26, ఫిబ్రవరి 2022, శనివారం

జీవితం కోసం

 ఏమండోయ్ ! ఇవాళ ఎక్కువ బట్టలు వెయ్యకండి ! పని మనిషి రెండు రోజులు రానంది .

ఏమొచ్చింది ? అడిగాడు ప్రకాష్.

వాళ్ళ ఊరు వెడతాను, కూతురినీ మనుమలనూ చూసి వస్తాను అందండీ ! అక్కడ పండగట .

" సరేలే బట్టలు ఎక్కువ వెయ్యను " అన్నాడు ప్రకాష్

" ఏమండీ ! పాపం దానికి ఒక 500 ఇస్తానండి . వినాయక చవితికి ఇచ్చినట్టు ఉంటుంది . పిల్ల దగ్గరకి వెడుతోంది కదా ! ఏదైనా పట్టుకు వెడుతుంది . "

" నీ చేతికి ఎముక లేదు . వచ్చే దీపావళికి ఇద్డువులే ! . రేపు పిజ్జా కొనుక్కోవాలి "

" ఈ వారం పిజ్జా మానేద్దాము . పాచిపోయిన 8 ముక్కాలా బ్రెడ్ కోసం ఎందుకండీ ! దానికి ఇస్తే ఎంత సంతోషిస్తుందో... ?"

" మా పిజ్జా దానికి ఇచ్చెస్థావన్నమాట . సరే నీ ఇష్టం " మనసులో ఏడుస్తూనే ఒప్పుకున్నాడు ప్రకాష్.

నాలుగు రోజుల తరువాత పనిమనిషి వచ్చింది

" పండుగ బాగా జరిగిందా ? " అడిగాడు ప్రకాష్

సంతోషంగా చెప్పింది ఆమె

" అమ్మగారు నాకు 500 ఇచ్చారండి. రెండు రోజులు 500 ఖర్చు పెట్టి చాలా బాగా గడిపాము 150 పెట్టి మనవరాలుకి డ్రెస్ కొన్నాను .. 40 రూపాయలతో బొమ్మ కొన్ననండి . 50 రూపాయలతో స్వీట్స్ కొన్నానండి . 50 రూపాయలు గుడిలో ఇచ్చానండి . 60 రూపాయలు బస్ టిక్కెట్లు అయ్యాయండి. అల్లుడికి 50 రూపాయలు పెట్టి బెల్ట్ కొన్నానండి. 25 రూపాయలు పెట్టి అమ్మాయికి గాజులు కొన్నానండి. 75 రూపాయలు మిగిలాయండి. పిల్లకు కాపీ పుస్తకాలూ పెన్సిళ్ళూ కొనమని మా పిల్లకి ఇచ్చానండి.

ఆశ్చర్య పోయాడు ప్రకాష్. 500 రూపాయలతో ఇన్నా ?

తన 8 ముక్కల పిజ్జాను గురించి ఇలా అనుకున్నాడు

మొదటి ముక్క - 150 రూపాయల డ్రెస్

రెండో ముక్క -40 రూపాయల బొమ్మ

మూడో ముక్క - 50 రూపాయల స్వీట్స్

నాలుగో ముక్క - గుడిలో ఇచ్చిన 50 రూపాయలు

ఐదో ముక్క - బస్ టికెట్లు 60 రూపాయలు

ఆరో ముక్క - 50 రూపాయల అల్లుడి బెల్ట్

ఏడో ముక్క - 25 రూపాయలు గాజులు

ఎనిమిదో ముక్క - కాపీ పుస్తకాలూ పెన్సిళ్ళూ

ఎనిమిది ముక్కలో కళ్ళ ముందు తేలుతూ కనిపిస్తున్నాయి

ఇన్నాళ్ళూ పిజ్జా ఒక వైపే చూశాడు. పిజ్జా రెండో వైపు ఎలా ఉంటుందో పనిమనిషి ఖర్చు చూశాక తెలిసింది.

తనది ఖర్చు పెట్టడానికి జీవితం

ఆమెది జీవితం కోసం ఖర్చు పెట్టడం.

“Spending for life” or “ Life for spending.....

"విలాసం .... అవసరం .... అత్యవసరం"... తేడా తెలుసుకున్నవాళ్ళు ధన్యజీవులు....!!! pl share this msg..


సేకరణ

ఏ స్తోత్రం చదివితే

 ఏ స్తోత్రం చదివితే  ఏ ఫలితం వస్తుంది... 

ఈ మెసేజ్ save చేసి పెట్టుకోండి... ఎన్ని వేల రూపాయలు వచ్చిన ఇలాంటి సి డి గా కానీ క్యాసెట్ లుగా కానీ కొనలేరు .. ఈ వివరణ కూడా మీకు ఎక్కడా దొరకదు... మనలో చాలా మందికి ఏమి చదివితే ఏ ఫలితం వస్తుంది అవి ఎలా చదవాలి ఎక్కడ దొరుకుతాయి తదితర వివరాలు ఏమీ తెలియదు... ఇక్కడ కొన్ని స్తోత్రాలు వాటిని చదవడం వల్ల వచ్చే ఫలితాలను ఇస్తున్నాము... ప్రతి స్తోత్రం కింద ఉన్న లింకులో వాటిని ఎలా చదవాలి వీడియో guide తో వచనంతో పిడిఎఫ్  అన్ని లింకులు ఇచ్చాము...

మీ అయిన వాళ్ళకి ఈ లింక్ ని పంపించడం మరిచిపోవద్దు...

💠దక్షిణా మూర్తి స్తోత్రం - ఏ స్తోత్రం పఠించాలో తెలియనప్పుడు, విద్యా సిద్ధికి, https://tinyurl.com/69fa4f22

💠 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!

https://bit.ly/36t2H69

💠 శివాష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!శివ అనుగ్రహం !!

💠 ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!

https://bit.ly/36LY3As

💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!

💠 అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!

https://bit.ly/2Q8O4QD

💠 కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!

💠 దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!

https://bit.ly/3dGR0Nc

💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!

https://bit.ly/3uTXnT6

💠 సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!

💠 హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!

యంత్రోధారక హనుమత్ స్తోత్రం - ఆరోగ్య సమస్యల నివారణ, పిశాచపీడ.. https://tinyurl.com/yth83p7k

💠 విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!

💠 భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!

💠 శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!

💠 లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !! https://bit.ly/3sVXsEw

💠 కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!

💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !! https://bit.ly/3mD0mwg

💠 శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!

https://bit.ly/3hvpkgB

💠 లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!

💠 శ్యామాల దండకం - వాక్శుద్ధి !!

💠 త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!

💠 శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!

💠 శని స్తోత్రం - శని పీడ నివారణ !!

https://bit.ly/2QVTGgZ

💠 మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!

💠 అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!

https://bit.ly/2YvUGZW

💠 కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!

https://bit.ly/39SphH2

💠 కనకధార స్తోత్రం - కనకధారయే !!

https://bit.ly/2Ry0vWm

💠 శ్రీ సూక్తం - ధన లాభం !! https://bit.ly/2R4Tv3o

💠 సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!

https://bit.ly/3dLBuzU

💠 సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!

💠 విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !! Https://bit.ly/3dL4Mie

💠 రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!

💠 దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!

💠 భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !! https://bit.ly/2SCaL0x

💠 వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!https://bit.ly/345D3mB

💠 దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

Https://bit.ly/2RziDjc

💠 లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !! https://tinyurl.com/bjhd6w42

💠 రుక్మిణీ కల్యాణం- పెళ్లి కావడం కష్టంగా ఉన్నవారికి.. కోరిన వారిని పెళ్లి చేసుకోవడానికి https://bit.ly/36Y4RLB

💠 మహా మృత్యుంజయ మంత్రము - అపమృత్యు దోషాలను నివారించడానికి https://bit.ly/3jlAUtS

💠 మణిద్వీప వర్ణన https://https://tinyurl.com/3yd3c7de

🙏🙏🙏

*కలింగ కిరాతుడు - మిత్రుల కథ*

 _*మాఘమాసం*_

        🍁 _*శనివారం*_🍁

🌴 _*ఫిబ్రవరి 26వ తేది 2022*_🌴


    _*🍁మాఘ పురాణం🍁*_

 🌴 _*25 వ అధ్యాయము🌴*_


🕉🌹🌴🍁🍁🌴🌹🕉️


*కలింగ కిరాతుడు - మిత్రుల కథ*


☘☘☘☘☘☘☘☘


గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరల నిట్లు పలికెను. ఓయీ ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాసవ్రతము నాచరించి పాప విముక్తుడగునని యీ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన యీ కథ శ్రీహరి కథామహిమను తెలుపును.


పూర్వమొక కలింగ కిరాతుడు కలడు. అతడా ప్రాంతమున సంపద కలవాడు , పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో నొకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదకుచు అడవిలో తిరుగుచుండగా నొకవిప్రుని జూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరెను. మార్గ మధ్యలో ఆయాసముచే నొక మఱ్ఱిచెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణము చేయదలచెను. కిరాతుడతని చూచి వాని వద్ద నున్న వస్త్రములు , ధనము మున్నగువానిని అపహరింప వలయునని తలచెను. తన వారితో వచ్చి యీ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటిని బలవంతముగ తీసికొనెను.


ఓయీ ! నీవు దాచిన ధనమునిమ్ము , లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును *'నేను దరిద్రుడను నా వద్ద ధనమేమియు లేదని సమాధానము నిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించువారిని చంపి వారి నగలను , ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారి గూడ దోచుకొని చంపుచుండెను. వానికి ధనమును సంపాదింప వలయునను కోరిక విపరీతముగా పెరుగుచుండెను.


ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగ నుండెను. అతడును కిరాతునివలె క్రూరుడు , వంచనాపరుడు , బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రునికిచ్చెడివాడు. అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకిచ్చెడివాడు. వీరికి మరియొక శూద్రుడు మిత్రుడుగ నుండెను. వాని తల్లియును అట్టిదే భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్చావర్తనురాలయ్యెను. ఈ విధముగ నాకుటుంబమున కుమారుడు , తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. వాని తల్లి చీకటిలో కామాతురయై తన విటుడు వచ్చుచోటికి పోయెను. చీకటిగానున్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని యామె వానికై వేచియుండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలయిన తన కిష్టురాలయిన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో నున్న తల్లి తాను కోరిన ఆమెయనుకొనెను , వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకొన్న విటుడే అనియనుకొన్నది. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు యెరుగక తమకు కావలసిన వారేయనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి , సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరి నొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంత కాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలననుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలో బంగారమును దొంగలించువాడు. శూద్రుడు తల్లితో వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలసి వారితోబాటు పాపకార్యములను చేయుచుండెను , బ్రాహ్మణుడగుటచే వాడు పౌరోహిత్యమును కూడ చేయుచుండెను. వీరి కలయికతో పంచ మహాపాపములొకచోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు , కల్లుత్రాగువాడు , క్రూరుడు , బంగారము నపహరించినవాడు , గురుపత్నితో రమించినవాడు వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను , అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకనిని జూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలను ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టియుండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయిదీనుడై యున్నవానిని చూచి నీవెవరవు ఎక్కడికి పోవుచున్నావని యడిగెను. అతడును నేను బ్రాహ్మణుడను , కిరాతుని వద్ద పని చేయువాడనని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై యుండి కనులు తెరచి యిట్లనెను.


ఓయీ ! నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు , హింసాపరుడు. వానికి బంగారమును దొంగలించినవాడు మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు తల్లితో రమించినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసినవారితో తిరిగి నీ బ్రహ్మతేజమ్మును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను , వారిని చూచినను , తాకినను , వాడును వారివలె పాపాత్ముడగును. అట్టివారితో మాటలాడక తప్పనిసరి అయినను దర్భను చేత బట్టి మాటలాడవలెను. అట్లు చేసిన పాపమంటదు. నీవట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు , మద్యపానము చేసినవాడు , గురుతల్పగమనము చేసినవాడు , బంగారమును దొంగలించిన వాడు , వీరితో స్నేహము చేసినవాడు వీరైదుగురు పాపులే. ఇట్టివారికెంత దూరముగ నున్న అంత మంచిది. అని వీరవ్రతుడు నిశ్శంఖులునితో పలికి మిన్నకుండెను.


నిశ్శంఖులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞానీ ! నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపమునుండి విముక్తి యెట్లు కల్గును ? సర్వపాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని , దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తము నిట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థ యాత్రలను పన్నెండు సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ బిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతఃకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కల్గును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగాగాని , సంవత్సరము పాటు కాని ప్రయాగ మాఘస్నానము నాచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము ఈ ప్రకారమొక మాసము చేయుము అని అనెను. నిశ్శంఖులుడును అట్లేయని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింపదగినదని చెప్పెను. నిశ్శంఖులుడును వీరవ్రతునకు నమస్కరించి పన్నెండు సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసికొన్న తరువాత నాకు ధర్మము నుపదేశింప గోరుదునని యడిగెను. ఆ ధర్మము నప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను.


నిశ్శంఖులుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశ్శంఖులుని మాటలను విని భయమును , పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్నభోజనము , మాఘస్నానము చేసి పాపవిముక్తులైరి. నిశ్శంఖులుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీ నగరము చేరి కొంతకాలముండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతము నాచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము , ప్రయాగ స్నానము. నిశ్శంఖులుడును వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తము నాచరించెను. పాపవిముక్తుడై వీరవ్రతుని వెదకుచు నైమిశారణ్యమునకు బోయి వీరవ్రతునకు నమస్కరించి యిట్లు పలికెను.


వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశ్శంఖులుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. రెండు గడియలు ఆలోచించి యిట్లనెను. ఓయీ నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే దుష్టసాంగత్యజనిత దోషము కూడ పోయినది. నీవిప్పుడు బ్రహ్మతేజస్సుతో నున్నావు. మంత్రపూతమగు జలముతో మూడు దినములు స్నానము చేయింతును. నిరాహారముగ నీవీ మూడు దినములుండును. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. నిశ్శంఖులునిచే మంత్రజలమున స్నానము మూడు దినములు చేయించెను. నిశ్శంఖులుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై యుండెను.


వీరవ్రతుడు నిశ్శంఖులునకు ఇట్లు ఉపదేశించెను. ఓయీ ! నిరంతరము సంతోషముగనుండుము. వేదమార్గమును అతిక్రమింపకుము. శాస్త్రముననుసరించి కార్యములనాచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మము నాచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము , సంధ్యా వందనము మున్నగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము. హరిని హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని జూచి విచారపడకుము. పరస్త్రీలను తల్లివలె చూడుము. చదివిన వేదములను మరువకుము. అతిధుల నవమానింపకుము. పితృదినమున శ్రార్థమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండుధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తముతో శివుని అర్చింపుము. తులసి మాలను ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణులను , బిల్యదళములతో శివుని అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేదాన్నమును భుజింపుము , యతీస్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామక్రోదాది శత్రువులను జయింపుము , మాఘస్నానమును మానకుము , మనస్సు నదుపులో నుంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాదికము నాచరింపుము , అని వీరవ్రతుడు నిశ్శంఖలునకు ధర్మప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను.


నిశ్శంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతినంది మరల కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖమిగ నుండెను తరువాత మరణించి ముక్తి నందెను.


      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

భగవద్గీత

 🌹భగవద్గీత🌹


పదకొండవ అధ్యాయము

విశ్వరూపదర్శన యోగము 

నుంచి 43 వ శ్లోకము


పితాఽసి లోకస్య చరాచరస్య 

త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ ౹

న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో

లోకత్రయేఽప్యప్రతిమప్రభావ ౹౹(43)


పితా , అసి , లోకస్య , చరాచరస్య , 

త్వమ్ , అస్య , పూజ్యః , చ , గురుః , గరీయాన్ ౹

న , త్వత్సమః , అస్తి , అభ్యధికః , కుతః , అన్యః ,

లోకత్రయే , అపి , అప్రతిమప్రభావ ౹(43)


అప్రతిమప్రభావ ! = సాటిలేని ప్రభావముగలవాడా ! 

త్వమ్ = నీవు 

అస్య , చరాచరస్య = చరాచర ప్రాణులతో గూడిన 

లోకస్య = జగత్తునకు 

పితా = తండ్రివి 

చ = మఱియు 

గరీయాన్ = సర్వశ్రేష్ఠుడవు 

గురుః = గురుడవు 

పూజ్యః , అసి = పూజ్యుడవు 

లోకత్రయే , అపి = ముల్లోకముల యందును 

త్వత్సమః = నీతో సమానుడు 

అన్యః = మఱియొకడు 

న , అస్తి = లేడు

అభ్యధికః = అధికుడు 

కుతః = ఎట్లుడును ?


తాత్పర్యము:- ఓ అనుపమప్రభావా ! ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి. నీవుపూజ్యుడవు. గురుడవు. సర్వశ్రేష్ఠుడవు. ఈముల్లోకముల యందును నీతో సమానుడెవ్వడును లేడు. ఇంక నీ కంటే అధికుడెట్లుండునu. (43)


          అందరికీ శుభ శుభోదయం

               Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy

గుండె కోసం డిజిటల్ మెడిసిన్

 తమిళనాడు బ్రేకింగ్ న్యూస్


గుండె కోసం డిజిటల్ మెడిసిన్

(గుండె మార్పిడి లేకుండా గుండెను రీసైకిల్ చేయవచ్చు)


కత్తి మరియు రక్తం లేకుండా అల్ట్రా మోడ్రన్ ఇంగ్లీష్ మెడిసిన్.


*1) యాంజియోగ్రామ్ లేదు *


2) బైపాస్ సర్జరీ లేదు


3) యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ లేదు


రెండు సూపర్ ఆధునిక యంత్రాలు కనుగొనబడ్డాయి

1)CT-700

2)EECP


1) యాంజియోగ్రామ్ లేకుండా గుండె అడ్డంకిని గుర్తించడానికి CT-700 అనే అత్యంత ఆధునిక యంత్రం కనుగొనబడింది దీనికి రెండు నిమిషాలు సరిపోతుంది.

దీని కోసం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు

ఈ ఖర్చు కూడా తక్కువే

చెన్నైలో రెండు చోట్ల మాత్రమే ఇలా చేస్తారు.

ప్రారంభ దశలో గుండె అడ్డంకిని ముందుగానే గుర్తించడం

మాత్రల ద్వారా నయం అయ్యే అవకాశం చాలా ఎక్కువ..

మరియు అది ఇప్పుడు

2) EECP అనే అధునాతన యంత్రం ద్వారా బైపాస్ సర్జరీ మరియు స్టెంట్ లేకుండా గుండెను నయం చేయవచ్చు మరియు రీసైకిల్ చేయవచ్చు.


ప్రభుత్వం ఆమోదించిన వైద్య వ్యవస్థ


నిజం తెలుసుకోవాలంటే

*శ్రీ వివేకానంద హాస్పిటల్*

చెన్నై

08925015666

08778463371

09500037040 09500037040

04443192129

DR.G. డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలో వివేకానందన్

ఇది ప్రచురించిన వార్త

దీని వల్ల లక్షలాది మంది మధుమేహం, హృద్రోగులు ప్రయోజనం పొందారు.


ఎలాంటి బ్లాక్ లేకుండా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ దీన్ని షేర్ చేయండి.


ఒక షేర్ చాలా మంది హృద్రోగుల ప్రాణాలను కాపాడుతుంది

ధన్యవాదాలు

సంసారమనే సముద్రంలో

 శ్లోకం:☝️

*భవజలధిగతానాం*

    *ద్వంద్వ వాతాహతానాం*

*సుతదుహితృ కళత్ర-*

    *త్రాణభారార్ధితానాం l*

*విషమవిషయతోయే*

    *మజ్జతామప్లవానాం*

*భవతు శరణమేకో*

    *విష్ణుపోతోనరాణాం ll*

   – ముకుందమాల - 11


భావం: సంసారమనే సముద్రంలో చిక్కి విరుద్ధ ధర్మములనే గాలిచే కొట్టబడి, భార్యాబిడ్డలు మున్నగువారిని పోషించడమనే బరువును మోస్తూ, విషయ సుఖాలనే నీళ్ళలో మునిగి తేలుతూ, నావ లేకుండా నానా యాతనలకు గురవుతున్న నరులకు శ్రీమన్నారాయణుడు (శ్రీమహా విష్ణువు) అనే నావ ఒక్కటే శరణ్యము.🙏

అన్నాన్ని రైసని పిలిస్తే

 అన్నాన్ని రైసని పిలిస్తే వచ్చే జన్మలో హోటల్లో క్లీనరైపుట్టాలని....

...........................................

మృష్టాన్నభోజనమంటే రుచికరమైన ఆహారపదార్థములతో కూడిన భోజనము.Delicious food. భోజనము ఎలాంటిదైనా సరే అంటే రాగిముద్ద, సజ్జరొట్టె, గంజి, జావ, జొన్నసంకటి, ఇంకా బియ్యంతో చేసిన ఏ వంటకాన్నైనా అన్నమనే అంటారు. 

మనమేమో అన్నము వడ్డించండి అని పిలిస్తే నామోషిగా వుంటుందని ఎవరైనా తనను అనాగరికుడని అనుకొంటారని అన్నాన్ని రైస్ అని సంభోదిస్తూ దానిని పెట్టండంటూ సంబరపడిపోతున్నాము.


 పెండ్లిండ్లలో కలర్ రైస్ అని వైట్ రైస్ అని పిలుచుకొంటూ తృప్తిపడిపోతున్నాము.

ఇక పూటకూళ్ళ (హోటళ్ళ ) లో లెమన్ రైస్, జీరారైస్, ఫ్రైడ్ రైస్, బిర్యానీరైస్, ఇలా ఏమోమో అని పిలిచి అన్నపూర్ణను అదేనండి అన్నాన్ని అవమానిస్తున్నాము.


ఇకనుండి ఎవరైనా సరే అన్నాన్ని వైట్ రైసని ఇలా వేరువేరు పేర్లతో పిలిచారో రాబోయే జన్మలో పూటకూళ్ళ ఇళ్ళలో బోకులు తోమేవాడిగా జన్మిస్తారని శపిస్తున్నా. 


బోకులు అని పిలవటానికి పలకాటనికి కూడా మన అమ్మలక్కలకు నామోషియే. బోకులంటే వంటపాత్రలని అచ్చతెనుగులో అర్థము.

బోకులంటే ఇంకా జనమనే అర్థము కూడా వుందనుకోండి.

అమ్మలక్కలన్నదానికి బాధగా వుందా ?

ఇదో గౌరవమైన సంబోధన. అమ్మలు + అక్కలు = అమ్మలక్కలు . ఇదే సంధో నాకు తెలియదు. మీరు చెపితే సంతోషిస్తా.

............................... .......... జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

ప్రశ్న పత్రం సంఖ్య: 43

  ప్రశ్న పత్రం సంఖ్య: 43

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) వజ్రం అన్నది దీని ఒక రూపమే

i ) ఇనుము  ii ) కార్బన్    iii ) రాగి iv ) ఇత్తడి 

2) ఏకం ____ విప్రాణాం బహుదా వదన్తి

i ) చిత్ ii ) సత్  iii ) మనః  iv ) దేవః

3) భగవత్గీత ఎవరికి ఎవరు ఉపదేశించారు

i ) శ్రీ కృష్ణుడు అర్జనుడికి ii ) అర్జనుడు భీమునికి  iii ) దృతరాష్ట్రుడు దుర్యోధనునికి  iv ) సంజయుడు విరాటునికి 

4)  సెమికండక్టర్ అనునది ఇందులో ఉపయోగిస్తారు

i ) సైకిల్ ii ) ఫాన్ iii ) నీటి పంపు iv ) రేడియో, టెలివిషన్లలో 

5) రఘువంశం అనునది

i ) రామాయణానికి సంబందించినది ii ) భారతానికి సంబంధించింది iii ) వేదాలకు సంబంధించింది iv ) పురాణాలకు సంబంధించింది 

6)  భరణి అనునది దీనికి సంబందించినది

i ) పసుపు ii ) కుంకుమ iii ) బెల్లం |iv ) ఇంగువ 

7) మనదేశంలో కారు నడిపే వారిని  ఇలా పిలుస్తారు

లాయరు   ii ) క్లీనర్ iii ) ఓనర్ iv ) డ్రైవరు

8) మొట్టమొదటి తెలుగు కవి ఎవరు .

i ) నన్నయ ii ) పోతన iii ) వాల్మీకి iv ) వ్యాసుడు

9) భార్య భర్తల వైవాహిక సంబంధ వివాదాలను ఈ కోర్టు పరిష్కరిస్తుంది 

i ) సివిల్ కోర్టు ,   ii ) క్రిమినల్ కోర్టు .iii ) కన్స్యూమర్ కోర్ట్ ,iv ) ఫామిలీ కోర్టు 

10) వడ్లు ఈ రకము భూమిలో పండుతాయి

i ) మెట్ట భూమి ii ) మాగాణి భూమి iii ) బంజరు భూమి iv ) ఇసుకనేలా 

11) అన్ని మతాల వారు నమ్మేది

i ) దేముడు లేడని ii ) దేముడు ఉన్నాడని iii ) మనిషే దేముడని iv ) ఎవరి నమ్మకం వారిది

 12) ధమనులు అను రక్తనాళాలలో

i ) మంచి రక్తం ఉంటుంది ii ) చెడు రక్తం ఉంటుంది iii ) యెర్రని రక్తం ఉంటుంది   iv ) రక్తం ఉండదు 

13) మనము తినే ఆహారంలో చెట్లనుంచి ఈ పదార్ధం రాదు

i ) బెల్లము  ii ) పంచదార iii ) లవణము iv ) ఇంగువ

14) ఆది శంకరుల వారు బోధించినది  

i ) ఆత్మవేరు పరమాత్మ వేరని ii )ఆత్మ పరమాత్మ ఒకటేనని   iii ) మనుషులంతా ఒకటేనని iv ) సన్యాసం ఒకటే దేముడిని చేరు మార్గమని 

15) జాతకంలో చంద్రుడు నీచంగా ఉంటే

i )బుద్ధిమంతులు అవుతారు ii )  నాయకులు అవుతారు iii ) మంచివాడు అవుతారు  iv ) పిచ్చి వాళ్ళు అవుతారు

16) ఇది ఇంద్రియం కాదు

i ) కన్ను  ii ) ముక్కు     iii ) చెవి  iv ) గోరు

17) దీనిని తలస్నానం చేయటానికి వాడతారు  

i ) కుంకుడు కాయ ii ) తరిగిన దోసకాయ   iii ) తరిగిన ఉల్లిగడ్డ iv ) తరగని బెండకాయ 

18) కదళీ ఫలం అని దీనిని అంటారు

i ) అరటి ఫలం ii ) రేగి ఫలం  iii ) జామ ఫలం iv ) ద్రాక్ష ఫలం 

19) ప్రియం అను పదానికి గల రెండు అర్ధాలు

i ) ఇష్టమైనది మరియు కష్టమైనది ii ) ఇష్టమైనది మరియు ఖరీదైనది iii ) ఇష్టమైనది మరియు నష్టమైనది iv )   ఇష్టమైనది మరియు స్పష్టమైనది 

20)  ఈ పదము లాయర్లకు మరియు ఇంజనీర్లకు కూడా వర్తిస్తుంది 

i ) క్రిమినల్ ii ) సివిల్   iii ) మెకానికల్  iv ) ఎలెట్రికల్

 

 

మంత్ర దోషాలు

 మంత్ర దోషాలు :


హరితత్త్వ ధేథితి అన్న గ్రంథంలో మంత్రాలకు ఎనిమిది రకాల దోషాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది.  


అవి అభక్తి, అక్షరభ్రాంతి, లుప్తత, ఛిన్నత, హ్రస్వత, దీర్ఘత, కథనము, స్వప్నకథనం 


1. అభక్తి :- ఒక గురువు ఇచ్చిన మంత్రాన్ని మరొక గురువు దగ్గరకు తీసుకొని వెళ్ళి చూపించిండం, ఆ గురువేమో ఇంతకంటే గొప్ప మంత్రం నేను ఇస్తాను అని వేరొక మంత్రం ఇవ్వడం! మొదలైన దోషములే అభక్తి. గురువు ఇచ్చిన మంత్రాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. అజ్ఞానం వలన, అతి ఉత్సాహం వలన శిష్యులు అలా వేరొక గురువు వద్ద చెప్పినా ఆ గురువు ఆ మంత్రాన్ని తరచి తరచి చూడకూడదు. అదే అభక్తి. గురువు యందు మంత్రం యందు భక్తి లేకపోవడమే ఇంకొకరి వద్దకు వెళ్ళడం. 


2. అక్షరభ్రాంతి :- గురువు గారు "ఓం హ్రీం ఓం" అని మంత్రం ఇచ్చారు. అయితే శిష్యుడికి అది సరిగా వినబడకపోవడం వలన "ఓం శ్రీం ఓం" అనుకున్న . అదే అక్షరభ్రాంతి. ఈ విధమైన అక్షరభ్రాంతి లేకుండా ఉండటం కోసమే గురువు జాగ్రత్తలు తీసుకోవాలి. 


3. లుప్తత :- గురువు గారు "శ్రీరామ చంద్ర పరబ్రహ్మణే నమః" అని మంత్రం ఇస్తే శిష్యుడు "శ్రీ రామ బ్రహ్మణే నమః" అని జపం చేస్తాడు. అంటే గురువు ఇచ్చిన మంత్రం సరిగా జ్ఞాపకం పెట్టుకోకపోవడం వలన ఇలా జరుగుతుంది. దీని గురించి మళ్ళీ గురువును అడగలేడు. ఇది న్యూనత లోపం వలన జరుగుతుంది. అసలు మంత్రం మర్చిపోయి సొంత కవిత్వం పెట్టడం లుప్తత. కొన్ని తగ్గించి, కొన్ని తీసేసి, కొన్ని వదిలిపెట్టి మంత్రాన్ని ఉఛ్ఛరించడం లుప్తత. 


4. ఛిన్నత :- వత్తులు ఉండవలసిన చోట వత్తులు లేకుండా పలకడం ఛిన్నత. ఉదాహరణకు ఛిన్నమస్తా అనవలసిన చోట చిన్నమస్తా అని పలకడం ఛిన్నత.


5. హ్రస్వత :- ధీర్ఘం ఉండవలసిన చోట దీర్ఘం తీసివేసి హ్రస్వంగా పలకడం హ్రస్వత . ఉధా : || ఓం రాం రామాయ నమః|| అనడానికి బదులు | ఓం రం రామాయ నమః| అని పలకడం.


6. దీర్ఘత :- హ్రస్వంగా పలకవలసిన చోట దీర్ఘాన్ని చేర్చడం ఉదా : ఓం నమః శివాయ అనవలసిన చోట ఓం నామా శీవాయా అనడం. 


7. కథనం :- గురువు ఇచ్చిన మంత్రాన్ని ఇతరుల వద్ద చర్చించడం లేక ఆ మంత్రాన్ని వేరొకరికి చెప్పడం, లేక ఇంకో గురువు వద్ద ఆ మంత్రాన్ని గురించి అడగటం మొదలైనవి కథనం కిందకి వస్తాయి. మంత్రం గురు శిష్యుల మధ్యనే ఉండాలి తప్ప మూడో వ్యక్తికి చెప్పకూడదు. 


8. స్వప్న కథనం :- గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తూ చేస్తూ అలాగే నిద్రలోకి జారిపోయి ఆ నిద్రలో కలవరిస్తూ ఉంటారు కొంత మంది. లేకపోతే కలలో బయటకు చెప్పేస్తారు. అదే స్వప్న కథనం ఇది కూడా దోషమే.

 ధిక్ తస్య జన్మ యః పిత్రా

లోకే విజ్ఞాయతే నరః।

యత్పుత్రాత్ ఖ్యాతిమభ్యేతి

తస్య జన్మ సుజన్మనః॥


        ..... మార్కణ్డేయపురాణమ్ - 1.101


"ఎవడు తండ్రి యొక్క ఖ్యాతి చేత లోకానికి తెలియబడుచున్నాడో వాడి జన్మ వ్యర్థం....... 

*ఏ తండ్రి పుత్రుడియొక్క జన్మ వలన కీర్తించబడుతున్నాడో ఆ తండ్రి జన్మయే సార్థకం."*