16, మార్చి 2025, ఆదివారం

కృష్ణార్పణము కృష్ణ అక్షయం

 .

కృష్ణార్పణము కృష్ణ అక్షయం ఈ రెండు వేరే ఎవరు చెప్పినది కాదు సాక్షాత్తు పంచ పతివ్రతలలో ఒకరైన ద్రౌపదీ మహా సాధ్వి చెప్పిన విషయం ఇది. 

దాని గురించి వివరంగా తెలుసుకుందాం. 

ద్రౌపతీ దేవి మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్ముడిని తన స్వయంవర సమయం లో చూసింది. అప్పుడు నేరుగా వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి మహాత్మా నీవు సర్వాంతర్యామివి సర్వ జగద్రక్షకుడివి సర్వము తెలిసిన వాడివి. నాకు ఎవరిని భర్తగా నిలపాలా అనేది నిర్ణయం నీదే ఇది కేవలము లోకములోని అందరికీ తెలిసేటందుకు ఈ స్వయంవరం జరుగుతోంది, కావున ధర్మము తప్పనివాళ్లు సత్సాంగత్యం కలవాళ్ళు కలిగిన అత్తగారింటికి వెళ్ళేట్టుగా నన్ను ఆశీర్వదించు అని ఆయనను వేడుకొంది. అందులకు ఆయన అది ఏమిటి తల్లి ఇంత మంది ఉన్నారు పెద్దల ఆశీస్సులు కాకుండా నా ఆశీస్సులు అడుగుతున్నావు అని అడిగాడు అందులకు ఆమె నేను ముందుగానే చెప్పాను నీవు ఎవరవు అనే విషయం నాకు తెలుసు అసలు ఈ విషయము అంతయు నీ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఏదైనా నీకు అర్పితం కానిది ఇంకెవరికి అర్పితం కాదు అని ఆమె ఆయన పాదాలు విడవలేదు. ఆమె భక్తికి మెచ్చిన ఆ నందగోపాలుడు ఆమెకు తధాస్తు నీకు శుభం కలుగుగాక నీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను తల్లి అని చెప్పాడు. 

అటు తరువాత ఒకసారి పాండవులు ద్రౌపది అరణ్యవాసంలో ఉన్నప్పుడు కౌరవులు పంపగా ధర్మరాజును పరీక్షించడానికి దుర్వాస మహర్షి వస్తాడు మేము మా శిష్య బృందం అంతా ఆకలితో ఉన్నాం నేను నదికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసుకొని వచ్చేలోపు మా అందరికీ నీవు భోజనములు సిద్ధం చెయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. 

అప్పటికి ధర్మరాజు వద్ద ఉన్న అక్షయపాత్ర శుభ్రం చేసి పూజా మందిరంలో పెట్టేస్తుంది ద్రౌపతి. ధర్మరాజు ఈ అనుకోని అతిథి వలన ఏమి బాధలు కలుగుతాయో అని వెళ్లి ద్రౌపది దీనికి చెబుతాడు. అప్పుడు ఆమె నేను ఎప్పుడు కూడా నీ పద చరణాలను నమ్ముకుని ఉండే దానిని అయితే నా ఈ కష్టాన్ని నీవే కాపాడుతావు ఓ ఆర్తత్రాణ పరాయణ ఓ వాసుదేవా ఓ జగత్కారణ ఓ గోపి జనప్రియ అని అనేక నామాలతో కీర్తిస్తుంది, స్తుతిస్తుంది. అప్పుడు ఆ దీనజన వల్లభుడు ఆ సమయానికి అక్కడ ప్రత్యక్షమై అమ్మ సోదరి నాకు కాస్త ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే పెట్టు తల్లి అని అడిగాడు. ఓ జగన్నాటక సూత్రధారి ఇదంతాయు నీ మాయనే నీ వల్లనే మేము ఇక్కడికైనా ఉన్నాం కావున నీవు ఇంకా నన్ను పరీక్షించవద్దు అని ఆయననే శరణు వేడింది. దానికి ఆయన ఆ అక్షయ పాత్రలో చూడు తల్లి ఒక్క గుళికైనా ఉండకపోతుందా అని అడిగాడు తీసుకొచ్చి ఆమె చూపించింది అప్పుడు ఆ వాసుదేవుడు తన చేతిలో ఒక చిన్న మెతుకు గోటిలో పెట్టుకొని వచ్చాడు ఆ మెతుకు దాన్లో వేసి ఇదిగో తల్లి ఈ ఒక్క గుళిక చాలు బ్రహ్మాండములో ఏదైనా కూడా తృప్తి చెందుతాను నేను. నాకు కావాల్సింది భక్తి అంతే తల్లి ఇదిగో అని చెప్పి లోపలికి ఆ మెతుకు నువ్వు నోట్లో వేసుకుని తృప్తాస్మి(తృప్తస్థ) (ఇక్కడ ఈ రెండు పదాల్లో నాకు ఒక అనుమానం ఉన్నది అందుకని రెండు పదాలు వాడను) అని చెప్పి భీమసేన నీవు వెళ్లి దూర్వాసుల వారిని వారి శిష్య బృందమును వెంటబెట్టుకుని రావాలి. కాదు కూడదన్నా కూడా జాగ్రత్తగా తీసుకురావాలి మర్చిపోవద్దు నేను వచ్చానని చెప్పు తప్పకుండా వస్తాడు అని చెబుతాడు ఆయన చెప్పిన మాటలను తు.చ. పాటిస్తూ భీమసేనుడు వెళ్లి అడగగా అక్కడ కడుపు ఉబ్బరంతో దుర్వాసుడు అతడి శిష్య బృందమంతా అనగా అజీర్తి తో నేల మీద బడి దొర్లుతూ ఉంటారు. వెళ్లి పిలిచిన భీమసేనుడిని చూసి నాయనా నేను రాలేను నాకు కడుపు అంతా ఉబ్బరం చేసింది నేను ఇప్పుడు ఒక మెతుకు కూడా ముట్టలేను కాబట్టి నన్ను వదిలేయి అన్నాడు అప్పుడు భీమసేనడు అలా కుదరదు స్వామి మీరు వచ్చారని తెలిసి వాసుదేవుడు కూడా వచ్చాడు అని చెప్పగా దానికి ఆయన విషయం తెలుసుకున్నవాడై భీమసేన ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఆ దుష్ట చతుష్టయం మాటలు విని మిమ్ములను పరీక్షించడానికి వచ్చాను నా తప్పును మన్నించమని వాసు దేవుడికి చెప్పు అని చెప్పి పంపిస్తాడు అప్పుడు ద్రౌపదీ దేవికి ఇచ్చిన వరం కృష్ణ అక్షయం అంటే ఆమె ఏది మొదలుపెట్టిన కూడా కృష్ణుని దయ వల్లనే ఇది అక్షయమవుతుంది అని అర్థం. ఎవరైనా సరే వాళ్లకు ఏదైనా కీడు తలపెట్టినా కూడా లేదా దురుద్దేశంతో వస్తున్న కూడా అప్పుడు ఆమె కృష్ణార్పణమస్తు అని చెబుతూ వచ్చింది.

ఆమె భక్తితో చేస్తూ ఉంది కాబట్టి కృష్ణాక్షయము కృష్ణార్పణము రెండు ఆమె ద్వారా వచ్చినటువంటివే!


ఇది మహాభారతంలో అరణ్యకాండలో వస్తుంది.


    నమస్కారమండి 

               మీ 

 చంద్రమోహన్ మాండవ్య 🙏🕉️🍒🦜🪻🌹🥀🏵️🍁

కామెంట్‌లు లేవు: