21, జులై 2023, శుక్రవారం

అజపాజపము

బ్రాహ్మణులు నిత్యము గాయిత్రి జపము చేయటము సహజము.  అది నిత్యనైమిత్తిక కర్మాగా ప్రతివాని భాద్యత.  కాగా ఇంకొక విధమైన గాయత్రి జపము కలదు.  దీనికి హంస గాయత్రి అని పేరు.  ఈ గాయత్రీ జపముకు మనము ప్రత్యేకించి ఆసనముమీద కూర్చొని చేయవలసిన పనిలేదు.  కేవలము సంకల్పము చేసినంతమాత్రమునే జపము చేయగలము. దానిని గురించిన వివరములు గీతాప్రెస్ గోరకపూర్ వారి ప్రచురణ "నిత్యకర్మ-పూజా ప్రకాశిక" అను గ్రంధము నుండి సేకరించి పొందుపరచుచున్నాను. ఈ గ్రంధము బ్రాహ్మణులైన ప్రతివారి గృహములో వుండదగినదిగా నేను తలుస్తాను. విప్రులు ఆచరించవలసిన అనేక కర్మలగూర్చి ఈ గ్రంధములో పేర్కొనినారు.  కాగా ఈ గ్రంధము వెల రూ. 150/-

అజపాజపము

ఈ దేహమును మానవశరీరము అత్యంత మహత్యపూర్ణమైనది. మిక్కిలి దుర్లభమైనది. ఒకవేళ శాస్త్రములయందు పేర్కొనబడినట్లుగా ఉపయోగించుకొనిన యెడల మనుష్యుడు బ్రహ్మమును కూడా పొందగలడు. ఇందులకై శాస్త్రములయందు అనేక సాధనములు పేర్కొనబడినవి. వాటిలో అన్నింటికంటే మీదుమిక్కిలి సులభమైన, సుగమమైన సాధనము - ‘అజపాజపము’. భగవంతునికి జీవులపట్ల ఎంతటి అంతులేని, అపారమైన కరుణ గలదో, ఈ సాధనమువలన మనకు బోధపడగలదు. అజపాజపమును గూర్చి సంకల్పము చేసినమీదట ఇరువది నాలుగు గంటలలో ఒక క్షణకాలము కూడా వ్యర్థము కాజాలదు. మనము మేలుకొని ఉన్నా సరే, స్వప్నంలో ఉన్నాసరే లేక సుషుప్తిలో ఉన్నా సరే, ప్రతి ఒక స్థితిలోనూ 'హంస' అనెడు జపము శ్వాసక్రియద్వారా మిక్కిలి సహజముగా, అనాయాసముగా అంటే ఎటువంటి ప్రయత్నము లేకుండా జరుగుచునే ఉండును. ఇందలి మరొక విశేషమేమనగా సంకల్పము చేసినంతలోనే ఈ జపము ఆ వ్యక్తిద్వారా చేయబడినట్లుగా అంగీకరింపబడును. లేదా ఆమోదింపబడును.

చేయబడిన అజపాజపమును సమర్పించెడు సంకల్పము:

ఓం గోవింద గోవింద గోవింద(2) అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీశ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలి ప్రథమచరణే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య (ఆగ్నేయ) ప్రదేశ్, శ్రీకృష్ణా గోదావర్యోర్ మధ్యదేశే (శ్రీకృష్ణాకావేర్యోర్ మధ్యదేశే) లక్ష్మీనివాసగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ । అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే .... నామ సంవత్సరే .... అయనే...... ఋతౌ మాసే .... పక్షే వాసరే ప్రాతఃకాలే ….... గోత్రః ..... ●●●● శర్మా అహం హ్యస్తన సూర్యోదయాదారభ్య అద్యతన సూర్యోదయ పర్యంతం శ్వాసక్రియయా భగవతా కారితం 'అజపాగాయత్రీ జపకర్మ' భగవతే సమర్పయే॥

॥ ఓం తత్సత్ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు ॥

2. వర్తమాన దినమునందు అజపాజపము చేయుట గురించిన సంకల్పము :

నిన్నటి దినమునందు చేయబడిన అజపాజపమును భగవదర్పితము చేసిన పిదప నేటి దినము సూర్యోదయము నుండి మొదలుకొని మరుసటి దినము సూర్యోదయమయ్యేవరకు జరుగవలసిన అజపాజపమును గురించిన సంకల్పమును ఈ విధముగా చెప్పవలెను -

1. అజపా నామ గాయత్రీ యోగినాం మోక్షదాయినీ। తస్యాః సంకల్పమాత్రేణ జీవన్ముక్తో న సంశయః ॥ (ఆచారభూషణం  ఆచారరత్నమునందు అంగిరుని వచనము) ఓం విష్ణుర్విష్ణు ర్విష్ణుః - అని కూడా చెప్పవచ్చును.

ఓం గోవింద..... నుండి ......అహం వరకు పూర్వమువలెనే చెప్పిన పిదప నాటి సంకల్పమును ఇట్లు చెప్పవలెను -అద్య సూర్యోదయాదారభ్య శ్వస్తన సూర్యోదయ పర్యంతం షట్ శతాధికైక వింశతి సహస్ర (21,600) సంఖ్యాకోచ్ఛ్వాస నిఃశ్వాసాభ్యాం హంసః సోహం రూపాభ్యాం గణేశ బ్రహ్మ విష్ణు మహేశ జీవాత్మ పరమాత్మ గురు ప్రీత్యర్థం అజపా గాయత్రీజపం కరిష్యే | ||

అటు తర్వాత కొంత తడవు భగవన్నామ సంకీర్తనము చేయవలెను. అనంతరము ప్రాతఃస్మరణీయ శ్లోకములను పఠించవలెను. అజపాజపము - విశేషవిధానము

కామెంట్‌లు లేవు: