16, మార్చి 2025, ఆదివారం

గరుడ పురాణం_*12 - 15

: *గరుడ పురాణం_*12వ భాగం*


_*నవవ్యూహార్చన విధి పూజానుక్రమ నిరూపణం:*_


_“పరంధామా! నవ వ్యూహార్చన విధిని గూర్చి తెలుసుకొనగోరుతున్నాము” అని ప్రార్థించాడు ఇంద్రుడు. చెప్పసాగాడు ఇందిరానాథుడు._


_*“మహా పురుషులారా! ఒకప్పుడు మా గరుత్మంతుడిదే విషయాన్ని గూర్చి కశ్యపునికి చెప్పాడు. అదే మీకు నేను వర్ణిస్తాను.*_


_సాధకుడు ముందుగా యోగక్రియ ద్వారా మస్తక, నాభి, హృదయతత్త్వములను ఆకాశనామకతత్వంలో ప్రవేశింపజేయాలి. తరువాత 'రం' అనే అగ్ని బీజ మంత్రంతో పాంచభౌతిక శరీరాన్ని శోధించుకోవాలి. తరువాత 'యం' అనే వాయు బీజమంత్రంతో సంపూర్ణ శరీరాన్ని లయింపజేస్తున్న భావన చేయాలి. తరువాత 'లం' అనే బీజమంత్రంతో ఈ శరీరాన్ని చరాచర జగత్తుతో సంప్లావితం చేస్తున్నట్లు భావించుకోవాలి. అటుపిమ్మట 'వం' అనే బీజమంత్రంతో తనలోనే అమరత్వాన్ని భావించుకోవాలి. అమృతాన్ని ధ్యానిస్తూ 'పీతాంబరధారియు చతుర్భుజుడునునగు శ్రీహరిని నేనే' అని భావించుకుంటూ ఆత్మతత్త్వ ధ్యానంలో నిమగ్నం కావాలి._


_*తరువాత శరీరంలో, చేతుల్లో మూడు ప్రకారాల మంత్రన్యాసం చేయాలి. ముందు పన్నెండక్షరాల బీజమంత్రంతో, తరువాత మరో మంత్రంతో, న్యాసం, షడంగన్యాసం చేస్తే సాధకుడు తానే సాక్షాత్ నారాయణ స్వరూపుడైపోతాడు. దక్షిణాంగుష్ఠంతో ప్రారంభించి మధ్య వేలి దాకా న్యాసం చేసి మరల ఆ మధ్య వేలిపైనే రెండు బీజమంత్రాలతో న్యాసం చేసి మరల శరీర విభిన్నాంగాలపై న్యాసం చేయాలి. క్రమంగా గుండె తల, పిలక, టెంకి, మోము, కనులు, కడుపు, వీపు, అంగన్యాసం చేస్తూ రెండు భుజాలు, చేతులు, మోకాళ్ళు, కాళ్ళలోన కూడా న్యాసం చేయాలి. (చేతుల తరువాత మోకాళ్ళు)*_


_తరువాత రెండు చేతులనూ కమలాకారంలో పెట్టుకొని దాని మధ్య భాగంలో బొటన వ్రేళ్ళను కలిపి నిలపాలి. ఈ ముద్రలోనే కొంతసేపుండి పరమతత్త్వ స్వరూపుడు, అనామయుడు, సర్వేశ్వరుడు, భగవానుడునగు నారాయణ చింతనం గావించాలి._


_*తరువాత ఇవే బీజమంత్రాలతో క్రమంగా చూపుడు వేలితో మొదలెట్టి అన్ని వేళ్ళతో న్యాసం చేసి యథాక్రమంగా తల, కనులు, మోము, గొంతు, గుండె, బొడ్డు. వెనుక భాగము, రెండు మోకాళ్ళు, కాళ్ళలో కూడా న్యాసం చేయాలి.*_


_బీజమంత్రాలతో సంపూర్ణ శరీరంలో న్యాసం చేయాలి. బొటనవ్రేలి నుండి చిటికెన వేలి దాకా అయిదు బీజమంత్రాలతో న్యాసం చేయాలి. ఏ అంగానికి సంబంధించిన బీజ మంత్రాన్ని ఆ అంగన్యాసం చేస్తున్నపుడు మననం చేయాలి._


_తరువాత సాధకుడు అవే బీజ మంత్రాలతో దిక్కులను ప్రతిబద్ధం చేసుకొని పూజన క్రియ నారంభించాలి. ముందుగా ఏకాగ్ర చిత్తంలో తన హృదయంలో యోగ పీఠాన్ని ధ్యానించాలి. వివిధ దిశలలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను కల్పించుకొని పూజించి పూర్వాది దిశలలో అధర్మాదులను న్యాసం చేయాలి ఇలా :_


అగ్ని కోణంలో - ఓం ధర్మాయ నమః


నైరృత్య కోణంలో - ఓం జ్ఞానాయ నమః


వాయు కోణంలో - ఓం వైరాగ్యాయ నమః


ఈశాన కోణంలో - ఓం ఐశ్వర్యాయ నమః


తూర్పు దిక్కులో - ఓం అధర్మాయ నమః


దక్షిణ దిక్కులో - ఓం అజ్ఞానాయ నమః


పడమటి దిక్కులో - ఓం అవైరాగ్యాయ నమః


ఉత్తర దిక్కులో - ఓం అనైశ్వర్యాయ నమః

_*అని అంటూ న్యాసం చేయాలి.*_


_సాధకుడీ విధంగా న్యాసవిధులతో ఆచ్చాదింపబడిన తన శరీరాన్ని ఆరాధన పీఠంగానూ తనను తాను దాని స్వరూపంగానూ భావించుకొని తూర్పు వైపు తిరిగి తలను బాగా ఎత్తి స్థిరుడై అనంత భగవానుడైన విష్ణువును తనలో ప్రతిష్ఠితుని చేసుకోవాలి. తరువాత జ్ఞానరూప సరోవరంలో వికసించిన అష్టదళ కమలాన్ని ధ్యానించాలి._


_*తరువాత ఋగ్వేదాదులలోని మంత్రాలతో సూర్య, చంద్ర, అగ్న్యాదులను ధ్యానించు కోవాలి. తరువాత అష్టదళ కమలంపై ఎనిమిది దెసలలో భగవంతుడైన కేశవుని వద్దనే అవస్థితములై వుండు విమలాది శక్తులను విన్యస్తం చేసి తొమ్మిదవ శక్తిని కర్ణికపై స్థాపించాలి.*_


_వాటిని ధ్యానించిన పిమ్మట యోగపీఠానికి విధ్యుక్తంగా పూజ చేయాలి. తరువాత మరల మనస్సు ద్వారా విష్ణుభగవానుని అంగసహితంగా ఆవాహనం చేసి ఆ యోగపీఠంపై ప్రతిష్ఠించాలి. అపుడు తూర్పు మొదలుగా నాలుగు దిక్కులలో నున్న కమలదళాలపై హృదయాది న్యాసాన్ని చేయాలి. కమలము యొక్క మధ్య భాగంలోనూ కోణాల పైననూ ఈ క్రింది విధంగా అస్త్రమంత్ర న్యాసాన్ని గావించాలి._


తూర్పువైపు దళంలో - హృదయాయ నమః


దక్షిణం వైపు దళంలో - శిరసే స్వాహా


పశ్చిమం వైపు దళంలో - శిఖాయై వషట్


ఉత్తరం వైపు దళంలో - కవచాయ హుం


మధ్యంలో - నేత్రత్రయాయవైషట్


కోణంలో - అస్త్రాయఫట్

_*అంటూ న్యాసం చేయాలి.*_


_తరువాత పూర్వాది దిశల్లో యథాక్రమంగా సంకర్షణాదులను స్థాపించాలి. తరువాత తూర్పు, పడమటి ద్వారాలలో ఓం వైనతేయాయ నమః అంటూ గరుత్మంతుని స్థాపించాలి. దక్షిణ ద్వారంలో 'ఓం సుదర్శనాయ నమః, ఓం సహస్రారాయనమః' అని ఉచ్ఛరిస్తూ వేయి అర్రలున్న సుదర్శన చక్రమును స్థాపించాలి. దక్షిణ ద్వారంలోనే ఓం శ్రియైనమః మంత్రంతో శ్రీ అనే అక్షరాన్ని న్యాసం చేసి ఉత్తర ద్వారంలో ఓం లక్ష్మ్యై నమః అనే మంత్రంతో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలి. తరువాత ఉత్తర దిశలో ఓం గదాయై నమః అంటూ గదనీ, కోణాలలో ఓం శంఖాయై నమః అంటూ శంఖాన్నీ న్యాసం చేయాలి._


_*పిమ్మట విష్ణుదేవునికి రెండు వైపులా ఆయుధాలనుంచాలి. దక్షిణం వైపు ధనుస్సు (శారంగము) నీ ఎడమ వైపు బాణములను అలాగే కుడి యెడమలలో కత్తినీ కవచాన్నీ వుంచాలి.*_: *గరుడ పురాణం_*13వ భాగం*



_ఆపై సాధకుడు మండలమధ్యంలో దిశాభేదాను సారము తూర్పుతో మొదలెట్టి ఇంద్రాది దిక్పాలకులను వారి ఆయుధాలతో సహా స్థాపించాలి. అలాగే పైకి ఓం బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవునీ ఓం అనంతాయ నమః అనే మంత్రం ద్వారా అనంతునీ న్యాసం చేయాలి._


_*ఈ ప్రకారంగా అందరు దేవతల న్యాస, ధ్యాన, పూజనాలను చేస్తూ ఆయా దేవతల కెదురుగా వారి వారి ముద్రలను ప్రదర్శించాలి. అంజలి బద్ద ముద్ర మొదటి ముద్ర. దీన్ని ప్రదర్శించడం వల్ల దేవసిద్ధి తొందరగా లభిస్తుంది. రెండవది వందినీ ముద్ర. మూడవదైన హృదయాసక్త ముద్రను ఎలా ప్రదర్శించాలంటే ఎడమ పిడికిటిలో కుడిబొటనవ్రేలిని బంధించి ఎడమ బొటన వేలిని పైకెత్తి గుండెకు తగల్చాలి. వ్యూహ పూజలో ఈ మూడిటినీ సాధారణ ముద్రలుగా పరిగణిస్తారు. రెండు చేతుల వేళ్ళనూ ఒకదానికొకటి తగిలించి వుంచి ఒక్కొక్క వ్రేలినీ వదులుకుంటూ పోవడం ద్వారా ఎనిమిది ముద్రలు ఏర్పడతాయి.*_


_రెండు చేతుల బొటనవ్రేళ్ళనూ వాటి మధ్యమ, అనామిక, చిటికెన వ్రేళ్ళకు తగిలించి క్రిందికి వంచి చూపే ముద్రను 'నరసింహ' ముద్ర అంటారు. కుడిచేతిపై ఎడమ చేతిని ఉత్తానస్థితిలో పెట్టి ప్రతిమపై మెల్ల మెల్లగా తిప్పడాన్ని 'వారాహీ' ముద్ర అంటారు. ఆయా దేవుళ్ళకివి ప్రియమైన ముద్రలు. రెండు పిడికిళ్ళను బిగించి ఒకదానిపై నొకటిగా వుంచి ఒక్కొక్క వ్రేలినే మెలమెల్లగా విడిపించి మరల పిడికిళ్ళను బిగించడాన్ని 'అంగముద్ర’ అంటారు. పది దిక్కుల పాలకులకూ సాధకుడు ఈ విధంగా ముద్రలను చూపించాలి._


_*భగవంతుడైన వాసుదేవుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు క్రమంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ దేవస్థానములకు అధికారులైన దేవతలు. కాబట్టి సాధకుడు క్రమంగా 'ఓం అం వాసుదేవాయనమః, ఓం ఆం బలాయ నమః, ఓం అం ప్రద్యుమ్నాయ నమః, ఓం అః అనిరుద్ధాయ నమః అనే మంత్రాలతో పూజించాలి.*_


_ఓంకారం, తత్సత్, హుం, క్షౌం, భూః ఈ అయిదూ క్రమంగా, నారాయణ, బ్రహ్మ విష్ణు, * నరసింహ మహావరాహ భగవానుల బీజమంత్రాలు._


_*కాబట్టి సాధకుడు ఓం నారాయణాయ నమః మంత్రంతో భగవంతుడైన నారాయణునీ ఓం తత్సత్ బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవునీ, ఓం హుం విష్ణవే నమః అనే మంత్రంతో విష్ణుదేవునీ, ఓం క్షౌం నరసింహాయ నమః అనే మంత్రంతో నరసింహునీ, ఓం భూః మహా వరాహాయ నమః అనే మంత్రంతో ఆదివరాహాన్నీ పూజించాలి.*_


_( * 'నరసింహ' అనే శబ్దం సరికాదనీ 'నృసింహ' అనియే ఉండాలనీ కొందరు పండితులంటారు. బీజమంత్రాలు అనే మాట కన్న బీజాక్షరాలు అనే మాట తెలుగు ప్రాంతంలో ఎక్కువగా వాడబడుతోంది.)_


_*పైన చెప్పబడిన తొమ్మండుగురు దేవతలూ (వాసుదేవ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, బ్రహ్మ, విష్ణు, నరసింహ, మహావరాహ) నవవ్యూహాధినాథులు. వీరి యొక్క వర్ణాలు క్రమంగా తెలుపు, ఎరుపు, హరిద్ర పీతం, నీలం, నలుపు, ఎరుపు, మబ్బు వంటి నలుపు, అగ్ని వంటి పసుపు, తేనెరంగు (రెండవ ఎరుపు గులాబీ రంగు) ఈ దేవతలంతా ఈయీ రంగుల తేజస్సును వెలార్చుతూ వెలిగిపోతుంటారని అర్ధము.*_


_ఓంకారం ప్రతి మంత్రానికీ ముందు వాడుతూ విష్ణువు అంగాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ క్రింది దేవతలకి ఈయీ బీజ మంత్రాలను (బీజాక్షరాలను) వాడాలి.*_ 


ఓం కం టం పం శం - గరుడుడు


జఖం వం - సుదర్శనం


షం చం ఫం షం - గద


వం లం మం క్షం - శంఖ


ఘం ఢం భం హం - లక్ష్మి


గం జం వం శం - పుష్టి


ఘం వం - వనమాల


దం సం - శ్రీవత్సం


ఛం డం పం యం - కౌస్తుభం


_*గరుడుడు కమలం వలె ఎఱ్ఱనివాడు. గద నల్లనిది. పుష్టి శిరీష పుష్ప వర్ణంలో, లక్ష్మి బంగారం వలె పచ్చని కాంతులతో వుంటారు. శంఖానిది పూర్ణచంద్రుని వర్ణకాంతి. కౌస్తుభమణి అప్పుడే వికసించిన సూర్యుని అరుణ వర్ణంలో వుంటుంది. సుదర్శనునిది సహస్ర సూర్యకాంతి. శ్రీ వత్సం కుందపుష్పసమాన వర్ణితం, అనగా శ్వేతం. వనమాల పంచవర్ణశోభితం. అనంత భగవానుడు నీలమేఘశ్యాముడు. అస్త్రాలది విద్యుత్కాంతి 'పుండరీకాక్ష' విద్య సహాయంతో పద్ధతిని తెలుసుకొని విష్ణువు యొక్క ఈ సమస్తాంగాలకీ అర్ఘ్య పాద్యాదులను సమర్పించాలి.*_

_(11వ అధ్యాయం సమాప్తం)_

: *గరుడ పురాణం_*14వ భాగం*



_*పూజానుక్రమ - నిరూపణం:*_


_రుద్రదేవా! ఏ పూజకైనా ఒక క్రమ విధానముంటుంది. దానిని వివరిస్తాను వినండి. సాధకుడు ముందుగా ఓం నమః మంత్రంతో పరమాత్మను స్మరించాలి. తరువాత యం రం వం లమ్ అనే బీజాక్షరాల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకొని భగవానుడు చతుర్భుజుడునైన విష్ణువుని తనలోనే ఊహించుకోవాలి._


_*తరువాత కరన్యాస, దేహన్యాసాలను చేసుకొని ఈ క్రింది మంత్రాల ద్వారా హృదయంలోనే యోగపీఠాన్ని పూజించాలి.*_


_ముందుగా నొక కమలాన్ని స్థాపించి అందులోని భాగాలలో దేవతలనూహించుకొని ఈ మంత్రాలను పఠించాలి._


ఓం అనంతాయ నమః ।

ఓం ధర్మాయ నమః |

ఓం జ్ఞానాయ నమః |

ఓం వైరాగ్యాయ నమః ।

ఓం ఐశ్వర్యాయ నమః ।

ఓం అధర్మాయ నమః ।

ఓం అజ్ఞానాయ నమః ।

ఓం అవైరాగ్యాయ నమః ।

ఓం అనైశ్వర్యాయ నమః ।

ఓం పద్మాయ నమః |

ఓం ఆదిత్య మండలాయ నమః ।

ఓం చంద్ర మండలాయ నమః ।

ఓం వహ్ని మండలాయ నమః ।

ఓం విమలాయై నమః /

ఓం ఉత్కర్షిణ్యై నమః |

ఓం జ్ఞానాయై నమః |

ఓం క్రియాయై నమః ।

ఓం యోగాయై నమః ।

ఓం ప్రహ్ వ్యై నమః |

ఓం సత్యాయై నమః |

ఓం ఈశానాయై నమః ।

ఓం సర్వతోముఖ్యై నమః ।

ఓం సాంగోపాంగాయ హరేరాసనాయ నమః ।


_తరువాత సాధకుడు కర్ణిక మధ్యలో అం వాసుదేవాయ నమః అంటూ వాసు దేవునికి నమస్కరించి ఈ క్రింది మంత్రాలతో హృదయాది న్యాసం చేయాలి._


ఆం: హృదయాయ నమః ।

ఈం శిరసే నమః ।

ఊఁ శిఖాయై నమః |

ఐం కవచాయ నమః /

ఔం నేత్రత్రయాయ నమః ।

అః ఫట్ అస్త్రాయ నమః ।


_*తరువాత ఈ క్రింది మంత్రాలతో సంకర్షణాది వ్యూహదేవులకు నమస్కారం చేయాలి.*_


ఆం సంకర్షణాయ నమః ।

అం ప్రద్యుమ్నాయ నమః |

అః అనిరుద్ధాయనమః ।

ఓం అః నారాయణాయ నమః |

ఓం తత్సద్ బ్రహ్మణే నమః

ఓం హుం విష్ణవే నమః ।

క్లౌం నరసింహాయ నమః ।

భూర్వరాహాయ నమః ।


_*పిమ్మట స్వామి వారి పరివారాన్నీ ఆయుధాలనూ ఇలా కొలుచుకోవాలి.*_


కం టం జం శం వైనతేయాయ నమః |

జం ఖం వం సుదర్శనాయ నమః ।

ఖం చం ఫం షం గదాయై నమః ।

వం లం మం క్షం పాంచజన్యాయ నమః |

ఘం ఢం భం హం శ్రియై నమః ।

గం డం వం శం పుష్యై నమః ।

ధం వం వనమాలాయై నమః ।

దం శం శ్రీ వత్సాయ నమః ।

ఛం డం యం కౌస్తుభాయ నమః ।

శం శారంగాయ నమః ।

ఇం ఇషుధిభ్యాం నమః ।

చం చర్మణే నమః |

ఖం ఖడ్గాయ నమః |


_*అనంతరం ఈ క్రింది బీజాక్షర సహిత మంత్రాలతో ఇంద్రాది దిక్పాలకులకు నమస్కారం చేయాలి. ప్రతి మంత్రానికీ ముందు 'ఓం' కారాన్ని ఉచ్చరించాలి.*_


లం ఇంద్రాయ సురాధిపతయే నమః ।


రం అగ్నయే తేజో ధిపతయే నమః |


యమాయ ధర్మాధిపతయే నమః |

క్షం నైరృతాయ రక్షో ధిపతయే నమః ।

వం వరుణాయ జలాధిపతయే నమః ।

యోం వాయవే ప్రాణాధిపతయే నమః ।

ధాం ధనదాయ ధనాధిపతయే నమః । 

హాం ఈశానాయ విద్యాధిపతయే నమః |


_*తరువాత దిక్పాలుర క్రమంలోనే వారి ఆయుధాలను కూడా ఈ క్రింది పద్ధతిలో జపించాలి.*_


ఓం వజ్రాయనమః | ఓం శక్ష్యై నమః |


ఓం దండాయ నమః | ఓం ఖడ్గాయ నమః |


ఓం పాశాయ నమః | ఓం ధ్వజాయ నమః । 


ఓం గదాయై నమః । ఓం త్రిశూలాయ నమః ।


పిమ్మట అనంతునికీ, బ్రహ్మ దేవునికీ ఈ మంత్రాలతో ప్రణామం చేయాలి.


ఓం లం అనంతాయ పాతాలాధిపతయే నమః ।


ఓం ఖం బ్రహ్మణే సర్వలోకాధిపతయే నమః ।


_*అనంతరం సాధకుడు వాసుదేవ భగవానునికి నమస్కరించడానికి ద్వాదశాక్షర మంత్రాన్ని ప్రయోగించాలి. దానితో బాటే పన్నెండక్షరాల బీజయుక్త శబ్దాలనూ, దశాక్షర మంత్రంలోని పదక్షరాల బీజయుక్త శబ్దాలనూ జపించాలి. ఇలా :*_


ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ।


ఓం ఓం నమః | ఓం నం నమః । ఓం మోం నమః | ఓం ఓం భం నమః | ఓం గం నమః ఓం వం నమః । ఓం తేం నమః | ఓం వం నమః ఓం సుం సమః । ఓం దేం నమః | ఓం వాం ఓం ఓం నమః ఓం నం నమః | ఓం యం నమః । నమః । ఓం మోం నమః । ఓం నాం నమః ఓం రాం నమః ఓం యం నమః । ఓం ణాం నమః | ఓం యం నమః ।


ద్వాదశాక్షర మంత్రం - ఓం నమోభగవతే వాసుదేవాయ


దశాక్షర మంత్రం – ఓం నమో నారాయణాయ నమః


అష్టాక్షర మంత్రం - ఓం పురుషోత్తమాయ నమః |


_*ఈ మూడు మంత్రాలనూ వీలైనంతగా జపించి ఈ క్రింది మంత్రంతో పుండరీకాక్ష భగవానునికి నమస్కారం చేయాలి.*_


నమస్తే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన |


సుబ్రహ్మణ్య నమస్తేస్తు మహాపురుష పూర్వజ ॥


_ఈ విధంగా విష్ణుదేవుని స్తుతించి అప్పుడు హవనం చేయాలి. తరువాత మహా పురుష విద్యానామక మంత్రాన్ని పద్ధతి ప్రకారం నూటయెనిమిది మార్లు జపించాలి. తదనంతరం "జితంతేనతో" మొదలగు మహాపురుష విద్యాస్తోత్రాన్ని జప, అర్ఘ్యముల తరువాత పఠించి నారాయణునికి పలుమార్లు ప్రణామం చేయాలి._


_*తరువాత అగ్నిదేవుని స్థాపించి పూజించి హవనం చేయాలి. విష్ణు దేవునికీ, అచ్యుతాది ఆంగిక దేవతలకీ బీజాక్షర యుక్త మంత్రాలతో ఆహుతులివ్వాలి. మనస్సులోనే సాంగోపాంగంగా బ్రహ్మదేవునీ ఇతర దేవతలనూ పూజించుకొని వారందరినీ మండలంలో స్థాపించాలి. అప్పుడు వాసుదేవ మంత్రంతో నూట యెనిమిది ఆహుతులివ్వాలి. తరువాత సంకర్షణాది ఆరుగురు అంగదేవతలకు మూడేసి ఆహుతులనూ, దిక్పాలకుల కొక్కొక్క ఆహుతినీ ప్రదానం చేయాలి. హవనం పూర్తయినాక ఏకాగ్ర చిత్తంతో పూర్ణాహుతి నివ్వాలి.*_


_తరువాత మన మనోవాక్కాయ కర్మలకు అతీతుడైన పరమాత్మతో సాధకుడు ఆత్మను లీనం చేస్తున్నట్లుగా భావించుకొని దేవతలందరికీ ఈ మంత్రం ద్వారా వీడ్కోలు చెప్పాలి._


గచ్ఛ గచ్ఛ పరంస్థానం యత్రదేవో నిరంజనః | గచ్ఛంతు దేవతాః సర్వాః స్వస్థానస్థితహేతవే ॥


_*దేవతలారా! సుదర్శన, శ్రీహరి, అచ్యుత, త్రివిక్రమ, చతుర్భుజ, వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, పురుష - ఈ దేవ సమూహాన్నే నవవ్యూహమంటారు. పరమాత్మను కలుపుకుంటే దశాత్మకమవుతుంది. అలాకాకుండా అనిరుద్ధునీ, అనంతునీ కలుపుకుంటే ఇదే ఏకాదశ వ్యూహమవుతుంది. నవవ్యూహానికి పరమతత్త్వాన్నీ, అనిరుద్ధునీ, అనంతునీ కలుపుకుంటే అది ద్వాదశాత్మక వ్యూహంగా చెప్పబడుతుంది.*_


_చక్రాంకిత మంత్రాలను చదివి వాటిని అనగా చక్రరూపాలను ఈ విధంగా బీజాక్షరాలతో పూజించాలి._


ఓం చక్రాయ స్వాహా | ఓం విచక్రాయ స్వాహా | ఓం సుచక్రాయ స్వాహా । ఓం మహాచక్రాయ స్వాహా | ఓం అసురాంత కృత్ హుం ఫట్ | ఓం హుం సహస్రార హుం ఫట్ /


_*గృహాన్ని సంరక్షించే పై మంత్రాలతో చేసే పూజకు 'ద్వారకా చక్రపూజ' అని పేరు. ఇది సర్వమంగళదాయిని"*_

_(12వ అధ్యాయం సమాప్తం)_

కామెంట్‌లు లేవు: