జీవం ఉన్న ఏ ప్రాణి, చెట్టుతో సహా వయసు పెరగడం సహజం.
నేను వృద్దుడును అయ్యాను అని పక్షి ఎగరడం ఆగిందా, చెట్టు పూలు పూయడం ఆగిందా!
ఎద్దు దున్నడం ఆపిందా! కాళ్ళు, కళ్ళు, అవయవాలు సహకరించే వరకు వాటిని కదలికలోనే ఉంచు. మెదడుకు, మనసుకు రెస్ట్ ఈయకు.
నువ్వు రోస్ట్, ఘోస్ట్ అవుతావు.
ప్రతిరోజూ నూతనంగా ఆలోచించు.
కొత్త విద్యలు నేర్చుకో,
నిన్ను నువ్వు మార్చుకో నూతనంగా!
జరగని అరుగులా ఉండకు. కదులుతూన్న బంతిలా ఉత్సాహంగా ఉండు.
వయసు అనేది శరీరానికి ఒక అంకె మాత్రమే!
నువ్వు కొత్తగా ఆలోచిస్తున్నంత కాలమూ, నిత్య యవ్వనుడివే మిత్రమా!
*శుభోదయం*🙏🌹🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి