22, ఆగస్టు 2023, మంగళవారం

దనుజ వన కృశానుం అర్థం

 దనుజ వన కృశానుం అర్థం ఏమిటి?


కృశాను అంటే అగ్ని .

దనుజ వనం అంటే రాక్షసులు అనే అడవి.

వనం (అడవి )విచ్చలవిడిగా అదుపు లేకుండా పెరిగేది. దాన్ని దావాగ్ని ఒకటే నిగ్రహించగలదు.

అడవిని దావాగ్ని సర్వ నాశనం చేస్తుంది. అలాగే హనుమ రాక్షసులను నాశనం చేసే వాడు —

దనుజులు అనే వనానికి కృశానుని వంటి వాడు . భయంకరుడు/ నాశకుడు.

దనుజ వన కృశానుం—(ద్వితీయా విభక్తి రూపం).= హనుమను .

అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహం

దనుజ వన కృశానుం జ్ఞానినాం అగ్రగణ్యం

సకల గుణ నిధానం వానరాణాం అధీశం

రఘుపతి వరదూతం వాతజాతం నమామి..

తులసీ దాసు రామచరిత మానస్ లో ప్రతి కాండ మొదట నాలుగైదు సంస్కృత శ్లోకాలు వ్రాశాడు . ఇది సుందర కాండ మొదట్లో ఉన్న శ్లోకాలలో ఒకటి.

హనుమను (కు) నమస్కరిస్తున్నాను.

కామెంట్‌లు లేవు: