5, ఆగస్టు 2020, బుధవారం

పాంచ భౌతిక తత్వాలు

మోక్షం సాధన🌹పాంచ భౌతిక తత్వాలు
         ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం....... శబ్దం   

    వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.

 అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.

  జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.

    భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.

    ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

   జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.

  అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది

    వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

  ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.


 ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే...

శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్

సంగీతవిద్వాన్ శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.
(9 జనవరి 1948).
ప్రముఖ సంగీత విద్వాంసులు. తిరుమలతిరుపతి దేవస్థానంలో 1978 నుండి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా ఉన్నారు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. "వినరో భాగ్యము విష్ణుకథ..", "జగడపు చనువుల జాజర..", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.." వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చారు. ఆయన సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలితసంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందారు.ఆయన కృష్ణవేణి, నరసింహారావు దంపతులకు రాజమండ్రిలో జన్మించారం. కర్ణాటకసంగీతంలొ డిప్లొమా చేశారు. ఆల్ ఇండియా రేడియోలో ఏ-గ్రేడ్ గాయకుడు. ఆయన సంగీతకళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అన్నమాచార్యసంకీర్తనలలో ప్రత్యేకత సంపాదించారు. కేవలం సంగీతం నేర్చుకోవటమే కాకుండా, అన్నమాచార్య సంకీర్తనల స్వరకల్పనలోనూ, వాటికి సంగీతస్వరాలతో కూడిన పుస్తకాలు ప్రచురించడంలోనూ, సిడి రికార్డింగ్ లలోనూ పాలుపంచుకున్నారు. 1978లో అన్నమాచార్యప్రాజెక్ట్ లో గాయకుడిగా చేరారు. అన్నమయ్యసంగీత, సాహిత్యాలను ప్రజలకు చేరువ చెయ్యడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్, ఆయన సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించే చక్కని వేదికగా ఉపయోగపడింది. అక్కడ చేరినప్పటినుండి, 2006లో పదవీ విరమణ వరకు ఆయన ఈ ప్రాజెక్ట్ లో ప్రధానసభ్యుడిగా ఉన్నారు. వివిధస్థాయిలలో ఈ సంస్థను గొప్పసాంసృతికసంస్థగా తీర్చిదిద్దటానికి కృషి చేశారు. నాలుగుదశాబ్దాల నాదోపాసనలో సంపూర్ణవిశ్వాసంతో, అంకితభావంతో, పరిపూర్ణత కోసం నిరంతరం పరిశ్రమించారు. 6000లకు పైగా కచేరీలు చేశారు. 600లకు పైగా అన్నమాచార్య కీర్తనలకు స్వరకల్పన చేశారు. తితిదే కోసం ఆడియో రికార్డింగ్ లు చేశారు, స్వరకల్పనతో కూడిన పుస్తకాలను ప్రచురించారు. అన్నమాచార్య కృతులకు ఇంకా ప్రాచుర్యం కల్పించడానికి తరగతులు నిర్వహించారు.సంకీర్తనయజ్ఞ ప్రక్రియకు ఈయన ఆద్యుడు. ఒక గాయకుడు ఒకరోజుకు పైగా ఒకే వేదికపై ఎన్నో పాటలు పాడటం ఈ కార్యక్రమ ప్రత్యేకత.1997 లో విశాఖపట్టణంలో, 1999లో విజయవాడలో 200 పైగా పాటలతో, 2001లో తిరుపతిలో 300 పైగా పాటలతో, 2003, 2007లో హైదరాబాదులో 200లకు పైగా పాటలతో సంకీర్తన యజ్ఞాన్ని నిర్వహించారు.వీటిలో కొన్ని భాగాలు మాటీవీ, భక్తిటీవి ప్రసారం అయ్యాయి.
భక్తిటీవీ "హరి సంకీర్తనం" కార్యక్రమం ద్వారా 100కు పైగా అన్నమాచార్యసంకీర్తనలను సామాన్యులకు నేర్పాడు. ఈయన రెండవ కుమారుడు జి.వి.యన్. అనిలకుమార్ ఈ కార్యక్రమంలో విద్యార్థిగా పాల్గొనటం గుర్తించదగ్గది. ఎంతో మంది సంగీత ప్రియులు ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణప్రసాద్ నుండి నేరుగా నేర్చుకొనగలిగారు.
లక్షగళార్చన: 2008 మే 10లో సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో లక్షమందికి పైగా గాయకులు బాలకృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అసాధారణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిలికాన్ ఆంధ్ర (అమెరికా తెలుగు సంస్థ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని సం యుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమం భారతదేశంలోని అనేక చానెల్స్ లో ప్రత్యక్షప్రసారం చేయబడింది.
600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన అసాధారణ సేవలకు గాను వెండిపతకం, ప్రశంసా పత్రంతో సత్కరించింది.
స్వయంగా వాగ్గేయకారుడైన ఆయన హనుమంతునిపై "ఆంజనేయ కృతిమాల" (21 కృతులు), వినాయకునిపై (50 కృతులు), నవగ్రహాలపై, ఇతర దేవతలపై కృతులు రచించారు. ఆయన స్వంతకృతులు వెయ్యికి పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని సంగీతస్వరాలతో సహా ప్రచురించబడ్డాయి.
వ్యక్తిగత జీవితం :-
ఆయన జి.రాధను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం- జి.యస్.పవన కుమార్, జి.వి.యన్.అనిల కుమార్. ఈయన సినిమా గాయని యస్.జానకి మేనల్లుడు

శ్రీ మహమ్మద్ - హిందువులు

 శ్రీ మహమ్మద్ గారికి హిందువులు అంతా రుణపడి వుంటారు. తమ వర్గ మత పెద్దల నుండి, తీవ్రవాదుల నుండి హెచ్చరికలు వచ్చినా లక్ష్య పెట్టకుండా
తనకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా లోకానికి చెప్పి
అందరికి ఆదర్శంగా నిలిచారు..🙏🙏🙏

ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డా||కరింగమన్ను కుజ్హియిళ్‌ మహమ్మద్‌ (కె.కె.మహ్మద్‌) గారు అయోధ్యపై రాసిన ఓ ఆర్టికల్...

డా|| కె.కె.మహ్మద్‌ :–

”ఈ అయోద్య విషయాన్ని వివరించ కుండా నా జీవిత కథ పూర్తికాదు. ఇది ఎవరి మత విశ్వాసాలను కించపరచడానికి గాని, వేరొకరి మత విశ్వాసాలను సమర్థించడానికి గాని ఉద్దేశించినది కాదు. అటువంటి ఉద్దేశాలతో గాని, అటువంటి ప్రయోజనాలకు గాని దీనిని ఏవిధంగానూ ఉపయోగించవద్దు. "

1990లో అయోధ్య సమస్య తీవ్రంగా మారింది. కాని అంతకుముందే 1978లోనే ఒక పురావస్తు శాస్త్ర విద్యార్థిగా అయోధ్యను పరిశీలించడానికి నాకు అవకాశం దొరికింది.

దిల్లీలోని పురావస్తు శాస్త్ర పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు, అయోధ్య వద్ద విస్తృత పరిశీలన (సర్వే) జరుపుతున్న ప్రొఫెసర్‌ బి.బి.లాల్‌ నేతృత్వంలోని బృందంలో నేనొక సభ్యునిగా ఉన్నాను. అంతకు ముందే ఉనికిలో ఉన్న దేవాలయ స్తంభాలను ఆధారంగా కనుగొన్నాము. ఆ రోజుల్లో ఇటువంటి ఆవిష్కరణను ఎవరూ వివాదాస్పదంగా చూడలేదు. చారిత్రక భావనతో పురాతత్వ శాస్త్ర నిపుణులుగా వాస్తవాలను మేము పరిశీలించాం.

బాబ్రి మసీదు గోడలపై పొందుపరచిన ఆలయ స్తంభాలున్నాయి. ఈ స్తంభాలు నల్లని సాలగ్రామం వంటి శిలతో (బ్లాక్‌ బసల్ట్‌) తయారయ్యాయి. 11-12 శతాబ్దిలలోని ఆచరణకు అనుగుణంగా స్తంభాల దిగువ భాగంలో ‘పూర్ణ కలశాలు’ చెక్కబడి ఉన్నాయి. ఆలయ కళలో పూర్ణ కలశాలు సంపదను సూచించే ఎనిమిది పవిత్ర చిహ్నాలలో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 1992లో మసీదు కూల్చిన సమయంలో అటువంటి పధ్నాలుగు స్తంభాలు అక్కడ బయటపడ్డాయి. మసీదు పోలీసు వారి రక్షణలో ఉంటూ, లోపలికి ఎవరినీ రానీయక పోయినప్పటికీ, మేము పరిశోధక బృంద సభ్యుల కావడంతో మమ్మల్ని ఎవరూ నిరోధించలేదు. అందువలన నేను స్తంభాలను చాలా దగ్గర నుండి చూడగలిగాను. ప్రొఫెసర్‌ బి.బి.లాల్‌ నేతృత్వంలోని బృందంలో భారత పురావస్తు సర్వేక్షణ విభాగం (ఆర్కియాలజి సర్వే ఆఫ్‌ – ఎఎస్‌ఐ) అధికారులతో పాటు పురావస్తు శాస్త్ర పాఠశాల విద్యార్థులం మేము పన్నెండు మందిమి ఉన్నాము. అయోధ్యలో వివిధ అన్వేషణల్లో రెండు నెలలు గడిపాం.

బాబర్‌ సేనాధి పతి మీర్‌, అంతకు ముందు తామే కూల్చివేసిన ఆలయ శిథిలాలను ఉపయోగించి ఈ మసీదును నిర్మించాడు. మసీదు వెనుక వైపున, ప్రక్కవైపునా త్రవ్వకాలు జరిపేటప్పుడు బ్లాక్‌ బసల్ట్‌ స్తంభాలతో నిలిచి ఉన్న ఇటుక వేదికలను మేము కనుగొన్నాము. ఈ వాస్తవాల ఆధారంగానే బాబ్రి మసీదు దిగువన ఆలయం ఉందని 1990లో నేను ప్రకటించాను.

అయోధ్యలో కట్టడం కూల్చివేత సమయంలో దొరికిన విలక్షణమైన శిల్పం ‘విష్ణుహరి శిల’ అనే రాతి ఫలకం. బలినీ, దశ కంఠుని (రావణ) హతమార్చిన విష్ణువుకు (రాముడు విష్ణుమూర్తి అవతారం) ఈ దేవాలయం అంకితం చేయబడినదని – ఈ ఫలకంపై సంస్కృతంలో 11-12 శతాబ్ది నాటి నాగరి లిపిలో, వ్రాయబడి ఉంది.

1992లో డా||వైడి శర్మ, డా||కెఎమ్‌ శ్రీ వాత్సవలు ఈ స్థలం గురించి అధ్యయనం చేసినప్పుడు మట్టితో చేసిన విష్ణు అవతారాలు, శివ, పార్వతుల చిన్న విగ్రహాలను కనుగొన్నారు. ఇవి కుషాణుల కాలానికి చెందినవి (100-300 ఎడి). 2003లో అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలపై మరల త్రవ్వకాలు జరిపినప్పుడు, ఒకప్పుడు ఆలయ స్తంభాలకు ఆధారంగా నిలచిన 50కి మించిన ఇటుక పునాదులను కనుగొన్నారు. సాధారణంగా దేవాలయాల పై భాగంలో కనబడే ‘అమలక’, ‘అభిషేక’ జలం ప్రవహించే ‘మకర ప్రణాళి’ కూడా త్రవ్వకాలలో ఉన్నాయి. బాబ్రి మసీదు ముందు ప్రాంగణం చదును చేసే సమయంలో 263 ఆలయ సంబంధిత కళాకృతులు కనుగొన్నట్లు ఉత్తరప్రదేశ్‌ ఆర్కియాలజి సంచాలకులు డా||రాగేశ్‌ తివారి ఒక నివేదిక సమర్పించారు.

త్రవ్వకాలలో లభించిన సాక్ష్యాలు, తరువాత ఆవిష్కరించిన చారిత్రక కళాకృతుల సమగ్ర విశ్లేషణ తరువాత, బాబ్రి మసీదు దిగువన ఆలయం ఉందనే నిర్ణయానికి భారత పురావస్తు సర్వేక్షణ (ఎఎస్‌ఐ) వచ్చింది. అలహాబాద్‌ హైకోర్టు, లక్నో బెంచ్‌ కూడా అదే నిర్ణయానికి వచ్చింది.

త్రవ్వకాలను నిస్పాక్షికంగా నిర్వహించడానికి 131 మంది బృందంలో 52 మంది ముస్లింలను త్రవ్వకాలలో చేర్చారు. అంతేకాక, బిఎంఎసి బృందానికి చెందిన పురావస్తు, చారిత్రక ప్రతినిధులు – సూరజ్‌ భాన్‌, మండల్‌, సుప్రియ వర్మ, జయమీనన్‌ల సమక్షంలో త్రవ్వకాలు జరిగాయి.

వామపక్ష చరిత్రకారులకు వార్తా పత్రికలు, ఇతర పత్రికలలో చాలా పలుకుబడి ఉండడంతో, అయోధ్యకు సంబంధించిన యదార్థాలను ప్రశ్నిస్తూ వారు ప్రచురించిన వ్యాసాలు సాధారణ ప్రజలను గందరగోళానికి గురి చేసాయి. ఈ రకమైన వాతావరణం వలన ఒకానొక సమయంలో తమ వాదనను పక్కనపెట్టి హిందువుల వాదనను ఒప్పుకోవచ్చునేమో అని ఆలోచించిన కొందరు సాధారణ ముస్లిములు సైతం నెమ్మదిగా తమ వైఖరిని మార్చుకోవడం ప్రారంభించారు. దాంతో మితవాదులు కూడా బాబ్రి మసీదును వదులుకోజాలమనే వైఖరికి కట్టుబడవలసి వచ్చింది.

కమ్యూనిస్టు చరిత్రకారుల జోక్యం వారి మానసిక పరిస్థితిని మార్చివేసింది. ఈ రెండు గ్రూపులు కలసి సంయుక్తంగా చేసిన అల్లరితో పరిష్కారానికి ఉన్న అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి.

జర్మనీకి చెందిన అంతర్జాతీయ త్రవ్వకాల బృందంతో ఒకసారి నేను ఒమన్‌ దేశంలోని సలాలా వెళ్ళాను. భూగర్భ నగరం అల్‌ బాలిద్‌ త్రవ్వకం మా లక్ష్యం. అక్కడ నాకు కొందరు కేరళీయులతో పరిచయం కలిగింది. వారు కేరళలో కన్నూర్‌-తలస్సెరి ప్రాంతానికి చెందినవారు. వారందరు సిమి సానుభూతి పరులు కూడా. వారు నన్ను ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు. వారిలో కొందరికి అయోధ్యపైనా అభిప్రాయాలు తెలుసు. కాని నేను వారికి కొన్ని నియమాలు విధించాను. నేను వచ్చి మాట్లాడతాను. నా అభిప్రాయాలను ప్రశ్నించవచ్చు. కాని నేను జర్మనీ వారి ఆహ్వానంపై అక్కడకు వెళ్ళాను కాబట్టి, అక్కడ ఎటువంటి అసహ్యమైన సంఘటన జరుగరాదు. క్రమశిక్షణ పాటించాలి. వ్యతిరేక అభిప్రాయాల పట్ల సహనం కలిగి ఉండాలి. వారు అంగీకరించిన మీదట నేను రామజన్మభూమి గురించి మాట్లాడాను. ప్రారంభంలో ఇస్లాం సహనంతో ఉన్న కాలంతో ప్రారంభించాను.  త్రవ్వకాలలో కళాఖండాల ఆవిష్కరణ గురించి నేను వివరంగా మాట్లాడాను. వారు అత్యంత శ్రద్ధగా విన్నారు. నా ఉపన్యాసాన్ని ఈ విధంగా ముగించాను.

‘ముస్లింలకు మక్కా, మదీనా ఎలాగో హిందువులకు అయోధ్య అదేవిధంగా ముఖ్యమైనది. మక్కా గాని, మదీనా గాని వేరొక మతం ఆధీనంలో ఉండడాన్ని ఏ ముస్లిమూ ఊహించలేడు. హిందువులు జనాధిక్యంగా ఉన్న దేశంలో కూడ, తమ దేవాలయం ముస్లిముల ఆధీనంలో ఉన్నదనే అవమానాన్ని ఎదుర్కొంటున్న  హిందువుల మొరను ముస్లిములు ఆలకించాలి. హిందువులు బాబ్రి మసీదును రామజన్మ భూమిగా నమ్ముతుండగా, ఆ ప్రాంతంలో ప్రవక్త మహమ్మదుకు ఏ సంబంధమూ లేదు. స్థలానికి సహబీస్‌తో కాని ఖులాఫర్‌ రన్విదిన్‌తో కాని ఏ సంబంధము లేదు; అలాగే, తాబియన్‌తో కాని, ఔలియ లేదా సలాఫ్‌ అజ్‌ – సలియాతో కాని ఏ సంబంధం లేదు. ఇది మొగల్‌ పాదుషా బాబర్‌కు మాత్రమే సంబంధించినది. అటువంటప్పుడు ఈ మసీదుకు అంతటి ప్రాముఖ్యం ఎందుకు?

నేను నా చిన్ననాటి సంఘటన వివరించాను. ‘జెరూసలేం కు చెందిన బైతుల్‌ ముక్దాస్‌ యూదుల వశమైనప్పుడు మేమందరం కొడువలి జుమా మసీదులో సమావేశమై, బైతుల్‌ ముక్దాసును తిరిగి పొందడానికి అల్లాకు మొరపెట్టుకున్నాము. మనం బైతుల్‌ ముక్దాస్‌ను కోల్పోయినప్పుడు పడిన క్షోభనే ఒక సాధారణ హిందువు ఈ రోజు అనుభవిస్తున్నాడు. నేను విద్యావంతుడైన ప్రగతి శీల హిందువు గురించి మాట్లాడటం లేదు. తీవ్రమైన చలి కాలంలో పైన చొక్కా లేకుండ, కాళ్ళకు చెప్పులు లేకుండ, కేవలం శ్రీరాముని దర్శనం కోసం ఎంతో దూరం నుండి నడచి వచ్చే ఉత్తర భారతదేశపు హిందువు గురించి మాట్లాడుతున్నాను. వారి బంధమూ, మతపరమైన వారి భావాలను మనం గౌరవించలేమా?

అక్కడున్న ప్రేక్షకులు అంతర్మథనానికి లోనయారు. నేను కొనసాగించాను. స్వాతంత్య్రానంతరం ముస్లింల కోసం ఒక ప్రత్యేక దేశం ఏర్పడింది. భారతదేశం ఒక హిందూ రాజ్యంగా ప్రకటించుకోగలిగి ఉండేది. కాని ఆ విధంగా జరుగలేదు. ముస్లిం అల్పసంఖ్యాకులకు వారి స్వంత దేశాన్ని ఇచ్చిన తరువాత సైతం, భారతదేశాన్ని ఒక మతాతీత లౌకిక రాజ్యంగా ప్రకటించారు. ఇటువంటి విశాల హృదయాన్ని ప్రపంచంలో మరెక్కడా చూడలేము.
ప్రేక్షకులకు కొంత ఆలోచించే అవకాశం ఇస్తూ కొద్దిసేపు ఆగిపోయాను. ఆ తరువాత కొనసాగించాను. ‘ముసిములే అధిక సంఖ్యలో ఉంటే భారతదేశం మతాతీత లౌకిక రాజ్యం అయ్యేదా?’. ప్రేక్షకుల నుండి సమాధానం లేదు. నేను చెప్పాను. ‘లేదు, భారతదేశం ముస్లిం జనాధిక్యత కల దేశమే అయి ఉంటే, అల్ప సంఖ్యా హిందువులకు ప్రత్యేక దేశాన్ని ఇచ్చిన తరువాత తనను తాను మతాతీత లౌకిక రాజ్యంగా ప్రకటించుకొని ఉండేది కాదు. హిందుత్వంలో నున్న విశాల దృక్పథం ఇదే. అదే హిందుత్వ సహనశీలత. ఈ ఉదార మనస్సును మనం అర్థం చేసుకోవాలి. గౌరవించాలి.

భారతదేశంలో హిందువులు కాక వేరొక మతస్తులు అధిక సంఖ్యాకులయి ఉంటే, ముస్లిముల దుస్థితి ఏ విధంగా ఉండేదో మనం ఒకసారి ఊహించడం మంచిది. అటువంటి చారిత్రక వాస్తవాన్ని అందరూ అంగీకరించి, రాజీ పడడానికి సిద్ధపడతారు. అప్పుడే మనం సరైన అర్థంలో మతాతీత లౌకిక రాజ్యం అవుతాము. ఈ ఆలోచనా విధానాన్ని నేను రివర్స్‌ థింకింగ్‌ అని పిలిచాను. మీరు హిందువు అయితే మీరు ముస్లింను అని ఊహించుకొని సమస్యను చేరుకోండి. ఒకవేళ మీరు ముస్లిం అయితే మీరే హిందువునని భావించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మనం వేర్వేరు మతాలకు చెందిన వారమవడం కేవలం యాదృచ్ఛికం.

Dr.K.K.మహమ్మద్

(ఒక ఇంగ్లీషు పత్రికలో వచ్చిన దానికి నా స్వేచ్చానువాదం)

శ్రీ పుల్లారెడ్డి గారి దాతృత్వం


అయోధ్య రామ జన్మభూమి ఆందోళన అని మాట పలికితే దాని వెనుక మరొక అవి స్మరణీయ దిగ్గజం.....స్వర్గీయ పుల్లారెడ్డి గారు...

ఆ రోజుల్లో కోర్టులో కేసు వాదించడానికి రోజుకు లక్షల్లో ఖర్చు వస్తున్నందున...

ఢిల్లీ VHP కార్యాలయంలో ఆర్థిక సంకటం ఏర్పడింది.

 కోశాధికారిగా ఉన్న పుల్లారెడ్డి గారి దగ్గరికి అశోక్ సింగల్ గారు వచ్చారు .

అప్పటికి ఇరవైఐదు లక్షలు సమీకరించాలి .

లక్షల రూపాయలు సంగ్రహించడం అప్పటికప్పుడు కష్టంగా ఉన్న సమయం. బాధపడుతూ హైదరాబాద్ వచ్చారు .

పుల్లారెడ్డి గారి ఇంట్లో కూర్చొని మాట్లాడుతుండగా....

ఇంట్లోకి వెళ్లి వచ్చి చేతిలో రెండు లక్షల రూపాయలు అశోక్ జీ చేతిలో పెట్టి...

 సాయంత్రానికి మరో పది లక్షలు ఆ తర్వాత మిగతావి సమకూర్చుదాము అంటూ...

రామజన్మభూమి కేసు మనకు విజయం  చేకూరే వరకు వాదించ వలసిందే దాని కొరకు పోరాడవలసినదే... ఎక్కడికైనా... ఎంత దూరమైనా, ఎన్ని త్యాగాలకైనా వెరవకుండా ముందుకు వెళ్దాం...

కేసు విషయంలో అంతరాయం కలగకూడదు అంటూ భరోసా ఇవ్వడమే కాక.

 ఎర్రమంజిల్లో ఉన్న తన ఇంటి ముందుకు తీసుకువచ్చి అశోక్ జి చేతులు పట్టుకొని ...

నేను బతికుండగా.., కోశాధికారిగా ఉండగా కేసుకు సంబంధించిన ధనం తక్కువ కానివ్వను .

" అవసరమైతే ఈ ఇల్లు అమ్మి వేద్దాం ...ఆమె లక్షల రూపాయల విలువచేసే నగలు అమ్మి వేద్దాం ...., అంటూ భార్య నారాయణమ్మ గారితో సహా అశోక్ జీ చేతులు పట్టుకుని ప్రార్థించాడు".

అశోక్ సింఘాల్ కన్నీటి పర్యంతమై... ఆనందాశ్రువులు కనుకొనుకులలో సుడులు తిరుగుతుండగా....,

నీవంటి  కుమారులు జన్మించినందుననే భారతమాత శిరస్సు ఉన్నతంగా నిలిచి ఉంది.అపజయం అన్నదే లేదు...

 ఎప్పుడు తల వంచ వలసిన అవసరం రాదు అంటూ...

 భారతమాత ప్రియ పుత్రుని ఆలింగనం చేసుకున్నారు .

ఆలింగనం చేసుకుని పుల్లా రెడ్డి గారి భుజాన్ని ఆనందపు అశ్రువులతో తడిపేసారు కీర్తిశేషులు అశోక్ సింగల్ జి. 😥😥

ఇటువంటి ఎందరో త్యాగధనుల యొక్క కృషి...
బలిదానులైన వారి ఆత్మార్పణం ...

తమ రక్తాన్ని చెమటగా మార్చిన అనేకమంది అవిజ్ఞాతులైన హిందూధర్మ రక్షకులైన వారి త్యాగ ఫలమే ..రామజన్మభూమి ఆందోళన, దాని విజయం వాళ్లందరి స్మృతులకు అంకితం.
జై శ్రీరాం

*మహారాజ్ఞి మండోదరి*



*Part.7*

అని మండోదరితో ఆనాటితో తనకు బంధం తీరినదని పలికి వీరుడై రణరంగానికి బయలుదేరాడు. తనభర్తకు చేజేతుల చంపుకోవడానికి కులీనయైన ఏ స్త్రీ ఆశించదు. మరణమెప్పటికి తప్పదు కాబట్టి ఉత్తమలోకాలు చేరి సద్గతిని పొంది సుఖించాలని ఆమె కోరుకోవడంలో ఉపకారమే ఉన్నది. భారతీయ సతీధర్మాలను ఇలా ఆయా పాత్రల ముఖతః నిరూపించాడు కవి. పరోపకార శీలం, స్వార్ధరహిత్యం, ఆత్మ పరిశీలనం, సత్యస్ఫ్రకంగా పాత్రల మనోభావాలను చిత్రించుట అంత తేలికయైన పనికాదు. పాత్రలలోని త్యాగైక గుణసంపదకు వన్నెలు దిద్దడం మహా ప్రజ్ఞాశీలియైన కవికి మాత్రమే గలదనుట నిర్వివాదాంశం.

అలా రావణుడు రణభూమి చేరి ఆ దాశరథి చేత విహుతుడైనాడు. అది తెలిసి రావణాంతఃపుర స్త్రీలంతా విలపించారు. కులస్త్రీలను చెరపట్టిన పాపమేనని భావించారేగాని శ్రీరామాదులను దూషించినవారు లేరు. రావణుని స్వ్యం కృతాపరాధానికి నొచ్చుకుంటూ మండొదరి చేసిన విలాపాలు ధర్మ ప్రతిపాదికమైనవి. మరొక్కసారి వేంకటకవి ఆమెచేత దీర్ఘోపన్యాసం చేయించాడు. శ్రీరాముని దైవత్వాన్ని రావణునిలోని ఆసురీప్రవర్తనను మరల మరల చాటి చెప్పించాడు. పౌరుష ప్రత్తపోన్నతుడై సిద్ధ గంధర్వాది దేవతా గణాన్ని గడగడ వణికించిన తనభర్త శ్రీరాముని చేతిలో నిర్జింపబడుట సిగ్గుపడవలసిన విషయమని, అంతా దైవయోగమని విలపించినది. శ్రీమన్నారాయణుడే శ్రీరాముడని ఆ దంపతులు యుద్ధానికి ముందే తెలిసికున్నారు. అయినా తన భర్త ఔన్నత్యం మీద ఆమెకంత విశ్వాసం. తన భర్త గొప్పదనాన్ని శ్రీరముని దైవత్వాన్ని పదిమందిలో తెలియజెప్పడానికే కవి మండోదరికి ఆ అవకాశం కల్పించి ఉంటాడు. అన్నింటికంటే ముఖ్యంగా మండోదరిచేత సీతా శీలవృత్తాన్ని మరల ప్రకటింపచేస్తాడు.
మండోదరి మరల అంటున్నది. ఒక వ్యక్తి వినాశానికి ఆ వ్యక్తిలోని దోషాలేనని పలికినది. తన భర్త ముందు ఇంద్రియాలను గెలిచి తర్వాత ముజ్జగాలను గెలిచాడట. అంతా తపోబల సంపదగలవాడు తన భర్త అని ఆమె ఉద్దేశం. ఇంద్రియ విజయం వల్ల అతనికి అతని యింద్రియాలే చివరకు శత్రువులైనాయట. అంత మనో నిగ్రహ శక్తులున్న్వాడైనా చివరకు ఇంద్రియ లోలత్వం వల్లనే వినాశాన్ని కొనితెచ్చుకున్నాడత. చపలాత్ములైన పురుషులందరికి ఈమె ఎంతో చక్కటి సందేశాని అందించినది. రామునితో వైరం మాని సీతని ఇమ్మని పలికిన హిరం నీకు రుచించలేదు. ఇది విధిచోదితమని పలికిన మండోదరి సౌమ్యగుణ్శీల సంపద కొనియాడదగియున్నది. ఇంద్రియలోలురైన ప్రతివారికి రావణుడే ఉదాహరణ.

తన భర్త చేపట్టిన అకార్యాలపట్ల ఆమె యెంతగా కుమిలిపోయినదో ఆమె చేసిన హెచ్చరికల ద్వారా తెలుస్తున్నది. సమయం దొరికినప్పుడంత తన భర్తలోని దురాగతాలను అనుభావానికి వచ్చిన తత్ఫలితాలను ఆమె వివరణగా చెప్పడం భార్యమాటలలోని పరమార్ధాలు తెలిసికూడ, అహాన్ని విడిచి ప్రవర్తించకపోవడమే లంకకు చేటు తెచ్చినది. రావణాసురుడు సామాన్యుడు కాదుగదా! పోగాలం దాపురించిన వాళ్లు “కనరు, వినరు, మూర్కొనరని” సూరిగారన్నట్లు ఏ రకమైన వ్యసనపరుడైనా పడే కష్టాలు తెలిసి కూడ తాము చేపట్టిన మార్గాన్ని విడిచిపెట్టరు. వాళ్లలోని అహంకారం అలాంటిది. స్త్రీల మాటను మగవాళ్లు అసలు ఖాతరుచేయరు. చివరికి అందుకోవలసిన ఫలితాన్ని అందుకుని అలమటించడం అతి సామాన్య ధోరణి మగవాళ్లకు. సామాన్యులే అలాంటి బుద్ధితో ప్రవర్తిస్తే పదితలలవాడికి ఇంకెంత బింకం ఉండాలి మరి. ఏది ఏమైనా మండోదరి మాత్రం కడవరకు తనభర్తను బ్రతికించుకోవాలనే విశ్వప్రయత్నం చేసి ఎన్నో విషయాలు గుర్తింపచేస్తుంది. రావణుడు ఇంతవరకు చేసిన పనులకంటే సీతను కొనిరావడమే లంకకు చేటు కలిగించిన విషయమని హెచ్చరించినది.
ఇంకా ఇలా అంటుంది పుణ్యవతి అయిన మహారాజ్ఞిపై నీకు పుట్టిన మోహమే నీ పాలిట అగ్నిశిఖ. అంతేగాదు “నిన్ను, నన్ను, గులమును, నిఖిల సుతుల హితుల మంత్రుల నెల్ల” దహించినదనుటలో ఆ సాధ్వికి భర్త చేష్టలు ఎంత అనర్ధదాయక మైనవో వివరించింది. “అరుంధతి, రోహిణి కంటె విశిష్టమైనది, క్షమాగుణం గలది, సౌభాగ్యవతులకు నిదర్శనమైనది. వారాశి సుతకు దృష్టాంతభూమియై తేజరిల్లుచున్నది. పతిభక్తిగలది, పరమసాధ్వి, నబల, సర్వానవద్యాంగి, మహితశీల, మాన్యయైన సీతను మ్రుచ్చిలి దెచ్చి ఏం సుఖపడినావు బృహత్ఫలితాన్ని పొందావు. కులం నశించినది అని రావణుని బలహీనబుద్ధిని ఏకరువుపెట్టినది. స్వయకృత అపరాధిగ నిర్ణయించినది. ఆ సతిని చెరపట్టిననాడే దహించిపోవలసిన వాడివి కాని కాలకర్మాలు కూడిన నాడే పరిపక్వమైన ఫలితం అని సూచించినది. ఉత్తమసతుల చెఱబడితే కలిగే అనర్ధాన్ని కన్నుల గట్టించినది. ఆమె హృదయ ఔన్నత్యాన్ని కవి చక్కగ రూపించాడు. మండోదరి ఒకసారి సీతను గూర్చి నాకంటే ఆమె అంత అందగత్తియా? అని వితర్కించింది. ఆ మండోదరియే సీతాదేవి సౌశీల్యాన్ని ఎంతగా కొనియాడినదో చూశారుగా. అలాంటి బంగారు శలాక సీతమ్మ. అంటే అగ్నిశిఖవంటిదని గూడ నర్మగర్భంగా తెలియచేసింది. నువ్వు చేపట్టిననాడే నిన్ను దహించివుండేది కాని పతిపరాయణ సీత నీ కాలకర్మాలకై ఎదురుచూచింది అనడంలో శత్రు వర్గపు స్త్రీ అయివుండి గూడ అమలినమైన భావాలతో సీతను కొనియాడిన మండోదరి ప్రశంసనీయ. ఈ ధర్మాధర్మ ప్రకటనకు మండోదరియే దగినపాత్ర అని వేంకట కవి భావించడం ఎంతో సముచితంగా వున్నది. పుణ్య పాపాలను పరిశీలించి ఆయా కర్మలు ఫలితాలు ఎలావుంటాయో విభీషణుణ్ణి, రావణుణ్ణి ఉదాహరణగా నిరూపించిన నేర్పరి. శ్రీమద్రామాయణంలో పరనింద చేసిన పాత్ర సృష్టి మృగ్యం. ఒక సామాన్య స్త్రీ అయినచో జ్ఞాతుల, సహచరుల చేష్టలను దుయ్యబట్టి నిందోక్తులతో బాధపెట్టడం లోకసహజం. ఉత్తములెప్పుడు తమను తామే పరిశీలించుకుని పశ్చాత్తాపులౌతారు. వేరొకరైనచో తన మరది విభీషణుడు, అతని భార్య యింటి గుట్టునంతా రామునికి చెప్పి తన భర్త మరణానికి కారకులైనందుకు తీవ్రంగా నిరసించి, నిందించి, కఠినోక్తులతో హింసించేవారు. కాని అయోనిజయైన మండోదరి మనస్తత్వమే వేరు. ఆమె తన యింటిని, పరిసరాలను, తన కుటుంబసభ్యులనే గాక, భర్త రావణుని గూడ చక్కగా అవగాహన చేసుకున్న కుశాగ్రబుద్ధిగలది. అందుకే తన బంగారమే మంచిదైతే అన్న సామెతగా తప్పులన్ని తన భర్తలోనే చూడగలిగిన ఉదార స్వభావం గలది.

 *మహారాజ్ఞి మండోదరి*
*Part-8*

అంతే కాదు విభీషణుడు చేసిన హెచ్చరికలు, హితోక్తులు లెక్కచేయక చేటు తెచ్చుకున్నావని తన భర్తనే అంటుంది కాని విభీషణుని ఆమె ఏమీ అనలేదు. శుభాశుభకర్మలకు ఫలితం సుఖదుఃఖాలని అనుభవానికి రాగలవని తీర్మానించినది. మరది విభీషణుని మన్నించినది. ఉత్తమ సతీధర్మాలు తెలిసిన మగువ మండోదరి. వాల్మీకి వ్యాసాదులేగాక ఎందరో గొప్ప కవులు మాత్రమే స్త్రీల ఔన్నత్యానికి పెద్దపీట వేసారు. మగువని ఆదరించి గౌరవించిన వాడే సుఖశాంతులని మన దివ్యగ్రంధాల సూచనగా నిర్ధారించారు.

మండోదరి తాను ఐశ్వర్యోపేతను, అందగత్తెను అను సాభిప్రాయ వ్యక్తీకరణ కూడ చేసుకున్నది. లోకంలో ఇది కొందరిపట్ల సహజమేననవచ్చును. రూపవతులైన యువతులు రావణుని కెందరో ఇంటగలరనీ, మోహవివశుడై వాళ్ల అందాల్ని చూడక సీతను పెద్ద అందగత్తెగా భావించాడని తలంచినది. ఇది కూడ పరస్త్రీ వ్యామోహ బద్ధులైన పురుషులకొక చిన్న చురకవంటిది. పైన మాటల వలన మండోదరి తన ఆధిక్యతను చాటుకుంటుంది. ఇంతంటి అందగత్తె తన ఇంట్లోవున్నప్పటికీ రావణుని వక్రబుద్ధి ఏపాటిదో చూడండి అంటున్నాయేమో మాటలు. ఏది ఏమైనా వ్యసనం వినాశహేతువు అని హెచ్చరిస్తోంది.
అని పలికిన పలుకులలో ధర్మపత్నితో పరస్త్రీ తుల్యమైనది కాదనే బుద్ధి గరపడమే గాక సీతకంటె తానేమి తక్కువైనదిగాదని పరస్త్రీలోలుడైన పురుషునికి తన భార్య సౌందర్యం తెలుసుకునే శక్తి చాలదని అలాంటి బుద్ధిలోపమే తన భర్తకు గలదని తత్ఫలితాన్ని అందుకున్నాడని నిరూపించిన ఉత్తమ యిల్లాలు. ఆమెలోని అభిజాత్యం అలాంటిది. జానకి ఆనందంగ భర్తతో సుఖం అనుభవిస్తుంటే చెఱగొన్న ఫలితంగా తనకీ వైధవ్యం అని రోదించిందా సతి, భార్యాభర్తలకు ఎడబాటుచేసిన కర్మఫలమేనని ఆమె విశ్వాసం. “నారీ చౌర్యమిదంక్షుద్రం కృతం శౌటిర్యమానినా” అన్నట్లు అతని నీచ బుద్ధిని గర్హించినది. పతివ్రతాపహరణమే అతని పాలిట కాలసర్పమై విషజ్వాలలచే దహించినదని పలుమార్లు మండోదరి వాకొన్నది. ఉత్తమ సతీధర్మాలకు నిలయం ఆమె హృదయం. ఆమెచేత కవి మరొక సత్యాన్ని లోకాలకు చాటిచెప్పించాడు. గొప్ప ఐశ్వర్యంతో తలతూగి భర్తతో కలిసి, అనుపమ భోగసంపదలు అనుభవించి ఉద్యానవనాది వివిధ దేశాలు సందర్శించిన తాను నేడు భోగ సంత్యక్తయై కాంతి హీనమైన జీవితం గడపవలసి వచ్చినందుకు చింతించినది. “భూవిభుల భోగ భాగ్యములు నమ్మదగవు చపలము లరయ ..” అని రాజ భోగాలన్ని అశాశ్వతాలని గర్హించినది. ఆమెలోని సత్యసంధత అనుపమానమైనది. అందుకే రాక్షసేంద్రా! అకారణ మృత్యువు కలుగదు. నీకు కూడ మైథిలిని అపహరించిన కారణంగానే మరణం సంభవించినదని కార్యకారణ హేతువుతో తర్కించినది. రావణుని ప్రేరణచేసిన తన ఆడపడుచు శూర్పణఖను గాని, రావణ వధకు కారకుడైన విభీషణునిగాని ఒక్కమాట అని కష్టపెట్టలేదు. ఎంతకూ అతడి కర్మ ఫలమేనని పలుమార్లు నొక్కి చెప్పడంలో కవి ఉద్దేశం ఎంతటివాడికైన కర్మఫలం అనుభవించక తప్పదనే సత్యాన్ని మండోదరి ముఖతః పాఠకలోకానికి అందించాడు.

మండోదరి తన భర్త ఔన్నత్యాన్ని, ఐశ్వర్యాన్ని, అందాన్ని చూచి మిక్కిలి గర్వించినది. అతని ఠీవిని పదే పదే స్మరించుకున్నది. స్త్రీల మానసిక భావాలను నిసర్గ రమణీయంగా వర్ణించాడు.
అని తన గర్వానికి కారణం వివరించినది. విక్రమాధికుడు, అహవశూరుడు, ధీరుడు, శౌర్యగుణోన్నతుడు అయిన భర్తగల తనకు ఎలాంటి ఆపద రాబోదని విశ్వసించినందున, మానవుని చేతిలో మరణిస్తాడని ఊహించలేదని దుఃఖించినది. అయితే పాఠకులు ఒక్క విషయాని గుర్తుంచుకోవాలి. మండోదరి రావణుడు ఇద్దరు రామావతార రహస్యం తెలిసినవాళ్లుగ, రాముడు దైవస్వరూపుడే అని మనకి చెప్పిన వాళ్లు గదా! మరల రాముడనే మానవుడి చేతిలో మరణం అనడానికి కారణం, రామావతార రహస్యాని పాఠకులకు ఒక్కమారైనా తెలియ చెప్పాలనే కవి మదిలోని ఆరాటాన్ని అలా ప్రదర్శింపచేసి వుంటాడు. అంతే వైభవోపేతంగా అలరారే రావణుని శరీరం రాముని కార్ముక విముక్తమైన వాడియైన శరజాలంతో క్షతమై నెత్తుటిదోగి విఖండితమై కొండవలె పడి ఉన్నదని దుఃఖితయైన సుశీల ఈమె. మృత్యువుకే మృత్యువైన నీవెట్లు మృతుడవైనావని భర్త ప్రతాపాన్ని ప్రకటించింది.

శభ్దవైచిత్రితో, దత్తపదుల విన్యాసంతో రావణాసురుని దర్పాన్ని వర్ణించిన వేంకటకవి రచన పోతనామాత్యుని పద్యరచనా కౌశలానికి ధీటైనది. రావణాసురుని మదరూప, ఐశ్వర్యటోపాలన్నిటిని ఏకరువు పెట్టి భోరున విలపించిన పతిపరాయణ రావణుని గుణశీల వర్ణనం, పతి స్వరూప స్వభావాలను, పరాక్రమోన్నతులను లోకాలకు పదే పదే చాటినదీ మయుని పుత్రి. పతి యందలి ప్రగాఢ అనురాగమే ఆమెనట్లు పలికించినది. తన భర్తకు గల భక్తియుక్తులు, శక్తిసామర్ధ్యాలు, దయాదాక్షిణ్యాలు ప్రవచించిన మండోదరి ప్రేమమూర్తి, భర్తవియోగ దుఃఖితయైన మండోదరి స్త్రీ జనోచిత భావాలకి తార్కాణం.
ఇలాంటి ఉన్నతుడైన భర్తను పోగొట్టుకొని కఠినాత్మనై జీవించియున్నానని శోకించినది. ఒకపరి పుత్ర శోకంతో, మరల పతి మరణంతో తీరని వ్యధతో హతనైతినని, సమస్త బాంధవ విరహితనై దుఃఖించవలసిన దౌర్భాగ్యానికి పెద్దప్రొద్దు విలపించినది. తర్క వితర్కాలతో కూడిన పలుకులెన్నో వినిపించినా సీతాసతివంటి పరస్త్రీ అపహరణమే రావణుడు అంతం కావడానికి ప్రధానకారణమని పదే పదే నినదించినది ఆమె కంఠం. దునుజేంద్రా! ధర్మం తప్పి పతిశెవా పరాయణులైన, ధర్మనిరతులైన పుణ్యమూర్తులైన కులస్త్రీలను, సువ్రతల్ను చెరబట్టి వాళ్ల భర్తలను వధించావు. ఆ సతీమతల్లుల హృదయ ఘోష నీ పాలిట శాపమైనది. కలకంఠికంట ఒలికిన కన్నీళ్ళకు కారణమైన వాడు ఎంతటి మహోన్నతుడైన నశిస్తాడను సత్యం నీ పట్ల ఋజువైనది. లోకత్రయాన్ని యేలగలిగిన ప్రతాపశాలివైన నీకు పరదారాభిలాష పతనానికి కారణమని తోచకుండుట తాను చేసుకున్న దౌర్భాగ్యమేనని విచారించినది. భీరువుగా సీతను అపహరించిననాడే నీ సౌర్యం నశించినది అంటూ రావణ దురాగతాలను వినయంతో చాటిన బుద్ధిశాలిని సాధుశీల. రావణుని మూర్ఖత్వానికి నొచ్చుకున్నది. పరదారాభిలాషనే పురస్కరించుకుని విలపించినది. అంటే స్త్రీలోలుడైన వాని వంశానికి చీడ తప్పదని పదే పదే నినదించినది. ఆమె విలపించిన తీరు చిత్రంగా వుంటుంది. కదనరంగంలోని శరీరాన్ని చూచి మండోదరి “అసుర పుంగవ ప్రియురాలినట్లు నేడు కదనమేదిని గౌగిట గదియబట్టి నాదువదనంబు చూడవు, మోదమిడవు. నన్ను గడదానిగ జూడ న్యాయమగునె” అని పలవించినది. వీర స్వర్గమలంకరించిన భర్తను చూచి పరిపరివిధాలుగా దుఃఖించినది. అప్పుడు కూడ భార్యభర్తకు దూరంగా జీవించుట తగనిపని యని ఆమె ఉద్దేశం. ఆ మహాసాధ్విని చూచి సపత్నులు ఓదార్చుచు విభీషణుడు మండోదరి దుఃఖాన్ని ఉపశమింపచేసి నాడు ఊరట కలిగించాడు.
*కవి* యిలా యుద్ధకాండలో మండోదరి పాత్రచిత్రణచేసి జీవం పోశాడు. విద్యావినయ సంపదలు, సంస్కృతీ సంప్రదాయాలు, వినయాహంకారాలు అన్నింటిలో పరిపుష్టంగా తీర్చిదిద్ది ఆమెనొక మహోన్నత మహిళామణిగ సృజించిన కవి ప్రతిభ ప్రశంసావహమైనది. ఉజ్వలమణిదీపం, లోకధర్మప్రతిష్ఠాపనకే కవి మండోదరిని సృష్టించి ఉంటాడనే వ్యక్తిత్వం గలది. ఆమెను గూర్చి పలికిన ఈ క్రింది మాటలు ఇక్కడ ప్రస్తావించదగినివిగా భావిస్తాను.

“ఎంతో సారవంతమైన పాదులో పుట్టి అందంగా, ఏపుగా ఎదిగే తీవతోనల్లు కోటానికి మహోన్నతమూ, శఖోపశఖా విలసితము అయిన పెద్ద వృక్షము కొఱకు వెదకటం, అలాంటి వృక్షానికి అల్లుకొని ఎంతో ఎత్తు పెరగాలని, ఎన్నో పూలు పూయాలని, కాయలు కాయాలని కలలు కనడము, ఆ కొరిక నెరవేరగా నిలువెల్ల పులకరించి తన అదృష్టానికి తానే ఆశ్చర్యపడుటము, అపరిమిత ఆనందాన్ని అనుభవించడము లోక సహజం. కాని ఆ చెట్టుకొక వేరు పురుగుపుట్టి, చీడతగిలి, బలహీనమై, గాలిదెబ్బకు కొమ్మలు విరిగి, కూకటి వ్రేళ్లతో పెళ్లగిలిపోతే ఆతీవ కుప్పకూలి ప్రక్కన బడి ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుందో ఎవరికి తెలుసు?” అనే మాటల వల్ల ఆమె ఆవేదన ఒకరికి చెప్పినా అర్ధంకాని అనంతమైనది. అనుభవించిన వాళ్ళకే తెలిసినది. అలాంటి బాధాపరితప్త మానసయైన మండోదరి పట్ల *కవి* చెప్పిన మాటలు సముచితంగా వున్నాయి.🙏🙏🙏🙏🙏

అయోధ్య,

*అయోధ్య,... ఇతర నగరాల మాదిరిగా అదో భౌగోళిక ప్రాంతంగా మిగిలిపోలేదు.  దైవం నడయాడిన నేలగా ప్రణతులందుకుంది. ఒక్కసారైనా ఆ మట్టిని ముట్టుకోవాలని లక్షలాదిమందిని ఆరాటపడేలా చేసింది.*
 *ఎందుకంటే... అది తరగని ఆధ్యాత్మిక చింతనకు ఆయువుపట్టు. ధర్మవర్తనకు, ప్రజారంజకమైన పాలనకు దిక్సూచి. సనాతన భారతీయ సాంస్కృతిక హర్మ్యానికి హృదయపీఠి.*

 *అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికా*

స్కాందపురాణం దేశంలోని ఏడు మోక్షపురాల్లో ఒకటిగా అయోధ్యను పేర్కొంది.
ఈ నగరం చేప ఆకారంలో ఉంటుందని కూడా ఈ పురాణం చెబుతుంది.
అగ్ని, బ్రహ్మపురాణాలు అయోధ్యను పాపాలను నాశనం చేసే నగరంగా కీర్తించాయి.
 యోగినీతంత్రంలో కూడా అయోధ్య ప్రస్తావన ఉంది.  అధర్వణ వేదం అయోధ్యను దేవనిర్మిత నగరంగా ప్రకటించింది. తులసీదాసు కూడా తన రామచరితమానస్‌లో అయోధ్య వైభవాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
 భాగవతంలో కూడా శుకమహర్షి రఘువంశాన్ని ప్రస్తావించి ప్రత్యేకంగా అయోధ్య గురించి వివరిస్తాడు.
 *అందరూ అనుకుంటున్నట్లు అయోధ్య కేవలం నగరం మాత్రమే కాదని, మానవ జీవ చైతన్యానికి ఇదో ప్రతీక అని అధర్వణవేదం చెబుతోంది.*

 *‘అష్టాచక్రా నవద్వారా దేవానాం పూరయోధ్యా  తస్యాగ్‌ం హిరణ్మయః స్వర్గలోకో జ్యోతిషావృత్తః...’* -

ఎనిమిది చక్రాలు, తొమ్మిది ద్వారాలు ఉండే మానవ శరీరం అయోధ్యకు ప్రతీక.
జనన, మరణ చక్రంలో శరీరం తిరుగుతూ ఉంటుంది.
 వీటితో మోక్షం కోసం యుద్ధం చేయడం సాధ్యం కాదు. ఫలితం ఉండదు.
శరీరం అనే పట్టణంలోని జ్యోతిర్మయకోశానికి స్వర్గం అనే పేరుంది.
అది జీవ చైతన్య స్వరూపమైన తేజస్సుతో నిండి ఉంటుంది.
ఈ పట్టణాన్ని బ్రహ్మ సంబంధమైనదిగా  తెలుసుకున్న వారికి బ్రహ్మదేవుడు ఆయువు, కీర్తి అనుగ్రహిస్తాడని అధర్వణ వేదమంత్రాలు చెబుతున్నాయి.

పోత‌న త‌ల‌పులో....(10)



కాళ్ళూచేతులూ తిరుగుతున్నంత కాలం, మైమ‌ర‌చి,
పద‌వులు క‌లిగిన వారి వెంట ప‌డి ప‌డి తిరిగి వారి సేవ‌లో
త‌రించ‌డం ఒక్క‌టే ఈ జ‌న్మ‌కు సార్థ‌క‌మ‌ని భావించే వారికి
క‌నువిప్పు క‌లిగించే ప‌ద్యం ఇది.
‌.
                        ***
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్

                   ***               ***
విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో వ్రాసిన భాగవతాన్ని మానవమాత్రులు మాత్రమే అయిన రాజులెవరికి ఇవ్వటానికి నా మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాల లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖాలలో మైమరచి ఈ లోకంలో అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిదెబ్బలు తప్పవని నాకు తెలుసు. అందుకే బమ్మర పోతరాజు అనే నేను, చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా  ప‌ర‌మ‌ పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని స‌ర్వాంత‌ర్యామి అయిన  ఆ శ్రీహరికే సమర్పించుకుంటున్నాను.

          స్వ‌గ‌తంగా అనిపించినా, అంత‌ర్లీనంగా  ఈజాతికిది సందేశం.
500 సంవ‌త్స‌రాల‌కు పూర్వ‌మే జాతికి  దిశా నిర్దేశం చేసిన మ‌హిమాన్వితుడు పోత‌న

🏵️*పోత‌న ప‌ద్యాలు- జాతిని మేల్కొలిపే ఆణిముత్యాలు*🏵️