17, ఏప్రిల్ 2024, బుధవారం

Joke










 

Panchaag


 

కర్మ సిద్ధాంతం

 _*కర్మ సిద్ధాంతం - వాచికమైన పాపాలు*_ 


ఎప్పుడూ ఒకరిలో దోషాలు ఎంచకూడదు, తీర్పులు చెప్పకూడదు. 

ఈ లోకంలో పెద్దపాపం ఏదైనా ఉందంటే అది ఇతరులలో దోషాలు ఎంచడమే,  "తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరూ విశ్వదాభి రామ వినుర వేమ" అనే పద్యం కూడా మనం చదువుకున్నాము. 


మనం సరిగ్గా ఉన్నామా, లేదా అనేది ముఖ్యం. 

ఈ లోకంలో ఎవ్వరిని సరి చేయడానికి మనం రాలేదు, నిరంతరం మనల్ని మనం విశ్లేషించుకుని, మనలోని తప్పుల్ని సరిదిద్దుకోవాలి, ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలి.


ఇతరులలో దోషాలెంచితే, వారు చేసిన పాపంలో మనకూ భాగం సంక్రమిస్తుంది.  


జీవుడు చేసిన పాపాలను లెక్కగట్టే పని చిత్రగుప్తునిది. గుప్తంగా (రహస్యంగా) చిత్రంగా మన పాపపుణ్యాలను లెక్కగడతాడు గనక ఆయన్ను చిత్రగుప్త అన్నారు. 


మనలోని సూక్ష్మశరీరమే చిత్రగుప్తుడని ఒక సంప్రదాయం చెబితే, అది చిత్రగుప్తుని అంశ అని ఇంకో సంప్రదాయంలో చెబుతారు. 

అందుకే ఆయనలో మనలోనే ఉంటూ, అన్నిటినీ నమోదు చేసుకుంటాడు, దేన్నీ వదలడు.


ఇతరుల దోషాలను ఎత్తి చూపడమే పనిగా పెట్టుకున్నవాడిని ఈశ్వరుడు అస్సలు వదిలిపెట్టడు, ఏ మాత్రం కనికరం చూపడు. 

పైగా అది బోలెడు పాపాన్ని తెచ్చిపెడుతుంది. 


ఒక్క గురువుకు మాత్రమే తన శిష్యుల లోపాలను ఎత్తి చూపే అధికారం ఉంది, అది గురువు యొక్క కర్తవ్యం కూడా.  


పైగా చాలామంది చేసే పని ఏంటంటే, వాళ్ళు తీర్పులు చెప్పడమే గాక, పక్కన ఉన్న సహచరులతో అవును కదా? ఏమంటావు? వాడు అలాంటి వాడే కదా? అంటూ వానితో కూడా చెప్పించి, వానికి ఆ పాపంలో వాటా ఇస్తాడు.  


అయినా ఎవరు ఎలా పోతే మనకెందుకు? మన సమస్యలే మనకు బోలేడు ఉంటాయి, కొత్త ప్రారబ్దాలెందుకు? అందరిని అన్నీ అనేసి, చేయాల్సినవన్నీ చేసేసి చివర్లో 

క్రూరకర్మములు నేరక జేసితి నేరము లెంచకు రామా

దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా ||

అని రామదాసుగారి కీర్తన పాడితే రాముడు వచ్చి కాపాడడు సరికదా గట్టి శిక్ష వేస్తాడు.


సాధుసంతులు, సన్యాసులు, గురువులు, కర్మయోగులను ఏనాడు విమర్శించరాదు. పొరపాటున కూడా వారిని నిందించకూడదు.


నిత్యవ్యవహారంలో కర్మ చేసే సమయంలో అందరికీ పొరపాట్లు దొర్లుతాయి. 

ఆ పొరపాట్ల వలన ఉద్భవించిన పాపం తమ స్వధర్మాలను నిష్ఠగా పాటించే మహాపురుషులకు అంటదు. అది ప్రకృతి యందు నిలిచి ఎవరిని చేరుదామా అని ఎదురు చూస్తూంటుంది.


ఎవరైతే సాధుసంతులను, సన్యాసులను, యోగులను విమర్శిస్తారో వారికి ఆ పాపం సంక్రమిస్తుంది.    


కర్మయోగి అనే మనం ఒక వ్యక్తిని పిలిచినంత మాత్రం చేత అతడు కర్మయోగి కాజాలడు. 

అలాంటి బిరుదు లేనంత మాత్రం చేత, కర్మయోగాన్ని నిష్ఠగా పాటించే వ్యక్తి కర్మయోగి కాకుండా పోడు. 

అలాంటి గొప్ప వ్యక్తి అందరికి తెలియాల్సిన అవసరంలేదు, మౌనంగా తన పని తాను చేసుకుంటూ, అతి సామాన్యునివలే సాధారణ జీవనం గడపవచ్చు. 

అలాంటి వారిని నిందించినా, వారి మీద ఆరోపణలు చేసినా, వారు చేసిన కర్మల్లో దోషాల కారణంగా ఏర్పడిన పాపం నిందించినవానిని జేరుతుంది. అది అతడి వంశాన్ని నాశనం చేస్తుంది.  


ఇటువంటి మరో ఘోరమైన కర్మ - ఉపాసకులను, భగవత్భక్తులు, భాగవతోత్తములు, వేదవిదులను, సద్బ్రాహ్మణులను నిందించడం. 

తెలిసి గానీ, తెలియకగానీ అటువంటివారి దరిదాపుల్లోకి చెడు భావనతో వెళ్ళరాదు. వారిని బాధిస్తే, వారు శపించకున్నా, అనేక దైవశక్తుల శాపాలు చుట్టుకుంటాయి.


ఇతరల లోకాల్లో ఉన నిందిచినవాని పితృదేవతలు ఏడుస్తారు. 

వాటిని ఏ యోగి/ గురువు నిర్మూలించలేడు, ఆ పాపాన్ని అనుభవించడం తప్ప పరిహారం వేరే లేదు. 

అది ఆ వంశాన్ని, ఆ జీవుడిని అధోగతి పాలు జేస్తుంది.


ఇవన్నీ అజ్ఞానంతో, అరిషడ్వర్గాలకు లోనై మానవులు చేసే తీవ్రమైన కర్మల్లో కొన్ని.


ఇవన్నీ వాచికమైన పాపాలు అనగా వాక్కు ద్వారా చేసేవిగా చెప్పబడతాయి.

శ్రీ రామ నవమి

 అందరికీ అందరికీ శ్రీ రామ నవమి పర్వ శుభాకాంక్షలు.🙏🙏🙏


ఉత్పలమాల

నాశము జేసెనంట ముని నాథుని యాగ విఘాత దానవా

ధీశుని భృత్యులందరను, తేకువ తోడను పట్టి ద్రుంచె గౌ

రీశుని విల్లు నీ నృపవరేణ్యుడు, శ్యామల మేఘ శ్యాము డే

లేశము నొవ్వ నొందకవలీలగ, చూడగ వీడు నిక్కమా

కేశవు డౌను, తక్కురుల కేవిధి శక్యము నిట్టి కార్యముల్. 🙏🙏🙏


(సీతా కళ్యాణ వేళలో, శ్రీ రామ చంద్ర మూర్తిని చూసిన మిథిలా నగర వాసుల మనోభావన)

🌷🙏🌷🙏🌷🙏🌷


చంపకమాల

వరములు పొంది దానవులు బాధలు పెట్టుచు భూమి కండ కా

వరమున రేగగా శరపు వర్షము చిమ్ముచు జీల్చి చెండు నీ

పరమ ప్రతాప తేజముల ప్రస్తుతి చేయ నశక్యమేరికిన్,

శిరమును మోడ్చి సన్నుతిని జేతుము గావు జగంబు రాఘవా !! 🙏🙏


🌷🙏🌷🙏🌷🙏🌷


శ్రీ రామ చంద్ర స్వామికి నా ప్రణుతి విన్నపం 🙏🙏


ఉత్పలమాల

వేదన నొంది నంత్యమున బేలగు తండ్రిని వీక్ష సేయకే

గాదిలి సీత తోడుగను కానల కేగుచు ధర్మ రక్షకై,

ఆదర మొప్పఁగా గుహుని భ్రాతృ సమానుగ జేర్చి, మేటియౌ

సాదర ప్రీతి మోక్షమునొ సంగి జటాయువు కంత్య కాలమున్,

సోదర ప్రేమ పంచితివి శోకము బాపుచు సూర్య పుత్రుకున్,

నీదయ వేడు దాసుడను, నీ యెడ వీడని భక్తి నీయుమా !! 🙏🙏🙏


శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః     🙏🙏🙏

శ్రీ రామ జయ రామ జయ జయ రామ     🙏🙏🙏

శ్రీ రామ జయం     🙏🙏🙏 పర్వ శుభాకాంక్షలు.🙏🙏🙏


ఉత్పలమాల

నాశము జేసెనంట ముని నాథుని యాగ విఘాత దానవా

ధీశుని భృత్యులందరను, తేకువ తోడను పట్టి ద్రుంచె గౌ

రీశుని విల్లు నీ నృపవరేణ్యుడు, శ్యామల మేఘ శ్యాము డే

లేశము నొవ్వ నొందకవలీలగ, చూడగ వీడు నిక్కమా

కేశవు డౌను, తక్కురుల కేవిధి శక్యము నిట్టి కార్యముల్. 🙏🙏🙏


(సీతా కళ్యాణ వేళలో, శ్రీ రామ చంద్ర మూర్తిని చూసిన మిథిలా నగర వాసుల మనోభావన)

🌷🙏🌷🙏🌷🙏🌷


చంపకమాల

వరములు పొంది దానవులు బాధలు పెట్టుచు భూమి కండ కా

వరమున రేగగా శరపు వర్షము చిమ్ముచు జీల్చి చెండు నీ

పరమ ప్రతాప తేజముల ప్రస్తుతి చేయ నశక్యమేరికిన్,

శిరమును మోడ్చి సన్నుతిని జేతుము గావు జగంబు రాఘవా !! 🙏🙏


🌷🙏🌷🙏🌷🙏🌷


శ్రీ రామ చంద్ర స్వామికి నా ప్రణుతి విన్నపం 🙏🙏


ఉత్పలమాల

వేదన నొంది నంత్యమున బేలగు తండ్రిని వీక్ష సేయకే

గాదిలి సీత తోడుగను కానల కేగుచు ధర్మ రక్షకై,

ఆదర మొప్పఁగా గుహుని భ్రాతృ సమానుగ జేర్చి, మేటియౌ

సాదర ప్రీతి మోక్షమునొ సంగి జటాయువు కంత్య కాలమున్,

సోదర ప్రేమ పంచితివి శోకము బాపుచు సూర్య పుత్రుకున్,

నీదయ వేడు దాసుడను, నీ యెడ వీడని భక్తి నీయుమా !! 🙏🙏🙏


శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః 🙏🙏🙏

శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏🙏🙏

శ్రీ రామ జయం 🙏🙏🙏

తీవ్రమైన గ్యాస్ సమస్య

 తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం  -


    ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.


      వాము  250 గ్రాములు .


      జీలకర్ర  250 గ్రాములు .


      ధనియాలు  250 గ్రాములు . 


         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.


            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.


  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు  -


  పాటించవలసిన నియామాలు  -


      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .


 పాటించకూడనివి  -


       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం 


          పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.


  

 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

భూమియందు జలధారలు

 భూమియందు జలధారలు కనుగొను విధానం  - 


 *  బావిలో నీరు ఉప్పగా ఉండినను , బురదగా లేదా వగరుగా , దుర్గన్ధముగా ఉండినచో మద్దిచెట్టు బెరడు , తుంగ గడ్డలు , వట్టివేళ్లు , శొంఠి , బీర విత్తులు , ఉశిరిక పొట్టు , చిల్లగింజలు తీసుకుని మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని బావినీటిలో కలిపిన ఆ బావినీరు తియ్యగా , శుభ్రముగా తయారగును. బావి వొడ్డున ఉశిరిక చెట్టు వేసినను బావినీరు తియ్యగా ఉండును. 


 *  మనిషి శరీరమున సిరలు ఏవిధముగా రక్తమును తీసుకువెళ్లే విధముగా ఉండునో అదేవిధముగా జలనాడులు భుమియందు ఉండును. ఈ జలనాడులు పెద్దవి మరియు చిన్నవిగా ఉండును. 


 *  పాతాళం నుండి పైకి వచ్చు జలనాడులను మహ సిరలు అనగా పెద్దగా జలతో కూడిన నాడులు అని అర్థం. దక్షిణదిశ , పశ్చిమ దిశ , ఉత్తరదిశ నుండి వచ్చు నాడులు శుభప్రధములు . ఆగ్నేయ , నైఋతి , వాయువ్య దిశల నుండి జలనాడులలో జల స్వల్పంగా ఉండును. 


 *  నిర్జల ప్రదేశము నందు నీరు ప్రబ్బలి చెట్టు ఉన్న దానికి పడమర దిశలో మూడు మూరల దూరము నందు ఒకటిన్నర  పురుష ప్రమాణం నందు పశ్చిమదిశ నుండి వచ్చు జలనాడి ఉండును.  ముందుగా తెల్లటి కప్పు వచ్చును. ఆ తరువాత బండ వచ్చును. ఆ బండని చేధించిన పిమ్మట జలం ఉండును. 


 *  పురుష ప్రమాణం అనగా 120 అంగుళములుగా లెక్కలోకి తీసికొనవలెను. మరికొన్ని గ్రంథాలలో పురుషుడు నీటిలోకి దుమికెప్పుడు తన చేతులను పైకి ఎత్తునప్పుడు 120 అంగుళములు ఉన్నచో దానిని పురుషప్రమాణముగా నిర్ధారించుకొనవలెను . 


 *  నిర్జల ప్రదేశము నందు నేరేడు చెట్టు ఉన్నచో ఆ నేరేడు చెట్టుకు ఉత్తర దిశకు మూడు మూరలు దూరములో రెండు పురుష ప్రమాణంలో తవ్విన తూర్పు దిక్కు నుండి వెలువడు ఐంద్రి అను పేరుగల జలనాడి ఉండును. అందులో ఇనుపవాసన కలిగిన మృత్తిక ( మట్టి ) , తెల్లని కప్ప ఉండును. 


 *  తోయరహిత ప్రదేశము నందలి నేరేడు చెట్టునకు తూర్పు దిశ యందు పుట్టయున్నచో దానికి సమీప దక్షిణ పార్శ్వమున రెండు పురుష ప్రమాణములు తవ్విన అందు మధుర జలం ఉండును. తవ్వు సమయమున అర్థ పురుష ప్రమాణం నందు ఒక చేప , పావురపు రంగు గల బండ , నల్లని మట్టి దాని క్రింద జలం ఉండును  . 


 *  జలహీన ప్రదేశము నందు అత్తిచెట్టు ఉన్నచో దానికి పడమట మూడు మూరల దూరంలో రెండున్నర పురుష ప్రమాణములు తవ్విన అందు ఒక పురుష ప్రమాణంబున తెల్లని సర్పము , నల్లని రాయి ఆ క్రింద తూర్పు దిశ నుండి మధురజలం స్రవించెడి జలనాడి ఉండును. 


 *  నిర్జల ప్రదేశము నందలి నల్లవావిలి చెట్టుకు పుట్ట చుట్టుకుని ఉన్న దానికి దక్షిణ దిశ యందు మూడు మూరల దూరమున రెండుంబాతిక పురుష ప్రమాణము తవ్విన ఎన్నటికి ఎండిపోని జలనాడి ఉండును. అందు అర్థ పురుష ప్రమాణమున  ఎర్రని చేప , దాని క్రింద కపిల వర్ణము గల మృత్తిక దాని క్రింద తెల్లని మృత్తిక దాని క్రింద ఇసుకయు ఆ క్రింద సున్నపు రాళ్ళను దాని క్రింద ఉదకము ( నీరు ) ఉండును . 


 

 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

సూర్య తిలకం

 *'సూర్య తిలకం' కోసం ప్రత్యేక టెక్నాలజీ*


అయోధ్య లో ఇవాళ మ. 12 గంటలకు సూర్య కిరణాలు బాలరాముడి నుదుటిపై ప్రసరించనున్నాయి. 


దీని కోసం CSIR ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది.


 రామమందిరం 3వ అంతస్తు నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలోని విగ్రహం వరకు ఏటా రామనవమి రోజు ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాలు అమర్చారు.


 వీటిలో ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్తు వాడలేదని CBRI తెలిపింది.

రామాయణం ఎందుకు చదవాలి

 


శ్రీభారత్ వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🌹 మళ్లీ మళ్లీ రామాయణం ఎందుకు చదవాలి? అనే ప్రశ్నకు ప్రముఖ సాహితీవేత్త డా. టి. గౌరీశంకర్ గారు ఎంత చక్కని సమాధానం ఇచ్చారో వినండి. కొడుకుగా, సోదరునిగా, భర్తగా, పాలకునిగా, సేవకునిగా, శిష్యునిగా జీవితం లోని ప్రతి దశలోను ఎలా నడుచుకోవాలో తాను ఆచరించి చూపినవాడు శ్రీరాముడు. అందుకే ఆయన అవతారమూర్తి కాదు.. ఆదర్శమూర్తి అంటారు. ఇన్ని వేల ఏళ్లు గడిచినా ఆదర్శ పురుషుడుగా అందుకే రాముడినే చెప్పుకుంటాం. ఎంత రమణియం రామకథ! ఆ విశేషాలు వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

పంచముఖి గణేశ ఆలయo

 🕉 మన గుడి : నెం 290


⚜ *కర్నాటక  :  బెంగళూరు*


⚜ *శ్రీ పంచముఖి గణేష ఆలయం*



💠 బెంగళూరు-మైసూర్ హైవేపై ఉన్న పంచముఖి గణేశ దేవాలయం బెంగళూరులోని అత్యంత ప్రసిద్ధ గణేశ దేవాలయాలలో ఒకటి . ఈ ఆలయం పైకప్పుపై ఏర్పాటు చేసిన భారీ గణేశ విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. 

ఈ విగ్రహం యొక్క విశేషమేమిటంటే, ఈ విగ్రహం ఐదు ముఖాలను కలిగి ఉండటం వల్ల ఆలయానికి "పంచ ముఖి" అని పేరు వచ్చింది, అంటే ఐదు ముఖాలు. 


💠 బెంగుళూరు -మైసూర్ హైవేలో ప్రయాణించే వారికి ఈ ఆలయం దూరం నుండి అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. 

దీని సముదాయం శాంతియుతంగా ఉంటుంది మరియు భక్తులు తమ నివాళులర్పించేందుకు వచ్చేందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది.


 

💠 పంచముఖి గణేష్ ఆలయం గణేశుడికి అంకితం చేయబడింది.  

ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద పంచముఖి గణపతి విగ్రహం ఉంది.

ఈ ఆలయంలో ఐదు తలల గణేశుడి విగ్రహం ఉంది, అందుకే దీనికి పంచముఖి గణేశుడు అని పేరు.  

ఇక్కడ అతని వాహనం సాధారణ మూషిక వాహనం కంటే భిన్నంగా ఉంటుంది.  

ఇక్కడ, అతని వాహనం ఒక సింహం 

వినాయకుడి తలలు ఒక్కొక్కటి ఒక్కో దిశలో ఉంటుంది. 


💠 ఆలయ ప్రధాన గోపురంలో 4 దిక్కులకు ఎదురుగా కూర్చున్న వినాయకుడి 4 విగ్రహాలు ఉన్నాయి మరియు ఈ 4 గణేశ విగ్రహాల 

పైన కేవలం తల మాత్రమే ఉంచబడిన 5 వ వినాయకుడు తూర్పు ముఖంగా ఉన్నాడు. 

ఈ ప్రత్యేక రూపం కారణంగా ఈ ఆలయాన్ని మహామేరు పంచముఖ గణేష్ ఆలయం అని కూడా పిలుస్తారు.


💠 పంచముఖి గణేశ దేవాలయం ద్రావిడ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. 

ఆలయం మేరు చక్రం రూపంలో ఉంటుంది. మేరు రూపంలో రూపొందించబడినందున ఆలయాన్ని మహామేరు పంచముఖ గణేశ దేవాలయం అని కూడా పిలుస్తారు.


💠 పంచముఖ గణేష్ యొక్క ప్రతి తల మానవుల సూక్ష్మ శరీర నిర్మాణ శాస్త్రంలో పంచ కోశాన్ని (పంచకోశ) సూచిస్తుంది.


1. అన్నమయ కోశ / అన్నమయ కోశ:-

పదార్థంతో చేసిన మాంసపు శరీరం.


2. ప్రాణమయ కోశ / ప్రాణమయ కోశ :-

 ఇది కీలకమైన శక్తి మరియు ఇది సూక్ష్మ శరీరం, నాడిలు, చక్రాలు మరియు కుండలిని సూచిస్తుంది.


3. మనోమయకోశ / మనమయ కోశ : -

ఇది మనస్సు మరియు అవగాహన యొక్క అవయవాలను సూచించే మానసిక కోశం


4. విఘ్న్నమయకోశ / విజ్ఞానమయ కోశ :-

ఎగువ స్పృహ యొక్క శరీరం. 

ఇది తెలివిని సూచించే జ్ఞాన కోశం, వివక్ష చూపే, నిర్ణయించే లేదా సంకల్పించే ప్రతిభ.


5. ఆనందమయకోశ / ఆనందమయ కోశ : -

 కాస్మిక్ బ్లెస్ యొక్క శరీరం. 

అందువలన, గణేష్ యొక్క ఐదవ తల సత్-చిత్-ఆనంద అని పిలువబడే అత్యున్నత స్థాయి యోగ అనుభవాన్ని సూచిస్తుంది.


💠 అద్భుతమైన శిల్పకళతో కూడిన ఆలయం నేలమట్టం నుండి 30 అడుగుల గోపురంతో బంగారు రంగుతో పూత పూయబడింది. 


💠 పంచముఖి గణేశ దేవాలయం గర్భగుడిలో పంచముఖి గణేశుడి ఆరు అడుగుల నల్లరాతి విగ్రహం ఉంది.

గర్భగుడి పైకప్పులపై వినాయకుని 32 రూపాలు అందంగా చెక్కబడ్డాయి.

ఇక్కడ శివుడు, అయ్యప్ప, పార్వతికి ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. 

బయటి అంతస్తు మట్టి పలకలతో, ఆలయ లోపలి భాగం పాలరాతి రాళ్లతో నిర్మితమైంది.


💠 ఆలయం లోపల చిన్న పాలరాతి & కాంక్రీటు నీటి చెరువులు ఉన్నాయి. 

ఆలయం చుట్టూ కాంక్రీట్ నీటి చెరువు కూడా ఉంది, ఇది ప్రత్యేకమైనది.  వెలుపలి భాగం మట్టి పలకలతో మరియు ఆలయం లోపలి భాగం పాలరాతి రాళ్లతో నిర్మించబడింది.


🔆 ఆచారాలు మరియు పండుగలు


💠 రోజువారీ ఆచారాలు:

స్వామికి అభిషేకంతో పాటు ఉదయం పూజ మరియు అర్చన. వివిధ రకాల సేవలు (అర్పణలు మరియు సేవలు) నిర్వహించబడతాయి.

సత్యనారాయణ స్వామి పూజ ప్రతి పూర్ణిమ (పౌర్ణమి) నాడు నిర్వహిస్తారు.


🔆 ప్రధాన పండుగలు:


💠 గురు పూర్ణిమ - 

ఈ పండుగను సాంప్రదాయకంగా హిందువులు, బౌద్ధులు మరియు జైనులు తమ గురువులను గౌరవించటానికి మరియు వారి కృతజ్ఞతలను తెలియజేయడానికి జరుపుకుంటారు. 

ఈ పండుగను ఆషాఢ మాసంలో (జూన్-జూలై) లో పౌర్ణమి రోజు ( పూర్ణిమ ) జరుపుకుంటారు.


సంకష్ట చతుర్థి - 

గణేశుడికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. హిందూ క్యాలెండర్‌లోని ప్రతి కృష్ణ పక్షంలో 4వ రోజున ఇది గమనించబడుతుంది .

గణేశ చతుర్థి అనేది గణేశుని జన్మదినాన్ని జరుపుకునే హిందూ పండుగ. ఇది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో వస్తుంది.


💠 పంచముఖి గణేశ ఆలయ సమయాలు :

ప్రతిరోజూ ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మరియు సాయంత్రం 6:00 నుండి రాత్రి 8:30 వరకు.


💠 ఎలా చేరుకోవాలి: 

కెంగేరిలోని పంచముఖి దేవాలయం కెంగేరి ప్రధాన బస్టాండ్ నుండి 2 కి.మీ దూరంలో ఉంది.  బనశంకరి, జయనగర్ మరియు మార్కెట్ నుండి కెంగేరికి చేరుకోవడానికి అనేక బస్సులు ఉన్నాయి.  

ఆలయానికి చేరుకోవడానికి కెంగేరి బస్టాండ్ నుండి ఆటోలో వెళ్లడం మంచిది.

బెంగళూరు నగరం నుండి అరగంట ప్రయాణం.

అవశ్యం అనుభోక్తవ్యం

 *అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్*

```

తా॥ పుణ్యపాప రూపకర్మను ఎవరు చేసినా దానిని వారు తప్పక అనుభవించి తీరాల్సిందే!


కార్యకారణముల గొలుసే కర్మ. మనం చేసే పనేకాదు, చేయాలనే ఆలోచన, దాని ఫలితం కూడా అనుసరించి వస్తుంది.


కర్మలు మూడు విధాలు ‘సంచితం, ప్రారబ్ధం, ఆగామి’. ఇంతకు ముందు అనాది జన్మలలో ఆర్జించిన కర్మను ‘సంచితం’ అంటారు.


ఇందులోంచి ఈ జన్మలో ఈ శరీరముతో అనుభవించేదంతా ‘ప్రారబ్ధం.’


ఈ జన్మలో చేసినది వెనక నిలువలో కలిసి రాబోవు జన్మలో అనుభవించ వలసినది ‘ఆగామి’


మామిడి పళ్ళ కాపు నుండి పండిన మామిడి పండ్లను తీసి ఇచ్చినట్లుగా, భగవంతుడు ప్రతి జీవికి వాని కర్మానుగుణంగా పరిపక్వమైన  కర్మలను తీసి ఏడు జన్మలకు కేటాయిస్తాడు. 


ఏ కర్మఫలమును ఎప్పుడు ఏ విధంగా అనుభవించాలో నిర్ణయించేది భగవంతుడే!


గత జన్మలలో చేసిన పుణ్యకర్మల ఫలములు ఈ జన్మలో అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టే, ఈ జన్మలో సుఖం అనుభవిస్తున్నాడు. 


గత జన్మలలో చేసిన పాపకర్మలు, ఈ జన్మలో అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టే ఇప్పుడు మానవుడు కష్టాలుపడుతూ, కన్నీళ్ళ పాలవుతున్నాడు.


అందుచేత చేసే ప్రతి మంచి పని ఆ భగవంతుడే చేయిస్తున్నాడనీ, ఆ పని ఫలితం ఏదైనా అతనికే చెందుతుందని, బాధ్యత అంతా అతడిదేనని, తాను భగవంతుడి చేతిలో ఒక పని ముట్టు మాత్రమే అని దృఢంగా విశ్వసించి భగవత్, భాగవత (భక్త), ఆచార్య కైంకర్య రూపంగా అన్ని పనులూ చేయాలి.


భగవంతుడే అనుగ్రహించి కావలసినవన్నీ తానే ఇచ్చి, పూర్వకర్మలను అన్నింటిని తొలగించి, తనతో చేర్చుకుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మాధవసేవగా సర్వప్రాణికోటి సేవ చేయడమే మనిషికి భగవంతుడు అనుగ్రహించే వరం.


అదే మానవ జన్మకు సార్ధకత.!```

Kasi photo