15, జులై 2024, సోమవారం

"పిప్పలాదుడి" కథ..!!*

 *🪷 "పిప్పలాదుడి" కథ..!!*


 *జన్మించిన 5ఏండ్ల వరకూ శని ప్రభావం మనకు ఉండకుండా చేసిన మహానుభావుడు..!!*


 *మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావిచెట్టు తొఱ్ఱలో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది, ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకు పోయారు..!!*


*రావి చెట్టు తొఱ్ఱలోని పిల్లవాడు ఆకలి, దాహంతో ఏడుపు ప్రారంభించాడు, అయినా తనను చూచేవారు ఎవరూ లేకపోవడంతో, అతను ఆ తొఱ్ఱలోనే పడిన రావి పండ్లు తిని పెరిగాడు..!!*


*ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్తూ వెళ్తూ రావి చెట్టులో ఉన్న పిల్లవాడిని చూసి అతని పరిచయాన్ని అడిగాడు..!!*


 *నారదుడు - నువ్వు ఎవరు..?* 

 *అబ్బాయి: అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది..!!* 

 *నారదుడు - నీ తండ్రి ఎవరు..?* 

 *అబ్బాయి: అదే నేను తెలుసు కోవాలనుకుంటున్నాను..!!* 

 *అప్పుడు నారదుడు దివ్యదృష్టితో చూసి ఆశ్చర్యపోయి “ఓ అబ్బాయీ..! నీవు గొప్ప దాత ‘మహర్షి దధీచి’ కొడుకువి” అని చెప్పాడు, ”నీ తండ్రి అస్తికలతో  దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి (వజ్రాయుధం) రాక్షసులను జయించారు, మీ తండ్రి దధీచి 31 ఏళ్లకే చనిపోయారు” అని నారదుడు చెప్పాడు..!!* 

 *అబ్బాయి: మా నాన్న అకాల మరణానికి కారణం ఏమిటి..?* 

 *నారదుడు: “మీ తండ్రి మరణానికి శని మహాదశయే కారణం”..!!*

 *పిల్లవాడు: నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి..?* 

 *నారదుడు:శనిదేవుని మహాదశయే..!!*


 *రావి ఆకులు,పండ్లు తిని పెరిగిన ఆబిడ్డకు “పిప్పలుడు” అని పేరు పెట్టాడు నారదుడు, తపోదీక్షను కూడా ఇచ్చాడు, పిల్లవాడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు, బ్రహ్మాదేవుడు బాల పిప్పలాదుడిని వరం అడగమని కోరినప్పుడు, పిప్పలాదుడు తన కళ్లతో ఏవస్తువును చూస్తే ఆ వస్తువును కాల్చే శక్తిని ఇవ్వమని అడిగి సాధించాడు, ఆ తరువాత అలా అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు, శనిదేవుడినీ వదల్లేదు, విశ్వంలో కలకలం రేగింది, సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫల మయ్యారు, సూర్యుడు కూడా తన కళ్ల ముందే కాలిపోతున్న కొడుకుని చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకున్నాడు, చివరికి బ్రహ్మదేవుడు పిప్పలాదుడి ముందు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచిపెట్టమని అడిగాడు, కానీ పిప్పలాదుడు ఒప్పుకోలేదు, బ్రహ్మాదేవుడు “ఒకటి కాదు రెండు వరాలు ఇస్తాను అతడిని వదిలేస్తే” అన్నాడు.. పిప్పాలాదుడు సంతోషించి రెండు వరాలను అడిగాడు..!!*


*1)పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు పిల్లలెవరికీ శనిబాధ ఉండకూడదు, తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు..!!* 

 *2)అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది, కనుక సూర్యోదయానికి ముందు 'రావి' చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు, దానికి   బ్రహ్మాదేవుడు 'తథాస్తు' అని వరం ఇచ్చాడు..!!*


*ఆ వెంటనే పిప్పలాదుడు మండుతున్న శనిని విడిపించాడు, ఏమండీ ఆపాటికే శనిదేవుని పాదాలు కాలిపోయి దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు, అందుకే “శనిః చరతి య: శనైశ్చరః" అన్నారు, మెల్లగా నడిచే వాడు శనైశ్చరుడు అని, మంటల్లో మాడిపోయి నల్లగా అయిపోయాడు..!!* 

*శని యొక్క నల్లని విగ్రహాన్నీ, రావిచెట్టునీ పూజించడంలోని మూల సూత్రం ఇదే..!!✍️*

కామెంట్‌లు లేవు: