13, జనవరి 2024, శనివారం

అక్షింతల వితరణ*

 *అయోధ్య రామయ్య అక్షింతల వితరణ*

అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రతిష్ట పూర్తి అయినది. 

ఆ అయోధ్య బాల రాముడి అక్షింతలు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి పంపిణీ జరుగుతూ ఉన్నది.. 


కాకపోతే ఇక్కడ చిన్న సమస్య ఎదురవుతూ ఉన్నది.. 


వ్యక్తిగతంగా నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటి అంటే అయోధ్య బాల రాముడి అక్షంతలు వితరణ చేసే సమయంలో అక్షింతలను తీసుకున్న తరువాత ఏమి చేయాలి అనే విషయాన్ని అక్షింతల వితరణ చేసేవారు ప్రతి ఇంటికి వివరించలేకపోతున్నారు. . 

సమయము లేకపోయి ఉండవచ్చు. 

లేదా కొన్ని గ్రామాలలో వితరణ చేసే వారికి కూడా సరియైన అవగాహన లేక కూడా ఈ విధమైన పొరపాటు జరుగుతూ ఉన్నది. . 

చాలామంది ప్రజలు నన్ను వ్యక్తిగతంగా అడగడం జరిగినది. .


అయోధ్య బాల రాముడి అక్షింతలు తీసుకొని వచ్చినవారు మన ఇంటి ముందుకు రాగానే. . 

ముందుగా మనము వీలు అయితే ఒక పాత్రలో నీటిని తీసుకొని వచ్చిన వారి కాళ్లు తడిచే విధంగా నీటిని ఆరగించాలి. . 

ఎందుకంటే అయోధ్య రామయ్య అంతటివాడు మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు మనము సాదరంగా అయోధ్య రామయ్య కాళ్లు కడిగి లోపలికి స్వాగతించాలి. . 

వీలు కాని వారు సాదరంగా వారిని లోపలికి స్వాగతించాలి..

వారు ముందుగా మన ఇంటికి వస్తున్నారు అని తెలియగానే ముందస్తుగా మనము హారతి పళ్లెం అందులో ఒక పిడికెడు అక్షింతలు తయారుగా ఉంచుకోవాలి మన ఇంట్లో. . 

ఎందుకనగా వారు వచ్చిన తర్వాత మనము వీటిని సిద్ధం చేయాలి అంటే సమయము సరిపోదు వారికి. . 

వారు భారత దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి వితరణ చేయాలి కాబట్టి వారి సమయాన్ని మనము ఆదా చేయాలి కాబట్టి. . 


అయోధ్య బాలరామయ్య అక్షింతలు లోపలికి వచ్చిన తరువాత మనము హారతి ఇచ్చి వారు ఇచ్చిన అక్షింతలను మన అక్షింతలలో కలుపుకొని  ఆ అక్షింతలను మన ఇంటిలోని దేవుడి దగ్గర ఉంచాలి. . 


అక్షింతలతోపాటు అయోధ్యకు సంబంధించిన ఒక చిత్రపటము    మరియు మరియొక పత్రమును మనకు వారు అందిస్తారు. . 


అలాగే అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి అయ్యి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భముగా ప్రతి ఇంటి పైన కాషాయ ధ్వజము ( జెండా) ఎగురవేయడం ముఖ్యము. . 


ప్రతిరోజు అయోధ్య బాల రాముడి అక్షింతలను వీలైతే ప్రతి రోజు పూజించాలి. . 


తారక మంత్రము :-


*శ్రీరామ*

*జయరామ*

*జయ జయ రామ*


అనే ఈ తారక మంత్రాన్ని ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ప్రతి రోజు 108 సార్లు జపించాలి. . 

దీనివల్ల మన ఇంట్లో శ్రీరాముని దివ్య శక్తి ఉత్పన్నం అవుతుంది. . 


ఈ విధంగా 22వ తారీకు వరకు కూడా పాటించాలి. . 


జనవరి 22వ తారీకు నాడు ఆరోజు మనకు మహా పండుగ పర్వదినము. . 


ఆరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి ఇంటిల్లిపాది స్నానమాచరించి ఇంటిని పరిశుభ్రముగా చేసుకొని. . ఇంటి నీ పూలతో అలంకరించుకొని.. 

ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించి. . 

ఇంటి ముందు ముగ్గులు వేసి. . 

ఆరోజు మన ఇంటిలో పెద్ద ఎత్తున పండుగ జరుపుకోవాలి. . 

ఆరోజు మధ్యాహ్నము 11:29 నుండి  11:31 నిమిషముల వరకు  అయోధ్య రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో మన ఇంటిలో దేవుళ్లకు పూజ చేయాలి. . 


మధ్యాహ్నము 12 గంటల సమయంలో అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన తరువాత మన ఇంటిలో ఇచ్చిన అక్షింతలను ఇంటిలో ఉన్న పెద్దవారు ఇంటిలో ఉన్న చిన్నవారి అందరి తల పైన అక్షింతలు వేసి వారిని ఆశీర్వదించాలి. . 

ఇలా ఆశీర్వదించడం ద్వారా అయోధ్య శ్రీరాముడే మన అందరిని ఆశీర్వదించినట్లు అవుతుంది.. ఆ శ్రీరాముడి ఆశీస్సులు మన అందరికీ ఏర్పడతాయి. . 


తల పైన వేసిన అక్షింతలు జారీ నేలపైన పడతాయి. . 

అలా నేల పైన పడిన పవిత్రమైన అక్షింతలను మనము వదిలి వేయకూడదు. . 

ఒక గుడ్డతో ఒక్క దగ్గరకు అక్షింతలను చేర్చి వాటిని సేకరించి తులసి చెట్టు  లేదా పూల మొక్కల మొదళ్ళ వద్ద కానీ  వేయాలి అలా వేయడం వల్ల అపవిత్రం కాకుండా ఉంటాయి. 


ఆ తరువాత అదే రోజు సాయంత్రము మనము ప్రతి సంవత్సరము ఏ విధంగా దీపావళి పండుగ జరుపుకుంటామో... 

ఈరోజు వచ్చే పండుగ మహా దీపావళి పండుగ. . 

500 సంవత్సరాలుగా పోరాటం చేసిన తరువాత ఈరోజు అయోధ్య రామాలయానికి పునఃప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భముగా. . 

ఐదు దీపాలను మాత్రం కచ్చితంగా వెలిగించాలి. . 

మొదటి రెండు దీపాలు మన ఇంటిలో ఉన్న దేవుని గదిలో వెలిగించాలి. . 

మరో రెండు దీపాలను మన ఇంటి బయట ఇరువైపులా వెలిగించాలి. . 

మరియొక దీపాన్ని మాత్రము మన ఇంటిలోని తులసి చెట్టు వద్ద వెలిగించాలి. . 


వీటితోపాటు దీపావళి రోజున మనము ఏవిధంగానైతే దీపాలను ఇంటి నిండా అలంకరిస్తామో ఆ విధంగా  సాయంత్రం 6 గంటల నుండి మట్టి ప్రమిదలతో మాత్రమే దీపాలను అలంకరించాలి. . 

కొవ్వొత్తులు వెలిగించడం అనేది నిషేధము. . 

ఎందుకంటే కొవ్వొత్తులు వెలిగించడం అనేది క్రైస్తవ సాంప్రదాయము. . 

అది మన హైందవ సాంప్రదాయం కాదు. . 


అలాగే మామూలుగా దీపావళి రోజున మనము ఏవిధంగానైతే బాణాసంచా కాలుస్తామో. . 

అదేవిధంగా జనవరి 22వ తారీకు సాయంత్రం 6 గంటల తరువాత పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి మనము మహా పండుగను జరుపుకోవాలి. . 

ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగని మనము ఎంతో హంగు ఆర్భాటాలతో జరుపుకుంటాము. . 


అలాంటిది 500 సంవత్సరాల తరువాత మన హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్య రామాలయం నిర్మాణము మరియు ఆలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన సందర్భముగా. . 

మనము ఏవిధంగా బాణాసంచా కాల్చుకోవాలో మీరే ఆలోచించుకోండి. . 


మరొక ముఖ్యమైన విషయము ఏమిటి అంటే ఈరోజు నిర్మించిన అయోధ్య రామాలయం. . 

కొన్ని వేల సంవత్సరాల పాటు చరిత్రలో నిలిచిపోతుంది.. 


ఒక ఐదు వేల సంవత్సరముల తరువాత అంటే 7024 సంవత్సరములో.. 

అప్పటి మన భవిష్యత్తు తరాల వారు *అయోధ్య రామ మందిర పంచ సహస్రాబ్ది ఉత్సవాలు* జరుపుకునే క్రమంలో ఐదు వేల సంవత్సరాల క్రితం 2024 సంవత్సరములో అయోధ్య రామాలయ నిర్మాణం జరిగిందట ఆ రోజులలో ఉన్న మా పూర్వీకులు ఎంత అదృష్టవంతులు.. 

వారు అయోధ్యను దర్శించుకో లేకున్నా కూడా వారి ఇంటిలో పెద్ద ఎత్తున పండుగలు జరుపుకున్నారట.. 

ఆనాటి కాలంలో ఉండే టెలివిజన్లలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారట. . 

అలాంటి మహాత్భాగ్యము మాకు కలగలేదే.. 

అని వాపోతారు. . 


ఈరోజు మన విలువ మనకు అర్థం కావడం లేదు కానీ. . 

మన విలువ ఏమిటి అనేది భవిష్యత్తు తరాల వారు గుర్తిస్తారు. . 


కాబట్టి ఇలాంటి మహదవకాశము మనకు లభించినందుకు మన జన్మ ధన్యం అయ్యింది అని తెలుసుకొని అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని పునః ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న మహా పర్వదినాన్ని ఘనంగా జరుపుకుందాము మన జన్మను తరిద్దాము. . 



                  జై శ్రీ రామ్... 



దయచేసి దీనిని చదివిన వారు సాధ్యమైనంత వరకు సామాజిక మాధ్యమాలలో దయచేసి షేర్ చేయండి, ఫార్వర్డ్    సిహెచ్ .దుర్గాప్రసాద్ విశ్వహిందూ పరిషత్, ధర్మ ప్రచార ప్రముఖ, విశాఖపట్నం జిల్లా.    🚩🚩🚩🚩🙏

కామెంట్‌లు లేవు: