*దైవేచ్ఛ...!!*
మనం ఏదైనా పని చేయ తలపెడతాం.
ఆ కార్యాన్ని సాధించడంలో మనం సఫలీకృతులమైతే ఆ విజయం మన ప్రతిభేనని చెప్పుకుంటాం.
అదంతా మన ఘనతేనని చాటుకుంటాం.
అదే విఫలమైతే దానికి కారణం ఇతరుల పైన నెడతాం.
లేదా ప్రతికూల పరిస్థితులు అంటాం.
భగవంతుడికి మన మీద దయ లేదు, అది మనకు వ్రాసి పెట్టలేదు అని ఆ వైఫల్యాన్ని భగవంతుడి మీదకు తోసేస్తాం....
అంతే కాని ఆ వ్రాసిపెట్టడమనేది మన పూర్వ జన్మ కర్మల ఫలితమేననీ, అంతా దైవేచ్ఛ అని మాత్రం అనుకోం.
అలా అనుకుంటే మనకు ఖేదమోదాలుండవు...!!!
అది ఎలా ??? ఓ చిన్న కథ ద్వారా తెలుసుకొందాము!!...
ఓ ఊళ్ళో ఓ పేదవాడుండేవాడు...
అతడు కూటికి పేద అయినా అతనిలో భక్తికి మాత్రం లోటు లేదు.
కూలీ, నాలీ చేసి వచ్చినదానితో సంతృప్తి చెందుతూ సంతోషంగా జీవనయానం సాగిస్తుండేవాడు.
అలా ఆ ఊళ్లోవాళ్ళందరికీ అతడంటే అభిమానం ఏర్పడింది.
“దైవేచ్ఛ వల్ల నాకు ఈరోజు పని దొరికింది, దైవేచ్ఛ వల్ల నేను ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలిగేను "...
" దైవేచ్ఛ వల్ల నేను ఈ రోజు ఇంత సంపాదించ గలిగేను.”
ఇలా అన్నీ దైవేచ్ఛ వల్లే అనుకుంటూ ఉండే వాడు.
ఓ రోజు రాత్రి భగవన్నామస్మరణ చేస్తూ ఇంటి బయట కూర్చున్నాడు, ఇంతలో కొంత మంది దొంగలు అటు వస్తూ వాళ్లకు మూటలు మోయడానికి ఓ మనిషి కావలిసివచ్చి ఈ పేదవాడ్ని లాక్కెళ్ళి పోయేరు.
అలా తీసుకెళ్ళి వాళ్ళు ఒక ఇంటిలో దొంగిలించిన నగల మూటను వాడి నెత్తి మీద పెట్టి తమతో రమ్మన్నారు.
ఇంతలో అటువైపు రాజభటులు రావడం చూసిన ఆ దొంగలు పారిపోయేరు...
రాజభటులు నెత్తిన మూటతో ఉన్న ఆ పేదవాడ్ని చూసి వీడే దొంగ అని తీసుకుని పోయి కారాగారంలో బంధించారు...
మర్నాడు విచారణకు అతడిని రాజు గారి వద్దకు తీసుకొచ్చేరు.
ఈ విషయం తెలిసి ఆ ఊళ్లోవాళ్ళందరూ వచ్చి రాజుగారితో..
“ప్రభూ! ఇతను మాకందరికీ తెలుసు, చాలా మంచివాడు, గొప్ప భక్తుడు కూడా, దొంగ కాదు ” అని చెప్పేరు.
అది విని ఆ రాజుగారు పేదవాడితో.. “నువ్వు చెప్పుకోవలసిందేమైనా ఉందా..?“ అని అడిగితే..
దానికి ఆ పేదవాడు “ప్రభూ! దైవేచ్ఛ వల్ల నేను రాత్రి ఇంటిబయట కూచున్నాను...
దైవేచ్ఛ వల్ల దొంగలు అటుగా రావడం జరిగింది.
దైవేచ్ఛ వల్ల వాళ్ళు నన్ను తమవెంట తీసుకుపోయేరు,
దైవేచ్ఛ వల్ల వాళ్ళు దొంగిలించిన నగలమూటను నా నెత్తిన పెట్టేరు.
దైవేచ్ఛ వల్ల మీ భటులు నన్ను దొంగనుకుని కారాగారంలో బంధించేరు.
దైవేచ్ఛ వల్ల ఇప్పుడు నేను మీవద్దకు విచారణకు తీసుకురాబడ్డాను.
అంతా దైవేచ్ఛయే ప్రభూ!“ అని చెప్పేడు.
ఆ పేదవాడి భక్తినీ, అమాయకత్వాన్నీ చూసి రాజుగారు ఇతడు దొంగ కాదని చెప్పి వదిలేసేరు...
చూసేరా! ఆ పేదవాడు అంతా దైవేచ్ఛయే అనుకుంటుండడాన్ని తనను దొంగలు తీసుకెళ్ళినప్పుడు అతనిలో భయం గాని, తన నెత్తిన మూట పెట్టినప్పుడు జంకుగాని, రాజభటులు కారాగారంలో పెట్టినప్పుడు దుఃఖం గాని, విచారం గాని కలుగలేదు.
అంతా కూడా దైవ నిర్ణయమె, దైవేచ్ఛ యే... అనే భావం ఎప్పుడూ మనలో వుండాలి, అప్పుడే మనలని ఆ భగవంతుడు కంటికి రెప్పలా కాపాడుతుంటాడు...
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1.
*రామాయణం...*
*ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది.*
*వాల్మీకి రామాయణం*
➖➖➖✍️
*( 1వ భాగం )*
రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి, కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు, అదేంటంటే, "దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ ", నేను పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి, ఈ భూమండలాన్నంతటిని పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు.
అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందొ, అంత కాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లితండ్రుల దెగ్గర, సోదరుల దెగ్గర, గురువుల దెగ్గర, భార్య దెగ్గర ఎలా ఉండాలొ, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలొ రాముడిని చూసి నేర్చుకోవాలి.
యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.
ఎక్కడన్నా రామాయణం గూర్చి మాట్లాడుతుంటె స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు.
రామ అంటె లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు, ఇంతమందిని అడిగాను నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటె అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి, ఒక మనిషి తలుచుకుంటె ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరు రామనామం చెప్పాలి.
కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
రాముడి యొక్క ఆయనం(నడక) కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి సీతాయాశ్చచరితమ్ మహత్:, పౌలస్త్య వధ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు.✍️
రేపు...2వ భాగం...
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...9493906277
*ప్రసాదం - పరమార్థం*
➖➖➖✍️
అది 1993లో నంగనల్లూర్ లో ఆంజనేయ స్వామీ దేవస్థానం ప్రారంభం చేస్తున్న సందర్భం. దేవాలయం నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతున్నాయి.
చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. ఒకరోజు నేను పరమాచార్య స్వామివారి ఆశీస్సుల కొరకు వెళ్లాను. స్వామికి సాష్టాంగం చేసి నమస్కరించాను.
మహాస్వామివారు ఆశీర్వదించి నాతో ఇలా అన్నారు, *“ఇక్కడకు వచ్చే చాలా మంది భక్తుల ద్వారా విన్నాను దేవాలయానికి భక్తులు ఎక్కువగా వస్తున్నారు అని. చాలా పెద్ద విగ్రహం కదా స్వామివారి ఆకర్షణ శక్తి కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది”.*
నన్ను ఆశీర్వదించి ఎంతో వాత్సల్యంతో, *“ఆయన చాలా పెద్ద స్వామి కదా! మరి ఎక్కువ ప్రసాదం నివేదన చెయ్యాల్సి పడుతుంది కదా?”* అని అడిగారు.
నేను వెంటనే, *“ఒక పెద్ద సంచి బియ్యాన్ని వండి నివేదన చేస్తున్నాము పెరియవ”* అని బదులిచ్చాను.
*“ఉత్తి అన్నం మాత్రమేనా?”*
*“లేదు పెరియవ చిత్రాన్నాలు వంటివి చేసి నివేదిస్తాము”*
*“నివేదనకు ఏమేమి తయారు చేస్తుంటారు?”*
*“ఉదయం నుండి చాలా రకాలు తయారు చేస్తుంటాము. వెణ్ పొంగల్, బెల్లం పొంగల్, పులిహోర, మిరియాల అన్నం, పెరుగన్నం అలా వరుసగా చేస్తుంటాము పెరియవ”*
*“మరి వీటికోసం చాలా మంది భక్తులు వస్తుంటారు కదా!”*
కొంచం గర్వంతో, *“ప్రతిరోజూ చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు. ప్రసాదాలు ఏవీ మిగలవు”* అన్నాను.
మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. *“ప్రసాదాలు కొద్ది కొద్దిగా ఇస్తారా, ఎక్కువ మొత్తంలో ఇస్తారా?”* అని అడిగారు స్వామి.
అతిశయించిన గర్వంతో, *“ఒక పెద్ద ఆకులో ఎక్కువ ప్రసాదం ఇస్తాము పెరియవ”* అని అన్నాను.
*“ఇక్కడకు వచ్చే వారి వద్ద నేను ఈ విషయం విన్నాను. నిన్ను ఒక విషయం అడగదలచుకున్నాను. ప్రసాదాన్ని ప్రసాదం లాగా కొద్దిగా ఇవ్వాలా? లేక భోజనం లాగా ఎక్కువ ఇవ్వాలా?”* అని ఆత్రుతతో అడిగారు.
ఏమని సమాధానం చెప్పాలో తెలియక నిలబడ్డాను.
మహాస్వామివారు నవ్వుతూ, *“ఎందుకు అలా స్థాణువులా నిలబడిపోయావు? కేవలం నేను తెలుసుకోవడానికే నిన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాను”* అని అన్నారు.
కొద్దిగా సంశయిస్తూ వినయంగా, *“లేదు పెరియవ. భక్తులు ఎంతో దూరం నుండి ఇక్కడకు వస్తారు. బహుశా వారికి ఆకలిగా ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువ మొత్తంలో ప్రసాదాన్ని . . . ”* అని ఇంకా నేను ముగించకుండానే, స్వామివారు *“నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో నాకు అర్థం అవుతుంది. కాని నా ఉద్దేశ్యం ప్రసాదాన్ని ప్రసాదం లాగా తక్కువ మోతాదులో ఇవ్వాలి. ఆకలిగొన్న వారిని కూర్చుండబెట్టి వేరేగా భోజనం పెట్టాలి”* అని *“మన వేదాలు, శాస్త్రాల్లో ఎన్నో చెయ్యవలసినవి, చెయ్యకూడనివి నిర్దేశించబడి ఉన్నాయి. కొన్ని కేవలం మన స్వీయానుభావం వల్ల మాత్రమే అర్థం అవుతాయి”* అని ఇతమిత్తంగా ఏమి చెప్పకపోవడంతో, అర్థం కాక, *“నాకు ఈ విషయం అర్థం కాలేదు పెరియవ. ఏది సరైనది? ప్రసాదం కొంచం ఇవ్వాలా? ఎక్కువ ఇవ్వాలా? ఈ విషయంలో నాకు సహాయపడవలసింది”* అని అడిగాను.
*“లేదు, లేదు ఈ విషయంలో సరైనది ఏది అని నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పటి దాకా ఓపికగా ఉండు”* అని నన్ను ఆశీర్వదించి పంపారు.
ఇప్పుడు నేను పాండిచెర్రి నుండి దిండివనం వెళ్ళే దారిలో ఉన్న పంచవటిలో ఒక దేవాలయం నిర్మిస్తున్నాను. అది ముప్పైఆరు అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామీ ఆలయం. నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు.
ఇక్కడ కూడా పెద్ద ఆకుల్లో ఎక్కువ ప్రసాదం ఇవ్వడం ఆనవాయితీ. కొన్నిసార్లు నేనే ఆ ప్రసాద వితరణ చేస్తుంటాను. ఇటీవల ఒకరోజు ఎప్పటిలాగే ఒక ఆకులో కదంబం (సాబారు అన్నం) మరొక ఆకులో పెరుగన్నం పెద్దమొత్తంలో ఇస్తున్నాము. అక్కడే కూర్చుని తింటున్న కొద్దిమంది నా వద్దకు వచ్చారు.
అందులో ఒకరు చాలా నిష్టూరంగా నాతో, *“మీరు సాంబార్ అన్నం, పెరుగన్నం ఎక్కువ ఎక్కువ ఇస్తున్నారు బావుంది. రుచిగా కూడా ఉంది. కాని మీకు ఒక సలహా ఇవ్వాలి అని ఉంది. సాంబార్ అన్నానికి నంచుకోవడానికి పోరియల్, పెరుగన్నానికి తోడుగా కారం ఊరగాయ(ఆవకాయ) ఇస్తే బావుంటుంది”*
ఆ మాటలు విని నేను నిశ్చేష్టుణ్ణి అయ్యాను. 1993లొ పరమాచార్య స్వామివారి మాటలు ఒక్కసారిగా గుర్తువచ్చాయి.
*“లేదు, లేదు ఈ విషయంలో సరైనది ఏది అని నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పటి దాకా ఓపికగా ఉండు”*
స్వానుభవంతో ఇప్పుడు నాకు నిజం అవగతమైంది. ప్రసాదాన్ని ప్రసాదం లాగా కొద్దిగానే ఇవ్వాలి అని!
--- శ్రీ రమణి అన్న, “మహా పెరియవర్” నుండి.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
https://t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*
ప్రేమ అనగానే గుర్తుకు రావాల్సింది అమ్మ ప్రేమే. ఎందుకంటే ప్రేమే తప్ప స్వార్ధం తెలియనిది తల్లి ప్రేమే కాబట్టి. నవమాసాలు మోసి కని పెంచడానికి తల్లి ఎంత కష్టపడతుందో ఏ బిడ్డకి తెలియకపోవచ్చు అందులో తప్పు లేదు. కాని ఎంత ప్రేమ పంచిందో ప్రతీ బిడ్డకు తెలుస్తుంది కాని తెలిసి తెలిసి ఎందరో ఎన్నో తప్పులు చేస్తుంటారు. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే!.........
జపానులో పూర్వం ఒక కౄరమైన అలవాటు ఉండేదట… వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకుని వెళ్లి ఎతైన కొండప్రాంతాలలో వదిలి వచ్చేవారట.
వారి పని కూడా వారు చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారట.
ఒకరోజు ఒక యువకుడు తన తల్లిని కొండల్లో వదలేసి రావడానికి తన భుజాలపై మోసుకుని బయలు దేరాడు.
దారిలో భుజం పై ఉన్న తల్లి ఏదో చేస్తున్నట్టు అనిపించి గమనించగా చెట్టు కొమ్మల నుంచి ఆకులు తెంపడం గమనించి చాలా దూరం వెళ్ళిన తరవాత తల్లిని దించి నువ్వు ఎందుకు ఆకులు తెంచుతున్నావు అని అడిగాడు.
అప్పుడు ఆ తల్లి ఇలా చెప్పుకొచ్చింది… “నాయనా! నేను ముసలిదాన్ని అయిపోయానని, నన్ను వదిలెయ్యాలని పైగా నేను తిరిగి రాకూడదని చాలా దూరం తీసుకుని వస్తున్నావు. ఒకవేళ నువ్వు దారితప్పి ఇబ్బంది పడతావేమో అని బాధతో నీకు దారిని తెలిపే ఉద్దేశ్యంతో ఆ కొమ్మలను తెంపి దారిపొడుగునా వేస్తూ వచ్చాను. ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇల్లు చేరుతావని అలా చేశాను.” అని చెప్పింది ఆ తల్లి.
అమ్మ మనసు మంచు కన్నా చల్లనిది, మల్లె కన్నా తెల్లనిది, దేవతతో సమానురాలు అని అందుకే అంటారు. ఆమె మాటలు విన్న ఆ యువకుడికి కనువిప్పు కలిగి తల్లిని తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లి చక్కగా చూసుకోవడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి అందరూ ఆ ఆచారం వదిలేసారంట.
మనం కన్న పిల్లలు ఏమి చేసినా నేను కూడా చిన్నప్పుడు అలాగా చేసాను, ఇలానే చేసాను ఇప్పుడు నా పిల్లలు కూడా అంతే అని మురిసిపోయే మనం… మన తల్లి తండ్రులు వృద్దులైపోతే నేను కూడా కొన్ని సంవత్సరాల తరవాత ఇలా ఉంటాను అన్న మాట అని ఎందుకు అనుకోము. నేటి తరం అయిన మన పిల్లల రేపటి భవిష్యత్తు కోసం పాకులాడి, మన స్థాయికి మించిన చదువులు వాళ్ళ ఇష్టాలు తీర్చడానికి పాటు పడే మనము, మనకి భవిష్యత్తులో వచ్చేది ఆ ముసలితనమేనని ఎందుకు మరచిపోతాము ??? ✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
: *దైవేచ్ఛ...!!*
మనం ఏదైనా పని చేయ తలపెడతాం.
ఆ కార్యాన్ని సాధించడంలో మనం సఫలీకృతులమైతే ఆ విజయం మన ప్రతిభేనని చెప్పుకుంటాం.
అదంతా మన ఘనతేనని చాటుకుంటాం.
అదే విఫలమైతే దానికి కారణం ఇతరుల పైన నెడతాం.
లేదా ప్రతికూల పరిస్థితులు అంటాం.
భగవంతుడికి మన మీద దయ లేదు, అది మనకు వ్రాసి పెట్టలేదు అని ఆ వైఫల్యాన్ని భగవంతుడి మీదకు తోసేస్తాం....
అంతే కాని ఆ వ్రాసిపెట్టడమనేది మన పూర్వ జన్మ కర్మల ఫలితమేననీ, అంతా దైవేచ్ఛ అని మాత్రం అనుకోం.
అలా అనుకుంటే మనకు ఖేదమోదాలుండవు...!!!
అది ఎలా ??? ఓ చిన్న కథ ద్వారా తెలుసుకొందాము!!...
ఓ ఊళ్ళో ఓ పేదవాడుండేవాడు...
అతడు కూటికి పేద అయినా అతనిలో భక్తికి మాత్రం లోటు లేదు.
కూలీ, నాలీ చేసి వచ్చినదానితో సంతృప్తి చెందుతూ సంతోషంగా జీవనయానం సాగిస్తుండేవాడు.
అలా ఆ ఊళ్లోవాళ్ళందరికీ అతడంటే అభిమానం ఏర్పడింది.
“దైవేచ్ఛ వల్ల నాకు ఈరోజు పని దొరికింది, దైవేచ్ఛ వల్ల నేను ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలిగేను "...
" దైవేచ్ఛ వల్ల నేను ఈ రోజు ఇంత సంపాదించ గలిగేను.”
ఇలా అన్నీ దైవేచ్ఛ వల్లే అనుకుంటూ ఉండే వాడు.
ఓ రోజు రాత్రి భగవన్నామస్మరణ చేస్తూ ఇంటి బయట కూర్చున్నాడు, ఇంతలో కొంత మంది దొంగలు అటు వస్తూ వాళ్లకు మూటలు మోయడానికి ఓ మనిషి కావలిసివచ్చి ఈ పేదవాడ్ని లాక్కెళ్ళి పోయేరు.
అలా తీసుకెళ్ళి వాళ్ళు ఒక ఇంటిలో దొంగిలించిన నగల మూటను వాడి నెత్తి మీద పెట్టి తమతో రమ్మన్నారు.
ఇంతలో అటువైపు రాజభటులు రావడం చూసిన ఆ దొంగలు పారిపోయేరు...
రాజభటులు నెత్తిన మూటతో ఉన్న ఆ పేదవాడ్ని చూసి వీడే దొంగ అని తీసుకుని పోయి కారాగారంలో బంధించారు...
మర్నాడు విచారణకు అతడిని రాజు గారి వద్దకు తీసుకొచ్చేరు.
ఈ విషయం తెలిసి ఆ ఊళ్లోవాళ్ళందరూ వచ్చి రాజుగారితో..
“ప్రభూ! ఇతను మాకందరికీ తెలుసు, చాలా మంచివాడు, గొప్ప భక్తుడు కూడా, దొంగ కాదు ” అని చెప్పేరు.
అది విని ఆ రాజుగారు పేదవాడితో.. “నువ్వు చెప్పుకోవలసిందేమైనా ఉందా..?“ అని అడిగితే..
దానికి ఆ పేదవాడు “ప్రభూ! దైవేచ్ఛ వల్ల నేను రాత్రి ఇంటిబయట కూచున్నాను...
దైవేచ్ఛ వల్ల దొంగలు అటుగా రావడం జరిగింది.
దైవేచ్ఛ వల్ల వాళ్ళు నన్ను తమవెంట తీసుకుపోయేరు,
దైవేచ్ఛ వల్ల వాళ్ళు దొంగిలించిన నగలమూటను నా నెత్తిన పెట్టేరు.
దైవేచ్ఛ వల్ల మీ భటులు నన్ను దొంగనుకుని కారాగారంలో బంధించేరు.
దైవేచ్ఛ వల్ల ఇప్పుడు నేను మీవద్దకు విచారణకు తీసుకురాబడ్డాను.
అంతా దైవేచ్ఛయే ప్రభూ!“ అని చెప్పేడు.
ఆ పేదవాడి భక్తినీ, అమాయకత్వాన్నీ చూసి రాజుగారు ఇతడు దొంగ కాదని చెప్పి వదిలేసేరు...
చూసేరా! ఆ పేదవాడు అంతా దైవేచ్ఛయే అనుకుంటుండడాన్ని తనను దొంగలు తీసుకెళ్ళినప్పుడు అతనిలో భయం గాని, తన నెత్తిన మూట పెట్టినప్పుడు జంకుగాని, రాజభటులు కారాగారంలో పెట్టినప్పుడు దుఃఖం గాని, విచారం గాని కలుగలేదు.
అంతా కూడా దైవ నిర్ణయమె, దైవేచ్ఛ యే... అనే భావం ఎప్పుడూ మనలో వుండాలి, అప్పుడే మనలని ఆ భగవంతుడు కంటికి రెప్పలా కాపాడుతుంటాడు...
శ్రీ సద్గురుపీఠం కోటకదిర