21, జులై 2023, శుక్రవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 121*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 121*


🔴 *రాజనీతి సూత్రాణి - ప్రథమధ్యాయము* :


📕 *జషాడ్గుణం* : 📕


1. హీయమానః సంధి కుర్వీత. (బలం తగ్గిపోతున్నవాడు సంధి చేసుకోవాలి. బలం పూర్తిగా తగ్గిపోయాక కాదు.) 


2. తేజో హి సంధానహేతుస్తదర్థానామ్ (సంధి వల్ల ప్రయోజనం సంధి కుదరాలంటే రెండు పక్షాలవాళ్ళకీ తేజస్సు (బలం) ఉండాలి.) 


3. నాతప్తలోహో లోహేనా సంధీయతే (కాల్చకుండా లోహం లోహంతో అతకదు.) 


4. బలవాన్ హీనేన నిగృహ్నీయాత్, న జ్యాయాసా సమేన వా (బలంగా ఉన్నవాడు తనకంటే తక్కువ బలమున్నవాడితో విరోధం పెట్టుకోవాలి. ఎక్కువ బలం ఉన్న వాడితో గాని సమునితో గాని విరోధం పెట్టుకోకూడదు.) 


5. గజేన పాదయుద్ధమివ బలవద్విగ్రహః ఆమపాత్రమప్యామేన వినశ్యతి (బలవంతునితో యుద్ధం ఏనుగుతో యుద్ధం చేయడం వంటిది. సముడితో కూడా విరోధం పెట్టుకోకూడదు. రెండు పచ్చి కుండలు వంటివి ఒకదానితో ఒకటి ఢీకొన్న రెండిటికీ ప్రమాదమే.) 


6. అరిప్రయత్నమభిసమీక్షేత (శత్రువు చేస్తున్న ప్రయత్నాలు ఒక కంట కనిపెడుతూ ఉండాలి.) 


7. సంధాయైకతో వాయాయాత్  (చాలా మంది శత్రువులున్నప్పుడు ఒకరితో సంధి చేసికోని రెండవవాని మీదికి యుద్ధానికి వెళ్లాలి.) 


8. అమిత్రవిరోధాదాత్మరక్షామావసేత్ (శత్రువులు విరోధం చూపుతున్నప్పుడు శత్రువులతో విరోధంకంటే ఆత్మరక్షణకు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.)


9. శక్తిహీనో బలవంత మాశ్రయేత్ (శక్తి లేనివాడు బలవంతుణ్ణి ఆశ్రయించాలి.) 


10. దుర్బలాశ్రయో దుఃఖమావహతి (దుర్భలుడ్ని ఆశ్రయిస్తే లేని కష్టాలు తెచ్చి పెట్టుకున్నట్లు అవుతుంది.) 


11. అగ్నివద్రాజానమాశ్రయేత్ 

(రాజును అగ్నిని ఆశ్రయించినట్లు ఆశ్రయించాలి. అగ్నితో వ్యవహరించినట్లు వ్యవహరించాలి.) 


12. రాజ్ఞ ప్రతికూలం నాచరేత్ (ఆశ్రయించిన రాజుకు ప్రతికూలంగా ప్రవర్తించకూడదు.) 


13. ఉద్దతవేషధరో న భవేత్ (ఆ రాజు ఎదుట ఆడంబరపూర్వకమైన వేషం ధరించకూడదు.) 


14. న దేవచరితం చరేత్ (దేవతలు ప్రవర్తించినట్లు ప్రవర్తించకూడదు.) 


15. ద్వయోరపీర్ష్యతో ద్వైధీభావం కుర్వీత (ఇద్దరు తనతో విరోధం పెట్టుకున్నప్పుడు ద్వైధీభావం అనగా ఒకరితో సంధిచేసుకుని రెండోవవానితో విరోధం సాగించాలి.) 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్* 


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️

కామెంట్‌లు లేవు: