13, జనవరి 2024, శనివారం

Himalaya munies


 

panchamgam

 శుభోదయం, panchamgam

డిసెంబర్-30-శనివారం      

*స్వస్తిశ్రీ  శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం,,  హేమంతు ఋతువు*మార్గశిర మాసం, కృష్ణపక్షం* 

తిథి:  తదియ 08.16am

స్థిరవాసరే

నక్షత్రం:  ఆశ్లేష 4.43 am 

వర్జ్యం: 07:09 pm – 08:57 pm

దుర్ముహుర్తం: 07:41 am - 08:32 am

రాహుకాలం: 09:00 am - 10:30 am

యోగం:  వైదృతి 02:28 am

కరణం:  భద్ర 09:44 am, 

బవ 10:47 pm

సూర్యోదయం   : 06:49

సూర్యాస్తమయం : 05:47

* *  సంకటహర చతుర్థి  **

కామెర్ల వ్యాధి - లక్షణాలు

 కామెర్ల వ్యాధి  - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం . 


     కామెర్ల వ్యాధిని జాండిస్ అంటారు. ఇది సాధారణంగా నీటి కాలుష్యం వలన వస్తుంది. బాగా వరదలు వచ్చే ప్రాంతంలో కూడా ఎక్కువుగా వచ్చే అవకాశం ఉన్నది. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి . దీని మూలంగా చర్మం , కళ్లు , మల , మూత్రాదులు పసుపు రంగులో మారతాయి. విరేచనం తెల్లగా లేదా బూడిద రంగులో మారుతుంది . దీనికి ప్రధాన కారణం రక్తంలోని "బైలురూబిన్ " శాతం ఎక్కువ అవ్వడమే . 


           ఆయుర్వేదంలో కామెర్లని మూడు రకాలుగా విభజించారు .  అవి 


    1 .  కోష్ఠశ్రీత కామల .

 

    2 .  శాఖాశ్రీత కామల .


    3 .  కుంభ కామల 


      కామల అనగా ఆయుర్వేదంలో కామెర్ల వ్యాధికి ఉన్న మరొక పేరు . 


  వ్యాధి లక్షణాలు  -


     రోగిని పరీక్షించినప్పుడు కాలేయం ( liver ) ఆకారం పెరిగి ఉంటుంది. 


  1 .  కళ్లు పసుపు రంగులో ఉంటాయి.


   2 .  శరీరం కూడా వ్యాధితీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పసుపు వర్ణంలో మారుతుంది . 


   3 .  అన్నం తినాలనిపించదు.


   4 .  వాంతులు అవుతాయి.


   5 .  కొంతమందిలో దురద వస్తుంది . 


   

  పాటించవలసిన ఆహారనియమాలు  -


    కొవ్వు పదార్ధాలు , సిగిరెట్లు , ఆల్కాహాల్ , మాంసం మానివేయాలి . నూనె పదార్దాలు , స్వీట్స్ , నెయ్యి , పూరి , చపాతీ తినకూడదు. తేలికైన మరియు త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి . పాలు , మజ్జిగ , ఆకుకూరలు తినవచ్చు. గ్లూకోజ్ బాగా తాగాలి. పళ్లరసాలు , కాచి చల్లార్చిన నీరు , చెఱుకురసం బాగా త్రాగాలి.


  ఒకే మూలికని ఉపయోగించి చికిత్స చేసే విధానం  - 


 *  నేల ఉసిరి సమూల రసం తీసి మజ్జిగతో సేవిస్తే కామెర్లు తగ్గును. నేల ఉసిరికి కామెర్లని కలగజేసే వైరస్ ని సంహరించే గుణం ఉన్నది.


 *  నేల వేము 50ml కషాయం , 2 గ్రాముల శొంఠి కలిపి రోజుకి రెండుసార్లు సేవించాలి . 


 *  తిప్పతీగ స్వరసం ( చెట్టు మొత్తాన్ని దంచి తీసిన రసం ) 14ml తీసుకుని 14 మిల్లి గ్రాముల తేనెలో ఉదయం , సాయంత్రం సేవించాలి . 


 *  ఏరణ్డ మూల చూర్ణం తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును. 


 *  కటుకరోహిణి చూర్ణం 2 నుంచి 3 గ్రాములు తేనెతో సేవించిన కామెర్ల వ్యాధి నయం అవ్వును. 


 *  త్రిఫలా చూర్ణం 3 గ్రాములు తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును.


 *  చింతాకు చిగుళ్లు 4 గ్రాములు , వేపాకు చిగుళ్లు 1 గ్రాము ముద్దగా చేసి ఉదయం పరగడుపున మ్రింగించి పాలు త్రాగిస్తే కామెర్ల వ్యాధి నయం అగును.


        కఠిన ఆహారనియమాలు పాటిస్తే తొందరంగా వ్యాధి నుంచి బయటపడగలరు. 


 

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

          9885030034 


       


     కాళహస్తి వేంకటేశ్వరరావు 


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

రోగములు - ఏకమూలికా ప్రయోగాలు

 రోగములు - ఏకమూలికా ప్రయోగాలు . 


     

      ఆయుర్వేద వైద్యము నందు ఒక రోగమునకు ఎన్నో రకాల వైద్యయోగాలు ఉంటాయి . కొన్నిసార్లు అనేక రకాల మూలికలను ఒక మొతాదులో కలిపి ఆయా రోగాలకు ఔషధాలను తయారుచేయడం జరుగును . కాని కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి . అవి ఒక్క మూలికా ఉన్నను చాలు రామబాణం వలే ఆ రోగము మీద ప్రయోగించి ఆ రోగాన్ని నయం చేయవచ్చు . 


     ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఏకమూలికా యోగాలు నేను అనేక పురాతన గ్రంథ పఠనం మరియు నా పరిశోధనలో తెలుసుకొనినవి మీకు దాచుకోకుండా అందచేస్తున్నాను . 


  ఏకమూలికా ప్రయోగాలు - 


 * తుంగముస్తలు , పర్పాటకం - జ్వరం నందు శ్రేష్టం . 


 * నీటియందు సన్నని ఇసుక , పెంకులు వేసి కాచి వడబోసి చలార్చి ఇచ్చిన జలం అతిదాహం నివారించును . 


 * పేలాలు ఛర్ధిరోగము ( వాంతుల ) యందు శ్రేష్టం . 


 * శిలజిత్ మూత్రసంభంధ రోగముల యందు శ్రేష్టం . 


 * ఉసిరి , పసుపు ప్రమేహము నందు శ్రేష్టం . 


 * లోహచూర్ణం పాండురోగము నందు శ్రేష్టం . 


 * కరక్కాయ వాత, కఫ రోగముల యందు శ్రేష్టం . 


 * పిప్పలి ప్లీహ ( Spleen ) రోగము నందు శ్రేష్టం . 


 * లక్క ఎముకల సంధానము ( అతుక్కొనుట ) నందు శ్రేష్టం . 


 * దిరిసెన విషము నందు శ్రేష్టం . 


 * గుగ్గిలము మేడీ ఆమ్రయమయిన వాయవు నందు శ్రేష్టం . 


 * అడ్డసరం రక్తపిత్తము నందు శ్రేష్టం . 


 * కోడిశెపాల అతిసారం నందు శ్రేష్టం . 


 * నల్లజీడి మొలల రోగము నందు శ్రేష్టం . 


 * స్వర్ణభస్మం పెట్టుడు మందు నివారణకు శ్రేష్టం . 


 * రసాంజనము శరీర అధికబరువు నివారణలో శ్రేష్టం . 


 * వాయువిడంగములు క్రిమిరోగము నందు శ్రేష్టం . 


 * మద్యము , మేకపాలు , మేక మాంసం క్షయరోగము నందు శ్రేష్టం . 


 * త్రిఫల నేత్రరోగముల యందు శ్రేష్టం . 


 * తిప్పతీగ వాతరక్తం నందు శ్రేష్టం . 


 * మజ్జిగ గ్రహణి రోగము నందు శ్రేష్టం . 


 * ఖదిర కుష్ఠు నందు శ్రేష్టం . 


 * గోమూత్ర శిలజిత్ అనేక రోగముల యందు శ్రేష్టం . 


 * పురాణ ఘృతం ( పాత నెయ్యి ) ఉన్మాదము నందు శ్రేష్టం . 


 * మద్యము శోకము నందు శ్రేష్టం . 


 * బ్రాహ్మి అపస్మారము నందు ప్రశస్తము . 


 * పాలు నిద్రానాశనము నందు శ్రేష్టం . 


 * రసాలము ( పెరుగు నుండి తయారు చేయబడును ) ప్రతిశ్యాయము నందు శ్రేష్టం . 


 * మాంసము కార్శ్యము ( Liver ) నందు శ్రేష్టం . 


 * వెల్లుల్లి వాతము నందు శ్రేష్టము . 


 * స్వేదకర్మ స్తంబము ( బిగదీసుకొని పోయిన అవయవాలు ) నందు శ్రేష్టం . 


 * బూరుగ బంక నశ్యము రూపమున చేతులు , భుజములు , భుజశిరస్సు శూల యందు శ్రేష్టం . 


 * వెన్న , పంచదార ఆర్ధిత వాతము నందు శ్రేష్టం . 


 * ఒంటె మూత్రము , ఒంటె పాలు ఉదరరోగము నందు శ్రేష్టం . 


 * నస్యము శిరోగములకు ప్రశస్తం . 


 * రక్తమొక్షము నూతనముగా వచ్చిన విద్రది ( కురుపు ) నందు శ్రేష్టం . 


 * నస్యము , ఔషధద్రవ్యమును పుక్కిలించుట ముఖరోగముల యందు శ్రేష్టం . 


 * నస్యము ( ఔషధ చూర్ణము ముక్కు ద్వారా లోపలికి పీల్చుట , అంజనం ( ఔషధద్రవ్యమును కాటుకలా కంటికి పెట్టటం ) , తర్పణం ( శుభ్రపరచుట ) నేత్రరోగముల యందు శ్రేష్టం . 


 * పాలు , నెయ్యి వృద్దాప్యము ఆపుట యందు శ్రేష్టం . 


 * చల్లనినీరు , చల్లనిగాలి , నీడ మూర్చ యందు ప్రశస్తము . 


 * మద్యము , స్నానము శ్రమ యందు శ్రేష్టం . 


 * పల్లేరు మూత్రకృచ్చము నందు ప్రశస్తం . 


 * వాకుడు కాసరోగము నందు శ్రేష్టం . 


 * పుష్కరమూలము పార్శ్వశూల ( ఒకవైపు వచ్చు తలనొప్పికి ) శ్రేష్టం . 


 * ఉసిరిక రసాయనముల యందు శ్రేష్టం . 


 * త్రిఫల , గుగ్గిలం వ్రణముల యందు శ్రేష్టం . 


 * వస్తి ప్రయోగము వాతరోగముల యందు ప్రశస్తం . 


 * విరేచనము పిత్తరోగముల యందు ప్రశస్తం . 


 * వమనము శ్లేష్మరోగముల యందు ప్రశస్తం . 


 * తేనె కఫరోగముల యందు ప్రశస్తం . 


 * నెయ్యి పిత్తరోగముల యందు ప్రశస్తం . 


 * తైలము వాతరోగముల యందు ప్రశస్తం . 


       పైన చెప్పిన వాటిలో కొన్ని దేశ కాల , బలములను అనుసరించి కలపడం కాని తీయటం కాని వైద్యుని విచక్షణ పైన ఆధారపడి ఉండును. 


   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

భక్తరక్షణాపరాయత

 శు  భో  ద  యం🙏


పోతన సన్నివేశ చిత్రణము! 

శ్రీ హరి భక్తరక్షణాపరాయత!


సుందర సురుచిర ఘట్టముల నావిష్కరించుటలో పోతన మొనగాడు. ప్రతిఘట్టమున కొన్ని సుందర దృశ్యములుండును.వానినిపాఠకుని మనో పటమున మరపురాని మనోజ్ఙ వర్ణరంజిత చిత్రాలుగా మలచుట ఆతని కవిత లోని ప్రత్యేకత!


       గజేంద్రమోక్షమున భక్తపరాధీనుడైనహరి,గజరాజు మొరవిని వైకుంఠమునుండి పరుగుపరుగున వచ్చుదృశ్యమును పోతన వర్ణంచిన తీరు నాన్యతో దర్శనీయము.

"తనవెంటంసిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్,/ వానివెన్కను బక్షీంద్రుడు,వానిపొంతను ధనుఃకౌమోదకీశంఖచ/

క్రనికాయంబును,నారదుండు,ధ్వజనీకాంతుండురావచ్చిరొ/

య్యన వైకుంఠపురంబునన్ గలుగువారాబాలగోపాలమున్;//

చివరకు వైకుంఠపురంలోని పిలాపెద్దా అంతా హరివెనుక కదిలారు.


మంచిసుందరదృశ్యము.దీనిని 


వినువీధిలో నిలచి దేవతలు చూచుచూ ఆజగద్బాంధవునకు మ్రొక్కులిడు చున్నారట!

పరిశీలిపుడు.

"వినువీధిన్ జనుదేరగాంచిరమరుల్ విష్ణున్,సురారాతిజీ/

వన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్రహృ/

ద్వనవర్తిష్ణు, సహిష్ణు,భక్తజనబృంద ప్రాభవాలంకరి

ష్ణు,నవోఢోల్లసదిందిరాపరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్,


ఒకరితో నొకరు ఇలాచెప్పుకుంటుంన్నారు.


"చనుదెంచెన్హరి,యల్లవాడె!  హరిపజ్జంగంటిరే లక్ష్మి,శం/

ఖనినాదంబదె!చక్రమల్లదె ,భుజంగధ్వంసియున్ వాడె,చ/

య్యన నేతెంచెనటంచు వేల్పులు నమోనారాయణాయే/

తి! నిస్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్;


ఆయాకాశమేమో? ఆదేవతలేమో? మ్రొక్కులిడుటేమో మనమెన్నడు చూచినవారముగాకపోయినా చదువరుల మనోకుడ్యములమీద ఆచిత్రమంతయు మద్రబడునట్లు వర్ణించినాడు పోతనమహాకవి.


 ఇదీ ఆకవికలము జేసిన వర్ణనా మాయా మహేంద్రజాలము


.ఆచిత్రములను జూచుటకు మన నయనములుగాని,సులోచనములుగానిపనికిరావు.ఆలోచనా లోచనాలతో అంతరంగమున పరికింప వలసియుండును.ప్రయత్నింపుడు.ఫలితము మీచెంతనే! ఇట్టి మనోహర కవితా నిర్మాణచాతుర్యముగల పోతనమహాకవీంద్రునకు వినమ్రసాంజలులర్పించుచు,

                      స్వస్తి!

🙏🙏🙏🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్రీ చౌరాసి( 84) ఆలయాలు

 🕉 మన గుడి : నెం 298


⚜ హిమాచల్ ప్రదేశ్  : భార్మోర్


⚜ శ్రీ చౌరాసి( 84) ఆలయాలు


💠 చౌరాసి టెంపుల్  అనేది 84 విభిన్న పుణ్యక్షేత్రాలను కలిగి ఉన్న ఆలయ సముదాయం, ఇది చంబా జిల్లాలోని భర్మూర్ పట్టణం మధ్యలో ఉంది.  

సుమారు 1400 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాల కారణంగా ఇది అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది.

చౌరాసి ఆలయం అంచున నిర్మించిన 84 మందిరాల కారణంగా ఆ పేరు వచ్చింది.  చౌరాసి అనేది ఎనభై నాలుగు అనే హిందీ పదం. 


💠 యముడిని కాలదేవుడు అని పిలువబడే  ఈ దేవునికి తమిళనాడులో కొన్ని ఆలయాలలో ప్రత్యేక సన్నిధులు వున్నాయి.

అలాగే హిమాచల్ ప్రదేశ్ భార్మోర్ నగరం లో  వున్న ధర్మశ్వర్ మహాదేవ్ ఆలయం యమధర్మరాజుకు ఆతని సహాయకుడైన చిత్రగుప్తునికి ప్రశస్తి చెందినది.

ఈ యముని ఆలయాన్ని ఒక ప్రత్యేకమైన ఆలయంగా కాకుండా 84 ఆలయాల

ఆవరణలో వున్నందున చౌరాసీ 84 ఆలయాల మందిరంగా పిలుస్తారు.


💠 యమధర్మరాజు యొక్క న్యాయ రక్షణా కార్యాలయం కూడా యిదే అని, ఆయుస్సు తీరిన వారి ఆత్మలని  ఇక్కడికి రప్పించి  యమధర్మరాజు న్యాయమైన తీర్పులు యిచ్చి వాటికి సద్గతులు కల్పిస్తాడని అంటారు.


💠 సుమారు 1400  సంవత్సరాలకి ముందు

మరు వంశానికి చెందిన రాజా సాహిల్ వర్మ ఈ బార్మోర్ ను పాలించిన కాలంలో ఈ 84 ఆలయాలు నిర్మించబడినవి. 

సాహిల్వర్మకు సంతానం లేక మనోవేదనతో వున్న కాలంలో కురు క్షేత్రం నుండి తీర్ధయాత్రలు చేస్తున్న 84 మంది  సిధ్ధపురుషులు

యీ ప్రాంతానికి వచ్చారు.

ఆ మహాత్ములకి ఇక్కడ శివ దర్శనమైనది.

ఆ మహాత్ములను మహారాజు  ఆదరించాడు.

ఆ బృందానికి నాయక యోగి యైన

బత్నాధ్ జీ ని గురువుగా

స్వీకరించిన మహారాజు, ఆ గురువుగారి ఆదేశం ప్రకారం  వారి ఆది గురువులు  9 మందిని

మట్టి కుండలలోకి ఆవాహన చేసి 9 శివలింగాలను ప్రతిష్టించాడు. 


💠 సంప్రదాయబధ్ధంగా పూజాపునస్కారాలు జరిపించడానికి 84 ఆలయాలు నిర్మించాడు.

ఆవాహన చేయబడిన యోగులు తృప్తిచెంది

మహారాజుకి సంతాన భాగ్యం కలగాలని ఆశీర్వదించారు.

ఫలితంగా మహారాజుకి

పదిమంది పుత్రులు , ఒక పుత్రిక జన్మించారు.


💠 తరువాత కాలంలో కుమార్తె చంపావతి కోరిక ప్రకారం ముఖ్యపట్టణాన్ని

రాజ్యం పేరు మార్చుకొని చంపా అనే

పేరు పెట్టాడు. 

రాజకుమార్తె   యోగినియై అంతిమకాలాన పరంజ్యోతిలో కలిసి పోయినది.   

ఆ రాజకుమర్తె  చంపావతికి రాజ గురువు సర్బత్ నాధ్ జీ కి ఇక్కడ ప్రత్యేక సన్నిధులు వున్నాయి.

ప్రసిద్ధి చెందిన మణి మహేష్ యాత్ర చేపట్టేవారు ముందుగా ఇక్కడికి వచ్చి గురూజీని

దర్శించి   తమ యాత్ర ఆరంభించాలని నియమం.


💠 కాశ్మీర్, గాంధార శిల్ప శైలిలో అందమైన నగిషీ నైపుణ్యంతో ఈ ఆలయాలు నిర్మించబడినవి.


💠 ఆలయ ఆవరణం మధ్యలో  మణిమహేష్ శివలింగం నిర్మించబడినది. 

ఆ శివలింగాన్ని దర్శిస్తున్న విధంగా ఒక పెద్ద ఇత్తడి  నందీశ్వరుని మూర్తి. 

దీనిని శిల్పిగుహా  అనే గొప్పశిల్పి  మలచినట్లుగా అతని పేరు  ఆ విగ్రహం క్రింద చెక్కబడి వున్నది. 


💠 దేవాలయానికి ఎదురుగా పెద్ద ఎత్తైన దేవదారు వృక్షం వున్నది.

దాని క్రింద అర్ధగంగ, అర్ధగయ అని పిలువబడే

పవిత్రమైన నిర్మలమైన తటాకం వున్నది. పార్వతీ దేవి కోసం వినాయకుడు

ఏర్పాటు చేసినదిగా చెపుతారు.

ఏడు నదుల సంగమమైన యీ తటాక జలాలలో  స్నానం చేస్తే సకల

పాపాలు తొలగిపోతాయి అని చెప్తారు. 

దీని కుడి ప్రక్కన  విష్ణు పాదాలు వున్నవి.  

ఆ దివ్యపాదాలు దర్శించి  తటాకంలో స్నానంచేస్తే గయ వెళ్ళిన పుణ్యం లభిస్తుందని అంటారు.


💠 ఇక్కడ ధర్మేశ్వర్  మహాదేవ్ పేరుతో

లింగరూపంలో దర్శనమిస్తున్న యమధర్మరాజుని స్థానిక భక్తులు నిర్భయంగా పూజిస్తారు.

అయితే ఇతర ప్రాంతాల యాత్రికులు మాత్రం యమధర్మరాజుని చూడడానికి భయపడి వెలుపల నుండి చూసి వెళ్ళిపోతారు.


💠 ఈ పుణ్యక్షేత్రాన్నికి  ఇద్దరు  భైరవులు  అదృశ్యరూపంగా రక్షకులుగా వుంటారని

అంటారు. 


💠 సన్నిధికి వెలుపలి గోడమీద  నచికేతుడు యమధర్మరాజు ని స్తుతించిన శ్లోకం వ్రాసి వున్నది. 

ఆలయ లోపలి ప్రాంతం చాలా చల్లగా వుంటుంది.

ఆలయం లోపల ప్రవేశించగానే శిలలతో వృక్షాలతో ముఖమండపం వుంటుంది.  

ఒక అటక మీదకి ఎక్కుతున్నట్లు ఐదు మెట్లు ఎక్కి ,ప్రవేశ ద్వారం వద్ద ఒంగుని  గర్భగుడి లోనికి వెళ్ళాలి.


💠 మధ్యలో ఒక వేదిక మీద  ధర్మశ్వర్ మహాదేవ్, పొడవైన త్రినేత్రంతో,చుట్టచుట్టుకుని వున్న ఒక సర్పం మీద  కొలువు తీరివుంటాడు. ఆ సర్పమే  మూలమూర్తికి పైన ఛత్రం పడుతూవుంటుంది.

దానికి పైన వ్రేలాడేటట్టు వుండే మరియొక  ఛత్రంతో  ధర్మేశ్వరుడు రమ్యంగా దర్శనమిస్తున్నాడు.


💠 యమధర్మరాజు యొక్క యీ సన్నిధానానికి

" ఢాయీ పౌడీ" అంటే రెండున్నర మెట్లు అని పేరు. అంటే  అటు స్వర్గానికో  లేక ఇటు నరకానికో  వెళ్ళడానికి కొన్ని అడుగుల

దూరంలో వున్నామని.


💠 ఆలయానికి ముందు  చెక్కలతో అడ్డం కట్టబడిన  ఒక రాతి తొట్టి వున్నది. పాప పుణ్యాల లెక్కలు చూసే చిత్రగుప్తుని కార్యాలయం అంటారు. దాని మధ్యలో వున్న చక్రం ఆత్మని సూచించే  చిహ్నం.


💠 సమీప రైలు మార్గం: పఠాన్‌కోట్.

పఠాన్‌కోట్ నుండి చంబా 120 కి.మీ

చంబా నుండి భర్మూర్ 59.5 కి.మీ

తెలుగు పండుగ '

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 రాజమండ్రి లో మూడు రోజుల పాటు అద్భుతంగా జరిగిన ' తెలుగు పండుగ ' తెలుగు భాష ఔన్నత్యాన్ని మరోసారి దశదిశలా చాటింది. గజల్ శ్రీనివాస్ గారి నాయకత్వం లోని ఆంధ్ర సారస్వత పరిషత్తు, చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో పత్రికల్లో తెలుగు భాష తీరుతెన్నులపై సీనియర్ జర్నలిస్టు ఎ.వి.వి ప్రసాద్ చేసిన ఈ ప్రసంగం ఆహూతులను విశేషంగా అలరించింది. పత్రికలే భాషకు ప్రాణంపోస్తున్నాయంటూ ఆయన చెప్పిన విశేషాలు వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

_సంక్రాంతి పండుగ ప్రారంభ తేది_*

 *_సంక్రాంతి పండుగ ప్రారంభ తేది_*

*~~~~~*

2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయింది.

అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ.

ఇదో 72 ఏళ్ల సమయం.

ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు మారుతుంది.

1935 నుండి 2007 వరకు జనవరి 14న, 2008 నుండి 2080 వరకు జనవరి 15న,

2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుంది.

ఎందుకిలా అంటే, సాధారణం గా, సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిన నాడే మకర సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు నుండి మిధునరాశి లోకి ప్రవేశించే దాకా ‘ఉత్తరాయణ పుణ్య కాలం’ గా వ్యవహరిస్తారు.

ఇక, సూర్యుడు ప్రతీ సంవత్సరం మకర సంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. స్థూలగణన ఆధారంగా ఇది మూడు సంవత్సరాలకు ఒక గంట, 72 ఏళ్లకు ఒక రోజుగా మారుతోంది.

ఈ లెక్కన, ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ ప్రకారం, 72 ఏళ్లకొకసారి సంక్రాంతి తర్వాతి రోజుకు మారుతుంది. జనవరి 16న సంక్రాంతి రావడం ఎలాగూ మనం చూసే అవకాశం లేదు.

సీనియర్ సిటిజన్లకు TTD నుంచి మంచి శుభ వార్త.*

 *సీనియర్ సిటిజన్లకు TTD నుంచి మంచి శుభ వార్త.*


వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్‌ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటుచేయబడ్డాయి.  


ఒకటి ఉదయం 10 గంటలకు,మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. మీరు ఫోటో ID తో వయస్సు రుజువును సమర్పించాలి మరియు S1 కౌంటర్‌లో సమర్పించాలి.            


వంతెన కింద గ్యాలరీ నుండి ఆలయం కుడి వైపు గోడకు రోడ్డు దాటుతుంది.  ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.మంచి సీటింగ్ ఏర్పాటు అందుబాటులో ఉంది.  


మీరు లోపల కూర్చున్నప్పుడు - వేడి సాంబార్ అన్నం మరియు పెరుగు అన్నం మరియు వేడి పాలు అందించ బడతాయి.  


ప్రతిదీ ఉచితం. 

మీరు రూ20/- చెల్లించి రెండు లడ్డూలను పొందుతారు.  


మరిన్ని లడ్డూల కోసం మీరు రూ. 25/- ప్రతి లడ్డూకి.టెంపుల్ ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుండి, కౌంటర్ కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంది. 


దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేయబడతాయి, ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్ దర్శనం మాత్రమే అనుమతించ బడుతుంది. 


భగవంతుని దర్శనం తర్వాత మీరు 30 నిమిషాల్లోపు దర్శనం నుండి బయటకు రావచ్చు. 


హెల్ప్‌డెస్క్ తిరుమల 08772277777 ని సంప్రదించండి.

Great idea

 https://youtube.com/shorts/eK3yEaMP27A?si=XxmOaQQfxJnXwM29


విభూతి..గంధం..

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*విభూతి..గంధం..*


"మేము అండమాన్ లో వుంటామండీ..మా బంధువులు ఇక్కడికి దగ్గరలో ఉన్న చుండి గ్రామం లో వుంటారు..ఒకప్పుడు మేమూ ఈ ప్రాంతం వాళ్ళమే.. కానీ కొన్ని సంవత్సరాల క్రిందట అండమాన్ వెళ్లి..అక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాము.. మావాళ్ళు ఈ క్షేత్రం గురించి..శ్రీ స్వామివారి గురించి గొప్పగా చెపితే..చూసిపోదామని వచ్చాము..మాకు ఈ క్షేత్రం గురించి వివరాలు చెపుతారా?.." అన్నారా దంపతులు..వాళ్ళు మాట్లాడుతున్నది తెలుగులోనే అయినా..కొద్దిగా తేడాగా ఉంది..


శ్రీ స్వామివారు మాలకొండ క్షేత్రం లో తపస్సు చేసుకుంటూ ఉన్నప్పటి నుంచి..మొగలిచెర్ల లోని ఫకీరు మాన్యం లో తాను నిర్మించుకున్న ఆశ్రమం లో కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దాకా జరిగిన సంఘటనలన్నీ క్లుప్తంగా వివరించాను..శ్రద్ధగా విన్నారు..శ్రీ స్వామివారు సమాధి చెందిన అనంతరం..వేలాదిమంది వచ్చి దర్శించుకొని వెళుతున్నారని..వారికేమైనా సమస్యలు ఉన్నా..ఈ సమాధి దగ్గర మ్రొక్కుకుంటే..అవి తీరిపోతున్నాయనీ ..తమ బంధువుల ద్వారా విన్నామని వాళ్ళు నాతో అన్నారు..


ఆ తరువాత ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరానికి మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి..శ్రీ స్వామివారి విగ్రహం వద్ద పూజ చేయించుకుని..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..ఒక ఐదారు నిమిషాల పాటు ప్రార్ధన చేసుకొన్నారు..శ్రీ స్వామివారి విభూతి..గంధం..రెండూ తీసుకున్నారు..వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు..


మరో మూడు నాలుగు నెలల తరువాత..మందిరానికి నూరు రూపాయల మనీ ఆర్డర్ వచ్చింది..అందులో..తమ చిరునామాకు..శ్రీ స్వామివారి విభూతి, గంధం..రెండూ పోస్ట్ ద్వారా పంపమని వ్రాసారు..ఆ చిరునామా..అండమాన్ లోని పోర్టుబ్లయర్ కు సంబంధించినది..అప్పుడు మాకు గుర్తుకు వచ్చింది..కొంతకాలం క్రిందట వచ్చి వెళ్ళింది వీళ్ళే కదా అని..అందులో వారి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు..వారు కోరిన విధంగా విభూతి..గంధం..పోస్ట్ ద్వారా పంపాము..మరో రెండు నెలల తరువాత..చుండి గ్రామం నుంచి ఒక వ్యక్తి వచ్చి..తాను అండమాన్ వెళుతున్నాననీ..తమ బంధువుల కోసం శ్రీ స్వామివారి విభూతి, గంధం కావాలని అడిగారు..ఇచ్చాము..వచ్చిన ఆ వ్యక్తి ద్వారా తెలిసింది..అప్పుడు వచ్చిన ఆ దంపతుల కోసమే ఈ విభూతి.. గంధం..


మరో ఆరేడు నెలల తరువాత..ఒక శనివారం నాడు ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు.."శ్రీ స్వామివారు చాలా మహిమ కలవాడు..మేము పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సమస్యల్లో ఉన్నామండీ..ఒక రకంగా చెప్పాలంటే ఆర్ధికంగా..మానసికంగా కృంగిపోయి వున్నాము..ఎటూ దిక్కుతోచని పరిస్థితి లో వున్నాము..ఇక్కడినుంచి పోతూ పోతూ..శ్రీ స్వామివారి విభూతి..గంధం..తీసుకెళ్లాము..ప్రతిరోజూ ఇంటినుంచి ఉదయాన్నే స్నానం చేసి..దీపారాధన చేసుకొని..శ్రీ స్వామివారి విభూతిని..గంధాన్ని.. నుదుటిన ధరించడం అలవాటు చేసుకున్నామండీ..కేవలం పదిహేను రోజుల లోపే మాకు చాలా మార్పు కనబడింది..మా దగ్గర అప్పు తీసుకొని..ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు..ఇంటికొచ్చి మరీ చెల్లించి వెళ్లారు..దాదాపు డెబ్భై శాతం వసూలు అయ్యాయి..ఆ డబ్బు చేతికి వచ్చిన మరుక్షణం మేము చెల్లించాల్సిన వాళ్లకు చెల్లించివేశాము..ఇప్పుడు మాకున్న అప్పులన్నీ తీరిపోయాయి..వడ్డీ వ్యాపారం కూడా మానేసాము..ఒకళ్లను పీడించి..ఏడిపించి.. వాళ్ళ ఆర్ధిక బలహీనత మీద చేసే ఆ వ్యాపారం మంచిది కాదని..మాకు తోచింది..వేరే వ్యాపారం చూసుకున్నాము..అంతా ఆ స్వామివారి విభూతి మహిమ..అందుకే మీ దగ్గరనుంచి విభూతి..గంధం..రెండు మూడు సార్లు తెప్పించుకున్నాము..ఈరోజు శ్రీ స్వామివారిని దర్శించుకుని మా మ్రొక్కు చెల్లించుకోవాలని అనుకున్నాము.." అన్నారు..


" రాబోయే శనివారం, ఆదివారం రోజులలోఅన్నదానం చేయాలని అనుకున్నాము..సరుకులన్నీ మేమే తీసుకొస్తాము..సుమారు ఎంతమందికి తయారు చేయాలో మీరు చెపితే..దానికి తగ్గ విధంగా ఏర్పాటు చేసుకుంటాము.." అన్నారు..శనివారం రాత్రికి సుమారుగా వేయి మంది భక్తులు వుంటారనీ.. ఆదివారం మధ్యాహ్నం అయితే..ఎనిమిది వందల మంది భక్తుల కొరకు ఏర్పాట్లు చేయాలనీ.. చెప్పాము..వచ్చే శని, ఆదివారాల్లో రెండుపూటలా తామే చేస్తామని చెప్పారు..


అనుకున్న విధంగానే ఆ దంపతులిద్దరూ అన్నదానం చేశారు..అవకాశం ఇచ్చినందుకు నాకూ మా సిబ్బందికి ధన్యవాదములు తెలిపారు..తిరిగి వెళుతూ..మర్చిపోకుండా శ్రీ స్వామివారి విభూతి..గంధం..రెండూ ఎక్కువ మోతాదులో తీసుకొని వెళ్లిపోయారు..ఇప్పటికీ సంవత్సరం లో కనీసం మూడు నాలుగు సార్లు మనీ ఆర్డర్ ద్వారా నగదు పంపి..విభూతి..గంధం..తెప్పించుకుంటూ వుంటారు..


విభూతి..గంధం..ఈ రెండింటి ద్వారా ఆ దంపతుల భక్తిని శ్రీ స్వామివారు స్థిరపరచారు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699).

అక్షింతల వితరణ*

 *అయోధ్య రామయ్య అక్షింతల వితరణ*

అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రతిష్ట పూర్తి అయినది. 

ఆ అయోధ్య బాల రాముడి అక్షింతలు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి పంపిణీ జరుగుతూ ఉన్నది.. 


కాకపోతే ఇక్కడ చిన్న సమస్య ఎదురవుతూ ఉన్నది.. 


వ్యక్తిగతంగా నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటి అంటే అయోధ్య బాల రాముడి అక్షంతలు వితరణ చేసే సమయంలో అక్షింతలను తీసుకున్న తరువాత ఏమి చేయాలి అనే విషయాన్ని అక్షింతల వితరణ చేసేవారు ప్రతి ఇంటికి వివరించలేకపోతున్నారు. . 

సమయము లేకపోయి ఉండవచ్చు. 

లేదా కొన్ని గ్రామాలలో వితరణ చేసే వారికి కూడా సరియైన అవగాహన లేక కూడా ఈ విధమైన పొరపాటు జరుగుతూ ఉన్నది. . 

చాలామంది ప్రజలు నన్ను వ్యక్తిగతంగా అడగడం జరిగినది. .


అయోధ్య బాల రాముడి అక్షింతలు తీసుకొని వచ్చినవారు మన ఇంటి ముందుకు రాగానే. . 

ముందుగా మనము వీలు అయితే ఒక పాత్రలో నీటిని తీసుకొని వచ్చిన వారి కాళ్లు తడిచే విధంగా నీటిని ఆరగించాలి. . 

ఎందుకంటే అయోధ్య రామయ్య అంతటివాడు మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు మనము సాదరంగా అయోధ్య రామయ్య కాళ్లు కడిగి లోపలికి స్వాగతించాలి. . 

వీలు కాని వారు సాదరంగా వారిని లోపలికి స్వాగతించాలి..

వారు ముందుగా మన ఇంటికి వస్తున్నారు అని తెలియగానే ముందస్తుగా మనము హారతి పళ్లెం అందులో ఒక పిడికెడు అక్షింతలు తయారుగా ఉంచుకోవాలి మన ఇంట్లో. . 

ఎందుకనగా వారు వచ్చిన తర్వాత మనము వీటిని సిద్ధం చేయాలి అంటే సమయము సరిపోదు వారికి. . 

వారు భారత దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి వితరణ చేయాలి కాబట్టి వారి సమయాన్ని మనము ఆదా చేయాలి కాబట్టి. . 


అయోధ్య బాలరామయ్య అక్షింతలు లోపలికి వచ్చిన తరువాత మనము హారతి ఇచ్చి వారు ఇచ్చిన అక్షింతలను మన అక్షింతలలో కలుపుకొని  ఆ అక్షింతలను మన ఇంటిలోని దేవుడి దగ్గర ఉంచాలి. . 


అక్షింతలతోపాటు అయోధ్యకు సంబంధించిన ఒక చిత్రపటము    మరియు మరియొక పత్రమును మనకు వారు అందిస్తారు. . 


అలాగే అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి అయ్యి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భముగా ప్రతి ఇంటి పైన కాషాయ ధ్వజము ( జెండా) ఎగురవేయడం ముఖ్యము. . 


ప్రతిరోజు అయోధ్య బాల రాముడి అక్షింతలను వీలైతే ప్రతి రోజు పూజించాలి. . 


తారక మంత్రము :-


*శ్రీరామ*

*జయరామ*

*జయ జయ రామ*


అనే ఈ తారక మంత్రాన్ని ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ప్రతి రోజు 108 సార్లు జపించాలి. . 

దీనివల్ల మన ఇంట్లో శ్రీరాముని దివ్య శక్తి ఉత్పన్నం అవుతుంది. . 


ఈ విధంగా 22వ తారీకు వరకు కూడా పాటించాలి. . 


జనవరి 22వ తారీకు నాడు ఆరోజు మనకు మహా పండుగ పర్వదినము. . 


ఆరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి ఇంటిల్లిపాది స్నానమాచరించి ఇంటిని పరిశుభ్రముగా చేసుకొని. . ఇంటి నీ పూలతో అలంకరించుకొని.. 

ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించి. . 

ఇంటి ముందు ముగ్గులు వేసి. . 

ఆరోజు మన ఇంటిలో పెద్ద ఎత్తున పండుగ జరుపుకోవాలి. . 

ఆరోజు మధ్యాహ్నము 11:29 నుండి  11:31 నిమిషముల వరకు  అయోధ్య రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో మన ఇంటిలో దేవుళ్లకు పూజ చేయాలి. . 


మధ్యాహ్నము 12 గంటల సమయంలో అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన తరువాత మన ఇంటిలో ఇచ్చిన అక్షింతలను ఇంటిలో ఉన్న పెద్దవారు ఇంటిలో ఉన్న చిన్నవారి అందరి తల పైన అక్షింతలు వేసి వారిని ఆశీర్వదించాలి. . 

ఇలా ఆశీర్వదించడం ద్వారా అయోధ్య శ్రీరాముడే మన అందరిని ఆశీర్వదించినట్లు అవుతుంది.. ఆ శ్రీరాముడి ఆశీస్సులు మన అందరికీ ఏర్పడతాయి. . 


తల పైన వేసిన అక్షింతలు జారీ నేలపైన పడతాయి. . 

అలా నేల పైన పడిన పవిత్రమైన అక్షింతలను మనము వదిలి వేయకూడదు. . 

ఒక గుడ్డతో ఒక్క దగ్గరకు అక్షింతలను చేర్చి వాటిని సేకరించి తులసి చెట్టు  లేదా పూల మొక్కల మొదళ్ళ వద్ద కానీ  వేయాలి అలా వేయడం వల్ల అపవిత్రం కాకుండా ఉంటాయి. 


ఆ తరువాత అదే రోజు సాయంత్రము మనము ప్రతి సంవత్సరము ఏ విధంగా దీపావళి పండుగ జరుపుకుంటామో... 

ఈరోజు వచ్చే పండుగ మహా దీపావళి పండుగ. . 

500 సంవత్సరాలుగా పోరాటం చేసిన తరువాత ఈరోజు అయోధ్య రామాలయానికి పునఃప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భముగా. . 

ఐదు దీపాలను మాత్రం కచ్చితంగా వెలిగించాలి. . 

మొదటి రెండు దీపాలు మన ఇంటిలో ఉన్న దేవుని గదిలో వెలిగించాలి. . 

మరో రెండు దీపాలను మన ఇంటి బయట ఇరువైపులా వెలిగించాలి. . 

మరియొక దీపాన్ని మాత్రము మన ఇంటిలోని తులసి చెట్టు వద్ద వెలిగించాలి. . 


వీటితోపాటు దీపావళి రోజున మనము ఏవిధంగానైతే దీపాలను ఇంటి నిండా అలంకరిస్తామో ఆ విధంగా  సాయంత్రం 6 గంటల నుండి మట్టి ప్రమిదలతో మాత్రమే దీపాలను అలంకరించాలి. . 

కొవ్వొత్తులు వెలిగించడం అనేది నిషేధము. . 

ఎందుకంటే కొవ్వొత్తులు వెలిగించడం అనేది క్రైస్తవ సాంప్రదాయము. . 

అది మన హైందవ సాంప్రదాయం కాదు. . 


అలాగే మామూలుగా దీపావళి రోజున మనము ఏవిధంగానైతే బాణాసంచా కాలుస్తామో. . 

అదేవిధంగా జనవరి 22వ తారీకు సాయంత్రం 6 గంటల తరువాత పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి మనము మహా పండుగను జరుపుకోవాలి. . 

ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగని మనము ఎంతో హంగు ఆర్భాటాలతో జరుపుకుంటాము. . 


అలాంటిది 500 సంవత్సరాల తరువాత మన హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్య రామాలయం నిర్మాణము మరియు ఆలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన సందర్భముగా. . 

మనము ఏవిధంగా బాణాసంచా కాల్చుకోవాలో మీరే ఆలోచించుకోండి. . 


మరొక ముఖ్యమైన విషయము ఏమిటి అంటే ఈరోజు నిర్మించిన అయోధ్య రామాలయం. . 

కొన్ని వేల సంవత్సరాల పాటు చరిత్రలో నిలిచిపోతుంది.. 


ఒక ఐదు వేల సంవత్సరముల తరువాత అంటే 7024 సంవత్సరములో.. 

అప్పటి మన భవిష్యత్తు తరాల వారు *అయోధ్య రామ మందిర పంచ సహస్రాబ్ది ఉత్సవాలు* జరుపుకునే క్రమంలో ఐదు వేల సంవత్సరాల క్రితం 2024 సంవత్సరములో అయోధ్య రామాలయ నిర్మాణం జరిగిందట ఆ రోజులలో ఉన్న మా పూర్వీకులు ఎంత అదృష్టవంతులు.. 

వారు అయోధ్యను దర్శించుకో లేకున్నా కూడా వారి ఇంటిలో పెద్ద ఎత్తున పండుగలు జరుపుకున్నారట.. 

ఆనాటి కాలంలో ఉండే టెలివిజన్లలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారట. . 

అలాంటి మహాత్భాగ్యము మాకు కలగలేదే.. 

అని వాపోతారు. . 


ఈరోజు మన విలువ మనకు అర్థం కావడం లేదు కానీ. . 

మన విలువ ఏమిటి అనేది భవిష్యత్తు తరాల వారు గుర్తిస్తారు. . 


కాబట్టి ఇలాంటి మహదవకాశము మనకు లభించినందుకు మన జన్మ ధన్యం అయ్యింది అని తెలుసుకొని అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని పునః ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న మహా పర్వదినాన్ని ఘనంగా జరుపుకుందాము మన జన్మను తరిద్దాము. . 



                  జై శ్రీ రామ్... 



దయచేసి దీనిని చదివిన వారు సాధ్యమైనంత వరకు సామాజిక మాధ్యమాలలో దయచేసి షేర్ చేయండి, ఫార్వర్డ్    సిహెచ్ .దుర్గాప్రసాద్ విశ్వహిందూ పరిషత్, ధర్మ ప్రచార ప్రముఖ, విశాఖపట్నం జిల్లా.    🚩🚩🚩🚩🙏

శ్రీ హరి భక్తరక్షణాపరాయత

 శు  భో  ద  యం🙏


పోతన సన్నివేశ చిత్రణము! 

శ్రీ హరి భక్తరక్షణాపరాయత!


సుందర సురుచిర ఘట్టముల నావిష్కరించుటలో పోతన మొనగాడు. ప్రతిఘట్టమున కొన్ని సుందర దృశ్యములుండును.వానినిపాఠకుని మనో పటమున మరపురాని మనోజ్ఙ వర్ణరంజిత చిత్రాలుగా మలచుట ఆతని కవిత లోని ప్రత్యేకత!


       గజేంద్రమోక్షమున భక్తపరాధీనుడైనహరి,గజరాజు మొరవిని వైకుంఠమునుండి పరుగుపరుగున వచ్చుదృశ్యమును పోతన వర్ణంచిన తీరు నాన్యతో దర్శనీయము.

"తనవెంటంసిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్,/ వానివెన్కను బక్షీంద్రుడు,వానిపొంతను ధనుఃకౌమోదకీశంఖచ/

క్రనికాయంబును,నారదుండు,ధ్వజనీకాంతుండురావచ్చిరొ/

య్యన వైకుంఠపురంబునన్ గలుగువారాబాలగోపాలమున్;//

చివరకు వైకుంఠపురంలోని పిలాపెద్దా అంతా హరివెనుక కదిలారు.


మంచిసుందరదృశ్యము.దీనిని 


వినువీధిలో నిలచి దేవతలు చూచుచూ ఆజగద్బాంధవునకు మ్రొక్కులిడు చున్నారట!

పరిశీలిపుడు.

"వినువీధిన్ జనుదేరగాంచిరమరుల్ విష్ణున్,సురారాతిజీ/

వన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్రహృ/

ద్వనవర్తిష్ణు, సహిష్ణు,భక్తజనబృంద ప్రాభవాలంకరి

ష్ణు,నవోఢోల్లసదిందిరాపరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్,


ఒకరితో నొకరు ఇలాచెప్పుకుంటుంన్నారు.


"చనుదెంచెన్హరి,యల్లవాడె!  హరిపజ్జంగంటిరే లక్ష్మి,శం/

ఖనినాదంబదె!చక్రమల్లదె ,భుజంగధ్వంసియున్ వాడె,చ/

య్యన నేతెంచెనటంచు వేల్పులు నమోనారాయణాయే/

తి! నిస్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్;


ఆయాకాశమేమో? ఆదేవతలేమో? మ్రొక్కులిడుటేమో మనమెన్నడు చూచినవారముగాకపోయినా చదువరుల మనోకుడ్యములమీద ఆచిత్రమంతయు మద్రబడునట్లు వర్ణించినాడు పోతనమహాకవి.


 ఇదీ ఆకవికలము జేసిన వర్ణనా మాయా మహేంద్రజాలము


.ఆచిత్రములను జూచుటకు మన నయనములుగాని,సులోచనములుగానిపనికిరావు.ఆలోచనా లోచనాలతో అంతరంగమున పరికింప వలసియుండును.ప్రయత్నింపుడు.ఫలితము మీచెంతనే! ఇట్టి మనోహర కవితా నిర్మాణచాతుర్యముగల పోతనమహాకవీంద్రునకు వినమ్రసాంజలులర్పించుచు,

                      స్వస్తి!


*చొప్పకట్ల సత్యనారాయణగారి పోస్టు.* 

🙏🙏🙏🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం  -‌ ద్వితీయ -  శ్రవణం   -‌ స్థిర వాసరే* *(13-12-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/Q7RWCVrxDfU?si=79NefJQVlquPHtu3


🙏🙏

నారాయణుడు

 


               *నారాయణుడు*

                 ➖➖➖✍️


*మహావిష్ణువుని నారాయణుడు అని పిలవడం వెనుక కారణాలు ఏంటి*?


*శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం దశావతారాలు ధరించాడు॥*


*ఇందులో ఒక్కో అవతారానికి ఒక్కో విశిష్టత అనేది ఉన్నది.*


*అయితే త్రిమూర్తులలో ఒకడైన                           శ్రీ మహావిష్ణుని అనేక పేర్లతో కొలుస్తుంటారు.*


*అందులో ఒకటి నారాయణుడు. మరి ఈ స్వామిని నారాయణుడు అని పిలవడం వెనుక కారణాలు ఏంటి? నారాయణుడు అంటే అర్ధం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం…*


*ప్రాణికోటి మ‌నుగ‌డ‌కు నీరు అత్యంత ఆవ‌శ్య‌కం. నీరు లేక‌పోతే మ‌నం లేము. అయితే నారాయ‌ణుడు అన్న పేరులో ‘నారము’ అంటే ‘నీరు’ అనే అర్థం వ‌స్తుంది. అదేవిధంగా ‘ఆయ‌ణుడు’ అంటే దారి చూపే వాడు అని అర్థం వస్తుంది. అంటే స‌మ‌స్త ప్రాణికోటికి నీటిని అందించే వాడు క‌నుక‌నే విష్ణువుకు ‘నారాయ‌ణుడ‌’నే పేరు వ‌చ్చింది.*


*అంతేకాదు, విష్ణువు నీటి నుంచి ఉద్భ‌వించిన‌ట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకు కూడా ఆయ‌న్ను నారాయ‌ణుడ‌ని పిలుస్తారు.*


*ఇవే కాకుండా విష్ణువును నారాయ‌ణుడ‌ని పిల‌వ‌డానికి ఇంకొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి.*


*అవేమిటంటే నారదుడు ఎల్ల‌ప్పుడూ నారాయ‌ణ‌, నారాయ‌ణ‌ అంటూ స్మ‌ర‌ణ చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో విష్ణువును నారాయ‌ణుడని పిల‌వ‌డం మొద‌లుపెట్టార‌ట‌*


*అదేవిధంగా గంగాన‌ది విష్ణువు పాదాల నుంచి ఉద్భ‌వించ‌డం వ‌ల్ల ‘విష్ణు పాదోదకం’ అని పేరు వ‌చ్చింద‌ట‌. దీంతోపాటు విష్ణువు ఎల్ల‌ప్పుడూ నీటిలో నివ‌సిస్తాడు కాబ‌ట్టి ఆయ‌న‌కు నారాయ‌ణుడ‌నే పేరు వచ్చిందని చెబుతారు.*


*ఇంకా నారాయణుడు అంటే పరమాత్మా స్వరూపుడు.*


*భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునకు,              “ఓ అర్జునా నీకు నాకు ఇద్దరికీ శరీరాలు వున్నవి ఇద్దరం కర్మలను చేస్తున్నాము కానీ నేను వీటికి బందీకాను ఎందుకంటే నేను జ్ఞానాన్ని కలిగివున్నాను   కాని నువ్వు అజ్ఞానంలో వున్నావు  ఆ అజ్ఞానంతో నువ్వు చేసే కర్మలకు నేను చేస్తున్నాను  అనే అహంకారంతో నీ పైన వేసుకొని బందీ అవుతున్నావు. కావున నీవు జ్ఞానివై యోగివై, నీవు చేసే కర్మలు నిష్కల్మషంగా, లోక కల్యాణార్ధంగా, ఫలాసక్తిరహితుడవై, నీవు చేసే ప్రతి పని నాకు సమర్పించి నీ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించు అర్జునా!”  అని చెప్పాడు.*


*అంటే ఇద్దరూ శరీరాలను కలిగి వున్నారు, ఇద్దరి శరీరాలను వుత్తేజపరిచే ఆత్మ కూడ ఒకటే.*


*కానీ శ్రీకృష్ణుడు మాత్రం పరమాత్ముడు అయ్యాడు అదే అర్జునుడు నరుడయ్యాడు. ఎందుకంటే అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు కానీ శ్రీ కృష్ణుడు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అదియే భేదం.*


*అందుకే వీరిని నర నారాయణులు అని కూడ అంటారు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సాంకేతిక

 _*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_*LMS TvM8*


_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._


_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._


_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._


_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._


_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._


_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._


_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._


_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._


_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_ *LMS TvM8*

పంచాంగం 13.01.2024

 ఈ రోజు పంచాంగం 13.01.2024

Saturday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతు పుష్య మాస శుక్ల పక్ష: ద్వితీయా తిధి స్థిర వాసర: శ్రవణం నక్షత్రం వజ్ర తదుపరి సిద్ది యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


విదియ పగలు 11:11 వరకు. 

శ్రవణం మధ్యాహ్నం 02:49 వరకు .

సూర్యోదయం : 06:53

సూర్యాస్తమయం : 05:57

వర్జ్యం : సాయంత్రం 04:24 నుండి రాత్రి 05:51 వరకు.

దుర్ముహూర్తం : ఉదయం 06:53 నుండి 08:22 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

యమగండం: మద్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*13-01-2024 / శనివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వలన విశ్రాంతి  ఉండదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------

వృషభం


ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

---------------------------------------

మిధునం


వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు.

---------------------------------------

కర్కాటకం


దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------

సింహం


ముఖ్యమైన  వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దాయదులతో  ఆస్తి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి.

---------------------------------------

కన్య


మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. దూరపు బంధువుల నుండి అరుదైన  ఆహ్వానాలు అందుతాయి. 

---------------------------------------

తుల


దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.

---------------------------------------

వృశ్చికం


చేపట్టిన పనులలో అధిక శ్రమ ఫలితాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------

ధనస్సు


ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.

---------------------------------------

మకరం


చేపట్టిన  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

---------------------------------------

కుంభం


ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలు ఉన్నవి.

---------------------------------------

మీనం


ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀