13, డిసెంబర్ 2020, ఆదివారం

మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం - రుద్రం

 మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం - రుద్రం...

************************************

శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది.

రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు.

నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |

నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||


నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవరు చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం  ప్రాప్తిస్తుంది.


నమకం విశిష్టత :


నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయుధాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.


అనువాకం – 1:

***************

తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.


అనువాకం – 2 :

****************

ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.


అనువాకం – 3:

***************

ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారణకు కూడా చదువుతారు.


అనువాకం – 4:

***************

ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:


అనువాకం – 5:

***************

ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.


అనువాకం – 6:

**************

ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.

ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.


అనువాకం – 7:

**************

నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.


అనువాకం – 8:

***************

ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.


అనువాకం –9:

*************

ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.


అనువాకం – 10:

***************

ఈ అనువాకంలో మరలా రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.


అనువాకం – 11:

****************

ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.


చమకం విశిష్టత:

*****************


నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు


అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే..

యోగాలు

 యోగాలు - ఫలితాలు


జ్యోతిష్యశాస్త్రంలో అనేక యోగాలు సూచింపబడ్డాయి. రాశి, అంశ చక్రాలలో ఉన్న గ్రహస్థానలను పరిశీలిస్తూ ఈ యోగాలు ఉంటాయి. యోగాలను అనుసరించి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని యోగాలు గురించి తెలుసుకుందాం.


రవి సంబంధిత యోగాలు


జ్యోతిష్యంలో రవి(సూర్యుడు)కి సంబంధించిన యోగాలు పరిశీలిద్దాం.


1. బుధాదిత్య యోగము

రవి బుధుడు ఏ రాశిలో ఉన్నా దానిని బుధాదిత్య యోగము అంటారు. జాతక చక్రంలో రవి, బుధులు మేషం, మిథునం, సింహం, కన్యారాశుల్లో కలిసి ఉంటే ఈ యోగం కలుగుతుంది. ఈ రాశుల్లో ఒకటి లగ్నమై అక్కడ రవి, బుధులు కలిసి ఉంటే రాజయోగం అనుభవిస్తారు. మిగిలిన చోట ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా బుధాదిత్యయోగం కాదు.

ఫలితాలు: విచక్షణతో కూడిన కార్యాలు, వెనకడుగు వేయని పట్టుదల, పట్టు వదలని ప్రయత్నం వీరి స్వంతం.

 

2. శుభవేశి యోగము

రవికి రెండవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే శుభవేశి యోగము అంటారు.

ఫలితం: సుఖమైన ప్రశాంత జీవితము, కీర్తి, మర్యాద, అదృష్టము వరించుట.


3. శుభవాశి యోగము

రవికి పన్నెండవ స్థానంలో శుభగ్రహాలు శుభవాశి యోగము అంటారు.

ఫలితాలు: కీర్తి ప్రతిష్టలు, సంపద, పలుకుబడి, పట్టుదల, స్వయంకృషితో అభివృద్ధి.


4. ఉభయరాశి యోగము

2, 12 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే ఉభయరాశి యోగము అంటారు.

ఫలితాలు: సంతోషం, సంపద, కీర్తి, మర్యాద, పలుకుబడి, పట్టుదల ప్రయత్నంతో ముందుకు రావడం.


చంద్రుడు సంబంధిత యోగాలు

5. చంద్ర మంగళ యోగము

చంద్రుడు, కుజుడు ఒకే స్థానంలో ఉన్నా నేక చంద్రునికి కేంద్రంలో అంటే 1, 4, 7, 10 స్థానాలలోఉంటే చంద్రమంగళ యోగం అంటారు. జాతక చక్రంలో చంద్రునికి కేంద్రమందు కుజుడు ఉన్నా, లేక ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా ఈ యోగం కలుగుతుంది.

ఫలితాలు:  భాగ్యవంతులవుతారు, రసాయన, ఔషధ వ్యాపార రంగంలో అనుకూలత ఉంటుంది. మనో చంచలం రావడానికి అవకాశం.


6. వసుమతి లేక లక్ష్మి యోగము

చంద్రునికి ఉపజయ స్థానాలయిన 3, 6, 10, 11 స్థానాలలో బుధుడు, శుక్రుడు, గురువు ఉంటే వసుమతి లేక లక్ష్మి యోగము అంటారు.

ఫలితాలు: అకస్మాత్తుగా ధనాగమనం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ యోగ జాతకులకు ధనం కొరత ఉండదని శాస్త్రం చెబుతోంది.


7. గజ కేసరి యోగము

గురు, చంద్రులు కర్కాటక రాశియందు ఉన్నప్పుడు ఈ యోగము కలుగుతుంది. చంద్రునికి కేంద్రంలో గురువు ఉంటే గజ కేసరి యోగము అంటారు.

ఫలితాలు: చంద్రునికి కేంద్ర స్థానంలో గురుడు ఉన్నా, లేక ఇతర స్థానాల్లో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా మిక్కిలి భోగభాగ్యాలు అనుభవిస్తారు. కీర్తి ప్రతిష్టలు, శత్రుజయం, ధనాగమనం, సంపద, దీర్ఘాయువు.


8. అనపా యోగము

చంద్రునికి పన్నెండు స్థానాలలో రాహువు, కేతువు మనహా మీలిన గ్రహాలు ఉంటే అనపా యోగము అంటారు.

ఫలితము: ఆరోగ్యమైన శరీరం.


9: శునభా యోగము

చంద్రునికి రెండులో రాహువు, కేతువు మినహా మిగిలిన గ్రహాలు ఉంటే అనపా యోగము అంటారు.

ఫలితాలు: స్వప్రయత్నంతో సంపాదన.


10. మేఘదృవా యోగము

 చంద్రునికి 2, 12 స్థానాలలో ఏగ్రహాలు లేకుంటే అనపా యోగం అంటారు.

ఈ యోగము పీడ, కీడు కలిగిస్తుంది. అయినా కేంద్రం అంటే 1, 4, 7, 10 స్థానాలలో ఏదైనా గ్రహం ఉంటే నివృత్తి ఉంటుంది.


12 అది యోగము

చంద్రుడికి 6, 7, 8 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే అది యోగం అంటారు.

ఫలితాలు: విలాసవంతమైన జీవితం.


13. శకట యోగము

చంద్రునికి , 6,8, 12వ స్థానంలో గురువు ఉంటే శకట యోగము అంటారు.రాశి చక్రములోని గ్రహములన్ని లగ్నము మరియు సప్తమ స్థానమల మాత్రమే ఉన్న శకట యోగము అంటారు.

గురువు లగ్నము తప్ప మిగిలిన స్థానములలో ఉన్న శకట యోగము సంభవిస్తుంది.


ఫలితాలు: జీవితంలో నిలకడ లేమి, అవమానము, ఆర్థిక బాధలు, శారీరక కష్టం, మానసిక బాధలు కలిగించును. ధనవంతుల గృహంలో జన్మించినా ఈ యోగప్రభావమున పేదరికమే అనుభవించవలసి ఉంటుంది. అర్హతకు తగిన గౌరవ, మర్యాదలు ఉండవు. అయితే ఇతర బాధలు ఉండవు. ఈ యోగముకు భంగము ఏర్పడినప్పుడు సమస్యలు ఉన్నా గౌరవ మర్యాదలాకు భంగము వాటిల్లదు....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

గోత్రం గురించి

 గోత్రం గురించి అంద‌రు తెలుసుకోవాల్సిన నిజాలు


గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యడి తాలూకు విత్తనానికి (లేక వీర్యకణానికి) జన్మనిచ్చేది మాత్రం పురుషుడే కాబట్టి గోత్రము మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది.

గోత్రము అనగా గో అంటే గోవు, గురువు, భూమి, వేదము అని అర్థములు. ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా,ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు, కపిలగోవువారు,తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు. ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు

పేరును వశిష్ట, భరద్వాజ, వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు. తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు. ఆ తరువాత భూములను కలిగిన బోయ/క్షత్రియులు భూపని, భూపతి, మండల అనే గోత్రాలను

ఏర్పరుచుకున్నారు.ముఖ్యముగా బ్రాహ్మణులు వేదవిద్యను అభ్యసించి తాము నేర్చుకున్న వేదమునే యజుర్వేద,ఋగ్వేద అని గోత్రాలను వేదముల పేర్లతో ఏర్పరుచుకొన్నారు. గోత్రాలు ఆటవిక కాలము/ఆర్యుల కాలంలోనే ఏర్పడ్డాయి. ముందుగా గోత్రములను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే కలిగి ఉన్నారు. ఒకే మూల(తండ్రికి)పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య వివాహ

సంబంధములు ఉండ రాదని, వేరు గోత్రికుల మధ్య వివాహములు జరపటము మంచిదని గోత్రములు అందునకు ఉపకరిస్తాయని, ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాలవారు గోత్రములను ఏర్పరచుకొన్నారు. తండ్రి(మూల పురుషుడు) చేసిన పని, వాడిన

పనిముట్లు కూడా గోత్రముల పేర్లుగా నిర్ణయించ బడినాయి. క్రైస్తవుల మతగ్రంథం బైబిల్లో కూడా గోత్ర ప్రస్తావన ఉంది. కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే, మరికొన్ని గోత్రాలు వంశంలో

ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద, ఉపయోగించిన ఆయుధము, వాహనము పేర్ల మీద ఏర్పడ్డాయి. ఉదాహరణకు క్షత్రియ బుషి అయిన విశ్వామిత్రుడు వంశంలో పుట్టిన ధనుంజయుడి పేరు మీద గోత్రం ఉంది, ఖడ్గ, శౌర్య, అశ్వ, ఎనుముల, నల్లబోతుల

పేర్లమీదా గోత్రములు ఉన్నాయి....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

శంకరాభరణం

 కళాతపస్వి' డా.కె.విశ్వనాథ్ గారు రూపొందించగా సంచలన విజయం సాధించిన 

'శంకరాభరణం' సినిమాలో శంకరశాస్త్రిగారి పాత్రకు ప్రేరణ మరెవరో 

కాదు..'గాయకసార్వభౌమ' పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారే. ఆ సినిమా 

విజయవంతం అయిందని తెలియగానే విశ్వనాథ్ గారు విజయవాడ వచ్చి, గాంధీనగర్ 

లోని పంతులుగారి విగ్రహాన్ని దర్శించుకొని, పూలమాల వేసి, వారికి తన కృతజ్ఞత 

తెలుపుకున్నారు.

        పారుపల్లివారి కట్టు, బొట్టు, తలపాగా, కోటు,నడక,వారి 

హుందాతనం, మితభాషణ...ఒక్కటేమిటి?..అన్నిటికీ సజీవ రూపాన్నిచ్చారు. 

పంతులుగారి జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు, వారి నిస్వార్థ సంగీత సేవ..వీటిని 

తన చిత్రంలో ఎంతో అందంగా మలచారు విశ్వనాథ్ గారు.  ఆఖరికి శంకరశాస్త్రిగారి     

శిష్యుడి పాత్ర కూడా పంతులుగారి శిష్యుడైన 'బాల'మురళిదే...ఆ సినిమా చివరిలో 

శంకరశాస్త్రిగారికి వయోభారం చేత కచేరీ చేయలేని పరిస్థితి వస్తే, వేదికపైకి 

శిష్యుడువచ్చి,గురువుగారు ఆగిన చోటునుండి అందుకొని, పాటని రసవత్తరంగా పూర్తి 

చేస్తాడు.దాదాపు అటువంటి సంఘటనే పంతులుగారి జీవితంలోనూ జరిగింద     

ఆరోజు 7-1-1942..సాయం సమయం..త్యాగయ్యగారి ఆరాధనోత్సవాలు 

తిరువయ్యారులో జరుగుతున్నాయి. అందులో గానం చేయడానికి పంతులుగారికి గంట 

సమయం కేటాయించబడింది.పంతులుగారు తనతో తన శిష్యుడు, 12 సంవత్సరాల 

మురళిని కూడా అక్కడికి తెచ్చారు.అప్పటికే తెలుగునాట బాల గాయకుడిగా     

పేరుతెచ్చుకున్న మురళిచేత ఆ పవిత్ర స్థలంలో పాడించి, పెద్దల ఆశీస్సులకు పాత్రుణ్ని చేయాలని నిశ్చయించుకున్న పంతులుగారు, నిర్వాహకులతో తనకు ఆరోగ్యం సరిగా లేదని,అందుచేత, తనకు బదులుగా తన శిష్యుడికి రెండు కీర్తనలు పాడే అవకాశం 

ఇవ్వవలసిందిగా విన్నవించుకొని, ఎలాగో ఒప్పించారు.ఎంతో అరుదైన తన 

అవకాశాన్ని శిష్యుడి కోసం త్యాగం చేశారాయన... మురళిని తానే వేదికనెక్కించారు.     

ఆజానుబాహులైన ప్రక్కవాద్య కళాకారుల మధ్య...అర్భకుడైన బాలమురళి ప్రేక్షకులకు 

కనిపించకపోవడంతో ఒక పీటను తెప్పించి, దానిపై కూర్చుండబెట్టారు.కచేరీ ప్రారంభం 

అయింది. మురళీగానానికి శ్రోతలు పరవశించిపోయారు.రెండు కీర్తనలు 

నాలుగయ్యాయి..మరొక పావుగంట..మరొక అరగంట..ఇలా మూడుసార్లు సమయం 

పొడిగించబడింది. జనం ఆ గంధర్వ గానానికి మంత్రముగ్ధులయ్యారు..బాలమురళికి 

బ్రహ్మరథం పట్టారు.పంతులుగారి ఆనందానికి అవధులు లేవు.తనకు సంగీత       

వారసుణ్ణి ఇచ్చి, తన అభీష్టాన్ని నెరవేర్చిన 'నాదయోగి' త్యాగయ్యకు మనసులోనే 

తృప్తిగా నమస్కారం చేసుకున్నారు...ఇంచుమించుగా ఈ యదార్థ సంఘటనే 

'శంకరాభరణం' చిత్రంలో ఆఖరి దృశ్యంగా ప్రేక్షకుల మనఃఫలకాలపై చెరగని ముద్ర 

వేసుకొంది.

శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి

 ఓం నమశ్శివాయ 🙏

శ్రీకాశీ విశ్వనాథుఁడు ఒక శివరాత్రి పర్వ దినాన అనుగ్రహంతో  ప్రవహింపఁ జేసిన శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి యందలి 

26 వ పద్యము నుండి 30 వ పద్యము వరకు.

👇


26. ప్రపంచ భూత సాక్ష్య దివ్య పంచ వక్త్ర శోభివే,  


విపంచి నాదమాధురిన్ సువేద్యమౌదువే హరా!


కృపాకటాక్ష వీక్షణల్ ధరిత్రిపైన నింపితే!   


ప్రపూజ్య ఓం నమశ్శివాయ భవ్య మంత్రమై. శివా!


27.  వినాశమన్నదెన్న లేని విశ్వ సాక్షివే ! హరా !   


మనోజ్ఞ సృష్టి చేసి, దాని మట్టిఁ జేయ న్యాయమా ?


ప్రణామముల్ ప్రపంచ దివ్య భవ్య భాగ్య రక్షకా!  


ననున్ గనంగదోయి సాంబ! నా మనోజ్ఞుఁడా! శివా!


28.  నిరంతరాయ దృష్టి నీది. నిర్వికల్పుఁడా! భవా!   


భరింపరాని దుష్ట భావ పాపు లేల పుట్టిరో!


విరించి చేయు సృష్టిఁ గాంచి వేగమే గ్రహించి, యీ  


భరంబుఁ బాపి కావుమయ్య భారతాంబ నో శివా!


29. కవీశ్వరుల్ గ్రహించునట్లు కానిపించుమా హరా!    


నివేదనంబు లందుమా! వినీతులన్ గ్రహింపుమా!


సువేద్యమై, మనోజ్ఞమైన సుందరాకృతిన్ కృపన్  


కవిత్వ తత్వ రూప మొంది కాంచఁ జేయుమా! శివా!


30. గుణత్రయంబు నీవయై, ప్రకోప దుష్ట సంహతిన్  


వినాశమొందఁ జేయవేమి? విశ్వ రూపుఁడా! హరా!


వినీతులెల్ల బాధలొంద ప్రీతి తోడఁ గాంతువా?  


అనాది దుష్ట తత్వమెన్ని యార్పుమా! మహా శివా!

🙏

ఓం నమశ్శివాయ.🙏

శ్రీకాశీవిశ్వనాథార్పణమస్తు.

🙏

చింతా రామకృష్ణారావు.

🙏

ఈ పద్యములను గానం చేసి ప్రాణం పోసిన శ్రీమతి బి.సుశీలాదేవి బాగవతారిణి గారికి నా ధన్యవాధహదములు.🙏

👇

ధార్మికగీత - 108*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                            *ధార్మికగీత - 108*

                                       *****

          *శ్లో:- అపరాధో న  మే౽స్తీతి  ౹*

                 *నైతత్ విశ్వాసకారణం ౹*

                 *విద్యతే హి నృశంసేభ్య: ౹*

                 *భయం గుణవతా మపి  ౹౹*

                                        *****

*భా:- లోకంలో ఎవరికిని కలలో కూడ అపకారం తలపెట్టకుండా మెలిగే  సాధువులు, సత్పురుషులు ఉంటారు. వారు మేమెవరికిని ద్రోహం చేయలేదని, మా కేమి ఢోకా లేదని, సురక్షితంగా ఉండగలమని  ధీమా వ్యక్తం చేయడం అంత మంచిదికాదు అని శాస్త్రం చెబుతున్నది. ఎలా? గడ్డిపరకలు తిని ప్రశాంతంగా బ్రతికే "జింక"లకు "వేటగాని"వలన ;  మడుగులో నీరు త్రాగుతూ జీవించే "చేప"లకు "జాలరి" వలన ; ఉన్నదానితో తృప్తిగా మనుగడ సాగించే "సజ్జనులకు" కొండెములు, "చాడీలుచెప్పే వారి"వలన అసలు అస్తిత్వానికే  పెనుముప్పు వాటిల్లుచున్నది. ఇక్కడ జింకలు, చేపలు, సజ్జనులు వారి మానాన వాళ్ళు ఒకరి జోలికి పోకపోయినా ఆపద ముంచుకొస్తూనే ఉన్నది.కాన దుర్మార్గుల పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నిరపరాధులైన రాముడు రావణుని,  కృష్ణుడు  శిశుపాలుని, భీముడు కీచకుని సంహరింపక తప్పలేదు. కాన మంచితనమే  మనకు రక్ష కాదని, అవసరమైనప్పుడు చెడును వీరోచితంగా ఢీకొనే  ధీపటిమ, ధీగరిమ,ధీమహిమ కూడ పూర్తిగా  "శ్రీరామరక్ష"  కాగలవని సారాంశము*.

                                 *****

                 *సమర్పణ   :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 36 /

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 36  / Sri Devi Mahatyam - Durga Saptasati - 36 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 10*

*🌻. శుంభ వధ - 3 🌻*


26. దైత్యజనులకు రేడైన ఆ శుంభుడు తనమీదికి కవియుట చూసి, దేవి అతని వక్షస్థలంపై దూరేలా శూలాన్ని ప్రయోగించి, అతనిని నేలపై కూలి పడిపోయేటట్లు చేసింది.


27. దేవి యొక్క శూలపు మొన వల్ల గాఢంగా గాయపడి అతడు ప్రాణాలు కోల్పోయి నేలగూలగా భూమి అంతా, పర్వత సముద్ర ద్వీప సహితంగా సంచలించింది.


28. ఆ దురాత్ముడు హతుడయినప్పుడు అఖిల ప్రపంచం సుఖం పొంది పూర్ణమైన స్వస్థత పొందింది. ఆకాశం నిర్మలం అయ్యింది.


29. అతడచట కూల్చబడినప్పుడు ఘోరమైన అశుభాలను సూచించేవీ, కొరివి పిడుగులుగలవి అయిన తొల్లిటి మేఘాలు శాంతించాయి. నదులు తమ సరియైన మార్గాలనే పట్టి ప్రవహించాయి.


30. అతడు హతుడైనప్పుడు సర్వదేవగణాల మనస్సులు పట్టరాని ఆనందాన్ని పొందాయి. గంధర్వులు మనోహరగానం చేసారు.


31–32. ఇతరులు వాద్యాలు మ్రోగించారు. అప్సర గణాలు (అచ్చరపిండులు) నృత్యం చేసారు. అనుకూల మారుతాలు వీచాయి. సూర్యుడు పూర్ణతేజస్సుతో వెలిగాడు. అగ్నులు శాంతంగా దీవించాయి. దిక్కులందు పుట్టిన నాదాలు శమించాయి.


శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణిమన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లోని "శుంభవధ” అనే దశమాధ్యాయము సమాప్తం.


సశేషం....

🌹 🌹 🌹🌹

ధనుర్మాసం

 *_16 నుండి ధనుర్మాసం ప్రారంభం     గోదాదేవి ఎవరు ?  పాశురాలు అంటే ఏమిటి ?   వాటి పరమార్ధం ఏమిటి ?_*



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 



గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో (4000 పాశురాలు) గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది.


తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం , తెల్లవారే వేళనే

కన్నులారా చూసి తరించాలన్న తపన , ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై.


*పాశురాల పరమార్ధం*


తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని , చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని , పంటలు నిండుగా పండుతాయని , దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది.


తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు , అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు , రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది.


చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.




_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

Tata shopping site.

 Tata launches its 

shopping site. 

Please use this one 

instead of Amazon or 

other Chinese shopping 

site. 

Lets reciprocate Tata's 

gesture towards we 

Indians, who helped us with huge donations of Rs. 1500 crores, to fight Covid19.


This is the only way we can express our gratitude and patriotism, without losing a paise, getting our necessities.

www.tatacliq.com

Only in India. 

Please forward to your 

family and friends 

A Token of Love & Affection,We Indians

Must support the Proposed Shopping Site of our beloved and Patriotic Brother of every Indian MR RATAN TATA🤝👏🙏



*Friends please share it as much as possible*

పద్యాల ప్రత్యేకతలను

 *ఈ క్రింది పద్యాల ప్రత్యేకతలను గుర్తించండి*


తం భూసుతాముక్తిముదారహాసం

వందే యతో భవ్యభవం దయాశ్రీ:

శ్రీయాదవం భవ్యభతోయదేవం

సంహారదాముక్తిముతాసుభూతం


చిరం విరంచిర్న చిరం విరంచి:

సాకారతా సత్యసతారకా సా

సాకారతా సత్యసత్యసతారకా సా

చిరం విరంచిర్న చిరం విరంచి:


తామసీత్యసతి సత్యసీమతా

మాయయాక్షమసమక్షయాయమా

మాయయాక్షసమక్షయాయమా

తామసీత్యసతి సత్యసీమతా


కా తాపఘ్నీ తారకాఘా విపాపా

త్రేధా విఘా నోష్ణకృత్య నివాసే

సేవా నిత్యం కృష్ణనోఘా విధాత్రే

పాపావిఘాకారతాఘ్నీ పతాకా


శ్రీరామతో మధ్యమతోది యేన

ధీరోనిశం వశ్యవతీవరాద్వా

ద్వారావతీవశ్యవశం నిరోధీ

నయేదితో మధ్యమతోమరా శ్రీ:


కౌశికే త్రితపసి క్షరవ్రతీ

యో దదాద్ ద్వితనయస్వమాతురం

రంతుమాస్వయన తద్విద్ దాదయో

తీవ్రరక్షసి పతత్రికేశికౌ


లంబాధరోరు త్రయలంబనాసే

త్వం యాహి యాహి క్షరమాగతాజ్ఞా

జ్ఞాతాగమా రక్షహి యాహి యాత్వం

సేనా బలం యత్ర రురోధ బాలం


లంకాయనా నిత్యగమా ధవాశా

సాకం తయానుత్రయమానుకారా

రాకానుమా యత్రను యాతకంసా

శావాధమాగత్య నినాయ కాలం


గాధిజాధ్వరవైరాయే

తేతీతా రక్షసా మతా:

తామసా క్షరతాతీతే

యే రావైరధ్వజాధిగా:


తావ దేవ దయాదేవే

యాగే యావదవాసనా

నాసవాదవయా గేయా

వేదే యాదవదేవతా


సభాస్వయే భగ్నమనేన చాపం

కీనాశతానద్వారుషా శిలాశౌ:

శౌలాశిషారుద్వానతాశనాకీ

పంచాననే మగ్నభయే స్వభాస:


న వేద యామక్షరభామసీతాం

కా తారకా విష్నుజితేవివాదే

దేవావితే జిష్నువికారతా కా

తాం సీమభారక్షమయాదవేన


తీవ్రగోరన్వయత్రార్యో

వైదేహీమనసో మత:

తమసోన మహీ దేవై-

ర్యోత్రాయన్వరగోవ్రతీ


వేద యా పంచసదనం

సాధారావతతార మా

మారతా తవ రాధా సా

నంద సంచప యాదవే


శైవతో హననేరోధీ

యో దేవేషు నృపోత్సవ:

వత్సపో నృషు వేదే యో

ధీరోనేన హతోవశై:


నాగోపగోసి క్షర మే పినాకే

నాయోజనే ధర్మధనేన దానం

నందాననే ధర్మధనే జయో నా

కేనాపిమే రక్షసి గోపగో న:


తతాన దామ ప్రమదా పదాయ

నేమే రుచామస్వనసుందరాక్షీ

క్షీరాదసుం న స్వమచారు మేనే

యదాపి దామ ప్రమదా నతాత


తామితో మత్తసూత్రామా

శాపాదేశ విగానతాం

తాం నగావిశదేపాశా

మాత్రాసూత్తమతో మితా


నాసావిఘాపత్రపాజ్ఞావినోదీ

ధీరోనుత్యా సస్మితోఘావిగీత్యా

త్యాగీ విఘాతోస్మి సత్యానురోధీ

దీనోవిజ్ఞా పాత్రపఘావిసానా


సంభావితం భిక్షురగాదగారం

యాతాధిరాప స్వనధాజవంశ:

శవం జధాన స్వపరాధితాయా

రంగాదగారక్షుభితం విభాసం


తయాతితారస్వనయాగతం మా

లోకాపవాదద్వితయం పినాకే

కేనాపి యం తద్విదవాప కాలో

మాతంగయానస్వరతాతియాత


శవేవిదా చిత్రకురంగమాలా

పంచావటీనర్మ న రోచతే వా

వాతేచరో నర్మనటీవ చాపం

లామాగరం కుత్రచిదావివేశ


నేహ వా క్షిపసి పక్షికంధరా

మాలినీ స్వమతమత్త దూయతే

తే యదూత్తమతమ స్వనీలిమా-

రాధకం క్షిపసి పక్షివాహనే


వనాంతయానశ్వణువేదనాసు

యోషామృతేరాణ్యగతావిరోధీ

ధీరోవితాగణ్యరాతే మృషా యో

సునాదవేణుశ్వనయాతంనా వ:


కిం ను తోయరసా పంపా

న సేవా నియతేన వై

వైనతేయనివాసేన

పాపం సారయతో ను కిం


స నతాతపహా తేన

స్వం శేనావిహితాగసం

సంగతాహివినాశే స్వం

నేతేహాప తతాన స:


కపితాలవిభాగేన

యోషాదోనునయేన స:

స నయే నను దోషాయో

నగే భావిలతాపిక:


తే సభాప్రకపివర్ణమాలికా

నాల్పకప్రసరమభ్రకల్పితా

తాల్పికభ్రమరసప్రకల్పనా

కాలిమార్ణవ పిక ప్రభాసతే


రావణేక్షిపతనత్రపానతే

నాల్పకభ్రమణమశ్రుమాతరం

రంతుమాశ్రుమణమభ్రకల్పనా

తేన పాత్రనతపక్షిణే వరా


దైవే యోగే సేవాదానం

శంకా నాయే లంకాయానే

నేయాకాలం యేనాకాశం

నందావాసే గేయో వేదై


శంకావజ్ఞానుత్వనుజ్ఞావకాశం

యానే నధ్యాముగ్రముధ్యాననేయా

యానే నధ్యాముగ్రముధ్యాననేయా

శంకావజ్ఞానుత్వనుజ్ఞావకాశం


వా దిదేశ ద్విసీతాయాం

యం పాథోయనసేతవే

వైతసేన యథోపాయం

యాంతాసీద్విశదే దివా


వాయుజోనుమతో నేమే

సంగ్రామేరవితోహ్రి వ:

విహ్రితో విరమే గ్రాసం

మేనేతోమనుజో యువా


క్షతాయ మా యత్ర రఘోరితాయు-

రంకానుగానన్యవయోయనాని

నినాయ యో వన్యనగానుకారం

యుతారిఘోరత్రయమాయతాక్ష


తారకే రిపురాప శ్రీ-

రుచా దాససుతాన్విత:

తాన్వితాసు సదాచారు

శ్రీపురా పురి కే రతా


లంకా రంకాగరాధ్యాసం

యానే మేయా కారావ్యాసే

సేవ్యా రాకా యామే నేయా

సంధ్యారాగాకారం కాలం

స్నేహితులంతా

 చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న

స్నేహితులంతా ఓ చోట కలిశారు. అందరికీ వేలల్లో జీతం వస్తోంది . బాగా సెటిల్ అయ్యారు . కానీ జీవితంలో ఏదో మిస్‌ అవుతున్నామనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది.


ఇదే విషయం గురించి చర్చించారు...

కానీ ఏదో మిస్‌ అవుతున్నామని అందరూ ఒప్పుకున్నారు.....!

మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్లకు పాఠం చెప్పిన ఓ మాస్టారూని గుర్తుచేశారు.


ఆ మాస్టారూ పేరు గుర్తుకు రాగానే అందరి మోహాల్లో ఒక సంతోషం...! ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ మాస్టారూ అంటే అందరికీ ఎంతో ఇష్టం....

అతనొక స్పూర్తి ! అంతా ఒక అండస్టాండింగ్‌కు వచ్చారు...


ఆ మాస్టారూ ఎప్పుడూ అంత ఆనందంగా ఎలా ఉండేవాడో కనుక్కుందామని ఆయన దగ్గరకు బయలు దేరారు....!


ఆ మాస్టారూ దగ్గరకు వెళ్ళి, తామిప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో అందరూ గొప్పగా చెప్పుకున్నారు..!


ఆయన చెప్పిన పాఠాల మూలంగానే ఇంత గొప్పవాళ్లమయ్యామని గుర్తుచేశారు...! పనిలోపనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు,

సవాళ్లను కూడా ఏకరువూ పెట్టారు.


ఎంతెంతో పెద్ద పెద్ద హోదాలో వున్నా...వేలకు వేల జీతాలు సంపాధిస్తున్నా ఏదో అశాంతికి గురవుతున్నామని చెప్పుకున్నారు.....!


ఇదంతా విన్న ఆ గురువు

కాసేపు కూర్చోండని చెప్పి లోపలికెళ్ళాడు.


కొద్ది సేపటికి గురువుగారి భార్య వంటగదిలో నుండి వేడి వేడి టీ ని ఓ కేటిల్‌లో తీసుకుని వచ్చింది.


ఓ ప్లేట్‌లో రకరకాల కప్పులను

(పింగాణి, స్టీల్‌, మట్టి, రకరకాల పూలతో ఆకర్షణీయంగా డిజైన్‌ చేసినవి) తీసుకొచ్చి, వారి ముందుపెట్టి టీ తాగమని చెప్పి లోపలికెళ్ళింది.


వాళ్లంతా మోహమాట పడుతూనే....తమకు నచ్చిన కప్పును తీసుకొని టీ తాగడం మొదలెట్టారు...!


వాళ్లంతా టీ తాగడం అయిపోగానే ఆ మాస్టారూ వాళ్లందరిని ఉద్దేశించి..


‘‘మీరంతా గమనించారా...

టీ మీ ముందుకు రాగానే , ఏ కప్పు తీసుకోవాలని కాసేపు అలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకుని టీ తాగారు..ఫలితం...

ఇక్కడున్న వాటిలో normal కప్పులే మిగిలిపోయాయి....!


అందరూ తాగే టీ

ఒకటేఅయినా... తాగుతూ..

ఇతరుల టీ కప్పు,

దాని డిజైన్‌ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయే అని మధన పడుతూ తాగుతున్నారు ...

ఫలితం...తాగే

"టీ"ని అస్వాధించడం" మరిచిపోయారు..


అదే సకల సమస్యలకు మూలం....


ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి...

వాటి వెంట పరిగెడితే ఇక అంతే...!


*మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు...!*


ఎదుటి వాళ్లు ఎంత సంపాదిస్తున్నారో,

ఎంత రిచ్‌గా ఉన్నారో...

ఏ హోదాలో ఉన్నారో,

ఏం కొంటున్నారో

అని పొల్చుకొని...

మధన పడుతూ...

వాళ్లలా ఉండటానికి ప్రయత్నిస్తూ

మీ ఇష్టాఇష్టాలను,

మీ అభిరుచులను

అన్నీ అన్నీ మర్చిపోతున్నారు...


మీ జీవితం టీ అయితే.....

మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కూడా

టీ కప్పులాంటివి...no limit for them.


కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి...కప్పులోని టీ ని ఆస్వాధించటం నేర్చుకొండి. అప్పుడే "ఆనందంగా" ఉంటారు. *Finally understand difference between being rich and being happy. Dont struggle much, do your interests and try to be happy*


అదే జీవిత సత్యం...


చాలా మనోజ్ఞమైన సందేశాన్ని అందించిన వారికి ధన్యవాదాలు.

.. జై జవాన్

 ఈనాడు దిన పత్రిక నుండి సేకరణ.


ఒక  కప్పు టీ చేసుకోవాలంటే మూడు నిమిషాలు చాలు మనకి. మూడు గంటలు పట్టిందంటే... అది సియాచిన్ ప్రాంతం అయివుండాలి. మంచును కరిగించి, ఆ నీటిని మరిగించి, టీ కాచేసరికి అంత టైమవు తుంది. కష్టపడి చేసుకున్నాం కదా 


అని ఒక్కో గుక్కా ఓ పావుగంట తాగుదామను కుంటే అది అత్యాశే. గబగబా తాగకపోతే మూడో నిమిషంలో కప్పులో మంచుముక్కే మిగులుతుంది మరి.


కప్పు టీ చేసుకోడానికే ఇంత కష్టమైన చోట దాదాపు పదివేల మంది సైనికులు ఏడాది పొడుగునా రేయింబగళ్లు కాపలా కాస్తున్నారు.


సియాచిన్... హిమాలయాల్లో ఉన్న అతి పెద్ద మంచుదిబ్బ. కీలకమైన సరిహద్దు ప్రాంతం. పశ్చిమాన పాకిస్థాన్, తూర్పున చైనా... మధ్య త్రికోణాకారంలో ఉన్న ఈ పర్వత ప్రాంతం ప్రపంచంలోనే ఎత్తైన


యుద్ధభూమి. అక్కడ ఇప్పుడు శత్రువుల కన్నా ఎక్కువగా ప్రకృతితో యుద్ధం చేస్తున్నారు మన సైనికులు. .


తలదాచుకోను వెచ్చని నీడ ఉండదు. తాగడానికి నీరుండదు. గుండెల నిండా పీల్చుకోడానికి గాలీ ఉండదు. అయినా సరే ఒంటిమీద ఇరవై ముప్పై కిలోల బరువును


మోస్తూ గస్తీ తిరగాలి. పైనుంచో పక్క నుంచో విరిగిపడే మంచు చరియల కింద కూరుకుపోకుండా, 200కి.మీ. వేగంతో వీచే మంచుతుపానుకు చిక్కకుండా, హఠాత్తుగా విచ్చుకునే మంచులోయల్లోకి జారిపోకుండా... మూడు నెలలు డ్యూటీ చేసి 


సురక్షితంగా తిరిగి వచ్చాడంటే ఆ సైనికుడు మరో జన్మ ఎత్తినట్లే.


సియాచిన్ కి సైన్యాన్ని వారికి అవసరమైన వస్తువుల్ని పంపించే బేస్ క్యాంపే సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తున ఉంటుంది. అక్కడి నుంచి పై పైకి వెళ్లినకొద్దీ వరసగా వందకు పైగా సైనిక స్థావరాలుం టాయి. 128కి. మీ. పరిధిలో ఉన్న 


ఈ స్థావ రాల్లో అన్నిటికన్నా పైన ఉన్నది 23 వేల అడుగుల ఎత్తున ఉన్న బనా పోస్ట్. ఒక్కో సైనిక పోస్టులోనూ అవసరాన్నిబట్టి ఆరు నుంచి 10 మంది వరకూ సైనికులుంటారు.


మనకి చలికాలంలో ఉండే కనిష్ట ఉష్ణోగ్రత అక్కడ వేసవి కాలపు గరిష్ఠ ఉష్ణోగ్రత. ఇక చలి కాలం అయితే పగలు


మైనస్ 30 ఉంటే రాత్రయ్యేసరికి మైనస్ 60 డిగ్రీల వరకూ వెళ్తుంది. ఆ చలి తట్టుకోలేక గత మూడున్నర దశాబ్దాల్లో దాదాపు 900 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణమే శత్రువు


సియాచిన్లో బాధ్యతలు నిర్వహించాల్సిన సైనికులకు నెలరోజులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మంచుకొండల్ని ఎక్కడం, తీగ వంతెన సాయంతో లోయల్ని దాటడం, కూరుకుపోయిన వారిని రక్షించడానికి మంచు గొడ్డలితో మంచుపలకల్ని 


కోయడంలాంటి వాటితోపాటు ముఖ్యంగా ఆ వాతావరణంలో తమను తాము కాపాడుకోవటం ఎలాగో నేర్పిస్తారు. ఎందుకంటే అక్కడ గాలి పీల్చడం దగ్గర్నుంచీ నీరు తాగడం వరకూ ప్రతి పనీ ఓ సాహసమే. సాధారణంగా చుట్టూ ఉన్న 


వాతావరణానికి అలవాటుపడేం దుకు ప్రయత్నిస్తుంది. మన శరీరం. అందుకే ఎండల్నీ వానల్నీ చలిని తట్టుకుంటున్నాం. అయితే సముద్ర మట్టానికి 17 వేల అడు గుల ఎత్తు దాటాక మనిషి శరీరంలో వాతా వరణాన్ని తట్టుకునే శక్తి పూర్తిగా 


పోతుంది. ఈ సైనికులేమో 23 వేల అడుగుల ఎత్తు వరకూ వెళ్తారు. మంచుతో ముంచుకొచ్చే ప్రమాదాలకు అందకుండా జాగ్రత్తపడుతూనే ఆరోగ్యంతో మరో యుద్ధమూ చేస్తారు. శ్వాస కోసం నిద్రలేస్తారు!


శ్వాస... మనకి అసంకల్పితంగా జరిగి పోయే ప్రక్రియ. అక్కడ దానికి చాలా కష్ట పడాలి. మనకు దొరికే ఆక్సిజన్లో పది శాతమే అక్కడ దొరుకుతుంది మరి. అందు కని పట్టుమని నాలుగు గంటలు నిద్రపోవ డానికి కూడా ఉండదు. రాత్రిపూట 


ఒకరు ఎప్పుడూ మెలకువగా ఉండి గంటకోసారి మిగిలినవాళ్లను లేపుతుంటారు. లేచి, గుండెల నిండా ఆక్సిజన్ పీల్చుకుని మళ్లీ పడుకుంటారు. అలా లేపకపోతే గదిలో కిరోసిన్ స్టవ్ వల్ల వెలువడే కార్బన్


మోనాక్సైడ్ పీల్చుకుని నిద్రలోనే ప్రాణాలు విడుస్తారు. ఇక అంత ఎత్తున ఉండటం వల్ల కళ్లు తిరుగుతుంటాయి. భరించలేని తలనొప్పి వేధిస్తుంటుంది. తిండి తినబుద్ది కాదు, నిద్ర పట్టదు. దాంతో బరువు తగ్గి పోతారు. ఎక్కువ కాలం ఆ 


వాతావరణంలో ఉంటే జ్ఞాపకశక్తిని కోల్పోతారు, మాట స్పష్టత పోతుంది. అంతేకాదు, మెదడులోకీ ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి అకస్మాత్తుగా జబ్బుపడతారు. డీహైడ్రేషన్ కి గురవుతారు. చెవులు వినిపించవు. తెల్లని మంచుని చూసి చూసి 


కనుచూపు కూడా దెబ్బతింటుంది. కత్తిలా కోసేస్తుంది!


నడిచే నేల మంచు. చుట్టూ కన్పించే కొండలు మంచు. వీచే గాలీ మంచులా చల్లగా ఉంటుంది. ఆ చల్లదనాన్ని తట్టుకోడా నికి ఐదారు పొరల దుస్తులు ధరిస్తారు. కాళ్లకీ చేతులకూ రకరకాల తొడుగులు వేసు కుంటారు. కళ్లకి గాగుల్స్ 


పెట్టుకుంటారు. . శరీరంలోని ఏ భాగంలోనూ అంగుళం కూడా ఆచ్చాదన లేకుండా క్షణమైనా ఉండడానికి వీల్లేదు. అలా ఉన్నప్పుడు లోహపు వస్తువు ఏదైనా తాకితే అక్కడ చర్మం ఉన్నపళాన ఊడొచ్చేస్తుంది. కేవలం కొద్ది సెకన్లు చాలు,


ఫ్రాస్ట బైట్ తన పని చేసేస్తుంది. అందుకని ఇంత పకడ్బందీగా దుస్తులు ధరించి సరుకులు మోస్తూ ఒక స్థావరం నుంచి మరో స్థావరానికి నడుస్తుంటే- శరీరం వేడికి లోపల చెమట పడుతుంది. అది దుస్తు లోపల సన్నని మంచుముక్కలుగా 


మారి *......


. . . - - శరీరాన్ని కోసేస్తుంటే- ఆ అవస్థ వర్ణనా తీతం. దానికి తోడు నెలల తరబడి స్నానం చేయడానికి ఉండదు. పొడి తువ్వాలుతో ఒళ్లు తుడుచుకోవటమే. దుస్తులు ఎప్పుడు మార్చుకోవాలి. ఎప్పుడు ఒళ్లు తుడుచుకోవాలి అన్నది కూడా 


వైద్య అధికారుల సూచన మేరకే చేయాలి. మంచుబొరియలే ఇళ్లు


ఫైబర్ గ్లాస్ ప్యానెల్స్ కట్టిన చిన్న గుడారాల్లోనో, మంచు బొరియల్లోనో సైనికులు నివసిస్తుంటారు. ఆఫీసరు. సైనికుడు


అన్న తేడా లేకుండా అందరూ అందులోనే సర్దుకుపోతారు. ఒక మంచం అంత ఉండే స్థలంలో ఆరుగురు పడుకోవాలి. అలా పడుకోవడానికి వీలు కానప్పుడు ముగ్గురు ముగ్గురు చొప్పున వంతులేసుకుని పడు కుంటారు. కొన్ని చోట్లయితే అది 


కూడా సాధ్యం కాదు. అందుకని మంచునే గుహలా తవ్వి స్థావరంగా చేసుకుంటారు. కాలకృ త్యాలు తీర్చుకోడానికి డీఆర్‌డీవో ప్రత్యేకంగా కట్టిచ్చిన క్యాబిన్స్ వాడతారు. అసలా చలిలో కాలకృత్యాలు తీర్చుకోవడమూ ఇబ్బందే. విరేచనం 


అవడానికి మందులు ఎక్కువగా వాడాల్సివస్తుంది. హీటర్లుండవు. కిరస నాయిల్ స్టవ్ మీద ప్రత్యేకంగా రంధ్రాలు చేసిన డబ్బాలను కప్పుతారు. అవి రేడియే టర్లుగా పనిచేస్తాయి. అవి తప్ప మిగతావేవీ అక్కడ పనిచేయవు. వాటివల్లే వారు 


విశ్రాంతి తీసుకునే గదిలో కాస్త వెచ్చదనం ఉంటుంది. అక్కడి నుంచి మళ్లీ మైనస్ 40, 50 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండే సెంట్రీ పోస్టు దగ్గరికెళ్లి డ్యూటీ చేయడం అంటే నరకమే. అలాగని బద్దకించి ఒక్క పోస్టుని కాసేపు ఎవరూ వెళ్లకుండా వదిలేస్తే- 


కాచుకుని ఉన్న శత్రువు నిమిషాల్లో దాన్ని వశం చేసుకో వచ్చు. ఇక ఆ తర్వాత తిరిగి దాన్ని ఆక్ర మించుకోవాలంటే చాలా ప్రాణాలను పణంగా పెట్టాల్సివస్తుంది. అందుకే ఎంత కష్టమైనా సరే బద్ధకించకుండా డ్యూటీ చేస్తారు. సైని కులు. 


పండగలూ పనిగంటలూ సెలవులూ ఏమీ ఉండవక్కడ. ఇరవై నాలుగ్గంటలూ ఏడాది పొడుగునా కాపలా పనే. ఆపిల్ క్రికెట్ బంతిలా...


రియల్, ఫ్రూటీ లాంటి జ్యూసు పాకెట్లు, రకరకాల బిస్కట్లు, చాకొలెట్లు, సూప్స్,


డ్రై ఫ్రూట్స్.. ఎవరికైనా అయితే ఆ పాకెట్లన్నీ చూస్తే నోరూరిపోతుంది. జిహ్వ చచ్చి పోయి ఉన్న అక్కడి వారికి మాత్రం వాటిని చూస్తే విరక్తి పుడుతుంది. టిన్ క్యానుల్లో వచ్చిన ఆ ఆహార పదార్థాలనుంచి నారింజో ఆపిల్


పండో బయటకు తీయడం ఆలస్యం- క్రికెట్ బంతిలా గట్టిగా మారిపోతుంది. పదార్థాల్ని సుత్తీ శానం లాంటి వాటితో పగలగొట్టుకుని వేడి చేసుకుని నిమిషంలో తినేయాలి. కోడిగుడ్లు కూడా రాళ్లలాగా మారిపోతాయి


మరి. జ్యూస్ పాకెట్ పైన కాగితం తీసేస్తే లోపల జ్యూస్ గడ్డకట్టి ఇటుక లాగా ఉంటుంది. తప్పదు కాబట్టి తినడమే కానీ లేకపోతే ఆ చల్లని పాకెట్లని వేడి చేసుకుని తినబుద్దే కాదసలు అంటారు. సైనికులు. నాలుగైదు నెలలపాటు తాజా ఆహారం 


అనేది కంటికి కూడా కనపడకుండా బతకడం అంటే నరకమేగా. మంచి నీళ్లు తాగాలన్నా మంచు ముక్కల్ని స్టవ్ మీద కరగబెట్టా ల్సిందే. అదెంత సేపు... వేడి చేసుకుంటే కాస్త చలీ తగ్గుతుంది కదా అనుకోవచ్చు కానీ, అదీ కష్టమే. 


ఎందుకంటే... గ్లోవ్స్ వేసుకున్న చేతులతో కిరోసిన్ స్టవ్ వెలిగించడమంటే- బ్రహ్మ ప్రళయమే! ఆ చేతులు కదలవు!


గ్లోవ్స్ వేసుకున్నా పనిచేసుకోవచ్చు కానీ అవి ఒక్కటే వేసుకుంటే చలికి తట్టుకోలేరు. అందుకని వాటి మీద మిటెన్స్(వీటికి వేళ్లు విడివిడిగా ఉండవు. బొటన వేలొక్కటే విడిగా ఉంటుంది) వేసుకోవాలి. అవి వేసు కుంటే చేతులు తేలిగ్గా కదలవు. 


వాటిని తీసి పడేసి గబగబా పనిచేసుకుందామనిపిస్తుంది కానీ ఆ తర్వాత అసలు పనిచేయడానికి వెళ్లే ఉండవని గుర్తొచ్చి ఎంత కష్టమైనా


హెలికాప్టర్ దిగడానికి బోర్న్ విటా! 


అసాధారణమైన వాతావరణంలో అసాధ్యమైన పనుల్ని సుసాధ్యం చేస్తున్న సియాచిన్ సైనికుల గురించి మరికొన్ని...


* సన్నగా మంచుకురుస్తున్నప్పుడు హెలిపాడ్ ఎక్కడుందో కన్పించదు పైలట్ కి. అందు కని బోర్న్ విటా,


జామ్, డ్రైఫ్రూట్స్ లాంటివి ఉపయోగించి హెలిపాడ్ సరిహద్దులు కన్పించేలా చేస్తారు. * సైనికులు నీళ్లు నింపిన కండోమ్ ని జేబులో ఉంచుకుంటారు. ఎందుకంటే పెట్రోలింగ్ చేసేటప్పుడు ఎక్కడ చిక్కుబడిపోతారో తెలియదు. తేలికగా ఉండి లీటరు 


నీళ్లు పట్టే కండోమ్ జేబులో ఉంటే ఆ నీటితో రెండు రోజులు ప్రాణాలు కాపాడుకోవచ్చు. * అక్కడ డ్యూటీ చేసేవారికి జీతంతో పాటు అదనంగా నెలకు రూ.14వేల సియాచిన్ అలవెన్సు ఇస్తారు. * వాతావరణం కాస్త పర్వాలేదనుకున్నప్పుడు సి 


విటమిన్ టాబ్లెట్ సాయంతో పాలు తోడుపెట్టుకుని పెరుగు చేసుకుంటారట.


ఏమిటీ సియాచిన్? ఎందుకీ కాపలా? భారత్, పాకిస్తాన్ల మధ్య సరిహద్దు విషయమై చేసుకున్న కరాచీ, సిమ్లా తదితర ఒప్పందాల్లో సియాచిన్ గ్లేషియర్ ప్రాంతంపై స్పష్టత లేకపోవటంతో ఆ ప్రాంతాన్ని రెండు దేశాలూ తమదిగా


భావిస్తూ వచ్చాయి. మనుషులు తిరిగే ప్రాంతం కాకపోవటంతో 1970వ దశకం వరకూ ఇది ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. మనదేశం నుంచీ సియాచిన్ వెళ్లాలంటే హెలికాప్టర్ తప్ప మరో మార్గం లేదు. పాకిస్తాన్ నుంచి మనకన్నా కాస్త 


సులభంగా ఎక్కవచ్చు. దాంతో అటునుంచి పర్వతారోహకుల తాకిడి పెరిగింది. వారికి తోడుగా పాక్ సైనికాధికారులు వెళ్లేవారు. ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్లో భాగంగా చూపుతూ అమెరికాలో మ్యాపులు ప్రచురితమయ్యాయి. జర్మన్ పర్వతారోహకుల 


ద్వారా ఈ విషయం తెలుసుకున్న భారత అధికారి కల్నల్ నరేంద్రకుమార్ స్వయంగా ఒకటికి రెండుసార్లు సియాచిన్ కి వెళ్లి వచ్చి సవివరంగా నివేదికలు ఇచ్చారు. అదే సమయంలో సియాచిన్ని ఆక్రమించుకోవడానికి పాకిస్థాన్ సైన్యం 


సిద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో సరిగ్గా వారికన్నా మూడు రోజుల ముందే భారత సైన్యం అక్కడికి చేరుకుని సియాచిన్ గ్లేసియర్‌ నీ చుట్టుపక్కల


ప్రాంతాల్నీ తన అదుపులోకి తీసుకుంది. ఒకవేళ ఆ ప్రాంతం పాకిస్థాన్ వశమైతే సియాచిన్ మీదుగా లదాఖోకీ శత్రువు తేలిగ్గా చేరుకునే వీలుంటుంది. అందుకే కీలకమైన ఈ ప్రాంతాన్ని సరైన సమయంలో వశపర్చుకున్న భారత్ అప్పటి నుంచీ 


అక్కడ సైనిక స్థావరాలను


కొనసాగిస్తోంది.


అలాగే సర్దుకుపోతారు. ముక్కు, చెవులు, చేతివేళ్లు.... చలి ప్రభావానికి ప్రమాదానికీ


మొట్టమొదట లోనయ్యే భాగాలు. కిలోలకొద్దీ బరువున్న దుస్తుల్ని ఆయుధాల్నీ మోస్తూ తిరిగే బదులు ఆ చలికి కదలకుండా ఓ మూల ముడుచుకు కూర్చోవాలనిపిస్తుంది. అలా కూర్చుంటే శరీరం బిగుసుకుపోతుంది. వాళ్లు ఆరోగ్యంగా 


ఉండాలంటే వ్యాయామం చాలా ముఖ్యం. అందుకని హెలికాప్టర్ ఒకచోట దించిన సరు కుల్ని చుట్టుపక్కల స్థావరాలకి చేరవేసే బాధ్యత సైనికులదే. ఒకప్పుడు కిరోసిన్ క్యాన్స్న వీపున మోస్తూ ఐదారు గంటలు నడిచేవారు. ఇప్పుడు బేతిక్యాంప్ 


నుంచి చివరి క్యాంపు వరకూ పైప్లాన్ వేసి మధ్యలో పంపింగ్ స్టేషన్లు పెట్టారు కాబట్టి ఆ పని తప్పింది. గస్తీ తిరిగేటప్పుడు డేగ కళ్లతో చుట్టుపక్కల చూడడం ఎంత అవస రమో కింద నేలను పరిశీలించి చూడడమూ అంతే అవసరం. హఠాత్తుగా 


మంచు పెళ్ల కదిలి లోతుగా గొయ్యి ఏర్పడి అందులో కూరుకుపోవచ్చు. అందుకే వరసగా తాడుప ట్టుకుని నడుస్తుంటారు. ఏ ఒక్కరు జారినా మిగిలినవారు అప్రమత్తమై ఆ తాడు సాయంతో పడిపోయినవారిని పైకి లేపు తారు. వాతావరణం 


అనుకూలించినపుడు యోగా కూడా చేస్తుంటారు. మనసుని చిక్కబట్టుకుని... శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోదు, మనసునీ కుంగిపోకుండా కాపాడు కోవాలి. నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండటంతో ఒంటరితనం 


వేధిస్తుంది. పక్కన ఉన్న ఐదారుగురు సైనికులతో ఏం మాట్లాడతారు. ఎంత సేపని మాట్లాడతారు. అయినా తప్పదు కాబట్టి మనసు మళ్లించుకోడానికి రకరకాల పనులు చేస్తుంటారు. కొంతమంది పుస్తకాలు చదువు తారు. కొందరు పేకాట 


ఆడతారు. సినిమా పాటలు పాడుకుంటారు. ఇంటి నుంచి వచ్చే ఉత్తరాలను పదే పదే చదువుకుంటారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక ఎవరూ సరిగ్గా


ఉత్తరమే రాయడం లేదని వాపోతుంటారు కొందరు. ఆర్మీవైవ్స్ అసోసియేషన్ నుంచి వచ్చే గ్రీటింగ్ కార్డులు చాకొలెట్లూ చూసు కుని మురిసిపోతుంటారు. అత్యవసరమైతేనే శాటిలైట్ ఫోనుతో రెండు నిమిషాలు మాట్లా డుకునే అవకాశం ఇస్తారు. 


అధికార్లకూ పరీక్షే! సియాచిన్ బేస్ క్యాంప్లో ఉండే అధికార్లకు విధి నిర్వహణ రోజూ కత్తి మీద సామే. ఒక్కో క్యాంప్ నుంచీ ఒక్కో సమస్యతో ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఒకచోట ఆరోగ్యం బాగా లేదనీ మరోచోట గస్తీకి వెళ్లినవాళ్లు కన్పించ కుండా 


పోయారనీ... ఇలా ఏదో ఒక ఫిర్యాదు అందుతూనే ఉంటుంది. వెంటనే


హెలికాప్టర్ని పంపించి ఆరోగ్యం బాగాలేని వారిని కిందికి తీసుకొస్తారు. హెలికాప్టర్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు పంపడానికి వాతావరణం అనుకూలించదు. మధ్యాహ్నం దాటితే గాలుల వేగం పెరుగుతుంది. అత్యవసరమైతే తప్ప రిస్క్ 


తీసుకోలేరు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుం టుంది అధికారి పరిస్థితి. అక్కడి వారిని రక్షించడానికి హెలికాప్టర్ పైలట్ ప్రమాదం లోకి నెట్టడం అవుతుంది. ఆ అధికారి ఎటూ నిర్ణయించుకునే లోపే అంతకు ముందు రోజు కింద ఆస్పత్రికి 


పంపించిన సైనికుడు ప్రాణాలు విడిచాడన్న వార్త వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పనిచేయడానికి ఎంతో మానసిక స్టెర్యం కావాలి. సియాచిన్లో ఉన్న సైనికు లకీ బయటి ప్రపంచానికి


లింకు సరుకులు చేరవేసే హెలికాప్టరే, అది వచ్చిందంటే వారికి పండగే. అది తెచ్చిన సరుకుల్లో వారు ఆత్రుతగా వెతుక్కునేది ఇంటినుంచి వచ్చిన ఉత్తరాలకోసమే. సియాచిన్ వాతావరణంలోనికి వెళ్లడానికి మామూలు హెలికాప్టర్లు పనికిరావు. 


ప్రత్యేకంగా తయారుచేసిన హెలికాప్టర్లను కూడా బలవంతాన తోసుకెళ్లినట్లు నడపాల్సి వస్తుంది. సైనిక స్థావరాల్లో ఉన్న వారికి వేళకి ఆహారం అందడమూ, సమయానికి వైద్యం అందడమూ లాంటివన్నీ సవ్యంగా జరిగాయంటే కేవలం అదృష్టం 


వారి పక్షాన ఉందన్నమాటే. దానికి మన దీవెనలూ తోడైతే... ఎప్పటికప్పుడు వారంతా క్షేమంగా విధులు ముగించుకుని తిరిగొస్తారు.


మిత్రమా, మేమెవరమో మీకు తెలియదు. మీకూ మాకూ ఏ రక్తసంబంధమూ లేదు. కానీ మాకోసం మా భద్రత కోసం ప్రాణాల్నే పణంగా పెట్టి మంచుకొండల్లో మగ్గిపోతున్నారు. ప్రతి నిమిషం మీకో గండమే, ప్రతిపూటా మీకో పుట్టుకే. 


అయినవాళ్లకు దూరంగా తిండీ తిప్పలూ లేకుండా కంటికి కునుకే రాకుండా మీరు పడుతున్న కష్టానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం... జై జవాన్ అని నిత్యం స్మరించుకోవడం తప్ప..!

మొగలిచెర్ల

 *స్వామివారి సహాధ్యాయి..*


2004 వసంవత్సరం మహాశివరాత్రి మరో పదిరోజులు ఉన్నదనగా...నేనూ మా సిబ్బంది మహాశివరాత్రి కి చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించుకుంటూ ఉన్నాము..మధ్యాహ్నం  నైవేద్యం హారతి కాగానే అర్చకస్వాములు మందిరం తలుపులు మూసేసి భోజనానికి వెళ్లిపోయారు..నేనొక్కడినే మందిరం లో కూర్చుని వున్నాను..ఇంతలో కాషాయ వస్త్రాలు ధరించిన సాధువు ఒకరు లోపలికి వచ్చారు..

బావి వద్దకు వెళ్లి, బకెట్ తో నీళ్లు తోడుకొని..కొన్ని నీళ్లు దోసిలి లోకి తీసుకొని నెత్తిన చల్లుకున్నారు..మరికొన్ని నీళ్లతో కాళ్ళు కడుక్కున్నారు..అక్కడినుంచి నేరుగా ప్రధాన మంటపం లోకి వచ్చి, శ్రీ స్వామివారి సమాధి గదికి ఎదురుగా నిలుచున్నారు..వారిని గమనిస్తూ ఉన్న నేను..వారి వద్దకు వెళ్లి..

"స్వామీ..ఇలా తిరిగి రండి..ఈ గర్భాలయపు మంటపం లో కూర్చోండి..అర్చకులను పిలిపిస్తాను..శ్రీ స్వామివారి మందిరం తలుపులు తీస్తారు..మీరు స్వామివారి సమాధిని దర్శించుకోవచ్చు.." అన్నాను..


నా వైపు సాలోచనగా చూసి..తలవూపి..నా వెనుకే వచ్చి..సమాధి మందిరపు మంటపం లో నిలుచున్నారు..అర్చకస్వామి ని పిలువమని మనిషి చేత చెప్పి పంపించి.."స్వామీ మీరెక్కడినుంచి వస్తున్నారు.."? అని అడిగాను..


"హృషీకేష్ నుంచి"..అన్నారు..ఆయన వాలకం చూస్తుంటే ముభావంగా వున్నారు..ఏ ప్రశ్న అడిగినా ముక్తసరిగా సమాధానాలు ఇస్తున్నారు..చివరగా "భోజనం చేసారా..ఇక్కడ ఏర్పాటు చేయమంటారా?.." అన్నాను.."ఈరోజు మేము ఆహారం తీసుకోము..మీ భాషలో చెప్పాలంటే..ఉపవాసం.." అన్నారు..ఇక నేను ప్రశ్నలు వేయదల్చుకోలేదు..కొద్దిసేపటికే పూజారి గారు వచ్చి, శ్రీ స్వామివారి సమాధి మందిరపు తలుపులు తీశారు..


"మీరు వెళ్లి సమాధి దర్శనం చేసుకోండి.." అన్నాను..అంగీకారంగా తలవూపి..సమాధి మందిరం గడప ఇవతల నిలబడి నమస్కారం చేసుకున్నారు..ముందుకు వంగి ఆ గడపకూ నమస్కారం చేశారు..మెల్లిగా కుడిపాదం లోపలికి పెట్టి..సమాధి వద్దకు వెళ్లారు..నేను ప్రక్కకు వచ్చేసాను..సమాధి వద్ద సుమారు పదిహేను నిమిషాల పాటు వున్నారు..


సమాధి దర్శనం చేసుకొని ఇవతలికి వచ్చి..మళ్లీ గడప దగ్గర నిలబడి మరొక్కసారి నమస్కారం చేసుకొని..నా దగ్గరకు వచ్చి..ప్రక్కనే ఉన్న చాపమీద పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..కొద్దిగా అవతల వైపు నేను కూర్చున్నాను..నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు..


"నువ్వూ...?" అంటూ సందేహంగా అడిగారు..

నా పేరు చెప్పి..నేను శ్రీధరరావు ప్రభావతి గార్ల కుమారుడిని..అని చెప్పాను..ప్రస్తుతం ఈ మందిరం నిర్వహణ చూస్తున్నాను అనికూడా చెప్పాను..


అలాగా అన్నట్లు తలవూపి..నా దగ్గరగా జరిగి, నా ప్రక్కనే కూర్చుని.."ఈ స్వామివారు, నేనూ వ్యాసాశ్రమం లో ఒకే సమయం లో ఉన్నాము..సాధనా పద్ధతుల గురించి..మోక్షప్రాప్తి గురించి..అక్కడ మాకు బోధ జరిగేది..ఈయన చాలా చురుకుగా ఉండేవారు..గురువుగారు చేసిన బోధ లోని మర్మాలను ఇట్టే పసికట్టేవాడు..మళ్లీ మాకందరికీ విపులంగా చెప్పేవాడు..చక్కటి కంఠస్వరం..మా కందరికీ ఆశ్చర్యం గా ఉండేది..ఎటువంటి విషయమైనా ఒక్కసారి వింటే చాలు..తిరిగి యధాతధంగా అప్పచెప్పేవాడు..ఒకానొక సందర్భం లో ఆ ఆశ్రమానికి ఉత్తరాధికారిగా  నియమిస్తే బాగుండునని మేమందరమూ తలపోసాము..ఆ మాటే చెప్పాము కూడా..ససేమిరా వద్దన్నాడు.."నేను ఆశ్రమ నిర్వహణ చేయను..చేయలేను..నాకు అతి త్వరగా మోక్షం కావాలి..నా సాధన అంతా అందుకొరకే"..అని తేల్చి చెప్పేసాడు..

మహానుభావుడు..తన లక్ష్యం ఏమిటో చక్కగా తెలిసిన వాడు..అందుకనుగుణంగా తన జీవితాన్ని మలచుకున్నాడు.." అన్నారు..


"స్వామీ మీ పేరేమిటి..? ప్రస్తుతం మీరెక్కడ వుంటున్నారు..? స్వామివారి గురించి మరింత వివరంగా చెప్పగలరా..? " అన్నాను..


"నేను ప్రస్తుతం హృషీకేశ్ లో ఒక ఆశ్రమం లో ఉంటున్నాను..వ్యాసాశ్రమం లో ఈ స్వామివారు గడిపింది చాలా కొద్దికాలమే..బహుశా రెండేళ్ల కాలం కాబోలు..మాలకొండలో  తపస్సు చేసుకునే రోజుల్లో ఒకటి రెండుసార్లు కలిశాను..సిద్ధిపొందిన తరువాత ఒక్కసారి వచ్చి వెళ్ళాను..మళ్లీ ఇదే రావడం..ఈ స్వామివారికి కొంతకాలం సహాధ్యాయిగా ఉన్నానని ఒక తృప్తి ఉంది..మాలాంటి వారికి మార్గదర్శనం చేసాడు..సాధకుడి నడవడిక ఎలా ఉండాలో ఆచరించి చూపాడు..మళ్లీ ప్రాప్తం ఉంటే..మరోసారి వస్తాను..సాయంత్రం దాకా ఇక్కడ ధ్యానం చేసుకొని..రాత్రికి ఇక్కడే బస చేసి..రేపుదయం బయలుదేరి వెళ్లిపోతాను.." అన్నారు..వారికి అవసరమైన ఏర్పాట్లు చేసాను..తెల్లవారి మళ్లీ ఒకసారి స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..వెళ్లిపోయారు..


స్వామివారి గురించి వారు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు బాగా గుర్తుండిపోయాయి..


సర్వం..

దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).