ప్రశ్న పత్రం సంఖ్య: 43
కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.
1) వజ్రం అన్నది దీని ఒక రూపమే
i ) ఇనుము ii ) కార్బన్ iii ) రాగి iv ) ఇత్తడి
2) ఏకం ____ విప్రాణాం బహుదా వదన్తి
i
) చిత్ ii ) సత్ iii ) మనః iv ) దేవః
3) భగవత్గీత ఎవరికి ఎవరు ఉపదేశించారు
i ) శ్రీ కృష్ణుడు అర్జనుడికి ii ) అర్జనుడు భీమునికి iii ) దృతరాష్ట్రుడు దుర్యోధనునికి iv ) సంజయుడు విరాటునికి
4) సెమికండక్టర్ అనునది ఇందులో ఉపయోగిస్తారు
i ) సైకిల్ ii ) ఫాన్ iii ) నీటి పంపు iv ) రేడియో, టెలివిషన్లలో
5) రఘువంశం అనునది
i ) రామాయణానికి సంబందించినది ii ) భారతానికి సంబంధించింది iii ) వేదాలకు సంబంధించింది iv ) పురాణాలకు సంబంధించింది
6) భరణి అనునది దీనికి సంబందించినది
i ) పసుపు ii ) కుంకుమ iii ) బెల్లం |iv ) ఇంగువ
7) మనదేశంలో కారు నడిపే వారిని ఇలా పిలుస్తారు
లాయరు ii ) క్లీనర్ iii ) ఓనర్ iv ) డ్రైవరు
8) మొట్టమొదటి తెలుగు కవి ఎవరు .
i ) నన్నయ ii ) పోతన iii ) వాల్మీకి iv ) వ్యాసుడు
9) భార్య భర్తల వైవాహిక సంబంధ వివాదాలను ఈ కోర్టు పరిష్కరిస్తుంది
i ) సివిల్ కోర్టు , ii ) క్రిమినల్ కోర్టు .iii ) కన్స్యూమర్ కోర్ట్ ,iv ) ఫామిలీ కోర్టు
10) వడ్లు ఈ రకము భూమిలో పండుతాయి
i ) మెట్ట భూమి ii ) మాగాణి భూమి iii ) బంజరు భూమి iv ) ఇసుకనేలా
11) అన్ని మతాల వారు నమ్మేది
i ) దేముడు లేడని ii ) దేముడు ఉన్నాడని iii ) మనిషే దేముడని iv ) ఎవరి నమ్మకం వారిది
12) ధమనులు అను రక్తనాళాలలో
i ) మంచి రక్తం ఉంటుంది ii ) చెడు రక్తం ఉంటుంది iii ) యెర్రని రక్తం ఉంటుంది iv ) రక్తం ఉండదు
13) మనము తినే ఆహారంలో చెట్లనుంచి ఈ పదార్ధం రాదు
i ) బెల్లము ii ) పంచదార iii ) లవణము iv ) ఇంగువ
14) ఆది శంకరుల వారు బోధించినది
i ) ఆత్మవేరు పరమాత్మ వేరని ii )ఆత్మ పరమాత్మ ఒకటేనని iii ) మనుషులంతా ఒకటేనని iv ) సన్యాసం ఒకటే దేముడిని చేరు మార్గమని
15) జాతకంలో చంద్రుడు నీచంగా ఉంటే
i )బుద్ధిమంతులు అవుతారు ii ) నాయకులు అవుతారు iii ) మంచివాడు అవుతారు iv ) పిచ్చి వాళ్ళు అవుతారు
16) ఇది ఇంద్రియం కాదు
i ) కన్ను ii ) ముక్కు iii ) చెవి iv ) గోరు
17) దీనిని తలస్నానం చేయటానికి వాడతారు
i ) కుంకుడు కాయ ii ) తరిగిన దోసకాయ iii ) తరిగిన ఉల్లిగడ్డ iv ) తరగని బెండకాయ
18) కదళీ ఫలం అని దీనిని అంటారు
i ) అరటి ఫలం ii ) రేగి ఫలం iii ) జామ ఫలం iv ) ద్రాక్ష ఫలం
19) ప్రియం అను పదానికి గల రెండు అర్ధాలు
i ) ఇష్టమైనది మరియు కష్టమైనది ii ) ఇష్టమైనది మరియు ఖరీదైనది iii ) ఇష్టమైనది మరియు నష్టమైనది iv ) ఇష్టమైనది మరియు స్పష్టమైనది
20) ఈ పదము లాయర్లకు మరియు ఇంజనీర్లకు కూడా వర్తిస్తుంది
i ) క్రిమినల్ ii ) సివిల్ iii ) మెకానికల్ iv ) ఎలెట్రికల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి