🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*మహాశివరాత్రి*
*ఓం నమశ్శివాయ*
*శివునికి గుర్తు అని చెప్పేదే శివలింగం. 'లీయతే గమ్యతే ఇతిలింగం' -*
*ప్రపంచమునంతటినీ తనలో లీనం చేసుకుని, పరమపావన గమ్యాన్ని నిర్దేశించేది లింగం అని అర్థం. 'లిం' అంటే లయం పొందుట. 'గం' అంటే సృష్టిచేయడం కనుక, జగత్తుకు పుట్టుక, లయ... ఈరెండింటికీ లింగమే కారణం అని చెబుతారు. అయితే శివరూపం మూడు విధాలుగా ఉంటుంది.*
*1.సకలం - తల, శరీరం, కాళ్లు, చేతులు మొదలైన అవయవాలతో కూడుకున్నది. చంద్రశేఖరమూర్తి, గంగాధరమూర్తి మొదలైన రూపాలు ఈ సకల తత్వానికి ప్రతీకలు.*
*2.నిష్కళం- అవయవాలు లేకుండా కేవలం చిహ్న మాత్రంగా ప్రపంచానికి ఆధారమైన జ్యోతిస్తంభరూపంగా లింగాకృతిలో గోచరించే శివలింగం నిష్కళ తత్త్యానికి ప్రతీక.*
*3.సకల నిష్కళం-పై రెండు పద్దతులు ఒకటైతే ఏర్పడే రూపం. ఇందులో సకలతత్వానికి ప్రతీకగా ముఖం, నిష్కళతత్వానికి ప్రతీకగా లింగం కలిసి ఉంటాయి. అందుకే దీనిని ముఖలింగం అంటారు. ఇది సకల నిష్కళతత్త్వానికి ప్రతీక.*
*పురాణాలలో మహర్షులంతా కలిసి మహాయజ్ఞాన్ని తల పెట్టారు. ఆ యజ్ఞ ప్రాంతానికి నారద మహర్షి విచ్చేసి అక్కడ ఉన్న మహర్షులని ఇలా అడిగాడు. 'ఈ యజ్ఞ హవిర్భాగాన్ని ఎవరికి సమర్పిస్తారు? ఈ యజ్ఞ హవిర్భోక్త ఎవరు?' అని అడిగాడు. మహరులంతా సమావేశమై త్రిమూర్తులలో ఎవరు శ్రేష్టమైన వారో వారే సావిర్భోక్షయని నిర్ణయించుకున్నారు. శ్రేష్ఠులైన వారిని ఎన్నుకొని రమ్మని భృగుమహర్షిని " పంపారు.*
*భృగుమహర్షి మొదట సత్యలోకానికి అక్కడి నుండి కైలాసానికి వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరులు తనువు, మనస్సు లయించి ఆనందానురాగాలు పరవశించ అర్ధనారీశ్వరులై నాట్యమాడుతున్నారు. మహర్షి ఎంతో సేపు వేచిచూచినా పరమేశ్వరుడు గమనించలేదు. ఫలితంగా అంగాంగీ భావంతో మునిగితేలుతున్న నీవు నిర్లింగివి అవుగాక! ఇక నుండి నీకు సగుణారాధన లేక లింగరూపంలోనే పూజింపబడుదువు అని మహర్షి శపించాడు. నాటి నుంచి శివునికి శివలింగ రూపంలోనే పూజలుతప్ప మూర్తిరూపంలో పూజలులేవు. ఇది వేంకటచల మహత్యంలో శివలింగ ఆవిర్భావం గురించి చెప్పేకథ. వేద, పురాణాల ఆధారంగానే శైవాగమాలు ఉద్భవించాయి.*
*కావ్యేతిహాసాలలో... శ్రీరాముడు సేతు నిర్మాణానికి మునుపు సముద్రపు ఇసుకతో శివలింగం తయారుచేసి పూజించాడు. లంకా విజయం తరువాత తిరిగి వస్తూ సీతాదేవితో కలిసి మళ్లీ ఆ శివలింగాన్ని పూజించాడు. రామనాథలింగం కొలువైన రామేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రాలు పన్నెండింటిలో ఒకటి. మహాభారతంలో స్వయంగా శ్రీకృష్ణుడే శివభక్తుడై కనిపిస్తాడు. ఆయన ఉపమన్యుమహర్షి నుండి శివయోగ సిద్ధిని పొందుతాడు. మహాభారతంలో కిరాతార్జునీయ ప్రకరణంలో అర్జునుడు శివలింగారాధన చేశాడు.*
*శివలింగాలు స్థావర, జంగమ లింగాలని రెండు రకాలుగా ఉంటాయి*
*స్థావర లింగం: శిలామయమై బ్రహ్మ, విష్ణు, రుద్ర భాగాలను పొంది త్రిసూత్రం, ముకుళం కలిగిన లింగాన్ని స్థావరలింగం అంటారు. కారణాగమం స్థావరలింగ లక్షణాన్ని ఇలా చెప్పింది. ఈ శివలింగానికి కింది భాగం చతురస్రంగా (నాలుగు.
పలకలుగా) ఉంటుంది. మధ్యలో భాగం అష్టాస్రంగా (8 పలకలుగా). పై భాగం గుండ్రంగా ఉంటుంది.
బ్రహ్మభాగం. భూమి లోపల, విష్ణుభాగం పీఠం లోపల, రుద్రభాగం పైకి ఉండి పూజలందుకుంటుంది. ఏదే ఈ శివలింగానికి సూత్రం ఉంటుంది. శివలింగానికి ముఖం సూచించేందుకు ఒక ముకులం (మొగ్గ) గుర్తును దానిపై చెక్కుతారు. దాని క్రింద నుండి బ్రహ్మసూత్ర. రేఖ ప్రారంభమై రెండు వైపులా వెళ్ళి వెనుక భాగంలో కలుసుకుంటుంది.*
*జంగమ లింగం : స్థావర లింగాలు కాకుండా మిగిలిన వన్నీ జంగమ లింగాలే. ఇవి 9 రకాలుగా ఉంటాయి. 1. దివ్యలింగం, 2. స్వాయంభువలింగం, 3. దైవతలింగం, 4. గాణపలింగం, 5. అసురలింగం, 6. సురలింగం, 7. ఆర్తలింగం 8. మానుషలింగం, 9. బాణలింగం:*
*స్వాయంభువ లింగము : నాగరికతకు దూరమైన జానపదులు సమాజంలో భగవంతునికి ప్రతీకగా స్వాభావిక శిలలనే సాంకేత(లింగ)ములుగా అలవర్చుకున్నారు. స్వాభావికంగా లభ్యమైన కొన్ని గండ్ర శిలలన్నీ స్వాయంభువ లింగాలుగా భారతదేశంలో ఆరాధించబడుతున్నవి.*
*భారతదేశంలో 12 జ్యోతిర్లింగములు వీటికి ఉదాహరణ. ఇవిగాక 68 శివక్షేత్రములను ఆగమాలు పేర్కొన్నాయి. బాణలింగాలు : కొన్ని నదులలో లభించే స్వాభావిక శిలలు శివ, విష్ణు ప్రతీకలు గా ఆరాధిస్తాయి. వీటిని బాణలింగాలు లేదా సాలిగ్రామాలు అని పిలుస్తారు. శివునికి సంకేతంగా బాణలింగాలు నర్మదానదిలో దొరుకుతాయి.*
*విష్ణుసంకేతాలైన సాలిగ్రామాలు నేపాల్ లోని గండకీ నదిలో దొరుకుతాయి.*
*🪷శివేతర లింగాలు : శివలింగం నిష్కళరూపానికి ప్రతీక. ఈ నిష్కళరూపంలో ఏ దేవుడినైనా అర్చించవచ్చని ఆగమాలు, శిల్పశాస్రగ్రంథాలు చెబుతున్నాయి. ఉదాహరణకు మనం పసుపు వినాయకుణ్ణి లింగాకృతిగానే తయారుచేసి పూజిస్తాం. గౌరీదేవిని కూడా ఇలాగే పూజిస్తాం. గ్రామదేవతా రూపాలను కూడా ఇలా లింగాకృతిలో ఉండటం చూడొచ్చు. గ్రామాలకు మధ్యలో బొడ్డురాయిని స్థాపిస్తారు. ఇది కూడా లింగాకృతియే. స్తంభాకృతి, - లింగాకృతి ఇవి రెండూ చాలా దగ్గరి సంబంధం కలిగినవి. తెలుగునాట నవ నృసింహక్షేత్రాలలో కొన్ని స్తంభాకృతి లోనే ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని తమకూరు జిల్లాలో ప్రసిద్ధ విష్ణుదేవాలయమైన సిబిలోని ఆ నృసింహస్వామి నేటికీ ఈ లింగాకారంలోనే " పూజించబడుతున్నారు. ఉడిపిలోని అనంతేశ్వరస్వామి, శివమొగ్గ జిల్లాలో పిళ్ళాంగేరి అనే ఊరిలో రంగనాథుడు ఇలా 1 చాలాచోట్ల విష్ణువు లింగాకారంలో నేటికీ 9. పూజించబడుతున్నాడు. దక్షిణ కర్ణాటకలోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైన కుక్కిలో సుబ్రహ్మణ్యస్వామిని లింగాకృతిలోనే పూజిస్తున్నారు.🪷*
*ముఖలింగములు - సకలనిష్కళ స్వరూపానికి ముఖలింగం ప్రతీక. ఈ ముఖలింగాలను దేశ సరిహద్దులో స్థాపించిపూజించాలని మహాభారతం చెప్పింది. ఈ ముఖలింగంలో శివలింగం స్థానంలో పరమేశ్వరుని భుజాల వరకు రూపం ఉంటుంది. పరమేశ్వరుని సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష ముఖములు 4 దిక్కులకు ఉంటే పై భాగం ఈశానముఖానికి ప్రతీకగా ఆకాశంలో శూన్యంగా కనిపిస్తుంది. కొన్నిచోట్ల ఊర్ధ్వముఖం కూడా దర్శనమిస్తుంది. మూడు ముఖాలు త్రిమూర్తులకు ప్రతీకలుగా తూర్పు, దక్షిణ, ఉత్తర దిక్కులను చూస్తూ ఉంటాయి.*
* శివాయనమః*