ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
11, మార్చి 2024, సోమవారం
అంతరంగంలో
అంతరాలు, ఓ చక్కని వ్యాసం :
*మధ్యతరగతి అంతరంగంలో ఆ #అంతరం అలాగే ఉండిపోయింది!*
🤔🤔🤔🤔🤔🤔🤔🤔
1) *చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు తినడానికి ఇంటినుండి అమ్మ చేసినవి తీసుకెళ్ళేవాళ్ళం, కొంతమంది రైల్లో కొనుక్కుని తినేవాళ్ళని చూసినపుడు మనమూ అలాగే కొనుక్కుని తినాలనిపించేది!*
అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, అది మన స్థాయికి చేయదగ్గది కాదు, డబ్బులున్న గొప్ప వాళ్ళు చేసేది అని!
ఇప్పుడు పెద్దయ్యాక మనం కొనుక్కుని తినే టైంకి ఆ పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు ఆరోగ్య రీత్యా ఆహారం ఇంటినుండి తెచ్చుకుని తింటున్నారు.
*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది .*
2) *చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే, కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునే వాళ్ళు, అదిచూసి అటువంటివి కావాలనిపించినపుడు, నాన్న చెప్పే వారు అది ఖరీదైనది మనం అంత పెట్టగలిగేవాళ్ళంకాదని!*
పెద్దయ్యాక మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే వాళ్ళు కాటన్ కు దిగారు ఇప్పుడు, కాటన్ దుస్తుల ధరే ఎక్కువ !
*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ..*😒🤔
⚖⚖⚖⚖⚖⚖⚖
3) *చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకే మోకాళ్ళ దగ్గర చినిగితే పారేసెందుకు మనసొప్పక అమ్మ లేదా టైలర్ తమ పనితనం చూపి నీట్ గా #రఫ్ చేసి ఇస్తే మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళం!*
పెద్దయ్యాక చూస్తే జనం ఆ మోకాళ్ళదగ్గర చిరుగులు ఉన్నవాటిని ఫ్యాషన్ పేరుతో #అధికధరలకు కొంటున్నారు !
*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ...*🤔😒
⚖⚖⚖⚖⚖⚖⚖⚖
4) *ఓ వయసులో మనకు సైకిల్ కొనగలగడమే కష్టం, అదీ సాధించేసరికి వాళ్ళు స్కూటర్ నడిపించేవాళ్ళు, మనం స్కూటర్ కొనే సమయానికి వాళ్ళు కార్లలో తిరిగేవారు, మనం కొంచెం ఎదిగి మారుతి 800 కొనే సమయానికి వాళ్ళు BMW ల్లో తిరిగారు, మనం రిటైర్మెంట్ వయసుకి వచ్చిన కూడబెట్టుకున్న వాటితో కొంచెం పెద్ద కారు కోనేసమయానికి వాళ్ళు ఆరోగ్యావసరాలతో సైక్లింగ్ చేస్తున్నారు!
*దాంతో ఇప్పటికి ఆ అంతరం
అలాగే ఉండిపోయింది . .🤔😒*
**
ప్రతి దశలో ప్రతి సమయాన విభిన్న మనుషుల మధ్య స్థాయి అంతరం ఉండనే ఉంటుంది.
*"ఆ అంతరం నిరంతరం" ఎప్పటికి ఉండి తీరుతుంది *
రేపటిఆలోచనతో ఇవాళ్టిది వదులుకుని మళ్ళీ రేపటిరోజున గతించిన #ఇవాళ్టి గురించి చింతించేకంటే, ఇవాళ అందినదానితో ఆనందిస్తూ ఆస్వాదిస్తూ రేపటి స్వాగతం పలకడం శ్రేయస్కరం.
*మన, మనవారి గురించి
కాలాన్ని వెచ్చిద్దాం *
💐🌹💐🌹💐🌹💐🌹
*మనం నవ్వుతూ ఉందాం*😊
*జీవితం కూడా సంతోషంగా ఉంటుంది * 😊
భాగవతము
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*షష్ఠ స్కంధం*
*ఎయ్యది కర్మబంధముల నెల్ల హరించు, విభూతికారణం*
*బెయ్యది, స న్మునీంద్రులకు నెల్ల గవిత్వసమాశ్రయంబు ము*
*న్నెయ్యది, సర్వమంత్రముల నేలిన దెయ్యది, మోక్షలక్ష్మిరూ*
*పెయ్యది, దానిఁ బల్కెద సుహృద్యము భాగవతాఖ్య మంత్రమున్.*
భాగవతం అంటే భగవంతునికి సంబంధించిన గుణగణాలను ప్రపంచించి చెప్పే ఒక మహామంత్రం. అది కర్మలవలన కలిగే బంధాలన్నింటినీ తొలగించివేస్తుంది. పొందదగిన గొప్పసంపదలన్నింటినీ భక్తులకు సిద్ధింపజేస్తుంది. నిత్యసత్యమైన పరతత్త్వాన్ని మాత్రమే పలకాలనే పట్టుదలగల మహర్షులు వాల్మీకికీ, వ్యాసుల వారికీ అత్యద్భుతమైన కవిత్వభిక్ష పెట్టింది. మంత్రాలన్నింటినీ ఏలిన మహామంత్రం అది. ఒక్కమాటలో చెప్పాలంటే అది అందరూ అందుకోవలసిన మోక్షలక్ష్మియే. భక్తుల హృదయాలలో భద్రంగా నెలకొని ఉండేది ఆ మంత్రమే. కనుక నేను దానినే వాక్కులతో ఉపాసిస్తాను.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
శ్రీశైలాన్ని ఏ మాసంలో దర్శిస్తే
*శ్రీశైలాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఏం ఫలం*
శ్రీ శైల శైలమహాక్షేత్రం మహిమాన్వితమైనది. ఈ క్షేత్రం యొక్క దివ్యశక్తి అమోఘం. భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం శ్రీశైలములో అణువణువునా వ్యాపించి వుంది.
ఎన్నో జన్మల పుణ్యఫలితం వలన మాత్రమే శ్రీశైల దర్శనభాగ్యం కలుగుతుందని స్కాందపురాణములోని శ్రీశైలఖండం చెబుతోంది. ఈ క్షేత్రాన్ని ఏ మాసములో దర్శిస్తే ఏ ఫలితం లభిస్తుందన్న విషయాన్ని శ్రీపర్వతపురాణం యిలా చెప్పింది.
1. చైత్రమాసం
సకల శుభాలు కలుగుతాయి. బహుయజ్ఞాలు ఆచరించిన ఫలం లభిస్తుంది. ఆయుష్షు పెరుగుతుంది.
2. వైశాఖ మాసం
కష్టాలు తీరుతాయి. లక్షగోవులను దానం చేసినంత ఫలం లభిస్తుంది.
3. జ్యేష్ఠ మాసం
కోరికలు నెరవేరుతాయి. లక్షగోవులను బంగారంతో అలంకరించి దానం చేసినంత ఫలం లభిస్తుంది.
4. ఆషాఢ మాసం
కోటిగోవులను శివాలయానికి దానమిచ్చినంత ఫలం లభిస్తుంది. బంగారు రాశులను దానం చేసిన ఫలం వస్తుంది.
5. శ్రావణమాసం
యోజనం పొలమును పంటతో సహా పండితునికి దానం చేసినంత ఫలితం లభిస్తుంది.
6. భాద్రపదమాసం
పండితులకు కోటి కపిల ఆవులను దానం చేసిన ఫలం లభిస్తుంది.
7. ఆశ్వయుజమాసం
పాపాలన్ని హరించబడతాయి, అప్లైశ్వర్యాలు లభిస్తాయి. వేయి కన్యాదానాలు చేసిన ఫలం లభిస్తుంది.
8. కార్తిక మాసం
యజ్ఞాలలో ఎంతో గొప్పదిగా చెప్పబడే వేయి వాజపేయ యాగాలు చేసినంత ఫలం లభిస్తుంది.
9. మార్గశిర మాసం
పాపాలు తొలగిపోతాయి. పౌండరీకయాగం చేసినంత ఫలం లభిస్తుంది.
10. పుష్యమాసం
పాపాలు హరించబడి మోక్షం లభిస్తుంది. అతిరాత్రయాగం చేసినంత ఫలితం కలుగుతుంది.
11. మాఘమాసం
శ్రేయస్సు కలుగుతుంది రాజసూయయాగం చేసిన ఫలం లభిస్తుంది.
12. ఫాల్గుణమాసం
తరగని సంపదలు కలుగుతాయి. సౌత్రామణి యాగఫలం, ఎనలేని పుణ్యాన్ని పొందవచ్చు.
వేమన పద్యములు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
. *🌹వేమన పద్యములు🌹*
. *అర్థము - తాత్పర్యము*
. *Part - 43*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*💥వేమన పద్యాలు-- 124*
*అధికమైన యజ్ఞ మల్పుండు తాజేసి*
*మొనసి శాస్త్రములని మురువు దక్కు*
*దొబ్బ నేర్చు కుక్క దుత్తలు మోచునా ?*
*విశ్వదాభిరామ వినురవేమా !*
*🌹తాత్పర్యము --*
అల్పబుద్ధిగలవాడు గొప్పలు తనకు తానే చెప్పుకుంటాడు.
దొంగబుద్ధిగల కుక్క తేరగా దొరికినది తింటుంది గానీ బరువులెత్తదు గదా !
*💥వేమన పద్యాలు -- 125*
*అధిక సుఖదుఃఖములు రెండు నరయలేక*
*విధిని దూరంగ ఫలమేమి ? వేడు కలర*
*బుద్ధినొక్కిన బరిపూర్తి బొందదయ్య*
*యట్లుకా కూరకయె యుండ నడగు వేమా !*
*🌹తాత్పర్యము --*
సుఖదుఃఖములకు దైవాన్ని దూషించకూడదు.
సుఖం కలిగిన సంతోషించి , కష్టమొస్తే దేవుని నిందించకూడదు.
సద్బుద్ధితో స్థిరచిత్తముతో మానవుడు ప్రయత్నించవలెను.
*💥వేమన పద్యాలు -- 126*
*అధికసూక్ష్మమైన యానంద మెరుగక*
*మతియు లేక చదివి మగ్నుడయ్యె*
*నతిరహస్య మెల్ల నాజను డెరగురా*
*విశ్వదాభిరామ వినురవేమా !*
*🌹తాత్పర్యము --*
చదివి చదివి సూక్ష్మమును గ్రహించలేక , ఆనందించలేక దైవ రహస్యము తెలియక ప్రవర్తించెడివాడు మనిషి అనిపించుకోడు.
*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి*
*సర్వేజనా సుఖినోభవంతు*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సోమవారం, మార్చి 11, 2024*
శుభోదయం,నేటి పంచాంగం 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐
*సోమవారం, మార్చి 11, 2024*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతువు*
*ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం*
తిథి : *పాడ్యమి* మ1.06 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం : *ఉత్తరాభాద్ర* రా2.08 వరకు
యోగం : *శుభం* మ2.23 వరకు
కరణం : *బవ* మ1.06 వరకు
తదుపరి *బాలువ* రా11.58 వరకు
వర్జ్యం : *మ12.42 - 2.11*
దుర్ముహూర్తము : *మ12.33 - 1.20*
మరల *మ2.55 - 3.42*
అమృతకాలం : *రా9.39 - 11.08*
రాహుకాలం : *ఉ7.30 - 9.00*
యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00*
సూర్యరాశి: *కుంభం* || చంద్రరాశి: *మీనం*
సూర్యోదయం: *6.16* ॥ సూర్యాస్తమయం: *6.04*
*సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు*
రాశి ఫలితాలు
*శుభోదయం*
16.2291923113
**********
11-03-2024
ఇందు వాసరః సోమవారం
రాశి ఫలితాలు
*****
మేషం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.
---------------------------------------
వృషభం
ఇంట బయట కొందరి ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు
---------------------------------------
మిధునం
కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో చిన్నపాటి వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
---------------------------------------
కర్కాటకం
పాత బాకీలు వసూలు అవుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ పడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
---------------------------------------
సింహం
ముఖ్యమైన పనులలో తొందరపాటు మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది నిరుద్యోగులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది.
---------------------------------------
కన్య
ఇంట బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
---------------------------------------
తుల
నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
---------------------------------------
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకుంలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
---------------------------------------
ధనస్సు
కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు
---------------------------------------
మకరం
వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు అదికమౌతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి కొంత పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యకపోవడం మంచిది.
---------------------------------------
కుంభం
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు.
---------------------------------------
మీనం
ఉద్యోగాలలో అధిక శ్రమతోకానీ పనులు పూర్తి కావు నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాల్లో నూతన విధానాలు అమలుచేస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది.
---------------------------------------
*గమనిక* :౼
●
●
●
మన సంస్థ *శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*(రి.జి.నెం.556/2013) *వనస్థలిపురం,హైదరాబాద్* - 500070
బ్రాహ్మణ పరిచయ వేదిక *పరిచయం - పరిణయం*
*26/05/2024* (ఆదివారం) రోజు *వనస్థలిపురం హైదరాబాద్* లో ఏర్పటు చేశాము. *రిజిస్ట్రేషన్* మరియు ఇతర వివరాలు కై దిగువ ఇవ్వబడిన ఫోన్ నెం లను సంప్రదించండి
*80195 66579/98487 51577*.
*************
దిశానిర్దేశం
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*దిశానిర్దేశం!.*
"ఇక్కడ కొన్నాళ్లపాటు ఉండాలని వచ్చానండీ..నేను చేసే సాధన కొరకు ఈ ప్రదేశం సరైనదని అనిపిస్తున్నది..పైగా ఇక్కడ శ్రీ దత్తాత్రేయస్వామి వారు తన తపోసాధన చేసారు.. ఆ ప్రభావం ఈ క్షేత్రం లో ఉన్నది.." అన్నాడా పాతికేళ్ల వయసున్న యువకుడు..
అతనిని అంతకు ముందెన్నడూ చూడలేదు..ఒక కాషాయ వస్త్రాన్ని పంచె లాగా కట్టుకొని వున్నాడు..అదే రంగు చొక్కా ఉన్నది కానీ..దానిని ధరించకుండా భుజం మీద వేసుకొని వున్నాడు..నేను అతని గురించి వివరాలు ఆడిగేలోపలే..
"నేను ఇక్కడికి వచ్చి మూడురోజులవుతున్నది..ఉదయాన్నే శ్రీ స్వామివారి ప్రభాత హారతి సమయం లో మందిరం లోకి వచ్చి దర్శనం చేసుకొని..శివాలయం వద్ద చెట్ల క్రింద ధ్యానం చేసుకుంటున్నాను..నిన్నటి నుంచీ మనసులో బలంగా అనిపిస్తున్నది..ఇక్కడే కొన్నాళ్ల పాటు వుండి సాధన కొనసాగించాలని..మీరు అనుమతి ఇస్తే..కొనసాగిస్తాను.." అన్నాడు..
"ముందుగా మీ వివరాలు తెలుపండి..మీకు సౌకర్యం గా వుంటే..మీ సాధనను ఇక్కడ కొనసాగించండి..మధ్యాహ్నం పూట అన్నదానం జరుగుతుంది. అక్కడకు వెళ్లి ఆహారం తీసుకోవచ్చు..కానీ..ఒక్కమాట..మీ సాధన కు మేము ఎటువంటి ఇబ్బందీ కలిగించము..మీరు కూడా మందిర వ్యవస్థలో తలదూర్చ వద్దు.." అని చెప్పాను..
అతనిది కందుకూరు..పేరు.. నాగరాజు..కులరీత్యా యాదవులు..తల్లిదండ్రులు వున్నారు..సుమారు ఐదారేళ్ళ నుంచీ ఇతను ధ్యానం అనీ..సాధన..తపస్సు అనీ తిరుగుతున్నాడు..ఇంకా ఒక స్పష్టమైన లక్ష్యం ఏర్పడలేదు అని చెప్పాడు..ఆ గురి కుదిరేదాకా ఇక్కడ ఉండాలని అతని భావన..
ఒక వారం రోజులపాటు అతనిని దగ్గరగా గమనించాను..రోజులో ఎక్కువ సేపు ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాడు..ఏదో ఒక సమయంలో భోజనం చేస్తున్నాడు..కానీ మరో రెండు రోజులు గడిచేసరికి..మెల్లిగా అతని చుట్టూ మనుషులు మూగడం ప్రారంభం అయింది..ప్రశ్నలు అడగడం..అతని చేత తమ జాతకాలు చూపించుకోవడం మొదలైంది..అతనూ తన సాధన ధ్యానం వదిలేసి..ఈ ప్రాపంచిక వ్యవహారాలలో కూరుకు పోతున్నాడు..
శ్రీ స్వామివారు జీవించి ఉన్న రోజులలో సాధకుల గురించి ఒక మాట చెప్పేవారు.."సాధన.. ధ్యానం..చేస్తూఉన్నప్పుడు.. కొంత కాలానికి ఆ సాధకుడి కి కొన్ని చిత్కళ లు స్వాధీనం అవుతాయి..వాటి మాయలో పడిపోయి..ఆ శక్తులను లౌకిక వ్యవహారాలకు ఉపోయోగిస్తే..తాత్కాలిక భోగాలు సమకూరుతాయి..ఆ భోగాలకు అలవాటు పడితే..ఇక ఆ సాధకుడి లక్ష్యం దెబ్బతిని..అతనొక సాధారణ మాంత్రికుడిగా మిగిలిపోతాడు.. దైవాన్ని చేరుకోలేడు.. ఇది ప్రకృతి కల్పించే మాయ పొర..ఆ వలలో పడకుండా వుండే వాడే నిజమైన అవధూత..నిజమైన సాధకుడు.." అని..ఆ మాటలు గుర్తుకొచ్చాయి..
నాలుగు రోజులు గడిచిన తరువాత..నా దగ్గరకు వచ్చాడు.."నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది.."అన్నాడు..అతని ముఖం లో ఏదో తెలియని బాధ కనబడుతున్నది..కళ్ళమ్మట ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతున్నాయి..
"ఏమైంది?" అన్నాను..
"శ్రీ స్వామివారు స్వప్నం లో కనబడి..నన్ను గట్టిగా హెచ్చరించారు..నేను నడుస్తున్న దారి గమ్యం లేనిదనీ..దారి తప్పి తిరుగుతున్నాననీ..చెప్పారు..లేచి చూసాను..ఎవ్వరూ కనబడలేదు..కానీ ఆలోచిస్తే..ఈ మధ్య నేను చేసిన కొన్ని పనులు..నా సాధన కు ఉపయోగపడేవి కాదనిపించింది..నేనూ తప్పు చేశాను..కొందరి బాధలు పోగొడుతున్నాను అని భ్రమించాను..కానీ నేను అధోగతికి పోతున్నానని గ్రహించలేదు.." అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.."మా గురువు గారి దగ్గరకు వెళుతున్నాను..ఆయన హిమాలయాల్లో వుంటారు..ఆయన పాదాలు పట్టుకోమని స్వామివారు గట్టిగా ఆదేశించారు..వెళ్ళొస్తాను..మీకు చెప్పి వెళదామని వచ్చాను.."అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు..పశ్చాత్తాపం అతనిని దహించివేస్తున్నది..
ఆ తరువాత అతను మందిరం వద్ద నుంచి వెళ్ళిపోయాడు..కొన్నాళ్లపాటు తన గురువుగారి వద్ద వున్నాడు..ప్రస్తుతం ఆశ్రమ నిర్మించుకునే సన్నాహాల్లో వున్నాడు..మొత్తానికి శ్రీ స్వామివారు తనకు సరైన మార్గాన్ని చూపారని వినమ్రంగా చెప్పుకుంటాడు..
ఆ రకంగా నాగరాజు అనబడే ఒక సాధకుడికి స్వామివారు దిశానిర్దేశం చేసారు..అతని జీవితానికో గమ్యాన్ని నిర్దేశించారు..
సర్వం..
దత్తకృప.
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699