26, ఫిబ్రవరి 2022, శనివారం

అన్నాన్ని రైసని పిలిస్తే

 అన్నాన్ని రైసని పిలిస్తే వచ్చే జన్మలో హోటల్లో క్లీనరైపుట్టాలని....

...........................................

మృష్టాన్నభోజనమంటే రుచికరమైన ఆహారపదార్థములతో కూడిన భోజనము.Delicious food. భోజనము ఎలాంటిదైనా సరే అంటే రాగిముద్ద, సజ్జరొట్టె, గంజి, జావ, జొన్నసంకటి, ఇంకా బియ్యంతో చేసిన ఏ వంటకాన్నైనా అన్నమనే అంటారు. 

మనమేమో అన్నము వడ్డించండి అని పిలిస్తే నామోషిగా వుంటుందని ఎవరైనా తనను అనాగరికుడని అనుకొంటారని అన్నాన్ని రైస్ అని సంభోదిస్తూ దానిని పెట్టండంటూ సంబరపడిపోతున్నాము.


 పెండ్లిండ్లలో కలర్ రైస్ అని వైట్ రైస్ అని పిలుచుకొంటూ తృప్తిపడిపోతున్నాము.

ఇక పూటకూళ్ళ (హోటళ్ళ ) లో లెమన్ రైస్, జీరారైస్, ఫ్రైడ్ రైస్, బిర్యానీరైస్, ఇలా ఏమోమో అని పిలిచి అన్నపూర్ణను అదేనండి అన్నాన్ని అవమానిస్తున్నాము.


ఇకనుండి ఎవరైనా సరే అన్నాన్ని వైట్ రైసని ఇలా వేరువేరు పేర్లతో పిలిచారో రాబోయే జన్మలో పూటకూళ్ళ ఇళ్ళలో బోకులు తోమేవాడిగా జన్మిస్తారని శపిస్తున్నా. 


బోకులు అని పిలవటానికి పలకాటనికి కూడా మన అమ్మలక్కలకు నామోషియే. బోకులంటే వంటపాత్రలని అచ్చతెనుగులో అర్థము.

బోకులంటే ఇంకా జనమనే అర్థము కూడా వుందనుకోండి.

అమ్మలక్కలన్నదానికి బాధగా వుందా ?

ఇదో గౌరవమైన సంబోధన. అమ్మలు + అక్కలు = అమ్మలక్కలు . ఇదే సంధో నాకు తెలియదు. మీరు చెపితే సంతోషిస్తా.

............................... .......... జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: