8, జూన్ 2023, గురువారం

ఎదిగేకొద్దీ

 *ఎదిగేకొద్దీ  ఒదగాలి! - ఎలా?*


మనిషి ఎంత ఎదిగినా ఒదిగివుండాలి కానీ అహంకరించకూడదు.

అహంకారం అనేది నైతికంగా మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తుంది.


అలాగే ఆత్మాభిమానం మంచిదే కానీ  దురభిమానం ఎప్పుడూ ఇబ్బందులు కలిగిస్తుంది.


సకలశాస్త్ర పారంగతుడిని అన్న అహంతోనే రావణాసురుడు తప్పు చేసి, శ్రీరాముని చేతుల్లో  హతుడైనాడు.


దుర్యోధనుడు దురభిమానం తో తొడలు విరిగి నేలకూలాడు.

ఎంతటి తపోధనులైనా సరే అహంకరిస్తే వాళ్ళ తపఃశక్తిని కోల్పోయి, మళ్లీ సంపాదించిన అంశాలెన్నో మన పురాణ, ఇతిహాసాల్లో ఉన్నాయి.

ద్వైతవనంలో ఉన్న పాండవులను అవమానించడానికి దుర్యోధనుడు దూర్వాసునికి సకల సేవలు చేసి మెప్పు పొంది, ఆయనను పాండవుల మీదికి పంపుతాడు.


సూర్య వర ప్రసాదంతో అక్షయపాత్ర ను పొందిన పాండవులు ఎందరో అన్నార్తుల ఆకలి తీరుస్తూ అడవిలో సుఖంగా వున్నారు. విశేషం ఏమిటంటే ద్రౌపది తిన్న తర్వాత ఆ పాత్ర తన శక్తిని కోల్పోతుంది. అది తెలిసి దుర్వాసుడు సమయం మించి వెళతాడు. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది.                      ఆ ఆపన్నపరాయణుడు అందరినీ స్నానాదులు ముగించుకుని భోజనానికి రమ్మని చెప్పిస్తాడు. అప్పుడు పరమాత్మ లీలచే అక్షయపాత్ర లో ఒక మెతుకు దొరుకుతుంది. అది తిని భగవానుడు నా కడుపు నిండినది అని త్రేన్చగానే   దుర్వాసునికి , అతని నూర్గురు శిష్యులకు అందరికి పొట్ట నిండిపోయి ఆయాసం తో అతలాకుతలం అవుతుంటారు.


ఆ సమయంలో ధర్మజుని ఆజ్ఞతో భీముడు అందరినీ భోజనానికి ఆహ్వానిస్తాడు. శ్రీకృష్ణుడు కూడా వారికై ఎదురుచూస్తూ ఉన్నాడని చెబుతాడు. అప్పుడు వారు ‘ఎవరి అండలో’ ఉన్నాడో ఆ లీలామానుష మూర్తిని గుర్తెరిగిన దూర్వాసుడు తన తప్పిదం తెలుసుకొని ఆయనకు ప్రణమిల్లి అహంకారంతో కోల్పోయిన తమ శక్తిని తిరిగి సంపాదించుకునేందుకు తపస్సుకు వెళ్ళిపోతాడు.

అలాగే విశ్వామిత్రుడు కూడా.!           ఇలా ఎన్నో దృష్టాంతాలు అంటే ఋజువులు మన పురాణ కథల్లో ఉన్నాయి.


పురాణాలు ..మన నైతికతకు గురువులు. ఏది, ఎందుకు, ఎప్పుడు చెయ్యాలి, చేయకూడదు అన్న ఇంగితాన్ని బోధిస్తాయి.


మహాద్భుతమైన మన పుణ్యభూమి, కర్మభూమి గొప్పదనం తెలుసుకుంటే విజ్ఞానవంతులై లోక శ్రేయస్సును పెంపొందిస్తారు. నేను, నాది అన్న అహంకారం వీడండి. భగవంతుడి అండను పొందండి ...

మన గుడి :

 🕉 మన గుడి : 


⚜ ప.గో.. జిల్లా :    అత్తిలి 


⚜ శ్రీ వల్లీ - దేవసేన - సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం.


" " శరవణభవ శరవణభవ 

శరవణభవ పాహిమాం 

శరవణభవ శరవణభవ 

శరవణభవ రక్షమాం " "


💠 పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడుగా చెప్పుకునే కుమారస్వామి, భూలోకంలోని అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి తన భక్తులను అనుగ్రహిస్తూ తన శక్తి ఆయుధాన్ని ధరించి నెమలి వాహనంతో  దర్శనమిస్తుంటాడు. 

 

💠 కొన్ని ప్రాంతాల్లో ఇలా దర్శనమిచ్చే స్వామి, కొన్ని ప్రదేశాల్లో సర్పాకారంలోనూ, లింగాకారంలోనూ పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగుబంగారంగా కొలువై ఉంటారు.

అందుకు పూర్తి భిన్నంగా స్వామివారి స్వయంభువుమూర్తి కనిపించే క్షేత్రం ఒకటుంది. అదే 'అత్తిలి' సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం.


💠 పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో క్షేత్రం వెలసిన శ్రీ వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం ఆంధ్ర రాష్ట్రంలో విరసిల్లుతున్న సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి.


💠 స్వామి వారి ఆలయం ప్రక్కనే జలాశయం ఉంటుంది. ఈ జలాశయంలోనే స్వామి వారి విగ్రహం లభించింది అని చెబుతారు.

భక్తుల కొంగు బంగారం.. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి చెందిన అత్తిలి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి మూర్తి బయటపడిన తీరును ఇక్కడ వారు ఆసక్తికరంగా చెబుతుంటారు.


💠 మరో విశేషం ఏమిటంటే రోజూ గర్భాలయంలోకి సోమసూత్రం గుండా ఒక సర్పం స్వామి మూల విరాట్‌ వద్దకు వస్తుందని, అది మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్తుందని ఆలయ అర్చకులు చెబుతుంటారు. ప్రతీనెలా ఈ సర్పం గర్భగుడిలో గానీ, చెరువు గట్టుపై గానీ కుబుసం విడిచి వెళ్తుందని, దానిని స్వామి పాదాల వద్ద ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారాని అంటుంటారు. 


💠 పౌరాణికంగా అత్తిలి గ్రామం అత్రి మహర్షి తపోభూమి అని ప్రసిద్ధి పొందింది. 

అత్రి మహర్షి పేరు మీదుగానే అత్తిలి పేరు ఏర్పడింది అని ప్రసిద్ధి.  


💠 అత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమా సిద్దేశ్వరస్వామి వారి ఆలయంలోని మూలావిరాట్టు అని ఐతిహ్యం. స్వామివారిపై చేసిన అభిషేక జలాలు తన శరీరంపై నుంచే వెళ్ళాలనే కోర్కెను వ్యక్తపరచినట్టు ఆ వరం  అనుగ్రహించినట్టు చెప్తారు


⚜ స్థలపురాణం ⚜


💠 చాలాకాలం క్రిందట ఇక్కడి చెరువు సమీపంలో ఒక పెద్ద పాముపుట్ట ఉండేదట. దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్లడం .. రావడం చాలామంది చూసేవాళ్లు. అయితే దానిని చూడగానే పవిత్రమైన భావన కలగడం వలన, ఎవరూ కూడా దానికి హాని తలపెట్టలేదు. కాలక్రమలో చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట కరిగిపోయింది, ఆ పాము విషయాన్ని కూడా అంతా మరిచిపోయారు. 


💠 కొంతకాలం తరువాత చెరువుకి సంబంధించిన మరమ్మత్తులు చేపట్టగా, గతంలో పుట్ట వున్న ప్రదేశంలో నుంచి ఏకశిలపై శ్రీ వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయట పడింది అని చెబుతారు. ఈ విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తుతో స్పష్టంగా  సర్ప ఆకృతితో తేజరిల్లుతుంటాడు .


💠 అది స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు, ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు. శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ వుంటుంది. స్వామివారి దేహం సర్పంవలె పొలుసులతో కూడి వుండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు.


💠 అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వల్లీ,దేవసేన సమేతంగా చాలా చిన్న విగ్రహ రూపంలో దర్శనం ఇస్తారు. 

ఆలయ ఆవరణలో స్వామి వారితో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి, గణపతి విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి. స్వామి వారికి రోజు చేసే పూజా కార్యక్రమాలతో పాటు షష్టి రోజు చేసే వివిధ రకాల సేవలు ఎంతోగాను ఆకట్టుకుంటాయి. 

 

💠 సాధారణంగా అత్తిలిలో పెద్ద పండగ ఏది అని అడిగితే అందరు చెప్పే ఏకైక సమాధానం సుబ్రహ్మణ్య స్వామి షష్టి. 

75 సంవత్సరాలుగా ఇక్కడ షష్ఠి తిరునాళ్ళను చేస్తున్నారు. స్వామివారి కల్యాణం సహా 15 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున సాగుతుంటాయి.


💠 15 రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలలోనూ స్థిరపడిన స్థానిక వాసులంతా షష్ఠికి అత్తిలి విచ్చేస్తారు. ఈ ఉత్సవాల్లో సెట్టింగులు, విద్యుద్దీపాలంకరణ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. 


💠 అత్తిలి సుబ్రహ్మణ్యస్వామి అభిషేక ప్రియుడు. ప్రతీ మంగళవారం, నెల షష్ఠి రోజున భక్తులు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు. 

నాగ, కుజ దోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి అభిషేకాలు చేస్తారు. సంతానం లేని వారు నాగుల చీర, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటారు. సంతానం కలిగాక తలనీలాలు, పటికబెల్లం తూకం వేసి మొక్కులు తీర్చుకుంటారు. అత్తిలిలో ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా స్వామి దర్శనం చేసుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ.


💠 మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని స్థానికులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


💠 తాడేపల్లిగూడెం నుండి 20km ,మరియు తణుకు నుండి 16km దూరం

తెలుగులో అర్ధాలు

 కింది పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు చెప్పగలరా!!?.



1.పిపీలికము = 

2. మశికము =  

3. మార్జాలము = 

4. శునకము = 

5. వృషభము = 

6. మహిషము = 

7. శార్దూలము = 

8.మత్తేభము = 

9.మకరము = 

10.మర్కటము = 

11. వాయసము = 

12. మూషికము = 

13.జంబుకము =

14. వృకము =   

15.తురగము =  

16. గార్ధభము = 

17. వరాహము = 

18.పన్నగము = 

19. కుక్కుటము = 

20. బకము = 

21. ఉష్ట్రము = 

22. శుకము = 

23. పికము =  

24.శలభము = 

25. కీటకము = 

26. మత్స్యము = 

27. హరిణము = 

28. మత్కుణము = 

29. మయూరము = 

30.కూర్మము = 

31. మకుటము =  

32. మకరందము = 

33. వానరము = 

34. వావురము = 

35. ఉరగము =

పాత ఉత్తరాలు

 *పాత మధుర సంప్రదాయం*

💖💖💖💖💖💖💖💖


*పూర్వం పోస్టు కార్డు లో పెద్దలకు "మహారాజశ్రీ" అనే పదం వాడేవారు. పిన్నలకు  "ప్రియమైన" లేక "చిరంజీవి" పదాలు వాడేవారు. స్త్రీలకు పెద్దవాళ్ళైతే  "లక్ష్మి సమానురాలగు" పదాలు వాడేవారు. విధవలకు  "గంగాభాగీరథీ సమానురాలగు" అనే పదాలు వాడేవారు. ఆ రోజుల్లో పోస్టుకార్డులు ఎక్కువగా వాడేవారు. ఉత్తరం యొక్క శరీర భాగంలో ఆరోగ్య సమాచారాలు, కష్టసుఖాలు, కుటుంబసమస్యలు, బాంధవ్యాలకు అనుగుణంగా సంభోదించుకొంటూ, పెద్దలకు నమస్కారాలు, పిన్నలకు దీవెనలతో ముగిస్తుండేవారు. ఆనాటి ఉత్తరాల్లో ప్రేమ, స్నేహం, పెద్దరికం, చక్కని బాంధవ్యాలు కనిపించేవి.*


*వివాహాలు, అమ్మాయిల వోణీ ధారణ లాంటి శుభ సమాచారాలుంటే ఉత్తరానికి నలుమూలల ‘పసుపు’ రాసి పంపిస్తుండేవారు. చావులాంటి అశుభ వార్తలుంటే ‘సిరా’ ఉత్తరానికి నలుమూలల రాసి పంపిస్తుండేవారు. అలాంటి ఉత్తరాలు వస్తే చదివి బయటే చించి పడేస్తుండేవారు. మామూలు ఉత్తరాలను ఒక ‘తీగెకు గుచ్చి’ పదిలంగా ఉంచుతుండేవారు.*


*తీగకు గుచ్చిన పాత ఉత్తరాలు మళ్లీ మళ్లీ చదివి పాత స్మ్రుతులు నెమరు వేసుకుని ఆనందించేవారు.*


*ఇప్పుడంతా సాంకేతిక పరిజ్ఞానం. వాడి పడేసే సాంప్రదాయం. ప్రేమలు, బంధాలు, బంధుత్వాలు, అనుబంధాల కోసం కాగడా పెట్టి వెతికాల్సిన పరిస్థితి.*

ఎగిరే పక్షిలా

 శ్లోకం:☝️

*ఆశాపాశశతాబద్ధా*

  *వాసనాభావధారిణః ।*

*కాయత్ కాయముపయాంతి*

  *వృక్షాత్ వృక్షమివాణ్డజాః ll*


భావం: వందలాది ఆశల చిక్కుల్లో బంధించబడి, కోరికలను వసనా రూపంలో ధరించి, ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు ఎగిరే పక్షిలా జీవుడు ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి వెళుతున్నాడు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ

 నరేంద్ర మోదీ అధికారములోకి రాకుంటే ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ యెంత అద్వాన్నంగా ఉండేదో  పూర్తి ఆధారాలతో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్  రఘురామ్ రాజన్  దైర్యంగా వ్రాసిన సంచలన వ్యాసానికి తెలుగు స్వేచ్ఛానువాదము.ఈ వ్యాసాన్నిభారతపౌరులు,జాతీయభావాలు గలవారు ముఖ్యం గా హిందువులమని చాటుగా అనుకునేవారు విధిగా చదువాలి.

🚩ఏ దేశ ప్రభుత్వమైనా మొదట చేయాల్సింది తమ దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం గావించడం,రుణ విముక్తి గావించడం,దేశ జి.డి.పిని పెంచుకోవడం, అంతర్జాతీయ స్థాయిలో తన దేశాన్ని నిలదొక్కుకునే విధంగా చేయడం,ఇంటా,బయట శత్రువులను అణచి వేయడం, సైనికపాటవాన్ని ,పటాలాన్ని పెంచుకోవడం మరియు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకో వడం.

🚩ఈ విషయాలలో నరేంద్ర మోదీ రాకపూర్వం భారత్ యెలా ఉండింది?వచ్చాక ప్రస్తుతం ఎలా వుంది?అని  బేరీజు వేసుకున్నప్పుడే అతడి పాలనా దక్షత దేశ ప్రజలకు  అర్థమవుతుంది.వారు 2014 మే 26 వ తేదీన మన్మోహన్ సింగ్ నుండి  14 వ భారతదేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 

🎈మన్మోహన్ సింగ్  నేతృత్వములోనున్న యూ.పి.ఏ ప్రభుత్వ హయాములో అగస్టు,29,2013 నఈ  దేశ మీడియా ఒక సంచలన వార్త ప్రచురించింది.

అది అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశ ప్రతిష్టను  దిగజార్చింది.అదేమంటే అప్పటి కేంద్ర ప్రభుత్వ వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ దేశములోని 5 లక్షల 57 వేల కిలోల బంగారములో 5 లక్షల కిలోల బంగారాన్ని  తీసివేయాలని నిర్ణయిం చింది. అంటే 90%  గోల్డ్ కార్పస్ ను  తనఖా పెట్టాలని నిర్ణయించిందన్న మాట.ఈ వార్త మన దేశ ఆర్థిక పరిస్థితి యెంత క్లిష్ట స్థితిలో ఉందో చెప్పకనే చెబుతుంది.ఆర్థిక నిపుణుడని సర్టిఫికేటు పొందిన  మన్మోహన్ సింగ్ పది సంవత్సరాల పాలనలో  దేశ ఆర్థిక వ్యవస్థను యెంత దిగజార్చారో తెలుస్తుంది.

🎈అప్పుడు మనదేశ గోల్డ్ కార్పస్  నిల్వలు కేవలం 

5 లక్షల 57 వేల కిలోలు మాత్రమే .అప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ.27,750లు. అంటే,మొత్తం బంగారం విలువ రూ.1.38 లక్షల కోట్లు.

🎈ఈ వార్త ప్రచురించ బడ్డాక దేశప్రజలు అగ్రహెూద గ్రులై,అభద్రతకు గురై ఒత్తిడికి లోసయ్యారు.అప్పుడు వాణిజ్య శాఖా మాత్యులు ఆనంద్ శర్మ తన ప్రతిపాదనను ఉపసంహరించుకొని తన అభిప్రాయాన్ని మీడియా తప్పుగా ప్రచురించిందని,సవరణ వివరణనిచ్చారు.

ఆ తరువాత రెండు,మూడు సంఘటనలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది.అంతర్జాతీయంగా భారతదేశ పరువు పోతుందని బంగారాన్ని కుదువబెట్టే  చర్యను మానుకొన్నారు.

🎈మరి ఆర్థిక దుస్థితినుండి బయట పడడానికి మన్మోహన్ సింగ్ నేతృత్వములోని యూ.పి.ఏ. ప్రభుత్వము చేసిన పని అప్పు చేయడం.అదే,విదేశీ కరెన్సీ,నాన్ రెసిడెంట్ డిపాసిట్(F.C.N.R[B])ద్వారా 25బిలియన్ల రుణాలు+32.32 బిలియన్ల (రూ2.23లక్షల కోట్లు)రుణం తీసుకొంది.

🎈మోదీ అధికారములోకి వచ్చేనాటికి  5 లక్షల 57 వేల కిలోల బంగారము మరియు 2.23 లక్షల కోట్ల రుణమున్నది.

🎈ఆ రుణాన్ని వడ్డీతో సహా మోదీ ప్రభుత్వం చెల్లించింది.

🎈బంగారం నిల్వలను 5.57  టన్నులనుండి 

 148 టన్నులకు పెంచారు.

🎈30 వ జూన్ 2021 నాటికి దేశంలో బంగారం నిల్వలు 705 టన్నులయ్యాయి.

🎈తమ కాంగ్రేస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాములో జరిగిన దివాలాకోరు ఆర్థిక వ్యవస్థను కప్పిపుచ్చి రాహుల్ గాంధీ  కాంగ్రేస్  మరియు కమ్యూనిస్టు పార్టీలకు వత్తాసు పలికే Lutyens media సైకోఫాంటిక్ జర్నలిస్టులు  ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని నిరంతరం దుఃఖం నటిస్తున్నారు.

 

 🎈1. అప్పటి RBI గవర్నర్ రఘురామ్ రాజన్ యొక్క ఈ *ఒప్పుకోలు* చదవండి.

 https://indianexpress.com/article/business/banking-and-finance/fcnr-bonds-were-least-bad-option-to-raise-dollars-raghuram-rajan-3011772/


 🎈2. మోదీ  ప్రభుత్వం ఆ రుణాన్ని తిరిగి చెల్లించింది. దీన్ని ధృవీకరించడానికి ఈ లింక్‌పై  క్లిక్ చేసి  ని చదవండి.

 https://www.thehindubusinessline.com/money-and-banking/fcnr-deposits-of-2013-set-to-mature-reserve-bank-ready-to-tackle-volatility/article8472235.ece


 🎈కాంగ్రెస్, కమ్యూనిస్టు మున్నగు పార్టీల తప్పుడు ప్రచారాలను తెలుసుకొని అర్థం చేసుకోండి.


 🎈కావున దేశ ప్రయోజనాల దృష్ట్యా మేలుకోండి.


 🚩స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు యెవరూ చేయలేని పనిని నరేంద్ర మోదీ ఈ 7 ఏళ్లలో చేశారు.  తప్పక చదవండి, మధ్యలో ఎక్కడైనా వదిలేస్తే, మీ కళ్ళు మూసుకుపోతాయి, కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా చదవండి.


 🎈తొలి విజయం:మన దేశాన్ని 200 ఏళ్ల పాటు బానిసలుగా మార్చిన బ్రిటన్ దేశము‌లో  జరిగిన 53 కామన్ వెల్త్ దేశాల సమావేశంలో నరేంద్ర మోదీగారు  జనరల్ ప్రెసిడెంట్ అయ్యాడు.దీనికి ప్రతి భారతీయుడు గర్వించాలి.మరియు అతడి వక్షస్థలం విశాలం కావాలి.


 🎈రెండవ విజయం: UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌లో భారత్‌కు భారీ విజయం లభించింది, అందు సభ్యుడగుటకు 97 ఓట్లు అవసరం,కాగా మనకు 188 ఓట్లు వచ్చాయి.ఇది చూశాక ,భారత ప్రజలు నరేంద్ర మోడీ విదేశాలకు ఎందుకు వెళ్ళాడని ఇంకా అడుగుతారా?


 🎈మూడవ విజయం:ప్రపంచంలోని 25 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితా విడుదలైంది.అందు భారత్ ఉండడం,పాకిస్తాన్ లేకపోవడం గర్వం కాదంటారా?


 🎈నాల్గవ విజయం:మన GST  నెలవారీ పన్ను వసూళ్లు 1 లక్ష కోట్లకు చేరుకొంది.ఇది రైల్వే ప్లాటుఫామ్ పైన టీ అమ్మిన నరేంద్రమోదీ  ఆర్థశాస్త్ర పరిమళం కాదా?


 🎈ఐదవ విజయం:నూతన  సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో అమెరికా మరియు జపాన్‌లను వెనక్కి నెట్టి భారతదేశం రెండవ స్థానానికి చేరుకుంది.


 🎈ఆరవ విజయం:2017-18లో సౌరశక్తి ఉత్పత్తి రెండింతలయింది.దీన్ని చూసి చైనా, అమెరికాలు కంగుతిన్నాయి.


 🎈ఏడవ విజయం:ఆకాశాన్నంటుతున్న భారతదేశ జి.డి.పిని చూడండి.మన దేశ జి.డి.పి 8.2% కాగా,చైనాది 6.7% మరియు అమెరికాది 4.2%.  నరేంద్రుడు  విదేశాలకు ఎందుకు వెళ్ళాడో  ఇప్పుడు భారతీయులకు అర్థమై యుండాలి.


 🎈ఎనిమిదవ విజయం:భూమి,జలము మరియు ఆకాశం అనే మూడు ప్రాంతాల నుండి సూపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించిన మొదటి దేశం మన భారతదేశం.ఇది రాజరాజనరేంద్రుని  యుగం.

మీకు గర్వంగా ఉంటే, “జైహింద్ “అని వ్రాయడం మర్చిపోకండి.

🎈తొమ్మిదవ విజయం:70 ఏళ్లలో పాకిస్థాన్ పేదరికాన్ని ఎప్పుడూ చవి చూడలేదు, కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దొంగనోట్ల రద్దుతో , పాకిస్తాన్ దరిద్రంగా మారింది.

🎈పదో విజయం: 2014లో కాంగ్రెస్ రక్షణ మంత్రి ఎ.కె.ఆంథోనీ   దేశం ఆర్థిక దుస్థితిలో  ఉందని, మనము రాఫెల్, చిన్న జెట్ కూడా కొనలేని స్థితిలో ఉన్నామని అన్నారు.కాని నరేంద్రుడి హయాములో,

 రాఫెల్ డీల్ కుదిరింది.ఎస్-400 కూడా తీసుకుంటోంది.

 మరి కాంగ్రెస్ హయాంలో దేశ సొమ్ము ఎక్కడికి పోయింది?


 🎈పదకొండవ విజయం:సైన్యం బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో యొక్క రక్షణ కవచాన్ని పొందగలిగింది.

 జమ్మూ కాశ్మీర్‌లో సైన్యానికి 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోలు అందించబడ్డాయి.


 🎈పండ్రెండవ విజయము:ఈ 4 సంవత్సరాలలో భారతదేశములో  యెంత అభివృద్ధి జరిగిందో  నేను మీకు చెబుతాను.

 🎈ఆర్థిక వ్యవస్థలో ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టి  భారత్ 6 వ స్థానానికి చేరుకుంది.


 🎈పదమూడవ విజయం:ఆటోమోబైల్  రంగములో  జర్మన్ ను వెనక్కి నెట్టి భారత్ 4 వ స్థానంలో నిలిచింది.


 🎈పద్నాలుగో విజయం:విద్యుత్ ఉత్పత్తిలో రష్యా వెనుకబడి పోగా,భారత్ 3వ స్థానంలో నిలిచింది.


 🎈పదిహేనవ విజయం ;వస్త్ర ఉత్పత్తిలో ఇటలీని అధిగమించి,భారత్  రెండవ స్థానానికి చేరుకుంది.


 🎈పదహారవ విజయం:మొబైల్ ఉత్పత్తిలో వియత్నాం వెనుకబడి పోగా,భారత్ రెండవ స్థానంలో నిలిచింది.


 🎈పదిహేడవ విజయం: ఉక్కు ఉత్పత్తిలో జపాన్‌ను అధిగమించి భారత్ రెండవ స్థానానికి చేరుకుంది.


 🎈పద్దెనిమిదవ విజయం:చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్‌ను అధిగమించి భారత్ నెంబర్ వన్ గా నిలిచింది.


 🎈పంతొమ్మిదవ విజయం:శ్రీ రామమందిరం, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, CAA.NRC మరియు యువతులకు  వివాహ  వయస్సు 18 నుండి 21 సంవత్సరాలకు  బిల్లులను ప్రవేశపెట్టి విజయాన్ని సాధించారు.యూనిఫాం సివిల్ కోడ్, జనాభా నియంత్రణ చట్టములు చేయుటకు అడుగులు పడుతున్నాయి.


 🎈ఇరువదవ విజయం:గాఢ నిద్రలోనున్న హిందువులలో, జాతీయవాదాన్ని మేల్కొల్పారు. ప్రపంచం మొత్తం మీద 125 కోట్ల మంది ఉన్న హిందువులకు తమకంటూ ఒక్క దేశం కూడా లేదనే విషయం చెప్పగలిగారు.

 🚩నేను ఈ పనిని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నాను.


 🚩దీన్నే నరేంద్ర మోదీ యుగం అంటారు.

 🚩మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాదులు కాశ్మీర్ లోయల నుంచి తుడిచిపెట్టుకుపోతున్నారు.

 🚩లష్కరే తోయిబా ఉగ్రవాది నవేద్ వట్ హతమయ్యాడు.

 🚩హిజ్బుల్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

 🚩8 నెలల్లో, 72 మందిని హురాన్ సమీపంలో, 230 మంది ఉగ్రవాదులను నరకానికి పంపారు.


 🚩కాంగ్రేసు పార్టీ ఉగ్రవాదులను చూచి భయందోళనలకు గురికాగా,నరేంద్ర సింగమును చూచి  ఉగ్రవాదులు భయాందోళనలకు గురవుతున్నారు.

🚩 కాంగ్రేసు హయాములో భారత సైన్యం ఉగ్రవాదులకు భయపడగా,నరేంద్రుని పాలన‌లో, ఉగ్రవాదుల దాడి కొరకు సైన్యం విజృంభిస్తున్నది.


 🚩తమ అవినీతి వ్యూహాలు ఫలించలేకపో తున్నాయని, కాంగ్రేస్, కమ్యూనిస్టులు.,తృణమూల్, టి.ఆర్.ఎస్.యు,సమాజ్ వాది,బహుజనసమాజ్, యం.ఐ.యం మున్నగునవన్ని, నరేంద్రుడనే  అభిమన్యుడిని  చంపాలని అనగా  2024 సార్వత్రిక ఎన్నికలలో ఓడించేందుకు పద్మవ్యూహం పన్నుతున్నారు.రోజురోజుకు నరేంద్రమోదీజీకి పెరుగుతున్న కీర్తిప్రతిష్టలను చూసి ప్రతిపక్ష పార్టీలన్ని కంగు తింటున్నాయి.కానీ ఆ అవినీతిపర పార్టీలు మోదీని ఏం చేయలేవు.ద్వాపర యుగములో  అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించడం తల్లి గర్భంలో యున్నప్పుడు గ్రహించాడు.ఈ మోడి రూప అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ప్రవేశించి,తిరిగి ఛేదించుకొని రాగల విద్యలను భరతమాత ఒడిలో నేర్చుకొన్నాడు.ఆమె అజేయురాలు, తన పుత్రుడైన నరేంద్రుడిని అజేయుడగుటకు ఆశీర్వదిస్తున్నది.


 🚩2024లో భరతమాత పుత్రుడిని  గతంలోకంటె  భారీ మెజారిటీతో గెలిపించేలా ఈరోజు మనమందరం ఒక తీర్మానం చేద్దాం, ఆ సంఖ్య ఎవరూ చేరుకోలేని  విధంగా గిన్నిస్ బుక్‌లో నమోదవ్వాలి.


  🚩2024లో నరేంద్రుడిని  తిరిగి భారత ప్రధానిని చేయవలయునని భారత ప్రజలందరికి నమస్కరిస్తున్నాను.



జగత్తే గురువు....

 జగద్గురువు కాదు... జగత్తే గురువు.....

వినయంతో విద్య రాణిస్తుంది. వినయం వల్ల వ్యక్తిత్వం వన్నెకెక్కుతుంది. అహంకారం ఎప్పుడూ ప్రమాదకరమె.. 

ఒకానొక సందర్భంలో ఎవరో ఒక అహంకారి ఓ యోగి దగ్గరకు వెళ్లి ‘నిన్ను అందరూ జగద్గురువని అంటున్నారు కదా.. నిజమేనా...? నీవు అంత గొప్పవాడివా..?’ అని తలబిరుసుగా అడిగాడు.

ఆ ప్రశ్నను విన్న యోగి ప్రశాంతంగా నవ్వి.. ‘నాయనా..! నేను జగద్గురువును అన్న మాట సత్యమే! అయితే జగద్గురువు అనే మాటకు రెండు అర్థాలున్నాయి. మొదటిది జగత్తుకి గురువు. ఇది షష్టీ తత్పురుష సమాసం. రెండవది జగత్తును గురువుగా కలవాడు. ఇది బహువ్రీహి సమాసం.

నీవు అనుకొంటున్నట్లుగా నేను జగత్తుకు గురువు కాను. జగత్తును గురువుగా కలవాడను. తత్పురుష సమాసాన్ని కాను. బహువ్రీహి సమసాన్ని’ అని సమాధానం చెప్పాడు..

ఆ సమాధానం విన్న అహంకారి అవాక్కయ్యాడు. వినయంతో ప్రణామం చేసి అతని దగ్గర సెలవు తీసుకున్నాడు...

మృగశిరకార్తె

  మృగశిరకార్తె ప్రారంభం

*ఉపగ్రహ సమాచారం అందుబాటులో లేని కాలంలోనే నిత్యపరిశీలనతో వాతావరణాన్ని అంచనావేస్తూ వ్యవసాయం చేశారు రైతులు*. ఏడాది 27 నక్షత్రాలను 27 కార్తెలుగా (ఒక కార్తె సుమారు 14రోజులు ఉంటుంది) విభజించి ఆయా కార్తెల్లో వాతావరణం తీరు, దానికనుగుణంగా చేయాల్సిన, చేయకూడని పనులను సామెతలుగా చెప్పారు. ఈ కార్తెలలోని వర్షపాతాన్ని బట్టి ఆ ఏడు అతివృష్టా, అనావృష్టా లేక సామాన్యమా చెప్పగలిగేవారు. తొలకరి వానలు  మృగశిరకార్తె (సుమారు జూన్‌ 8- 21)లో ప్రవేశిస్తాయి. ‘మృగశిర కురిస్తే ముంగిళ్లు చల్లబడతాయి.


మృగశిర చిందిస్తే మిగిలిన కార్తులు కురుస్తాయి, మృగశిర వర్షిస్తే మఖ గర్జిస్తుంది, మృగశిరలో తొలకరి వర్షిస్తేనే మఖలో వర్షాలు పడతాయి, మృగశిర చిందిస్తే ముసలెద్దు రంకె వేస్తుంది, మృగశిరలో వేసిన పైరు మేలు చేస్తుంది’ తదితర సామెతలు సేద్యంలో మృగశిర ప్రాధాన్యాన్ని చెబుతాయి.


ఆరుద్ర (జూన్‌ 22- జూలై 5) కార్తెలో వర్షాలు ఎక్కువ పడడం పంటకు చాలా అవసరం. ఆ అవసరాన్ని తెలిపేవే ‘ఆరుద్ర వాన అదను వాన, ఆరుద్ర కురిస్తే దారిద్య్రం ఉండదు, ఆరుద్రకార్తె విత్తనానికి- అన్నం పెట్టిన ఇంటికి చెరుపు లేదు, ఆరుద్రలో అడ్డెడు చల్లితే సులువుగా పుట్టెడు పండుతాయి’ లాంటి సామెతలు.


తరువాత కార్తెలు పునర్వసు (జూలై 6- 19) పుష్యమి (జూలై 20- ఆగష్టు 02). ‘పునర్వసు, పుష్యములు వర్షిస్తే పూరెడుపిట్ట అడుగైనా తడవదు’ సామెత ఆ రోజుల్లో వానలు తక్కువ అనే అంశాన్ని తెలుపుతుంది. ఆపై వచ్చే ఆశ్లేష కార్తె(ఆగష్టు 3- 16)లో నాన్పుడు వర్షం కురుస్తుంది. నాట్లు కూడా త్వరగా సాగుతాయి. అధిక వర్షం సాగు పనులకు ఆటంకం కలిగిస్తుంది. అరికాలు తడి అయ్యేంత వర్షం నాట్లకు అనుకూలం. అందుకే ‘ఆశ్లేషలో ఊడిస్తే అడిగినంత పంట, ఆశ్లేషలో అడుగునకొక చినుకు అయినా అడిగినన్ని పండలేను అందట వరి.


ఆశ్లేషలో అడ్డెడు చల్లడం మేలు’ మొదలైనవి ఆశ్లేష కార్తెకు సంబంధించిన సామెతలు. మఖ (ఆగష్టు 17- 30) శ్రావణంలో వస్తుంది. వానలు ఎక్కువ. ‘మఖలో మానెడు చల్లడం కన్నా ఆశ్లేషలో అడ్డెడు చల్లడం మేలు, మఖలో చల్లిన విత్తనాలు మచ్చలు కనబడతాయి, మఖ ఉరిమితే వెదురు మీద కర్రయినా పండుతుంది’ లాంటివి ఈ కార్తెలో చేయాల్సిన వ్యవసాయ పనుల గురించి తెలియచేస్తాయి.


ముందు వచ్చే కార్తెలలో వర్షాలు అంతగా కురవకపోయినా వర్ష రుతువులో వచ్చే మఖ, పుబ్బ (ఆగష్టు 31- సెప్టెంబరు 13) కార్తెలలో తప్పక కురవాలి. లేకపోతే క్షామం తప్పదు. ‘మఖ పుబ్బలు వరుపయితే మహా ఎత్తయిన క్షామం, మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు’ (పుట్టగొడుగులు మఖలో పుట్టి పుబ్బలో మాడిపోతాయి. ఏదైనా స్వల్పకాలంలోనే అణగిపోతే దీనిని వాడతారు) సామెతలు దీన్ని సూచిస్తాయి. ‘పుబ్బలో చల్లడం దిబ్బ మీద చల్లినట్లే’ అనేది పుబ్బలో విత్తడం మంచిది కాదని చెబుతుంది.


ఉత్తర చూసి ఎత్తరగంప

ఉత్తర కార్తె సెప్టెంబరు మధ్యలో వస్తుంది. ఖరీఫ్‌ పంట ఒకదశకు చేరుతుంది. ఈ కార్తె ప్రవేశించే నాటికి వానలు సరిగా పడకపోతే సాగు కష్టం అని చెప్పడమే ఈ సామెత ఉద్దేశం. దీన్ని సూచించేందుకే గంపను ఎత్తి పక్కన పెట్టమని చెప్పారు జానపదులు. ఉత్తరలో వరినాటడానికి ఆలస్యం అవుతుంది. వేరుశనగ, సజ్జ, పప్పు ధాన్యాలు కూడా ఈ కార్తెలో విత్తకూడదు. జొన్న మాత్రం కొన్ని ప్రాంతాలకు అనుకూలం. ఉలవ అన్ని ప్రాంతాలలో చల్లడానికి మంచి అదును. అందుకే ‘ఉత్తర పదును ఉలవకే అదును’ అనే సామెత పుట్టింది. ‘ఉత్తర ఉరుము తప్పినా, రాజుపాడి తప్పినా, చెదపురుగుకి రెక్కలొచ్చినా కష్టం, విశాఖ చూసి విడవర కొంప, ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం’లాంటి సామెతలూ ఇలాంటివే.


ఉత్తర తరువాత వచ్చేది హస్త (సెప్టెంబరు 27- అక్టోబర్‌ 11). ఆశ్లేషలో నాటిన వరిపంట హస్తకార్తె వచ్చే సరికి అనాకుపొట్ట దశకు వస్తుంది. చిత్తకార్తెలో (అక్టోబరు 11- 23) చిరుపొట్ట వస్తుంది. వెన్ను చిరుపొట్టతో ఉంటుంది. ఈ సమయంలో నీరు చాలా అవసరం. అప్పుడు వర్షం లేకపోతే పంట చేతికి రావడం కష్టం. ‘హస్త కురవక పోతే విత్తినవాడూ, విత్తని వాడూ ఒక్కటే, హస్తకు అనాకుపొట్ట, చిత్తకు చిరాకు పొట్ట, హస్త చిత్తలు ఒక్కటైతే అందరి సేద్యం ఒక్కటే, చిత్త కురిస్తే చింతలు కాస్తాయి, చిత్త స్వాతులు కురవకపోతే చిగురుటాకులు మాడిపోతాయి…’ లాంటి సామెతలు చాలా ఉన్నాయి.


యథా చిత్త తథా స్వాతి

చిత్తలో వర్షం ఎలా ఉంటుందో, స్వాతిలో కూడా అలాగే ఉంటుంది. ఈ కార్తెలో సాధారణంగా గాలివానలు వస్తాయి. ‘స్వాతివాన చేనుకు హర్షం (మెట్ట ప్రాంతం), చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే వీసానికి పుట్టెడు పండుతానంటుంది జొన్న’ లాంటి సామెతలు తెలుగులో ఎన్నో ఉన్నాయి. విశాఖ కార్తె వచ్చేప్పటికి వరి కోతకు సిద్ధంగా ఉంటుంది. వర్షం అవసరం ఉండదు. ఈ అనుభవంతో వచ్చిన సామెత ‘విశాఖ కురిస్తే పంటకు విషమే’. అయితే.. మఖ, పుబ్బల్లో చల్లిన ఆముదాలు విశాఖలో పొట్టమీద ఉంటాయి. అప్పుడు వాటికి వర్షం అవసరం. అందుకే ‘విశాఖ వర్షం ఆముదాలకు హర్షం’! ఇక భరణి (ఏప్రిల్‌ 27- మే 10), కృత్తిక (మే 11- 24), రోహిణి (మే 25- జూన్‌ 7)లపై ‘భరణి కురిస్తే ధరణి పండును, కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు, రోహిణిలో విత్తితే రోటిలో విత్తినట్లే’ లాంటివి రైతుల ప్రకృతి పరిశీలనా దృష్టికి నిదర్శనాలు.


ఊరిముందరి చేను… ఊళ్లో వియ్యం అందిరావు

ఊరికి సమీపంలో చేను ఉంటే ఊళ్లో ఉండేవారు, వచ్చిపోయే వారు, పశువుల బెడద… ఇంత కష్టం ఉంటుంది. ఇక ఊళ్లో వియ్యం సంగతి… భార్యా భర్తలిద్దరిది ఒకే ఊరయితే ఆ ఇంట్లో విషయం ఈ ఇంట్లో, ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో తెలిసి సంసారం ఇబ్బందికరంగా సాగుతుంది. ఈ సామెత పుట్టుకకు కారణం ఇదే. ‘కర్ణునితో భారతం సరి కార్తీకంతో వానలు సరి, ఫాల్గుణమాసపు వాన పది పనులకు చెరుపు’ ఇలా ఎన్నో సామెతలు జీవితానుభవం నుంచి పుట్టాయి.


వందల ఏళ్లుగా ఈ విజ్ఞానం రైతులకు దారిదీపంగా నిలిచింది. ఇప్పుడు ఈ విజ్ఞానం రూపుమాసిపోతోంది. ఇప్పటి వారికి చాలా సామెతలు, ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించినవి తెలియవు. వీటిని పాఠ్యప్రణాళికలో భాగం చేయాలి. అప్పుడే మనదైన విజ్ఞానం ముందుతరాలకు భద్రంగా అందుతుంది.

*నేడు మృగశిరకార్తె ప్రారంభం*

              ఇతి శివమ్

శ్రీశైల క్షేత్రం

 🕉️శ్రీశైల క్షేత్రం🕉️

 ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు జిల్లాలో వెలసిన స్వయం భూలింగ మూర్తి ఉన్న క్షేత్రము. విశేషించి అష్టాదశశక్తి పీఠములలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా అమ్మవారు ఒక శక్తిపీఠం. శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. ఆ పరమేశ్వరుడు వెలసిన కొండపేరు శ్రీగిరి. మనం ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయింది. దానిపేరు శ్రీగిరి. శ్రీశైలంలో స్వామి లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు. శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒకమాట చెప్పింది. ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని చెబుతారు. కానీ దాని తాత్త్వికమయిన రహస్యం వేరు. శ్రీ’లో ‘శ’కార, ‘ర’కార, ‘ఈ’కారములు ఉన్నాయి. ఈ మూడక్షరములు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి – ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలం. ఈ మూడు శక్తులు మమైకమయిన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలం ఒక శక్తి పీఠం. ఆ కొండమీద అడుగుపెట్టిన వాడు సరస్వతీ కటాక్షమును కానీ, లక్ష్మీ కటాక్షమును గానీ, జ్ఞానమును గానీ నోరువిప్పి అడగక్కరలేదు. అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తిమంతమయిన కొండ. శ్రీశైల పర్వతం ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు ఆలవాలము. అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయమును చెప్తారు.


గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలమునంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుహ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు. సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన ‘నాన్నగారూ, తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన ప్రదక్షిణతో సమానం. కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను’ అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈవిధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు. అపుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు.


సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు. వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు 24 క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు. అపుడు శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం క్రింద కూర్చున్నాడు. అపుడు పార్వతీదేవి కూడా వెళ్ళింది. పిల్లవాడు ఎలా ఉన్నాడో అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్లి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది. ఆయన మహా జ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటుంది. పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉంది


సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లెచెట్టు క్రిందకి వచ్చాము కదా అని అక్కడ వెలశారు. మనం అలకచేతనో, అజ్ఞానం చేతనో మన శరీరములను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాము. ఇలాంటి వాళ్ళు ఎవరయినా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు. శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. మీరు మీ ప్రదేశం నుంచి శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది మీ శరీరం. ఆ బట్టలతో కొండమీదకి వెళతారు. మీరు శుభ్రపడి దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. మీరు ఆ క్షేత్రమునకు వెళ్ళగానే ఆశౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరకు వెళ్లి ధూళి దర్శనమునకు వచ్చాము అని చెప్పి లోపలి వెళ్లి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకుని, శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగి పోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడుట. దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చెయ్యాలి.


అసురసంధ్య వేళలో నందివాహనం భూమండలం మీదనుండి వెడుతుంది. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైలపర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమయిన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు. జన్మ చరితార్థం అయిపోతుంది. చెంచులు చెవిటి మల్లన్నా అని అరుస్తూ ఉండేవారు. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలం స్వామీ వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామమునలు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలి వెళ్లి మన గోత్రం, పేరు, చెప్పుకోవాలి. గణపతి మన గోత్ర నామమును చిట్టాలో రాసేసుకుంటారు.


శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం, విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో నని అనుకున్న వాళ్లకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి.


అందుకే అనేక శివాలయములలో చరనంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద వున్నా త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి. అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా? అని. అపుడు శంకరుడు “శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగముల లోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి ‘మా అయన దిగబడిపోతున్నాడు. అందుకని ఎవరయినా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి’ అన్నది. అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అపుడు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. అపుడు ప్రతివాడూ తాను ఏదో పాపం చేసి ఉండక పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు.


ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది. అపుడు పార్వతీ దేవి ఏమమ్మా, అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా. అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది. అపుడు ఆవిడ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే – అమ్మా నేను ఇప్పడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం లేదు, పుణ్యం లేదు. రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇపుడు నా ఖాతాలో పాపం లేదు. పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను. నేను అర్హురాలను’ అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను’ అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు. అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమె మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది.

జన్మలవాసనలచే

 .

                _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*ఆశాపాశ శతాబద్ధాః*

*వాసనా భావధారిణఃl*

*కాయాత్కాయ ముపాయన్తి*

*వృక్షాత్ వృక్షమివాణ్డజాఃll*


తా𝕝𝕝 

ఎట్లయితే పక్షులు ఒక చెట్టునుండి మరొక చెట్టుకు నివాసం మారుస్తూ ఉంటాయో ఆ విధంగానే కూడా మానవులు  నిత్యం వందలాది ఆశలమధ్య బంధింపబడుతూ అనేకానేక జన్మలవాసనలచే వివిధ శరీరాలను ధరిస్తూ ఒక జన్మ నుండి మరో జన్మ పొందుచున్నారు.

నాచన సోమనాథుని కవితాశిల్పం!

 నాచన సోమనాథుని

కవితాశిల్పం!


 ‘ఉత్తర హరివంశం’లోని ఈ పద్యశిల్పంఅనల్పం. దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకపోయినవారు ప్రబంధక కవులు!


మొల్ల తెనాలి రామకృష్ణులు ఈ చమత్కారాన్ని అందిపుచ్చుకున్నారు


తెనాలి రామకృష్ణకవి పేరడి


ఆతుకూరిమొల్ల శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన తెలుగు కవయిత్రి. ఆమె కృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించినప్పుడు రాయలవారిని ఈ క్రిందిపద్యం తో ప్రస్తుతించింది. 


"అతడు గోపాలకుం డితడు భూపాలకుం, డెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతడు పాండవ పక్షు డితడు పండితరక్షు, డెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతడు యాదవపోషి ఇతడు యాచకతోషి, డెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతడు కంసధ్వంసి ఇతడు కష్టధ్వంసి, డెలమినాతని కన్న నితడు ఘనుడు,


పల్లెకాతండు పుట్టణ ప్రభువీతండు

స్త్రీల కాతండు పద్మినీ స్త్రీల కితడు

సురలకాతండు తలప భూసురులకితడు

కృష్ణుడతండు శ్రీమహాకృష్ణుడితడు"

                        మొల్ల;


శ్రీకృష్ణునకు - కృష్ణరాయలకు మధ్య ఉండే తేడాలను చూపిస్తు శ్రీకృష్ణునికన్నా కృష్ణదేవరాయలే మిన్న అని నిరూపిస్తున్న చాటుపద్యం ఇది.


మొల్ల పద్యాన్ని విన్న వికటకవి తెనాలిరామకృష్ణుడు తనసహజధోరణిలో దానిని అనుకరిస్తూ ఈ క్రిందిపద్యం చెప్పాడని అంటారు.


 బహుశః ఇదే మొట్టమొదటి పేరడి పద్యమేమో. 


ఈశ్వరునితో ఎద్దుని పోలుస్తూ చెప్పిన ఈ పద్యం చూడండి.


అతడంబకు మగం డితడమ్మకు మగండె, లమినాతని కన్న నితడు ఘనుడు,

అతడు శూలము ద్రిప్పు నితడు వాలము ద్రిప్పు, నెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతడమ్మున నేయు నితడు కొమ్మున డాయు, నెలమినాతని కన్న నితడు ఘనుడు,

అతని కంటను చిచ్చు నితని కంటను బొచ్చు, నెలమినాతని కన్న నితడు ఘనుడు,


దాతయాతండు గోనెల మోత యితడు

దక్షుడాతండు ప్రజల సంరక్షుడితడు

దేవుడాతండు కుడితికి దేవుడితడు

పశుపతి యతండు శ్రీమహ పశువితండు


బాగుంది కదా!మొల్లపద్యాన్ని హేళనచేద్దామనుకున్నాడు.కానీ,

మొల్లపరిమళం దీనికి వచ్చిందా?


అభ్రంకషంబైన యాలపోతునీతండు

    త్రుంచినాడీతండు పెంచినాడు


సాధు సమ్మతముగా సామజంబునితండు

    గాచినాడీతండు త్రోచినాడు


బహిర్ముఖార్థమై పర్వతేశునీతండు 

    దాల్చినాడీతండు వ్రాల్చినాడు


ఫణపరంపరతోడి పన్నగంబు నీతండు

    మెట్టినాడీతండు సుట్టినాడు


నేడు నాడును నాడును నేడు మనకు

జూప జెప్పంగ జెప్పంగ జూప గలిగె

ననుచు కొనియాడు సంయమి జనులకొదవె

రజితగిరిమీద హరిహరారాధనంబు


     

 వర్ణించింది హరిహరనాథుణ్ని కదా! అతనెలా ఉన్నాడనుకున్నారు?


 ఒకవైపు భాగమేమో బాగా ఏపుగా ఉన్న- అభ్రంకషం అంటే చాలా ఎత్తయిన- ఆలపోతును చంపిందట, ఇంకో వైపున్న రూపమేమో ఆలపోతును పెంచుకుందట. కృష్ణావతారంలో అరిష్టాసురుడనే- ఎద్దు రూపంలో వచ్చిన రాక్షసుణ్ని సంహరించింది- హరి, ఇక ఎద్దును పెంచుకునేవాడు అంటే- నంది వాహనుడైన హరుడే. అదే రూపంలో ఒకవైపు భాగమేమో సామజాన్ని, అంటే ఏనుగును కాచిందట- రక్షించాడట! ఇది గజేంద్రమోక్ష ఘట్టం. అంటే శ్రీహరి రూపం. మరోవైపు ఏనుగును తోసేశాడట- గజాసురుణ్ని చంపటం. ఈ తలనే వినాయకుడికి అతికించారు. ఇది శివరూపం. ఆ మూర్తిలో ఒకభాగం పర్వతేశుణ్ని దాల్చిన రూపమట! ఇది గోవర్ధనోద్ధరణం చేసిన కృష్ణుడిది. ఇంకోవైపు పర్వతాన్ని- అది మేరుపర్వతం, చేతిలోకి విల్లుగా చేసుకున్న శివుడిది. పడగల వరుసతో ఉన్న పన్నగాన్ని ఒకాయనేమో మెట్టాడట- ఆయన శేషతల్పం మీద పవళించిన హరి, ఇంకొకాయనేమో భుజంగాన్ని చుట్టుకున్నాడట- ఆయన కైలాసాధీశుడైన హరుడు! ఇద్దరూ కలిసిందే హరిహర రూపం. ఈవిధంగా రజతగిరి మీద హరిహరారాధనం చేసే భాగ్యం మనకు దక్కించాడు సోమన. 

      రెండు మూర్తులు కలిసిన రూపాన్ని, రెండు అవతారాలకు సమానంగా ఉండే అంశాలతో పోలికపెట్టాడు నాచన సోమన. అంతేనా సంస్కృత మణులు, తెలుగు పగడాలను ఒడుపుగా ప్రయోగించి మణిప్రవాళంలో రచించాడు. శివకేశవులకు ఇలా అభేదం చెప్పడంలో సోమన చూపిన ప్రతిభ అసామాన్యం కదూ!రసజ్ఞభారతి సౌజన్యంతో-

భజగోవిందం

 ॐ                 भज गोविन्दं

                    భజగోవిందం 

                 (మోహముద్గరః) 

            BHAJA GOVNDAM   

 

      (श्रीमच्छंकरभगवतः कृतौ 

       శ్రీమచ్ఛంకరభగవత్పాద కృతం 

           BY SRI ADI SANKARA)


                           శ్లోకం :16/31

                   SLOKAM :16/31

                    

శ్రీ హస్తామలకుడు 


अग्रे वह्निः पृष्ठेभानुः,

रात्रौ चुबुकसमर्पितजानुः।

करतलभिक्षस्तरुतलवासः,

तदपि न मुञ्चत्याशापाशः॥१६॥

                    ॥भज गोविन्दं॥ 


అగ్రే వహ్నిః పృష్ఠేభానుః

రాత్రౌ చుబుకసమర్పితజానుః |

కరతలభిక్షస్తరుతలవాసః

తదపి న ముంచత్యాశాపాసః ||16|| 

                    ॥భజ గోవిందం॥ 


    ఎదురుగా చలిమంట పెట్టుకొని,  

    వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, 

    రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకుని కూర్చుంటాడు; 

    తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. 

    చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు. 


అనువాదం


దినకరాగ్నుల నాశ్రయించి పగలు, 

                                దేహము 

ముడుచుకొనుచు నిశిన, 

            వడలిన దేహంపు చలి 

గాచుకొనుచు, నిరాశ్రయుడై 

                          తరుల నీడన 

చేతులు పాత్రగ భిక్షగొనుచు 

                          నాశ విడడు. 


    सूर्यास्त के बाद, 

    रात्रि में आग जला कर और 

    घुटनों में सर छिपाकर सर्दी बचाने वाला , 

    हाथ में भिक्षा का अन्न खाने वाला, 

    पेड़ के नीचे रहने वाला भी अपनी इच्छाओं के बंधन को छोड़ नहीं पाता है॥१६॥


    One who warms his body by fire after sunset,  

    curls his body to  his knees to avoid cold;  

    eats the begged food and sleeps beneath the tree, 

    he is also bound by desires, even  in these difficult situations. 


https://youtu.be/ImWKhB_PMiw 


                          కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

కంచి కామక్షి తల్లి 🕉️

 🕉️ కంచి కామక్షి తల్లి 🕉️


కంచి కామక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు తల్లి సంకల్పమే ప్రధానం. ఇది గొప్ప విశేషం

🕉️ సమస్త భూమండలానికి నాభి స్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభినుండే తల్లి పోషిస్తుంది. అందుకే కామక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది.


🕉️  ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ "సుగంధ కుంతలాంబ" అవతారంలో దర్శించవచ్చు.

(ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది. )


🕉️  ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ "ఢంకా

వినాయకుడు" దర్శనమిస్తాడు.

(ఏకాంబరేశ్వర,సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా భజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు)


🕉️ కామాక్షి తల్లి ఆలయంలో "అరూప లక్ష్మి" దేవి దర్శనమిస్తుంది. కామాక్షితల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మి తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే భర్తను నిందించిన దోషం పొతుంది , మరియు స్త్రీపురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూప లక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాపవిమోచనం అవుతుంది.


🕉️ కాత్యాయనీ దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచిపురం. తపస్సులో భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకతలింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో(కౌగిలితో) కాపాడుకుంటుంది . అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగం పై అగుపిస్తాయి.


🕉️ కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న ఉత్సవ కామక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు, శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు. (తనను నమ్మినవారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామక్షి)


అమ్మధ్యానంలో, "శోకాపహంత్రీ సతాం" అనే దివ్య వాక్కు గురించి వర్ణణ ఉంది. ఎవరైతే సతతం మనః శుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో, అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లపుడు సిద్ధంగా ఉంటుంది . తనయొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది , భుజం తట్టి నేనున్నాని ధైర్యం చెబుతుంది.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 84*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 84*


విడదిలో పర్వతకుడిని కలుసుకున్నాడు చాణక్యుడు. పరామర్శలూ, కుశల ప్రశ్నల అనంతరం "మా అర్ధరాజ్యం విషయం ఏం చేశారు ?" అని సూటిగా అడిగేశాడు పర్వతకుడు. 


చాణక్యుడు నవ్వి "ఆ విషయమే మనవి చెయ్యడానికి వచ్చాను. పట్టాభిషేకం మహోత్సవానికి రెండు మూడు రోజులదాకా శుభముహూర్తాలు లేవట... ముహూర్తం నిర్ణయం కాగానే అధికారికంగా పట్టాభిషేకం గురించి ప్రకటిస్తాం. ఒకే ముహూర్తంలో మీరూ, చంద్రుడూ మగధ సింహాసనంపై అభిషిక్తులవుతారు. అంతవరకూ మీరు మా విశిష్ట అతిధులు" అని చెప్పాడు వినయంగా. 


రెండు మూడు రోజుల్లోనే ముహుర్తమన్న మాట విన్నాక పర్వతకుడు శాంతించాడు. ముందు అధికారికంగా చంద్రునితో పాటు అర్థరాజ్యానికి అభిషిక్తుడైతే, ఆ తర్వాత వీలు చూసుకుని సింహాసనాన్ని పూర్తిగా ఆక్రమించుకోవచ్చు. అంతకుమించి ప్రస్తుతం చెయ్యగలిగిందేమీ లేదు. యుద్ధంలో తన వెంట తెచ్చిన సైన్యం యావత్తు తుడిచిపెట్టుకుపోయింది. కొద్ది మంది అంగరక్షకులు మాత్రమే వెంట ఉన్నారు. సామరస్యంగానే కార్యాన్ని సాధించుకోవడం మంచిది. 


"సరే ... రెండు మూడు రోజుల్లోనే అంటున్నారు గదా... అప్పటిదాకా వేచివుంటాంలెండి" చెప్పాడు పర్వతకుడు తన సోదరుడు, కుమారులను కనుసైగలతోనే సంప్రదించి. 


"శుభం..." అంటే చాణక్యుడు లేచి "అన్నట్లు, వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు మాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా మీ గౌరవార్థం ఈ రాత్రి విందు ఏర్పాటు చేశాం. సపరివార సమేతంగా తమరు తప్పక విచ్చేయాలి" అని ఆహ్వానించాడు. 


"అలాగే..." నంటూ తలవూపాడు పర్వతకుడు. 


ఆ రాత్రి విలాస మందిరంలో పర్వతకుని గౌరవార్థం ఏర్పాటైన విందుకు ఆ విజయానికి కారకులైన ప్రముఖులందరూ వచ్చారు. చాణక్యుడు విందులో ఏ పదార్థం వండించబోతున్నా "ముందు పర్వతకుల వారికి... వారే ఈ నాటి విశిష్ట అతిథి" అంటూ సేవకులను ఆదేశిస్తూ పర్వతకుని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ పొగడ్తలకు పొంగిపోతూ పర్వతకుడు పీకల దాక మద్యపానం చేశాడు. 


ఆ సమయంలో, ఆ విందుకి కాస్తంత ఆలస్యంగా వచ్చాడు రాక్షసామాత్యుడు. అతని వెంట అపురూప సౌందర్యరాశి అయినా పదహారు వత్సరాల సుందరాంగి వయ్యారాలు వలకబోస్తూ వచ్చింది. ఆ సుందరిని చూసీ చూడగానే అతిధులందరికీ మతులుపోయాయి. ఎవరికి వారే ఆ సుందరి తమది అయితే బాగుండునని ఆశపడ్డారు. అతిథులతో పాటు ఇటు చంద్రగుప్తుడూ, అటు పర్వతకుడూ మొహావేశంతో తదేకదీక్షతో ఆ సుందరాంగిని వీక్షించసాగాడు. 


చంద్రుని హావభావాలు గమనిస్తున్న రాక్షసుడు తన ఎత్తుపారనున్నందుకు లోలోపల సంతోషిస్తూ, ఆ సుందరిని చెయ్యిపట్టుకుని తీసుకువచ్చి చంద్రుని ముందు నిలిపి "కుమారా ! విందుకు ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలి. నా ఆలస్యానికి కారణం ఈ మధుశాలిని..." అని సంజాయిషి యిచ్చుకుని "మీ విజయోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకొని మీకు నా ప్రత్యేక కానుకగా ఈ మధుశాలినిని సమర్పించుకుంటున్నాను. ఈ రాత్రి ఈ సుందరిపొందులో తమరు స్వర్గసుఖాలు చవిచూడాలని నా ఆకాంక్ష" అని చెప్పాడు. 


చంద్రగుప్తుని ముఖం వికసించింది. పర్వతకుని ముఖంలో ఈర్ష్య, అసంతృప్తి వ్యక్తం అయింది. మిగతా వారంతా చంద్రుని అదృష్టానికి లోలోపలే ఈర్ష్య పడ్డారు. 


సరిగ్గా ఆ సమయంలో చాణక్యుడు కల్పించుకుంటూ "చంద్రా ! ఈనాటి ఈ విందుకు పర్వతకుల వారే మనకి విశిష్ట అతిధులు. విందులో లభించే కానుకైనా, కన్యకైనా వారికే చెందడం ధర్మం, న్యాయం" అని చెప్పాడు గంభీరంగా. 


చంద్రుని మొహం ముడుచుకుపోయింది. పర్వతకుని మొహం వికసించింది. అతడు మందహాసం చేస్తూ "చాణక్యుల వారు ధర్మస్వరూపులు. ధర్మనిర్ణయంలో వారికి వారే సాటి" ప్రశంసించాడు మద్యం మత్తులో. 


రాక్షసుడు కల్పించుకుంటూ "కావచ్చు. కానీ ఈ కానుక ప్రత్యేకంగా ప్రభువుల వారి కోసం" అంటూ నిరసన వ్యక్తం చేశాడు. 


చాణక్యుడు నవ్వి "పర్వతకుల వారు కూడా ప్రభువులే... పైగా వయస్సులో, అనుభవంలో చంద్రుని కన్నా అధికులు. అందుకే ఈ కన్య ఆ మహాపురుషునికే అనుభవొక్తం" అని స్పష్టంచేశాడు. 


ఇక అంతమందిలో మరేం మాట్లాడలేక వెర్రి మొహం వేశాడు రాక్షసుడు. కానీ ఎలాగైనా పర్వతకుని ప్రాణాలు కాపాడాలన్న దుగ్ధతో అతడిని ఎలా నిరోధించాలా అన్న ఆలోచనలో పడ్డాడు. 


"భేష్... భేష్... చాణక్యుల వారి ఆజ్ఞ శిరసావహిస్తాం.... ఈ కన్యామణిని అనుభవిస్తాం" అంటూ పర్వతకుడు లేచి మధుశాలిని భుజం మీద చెయ్యివేసి తూలుతూ ఆమెతో శయ్యామందిరానికి వెళ్లిపోయాడు. అతిథులంతా పత్వతకుని అదృష్టానికి లోలోపలే ఈర్ష్య చెందుతూ తమ తమ వసతులకి వెళ్ళిపోయారు. రాక్షసుడు కూడా చేసేదేమీ లేక తన నివాసగృహానికి బయలుదేరాడు. అక్కడ చాణక్య చంద్రగుప్తులు మాత్రమే మిగిలారు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అమ్మలగన్నయమ్మ

🙏


"అమ్మలగన్నయమ్మ!!


*బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రాజద్వారం పై ఉండే ఈపద్యం గురించి తెలుసుకొందాము*


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ

చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!!


విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. 

ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. 

మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాన్ని ఇచ్చేస్తాయి. 


ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. 

కొన్ని కొన్ని చేయకూడదు. 

పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. 

అది మనవల్ల కాదు. 

మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. 

అది కష్టం. 

కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన 

గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.


’అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ –

ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. 

అటువంటి దుర్గమ్మ మాయమ్మ. 

’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, 

మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు.


’అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. 

’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన 

బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన 

రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – 

ఈ ముగ్గురికీ అమ్మ – 

ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – 

అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – 

ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – 

ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, 

మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. 


ఈ ముగురమ్మల మూలపుటమ్మ. ’చాల పెద్దమ్మ’ – 

ఇది చాలా గమ్మత్తయిన మాట. 

చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – 

అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. 

ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదం లేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. 

అలా ఉండడం అనేదే మాతృత్వం. 

ఇది దయ. 

దీనిని సౌందర్యం అంటారు. 

దయకు సౌందర్యం అని పేరు. 

అది ప్రవహిస్తే సౌందర్యలహరి.


అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి 

ఈ భూమిని తిప్పుతూ, 

లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.


’సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – 

సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. 

దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. 

అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.


’తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – 

ఇదొక గొప్పమాట. 

అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?

బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి

చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి


మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, 

మహేశ్వరి, 

వైష్ణవి, 

మహేంద్రి, 

చాముండ, 

కౌమారి, 

వారాహి, 

మహాలక్ష్మి.


ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. 

వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. 

ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. 

వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.


’రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’

అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. 

ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో 

ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – 

ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – 

ఆవిడ లలితా పరాభట్టారిక – 

ఆ అమ్మ మాయమ్మ.


’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – 

ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. 

నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. 

దయతో ఇచ్చేయ్యాలి.


అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. 

ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – 

ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. 

కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. 


కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, 

కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, 

పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, 

ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.


ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – 

అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’

మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. 


కానీ మీరు రైలులో కూర్చున్నా, 

బస్సులో కూర్చున్నా 

స్నానం చెయ్యకుండా కూడా 

ఎక్కడ ఉన్నా కూడా – 

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – 

ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు.


మీరు అస్తమాననూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. 

అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. 

అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ 

అమ్మతనంతో ప్రారంభమవుతుంది.


ఆవిడ రాజరాజేశ్వరి. 

అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి 

ఆవిడ పొంగిపోతుంది. 

ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని 

మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు.


కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ అనడానికి కష్టం ఏమిటి?


ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు 

ఆయన ఒక ఋషి. 

అందుకని ఆ పద్యమును అనుగ్రహించినారు.

ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ..

స్వస్తి..!!


*సమస్త లోకా సుఖినోభవంతు.*


                             శ్రీ మాత్రే నమః !🙏🙏👌👌