15, జులై 2024, సోమవారం

⚜ *శ్రీ కోటిలింగేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 379*


⚜ *కర్నాటక  : కోలార్*


⚜ *శ్రీ కోటిలింగేశ్వర ఆలయం* 



💠 బెంగుళూరు వాసులు ఎల్లప్పుడూ తమ బిజీ వర్క్ షెడ్యూల్‌ల మధ్య నిర్వహించగలిగే చిన్న వారాంతపు సెలవుల కోసం వెతుకుతూ ఉంటారు. 

ట్రెక్కింగ్, హిల్ స్టేషన్లు, రోడ్ ట్రిప్స్ మరియు చారిత్రాత్మక ప్రదేశాలు ఎల్లప్పుడూ ఎక్కువగా కోరుకునే ప్రయాణాలు అయితే, కర్ణాటకలోని దేవాలయాలు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. 


💠 కర్ణాటక చారిత్రక కట్టడాలు అన్ని కళా ప్రక్రియలను ఆకర్షిస్తాయి. 

కోలార్ జిల్లాలోని కోటిలింగేశ్వర దేవాలయం చాలా పురాతనమైనది కాకపోయినా ఇప్పటికీ భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తోంది.


💠 కోలార్ గని బంగారు క్షేత్రాలకు ప్రసిద్ధి చెందింది, అయితే దురదృష్టవశాత్తు, పర్యాటకులుగా, మీరు వాటిని సందర్శించలేరు. అయితే, బెంగుళూరు నుండి కోలార్ వరకు 70 కి.మీ.ల దూరంలో ఉన్న కొద్దిపాటి ప్రయాణంలో కోటిలింగేశ్వర ఆలయానికి దారి తీస్తుంది.


💠 కన్నడలో 'కోటి' అంటే కోటి, కోటిలింగేశ్వరుడు కోటి శివలింగాలతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంతో కూడిన ఆలయం.


💠 ఈ ఆలయంలో ఆసియాలోనే అతిపెద్ద మరియు ఎత్తైన లింగం ఉంది. 

లింగాల సంఖ్య 6.1 లక్షల లింగాలను కలిగి ఉంటుంది.


💠 ఈ అద్భుతమైన ఆలయం కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉంది.  బాగా ప్రసిద్ది చెందిన ఆలయం. 

ఆలయ ప్రాంగణంలో 33 మీటర్ల పొడవైన లింగస్వరూపం, 11 మీటర్ల పొడవైన నందీశ్వరుడు కూడా ఉన్నాయి.

లింగానికి దగ్గరగా నిర్మించిన నీటి కొలను కూడా ఉంది, ఇది భక్తులు లింగాలకు అభిషేకం సమర్పించడానికి ఉపయోగించవచ్చు.


💠 ప్రతి సంవత్సరం రెండు  లక్షలకు పైగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

మహా శివరాత్రి ఒక ప్రత్యేక సందర్భం మరియు ఈ పవిత్రమైన రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ స్వామిని దర్శిస్తారు.


💠 ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ 108 అడుగుల (33 మీ) పొడవు ఉన్న శివయ్య మరియు 35 అడుగుల (11 మీ) పొడవైన నందీశ్వరుడు విగ్రహం.

దీని చుట్టూ 15 ఎకరాల విస్తీర్ణంలో లక్షలాది చిన్న లింగాలు ఉన్నాయి.


💠 నందీశ్వరుడు విగ్రహాన్ని 60 అడుగుల (18 మీ) పొడవు, 40 అడుగుల (12 మీ) వెడల్పు మరియు 4 అడుగుల (1.2 మీ) ఎత్తు కలిగిన ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేశారు. 

ప్రాంగణంలో వివిధ దేవతల కోసం పదకొండు చిన్న దేవాలయాలు నిర్మించబడ్డాయి.


💠 ఈ ప్రాజెక్టులో ఒక కోటి శివలింగాల స్థాపన ఉంది కాబట్టే  ఈ క్షేత్రానికి కోటిలింగేశ్వర అని పేరు పెట్టారు మరియు ప్రస్తుతం కొన్ని లక్షల శివలింగాలు కొలువై ఉన్నాయి.


🔆 *కోటిలింగేశ్వర ఆలయచరిత్ర :-*


💠 ఈ ఆలయాన్ని స్వామి సాంబశివ మూర్తి 1980 లో నిర్మించారు. మొదటి లింగాన్ని 1980 లో స్థాపించారు మరియు అప్పటి నుండి ఈ ఆలయంలో అనేక లింగాలు ఉన్నాయి.


💠 ఆలయ ప్రాంగణంలో, వివిధ దేవతల కోసం మరో పదకొండు ఆలయాలు ఉన్నాయి.

వాటిలో మొదటిది విష్ణువు, బ్రహ్మ దేవుడు మరియు మహేశ్వరుల ఆలయాలు.

తరువాత కోటిలింగేశ్వర ఆలయం ఉంది.

వీటితోపాటు దేవాలయం లో

అన్నపూర్ణేశ్వరి ఆలయం, కరుమారి అమ్మ ఆలయం,శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం,  పాండురంగస్వామి ఆలయం, శ్రీరామ సీతా మాత మరియు లక్ష్మణ దేవాలయం,

పంచముఖ గణపతి ఆలయం,  

అంజనేయ ఆలయం ,సంతోషిమాత ఆలయం భక్తులు దర్శించవచ్చు.


💠 భక్తులు లింగాలను వ్యవస్థాపించడం ద్వారా ప్రత్యేక పూజలు కూడా చేసుకోవచ్చు. 

భక్తులు వారి పేర్లలో ఎన్నుకున్న ఏ రోజునైనా ఈ లింగాలను వ్యవస్థాపించవచ్చు.  నిత్యపూజలు, కైంకర్యాలు నిర్వహించబడతాయి మరియు వ్యవస్థాపించిన అన్ని లింగాలకు అందించబడతాయి.


💠 ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం విశ్రాంతి గృహాలు ఉన్నాయి. అదనంగా, ప్రతి సంవత్సరం ఇక్కడ ఉచిత సామూహిక వివాహాలు జరుగుతాయి.



💠 బెంగుళూరు నుండి 100 కి.మీ దూరంలో, కోలార్ నుండి 35 కి.మీ మరియు బంగారుపేట నుండి 14 కి.మీ దూరంలో, శ్రీ కోటిలింగేశ్వర దేవాలయం బంగారుపేట మరియు బేతమంగళ మధ్య కమ్మసంద్ర గ్రామంలో ఉంది.

మంగళవారం*🍁 🌹 *జూలై 16, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🍁 *మంగళవారం*🍁

   🌹 *జూలై 16, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః* 


👉 *కర్కాటక సంక్రమణం & దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం* రా 11.09 నుండి


*ఆషాఢమాసం - శుక్లపక్షం*

*తిథి : దశమి* రా 08.33 వరకు ఉపరి *ఏకాదశి*

వారం :*మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం : విశాఖ* రా 02.14 వరకు ఉపరి *అనూరాధ*

*యోగం : సాధ్య* ఉ 07.19 వరకు ఉపరి *శుభ*

*కరణం  : తైతుల* ఉ 08.01 *గరజి* రా 08.33 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.30 - 12.30  సా 05.00 - 06.00*

అమృత కాలం :*సా 04.48 - 06.31*

అభిజిత్ కాలం :*ప 11.47 - 12.40*

*వర్జ్యం : ఉ 06.30 - 08.13*

*దుర్ముహుర్తం   : ఉ 08.19 - 09.11 రా 11.08 - 11.52*

*రాహు కాలం : మ 03.29 - 05.06*

గుళిక కాలం :*మ 12.13 - 01.51*

యమ గండం :*ఉ 08.58 - 10.36*

సూర్యరాశి : *మిధునం/కర్కాటకం* 

చంద్రరాశి : *తుల/వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.43* 

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల :‌ ఉత్తరం దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.43 - 08.19*

సంగవ కాలం :*08.19 - 10.55*

మధ్యాహ్న కాలం :*10.54 - 01.32*

అపరాహ్న కాలం :*మ 01.32 - 04.08*

*ఆబ్ధికం తిధి : ఆషాఢ శుద్ధ దశమి*

సాయంకాలం :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.56*

నిశీధి కాలం :*రా 11.52 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.16 - 05.00* ___________________________________

          🌷 *ప్రతినిత్యం*🌷     

        *_గోమాతను పూజించండి_* 🐄 

        *_గోమాతను సంరక్షించండి_* 🐄


    🚩 *శ్రీ ఆంజనేయం*🚩


🌹మానవుడుగా పుట్టి 

ఆదర్శ తనయునిగా...

ఆదర్శ మిత్రుడుగా, ఆదర్శ ప్రభువుగా...

ఆదర్శ ధర్మమూర్తిగా, ఆదర్శ వ్యక్తిగా.... జీవనం సాగించిన అవతారమూర్తి 

           #శ్రీరాముడు🙏


🌹తాను నమ్మిన దైవమును 

త్రికరణశుద్ధిగా సేవిస్తూ, 

రాముడుని అపారభక్తితో ఆరాధిస్తూ...

రామ నామ మహిమను రామునికే

తెలియజెప్పే పరమభక్తునిగా...

త్రేతాయుగమున రామబంటుగా...

ద్వాపరమున  రామభక్తుడై...  

కలియుగమున  మహిమాన్విత దైవమై, 

ఊరూరా, ఇంటింటా కొలువై... 

యుగాలుగా 

#చిరంజీవి గా విరాజిల్లుతున్న

భక్త జ్ఞానప్రపూర్ణ దివ్యమూర్తి    

          '#ఆంజనేయుడు'🙏


             🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145

మంచి మాటల ప్రభావమెంతో

 ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు.


వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి, తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు.


కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు.


చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు, అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్య ఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు.


విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చిన వెయ్యేళ్ల తపోఫలానికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్య ఫలం ఏపాటి సాటి వస్తుందని అనుకున్నాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు.


తపోఫలమా? సత్సాంగత్య ఫలమా? ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరూ బ్రహ్మ వద్దకు వెళ్లారు. ఆయన విష్ణువు వద్దకు వెళ్లమన్నాడు. విష్ణువు, దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు పంపాడు. ఆయనేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేరని తేల్చాడు.


ఇద్దరూ కలిసి అక్కడకూ వెళ్లారు. వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు. అప్పటివరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు కూడా పెట్టాడు. తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండని సలహా ఇచ్చాడు.


విశ్వామిత్రుడు వెంటనే ‘నా వేయి సంవత్సరాల తపోఫలాన్ని ధారపోస్తాను. ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది’ అన్నాడు. అయితే భూమిలో ఏ చలనం లేదు.


అప్పుడు వశిష్ఠుడు అన్నాడు ‘ఒక్క పూట సమయంతో పాటు మేం చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్య ఫలం ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను’ అన్నాడు.


వశిష్ఠుడు అలా అనగానే, ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశాన నిలబడింది. ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని ‘మీ ఇద్దరూ ఇక వెళ్లవచ్చ’ని అంటాడు.


అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్లమంటే ఎలా? అని ఇద్దరూ ఆదిశేషుడిని ప్రశ్నించారు. ‘మీ ఎదురుగానే రుజువైంది కదా! ఏ తపోఫలం గొప్పదో? ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది?’ అని ఆదిశేషుడు అన్నాడు.


వేయి సంవత్సరాల తపశ్శక్తి ధారపోసినా కదలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్య ఫలాన్ని ధారపోయడం వలన ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు గ్రహించారు.


చూశారుగా! మంచి మాటల ప్రభావమెంతో?


*ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నా అదే పని. ఏ ఇద్దరు కలిసినా అదే తీరు. ‘చరవాణి’ తోనే మాట్లాడుకుంటున్నారు. చరవాణితోనే గడుపుతున్నారు. దానితోనే పుణ్య కాలం కాస్తా గడిచిపోతోంది. ఇక మనం మనసు విప్పి మనతో మనం, ఇతరులతో మనం మంచి మాటలు మాట్లాడేదెప్పుడు?*

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


•••••┉━•••••┉━•••••┉━•••••

*16-07-2024 / మంగళవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━•••••┉━•••••

మేషం


సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.  పాత  మిత్రులు నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు  పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. 

---------------------------------------

వృషభం


ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన  ఫలితం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్ధిరాస్తి వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది.  నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉత్తమ  ఫలితాలు పొందుతారు.  విద్యార్థుల   ఫలితాలు  సంతృప్తి కలిగిస్తాయి.

---------------------------------------

మిధునం


కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు.  సన్నిహితులతో  మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.   వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున  అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. 

---------------------------------------

కర్కాటకం


దీర్ఘకాలిక  రుణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో  కలహా సూచనలున్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

సింహం


గృహమున వివాహ శుభకార్యాలు  నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం  ఉంటుంది. చేపట్టిన  వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.  విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు  ఆశించిన స్థాన చలనాల కలుగుతాయి.

---------------------------------------

కన్య


ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.  సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. చేపట్టిన పనులు శ్రమతో   కాని  పూర్తికావు. ముఖ్యమైన  వ్యవహారాలలో నమ్మినవారే మోసగిస్తారు. వ్యాపారమున అలోచించి నిర్ణయాలు  తీసుకోవాలి.

---------------------------------------

తుల


సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన విషయాలలో  కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  ఉద్యోగ విషయంలో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి.

---------------------------------------

వృశ్చికం


దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవితభాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం  అనుకూలంగా ఉంటుంది.  నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్ధిరాస్తి  కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.

---------------------------------------

ధనస్సు


వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భూ సంబంధిత  క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

మకరం


బంధు మిత్రులతో మాటపట్టింపులు  కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి. చేపట్టిన పనులలో నిదానంగా ముందుకు సాగడం  వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు  బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

కుంభం


ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.  వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన  పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో ఇబ్బందులు తప్పు.  నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

మీనం


ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తికావు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయట వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి.  నిరుద్యోగ  ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

•••••┉━•••••┉━•••••┉━•••••

🍁 *శుభం భూయాత్* 🍀

జై జగన్నాథ

 🙏జై జగన్నాథ 🙏 

🛕🛕🛕🛕🛕

1) పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం )

2) రథయాత్ర  ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ )

3) పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రోజులు జగన్నాథుడు కొలువై ఉండే మందిరం పేరేమి?( గుండిచా )

4) జగన్నాథుడు పయనించే రథం పేరేమి? (నంది ఘోష )

5) జగన్నాధుని రథం ఎత్తు ఎంత?( 23 గజాలు)

6) జగన్నాధుని రథచక్రాలు ఎన్ని?(18)

7) బలబద్రుని రథం పేరేమిటి?( తాళద్వజం )

8) బలబద్రుని రథం ఎత్తు ఎంత?(22 గజాలు )

9) బలబద్ధుని రవి చక్రాలు ఎన్ని?(16)

10) సుభద్రాదేవిని తీసుకొని వచ్చే రథం పేరేంటి?( దర్పదలన )

11) సుభద్రా దేవి రథం ఎత్తు ఎంత?(21 గజాలు)

12) సుభద్ర దేవి రథం చక్రాలు ఎన్ని?(14)

13) జగన్నాథ రథ తయారీ ప్రక్రియ పేరేమిటి?( రధ ప్రతిష్ట)

14) రథయాత్ర మార్గాన్నిఏమని పిలుస్తారు?( బడదండ )

15) రథాలపై రెపరెపలాడే జెండాలను ఏమంటారు?( పావన బాణా )

16) జగన్నాథ రథ తయారీలో పాల్గొనే వడ్రంగులు ఎంతమంది?(60 మంది)

17)  జగన్నాథ రథం పై వేసే అలంకరణ వస్త్రాన్ని ఏమంటారు?( చాంద్వా )

18) అలంకరణ వస్త్రాన్ని కుట్టే దర్జీలు ఎంతమంది?(14 మంది)

19) జగన్నాధ రథ అలంకరణ కోసం ఉపయోగించే వస్త్రం ఎన్ని మీటర్లు?(1200)

20) రథయాత్రకు సేవ చేయడానికి శిక్షణ పొందే వారిని ఏమంటారు?( దైవపతులు)

22) రథయాత్రకు ముందు మార్గాన్ని శుభ్రం చేసే ప్రక్రియను ఏమంటారు?( చెరాపహారా )

23) రధాన్ని లాగడాన్ని ఏమంటారు?( రాధా తానా)

24) జగన్నాధుని ప్రథమ సేవకుడు ఎవరు?( పూరి రాజు )

25) జగన్నాథ ప్రసాదాన్ని తయారు చేసేది ఏ కులము వ్యక్తి?( మంగలి)

26) ప్రసాద తయారీలో వినియోగించే పాత్ర ఏ లోహం? ( మట్టి)

 27)జగన్నాధుని విగ్రహం ఏ లోహంతో తయారవుతుంది?( దారు/ చెక్క )

28) జగన్నాథ రథయాత్ర కొనసాగే దూరం ఎంత?( రెండున్నర కిలోమీటర్లు )


🙏🏻🙏🏻🙏🏻🔔🌄🔔🙏🏻🙏🏻🙏🏻

సూర్యుడు(రవి)💥

 💥సూర్యుడు(రవి)💥


పిత, ఆత్మ, తనువు, రాజ్యము, ప్రభావము, ధైర్యము, అధికారము, నేత్రము, పిత్తము, శూరత్వము, శక్తి, విదేశ పర్యటన, జ్ఞాన తేజము, పరాక్రమము, ఉష్ణము, అగ్ని, ధర్మ ధ్యాస, కడుపు, కన్ను, పాలనాశక్తి, ప్రభుత్వ భూములు, కోర్టు వ్యవహారములు, బంజరు భూములు, గుండ్రని ఆకారముండు పొలములు, రారాజు యోచన, గ్రామ ఆధీన జాగాలు, ఎర్రచందనము, ముద్రాధికారము, తెల్ల జిల్లేడు, తూర్పు, ఆంగ్ల విద్య, ఆదివారము, చైత్రమాసము, రాజభవనములు, వేడిని పుట్టించు నీలి వెలుగులు, పై అంతస్థులు గల భవనములు ఈ విధముగా సూర్యుని ఆధీనములో ఉన్నవి. ఇట్లుండుట వలన సూర్యుడు కర్మచక్రములోని నాల్గవ రాశిమీద తన కిరణములను ప్రసరించినప్పుడు ఆ జాతకునికి పై అంతస్థు భవనములు కట్టించు ప్రేరణ చేయును. ఒకవేళ వ్యక్తి పేదవాడైవుంటే, భవనము కట్టించు స్థోమతలేనివాడైయుంటే, అతనికి పెద్ద భవనములో కిరాయికైనా ఉండుటకు ప్రేరణ చేయును. కిరాయికి కూడా ఉండలేని కర్మగలవానికి తాను పని చేయుచున్న యజమానికి గల పెద్ద అంతస్థుల భవనములో వాచ్‌మేన్‌గా నైనా లేక పని మనిషిగానైనా ఉండునట్లు చేసి ఆ ఇంటిలో నివాసము కల్గునట్లు చేయును. ఎందరో బీదవారు తమది కాని పెద్ద భవనములో వర్క్‌మ్యాన్‌గానో, వాచ్‌మ్యాన్‌గానో, వాటర్‌మ్యాన్‌గానో ఉంటూ యజమాని తన ఇంటిలో లేకున్నా తానుమాత్రము ఉంటున్నాడు. ఈ విధముగా సూర్యుడు అనుకూలించిన వారికి కలుగును. ఇలా అనుభవించవలెనను కర్మ నాల్గవ ఇంటిలోనున్నప్పుడు ఆ స్థానములోనికి సూర్యుడు వచ్చినప్పుడు అలా జరుగునని తెలియవలెను. నాల్గవ ఇంటిలో పాపమున్నప్పుడు సూర్యుడు అనుకూలుడై వచ్చినా అటువంటి సుఖములను సూర్యుడు ఇవ్వడు. ఒకవేళ సూర్యుడు శత్రుగ్రహమై వస్తే గృహమునకు సంబంధించిన సుఖములు అంతవరకున్నా అప్పుడు లేకుండా చేయుటకు ప్రయత్నించును. ఉన్న పెద్ద ఇల్లును కూడా అమ్మి చిన్న ఇల్లును కొందామనుకొనును. ఈ విధముగా మనిషియెడల సూర్యగ్రహము పనిచేయుచున్నది. జాతక లగ్నమునకు నాల్గవ స్థానములో రవి యున్నప్పుడు ఇలాంటి ప్రేరణ చేయును. జాతక లగ్నములో సూర్యుడు ఏ రాశిమీద ఉండునో జీవితాంతము ఆ రాశికి సంబంధించిన కార్యములనే ప్రేరేపిస్తూ మనిషికి కష్టసుఖములను కల్గించుచుండును. ఏ జాతకునికైనా జాతక లగ్నములో ఏయే రాశుల మీద ఏయే గ్రహములుండునో దాని ఫలితమును బట్టి జీవితములో ఉండును. కాలచక్రములో తిరుగుగ్రహములు తిరిగి ఆ రాశిమీదికి వచ్చినప్పుడు మొదటి లగ్నము ప్రకారమే ఫలితముల నిచ్చుచుందురు. ఇప్పుడు చంద్రునికి ప్రపంచములో ఏయే వస్తువుల మీద అధికారము కలదో తెలుసుకొందాము. 🙏

ఇంట్లో దీపం పెట్టేటప్పుడు.

 🙏🪔🪔🪔🙏

రోజు ఇంట్లో దీపం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు? 

🪔🪔🙏🪔🪔

రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు.

🪔🪔🪔🪔🪔

దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. 

మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. 


అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. 

దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. 


శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వటి రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.) 


దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి, అనగా రెండు వత్తులని కలిపి వేయాలి, విడివిడిగా కాదు.. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు. దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క కానీ, పటికబెల్లం పలుకులు కానీ, ఏదో ఒక పండుగానీ, లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి. 


ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. 


 ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

🙏🙏🙏🙏🙏

"పిప్పలాదుడి" కథ..!!*

 *🪷 "పిప్పలాదుడి" కథ..!!*


 *జన్మించిన 5ఏండ్ల వరకూ శని ప్రభావం మనకు ఉండకుండా చేసిన మహానుభావుడు..!!*


 *మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావిచెట్టు తొఱ్ఱలో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది, ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకు పోయారు..!!*


*రావి చెట్టు తొఱ్ఱలోని పిల్లవాడు ఆకలి, దాహంతో ఏడుపు ప్రారంభించాడు, అయినా తనను చూచేవారు ఎవరూ లేకపోవడంతో, అతను ఆ తొఱ్ఱలోనే పడిన రావి పండ్లు తిని పెరిగాడు..!!*


*ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్తూ వెళ్తూ రావి చెట్టులో ఉన్న పిల్లవాడిని చూసి అతని పరిచయాన్ని అడిగాడు..!!*


 *నారదుడు - నువ్వు ఎవరు..?* 

 *అబ్బాయి: అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది..!!* 

 *నారదుడు - నీ తండ్రి ఎవరు..?* 

 *అబ్బాయి: అదే నేను తెలుసు కోవాలనుకుంటున్నాను..!!* 

 *అప్పుడు నారదుడు దివ్యదృష్టితో చూసి ఆశ్చర్యపోయి “ఓ అబ్బాయీ..! నీవు గొప్ప దాత ‘మహర్షి దధీచి’ కొడుకువి” అని చెప్పాడు, ”నీ తండ్రి అస్తికలతో  దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి (వజ్రాయుధం) రాక్షసులను జయించారు, మీ తండ్రి దధీచి 31 ఏళ్లకే చనిపోయారు” అని నారదుడు చెప్పాడు..!!* 

 *అబ్బాయి: మా నాన్న అకాల మరణానికి కారణం ఏమిటి..?* 

 *నారదుడు: “మీ తండ్రి మరణానికి శని మహాదశయే కారణం”..!!*

 *పిల్లవాడు: నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి..?* 

 *నారదుడు:శనిదేవుని మహాదశయే..!!*


 *రావి ఆకులు,పండ్లు తిని పెరిగిన ఆబిడ్డకు “పిప్పలుడు” అని పేరు పెట్టాడు నారదుడు, తపోదీక్షను కూడా ఇచ్చాడు, పిల్లవాడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు, బ్రహ్మాదేవుడు బాల పిప్పలాదుడిని వరం అడగమని కోరినప్పుడు, పిప్పలాదుడు తన కళ్లతో ఏవస్తువును చూస్తే ఆ వస్తువును కాల్చే శక్తిని ఇవ్వమని అడిగి సాధించాడు, ఆ తరువాత అలా అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు, శనిదేవుడినీ వదల్లేదు, విశ్వంలో కలకలం రేగింది, సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫల మయ్యారు, సూర్యుడు కూడా తన కళ్ల ముందే కాలిపోతున్న కొడుకుని చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకున్నాడు, చివరికి బ్రహ్మదేవుడు పిప్పలాదుడి ముందు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచిపెట్టమని అడిగాడు, కానీ పిప్పలాదుడు ఒప్పుకోలేదు, బ్రహ్మాదేవుడు “ఒకటి కాదు రెండు వరాలు ఇస్తాను అతడిని వదిలేస్తే” అన్నాడు.. పిప్పాలాదుడు సంతోషించి రెండు వరాలను అడిగాడు..!!*


*1)పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు పిల్లలెవరికీ శనిబాధ ఉండకూడదు, తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు..!!* 

 *2)అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది, కనుక సూర్యోదయానికి ముందు 'రావి' చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు, దానికి   బ్రహ్మాదేవుడు 'తథాస్తు' అని వరం ఇచ్చాడు..!!*


*ఆ వెంటనే పిప్పలాదుడు మండుతున్న శనిని విడిపించాడు, ఏమండీ ఆపాటికే శనిదేవుని పాదాలు కాలిపోయి దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు, అందుకే “శనిః చరతి య: శనైశ్చరః" అన్నారు, మెల్లగా నడిచే వాడు శనైశ్చరుడు అని, మంటల్లో మాడిపోయి నల్లగా అయిపోయాడు..!!* 

*శని యొక్క నల్లని విగ్రహాన్నీ, రావిచెట్టునీ పూజించడంలోని మూల సూత్రం ఇదే..!!✍️*

Panchaag


 

ఆరు విధాలైన సుఖాలు

 ఏవి సుఖాలు ?

🪷🪷🪷🪷🪷


మహాభారతంలో సందర్భానుసారంగా ఎన్నో నీతులను చెప్పారు వ్యాసులవారు. 


'మనిషికి ఏవి సుఖాలు? అని పరిశీలిస్తే ఆరు సుఖాలు అని చెప్పవలసి వస్తుంది. అవి ఏమిటంటే-


*అర్థాగమో నిత్యమరోగితా చ*

*ప్రియా చ భార్యా ప్రియవాదినీ చ*

*వశ్యశ్చ పుత్రో౽ర్థకరీ చ విద్యా*

*షడ్జీవలోకస్య సుఖాని రాజన్!*


నిత్యం ధనార్జన చేయడం ఒకటి. ఏ రోగాలు లేకుండా ఉండడం రెండవది. ప్రియమైన భార్య ఉండడం మూడవది. భర్తతో ప్రియంగా మాట్లాడే భార్య ఉండడం నాల్గవది. పుత్రులు తండ్రి మాటను పాటించేవారై ఉండడం ఐదవది. తాను నేర్చుకొన్న విద్య భుక్తి ఉపయోగపడేది కావడం ఆరవది.


ఇలా మనిషికి ఆరు విధాలైన సుఖాలు పూర్వపుణ్యంతోనే వస్తాయి.

గోవింద పదారవింద మహిమ!



గోవింద పదారవింద  మహిమ!


                  ఉ: పొందరు  దుఃఖముల్,  భయము పొందరు, పొందరు  దైన్య మెమ్మయిన్,


                       పొందరు  తీవ్ర దుర్దశలు , పొందు ప్రియంబులు , పొందు   సంపదల్


                      పొందు సమగ్ర సౌఖ్యములు , పొందు సమున్నత  కీర్తు  లెందు,,   గో


                       వింద  పదారవింద  పదవీ  పరిణధ్ధ   గరిష్ట   చిత్తులన్;


                            నృసింహ పురాణము-  ఎఱ్ఱాప్రెగ్గడ;


                      

                 గోవింద పదారవింద  ధ్యాన పరాయణులకు  దుఃఖములు రావు. (దుఃఖములకు వెరువరని భావము)  భయముండదు.

జీవన దైన్యముండదు. దుర్దశలు  దాపురించవు.  ప్రియములు  కలుగుచుండును. సంపదలు కలుగును. సంపూర్ణమైన  సుఖములు కలుగును. సర్వోన్నతమైన కీర్తికలుగును.ననిభావం!


                         ఈపద్యంలో  ఒక  చమత్కారం ఉన్నది. గోవిందుని గొలచినవారికి  కలుగని  కీడులు ఒకవరుసగాను, కలిగెడు

లాభములను మరియొక వరుసగాను వివరించుట.


                      నవ విధ భక్తి మార్గాలలో  పాద సేవ సముచిత మైనది. అహంకార రాహిత్యము నొనగూరిచి, మనో విశుధ్ధిని  కలిగించుటకు  అది చక్కనిమార్గం.  సనక సనందనాది భక్తులు గోరిన దదియే! నేడు  తొలి  యేకాదశీ  సందర్భముగా మనమందరం

ఆదేవదేవుని పై మనసు నిలిపి  ధ్యానం  చేద్దాం. ముక్తిమాట  యేమైనా కనీసం  చిత్త శాంతితో  ప్రశాంతంగా  బ్రతికే అవకాశం కోసం

ప్రయత్నం చేద్దాం!


                                                           స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఏకాదశ రుద్రులు

 మీలో చాలా మందికి తెలిసి ఉండచ్చు కోనసీమ లో వెలిసిన ఏకాదశ రుద్రులు.అమలాపురానికి 10-15 కిలోమీటర్ల radius లో ఈ 11 శివాలయాలు వున్నాయి. వాటి గురించిన వివరాలు 👇,


కోనసీమలో కొలువైన ఏకాదశ రుద్రులు 


1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):

పూర్వకాలంలో ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆపులి శివలింగరూపాన్ని పొందిందని కధనము కలదు. వ్యాఘ్రము శివునిగా అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడెను.


2. హాదేవరుద్రుడు- కె. పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):

పూర్వకాలంలో విశ్వామిత్రుని తపోభంగముకొరకు ఇంద్రుడు మేనకను పంపెను. విశ్వామిత్రునకు, మేనకకు శకుంతల జన్మించెను. తరువాత మేనక స్వర్గమునకు పోవుదమని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయినది. అపుడు ఆమె శివుని ప్రార్ధించగా ఆయన ఒకశివలింగమును మేనకకు ఇచ్చి ఆప్రదేశములో ప్రతిష్ఠింపుమనెను. అపుడు మేనక కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి) నందు శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయెనని కధనముకలదు. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వరస్వామి అని పిలువబడెను. 


3. త్రయంబకేశ్వరుడు - ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):

రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయినది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించెనని కధనము కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడెను.


4 త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):

తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామము నందు శివలింగరూపంలో ఆవిర్భవించెనని కధనము కలదు. అపుడు ఆగ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను. 


 5.త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):

మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామమున ఈశివలింగము ప్రతిష్ఠింపబడినది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలువబడుచున్నాడు.


6.కాలాగ్ని రుద్రుడు - ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):

రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వరస్వామిగా పిలువబడెను.


పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కధనముకలదు. 


7. నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి ( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి ):

దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హానికలిగించకుండా చేయుటకు శివుడు తనకంఠమునందు నిక్షిప్తముచేసికొని నీలకంఠుడైనాడు.


 ఆగరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు, మరియు అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను.


8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):

శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, యముని జయించి "మృత్యుంజయుడు" అయ్యెను.

ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మిగ్రామ మునందు లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడెను.


9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీవీరేశ్వర స్వామి):

దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలందు కాలిబూడిద అయినపుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసెను. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారము నందు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. 


10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):

పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్ప వారని వాదనకుదిగి శివుని వద్దకు వచ్చిరి. అపుడు శివుడు ఆద్యంతములులేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినను ఒకఆవును, మొగలిపు వ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితి నని చెప్పెను. శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించివిష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆలింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్త ములచే ప్రతిష్ఠింపబడెను. 


11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):

పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి "పుండరీకపురము" అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు. వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అనుపేరుతో పిలువబడెను.



పరమేశ్వరుని కటాక్ష వీక్షణాలు మన అందరిపైనా ఉండాలని, సదా సద్బుద్ధి తో సాంబసదాశివుణ్ణి స్మరించే భాగ్యం కలగాలని ఆశిస్తూ..

Old people are not stupid

 ఒకసారి ఒక అమ్మాయి తన అవ్వతొ ఆమె వరండాలో కూర్చుంది.


అప్పుడు అనుకొకుండా అమె బాయ్ ఫ్రండ్ అక్కడికి వచ్చాడు.


ఆ అమ్మాయి తన ప్రియుడికి ఆమె ఇలా చెప్పింది.


"మీరు రామ్ పాల్ యాదవ్ * Dad is at Home " పుస్తకాన్ని తీసుకువచ్చారా?


అబ్బాయి " లేదు నేను కీమతి ఆనంద్ రాసిన * * Where should I wait for you* పుస్తకాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను "


అమ్మాయి "నా దగ్గర ఆ పుస్తకం లేదు. నా దగ్గర ప్రేమ్ బాజ్ పేయి రాసిన * Under the Mango Tree* ఉంది.


అబ్బాయి "సరే మీరు ఆనంద్ బక్శి గారి "*Call You In Five Minutes* తీసుకురండి.


అమ్మాయి "సరే నేను జాన్ అబ్రహం రాసిన **Won't Let You Down* పుస్తకాన్ని తప్పకుండా తెసుకువస్తాను.


అబ్బాయి అవ్వకు నమస్కరించి వెళ్ళిపోయాడు.


అవ్వ అంది ", ఈ అబ్బాయి చాలా పుస్తకాలు చదువుతాడు అనుకుంటాను.


అమ్మాయి "వావ్ అవును అతను మా తరగతిలో ఉన్నాడు. చాలా తెలివైన వాడు.


అవ్వ " అవును, కాని అతను ఒక పుస్తకం చదవటం మర్చిపోయినట్టు ఉన్నాడు"


అమ్మాయి " ఏమిటది"


అవ్వ " అతనికి మున్షి ప్రేమ్ చంద్ రాసిన Old people are not stupid పుస్తకాన్ని చదవమని చెప్పు.

మేఘసందేశం కాళిదాసు

 🙏మేఘసందేశం కాళిదాసు 🙏

కాళిదాసు రచించిన కావ్యాలకి ఒక ప్రత్యేకత ఉంది. కాళిదాసు పుట్టుకతోనే పండితుడు కాదనీ, పెళ్ళయ్యాకే అమ్మవారి (కాళికా దేవి) అనుగ్రహం వలన పండితుడయ్యాడనీ అందరికీ తెలిసినదే. అయితే పెళ్ళయిన వెంటనే కాళిదాసు భార్య "వాగస్తి కశ్చిత్?" (వాక్కు ఏదన్నా నీకుందా?) అని అడుగుతుంది. ఈయన పండితుడయిన తరువాత, ఈ వాగస్తి కశ్చిత్ లో ఉన్న మూడు పదాలనీ (వాక్, అస్తి, కశ్చిత్) తీసుకునీ ఒక్కో పదంతో మొదలయ్యేట్టుగా ఒక్కో కావ్యాన్ని (వాక్కుతో మొదలుపెట్టిన మహా కావ్యం రఘువంశం, అస్తి తో మొదలుపెట్టిన మహా కావ్యం కుమార సంభవం మరియు కశ్చిత్ తో మొదలుపెట్టిన ఖండ కావ్యం మేఘ సందేశం) వ్రాశాడు. ఆ ప్రకారంగా ఇందులోని మొట్టమొదటి శ్లోకం:

కశ్చిత్కాంతావిరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః

శాపేనాస్తంగమిత మహిమా వర్షభోగ్యేణ భర్తుః ।

యక్షశ్చక్రే జనక తనయా స్నాన పుణ్యోదకేషు

స్నిగ్ధచ్ఛాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు ॥


అంటే తన విధులలో అశ్రద్ధ వహించటం వలన యజమాని ఆగ్రహానికి గురయ్యి, తన విధుల నుండి తొలగించబడి, తన శక్తులన్నీ కోల్పోయి, యేడాది కాలం కాంతా (భార్య) వియోగంతో గడపవలననే శాపాన్ని పొందిన యక్షుడు, జనకుని కూతురు అయినటువంటి సీతా దేవి స్నానం చేయటం వలన పవిత్రంగా మారిన నీరు కలిగినటువంటి, దట్టమయిన నీడనిచ్చే చెట్లు కలిగినటువంటి రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు.


ఈ శ్లోకంతో నాయకుడయిన యక్షుని పరిచయం జరిగింది. దానికి రెండు విశేషణాలు వాడాడు. అవే స్వాధికారాత్ ప్రమత్తః, అస్తంగమిత మహిమ. దీని ఆధారంగా కాళిదాసు విధి నిర్వహణే ప్రధాన కర్తవ్యం అని చెప్తున్నాడు అనిపిస్తుంది. చేయవలసిన పని సరిగ్గా చేయకపోవటం వలన యక్షునికి కలిగిన అనర్థాలు ఉద్యోగం మరియు మహిమలు కోల్పోవటం, తద్వారా కాంతా వియోగం పొందటం. మనకి ధర్మార్థకామాలలో కూడా మొదటిది ధర్మ నిర్వహణే కదా! అది సరిగ్గా చేయకపోతే అన్నిటికీ దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలాగే రామగిరి ఆశ్రమంలో ఉన్నాడు అని చెప్పాడు కానీ అదెక్కడుందో రెండు విశేషణాలతో చెప్పకనే చెప్పాడు. అవే జనక తనయా స్నాన పుణ్యోదకేషు అనగా సీతాదేవి స్నానం చేయటం వలన పవిత్రమయిన నీరు, స్నిగ్ధచ్ఛాయాతరుషు అనగా ఎక్కువగా నీడనిచ్చే చెట్లు. వీటి ఆధారంగా తెలిసేది ఏమిటంటే సీతాదేవి వనవాసం చేసిన చోటు అని. అదే చిత్రకూట పర్వతం. ఇటువంటి ఎన్నో రసవత్తరమయిన శ్లోకాలతో ఆద్యంతం ఆకట్టుకున్న అద్భుత కావ్యం మేఘ సందేశం.


అరణ్యంలో విరహంతో ఉన్న యక్షునికి (యక్షులు సాధారణంగా కాముకులు కనుక వారికి కాంతా వియోగం భరించలేనటువంటిది) మేఘుడు కనిపిస్తాడు. కనిపించిన వెంటనే ఏమీ ఆలోచించకుండా మేఘునితో అలకాపురి(యక్షుల నివాసం)లో ఉన్న తన భార్యకి సందేశాన్ని పంపాలి అనుకుంటాడు. శ్రీరాముడు సీతకి ఆంజనేయస్వామి ద్వారా, పాండవులు కౌరవులకి శ్రీ కృష్ణుని ద్వారా, నలోపాఖ్యానంలో దమయంతికి హంస ద్వారా, సందేశాలు పంపటం జరిగాయి. కానీ ఇక్కడ యక్షుడు - పొగ, వెలుతురు, నీరు, గాలి కలిసినటువంటి మేఘంతో (ప్రాణం లేని దానితో) సందేశం పంపబోతున్నాడు. ఆ మాత్రం కూడా కాళిదాసుకి తెలియదు అని జనం భావించకుండానే, కామార్తులకు (కామముతో ఉన్న వాడికి) అంత ఆలోచన ఎక్కడిది? అని తన కావ్యౌచిత్యాన్ని సమర్ధించుకున్నాడు (పూర్వ మేఘం, నాల్గవ శ్లోకంలో).

                    సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

దయ,కరుణ కలిగి ఉండండి*

 *ఇతరుల పట్ల దయ,కరుణ కలిగి ఉండండి* 


భగవానుడు వైకుంఠం నుండి అవతరించి, వివిధ అవతారాలు ఎత్తాడు, ఈ వివిధ అవతారాలతో తనకు సంబంధించినంతవరకు ఎటువంటి ప్రయోజనం, అవసరం లేకపోయినా, కష్టతరమైన దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఏకైక ఉద్దేశ్యంతో, కరుణాపూరిత నిస్వార్థచిత్తంతో  అవతారాలు ధరించాడు. ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసే శక్తిని దేవుడు  మానవులమైన మనకు ఇచ్చాడు.  మనకు 'దయ' లేదా కరుణ ఉంటేనే మనం ఆ శక్తిని ఉపయోగిస్తాము.  

కరుణ అంటే ఏమిటి?  

ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు అతని బాధను పోగొట్టాలనే ఆలోచన వస్తేనే అది దయ. లేకపోతే, అతన్ని 'దయలేని' వ్యక్తి అంటారు.  దయ అనేది అత్యుత్తమ మానవ లక్షణం, అలాంటి దయను మనలో మనం పెంచుకోవాలి.  కొంతమంది సహజంగా అసాధారణమైన దయతో ఉంటారు. అది మంచిది.

 మంచివారి సాంగత్యం వల్ల వారి లాగే తామూ ఉండాలనే ఆలోచన కొందరికి కలిగితే అప్పుడు కరుణ కలుగుతుంది.  కాబట్టి మనం ముందు కరుణను పెంపొందించుకోవాలి. తద్ద్వారా దయ పుడుతుంది.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

పంచె(కు) తంత్రం

 ---------- పంచె(కు) తంత్రం ------------


"పంచెకట్టుటలో ప్రపంచాన మొనగాడు మన తెలుగువాడు" అని సి.నా.రె గారు చెప్పినా

పంచె కట్టడం అంత తేలికైన పనేమీ కాదు. అమ్మ బాబోయ్! పంచె భద్రత అంటే

ప్రపంచ భద్రత. అభినవ తెనాలి రామకృష్ణ గా బిరుదు సంపాదించుకున్న ఓ హాస్యవేత్త

కొన్నేళ్ల క్రిందట గజ్వెల్ 'భువనవిజయం' లో తెనాలి రామకృష్ణుడి పాత్ర ధరించాడు.


నాటకం జోరుగా సాగుతోంది.రామకృష్ణుడు ప్రగడరాజు నరస కవి తో వాగ్వివాదం

చేయాల్సిన ఘట్టం వచ్చేసింది.రామకృష్ణుడు తన స్థానం లోనుంచి లేవ పోయాడు.


పంచె(కు) తంత్రం మొదలైంది. పంచె వాకౌట్ చేసే లక్షణం కనిపించింది. పంచె ఊడిపోతే

ఎలా అనే భయం రామకృష్ణ పాత్రధారికి పట్టుకుంది. లేస్తే అదీ పరిస్థితి.


అటువంటి పరిస్థితి పగవాడికి కూడా వద్దు. తన స్థానం లోనే కూర్చుని ఓయీ! నరసకవీ!

నీ ముందు నేను నిలబడుటయా? వచ్చి నీవే నా పాదాలచెంతకు నిలబడి

మాట్లాడుము. అని గద్దించాడు. 


పరిస్థితిని అర్థం చేసుకున్న నరస రాజు పాత్రధారి

వణుక్కుంటూ దగ్గరగా వచ్చి మాట్లాడాడు. అలా సమయస్పూర్తితో కార్యక్రమం

యిబ్బంది లేకుండానే పూర్తయింది. అప్పటినుంచీ ఆ తెనాలి రామకృష్ణుడు ప్యాంటు

వేసుకోవడం ప్రారంభించాడు.


ఈ హాస్యవేత్తను ఒకసారి అమెరికాలోని సిలికా నాంధ్ర వాళ్ళు పిలిచి కార్యక్రమము

ఏర్పాటు చేశారు.పంచె కట్టకుండా తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది. 


అందుకోసం

ప్యాంటులాగా తొడుక్కునే పంచెను ధరించాడు.(రెడీమేడ్ పంచె). అయినా భయం

పోలేదు.


అయ్యా! తప్పనిసరి పరిస్థితిలో పంచె కట్టుకొని వచ్చాను నేను నా పెళ్ళిలో

కూడా పంచె కట్టుకోలేదు. ఇప్పుడు నాకేమవుతుందేమోనన్న భయం లేదు, పంచెకేమైనా

అవుతుందేమో నని భయం పట్టుకుంది.


నా పంచెకు జరగరానిదేమైనా జరిగితే నేనసలే

వామనావతారాన్ని, ఒకవేళ వేమనావతారాన్ని అయితే మీరే సర్దుకుపోవాలి.మీరే

క్షమించాలి అన్నాడు.నవ్వుతూ.


 పరిస్థితి అర్థం చేసుకున్న పంచె మాత్రం ఏమీ

యిబ్బంది పెట్టకుండా కరుణించింది. పాపం ఎంత దయో ఆ 'వేషుడిపై (తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యముతో)

జూలై 15, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

       🕉️ *సోమవారం*🕉️

   🌹 *జూలై 15, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*


 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః* 

*ఆషాఢమాసం - శుక్లపక్షం*

*తిథి : నవమి* రా 07.19 వరకు ఉపరి *దశమి*

వారం :*సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం : స్వాతి* రా 12.30 వరకు ఉపరి *విశాఖ*

*యోగం : సిద్ధ* ఉ 07.00 వరకు ఉపరి *సాధ్య*

*కరణం : బాలువ* ఉ 06.26 *కౌలువ* రా 07.19‌ ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.00 - 10.30  సా 04.30 - 06.00*

అమృత కాలం :*మ 02.49 - 04.35*

అభిజిత్ కాలం :*ప 11.47 - 12.39*

*వర్జ్యం : శేషం ఉ 06.01 వరకు*

*దుర్ముహుర్తం : మ 12.39 - 01.32 & 03.16 - 04.08*

*రాహు కాలం : ఉ 07.21 - 08.58*

గుళిక కాలం :*మ 01.51 - 03.29*

యమ గండం :*ఉ 10.36 - 12.13*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 05.43* 

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల :‌ తూర్పు దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.43 - 08.19*

సంగవ కాలం :*08.19 - 10.55*

మధ్యాహ్న కాలం :*10.54 - 01.32*

అపరాహ్న కాలం :*మ 01.32 - 04.08*

*ఆబ్ధికం తిధి: ఆషాఢ శుద్ధ నవమి*

సాయంకాలం :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.56*

నిశీధి కాలం :*రా 11.52 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.15 - 04.59*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్🕉️*


భృంగీశసేవిత ! గణేశకుమారతాత !

మృత్యుంజయ !  త్రిపురదానవభేదకారిన్ !

పాణావుపాత్తమృగడామరుకత్రిశూల !

శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II 


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

ఓ చిన్న కధ.

 *ఓ చిన్న కధ. 


*అమ్మాయి పెళ్ళికై నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు, ఆరోజున..!*


*అది మంచి సంబంధం కావడంతో కుటుంబం మొత్తం ఎంతో సంతోషించింది.*


*తండ్రి అయిన శర్మగారు ఎంతగానో ఆనందించారు. అబ్బాయి , అతని తల్లిదండ్రులు చాల మంచివారు. దాంతో శర్మగారికి ఎంతో భారం తగ్గినట్లనిపించింది.*


*పెళ్ళికి ముందు ఒక  రోజు  పెళ్ళికూతురు తండ్రి శర్మగారు వియ్యంకుడు వాళ్ళింటికి వెళ్ళాల్సి వస్తుంది.*


*అయితే ఆరోజు శర్మగారి ఆరోగ్యం బాగాలేదు. మొదటిసారి కావడం తో కాదనలేకపోయాడు.*


*వరుని తరఫువాళ్ళు ఎంతో సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించారు.*


*కొద్దిసేపు వచ్చినపని విషయమై మాట్లాడుతుండగానే టీ తీసుకొచ్చారు. శర్మగారికి మధుమేహం ఉండడంతో కొన్ని సంవత్సరాల నుండి చక్కెర పదార్ధాలకు దూరంగా ఉంటున్నారాయన.*


*అయితే మగపెళ్ళివారింటిలో శర్మగారు మొహమాటంతో ఇచ్చిన టీ కప్పును చేతిలోనికి తీసుకున్నారు తాగడానికై...*


*మొదటి గుటక వేస్తూనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.*


*అందులో పంచదార లేదు సరికదా, తనకిష్టమైన యాల కుల పొడి వేశారు.*


*మాఇంటిపధ్ధతిలోనే చేసిన టీ ని... వీరింటిలోనూ తాగుతున్నారే అని అనుకున్నారాయన.*


*మధ్యాహ్నం భోజనం చేశారు, అదీ అచ్చు తమ ఇంటివంట లాగానేఉంది.*


*వెంటనే ఏం బయలు దేరుతారు, కొంచెం విశ్రాంతి తీసుకోండి... అంటూ పడకగదికి తీసుకెళ్ళారు. అచ్చటి దుప్పటి తను కప్పుకునే దుప్పటి లాగ పలచటిది... కునుకుతీసి లేచేటప్పటికి రాగిచెంబులో నీరిచ్చారు తాగడానికి...*


*బయలుదేరేముందు ఇక అడగకుండా ఉండలేకపోయేరు శర్మగారు... " నేను ఏం తింటాను... ఎలా తాగుతాను... నా ఆరోగ్యానికి ఏది మంచిది... ఇవన్నీ మీకెలాతెలుసు?' అని.*


*అమ్మాయి అత్త గారు ఇలా అంది...*


*'నిన్నరాత్రి మీఅమ్మాయిఫోన్ చేసి మీగురించి అన్నీ చెప్పింది... మా నాన్నగారు మొహమాట పడతారు... వారి గురించి మీరే శ్రధ్ధ తీసుకోవాలనికోరింది.'*


*శర్మగారి కళ్ళల్లో నీరు తిరిగాయి ...*


*శర్మగారు ఇంటికి రావడంతోనే భార్యను పిలిచి ఇలా అన్నారు...*


*'లక్ష్మీ..! మా అమ్మ చనిపోలేదు.'*


*'ఏవిటండీ మీరు మాటాడుతున్నది'*


*'అవును లక్ష్మీ ... నన్ను కంటికి రెప్పలా చూసుకొనే నా తల్లి బతికేఉంది... నాకూతురు రూపంలో' అని జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు శర్మగారు కన్నీరు నిండిన కళ్ళతో.*


*అమ్మాయి 'ఆడ'పిల్ల అనుకొంటాము, మన ఇల్లు వదిలి పోతుందని.*


*తను ఎక్కడికీ పోదు...*

*తల్లిదండ్రుల హృదయాలలోనే ఉంటుంది. తన మనస్సులో తనవారి జ్ఞాపకాలను నింపుకుని.*

శతకములు సంబంధ 23 పుస్తకాలు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀




*శతకములు సంబంధ 23 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

వేమన శతకము www.freegurukul.org/g/Shathakam-1


కాళహస్తీశ్వర శతకము www.freegurukul.org/g/Shathakam-2


సుమతి శతకం www.freegurukul.org/g/Shathakam-3


కుమార శతకము www.freegurukul.org/g/Shathakam-4


కుమారి శతకం www.freegurukul.org/g/Shathakam-5


దాశరధి శతకము www.freegurukul.org/g/Shathakam-6


భర్త్రుహరి సుభాషితము www.freegurukul.org/g/Shathakam-7


వేమన శతకము www.freegurukul.org/g/Shathakam-8


భాస్కర శతకం www.freegurukul.org/g/Shathakam-9


పుణ్య గానము www.freegurukul.org/g/Shathakam-10


భర్త్రుహరి సుభాషితము www.freegurukul.org/g/Shathakam-11


శతక త్రయము www.freegurukul.org/g/Shathakam-12


శతకాల్లో రత్నాలు www.freegurukul.org/g/Shathakam-13


దాశరథి శతకము-కంచెర్ల గోపన్న-రామదాసు www.freegurukul.org/g/Shathakam-14


కృష్ణ శతకం www.freegurukul.org/g/Shathakam-15


దశావతారను శతకము www.freegurukul.org/g/Shathakam-16


కృష్ణ శతకం www.freegurukul.org/g/Shathakam-17


కలివర్తన దర్పణం www.freegurukul.org/g/Shathakam-18


ఆంధ్ర నాయక శతకం www.freegurukul.org/g/Shathakam-19


మదాంద్ర నాయక శతకము www.freegurukul.org/g/Shathakam-20


మారుతి శతకం www.freegurukul.org/g/Shathakam-21


మూక పంచశతి కటాక్ష శతకం www.freegurukul.org/g/Shathakam-22


నరసింహ శతకము www.freegurukul.org/g/Shathakam-23


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

గ్రహదోషంబులు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


         *!! శార్దూలము!!* 


 *గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణ నామంబు ప్ర*

*త్యహమున్ బేర్కొను నుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే?*

*దహనుం గప్పగఁ జాలునే శలభసంతానంబు? నీ సేవఁ చే*

*సి హతక్లేశులు గారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా!!!!*     29


                    [ *శ్రీ కాళహస్తీశ్వర శతకం* ]


*భావం.ఈశ్వరా! విషమస్థానంలో నుండి గ్రహములు కలిగించు బాధలుగానీ, అపశకునములుగానీ, రోజూ నీ నామస్మరణం చేయు పుణ్యపురుషులను కష్టపెట్టగలవా? ఏమిటో ఈ ప్రజలు అజ్ఞానంలో పడి నిన్ను సేవించక దుఃఖములను అనుభవిస్తున్నారుగానీ, మిడుతలదండు అగ్నిని ఆవరింపలేదని గ్రహింపలేకున్నారేమి? ఇదెంత చిత్రమైన విషయము* ?


 ✍️🌹💐🌷🙏