🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*>>>>>>>>>>>ఓం<<<<<<<<<<<*
శ్రీ కాళహస్తీశ్వర శతకం - 71
సులభుల్మూర్ఖులనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ నన్నలంతలబెట్టిన నీ పదాబ్ధములఁ బాయంజాల నేమిచ్చినం
గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గాపుండు టబ్జంబు పైఁ
జెలువొప్పున్ సుఖియింపఁ గాంచుట సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీ కాళహస్తీశ్వరా! లోకమునందలి రాజులు సులభులు. వారి సేవ అశ్రమముగనే లభించును. వీరు మూర్ఖులు, జ్ఞానహీనులు, అహంకారాది దోషములు కలవారు, అనుత్తమోత్తములు, నీచులందరిలోను గొప్పవారు, పరమనీచులు.
అట్టివారిని నేను సేవించను. ఆ కోపముతో వారు నన్ను ఎన్ని బాధలు పెట్టినను లెక్కపెట్టను.
విశిష్ట లక్షణములతో దుర్లభుడవు, సర్వజ్ఞుడవు, అహంకారాది దోషములు లేనివాడవు అగు నీ పాదపద్మములను వదలను. వారు ఏమిచ్చినను నాకు దానితో పని లేదు.
నీవు ఏమి ఇచ్చినను దానిని నేను వెండికొండను పాలించుటగా, అంబునిధిలో కాపురముండుటగా మరియు పద్మమునందు చక్కగా సుఖించుచుండుటగా భావించి ఆనందింతును.
ఓం నమః శివాయ
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి