుస్తూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. “సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను చూసుకుంటా” అని మేనేజరు చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


తరువాత సరైన సమయం చూసి మరక్కన్ను విషయం చెప్పాడు. “అతడిని పిలవండి”. మరక్కన్ను వచ్చాడు.


మహాస్వామివారు పెద్దగా నవ్వుతూ, “భయపడ్డావా? మంచిది, ఏమి భయపడకు” అని కండ చక్కెర ప్రసాదంగా ఇచ్చి పంపారు.


--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, కంచి శ్రీమఠం విద్వాన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

నిత్య యవ్వనుడివే

 



జీవం ఉన్న ఏ ప్రాణి, చెట్టుతో సహా వయసు పెరగడం సహజం.

నేను వృద్దుడును అయ్యాను అని పక్షి ఎగరడం ఆగిందా,  చెట్టు పూలు పూయడం ఆగిందా!

ఎద్దు దున్నడం ఆపిందా!                             కాళ్ళు, కళ్ళు, అవయవాలు సహకరించే వరకు వాటిని కదలికలోనే ఉంచు. మెదడుకు, మనసుకు రెస్ట్ ఈయకు.

నువ్వు రోస్ట్, ఘోస్ట్ అవుతావు.

ప్రతిరోజూ నూతనంగా ఆలోచించు.

కొత్త విద్యలు నేర్చుకో,

నిన్ను నువ్వు మార్చుకో నూతనంగా!

జరగని అరుగులా ఉండకు. కదులుతూన్న బంతిలా ఉత్సాహంగా ఉండు.

వయసు అనేది శరీరానికి ఒక అంకె మాత్రమే!

నువ్వు కొత్తగా ఆలోచిస్తున్నంత కాలమూ, నిత్య యవ్వనుడివే మిత్రమా!


*శుభోదయం*🙏🌹🙏

నేనేమీ జడ్జి ని కాదు..

 నేనేమీ జడ్జి ని కాదు...

ఒక కుటుంబం లో అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకం లో తగాదాలోచ్చి వ్యవహారం కోర్ట్ కు వెళ్ళింది. అందులో ఒక వ్యక్తి పరమాచార్య వారి వద్దకు వచ్చి తగాదా వివరించి 

"స్వామి.మీరు నన్ను ఆశీర్వదించాలి. తీర్పు నాకు అనుకూలంగా రావాలని."

స్వామి "నేనేమి చెయ్యగలను. నేనేమి జడ్జి ని గాదుగా."

"తమరు ఆశీర్వదిస్తే చాలు."

"తల్లిదండ్రులు జీవించి ఉన్నంత కాలం వారి బాగోగులు పట్టించుకోరు. కానీ ఆస్తులు కావాలి."

అంటూ అలుగుటయే ఎరుంగని స్వామి చివాలిన లేచి లోనికి వెళ్లిపోయారు.

కొన్ని నెలల తరువాత స్వామి వద్దకు వచ్చిన వ్యక్తి కి వ్యతిరేకం గా తీర్పు వచ్చింది.

***స్వామి వారన్నట్లు వారు జడ్జి కాకపోయినా కానీ వారు జస్టిస్