ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
22, ఆగస్టు 2023, మంగళవారం
శ్రీ కాళహస్తీశ్వర శతకం - 71
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*
శ్రీ కాళహస్తీశ్వర శతకం - 71
సులభుల్మూర్ఖులనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ నన్నలంతలబెట్టిన నీ పదాబ్ధములఁ బాయంజాల నేమిచ్చినం
గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గాపుండు టబ్జంబు పైఁ
జెలువొప్పున్ సుఖియింపఁ గాంచుట సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీ కాళహస్తీశ్వరా! లోకమునందలి రాజులు సులభులు. వారి సేవ అశ్రమముగనే లభించును. వీరు మూర్ఖులు, జ్ఞానహీనులు, అహంకారాది దోషములు కలవారు, అనుత్తమోత్తములు, నీచులందరిలోను గొప్పవారు, పరమనీచులు.
అట్టివారిని నేను సేవించను. ఆ కోపముతో వారు నన్ను ఎన్ని బాధలు పెట్టినను లెక్కపెట్టను.
విశిష్ట లక్షణములతో దుర్లభుడవు, సర్వజ్ఞుడవు, అహంకారాది దోషములు లేనివాడవు అగు నీ పాదపద్మములను వదలను. వారు ఏమిచ్చినను నాకు దానితో పని లేదు.
నీవు ఏమి ఇచ్చినను దానిని నేను వెండికొండను పాలించుటగా, అంబునిధిలో కాపురముండుటగా మరియు పద్మమునందు చక్కగా సుఖించుచుండుటగా భావించి ఆనందింతును.
ఓం నమః శివాయ
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
దనుజ వన కృశానుం అర్థం
దనుజ వన కృశానుం అర్థం ఏమిటి?
కృశాను అంటే అగ్ని .
దనుజ వనం అంటే రాక్షసులు అనే అడవి.
వనం (అడవి )విచ్చలవిడిగా అదుపు లేకుండా పెరిగేది. దాన్ని దావాగ్ని ఒకటే నిగ్రహించగలదు.
అడవిని దావాగ్ని సర్వ నాశనం చేస్తుంది. అలాగే హనుమ రాక్షసులను నాశనం చేసే వాడు —
దనుజులు అనే వనానికి కృశానుని వంటి వాడు . భయంకరుడు/ నాశకుడు.
దనుజ వన కృశానుం—(ద్వితీయా విభక్తి రూపం).= హనుమను .
అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహం
దనుజ వన కృశానుం జ్ఞానినాం అగ్రగణ్యం
సకల గుణ నిధానం వానరాణాం అధీశం
రఘుపతి వరదూతం వాతజాతం నమామి..
తులసీ దాసు రామచరిత మానస్ లో ప్రతి కాండ మొదట నాలుగైదు సంస్కృత శ్లోకాలు వ్రాశాడు . ఇది సుందర కాండ మొదట్లో ఉన్న శ్లోకాలలో ఒకటి.
హనుమను (కు) నమస్కరిస్తున్నాను.
శ్రీనాధుని కవితా వైభవం!
శ్రీనాధుని కవితా వైభవం!
శా: కాలాంతఃపుర కామినీ కుచతటీ కస్తూరికా సౌరభ
శ్రీలుంటాకము చందనాచల తట శ్రీఖండ సంవేష్ఠిత
వ్యాల స్ఫార ఫణాకఠోర విష నిస్వాసాగ్ని పాణింధమం
బేలా నాపయి దక్షిణానిలము పక్షీ , సేయు దాక్షిణ్యమున్;
శృంగార నైషధము- ద్వి:ఆ:- 32 ప: శ్రీ నాధుడు.
అద్భుతమైన కవిత్వంతో ఆంధ్రదేశాన్ని ఓలలాడించిన కవిసార్వభౌముడుశ్రీనాధుడు. "నైషథం విద్వదౌషధమ్ " అనేపండితోక్తి శ్రీనాధకృత నైషధము వలననే నని కొందరి యభిప్రాయము. మూలగ్రంథకర్త హర్షుడు గూడ సామాన్యుడుగాడు. అంత మహోన్నత గ్ంధమును వాసి తగ్గకండా అనువదించుట సామాన్యమైన విషయముకాదు. ఆమహద్గౌరవము శ్రీనాధునకే దక్కినది. పండిత జనైక వేద్యమైన యీగ్రంథములోని యొకపద్యం మీకోసం!
హంస నలుని చేతఁజిక్కి నన్ను విడిచినచో నీకొక యుపకారమును జేతున్నది. ఏమాయుపకృతి?లోకోత్రర సౌందర్య రాసి యగు దమయంతిని నీకు గూర్తునన్నది. ఆమెకు నీకు పెండిలి గావింతునన్నది. దమంయంతీ సౌందర్యమును రమణీయముగా వర్ణించి యామెపై నలునకు వలపు బుట్టించినది. నలుడు విరహమున బడినాడు. ప్రాచీన గ్రంథములలో యిదియొక ముఖ్యమైన వర్ణనము. ఈవిరహ మున చంద్ర, మన్మధ, వసంత, మలయానిలాదులను ,తూలనాడు విధానముండును. మనమిప్పుడు నలుడుమలయానిలమును(చల్లగాలి) దూషించుటను విందుముగాక!
విరహులకు చల్లగాలి అగ్ని కీలలను బోలి బాధించునట! అదిగో ఆబాధలో నున్నాడు నలుడు.
అర్ధవివరణ:- కాలాంతఃపురకామినీ- యమునిపట్టపురాణి; కుచతటీ-స్తనములయందలి; కస్తూరికా- కస్తూరీ ద్రవ్యము యొక్క; సౌరభశ్రీ- పరిమళ వైభవమును; లుంటాకము- దోచుకొను నట్టిది; చందనాచలతట- చందనపర్వత ప్రాంతము నందలి; శ్రీఖండ-మంచిగంధపు చెట్లపయి; సంవేష్ఠిత- నివసించే(చుట్టుకొనియుండే) వ్యాల- సర్పములయొక్క;స్ఫార- గొప్పనైన; ఫణాకఠోర-సర్పముల భయంకరమైన; విష-విషపూరితమైన; నిస్వాసాగ్ని- నిట్టూర్పుల అగ్గ్నితో; పాణింధమంబు-చేయికలిపిన (సమానమైన) దక్షిణానిలము-మలయానిలము;పక్షీ- ఓపక్షిరాజమా! నాపై -నామీద; దాక్షిణ్యము- దయను; ఏలచేయున్- ఎందుకు చేయును?
భావము: కాలుని యంతఃపుర కాంతల కుచ సీమల నలంకరించిన కస్తూపరిమళమున పనపహరించునదియు ,మలయాచల సానువుల యందలి చందన వృక్షముల పైనివసించు భయంకర సర్పముల నిట్టూర్పులచే విషదిగ్ధమైన యీమలయానిలము నాపై నేల దయను జూపును?
విశ్లేషణ: విరహులకు చలిగాలి శతృవు. అది విషతుల్యము. విషము చేయుపనియేమి? ప్రాణములను దొలగించును. అటులనే యీగాలులు విరహులకు ప్రాణాంతకములట! అదే విషమును నలుడు హంసకు దెలుపు చున్నాడు. ఓపక్షిరాజా! నీవర్ణనతో
దమయంతి పై నాకు వలపు బుట్టించితివి. ఇపుడు నాకామెతో పరిణయము గానియెడల విరహ వేదన నన్నుదహింపక మానదు.
మలయానిలమును చల్లగాలిగా భావింప వీలుగాదుగదా! ఏలనన?
ఇది దక్షిణానిలము గదా! దక్షిణదిశా పాలకుడు యముడు. అతనియంతఃపుర కాంతల స్తన వ్యాప్త కస్తూరికా పరిమళ
వ్యప్తమై, చందనాచల స్థిత భయంకర ఫూత్కార సమేతమై వచ్చు నీగాలి విషతుల్యము గాక మరేమి? కావున నాబ్రతుకిపుడు నీ వశమైనది.కావున సత్వరమే బోయి ఆమెకుగూడ నాపై వలపు గలిగించి మావివాహమును జరిపించమని నలుని సూచన!
ఈపద్యమున "కాలాంతఃపుర------శ్రీలుంటాకము" చందనాచల----పాణింధమంబు"- అనేరెండు పెద్ద సమాసాలను ప్రయోగిస్తూ! నలుని విరహ బాధలోని గాఢతను వివరించెను.
శ్రీలుంటాకము---- పాణిధమంబు; అను సంస్కృత పదములతో తన యపారమైన పాండిత్యము నభివ్యక్తము గావించెను.
ఈవిధముగా నీపద్యము శ్రీనాధుని యపార వైదుష్యమునకు ప్రతీక యైనది;
స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
బంధనములైన
🪷 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪷
🕉️卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* 卐🕉️
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*కదంబారుణ మంబాయా రూపం చింతయ చిత్తమే ౹*
*ముంచ పాపీయసీ నిష్టామ్ మా గృధః కస్య స్విద్దనం ౹౹*
𝕝𝕝భావం𝕝𝕝
*ఓ మనసా!* ఈ బాహ్య బంధనములైన ఈర్ష్య , ద్వేషం , కుళ్లు , కుతంత్రముల వద్దకు.... కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరముల.... జోలికి పోకుండా అనునిత్యం ఆ *కదంబ తరుచ్ఛాయలో ప్రకాశవంతముగా విరాజిల్లుతున్న ఆ జగన్మాత పాదములను ఆశ్రయించు..... ఆవిడే ఈ లోకమునంతటికి తల్లి.
🪷 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪷
🕉️卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* 卐🕉️
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*కదంబారుణ మంబాయా రూపం చింతయ చిత్తమే ౹*
*ముంచ పాపీయసీ నిష్టామ్ మా గృధః కస్య స్విద్దనం ౹౹*
𝕝𝕝భావం𝕝𝕝
*ఓ మనసా!* ఈ బాహ్య బంధనములైన ఈర్ష్య , ద్వేషం , కుళ్లు , కుతంత్రముల వద్దకు.... కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరముల.... జోలికి పోకుండా అనునిత్యం ఆ *కదంబ తరుచ్ఛాయలో ప్రకాశవంతముగా విరాజిల్లుతున్న ఆ జగన్మాత పాదములను ఆశ్రయించు..... ఆవిడే ఈ లోకమునంతటికి తల్లి.
కామ క్రోధాది వ్యసనాల కడకు పోక
యీర్ష్య ద్వేషాది గుణముల కెపుడు చనక
ఘన కదంబ తరుచ్ఛాయ మనుచు నుండి
వెల్గు జగదాంబ పదములన్ వేడు మెపుడు
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
హనుమంతుడు
శ్లోకం:☝️
*హనుమతి హతారామే*
*వానరా హర్షనిర్భరః |*
*రుదన్తి రాక్షసాః సర్వే*
*హాహారామో హతో హతః ||*
భావం: హనుమంతుడు (రావణుడి) తోటను (ఆరామాన్ని) నాశనం చేసినప్పుడు, రాక్షసులు 'తోట నాశనమైంది, తోట నాశనమైంది' అని హాహాకారాలు చేసారు. అది వినిన వానరులు ఆనందంతో నృత్యం చేసారు.
కొన్ని శ్లోకాలకు అర్థం అసంబద్ధంగా ఉంటుంది. కానీ పరిశీలించి చూస్తే అసలైన అర్థం వెల్లడౌతుంది.
మొదటి పఠనంలో ఈ క్రింది అర్థాన్ని ఇస్తుంది -
_హనుమంతుడు రాముడిని చంపినప్పుడు, వానరులు ఆనందంతో నృత్యం చేసారు మరియు రాక్షసులు హాహాకారాలు చేసారు._
పంచాంగం 22.08.2023 Tuesday,
ఈ రోజు పంచాంగం 22.08.2023 Tuesday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల పక్ష: షష్థి తిధి భౌమ వాసర: చిత్ర నక్షత్రం శుక్ల యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం ఇది ఈరోజు పంచాంగం.
షష్థి రాత్రి 03:04 వరకు.
చిత్ర ఉదయం 06:30 వరకు.
సూర్యోదయం : 06:04
సూర్యాస్తమయం : 06:34
వర్జ్యం : మధ్యాహ్నం 12:28 నుండి 02:10 వరకు.
దుర్ముహూర్తం: పగలు 08:34 నుండి 09:24 వరకు తిరిగి రాత్రి 11:10 నుండి 11:56 వరకు.
రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.
యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 17*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 17*
*ప్రగాఢ ధ్యానాభ్యాసం*
భగవంతుడంటూ ఒకరు ఉండివుంటే నిశ్చయంగా ఆయన నిజమైన ప్రార్థనలను ఆలకించి భక్తునికి దర్శనమిస్తాడు; ఆయన సాక్షాత్కారం పొందడానికి ఏదో ఒక మార్గం ఉండితీరాలి; అలా లేకపోతే జీవితమే నిరర్థకమని నరేంద్రుని గట్టి నమ్మకం. కాని అలాంటి భగవన్మార్గాన్ని బోధించడంలో బ్రహ్మసమాజం అనుకూలమైనది. కాదని కొద్ది రోజుల్లోనే నరేంద్రుడు గ్రహించకపోలేదు.
సత్యాన్ని తెలుసుకోవాలి; భగవత్సాక్షాత్కారం పొందాలనే తపనతో ఒక క్రొత్త పద్ధతిలో ధ్యానాభ్యాసం ప్రారంభించాడు. భగవంతుణ్ణి సాకారునిగా తలచినా, నిరాకారునిగా ఎంచినా మానవ రూపాన్నీ, గుణాలనూ స్వీకరించకుండా మనం ఆయనను ధ్యానించలేం. దీనిని గ్రహించడానికి మునుపు నరేంద్రుడు బ్రహ్మ సమాజ పద్ధతి మేరకు భగవంతుణ్ణి నిరాకార సగుణ బ్రహ్మంగా ధ్యానించేవాడు. ఇదీ ఒక రకమైన కల్పనగా నిర్ధారణ చేసిన నరేంద్రుడు ఆ ధ్యాన పద్ధతిని విడిచిపెట్టి, "భగవంతుడా! నీ నిజస్వరూప దర్శనానికి నన్ను అర్హుణ్ణి చేయి" అంటూ ప్రార్థించాడు.
ఆ తరువాత మనస్సును ఆలోచనారహితం చేసి, గాలిలేని చోట వెలిగే దీపశిఖలా మనస్సును నిశ్చలంగా ఉంచడానికి అభ్యాసం చేయసాగాడు. ఈ రీతిలో కొంతకాలం అభ్యసించిన తరువాత అతడి మనస్సు పూర్తిగా శాంతించింది. కొన్ని సమయాలలో దేహభావన, కాల భావన కూడా అతడికి మృగ్యమవడం కద్దు. ఇంట్లో అందరూ నిద్రించడానికి పోగానే, అతడు తన గదిలో ఈ తీరులో ధ్యానించేవాడు. అనేక రాత్రుళ్లు ధ్యానంలోనే గడచిపోయేవి.
ఆ కారణంగా ఒక రోజు నరేంద్రునికి అసాధారణమైన అనుభవం ఒకటి కలిగింది. ఆతడు ఇలా అన్నాడు: "ఏ ఆధారమూ లేకుండా మనస్సును ఏకాగ్రం చేసి స్థిరంగా నిలిపితే, మనస్సులో ఒక రకమైన ప్రశాంతతతో కూడుకొన్న పరమానందం జనిస్తుంది. ధ్యానానంతరం కూడా చాలాసేపు ఆ పరమానందపు మత్తు కొనసాగుతుంది. కనుక ఆసనాన్ని విడిచిపెట్టి వెంటనే లేవడానికి మనస్కరించదు.” అలాంటి ధ్యానానందాన్ని చవిచూడసాగాడు నరేంద్రుడు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹