11, మార్చి 2024, సోమవారం

వేమన పద్యములు🌹*

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 43*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 124*


*అధికమైన యజ్ఞ మల్పుండు తాజేసి*

*మొనసి శాస్త్రములని మురువు దక్కు*

*దొబ్బ నేర్చు కుక్క దుత్తలు మోచునా ?*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

అల్పబుద్ధిగలవాడు గొప్పలు తనకు తానే చెప్పుకుంటాడు.

దొంగబుద్ధిగల కుక్క తేరగా దొరికినది తింటుంది గానీ బరువులెత్తదు గదా !


*💥వేమన పద్యాలు -- 125*


*అధిక సుఖదుఃఖములు రెండు నరయలేక*

*విధిని దూరంగ ఫలమేమి ? వేడు కలర*

*బుద్ధినొక్కిన బరిపూర్తి బొందదయ్య*

*యట్లుకా కూరకయె యుండ నడగు వేమా !*


*🌹తాత్పర్యము --*

సుఖదుఃఖములకు దైవాన్ని దూషించకూడదు.

సుఖం కలిగిన సంతోషించి , కష్టమొస్తే దేవుని నిందించకూడదు.

సద్బుద్ధితో స్థిరచిత్తముతో మానవుడు ప్రయత్నించవలెను.


*💥వేమన పద్యాలు -- 126*


*అధికసూక్ష్మమైన యానంద మెరుగక*

*మతియు లేక చదివి మగ్నుడయ్యె*

*నతిరహస్య మెల్ల నాజను డెరగురా*

*విశ్వదాభిరామ వినురవేమా !*


*🌹తాత్పర్యము --*

చదివి చదివి సూక్ష్మమును గ్రహించలేక , ఆనందించలేక దైవ రహస్యము తెలియక ప్రవర్తించెడివాడు మనిషి అనిపించుకోడు.



*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: