జగద్గురువు కాదు... జగత్తే గురువు.....
వినయంతో విద్య రాణిస్తుంది. వినయం వల్ల వ్యక్తిత్వం వన్నెకెక్కుతుంది. అహంకారం ఎప్పుడూ ప్రమాదకరమె..
ఒకానొక సందర్భంలో ఎవరో ఒక అహంకారి ఓ యోగి దగ్గరకు వెళ్లి ‘నిన్ను అందరూ జగద్గురువని అంటున్నారు కదా.. నిజమేనా...? నీవు అంత గొప్పవాడివా..?’ అని తలబిరుసుగా అడిగాడు.
ఆ ప్రశ్నను విన్న యోగి ప్రశాంతంగా నవ్వి.. ‘నాయనా..! నేను జగద్గురువును అన్న మాట సత్యమే! అయితే జగద్గురువు అనే మాటకు రెండు అర్థాలున్నాయి. మొదటిది జగత్తుకి గురువు. ఇది షష్టీ తత్పురుష సమాసం. రెండవది జగత్తును గురువుగా కలవాడు. ఇది బహువ్రీహి సమాసం.
నీవు అనుకొంటున్నట్లుగా నేను జగత్తుకు గురువు కాను. జగత్తును గురువుగా కలవాడను. తత్పురుష సమాసాన్ని కాను. బహువ్రీహి సమసాన్ని’ అని సమాధానం చెప్పాడు..
ఆ సమాధానం విన్న అహంకారి అవాక్కయ్యాడు. వినయంతో ప్రణామం చేసి అతని దగ్గర సెలవు తీసుకున్నాడు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి