16, మార్చి 2025, ఆదివారం

కృష్ణార్పణము కృష్ణ అక్షయం

 .

కృష్ణార్పణము కృష్ణ అక్షయం ఈ రెండు వేరే ఎవరు చెప్పినది కాదు సాక్షాత్తు పంచ పతివ్రతలలో ఒకరైన ద్రౌపదీ మహా సాధ్వి చెప్పిన విషయం ఇది. 

దాని గురించి వివరంగా తెలుసుకుందాం. 

ద్రౌపతీ దేవి మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్ముడిని తన స్వయంవర సమయం లో చూసింది. అప్పుడు నేరుగా వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి మహాత్మా నీవు సర్వాంతర్యామివి సర్వ జగద్రక్షకుడివి సర్వము తెలిసిన వాడివి. నాకు ఎవరిని భర్తగా నిలపాలా అనేది నిర్ణయం నీదే ఇది కేవలము లోకములోని అందరికీ తెలిసేటందుకు ఈ స్వయంవరం జరుగుతోంది, కావున ధర్మము తప్పనివాళ్లు సత్సాంగత్యం కలవాళ్ళు కలిగిన అత్తగారింటికి వెళ్ళేట్టుగా నన్ను ఆశీర్వదించు అని ఆయనను వేడుకొంది. అందులకు ఆయన అది ఏమిటి తల్లి ఇంత మంది ఉన్నారు పెద్దల ఆశీస్సులు కాకుండా నా ఆశీస్సులు అడుగుతున్నావు అని అడిగాడు అందులకు ఆమె నేను ముందుగానే చెప్పాను నీవు ఎవరవు అనే విషయం నాకు తెలుసు అసలు ఈ విషయము అంతయు నీ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఏదైనా నీకు అర్పితం కానిది ఇంకెవరికి అర్పితం కాదు అని ఆమె ఆయన పాదాలు విడవలేదు. ఆమె భక్తికి మెచ్చిన ఆ నందగోపాలుడు ఆమెకు తధాస్తు నీకు శుభం కలుగుగాక నీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను తల్లి అని చెప్పాడు. 

అటు తరువాత ఒకసారి పాండవులు ద్రౌపది అరణ్యవాసంలో ఉన్నప్పుడు కౌరవులు పంపగా ధర్మరాజును పరీక్షించడానికి దుర్వాస మహర్షి వస్తాడు మేము మా శిష్య బృందం అంతా ఆకలితో ఉన్నాం నేను నదికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసుకొని వచ్చేలోపు మా అందరికీ నీవు భోజనములు సిద్ధం చెయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. 

అప్పటికి ధర్మరాజు వద్ద ఉన్న అక్షయపాత్ర శుభ్రం చేసి పూజా మందిరంలో పెట్టేస్తుంది ద్రౌపతి. ధర్మరాజు ఈ అనుకోని అతిథి వలన ఏమి బాధలు కలుగుతాయో అని వెళ్లి ద్రౌపది దీనికి చెబుతాడు. అప్పుడు ఆమె నేను ఎప్పుడు కూడా నీ పద చరణాలను నమ్ముకుని ఉండే దానిని అయితే నా ఈ కష్టాన్ని నీవే కాపాడుతావు ఓ ఆర్తత్రాణ పరాయణ ఓ వాసుదేవా ఓ జగత్కారణ ఓ గోపి జనప్రియ అని అనేక నామాలతో కీర్తిస్తుంది, స్తుతిస్తుంది. అప్పుడు ఆ దీనజన వల్లభుడు ఆ సమయానికి అక్కడ ప్రత్యక్షమై అమ్మ సోదరి నాకు కాస్త ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే పెట్టు తల్లి అని అడిగాడు. ఓ జగన్నాటక సూత్రధారి ఇదంతాయు నీ మాయనే నీ వల్లనే మేము ఇక్కడికైనా ఉన్నాం కావున నీవు ఇంకా నన్ను పరీక్షించవద్దు అని ఆయననే శరణు వేడింది. దానికి ఆయన ఆ అక్షయ పాత్రలో చూడు తల్లి ఒక్క గుళికైనా ఉండకపోతుందా అని అడిగాడు తీసుకొచ్చి ఆమె చూపించింది అప్పుడు ఆ వాసుదేవుడు తన చేతిలో ఒక చిన్న మెతుకు గోటిలో పెట్టుకొని వచ్చాడు ఆ మెతుకు దాన్లో వేసి ఇదిగో తల్లి ఈ ఒక్క గుళిక చాలు బ్రహ్మాండములో ఏదైనా కూడా తృప్తి చెందుతాను నేను. నాకు కావాల్సింది భక్తి అంతే తల్లి ఇదిగో అని చెప్పి లోపలికి ఆ మెతుకు నువ్వు నోట్లో వేసుకుని తృప్తాస్మి(తృప్తస్థ) (ఇక్కడ ఈ రెండు పదాల్లో నాకు ఒక అనుమానం ఉన్నది అందుకని రెండు పదాలు వాడను) అని చెప్పి భీమసేన నీవు వెళ్లి దూర్వాసుల వారిని వారి శిష్య బృందమును వెంటబెట్టుకుని రావాలి. కాదు కూడదన్నా కూడా జాగ్రత్తగా తీసుకురావాలి మర్చిపోవద్దు నేను వచ్చానని చెప్పు తప్పకుండా వస్తాడు అని చెబుతాడు ఆయన చెప్పిన మాటలను తు.చ. పాటిస్తూ భీమసేనుడు వెళ్లి అడగగా అక్కడ కడుపు ఉబ్బరంతో దుర్వాసుడు అతడి శిష్య బృందమంతా అనగా అజీర్తి తో నేల మీద బడి దొర్లుతూ ఉంటారు. వెళ్లి పిలిచిన భీమసేనుడిని చూసి నాయనా నేను రాలేను నాకు కడుపు అంతా ఉబ్బరం చేసింది నేను ఇప్పుడు ఒక మెతుకు కూడా ముట్టలేను కాబట్టి నన్ను వదిలేయి అన్నాడు అప్పుడు భీమసేనడు అలా కుదరదు స్వామి మీరు వచ్చారని తెలిసి వాసుదేవుడు కూడా వచ్చాడు అని చెప్పగా దానికి ఆయన విషయం తెలుసుకున్నవాడై భీమసేన ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఆ దుష్ట చతుష్టయం మాటలు విని మిమ్ములను పరీక్షించడానికి వచ్చాను నా తప్పును మన్నించమని వాసు దేవుడికి చెప్పు అని చెప్పి పంపిస్తాడు అప్పుడు ద్రౌపదీ దేవికి ఇచ్చిన వరం కృష్ణ అక్షయం అంటే ఆమె ఏది మొదలుపెట్టిన కూడా కృష్ణుని దయ వల్లనే ఇది అక్షయమవుతుంది అని అర్థం. ఎవరైనా సరే వాళ్లకు ఏదైనా కీడు తలపెట్టినా కూడా లేదా దురుద్దేశంతో వస్తున్న కూడా అప్పుడు ఆమె కృష్ణార్పణమస్తు అని చెబుతూ వచ్చింది.

ఆమె భక్తితో చేస్తూ ఉంది కాబట్టి కృష్ణాక్షయము కృష్ణార్పణము రెండు ఆమె ద్వారా వచ్చినటువంటివే!


ఇది మహాభారతంలో అరణ్యకాండలో వస్తుంది.


    నమస్కారమండి 

               మీ 

 చంద్రమోహన్ మాండవ్య 🙏🕉️🍒🦜🪻🌹🥀🏵️🍁

శ్రీకృష్ణార్పణమస్తు

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

   *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కృష్ణార్పణం అనడానికి కారణమేమిటి? ఫలమేమిటి?*


*ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి.*


*చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి.*


*ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో ఉండిపోవలసిందేనా?*


*లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు.* 


*యత్కరోషి, యదశ్నాసి,*

*యజ్జుహోషి దదాసియత్*

*యత్తపస్యసి, కౌంతేయ!*

*తత్కురుష్వమదర్పణమ్*


*అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు*


*అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది.*


*మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము.*


*రెండోది ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే. అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.*


*మూడోది సంగత్యాగం. ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి.*


*ఈ త్రివిధ త్యాగాలు ఎలా చెయ్యాలి?* 


*ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెప్పు, చాలు.*


 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*


*పై త్రివిధ త్యాగాలను త్రికరణశుద్ధిగా అవలంబించాలి*


*ఓం నమో భగవతే వాసుదేవాయ।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(77వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

          *కృష్ణావతారం* 

 *కంసుడు*, *శ్రీకృష్ణ జననం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఉగ్రసేనునికి క్షేత్రజ కుమారుడయిన కంసుడేగాక మరి ఎనిమిది మంది కుమారులు జన్మించారు. కంస, కంసవతి మొదలయిన అయిదుగురు కుమార్తెలు కూడా జన్మించారు. ఉగ్రసేనుని తమ్ముడు దేవకుడికి నలుగురు కుమారులు, ఏడుగురు కుమార్తెలు జన్మించారు.ఆ ఏడుగురిలో చివరది దేవకి. ఈ ఏడుగురినీ వసుదేవుడు వివాహం చేసుకున్నాడు. దేవకీ వసుదేవులకే శ్రీకృష్ణుడు జన్మించాడు.*


*దానవాంశంతో జన్మించిన కంసుడు చిన్ననాటి నుంచే ఎన్నో దుష్కృత్యాలకు పాల్పడ్డాడు. పుణ్యాత్ములను, బ్రాహ్మణులను హింసించసాగాడు. జరాసంధుని కుమార్తెలయిన అస్తి, ప్రాప్తిలను వివాహం చేసుకున్నాడతను. శిశుపాలుడు, దంతవక్త్రుడుతో స్నేహం కలుపుకున్నాడు. తండ్రి ఉగ్రసేనుణ్ణి బంధించి, తనని తాను రాజుగా ప్రకటించుకుని ప్రజలను పీడించసాగాడు.*


*శ్రీకృష్ణజననం:~*


*ఆడపిల్లను తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు, ఆమె వెంట అన్నో తమ్ముడో లేదంటే పుట్టింటికి సంబంధించిన మరొక వ్యక్తి ఎవరయినా ఉండడం ఆచారం. తోడుగా వెళ్ళి ఆమెను అత్త ఇంట దిగవిడచి రావడం సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించే దేవకీ వసుదేవుల వివాహం అనంతరం వారిని దిగ విడచి వచ్చేందుకు తోడుగా కంసుడు బయల్దేరాడు.*


*చెల్లెలినీ, బావగారినీ రథంలో కూర్చోబెట్టుకుని, తానే రథాన్ని నడపసాగాడు కంసుడు. ఆ రథాన్ని అనేకమంది దాస దాసీజనం, పరివారం అనుసరించాయి. సకల మర్యాదలతో చెల్లెలిని అత్త వారింటికి తీసుకుని వెళ్తున్నాన్న ఆనందంలో ఉన్నాడు కంసుడు. అప్పుడు ఓ విచిత్రం జరిగింది.*


*ఉత్సాహంగా ఉల్లాసంగా రథాన్ని నడుపుతున్న కంసుణ్ణి ఉద్దేశించి ఆకాశవాణి ఇలా పలికింది.*


*‘‘కంసా! సోదరిని సంతోషంగా అత్తవారింటికి తీసుకుని వెళ్తున్నావు. చేజేతులా చావుని కొని తెచ్చుకుంటున్నావు. ఈ దేవకి కడుపున పుట్టిన ఎనిమిదవ బిడ్డే నీ ప్రాణాల్ని హరిస్తుంది. ఆ బిడ్డ చేతిలో నీకు మరణం తప్పదు.’’*


*వినవచ్చిన ఆ మాటలకు విస్తుపోయాడు కంసుడు. కాసేపు కళ్ళు మూసుకున్నాడు. ఏకదీక్షతో ఆలోచించాడు. ఆకాశవాణి మాటలు నిజం కాకతప్పదు. తనకి మరణం తధ్యం. దానిని తప్పించుకోవాలి. ఎలా?*


*రథం దిగాడు కంసుడు. కొరకొరా చెల్లెలు దేవకిని చూశాడు. ఆమె సిగను పట్టి కిందకి లాగాడు. మొలలోని కత్తిని ఆమె పైకి దూశాడు.*


*‘‘బావా’’ అంటూ అడ్డుకున్నాడు వసుదేవుడు.*


*‘‘ ఇది నా చెల్లెలు కాదు, నా ప్రాణాల్ని హరించే రాక్షసి. దీనిని ఈ క్షణమే హతమార్చి, నన్ను నేను కాపాడుకుంటాను. తప్పుకో.’’ అన్నాడు కంసుడు.*


*వసుదేవుణ్ణి వెనక్కి నెట్టాడు. తూలిపడబోయి నిలదొక్కుకుని, కంసుని కాళ్ళు పట్టుకున్నాడు వసుదేవుడు.*


*‘‘బావా! భోజకులానికే ఎన్నదగినవాడవు. శూరుడవు. నీకు తెలియని ధర్మం లేదు. స్త్రీహత్య మహాపాతకం. చెల్లెలు, కొత్తపెళ్ళికూతురు, కాళ్ళపారాణి కూడా ఆరలేదు. అలాంటిదాన్ని, అమాయకురాలిని చంపుతాననడం ధర్మమా చెప్పు? దయచేసి నా మాట విను, దేవకిని వదలిపెట్టు.’’ ప్రాథేయపడ్డాడు. వినలేదు కంసుడు. దేవకిని చంపితీరుతానన్నాడు. ఎన్నో విధాలుగా నచ్చజెప్పి చూశాడు వసుదేవుడు. అయినా ఒప్పుకోలేదతను.*


*తీవ్రంగా ఆలోచించి అప్పుడు ఇలా అన్నాడు వసుదేవుడు.‘‘ఎనిమిదవ బిడ్డ కదా నీ ప్రాణాల్ని హరించేది. ఎనిమిదవ బిడ్డనే కాదు, దేవకికి పుట్టిన ప్రతిబిడ్డనీ నీకు తెచ్చి ఇస్తాను. నువ్వేం చేసుకుంటావో  చేసుకో! దేవకిని వదులు.’’*


*వసుదేవుని వాగ్దానానికి శాంతించాడు కంసుడు. దేవకిని విడచిపెట్టాడు. ‘‘మాట తప్పవు కదా?’’ అడిగాడు వసుదేవుణ్ణి. తప్పనన్నాడతను. ‘‘సరే, వెళ్ళిరండి.’’ కంసుడు ఇద్దరినీ వదిలేశాడు. బ్రతుకుజీవుడా అని భర్త సహా అత్తారింటికి చేరుకున్నది దేవకి.*


*కొన్నాళ్ళకు ఆమె ఓ కుమారుణ్ణి కన్నది. ఇచ్చిన మాట ప్రకారం ఆ కుమారుణ్ణి తీసుకుని, కంసుణ్ణి సమీపించాడు వసుదేవుడు.‘‘తీసుకోబావా’’ అందజేశాడు. పసిబిడ్డను తీసుకుని చూశాడు కంసుడు. వేలెడు లేడు. తనని వీడేం చేస్తాడనుకున్నాడు. సన్నగా నవ్వుకున్నాడు. తర్వాత వసుదేవుని సత్యనిష్ఠకు కూడా సంతోషించి, ఇలా అన్నాడు.‘‘ఆడిన మాటకు కట్టుబడి బిడ్డను తీసుకుని వచ్చావు. ఆనందంగా ఉంది. ఈ పసిగుడ్డు నన్నేం చేస్తుంది. తీసుకునిపో, పిల్లాడితో సుఖంగా ఉండండి.’’ వసుదేవునికి పిల్లాణ్ణి తిరిగి ఇచ్చేశాడు కంసుడు. ఆ బిడ్డపేరే కీర్తిమంతుడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*పరమశివుని పాదాల జంట అనే పక్షి గూటిలో తన మనస్సు అనే పక్షిని విహరింపుమని , శంకరులు ఈ శ్లోకంలో తన మనస్సు కు హితోపదేశం చేశారు.*


*శ్లోకం: 45*


*ఛన్దశ్శాఖి శిఖాన్వితైః ద్విజవరైః సంసేవితే శాశ్వతే*


*సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే ।*


*చేతః పక్షి శిఖామణే త్యజ వృథా సంచారం అన్యైరలం*


*నిత్యం శంకరపాదపద్మయుగలీనీడే విహారం కురు ।*

*తాత్పర్యము : ~*


*మనస్సనే పక్షి శ్రేష్ఠమా ! వేదములనే వృక్షాగ్రములయందు ఉన్నట్టి పక్షి శ్రేష్ఠములతో సేవింపబడేదీ, వేదాంతములైన ఉపనిషత్తులతో కూడిన బ్రాహ్మణవర్యులచే సేవింపబడేదీ, స్థిరమైనదీ, సౌఖ్యాన్ని కల్గించేదీ , దుఃఖాన్ని తొలగించేదీ, అమృత సారములైన ఫలాలతో ఒప్పేదీ, అమృత ప్రాయమైన మోక్షానందముతో ప్రకాశించేదీ అయిన శివుని పాదపద్మ యుగం అనే గూటి యందు సర్వదా విహరించు. వ్యర్థసంచారాలు విడచి పెట్టు. ఇతరములతో నీకు పని ఏముంది.*


*వివరణ :~*


*శంకరులు తనమనస్సును ఇలా ప్రబోధించారు. " ಓ మనస్సనే పక్షీ ! నీకు నీడ కోసం మంచి గూడు కావాలి. ఆ గూడులో అన్ని సుఖాలూ ఉండాలి. అటువంటి గూడుకోసం అక్కడా ఇక్కడా వ్యర్థంగా తిరుగకు.*

 

*శంకరుని పాదపద్మాలనే గూడు నీ కోసం సర్వ వస్తువులతో సిద్ధంగా

ఉంది. నీవందులో విహరించు. అది శాశ్వతమైనది.*


*ఇంతకుముందే ఆ గూట్లోకి వేదవృక్షాల కొమ్మల చివుళ్ళను ముట్టిన ద్విజ వరములు చేరిఉన్నాయి. ఆగూడు సౌఖ్యముగావుండి దుఃఖాన్ని పోగొడుతుంది. అమృతసారమైన ఫలములు అక్కడ దండిగా ఉన్నాయి. కాబట్టి పనికిమాలిన తిరుగుళ్ళు మాని ఈశ్వరుని పాదపద్మాలనే గూటికి చేరుకో."*


*తనమనస్సునకు శంకరులు అటువంటి స్థానాన్ని ఈ శ్లోకంలో చూపించారు. కరుణా సముద్రుడైన శివుని పాదాలపై మనస్సునుంచి శరణు వేడితే కానిది ఉండదుకదా !*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

గరుడ పురాణం_*12 - 15

: *గరుడ పురాణం_*12వ భాగం*


_*నవవ్యూహార్చన విధి పూజానుక్రమ నిరూపణం:*_


_“పరంధామా! నవ వ్యూహార్చన విధిని గూర్చి తెలుసుకొనగోరుతున్నాము” అని ప్రార్థించాడు ఇంద్రుడు. చెప్పసాగాడు ఇందిరానాథుడు._


_*“మహా పురుషులారా! ఒకప్పుడు మా గరుత్మంతుడిదే విషయాన్ని గూర్చి కశ్యపునికి చెప్పాడు. అదే మీకు నేను వర్ణిస్తాను.*_


_సాధకుడు ముందుగా యోగక్రియ ద్వారా మస్తక, నాభి, హృదయతత్త్వములను ఆకాశనామకతత్వంలో ప్రవేశింపజేయాలి. తరువాత 'రం' అనే అగ్ని బీజ మంత్రంతో పాంచభౌతిక శరీరాన్ని శోధించుకోవాలి. తరువాత 'యం' అనే వాయు బీజమంత్రంతో సంపూర్ణ శరీరాన్ని లయింపజేస్తున్న భావన చేయాలి. తరువాత 'లం' అనే బీజమంత్రంతో ఈ శరీరాన్ని చరాచర జగత్తుతో సంప్లావితం చేస్తున్నట్లు భావించుకోవాలి. అటుపిమ్మట 'వం' అనే బీజమంత్రంతో తనలోనే అమరత్వాన్ని భావించుకోవాలి. అమృతాన్ని ధ్యానిస్తూ 'పీతాంబరధారియు చతుర్భుజుడునునగు శ్రీహరిని నేనే' అని భావించుకుంటూ ఆత్మతత్త్వ ధ్యానంలో నిమగ్నం కావాలి._


_*తరువాత శరీరంలో, చేతుల్లో మూడు ప్రకారాల మంత్రన్యాసం చేయాలి. ముందు పన్నెండక్షరాల బీజమంత్రంతో, తరువాత మరో మంత్రంతో, న్యాసం, షడంగన్యాసం చేస్తే సాధకుడు తానే సాక్షాత్ నారాయణ స్వరూపుడైపోతాడు. దక్షిణాంగుష్ఠంతో ప్రారంభించి మధ్య వేలి దాకా న్యాసం చేసి మరల ఆ మధ్య వేలిపైనే రెండు బీజమంత్రాలతో న్యాసం చేసి మరల శరీర విభిన్నాంగాలపై న్యాసం చేయాలి. క్రమంగా గుండె తల, పిలక, టెంకి, మోము, కనులు, కడుపు, వీపు, అంగన్యాసం చేస్తూ రెండు భుజాలు, చేతులు, మోకాళ్ళు, కాళ్ళలోన కూడా న్యాసం చేయాలి. (చేతుల తరువాత మోకాళ్ళు)*_


_తరువాత రెండు చేతులనూ కమలాకారంలో పెట్టుకొని దాని మధ్య భాగంలో బొటన వ్రేళ్ళను కలిపి నిలపాలి. ఈ ముద్రలోనే కొంతసేపుండి పరమతత్త్వ స్వరూపుడు, అనామయుడు, సర్వేశ్వరుడు, భగవానుడునగు నారాయణ చింతనం గావించాలి._


_*తరువాత ఇవే బీజమంత్రాలతో క్రమంగా చూపుడు వేలితో మొదలెట్టి అన్ని వేళ్ళతో న్యాసం చేసి యథాక్రమంగా తల, కనులు, మోము, గొంతు, గుండె, బొడ్డు. వెనుక భాగము, రెండు మోకాళ్ళు, కాళ్ళలో కూడా న్యాసం చేయాలి.*_


_బీజమంత్రాలతో సంపూర్ణ శరీరంలో న్యాసం చేయాలి. బొటనవ్రేలి నుండి చిటికెన వేలి దాకా అయిదు బీజమంత్రాలతో న్యాసం చేయాలి. ఏ అంగానికి సంబంధించిన బీజ మంత్రాన్ని ఆ అంగన్యాసం చేస్తున్నపుడు మననం చేయాలి._


_తరువాత సాధకుడు అవే బీజ మంత్రాలతో దిక్కులను ప్రతిబద్ధం చేసుకొని పూజన క్రియ నారంభించాలి. ముందుగా ఏకాగ్ర చిత్తంలో తన హృదయంలో యోగ పీఠాన్ని ధ్యానించాలి. వివిధ దిశలలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను కల్పించుకొని పూజించి పూర్వాది దిశలలో అధర్మాదులను న్యాసం చేయాలి ఇలా :_


అగ్ని కోణంలో - ఓం ధర్మాయ నమః


నైరృత్య కోణంలో - ఓం జ్ఞానాయ నమః


వాయు కోణంలో - ఓం వైరాగ్యాయ నమః


ఈశాన కోణంలో - ఓం ఐశ్వర్యాయ నమః


తూర్పు దిక్కులో - ఓం అధర్మాయ నమః


దక్షిణ దిక్కులో - ఓం అజ్ఞానాయ నమః


పడమటి దిక్కులో - ఓం అవైరాగ్యాయ నమః


ఉత్తర దిక్కులో - ఓం అనైశ్వర్యాయ నమః

_*అని అంటూ న్యాసం చేయాలి.*_


_సాధకుడీ విధంగా న్యాసవిధులతో ఆచ్చాదింపబడిన తన శరీరాన్ని ఆరాధన పీఠంగానూ తనను తాను దాని స్వరూపంగానూ భావించుకొని తూర్పు వైపు తిరిగి తలను బాగా ఎత్తి స్థిరుడై అనంత భగవానుడైన విష్ణువును తనలో ప్రతిష్ఠితుని చేసుకోవాలి. తరువాత జ్ఞానరూప సరోవరంలో వికసించిన అష్టదళ కమలాన్ని ధ్యానించాలి._


_*తరువాత ఋగ్వేదాదులలోని మంత్రాలతో సూర్య, చంద్ర, అగ్న్యాదులను ధ్యానించు కోవాలి. తరువాత అష్టదళ కమలంపై ఎనిమిది దెసలలో భగవంతుడైన కేశవుని వద్దనే అవస్థితములై వుండు విమలాది శక్తులను విన్యస్తం చేసి తొమ్మిదవ శక్తిని కర్ణికపై స్థాపించాలి.*_


_వాటిని ధ్యానించిన పిమ్మట యోగపీఠానికి విధ్యుక్తంగా పూజ చేయాలి. తరువాత మరల మనస్సు ద్వారా విష్ణుభగవానుని అంగసహితంగా ఆవాహనం చేసి ఆ యోగపీఠంపై ప్రతిష్ఠించాలి. అపుడు తూర్పు మొదలుగా నాలుగు దిక్కులలో నున్న కమలదళాలపై హృదయాది న్యాసాన్ని చేయాలి. కమలము యొక్క మధ్య భాగంలోనూ కోణాల పైననూ ఈ క్రింది విధంగా అస్త్రమంత్ర న్యాసాన్ని గావించాలి._


తూర్పువైపు దళంలో - హృదయాయ నమః


దక్షిణం వైపు దళంలో - శిరసే స్వాహా


పశ్చిమం వైపు దళంలో - శిఖాయై వషట్


ఉత్తరం వైపు దళంలో - కవచాయ హుం


మధ్యంలో - నేత్రత్రయాయవైషట్


కోణంలో - అస్త్రాయఫట్

_*అంటూ న్యాసం చేయాలి.*_


_తరువాత పూర్వాది దిశల్లో యథాక్రమంగా సంకర్షణాదులను స్థాపించాలి. తరువాత తూర్పు, పడమటి ద్వారాలలో ఓం వైనతేయాయ నమః అంటూ గరుత్మంతుని స్థాపించాలి. దక్షిణ ద్వారంలో 'ఓం సుదర్శనాయ నమః, ఓం సహస్రారాయనమః' అని ఉచ్ఛరిస్తూ వేయి అర్రలున్న సుదర్శన చక్రమును స్థాపించాలి. దక్షిణ ద్వారంలోనే ఓం శ్రియైనమః మంత్రంతో శ్రీ అనే అక్షరాన్ని న్యాసం చేసి ఉత్తర ద్వారంలో ఓం లక్ష్మ్యై నమః అనే మంత్రంతో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలి. తరువాత ఉత్తర దిశలో ఓం గదాయై నమః అంటూ గదనీ, కోణాలలో ఓం శంఖాయై నమః అంటూ శంఖాన్నీ న్యాసం చేయాలి._


_*పిమ్మట విష్ణుదేవునికి రెండు వైపులా ఆయుధాలనుంచాలి. దక్షిణం వైపు ధనుస్సు (శారంగము) నీ ఎడమ వైపు బాణములను అలాగే కుడి యెడమలలో కత్తినీ కవచాన్నీ వుంచాలి.*_: *గరుడ పురాణం_*13వ భాగం*



_ఆపై సాధకుడు మండలమధ్యంలో దిశాభేదాను సారము తూర్పుతో మొదలెట్టి ఇంద్రాది దిక్పాలకులను వారి ఆయుధాలతో సహా స్థాపించాలి. అలాగే పైకి ఓం బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవునీ ఓం అనంతాయ నమః అనే మంత్రం ద్వారా అనంతునీ న్యాసం చేయాలి._


_*ఈ ప్రకారంగా అందరు దేవతల న్యాస, ధ్యాన, పూజనాలను చేస్తూ ఆయా దేవతల కెదురుగా వారి వారి ముద్రలను ప్రదర్శించాలి. అంజలి బద్ద ముద్ర మొదటి ముద్ర. దీన్ని ప్రదర్శించడం వల్ల దేవసిద్ధి తొందరగా లభిస్తుంది. రెండవది వందినీ ముద్ర. మూడవదైన హృదయాసక్త ముద్రను ఎలా ప్రదర్శించాలంటే ఎడమ పిడికిటిలో కుడిబొటనవ్రేలిని బంధించి ఎడమ బొటన వేలిని పైకెత్తి గుండెకు తగల్చాలి. వ్యూహ పూజలో ఈ మూడిటినీ సాధారణ ముద్రలుగా పరిగణిస్తారు. రెండు చేతుల వేళ్ళనూ ఒకదానికొకటి తగిలించి వుంచి ఒక్కొక్క వ్రేలినీ వదులుకుంటూ పోవడం ద్వారా ఎనిమిది ముద్రలు ఏర్పడతాయి.*_


_రెండు చేతుల బొటనవ్రేళ్ళనూ వాటి మధ్యమ, అనామిక, చిటికెన వ్రేళ్ళకు తగిలించి క్రిందికి వంచి చూపే ముద్రను 'నరసింహ' ముద్ర అంటారు. కుడిచేతిపై ఎడమ చేతిని ఉత్తానస్థితిలో పెట్టి ప్రతిమపై మెల్ల మెల్లగా తిప్పడాన్ని 'వారాహీ' ముద్ర అంటారు. ఆయా దేవుళ్ళకివి ప్రియమైన ముద్రలు. రెండు పిడికిళ్ళను బిగించి ఒకదానిపై నొకటిగా వుంచి ఒక్కొక్క వ్రేలినే మెలమెల్లగా విడిపించి మరల పిడికిళ్ళను బిగించడాన్ని 'అంగముద్ర’ అంటారు. పది దిక్కుల పాలకులకూ సాధకుడు ఈ విధంగా ముద్రలను చూపించాలి._


_*భగవంతుడైన వాసుదేవుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు క్రమంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ దేవస్థానములకు అధికారులైన దేవతలు. కాబట్టి సాధకుడు క్రమంగా 'ఓం అం వాసుదేవాయనమః, ఓం ఆం బలాయ నమః, ఓం అం ప్రద్యుమ్నాయ నమః, ఓం అః అనిరుద్ధాయ నమః అనే మంత్రాలతో పూజించాలి.*_


_ఓంకారం, తత్సత్, హుం, క్షౌం, భూః ఈ అయిదూ క్రమంగా, నారాయణ, బ్రహ్మ విష్ణు, * నరసింహ మహావరాహ భగవానుల బీజమంత్రాలు._


_*కాబట్టి సాధకుడు ఓం నారాయణాయ నమః మంత్రంతో భగవంతుడైన నారాయణునీ ఓం తత్సత్ బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవునీ, ఓం హుం విష్ణవే నమః అనే మంత్రంతో విష్ణుదేవునీ, ఓం క్షౌం నరసింహాయ నమః అనే మంత్రంతో నరసింహునీ, ఓం భూః మహా వరాహాయ నమః అనే మంత్రంతో ఆదివరాహాన్నీ పూజించాలి.*_


_( * 'నరసింహ' అనే శబ్దం సరికాదనీ 'నృసింహ' అనియే ఉండాలనీ కొందరు పండితులంటారు. బీజమంత్రాలు అనే మాట కన్న బీజాక్షరాలు అనే మాట తెలుగు ప్రాంతంలో ఎక్కువగా వాడబడుతోంది.)_


_*పైన చెప్పబడిన తొమ్మండుగురు దేవతలూ (వాసుదేవ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, బ్రహ్మ, విష్ణు, నరసింహ, మహావరాహ) నవవ్యూహాధినాథులు. వీరి యొక్క వర్ణాలు క్రమంగా తెలుపు, ఎరుపు, హరిద్ర పీతం, నీలం, నలుపు, ఎరుపు, మబ్బు వంటి నలుపు, అగ్ని వంటి పసుపు, తేనెరంగు (రెండవ ఎరుపు గులాబీ రంగు) ఈ దేవతలంతా ఈయీ రంగుల తేజస్సును వెలార్చుతూ వెలిగిపోతుంటారని అర్ధము.*_


_ఓంకారం ప్రతి మంత్రానికీ ముందు వాడుతూ విష్ణువు అంగాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ క్రింది దేవతలకి ఈయీ బీజ మంత్రాలను (బీజాక్షరాలను) వాడాలి.*_ 


ఓం కం టం పం శం - గరుడుడు


జఖం వం - సుదర్శనం


షం చం ఫం షం - గద


వం లం మం క్షం - శంఖ


ఘం ఢం భం హం - లక్ష్మి


గం జం వం శం - పుష్టి


ఘం వం - వనమాల


దం సం - శ్రీవత్సం


ఛం డం పం యం - కౌస్తుభం


_*గరుడుడు కమలం వలె ఎఱ్ఱనివాడు. గద నల్లనిది. పుష్టి శిరీష పుష్ప వర్ణంలో, లక్ష్మి బంగారం వలె పచ్చని కాంతులతో వుంటారు. శంఖానిది పూర్ణచంద్రుని వర్ణకాంతి. కౌస్తుభమణి అప్పుడే వికసించిన సూర్యుని అరుణ వర్ణంలో వుంటుంది. సుదర్శనునిది సహస్ర సూర్యకాంతి. శ్రీ వత్సం కుందపుష్పసమాన వర్ణితం, అనగా శ్వేతం. వనమాల పంచవర్ణశోభితం. అనంత భగవానుడు నీలమేఘశ్యాముడు. అస్త్రాలది విద్యుత్కాంతి 'పుండరీకాక్ష' విద్య సహాయంతో పద్ధతిని తెలుసుకొని విష్ణువు యొక్క ఈ సమస్తాంగాలకీ అర్ఘ్య పాద్యాదులను సమర్పించాలి.*_

_(11వ అధ్యాయం సమాప్తం)_

: *గరుడ పురాణం_*14వ భాగం*



_*పూజానుక్రమ - నిరూపణం:*_


_రుద్రదేవా! ఏ పూజకైనా ఒక క్రమ విధానముంటుంది. దానిని వివరిస్తాను వినండి. సాధకుడు ముందుగా ఓం నమః మంత్రంతో పరమాత్మను స్మరించాలి. తరువాత యం రం వం లమ్ అనే బీజాక్షరాల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకొని భగవానుడు చతుర్భుజుడునైన విష్ణువుని తనలోనే ఊహించుకోవాలి._


_*తరువాత కరన్యాస, దేహన్యాసాలను చేసుకొని ఈ క్రింది మంత్రాల ద్వారా హృదయంలోనే యోగపీఠాన్ని పూజించాలి.*_


_ముందుగా నొక కమలాన్ని స్థాపించి అందులోని భాగాలలో దేవతలనూహించుకొని ఈ మంత్రాలను పఠించాలి._


ఓం అనంతాయ నమః ।

ఓం ధర్మాయ నమః |

ఓం జ్ఞానాయ నమః |

ఓం వైరాగ్యాయ నమః ।

ఓం ఐశ్వర్యాయ నమః ।

ఓం అధర్మాయ నమః ।

ఓం అజ్ఞానాయ నమః ।

ఓం అవైరాగ్యాయ నమః ।

ఓం అనైశ్వర్యాయ నమః ।

ఓం పద్మాయ నమః |

ఓం ఆదిత్య మండలాయ నమః ।

ఓం చంద్ర మండలాయ నమః ।

ఓం వహ్ని మండలాయ నమః ।

ఓం విమలాయై నమః /

ఓం ఉత్కర్షిణ్యై నమః |

ఓం జ్ఞానాయై నమః |

ఓం క్రియాయై నమః ।

ఓం యోగాయై నమః ।

ఓం ప్రహ్ వ్యై నమః |

ఓం సత్యాయై నమః |

ఓం ఈశానాయై నమః ।

ఓం సర్వతోముఖ్యై నమః ।

ఓం సాంగోపాంగాయ హరేరాసనాయ నమః ।


_తరువాత సాధకుడు కర్ణిక మధ్యలో అం వాసుదేవాయ నమః అంటూ వాసు దేవునికి నమస్కరించి ఈ క్రింది మంత్రాలతో హృదయాది న్యాసం చేయాలి._


ఆం: హృదయాయ నమః ।

ఈం శిరసే నమః ।

ఊఁ శిఖాయై నమః |

ఐం కవచాయ నమః /

ఔం నేత్రత్రయాయ నమః ।

అః ఫట్ అస్త్రాయ నమః ।


_*తరువాత ఈ క్రింది మంత్రాలతో సంకర్షణాది వ్యూహదేవులకు నమస్కారం చేయాలి.*_


ఆం సంకర్షణాయ నమః ।

అం ప్రద్యుమ్నాయ నమః |

అః అనిరుద్ధాయనమః ।

ఓం అః నారాయణాయ నమః |

ఓం తత్సద్ బ్రహ్మణే నమః

ఓం హుం విష్ణవే నమః ।

క్లౌం నరసింహాయ నమః ।

భూర్వరాహాయ నమః ।


_*పిమ్మట స్వామి వారి పరివారాన్నీ ఆయుధాలనూ ఇలా కొలుచుకోవాలి.*_


కం టం జం శం వైనతేయాయ నమః |

జం ఖం వం సుదర్శనాయ నమః ।

ఖం చం ఫం షం గదాయై నమః ।

వం లం మం క్షం పాంచజన్యాయ నమః |

ఘం ఢం భం హం శ్రియై నమః ।

గం డం వం శం పుష్యై నమః ।

ధం వం వనమాలాయై నమః ।

దం శం శ్రీ వత్సాయ నమః ।

ఛం డం యం కౌస్తుభాయ నమః ।

శం శారంగాయ నమః ।

ఇం ఇషుధిభ్యాం నమః ।

చం చర్మణే నమః |

ఖం ఖడ్గాయ నమః |


_*అనంతరం ఈ క్రింది బీజాక్షర సహిత మంత్రాలతో ఇంద్రాది దిక్పాలకులకు నమస్కారం చేయాలి. ప్రతి మంత్రానికీ ముందు 'ఓం' కారాన్ని ఉచ్చరించాలి.*_


లం ఇంద్రాయ సురాధిపతయే నమః ।


రం అగ్నయే తేజో ధిపతయే నమః |


యమాయ ధర్మాధిపతయే నమః |

క్షం నైరృతాయ రక్షో ధిపతయే నమః ।

వం వరుణాయ జలాధిపతయే నమః ।

యోం వాయవే ప్రాణాధిపతయే నమః ।

ధాం ధనదాయ ధనాధిపతయే నమః । 

హాం ఈశానాయ విద్యాధిపతయే నమః |


_*తరువాత దిక్పాలుర క్రమంలోనే వారి ఆయుధాలను కూడా ఈ క్రింది పద్ధతిలో జపించాలి.*_


ఓం వజ్రాయనమః | ఓం శక్ష్యై నమః |


ఓం దండాయ నమః | ఓం ఖడ్గాయ నమః |


ఓం పాశాయ నమః | ఓం ధ్వజాయ నమః । 


ఓం గదాయై నమః । ఓం త్రిశూలాయ నమః ।


పిమ్మట అనంతునికీ, బ్రహ్మ దేవునికీ ఈ మంత్రాలతో ప్రణామం చేయాలి.


ఓం లం అనంతాయ పాతాలాధిపతయే నమః ।


ఓం ఖం బ్రహ్మణే సర్వలోకాధిపతయే నమః ।


_*అనంతరం సాధకుడు వాసుదేవ భగవానునికి నమస్కరించడానికి ద్వాదశాక్షర మంత్రాన్ని ప్రయోగించాలి. దానితో బాటే పన్నెండక్షరాల బీజయుక్త శబ్దాలనూ, దశాక్షర మంత్రంలోని పదక్షరాల బీజయుక్త శబ్దాలనూ జపించాలి. ఇలా :*_


ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ।


ఓం ఓం నమః | ఓం నం నమః । ఓం మోం నమః | ఓం ఓం భం నమః | ఓం గం నమః ఓం వం నమః । ఓం తేం నమః | ఓం వం నమః ఓం సుం సమః । ఓం దేం నమః | ఓం వాం ఓం ఓం నమః ఓం నం నమః | ఓం యం నమః । నమః । ఓం మోం నమః । ఓం నాం నమః ఓం రాం నమః ఓం యం నమః । ఓం ణాం నమః | ఓం యం నమః ।


ద్వాదశాక్షర మంత్రం - ఓం నమోభగవతే వాసుదేవాయ


దశాక్షర మంత్రం – ఓం నమో నారాయణాయ నమః


అష్టాక్షర మంత్రం - ఓం పురుషోత్తమాయ నమః |


_*ఈ మూడు మంత్రాలనూ వీలైనంతగా జపించి ఈ క్రింది మంత్రంతో పుండరీకాక్ష భగవానునికి నమస్కారం చేయాలి.*_


నమస్తే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన |


సుబ్రహ్మణ్య నమస్తేస్తు మహాపురుష పూర్వజ ॥


_ఈ విధంగా విష్ణుదేవుని స్తుతించి అప్పుడు హవనం చేయాలి. తరువాత మహా పురుష విద్యానామక మంత్రాన్ని పద్ధతి ప్రకారం నూటయెనిమిది మార్లు జపించాలి. తదనంతరం "జితంతేనతో" మొదలగు మహాపురుష విద్యాస్తోత్రాన్ని జప, అర్ఘ్యముల తరువాత పఠించి నారాయణునికి పలుమార్లు ప్రణామం చేయాలి._


_*తరువాత అగ్నిదేవుని స్థాపించి పూజించి హవనం చేయాలి. విష్ణు దేవునికీ, అచ్యుతాది ఆంగిక దేవతలకీ బీజాక్షర యుక్త మంత్రాలతో ఆహుతులివ్వాలి. మనస్సులోనే సాంగోపాంగంగా బ్రహ్మదేవునీ ఇతర దేవతలనూ పూజించుకొని వారందరినీ మండలంలో స్థాపించాలి. అప్పుడు వాసుదేవ మంత్రంతో నూట యెనిమిది ఆహుతులివ్వాలి. తరువాత సంకర్షణాది ఆరుగురు అంగదేవతలకు మూడేసి ఆహుతులనూ, దిక్పాలకుల కొక్కొక్క ఆహుతినీ ప్రదానం చేయాలి. హవనం పూర్తయినాక ఏకాగ్ర చిత్తంతో పూర్ణాహుతి నివ్వాలి.*_


_తరువాత మన మనోవాక్కాయ కర్మలకు అతీతుడైన పరమాత్మతో సాధకుడు ఆత్మను లీనం చేస్తున్నట్లుగా భావించుకొని దేవతలందరికీ ఈ మంత్రం ద్వారా వీడ్కోలు చెప్పాలి._


గచ్ఛ గచ్ఛ పరంస్థానం యత్రదేవో నిరంజనః | గచ్ఛంతు దేవతాః సర్వాః స్వస్థానస్థితహేతవే ॥


_*దేవతలారా! సుదర్శన, శ్రీహరి, అచ్యుత, త్రివిక్రమ, చతుర్భుజ, వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, పురుష - ఈ దేవ సమూహాన్నే నవవ్యూహమంటారు. పరమాత్మను కలుపుకుంటే దశాత్మకమవుతుంది. అలాకాకుండా అనిరుద్ధునీ, అనంతునీ కలుపుకుంటే ఇదే ఏకాదశ వ్యూహమవుతుంది. నవవ్యూహానికి పరమతత్త్వాన్నీ, అనిరుద్ధునీ, అనంతునీ కలుపుకుంటే అది ద్వాదశాత్మక వ్యూహంగా చెప్పబడుతుంది.*_


_చక్రాంకిత మంత్రాలను చదివి వాటిని అనగా చక్రరూపాలను ఈ విధంగా బీజాక్షరాలతో పూజించాలి._


ఓం చక్రాయ స్వాహా | ఓం విచక్రాయ స్వాహా | ఓం సుచక్రాయ స్వాహా । ఓం మహాచక్రాయ స్వాహా | ఓం అసురాంత కృత్ హుం ఫట్ | ఓం హుం సహస్రార హుం ఫట్ /


_*గృహాన్ని సంరక్షించే పై మంత్రాలతో చేసే పూజకు 'ద్వారకా చక్రపూజ' అని పేరు. ఇది సర్వమంగళదాయిని"*_

_(12వ అధ్యాయం సమాప్తం)_

గరుడ పురాణం_*12 -14

 *గరుడ పురాణం_*12వ భాగం*


_*నవవ్యూహార్చన విధి పూజానుక్రమ నిరూపణం:*_


_“పరంధామా! నవ వ్యూహార్చన విధిని గూర్చి తెలుసుకొనగోరుతున్నాము” అని ప్రార్థించాడు ఇంద్రుడు. చెప్పసాగాడు ఇందిరానాథుడు._


_*“మహా పురుషులారా! ఒకప్పుడు మా గరుత్మంతుడిదే విషయాన్ని గూర్చి కశ్యపునికి చెప్పాడు. అదే మీకు నేను వర్ణిస్తాను.*_


_సాధకుడు ముందుగా యోగక్రియ ద్వారా మస్తక, నాభి, హృదయతత్త్వములను ఆకాశనామకతత్వంలో ప్రవేశింపజేయాలి. తరువాత 'రం' అనే అగ్ని బీజ మంత్రంతో పాంచభౌతిక శరీరాన్ని శోధించుకోవాలి. తరువాత 'యం' అనే వాయు బీజమంత్రంతో సంపూర్ణ శరీరాన్ని లయింపజేస్తున్న భావన చేయాలి. తరువాత 'లం' అనే బీజమంత్రంతో ఈ శరీరాన్ని చరాచర జగత్తుతో సంప్లావితం చేస్తున్నట్లు భావించుకోవాలి. అటుపిమ్మట 'వం' అనే బీజమంత్రంతో తనలోనే అమరత్వాన్ని భావించుకోవాలి. అమృతాన్ని ధ్యానిస్తూ 'పీతాంబరధారియు చతుర్భుజుడునునగు శ్రీహరిని నేనే' అని భావించుకుంటూ ఆత్మతత్త్వ ధ్యానంలో నిమగ్నం కావాలి._


_*తరువాత శరీరంలో, చేతుల్లో మూడు ప్రకారాల మంత్రన్యాసం చేయాలి. ముందు పన్నెండక్షరాల బీజమంత్రంతో, తరువాత మరో మంత్రంతో, న్యాసం, షడంగన్యాసం చేస్తే సాధకుడు తానే సాక్షాత్ నారాయణ స్వరూపుడైపోతాడు. దక్షిణాంగుష్ఠంతో ప్రారంభించి మధ్య వేలి దాకా న్యాసం చేసి మరల ఆ మధ్య వేలిపైనే రెండు బీజమంత్రాలతో న్యాసం చేసి మరల శరీర విభిన్నాంగాలపై న్యాసం చేయాలి. క్రమంగా గుండె తల, పిలక, టెంకి, మోము, కనులు, కడుపు, వీపు, అంగన్యాసం చేస్తూ రెండు భుజాలు, చేతులు, మోకాళ్ళు, కాళ్ళలోన కూడా న్యాసం చేయాలి. (చేతుల తరువాత మోకాళ్ళు)*_


_తరువాత రెండు చేతులనూ కమలాకారంలో పెట్టుకొని దాని మధ్య భాగంలో బొటన వ్రేళ్ళను కలిపి నిలపాలి. ఈ ముద్రలోనే కొంతసేపుండి పరమతత్త్వ స్వరూపుడు, అనామయుడు, సర్వేశ్వరుడు, భగవానుడునగు నారాయణ చింతనం గావించాలి._


_*తరువాత ఇవే బీజమంత్రాలతో క్రమంగా చూపుడు వేలితో మొదలెట్టి అన్ని వేళ్ళతో న్యాసం చేసి యథాక్రమంగా తల, కనులు, మోము, గొంతు, గుండె, బొడ్డు. వెనుక భాగము, రెండు మోకాళ్ళు, కాళ్ళలో కూడా న్యాసం చేయాలి.*_


_బీజమంత్రాలతో సంపూర్ణ శరీరంలో న్యాసం చేయాలి. బొటనవ్రేలి నుండి చిటికెన వేలి దాకా అయిదు బీజమంత్రాలతో న్యాసం చేయాలి. ఏ అంగానికి సంబంధించిన బీజ మంత్రాన్ని ఆ అంగన్యాసం చేస్తున్నపుడు మననం చేయాలి._


_తరువాత సాధకుడు అవే బీజ మంత్రాలతో దిక్కులను ప్రతిబద్ధం చేసుకొని పూజన క్రియ నారంభించాలి. ముందుగా ఏకాగ్ర చిత్తంలో తన హృదయంలో యోగ పీఠాన్ని ధ్యానించాలి. వివిధ దిశలలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను కల్పించుకొని పూజించి పూర్వాది దిశలలో అధర్మాదులను న్యాసం చేయాలి ఇలా :_


అగ్ని కోణంలో - ఓం ధర్మాయ నమః


నైరృత్య కోణంలో - ఓం జ్ఞానాయ నమః


వాయు కోణంలో - ఓం వైరాగ్యాయ నమః


ఈశాన కోణంలో - ఓం ఐశ్వర్యాయ నమః


తూర్పు దిక్కులో - ఓం అధర్మాయ నమః


దక్షిణ దిక్కులో - ఓం అజ్ఞానాయ నమః


పడమటి దిక్కులో - ఓం అవైరాగ్యాయ నమః


ఉత్తర దిక్కులో - ఓం అనైశ్వర్యాయ నమః

_*అని అంటూ న్యాసం చేయాలి.*_


_సాధకుడీ విధంగా న్యాసవిధులతో ఆచ్చాదింపబడిన తన శరీరాన్ని ఆరాధన పీఠంగానూ తనను తాను దాని స్వరూపంగానూ భావించుకొని తూర్పు వైపు తిరిగి తలను బాగా ఎత్తి స్థిరుడై అనంత భగవానుడైన విష్ణువును తనలో ప్రతిష్ఠితుని చేసుకోవాలి. తరువాత జ్ఞానరూప సరోవరంలో వికసించిన అష్టదళ కమలాన్ని ధ్యానించాలి._


_*తరువాత ఋగ్వేదాదులలోని మంత్రాలతో సూర్య, చంద్ర, అగ్న్యాదులను ధ్యానించు కోవాలి. తరువాత అష్టదళ కమలంపై ఎనిమిది దెసలలో భగవంతుడైన కేశవుని వద్దనే అవస్థితములై వుండు విమలాది శక్తులను విన్యస్తం చేసి తొమ్మిదవ శక్తిని కర్ణికపై స్థాపించాలి.*_


_వాటిని ధ్యానించిన పిమ్మట యోగపీఠానికి విధ్యుక్తంగా పూజ చేయాలి. తరువాత మరల మనస్సు ద్వారా విష్ణుభగవానుని అంగసహితంగా ఆవాహనం చేసి ఆ యోగపీఠంపై ప్రతిష్ఠించాలి. అపుడు తూర్పు మొదలుగా నాలుగు దిక్కులలో నున్న కమలదళాలపై హృదయాది న్యాసాన్ని చేయాలి. కమలము యొక్క మధ్య భాగంలోనూ కోణాల పైననూ ఈ క్రింది విధంగా అస్త్రమంత్ర న్యాసాన్ని గావించాలి._


తూర్పువైపు దళంలో - హృదయాయ నమః


దక్షిణం వైపు దళంలో - శిరసే స్వాహా


పశ్చిమం వైపు దళంలో - శిఖాయై వషట్


ఉత్తరం వైపు దళంలో - కవచాయ హుం


మధ్యంలో - నేత్రత్రయాయవైషట్


కోణంలో - అస్త్రాయఫట్

_*అంటూ న్యాసం చేయాలి.*_


_తరువాత పూర్వాది దిశల్లో యథాక్రమంగా సంకర్షణాదులను స్థాపించాలి. తరువాత తూర్పు, పడమటి ద్వారాలలో ఓం వైనతేయాయ నమః అంటూ గరుత్మంతుని స్థాపించాలి. దక్షిణ ద్వారంలో 'ఓం సుదర్శనాయ నమః, ఓం సహస్రారాయనమః' అని ఉచ్ఛరిస్తూ వేయి అర్రలున్న సుదర్శన చక్రమును స్థాపించాలి. దక్షిణ ద్వారంలోనే ఓం శ్రియైనమః మంత్రంతో శ్రీ అనే అక్షరాన్ని న్యాసం చేసి ఉత్తర ద్వారంలో ఓం లక్ష్మ్యై నమః అనే మంత్రంతో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలి. తరువాత ఉత్తర దిశలో ఓం గదాయై నమః అంటూ గదనీ, కోణాలలో ఓం శంఖాయై నమః అంటూ శంఖాన్నీ న్యాసం చేయాలి._


_*పిమ్మట విష్ణుదేవునికి రెండు వైపులా ఆయుధాలనుంచాలి. దక్షిణం వైపు ధనుస్సు (శారంగము) నీ ఎడమ వైపు బాణములను అలాగే కుడి యెడమలలో కత్తినీ కవచాన్నీ వుంచాలి.*_

గరుడ పురాణం_*11వ

 *గరుడ పురాణం_*11వ భాగం*


_సదాశివాదులారా! విష్ణుభగవానుని విశేషపూజకై అయిదు ప్రకారాల రంగులు కలిపిన చూర్ణంతో వజ్రనాభమండలాన్ని నిర్మించాలి. దీనికి సమాన పరిమాణంలో పదహారు కోష్ఠకాలతో నిర్మించాలి._


_*వజ్రనాభ మండలం తయారు కాగానే న్యాసం చేసుకొని శ్రీహరిని పూజించాలి. హృదయ మధ్యంలో విష్ణుభగవానుని, కంఠంలో సంకర్షణుని, శిరంపై ప్రద్యుమ్నుని, శిఖాభాగంలో అనిరుద్ధుని, సంపూర్ణ శరీరంలో బ్రహ్మనీ, రెండు చేతులలో శ్రీధరునీ భావించుకొని న్యాసం చేసుకోవాలి. తరువాత*_ _అహం విష్ణుః_  _*అని ధ్యానం చేస్తూ పద్మంలో (మండలంలో నిర్మింపబడిన పద్మంలో) కర్ణిక భాగంలో శ్రీహరిని స్థాపించాలి. మండలానికి తూర్పులో సంకర్షణునీ, దక్షిణంలో ప్రద్యుమ్నునీ, పశ్చిమంలో అనిరుద్ధునీ, ఉత్తరంలో బ్రహ్మదేవునీ స్థాపించాలి. ఈశాన్యంలో ముందు శ్రీహరిని స్థాపించి ఆ తరువాత దిక్పాలకులను వారి వారి మంత్రాలతో ఈ దిగువ నిచ్చిన దిక్కులలో నిలపాలి.*_


ఓం ఇంద్రాయ నమః - ఇంద్రుని - తూర్పులో 


ఓం అగ్నయే నమః - అగ్నిని - ఆగ్నేయంలో  


ఓం యమాయనమః - యముని - దక్షిణంలో - 


ఓం నిరృతయే నమః - నిరృతిని - నైఋతిలో


ఓం వరుణాయ నమః -  వరుణుని - పశ్చిమంలో


ఓం వాయవే నమః - వాయువుని - వాయవ్యంలో


ఓం కుబేరాయ నమః - కుబేరుని - ఉత్తరంలో


ఓం ఈశానాయ నమః - ఈశ్వరుని - ఈశాన్యంలో


_*స్థాపించిన తరువాత అందరు దేవతలనూ గంధాది ఉపచారాల ద్వారా పూజించాలి. దీని వలన సాధకునికి దేహాంతంలో పరమపదం ప్రాప్తిస్తుంది.*_


_దేవగణములారా! దీక్షితుడైన శిష్యుడు వస్త్రంతో తన రెండు కన్నులనూ మూసుకొని దేవతల మూల మంత్రాలను పఠిస్తూ నూట యెనిమిది ఆహుతులను అగ్నిలోనివ్వాలి. పుత్ర లాభమును కోరుకొనే వారు దానికి ద్విగుణంగా అంటే రెండు వందల పదహారు ఆహుతులను అగ్నికి సమర్పించాలి. సాధనాసిద్ధికైతే మూడు రెట్లు (మూడు వందల ఇరవై నాలుగు) మోక్షప్రాప్తి కోసం చేసే దేశికునికైతే నాలుగు రెట్లు అనగా నాలుగు వందల ముప్పది రెండు ఆహుతులు అవసరం. (దేశికుడనగా ఉపదేశమిచ్చే ఆచార్యుడు)_


_*విద్వాంసుడైన దేశికుడు అన్నిటికన్న ముందు భగవంతుని ధ్యానించాలి. తరువాత వాయవ్యం వైపు తిరిగి 'యం' అనే బీజమంత్రాన్ని చదువుతూ శిష్యుల క్షేమాన్ని ఆలోచించాలి. ఆగ్నేయం వైపు తిరిగి 'రం' అనే బీజమంత్రం ద్వారా తమ మనస్తాపాలను తొలగించే విధానాన్ని ఆలోచించాలి. వారుణీ దిశగా తిరిగి 'వం' అనే బీజ మంత్రం ద్వారా హృదయస్థితినీ ధర్మాభిరుచినీ విచారించుకోవాలి. తరువాత దేశికుడు అభేద చింతనాన్ని చేయాలి. అభేద జ్ఞానమనగా ఆత్మతేజాన్ని పరమాత్మ తేజంతో ఏకం చేసే సాధనను చేయగలిగే తెలివి. అపుడు ఓంకారాన్ని జపిస్తూ వాయు, అగ్ని, జల, పృథ్వీ తత్త్వాలను ధ్యానం చేయాలి. అలా చేయగా చేయగా సాధకునికి వాటిపై విజయం ప్రాప్తిస్తుంది. తరువాత శరీరమంతా జ్ఞానంతో నిండిపోయి క్షేత్రజ్ఞుడవుతాడు.*_


_మండలాదికములను నిర్మించుకోవడం సాధ్యం కానపుడు సాధకుడు తన మానస మండలాన్ని తానే2 కల్పించుకొని ఆ శ్రీహరిని పూజించుకోవచ్చును. శరీరంలోనే బ్రహ్మాది తీర్థాలుంటాయని శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి మానసమండలానికి కూడ నాలుగు ద్వారాలుంటాయి. చేతిని పద్మంగానూ వ్రేళ్ళను పద్మపత్రాలుగానూ, హస్తమధ్యాన్ని కర్ణిక గానూ, గోళ్లను కేసరాలుగానూ భావించుకొనే సాధకుడు తన హస్తరూపియైన కమలంలోనే సూర్య, చంద్ర, ఇంద్ర, అగ్ని, యమాది పరివేష్టితుడైన శ్రీహరిని కల్పించుకొని పూజించుకోవచ్చును._


_*ఇక పూజానంతరము గురువు లేదా దేశికుడు తన చేతిని శిష్యుని తలపై పెట్టాలి. ఈ చేతిలోనే విష్ణువుంటాడు కాబట్టి ఆ హస్త స్పర్శ మాత్రాననే శిష్యుని పాపాలూ, అజ్ఞానమూ కూడా పటాపంచలై పోతాయి. అపుడు గురువు శిష్యుని పూజించి నూతన నామకరణం చేసి తనతో బాటు శిష్యుని కూడా ఆధ్యాత్మిక సాధనల దారిలో గొనిపోవాలి.*_


_శక్తిస్వరూపులైన ఓ శివాదిదేవతలారా! ఇక శ్రీలక్ష్మీ సిద్ధిప్రాప్తి విధివిధానాలు చూద్దాం. దీనిని స్థండిలాదులపై చేస్తారు. ఏదైనా పుణ్యకార్యానికై ప్రత్యేకంగా నేలకి కాస్త ఎత్తులో నిర్మింపబడి చదును చేయబడి పవిత్రీకరింపడిన ప్రత్యేక ప్రదేశాన్ని స్థండిలమంటారు._


_*ముందుగా ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మై నమః అని జపించి శ్రాం శ్రీం శ్రూం శైం శ్రాం శ్రః అనే బీజాక్షరాలను మంత్రానికి జోడిస్తూ క్రమంగా హృదయ, శిర, శిఖ, కవచ, నేత్ర, అస్త్రాలలో ఈ ప్రకారంగా షడంగన్యాసం చేసుకోవాలి.*_


ఓం శ్రాం హృదయాయ నమః ।

ఓం శ్రీం శిరసే స్వాహా ।

ఓం శ్రూం శిఖాయై వషట్

ఓం త్రైం కవచాయ హుం |

ఓం క్రౌం నేత్రత్రయాయ వౌషట్ ।

ఓం శ్రః *అస్త్రాయ ఫట్ |


_*సాధనారతుడైన భక్తుడు అంగన్యాసం తరువాత శ్రీమహాలక్ష్మిని పూజించాలి.*_


_( * సమస్త శరీరాన్నీ రక్షిస్తూ, ప్రతి భక్తుని చుట్టూ ఒక ఆవరక శక్తి వుంటుంది. దాన్ని 'అస్త్ర' అంటారు. న్యాసం చేసినపుడు ఈ శక్తిని రెండు చేతులలో కల్పన చేసుకోవాలి.)_


_*తరువాత ఒక మండలాన్ని నిర్మించి నాలుగు రంగులు అద్ది గర్భస్థానంలో పద్మాన్ని నిర్మించాలి. దానికి అరవై నాలుగు రేకులను కల్పించాలి. మధ్యలో లక్ష్మిని చిత్రించి ఒక వైపు దుర్గ నుంచి మిగతా అందరు దేవతలనూ విష్ణుపూజలో వలెనే స్థాపించాలి. హవనమూ చేయాలి. తరువాత ఓం ఘం టం డం హం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మహామంత్రంతో లక్ష్మీదేవిని పూజించాలి.*_


_అటు పిమ్మట సాధకుడు - 'ఓం సౌం సరస్వత్యై నమః |' ఓం హ్రీం సౌం సరస్వత్యై నమః | 'ఓం హ్రీం వద వద వాగ్వాదిని స్వాహా|' ఓం హ్రీం సరస్వత్యై నమః l' అను మంత్రాలనుచ్చరించి సరస్వతీ దేవికి నమస్కరించాలి. (అధ్యాయాలు 6-10)

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝  *గాశ్చ సంకీర్తయేన్నిత్యం నావమన్యేత తాస్తథా*

        *అనిష్టం స్వప్నమాలక్ష్య గాం నరః సంప్రకీర్తయేత్*


                        *గోవైశిష్ట్యం - మహాభారతం*

 

*తాత్పర్యము : ప్రతిదినము గోవులను కీర్తించుము. వాటిని అవమానించ వద్దు. పీడకలలు వచ్చినట్లైతే గో నామమును కీర్తించాలి*. 


 ✍️💐🌹🪷🙏

దయాసముద్ర తరంగాలు*

 🌸 *దయాసముద్ర తరంగాలు*

( మూడవ భాగము)

(శృంగేరి శారదా పీఠం 36వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి జీవిత విశేషాలు)


3. భక్తుడొకాయన శ్రీచరణుల వద్దకు వచ్చి తనకు శీఘ్రంగా కోపం వస్తుందని, అలా కోపం వచ్చినపుడు తనను తాను మరచి పోతానని చెప్పి, ఆ సమస్య పరిష్కారానికై మార్గాన్ని సూచించ మని ప్రార్థించాడు.


శ్రీజగద్గురువులు : కోపం ఎవరికి వస్తే వారిని అది నాశనం చేస్తుంది. అందువలన జాగ్రత్తగా దాని నుండి తప్పించుకోవాలి. ఇక మీదట ఎప్పుడైనా కోపం వచ్చేటట్లు అనిపిస్తే బిగ్గరగా నవ్వండి.


భక్తుడు : తమరు చెప్పినట్లే చేస్తాను. అయితే ఆ సలహాను పాటించటంలో భక్తుడు విఫలమయ్యాడు. ఆయన సమస్య అలాగే ఉంది. కొన్ని నెలల తరువాత శృంగేరికి మళ్లీ వచ్చినప్పుడు మరోసారి శ్రీచరణులను తన సమస్యకు పరిష్కారాన్ని సూచించమని వేడుకున్నాడు. తాను మొదట సూచించిన సలహాను భక్తుడు చిత్తశుద్ధితో పాటించటం లేదని శ్రీజగద్గురువులు గ్రహించారు. మళ్లీ అదే అభ్యర్థనను భక్తుని నుండి విన్నా శ్రీచరణులకు కోపం కాని, విసుగుకాని రాలేదు. భక్తుని మాటలతో కోపగించుకోలేదు. పూర్వమిచ్చిన సలహాను మళ్లీ చెప్పలేదు. భక్తుని మనస్సులో అది అలాగే ఉంది కదా. మరో సలహాయిచ్చినట్లయితే పాటించటానికి ఎక్కువ అవకాశం ఉంది. శ్రీచరణులు అలా మరోసలహాయిచ్చారు.


శ్రీజగద్గురువులు : మీకు కోపం వచ్చేటట్లు ఉంటే నన్ను తలచుకోండి.


భక్తుడు : క్రిందటిసారి తమను యిదే విషయమడిగినప్పుడు, శ్రీవారు బిగ్గరగా నవ్వమని సలహాయిచ్చారు.


భక్తుని మాటలను అధికప్రసంగంగా చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీచరణులకు అత్యద్భు తమైన జ్ఞాపకశక్తి ఉన్నదనే విషయం అతనికి తెలుసు. శ్రీవారి నుంచి పాతసలహానే పొందా లనెడి ఉద్దేశంతో ఆయన మళ్లీ ఆ విషయాన్ని ప్రస్తావించినట్లయితే అది శ్రీవారి విలువైన సమయాన్ని వృధాచేయటమే. అయితే శ్రీ జగద్గురువులు ఆయన ప్రస్తావనను తప్పుగా అర్థం చేసుకోలేదు.


శ్రీజగద్గురువులు : (చిరునవ్వుతో) అవునవును. మాకు గుర్తుంది.


భక్తుడు : శ్రీజగద్గురువులు యిప్పుడు నాకు మరో విధమైన సలహా యిస్తున్నారు. రెండింటిలో నేను దేనిని పాటించాలి?


పూర్వం చెప్పిన సలహానే పాటించమని తిరిగి చెప్పటం, లేదా క్రొత్తగా మరో సలహాచెప్పటం అనే రెండు మార్గాలలో ఏదో ఒకటి శ్రీచరణులు చెప్పాలి. శ్రీచరణులు క్రొత్తగా మరో సలహానే యిచ్చారు. అయితే శ్రీచరణుల రెండు సలహాలలోను అంతరం ఉన్నదనీ, రెండింటి మధ్య అనుకూలత ఉన్నదనీ భక్తుడు అనుకోకుండ చెప్పినట్లయింది. ఈ సందర్భంలో శ్రీచరణులు ఏదో ఒకదానిని పాటించమని చెప్తే, భక్తుని మనస్సులో రెండవది తక్కువ స్థాయిది అనే అభిప్రాయమేర్పడుతుంది. అంతేకాదు. భక్తుడు రెండవది ఎందువలన తనకు మొదట సూచించారనే ప్రశ్నను కూడ వేయవచ్చు.


భక్తుని మనస్సును పూర్తిగా అర్థం చేసుకుని అతనికి ఎటువంటి సందేహాలు మున్ముందు రాకుండ శ్రీజగద్గురువులు యిలా చెప్పారు : "రెండు సూచనలను అనుసరించండి." అలా కోపాగ్నిలో దహించి పోకుండ, భక్తునికి శ్రీచరణులను స్మరించుకొమ్మని, నవ్వుతూ ఉండమని సలహా యివ్వబడింది.


మహాత్ముల వాక్యాలు నిరర్ధకం కావు. సహజంగా నవ్వినా, తెచ్చిపెట్టుకుని నవ్వినా, నవ్వు నవ్వే. అది మన మానసిక స్థితిని సంస్కరిస్తుంది. మన కోపానికి అడ్డుకట్ట వేస్తుంది. అందువలన శ్రీచరణుల మొదటి సలహాను భక్తుడు తప్పనిసరిగా పాటిస్తే అతని సమస్యకు పరిష్కారం లభించేది. అలాగే రెండవ సలహాను పాటించినా ఫలితముంటుంది. ప్రశాంతతకు ప్రతిరూపమా అన్నట్లు ఉండే పూజ్యపాదులు జగద్గురువులు అయిన శ్రీచరణుల రూపాన్ని మదిలో తలచుకున్నప్పుడు భక్తునికి కోపం ఎలా వస్తుంది? కోపంలో ఎలా ఉడికిపోతాడు. భక్తుని హృదయంలో శ్రీచరణుల ఆలోచన రాగానే ఆనందం కలుగుతుంది. ఆనందం నవ్వు కవలలు. అందువలన మొదటి సలహా రెండవ సలహాల మధ్య అనుకూలత ఎక్కువగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీచరణులను స్మరించుకోగానే, వారిచ్చిన సలహా నవ్వుతూ ఉండమన్నది గుర్తుకు వస్తుంది. కాబట్టి శ్రీచరణులిచ్చిన రెండు సలహాలు ఒకదానితో మరొక దానికి సంబంధ మున్నవే.


ఈ సంఘటన శ్రీచరణులకున్న ఓర్మిని, యితరుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తీరును, కరుణను, యితరులకు చక్కటి, విలువైన సలహాను యివ్వగలసామర్ధ్యాన్ని ప్రదర్శిస్తుంది. గురుస్మరణ, నవ్వటం అనే విషయాలు ఈ సంఘటనలో ఒక భక్తునికి సూచించ బడినా, వానిని యితరులు కూడ స్వీకరించి, పాటించి సత్ఫలితాలను పొందవచ్చు.


ఆంగ్లమూలం:

కె.సురేష్ చందర్ గారు


తెలుగు అనువాదం : 

తుమ్మలపల్లి హరిహరశర్మ గారు.


🌸 *శారదే పాహిమాం శంకర రక్షమాం* 🙏

should change names.*

 Ahmedabad: - Who is Ahmed?

Moradabad: - Who is Murad?

Aurangabad: - Who is Aurangzeb?

Faizabad: - Who is Faiz?

Farooqabad: - Who is Farooq?

Adilabad: - Who is Adil?

Sahibabad- Who is Sahib?

Hyderabad: - Who is Haider?

Secunderabad: - Who is Sikander?

Firozabad: - Who is Firoz?

Mustafabad: - Who is Mustafa?

Ahmednagar: - Who is Ahmed?

Tughlaqabad: - Who is Tughlaq?

Fathabad: - Who is Fateh?

Usmanabad: - Who is Usman?

Baktiyarpur: - Who is Baktiyar?

Mahmudabad: - Who is Mahmud?

Muzaffarpur and Muzaffar Nagar: - Who is Muzaffar?

Burhanpur: - Who is Burhan?

Who are all these? These are the people who destroyed our culture, destroyed our temples, corrupted our idols and converted Hindus to Islam. 

This is their contribution in the history of India. 

Despite this, *Why* do we remember them by naming cities after them?

 *These cities should change names.*

అమ్మవారిని దర్శించడానికి

 ఒకప్పుడు శ్రీకాళహస్తి రాజు మీదకు పొరుగు దేశపురాజు పెద్ద సైన్యంతో హఠాత్తుగా దండెత్తి వచ్చాడు. కాళహస్తి రాజు మొదట్లో కలవరపడినా తరువాత తమ కులదైవమైన "జ్ఞానప్రసూనాంబ"ను తలుచుకొని కొద్ది సైన్యంతోనే శత్రువులను ఎదిరించాడు.


శత్రురాజు ఈ యుద్ధంలో మొట్టమొదటి సారిగా తుపాకులను ఉపయోగించాడు. అందరూ కాళహస్తి రాజు ఓడిపోతున్నాడు అనుకున్నారు. తుపాకుల ముందు మామూలు ఆయుధాలు నిలుస్తాయా?


ఆశ్చర్యంగా కాళహస్తి రాజు విజయం పొందాడు. 


ఆ రోజు రాత్రి కాళహస్తి రాజు కలలో జ్ఞానప్రసూనాంబ కనబడి తనకు ఒక చీర పెట్టమని అడిగింది. 


రాజు ఆశ్చర్యపడుతూ -

'అమ్మా! నీకు చీరలు లేకపోవడం ఏమిటి?" అని అడిగాడు.


దేవీ తుళ్లిపడినా తన పమిటి చెంగును చూపుతూ, బిడ్డా! తుపాకీ గుళ్ల వల్ల ఇట్లా అయ్యింది...తుపాకీ గుళ్లు నీకు, నీ సైన్యానికి తగలకుండా నా చెంగు అడ్డం పెట్టాను... అని అన్నది. 


కాళహస్తి రాజు ఉలిక్కిపడి లేచాడు...

ఆనందభాష్పాలు చెక్కిళ్లపై రాలుతున్నాయి. తన విజయరహస్యంలోని రహస్యం అవగతం అయ్యింది. తన తల్లి జగజ్జనని జ్ఞానప్రసూనాంబ తుపాకీగుళ్ళను తనపై తీసుకొని విజయాన్ని అనుగ్రహించింది.

ఎంత కరుణ...!! అని పొంగిపోయాడు.


మర్నాడు రాజు జ్ఞానప్రసూనాంబను బంగారు చీరతో అలంకరింపజేశాడు.


(ఈ కథ శ్రీకాళహస్తి ఆలయంలో ఒక శాసనంలో భద్రపరిచి ఉంది)


* * *


ప్రతి శుక్రవారం జ్ఞానప్రసూనాంబకు బంగారు చీరను అలంకరింప చేస్తారు.


ఇక్కడి స్త్రీలు బంగారుచీరలో ఉన్న

అమ్మవారిని దర్శించడానికి ఉత్సాహపడతారు.


ఆ బంగారు చీరలో మరింత తేజోమంతమై విరాజిల్లుతుంటుంది అమ్మవారు.

అందువల్ల స్థానికులు శుక్రవారం తప్పక శివాలయం వెళ్లి జ్ఞానప్రసూనాంబను కనులారా దర్శించి తన్మయులవుతుంటారు.

చాటుకథలు / శ్లోకాలు 🙏

 🙏కాళిదాస మహాకవి చాటుకథలు / శ్లోకాలు 🙏 


కాలిదాసు గురించి ఎంత చెప్పుకొన్నా తనివి తీరదు. 

1. ఒక సారి కాలిదాసు, భోజరాజుల మధ్య ఏదో వైషమ్యం వలన ఆయన ఒక వేశ్య యింట రహస్యంగా ఉన్నాడు (కాలిదాసు వేశ్య యింటనా అనుకోనవసరం లేదు. ఆయన జీవించిన దేశకాల పరిస్థితులు వేరు). ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి భోజుడు "కుసుమే కుసుమోత్పత్తిః; శ్రూయతే నతు దృశ్యతే" అన్న పద్యాన్ని చక్కగా పూరించినవారికి వంద బంగారు కాసులు ఇవ్వబడుతుందని చాటింపు వేయించాడు. కాలిదాసుకు ఆశ్రయమిచ్చిన వేశ్య ఆ విషయం చెప్పి అదేదో పూరించి యిస్తే తాను వెళ్లి ఆ బహుమానం తెచ్చుకొంటానని అర్థించింది. ఆయన ఇలా పూరించాడు.


కుసుమే కుసుమోత్పత్తిః

శ్రూయతే నతు దృశ్యతే

బాలే తవ ముఖాంబోజే

దృశ్యమిందీవరద్వయం


(పువ్వులోనుండి ఇంకో పూవు పుట్టుతుందని వినడమేకాని ఎన్నడూ చూడలేదు. కానీ ఓ అమ్మాయీ! నీ ముఖమనే తామరపూవులో నాకు రెండు నల్లకలువలు కనిపిస్తున్నాయి).


ఇంకేముంది! ఈ శ్లోకం ఆమె పట్టుకువెళ్లి రాజు ముందు చదవడం, ఆయన ఇది కాలికాసుదేనని గుర్తించి ఆమె వెంట వెళ్లి ఆయనను బ్రతిమాలి మళ్లీ తన వద్దకు రప్పించుకోవడం జరిగాయి.


ఒకసారి కాలిదాసు ఆలయ మండపంలో విశ్రమిస్తుంటే అక్కడ యిద్దరు బాటసారులు మాట్లాడుకోవడం విన్నాడు. వారిరువురూ సోదరులు. పాండిత్యం సంపాదించినవారు. దూరదేశం నుండి వస్తున్నారు. భోజునికి కవిత్వమంటే ప్రీతి అని విని ఏదైనా కవిత వినిపించి కొంత సొమ్ము యాచించాలని వారి ఆలోచన. కానీ వారి పండితులే గానీ కవులు కారు. ఐనా సరే ఏదైనా ఒక్క శ్లోకమైనా తయారుచేసుకొని వెళ్లి రాజుగారిని మెప్పించాలని వారి ప్రయత్నం. చిన్నవాడన్నాడు - 'నువ్వోపాదం చెప్పు, నేనో పాదం చెబుతా. మళ్లీ నువ్వు, తరువాత నేను. ఒక శ్లోకం అయిపోతుంది' అని. మంచి ఆకలి వేళ, దూరం నుండి ప్రయాణించి వచ్చారు. వారికి మరో అలోచన రాలేదు. పెద్దవాడు ప్రారంభించాడు, 'భోజనం దేహి రాజేంద్ర' ఒక పాదం అయిపోయింది. చిన్నవాడు అందుకొన్నాడు, 'ఘృత సూప సమన్వితం' . (అన్నం పెట్టించు మహా ప్రభూ, నెయ్యి పప్పుతో సహా అని అర్థం). మళ్లీ పెద్దవాడి వంతు. ఇంకేం చెప్పాలో తోచడం లేదు. చిన్నవాడికీ ఏమీ తట్టడం లేదు. ఇదంతా వింటూ నవ్వుకొంటున్న కాలిదాసుకు ఈ పండిత సోదరులమీద జాలి కలిగింది. 'తరువాతి రెండు పాదాలు నేను చెబుతాను వ్రాసుకొండి' అని శ్లోకం ఇలా పూరించి యిచ్చాడు.

మాహిషంచ శరచ్చంద్ర

చంద్రికా ధవళం దధిః

(శరత్కాలపు చంద్రుని వెన్నెల వలే తెల్లని ఆవు/గేదె పెరుగు [కూడా పెట్టించు] అని అర్థం)


ఈ శ్లోకం విన్న భోజుడు ఇది కాలిదాసు పూరణగా గుర్తించడం, ఆ పూరణను ఆయన చేసిన సిఫారసుగా భావించి ఆ సోదరులకు యథోచితంగా ధనసహాయం చేయడం తరువాతి కథ.


మరోసారి భోజుడు సరదాగా 'క,ఖ,గ,ఘ' అని ఒక ముక్క చెప్పి దీన్ని ఒక శ్లోకంగా పూరించగలరా అని అడిగాడట. దీనితో ఏం శ్లోకం వస్తుందా అని అలోచిస్తూ ఇంటికి వస్తున్న కాలిదాసు అక్కడి గణిక వీథిలో ఎదురుగా వస్తున్న చిన్న పిల్లను చూసి ముచ్చటపడి పలకరించాడు.


'ఎవరమ్మాయీ నువ్వు?'


'నా పేరు కాంచన మాల అండి'


'అలాగా. ఎవరమ్మాయివో?'


'కనకలత కుమార్తెను'


'ఓహో! ఏమిటో చేతిలో జాగ్రత్తగా తీసుకొని వెళ్లుతున్నావు?'


'తాళ పత్రమండీ. చదువుకోవడానికి తీసుకెళుతున్నాను.'


'మంచిది. ఏం వ్రాసుందో అందులో!'


'క,ఖ,గ,ఘ'.


ఇంకేం. మాటల్లోనే పద్యం పూర్తయిపోయింది.


కా త్వం బాలే? కాంచన మాలా


కస్యా పుత్రీ? కనక లతాయా


హస్తే కిం తే? తాలీ పత్రం


కావా రేఖా? క, ఖ, గ, ఘ


(ఇది ఏ ఛందస్సులో ఉందో, అసలుందో లేదో తెలియడం లేదు. నేను వ్రాసిన దానిలో కూడా తప్పు ఉండవచ్చు).


కాలిదాసుకు, ఇతర కవులకు ఉండే మాత్సర్యంపై కూడా కథలున్నాయి. వీటిలో నిజం ఉండకపోవచ్చు కాని, ఇలాంటి పుకార్లు వినడానికి రంజుగా ఉంటాయి కదా.


కాలిదాసు, దండిలలో ఎవరు గొప్ప వారు అన్న గొడవ వచ్చిందట. అప్పుడు ఉజ్జయినిలోని సరస్వతీ ఆలయంలోనో ఎక్కడో ఇద్దరి రచనలనూ పెట్టి ఎవరు గొప్పకవియో చెప్పమని దేవిని ప్రార్థించారట. ఆ విగ్రహంనుండి "కవిర్దండిః,కవిర్దండిః, కవిర్దండిః నసంశయః" అని వినిపించిందట. అది విని, అందరి ముందు జరిగిన అవమానంతో కోపం పట్టలేక కాలిదాసు "కోఽహం రండే?" అని అరిచాడట. అప్పుడు సరస్వతి "త్వమేవాహం, త్వమేవాహం, త్వమేవాహం" అని ముమ్మారు పలికిందట. కాలిదాసు సరస్వతీ స్వరూపుడని చెప్పడానికి అతని నోట అంతటి పరుషవాక్యాలను పలికించినదెవరో కానీ అది ఆతని స్వభావానికి పూర్తిగా విరుద్ధమైనట్టి మాట.


కాలిదాసు, భవభూతి కవుల మధ్య కూడా స్పర్థ ఉండేదని, వారి వారి శిష్యులు ఇప్పటి మన సినిమా హీరోల అభిమానుల్లా కొట్టుకొనేవారని కథలు ఉన్నాయి.


కవయాః కాళిసాద్యాః


భవభూతిర్మహాకవిః


(కవులు అంటే కాలిదాసు మొదలైనవారు. భవభూతి మహాకవి) అని భవభూతి శిష్యులు విర్రవీగితే

తరవః పారిజాతాద్యాః

స్నుహీ వృక్షం మహాతరుః


(చెట్లు అంటే పారిజాతం మొదలైనవి. స్నుహీ వృక్షం మహావృక్షం) అని కాలిదాసు శిష్యులు బదులిచ్చేవారట. ఈ స్నుహీ వృక్షం అన్నది ఆయుర్వేద పరంగా ఎందుకూ పనికి రాని చెట్టు అట. కనుక దీనిని వ్యంగ్యంగా 'మహావృక్షం' అని ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొంటారట.


"ఏకో రసః, కరుణ ఏవ" అని భవభూతి పలికినా, సంస్కృత కవిత్వం లో రసం, సరసం అంటే వాల్మీకి తరువాత కాలిదాసే.


కాళిదాసు పేరిట ఉన్న చాటువుల్లో సింహభాగం భోజరాజీయం కథలు. క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దంలో ధారానగరాన్ని భోజుడనే రాజు పరిపాలించాడు. స్వయానా అయన చాలా గొప్ప కవి.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ