13, డిసెంబర్ 2020, ఆదివారం

ధార్మికగీత - 108*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                            *ధార్మికగీత - 108*

                                       *****

          *శ్లో:- అపరాధో న  మే౽స్తీతి  ౹*

                 *నైతత్ విశ్వాసకారణం ౹*

                 *విద్యతే హి నృశంసేభ్య: ౹*

                 *భయం గుణవతా మపి  ౹౹*

                                        *****

*భా:- లోకంలో ఎవరికిని కలలో కూడ అపకారం తలపెట్టకుండా మెలిగే  సాధువులు, సత్పురుషులు ఉంటారు. వారు మేమెవరికిని ద్రోహం చేయలేదని, మా కేమి ఢోకా లేదని, సురక్షితంగా ఉండగలమని  ధీమా వ్యక్తం చేయడం అంత మంచిదికాదు అని శాస్త్రం చెబుతున్నది. ఎలా? గడ్డిపరకలు తిని ప్రశాంతంగా బ్రతికే "జింక"లకు "వేటగాని"వలన ;  మడుగులో నీరు త్రాగుతూ జీవించే "చేప"లకు "జాలరి" వలన ; ఉన్నదానితో తృప్తిగా మనుగడ సాగించే "సజ్జనులకు" కొండెములు, "చాడీలుచెప్పే వారి"వలన అసలు అస్తిత్వానికే  పెనుముప్పు వాటిల్లుచున్నది. ఇక్కడ జింకలు, చేపలు, సజ్జనులు వారి మానాన వాళ్ళు ఒకరి జోలికి పోకపోయినా ఆపద ముంచుకొస్తూనే ఉన్నది.కాన దుర్మార్గుల పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నిరపరాధులైన రాముడు రావణుని,  కృష్ణుడు  శిశుపాలుని, భీముడు కీచకుని సంహరింపక తప్పలేదు. కాన మంచితనమే  మనకు రక్ష కాదని, అవసరమైనప్పుడు చెడును వీరోచితంగా ఢీకొనే  ధీపటిమ, ధీగరిమ,ధీమహిమ కూడ పూర్తిగా  "శ్రీరామరక్ష"  కాగలవని సారాంశము*.

                                 *****

                 *సమర్పణ   :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: