*సమాచార హక్కు చట్టంపై సామాన్య ప్రజలలో మదలైయ్యే సందేశాలకు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది బి. ఎస్.కృష్ణారెడ్డిగారి సమాధానాలు*
*1.సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి ?*
◆సమాచార హక్కు చట్టం 2005 లో వచ్చింది. కేంద్ర , రాష్ట్ర పభుత్వాల పాలనకు ఒక పార దర్శకత, జవాబుదారీ తనం తీసుకురావడానికి ఇది ఉద్దేశించినది. రెండు ప్రభుత్వాల పని తీరుకి సబంధించిన సమాచారం దేశ ప్రజలందరికి అందుబాటులో వుంచడానికి ఇది కృషి చేస్తుంది.
*2. పబ్లిక్ ఆధారిటీలు అంటే ఎవరు?*
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాసనాల ద్వారా గాని , రాజ్యాంగంలో చేసిన ఏర్పాటు వల్ల గాని, స్వంతంగా పాలనా నిర్వహణ ఏర్పాటు చేసుకునే సంస్థలు పబ్లిక్ అధారిటి అంటారు. ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నడిచే సంస్థలు, ప్రభుత్వ అధికారం కింద పనిచేస్తున్న సంస్థలు, ప్రభుత్వ స్వంత సంస్థలు ఇవి కూడా పబ్లిక్ అధారిటి కిందకు ఆర్ధిక సహాయం వల్ల నడిచే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ కోవలోకే వస్తాయి.
3.కోరిన సమాచారాన్ని ఎవరు అందిస్తారు?
◆సమాచార ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ సమాచార అధికారి ప్రతి పబ్లిక్ సంస్థలోను నియమించబడతారు. వారు తప్పనిసరిగా ప్రజలు కోరిన సమాచారం ఇవ్వాలి. ఆర్.టి.ఐ. దరఖాస్తులు కూడా వీరిని అడ్రస్ చేసి పంపాలి.సబ్ డివిజినల్ స్థాయిలో అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు వుంటారు. వీరు తమకు చేరిన దరఖాస్తులను , అప్పీల్స్ ను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరుకు పంపుతారు.
*4.సమాచార కమిషనుకు రాసే దరఖాస్తు, పబ్లిక్ అథారిటికి మీరు రాసే దాని కంటే ఏ విధంగా ప్రత్యేకమైనది ?*
◆సమాచార హక్కు చట్టం ప్రకారం ఇతర దరఖాస్తుల మాదిరి కాకుండా ఇక్కడికి సమాచారాన్ని కోరుతూ వచ్చిన దరఖాస్తులకు, అప్పీళ్ళకు తప్పనిసరిగా స్పందించి,పరిమిత సమయంలో అందించాల్సి వుంటుంది. అలా జరగని పక్షంలో ఆ అధికారిపై చట్ట ప్రకారం శిక్ష విధించ వచ్చు. అంతే కాదు, అతనిపై క్రమశిక్షణా చర్య తీసుకోవచ్చు. ఆర్.టి.ఐ. నుపయోగించి, పొందగల సమాచారం పరిధి ఎంతో విశాలమైంది. ఈ చట్టం ప్రకారం, పార్లమెంటుకు కానీ, రాష్ట్ర శాసన సభకు కానీ సమర్పించే ఏ సమాచారమైనా ప్రజలు ఆర్.టి.ఐ. ద్వారా పొంద వచ్చు. ప్రజలు తాము కోరుతున్న సమాచారానికి కారణం కానీ, తమ వ్యక్తిగత వివరాలు కానీ,ఒక్క కాంటాక్టు అడ్రసు తప్ప, అధికారికి చెప్పాల్సిన పనిలేదు.
5.సమాచార హక్కు ను కోరుతున్న దరఖాస్తు ఇన్ని పదాల లోనే వుండాలని నిబంధన ఏమయినా వుందా?*
◆ఔను. ఆర్.టి ఐ అప్లికేషన్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు చిరునామాతో కలిపి, 500 పదాలకు మించి వుండరాదు. అయితే అప్లికేషనుకు అనుబంధం వుంటే అది లెక్కలోకి రాదు. అయినాకానీ , పదాల పరిమితి పెరిగిందనే కారణంతో ఎవరి దరఖాస్తును తిరస్కరించడానికి వీల్లేదు.
*6. సమాచార హక్కు చట్టం ప్రకారం నేను సమాచారం పొందాలంటే ఏం చెయ్యాలి?*
◆నిర్దేశించిన రుసుము చెల్లించి,సంబంధిత పబ్లిక్ అధారిటి యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరిట, దరఖాస్తు చేయాలి. ఆ అధికారికి మీరు అడుగుతున్న సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వుంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరు ఇక్కడ అవసరం లేదు.ఒకవేళ మీరు దరఖాస్తు రాయలేని నిరక్షరాస్యులు అయినట్టయితే , మీకు దరఖాస్తు రాసి పెట్టడానికి ఎవరినాయినా సూచించే బాధ్యత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తీసుకుంటారు.
*7. సమాచార హక్కు చట్టం ఎలా ఉపయోగించుకోవాలి?*
సమాచార హక్కు చట్టం కింద ఈ క్రింది విషయాలు మీరు పొందవచ్చు.
◆డాక్యుమెంట్స్, రికార్డ్స్, మెమోలు, ఈ మెయిల్స్, అభిప్రాయాలు. సలహాలు, పత్రికా ప్రకటనలు, ఆర్డర్స్, లాగ్ బుక్స్, కాంట్రాక్టులు, రిపోర్టులు, పేపర్స్, సర్క్యులర్స్, శాంపిల్స్, మోడల్స్
ఎలెక్ట్రానిక్ ఫారంలో వున్న డేటా, డాక్యుమెంటు ఒరిజినల్ కాపీ,
మైక్రోఫిల్మ్, ఇమేజ్ రూపంలో వున్న మైక్రో ఫిల్మ్
*8. ఏ ఏ విషయాలు సమాచార దరఖాస్తు ద్వారా పొందడానికి సాధ్యం కాదు ?*
◆ఈ క్రింది విషయాలు ఆర్.టి. ఐ ద్వారా పొందడానికి సాధ్యం కాదు. భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వాలకు భంగం కలిగించే సమాచారం దేశ భద్రత, వ్యూహాత్మక , వైజ్ణానిక, ఆర్ధిక ప్రయోజనాలపై , విదేశీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే సమాచారం, హింసను ప్రేరేపించే సమాచారం
ఫలానా సమాచారాన్ని ప్రకటించకూడదని ఏదయినా న్యాయస్థానం లేక ట్రిబ్యూనల్ ఆదేశించి వున్న పక్షంలో అలాంటి సమాచారం ,సమాచార వెల్లడి కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందనుకుంటే ఆ సమాచారం సమాచార వెల్లడి పార్లమెంట్ , రాష్ట్ర శాసన సభ హక్కులను ఉల్లంఘించేదయితే అలాంటి సమాచారం
వాణిజ్య పరమయిన గోప్యత, వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తికి సంబంధించిన సమాచారం, సమాచార వెల్లడి వల్ల పోటీ రంగంలో తృతీయ పక్షానికి హాని కలిగేటట్లయిటే అలాంటి సమాచారం . అయితే, అలా వెల్లడి చెయ్యడం వల్ల ప్రజలకుఎక్కువ మేలు కలుగుతుందంటే ,ఆ సమాచారం ఇవ్వవచ్చు. ఉద్యోగ సంబంధ రీత్యా ఒక వ్యక్తికి అందుబాటులో వున్న సమాచారం విశాల ప్రజాప్రయోజనాల రీత్యా వెల్లడి చేయాల్సిన అవసరం వుందని సంబంధిత అధికారి భావిస్తే దాన్ని ప్రకటించవచ్చు.
ఏదయినా విదేశ ప్రభుత్వం నుంచి అంది,గోప్యంగా ఉంచాల్సిన సమాచారం సమాచార వెల్లడి వల్ల ఒక వ్యక్తికి ప్రాణ హాని కానీ, ప్రమాదం కలుగుతుందనుకుంటే ఆ సమాచారం, చట్టాల అమలుకోసం, భద్రతా ప్రయోజనాల కోసం గోప్యంగా సమాచారం అందించిన,లేక సహాయపడిన వారి గుర్తింపుకు దారితీసే సమాచారం దర్యాప్తు ప్రక్రియనూ, నేరస్తులను పట్టుకునేందుకు గానీ,వారిని శిక్షించేందుకు అవరోధాలు కలిగించే సమాచారం ఏదైనా అంశాలపై మంత్రి మండలి నిర్ణాయక పత్రాలు,అవి బహిర్గతం చేసే దాకా ఆ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన సమాచారాన్ని వెల్లడి చేయరాదు. సమాచారం ప్రజా ప్రయోజనాలకు కాని, ప్రజా కార్యక్రమాలకు సంబంధంలేని, వ్యక్తిగత సమాచారం గోప్యతను వెల్లడి చేసే వివరాలు
*9. సమాచారం తీసుకోవడానికి ఏ భాషను ఉపయోగించాలి?*
◆మీకు కావలసిన సమాచారాన్ని ఇంగ్లీషు, హిందీ లేక స్థానిక భాష లో ఈ దరఖాస్తు పంపుతున్న మీ ప్రాంతంలోని అధికార భాషగా గుర్తించిన ప్రాంతీయ భాషలో గాని వుండవచ్చు.
●10. నాకు కావలసిన సమాచారాన్ని నేను కాపీ చేయడం గాని, చూడడం కాని ఎలా చెయ్యాలి?*
◆డాక్యుమెంట్స్ , మాన్యుస్క్రిప్టులు, మరియు రికార్డులు తనిఖీ చేయవచ్చు. నోట్స్ తీసుకోవచ్చు., సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ కాపీలు లేక వాటి అనుబంధ కాపీలు, పదార్ధాల సర్టిఫైడ్ శాంపుల్స్ , సీడీ ల రూపంలో వున్న సమాచారం, ఫ్లాపీలు, టేపులు, వీడియో కాసెట్స్, ప్రిట్ అవుట్స్ ( కంప్యూటరులో వున్న సమాచారం), లేక ఇతర ఎలక్ట్రానిక్ రూపంలో వున్న సమాచారం
*11. కావలసిన సమాచారం అధికారులు ఏ రూపంలో ఇవ్వగలరు?*
◆పబ్లిక్ సంస్థ వనరులలో వ్యత్యాసాలతో కూడిన మార్పులు జరగకపోతే, కోరిన రూపంలో సమాచారం ఇవ్వవచ్చు. ఆ డాక్యుమెంటుకు హాని లేని పక్షంలో , లబ్దిదారులు కోరిన విధంగా, కోరిన రూపంలో సమాచారం ఇవ్వవచ్చు .
*12.సమాచార చట్టం దరఖాస్తును (అప్లికేషన్) నింపడానికి ఏదైనా ఖచ్చితమైన ఫార్మెట్ వుందా?*
◆లేదు. సమాచారాన్ని కోరుతూ దాఖలు చేస్కునే దరఖాస్తు ఫారానికి ప్రత్యేకమయిన ఫార్మెట్ ఏమీ లేదు. కానీ దరఖాస్తు దారుడు ఈ క్రింది వివరాలు రాయాల్సి వుంటుంది.
1)దరఖాస్తు తేదీ.
2)సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు చిరునామా
దరఖాస్తుదారుని చిరునామా
3)కోరదల్చుకున్న సమాచారం( స్పష్టత కోసం నంబర్లవారీగా కానీ, టేబుల్ రూపంలో గానీ వుంటే మంచిది. దానికి ప్రతిస్పందనలు కూడా అదే రూపంలో వుంటాయి.)
4)కోరిన సమాచారం ఎలాంటి రూపంలో – ప్రింట్ అవుట్స్, సిడి , ఈ మైయిల్స్ చెల్లించాల్సిన రుసుము స్టాంపు రూపంలో అయితే అంటించండి చెల్లింపు విధానం తెలపండి.సంతకం అనేక కెంద్ర, రాష్ట ప్రభుత్వ సంస్థలు శాంపిల్ ఫార్మేట్స్ ను రూపొందించాయి.పర్యావరణ , అడవుల మంత్రిత్వ శాఖల కు సంబంధించిన దరఖాస్తు ఫారాలను http;//envfor.nic.in/sites/default/files/app_pro.pdf వెబ్ సైట్ లో చూడగలరు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారు కూడా ఒక దరఖాస్తు ఫార్మెట్ తయారు చేశారు. ఇది దరఖాస్తు సౌలభ్యం కోసం మాత్రమే తప్ప తప్పనిసరిగా పాటించితీరాలని నిబంధన ఏమీలేదు. ఈ ఫార్మెట్ లేదనే కారణం గా దరఖాస్తుని తిరస్కరించడానికి వీల్లేదు.
*13. ఆన్ లైన్ ద్వారా సమాచారాన్ని ఫైల్ చేయవచ్చా?*
◆అది పబ్లిక్ అధారిటి మిద ఆధార పడి వుంటుంది.కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే సమా చార హక్కు http;//rtionline.gov.in/ పేరిట ఒక పోర్టల్ నూ రూపకల్పన చేసింది. ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలపై మాత్రమే వినియోగదారుడు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమాచార హక్కు గురించి వెబ్ సైట్స్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.
*14.సమాచారం పొందడానికి ఎంత సమయం పడుతుంది?*
1)మీరు అడిగిన సమాచారం వ్యక్తి ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్చకు (లైఫ్ అండ్ లిబర్తికి ) సంబందించాయిన అంశం అయితే మీ దరఖాస్తు సంబంధిత అధికారికి ముట్టిన ముట్టిన సమయమ నుంచి 48 గంటలలోపు సమాచారం అందించాలి.
2) దరఖాస్తు చేరిన ౩౦ రోజులలోగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి సమాచారం అందించాలి. అప్లికేషన్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికి పంపినట్టయితే అతను సంబంధిత అధికారిని దాన్ని చేర్చి సమాచారం సేకరీంచే నిమిత్తం మరొక 5రోజులు అవసరమవుతుంది.
*15. సమాచార హక్కు దరఖాస్తు సరైన అధికారికి పంపకపోతే వెనక్కి తిరిగి వచ్చేస్తుందా?*
◆మీ దరఖాస్తు సంబంధిత అధికారికి చేరకుండా మరొకరికి చేరినా కానీ, దాన్ని తిప్పి పంపంచడానికి వీల్లేదు. ఈ చట్టం పకారం దాన్ని అందుకున్న వ్యక్తి, లేక సంస్థ 5 రోజుల్లోగా నిర్దేశిత అధికారికి తిరిగి చేర్చితీరాలి..
*16. సమాచారం తీసుకోవడానికి నేను ఏదైనా ఫీజు చెల్లించాలా.?*
◆సమాచార హాక్కు కింద సమాచారం కోరుతూ పంపే అప్లికేషను ఒక కాపీ మీ దగ్గర అట్టిపెట్టు కొండి. అప్లికేషను రిజిష్టర్ పోస్టు అక్నాలేడ్జిమేంట్
లో పంపండి రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ అథారిటి సమర్పించబోయే సమాచారానికి ఒక నియమిత ఫీజును నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆ మొత్తాన్ని రూ. 10 గా ప్రకటించింది.(ఈ పైన ఇచ్చిన పట్టికలో
ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫీజు ఎంతెంత నిర్ణ యిన్చిందో, ఎలా ఫీజు కట్టలో ఇవ్వడం జరిగింది. 1) ఒకవేళ దరఖాస్తు దారుడు
దారిద్యరేఖ దిగువున వున్నా వాడితే,( ఫీజు చెల్లించలేని పరిస్థితిలో) వుంటే దానికి సంబంధించిన గుర్తింపు కార్డును సమర్పించాల్సి వుంటుంది అనగా దరఖాస్తు వెంట తెల్ల రేషన్ కార్డు జిరాక్సు జత పర్చవల్సి ఉంటుంది.
*సెక్షన్7(3)(a)* ప్రకారం సమాచార రుసుము (కోర్టు సంబంచిన మాత్రం రూ25/- మిగతా శాఖ వారికి రూ10/- మాత్రమే చెల్లించాలి.
*దరఖాస్తు రుసం(పీజును)*
(1) నగదు రూపంలో,
(2) ఇండియన్ పోస్టల్ ఆర్డర్లు,
(3) డిమాండ్ డ్రాఫ్టు,
(4) కోర్టు ఫీ స్టాంపు వేయాలి,(కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు చెల్లుబాటు కాదు)
(5)బ్యాంకర్స్ చెక్కురూపంలో మాత్రమే దరఖాస్తు రుసుం. ఎకౌంట్ అధికారి పేరిట పంపించాలి.
విలయినంతగా పోస్టల్ ఆడారు మాత్రమే రుసుముగా చెల్లించాలి.
కోరిన సమాచారాన్ని బట్టి వాటి ప్రింటవుట్స్ కి పేజీకి రూ.2 చొప్పున చెల్లించాలి. అదనపు చార్జీలు ఎవైన వుంటే, ఆఫీసరు తన జవాబులో తెలియజేస్తారు.
ఒకవేళ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు సమాచారం ఇవ్వడంలో 30 రోజులకంటే ఎక్కువ జాప్యం చేస్తే, అప్పుడు ఎటువంటి ఫీజు వసూలు చెయ్యకుండా ఉచితంగా సమాచారం ఇవ్వాల్సి వుంటుంది.
*17.ఆర్.టి.ఐ దరఖాస్తుకి స్పందన లేకపోతే ఏం చెయ్యాలి?*
◆సమాచారం కోసం సమర్పించిన దరఖాస్తుకి సంబంధిత అధికారి నుంచి స్పందన లేకపోతే అప్పిలేట్ ఆధారిటీ కి అప్పీల్ చేసుకోవచ్చు. అన్ని పబ్లిక్ అథారిటిల తాలూకు అప్పిళ్ళను చూసేది అప్పలేట్ అధారిటి. మీ మొదటి అప్లికేషనుకు జవాబు రావాల్సిన తేది నుంచి 30 నుంచి 60 రోజుల వ్యవధిలోపల అప్పీలు చేసుకోవాలి.
*18. నాకు చేరిన సమాచారం తప్పుగానో, అసంపూర్తిగానో వుంటే ఏం చెయ్యాలి?*
◆ఇచ్చిన సమాచారం అవాస్తవంగానో , అసంపూర్తిగానో వుంటే అప్పిలేట్ ఆధారిటికి అప్పీల్ చేసుకోవాలి. సమాధానం చేరిన 30 రోజులలోపు అప్పీలుచేయాలి. సరైన కారణాలు వున్నప్పుడు అంతకంటే ఎక్కువ జాప్యం జరిగిన కూడా అప్పీలు అంగీకరిస్తారు.
*19. సమాచారాన్ని ఇవ్వడానికి తిరస్కరించవచ్చా?*
◆వ్యక్తి గత సమాచారం అడిగినప్పుడు తిరస్కరించవచ్చు. కొన్ని సమాచార విషయాలు ఆర్.టి.ఐ. సహాయంతో అందరితో పంచుకునే వీలులేదు. అలాంటప్పుడు సంబంధిత అధికారులు మీ అప్లికేషన్ తిరస్కరించవచ్చు. అయితే, ఆర్.టి.ఐ చట్టం కింద సదరు సమాచారం ఇవ్వ యోగ్యమైనదే అనిపిస్తే, మీరు అప్పీలు చెయ్యవచ్చు.
మీరు ఈ అప్పీలును మీకు జవాబు వచ్చిన 30 రోజుల లోగా చేసుకోవాలి.మీ అప్లికేషన్ తిరస్కరించినప్పుడు, దానికి కారణాలు, మీరు దానిపై ఎలా అప్పీలు చేసుకోవచ్చో, మీరు పంపాల్సిన అప్పలేట్ అధారిటి ,ఇవన్ని కూడా తిరస్కరిస్తున్న పబ్లిక్ అథారిటి ఇవ్వాల్సి వుంది.
*20. అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన సమాచారం నాకు అసంతృగా వుందనిపిస్తే నేను ఏం చెయ్యాలి?*
◆అలాంటప్పుడు, మీరు కేంద్ర సమాచార కమిషన్ కు లేదా, రాష్ట్ర సమాచార కమిషన్ కు రెండో సారి అప్పీలు చేయవచ్చు. మీరు మొదట పంపిన అప్పీలుకు జావాబు ఇవ్వాల్సిన సమయం అయిన తరవాత 90 రోజులోగా రెండో అప్పీలు పంపుకోవాలి. లేదా, మొదటి అప్పీలుకు జావాబు వచ్చిన తరవాత 90 రోజులలోగా రెండో అప్పీలు పంపాలి. సరైన కారణం వున్నప్పుడు, ఈ సమయం దాటి పోయినా కూడా అప్పీలు అనుమతించబడుతుంది.
*21. కోరిన సమాచారాన్ని సంబంధిత రాష్ట్ర సమాచార కమిషన్/కేంద్ర సమాచార కమిషన్ గాని నిర్ణిత సమయం లో ఇవ్వాలని వున్నదా?*
◆అటువంటి సమయ నిబంధన ఏది లేదు.
*22.కోరిన సమాచారం ఇవ్వని అధికారి పై ఎం చర్యలు తీసుకుంటారు*
◆పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు ఈ క్రింద వివరించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అతను దరఖాస్తూ స్వీకరించే వరకు లేదా సమాచారం ఇచ్చే వరకు కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార కమిషన్ రోజుకు రు .250 లు చొప్పున పెనాల్టి విధించ వచ్చు. గరిష్టంగా రు.25,000లు వరకు పెనాల్టి వేయవచ్చు.
●సరైన కారణం లేకుండానే ఆర్.టి.ఐ. దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించడం
●నిర్ణయించబడిన సమయంలో సమాచారం ఇవ్వడానికి నిరాకరించడం
●సమాచారం కావాలని ఆలస్యంగా ఇవ్వడం
●తెలిసి కూడా తప్పుడు సమాచారం/అసంపూర్తి సమాచారం/తప్పు దోవ పట్టించే
సమాచారం ఇవ్వడం
●అడిగిన సమాచారాన్ని అసలు లేకుండా చెయ్యడం,
●సమాచారం ఇవ్వడానికి ఏదో విధంగా అడ్డుపడడం.
*23.ఏలాంటి పరిస్థితుల్లో మీరు అప్పీల్ వేయకుండా సమాచార కమీషన్ కు దరఖాస్తు చేసుకొనవచ్చు?*
మీరు సమాచారం కొరకు దరఖాస్తు ప్రజా సమాచార అధికారి గారికి దరఖాస్తు చేసుకొని ఉంటే మీ దరఖాస్తు స్వీకరించకుండా తిరస్కరిస్తే (refused) మీరు సమాచార హక్కు చట్టం రాష్ట్ర)/కేంద్ర కమీసనర్ల అప్పీల్ చేసుకొనవచ్చు.
*24. రికార్డులను తనిఖీ చేసే అధికారం ఉందా?*
◆సెక్షన్2(j)(1) ప్రకారం పనులను, పత్రాలను తనిఖీ చేసే హక్కు అధికారం ఉంది (మొదటి గంటకు ఉచితం మరల ప్రతి గంటకు రూ5/- చెల్లించాలి
25 సమాచార దరఖాస్తు దారునికి వయసు,విద్య స్థానికత అవసరం ఉందా*?
◆లేదు
26. సమాచార హక్కు ప్రతి దరకాస్తుదారుడు వినియోగదారరుడేనా?
◆అవును వినియోగదారుడే
*27.అడుగుతున్న సమాచారాన్ని ఎందుకు అని ఆడిగే హక్కు ఎవరికైనా ఉందా?*
◆లేదు *సెక్షన్6(2)* ప్రకారం సమాచారం ఎందుకో చెప్పనక్కరలేదు.
*28.మీరు అడుగుతున్న సమాచారం ఏ శాఖ అధికారికి వస్తుందో తెలియనప్పుడు. మీరు తప్పకుండా
◆సెక్షన్-6(1) ప్రకారం సమాచార హక్కు దాఖలు విధానం. తెలియపరుస్తూ కోరిన సమాచార మీ పరిధిలోకి రాని యెడల *సెక్షన్ -6(3)* ప్రకారం నా దరఖాస్తును బదిలీ సీజేయగలరు అని తప్పని సరిగా వ్రాయాలి. సమాచారం సంబంధిత శాఖ అధికారికి దరఖాస్తు బదిలీ ప్రజా సమాచార అధికారిపై ఉండుంది.
*29.ఉచితంగా ఏ సెక్షన్ ప్రకారం సమాచారం పంపిణీ చేయాలి?
◆సెక్షన్7(6) ప్రకారం గడువులోపు సమాచారం ఇవ్వకుంటే సమాచారం ఉచితముగా ఇవ్వాలి.
*30.మినహాయింపులు ఎప్పుడు ఏ సెక్షన్ ప్రకారం వర్తించవు?*
◆సెక్షన్8(2) ప్రకారం అడిగిన సమాచారంలో ప్రజాప్రయోజనం ఉంటే మినహాయింపులు వర్తించవు.
*31.మొదటి అప్పీలు ఏ సెక్షన్ ప్రకారం అప్పీల్ చేయాలి?*
సెక్షన్19(1) ప్రకారం మొదటి అప్పీలుచేయాలి 45 రోజుల నుంచి 60 రోజుల లోపు ఉండాలి.
*32. ఏ సెక్షన్ ప్రకారం రెండవ అప్పీల్ చేయాలి?*
◆సెక్షన్19(3) ప్రకారం రెండవ అప్పీలు, 90 రోజుల లోగా రాష్ట్ర కేంద్ర సమాచార కమీషన్ అప్పీల్ చేసుకోవాలి. సరైన కారణాలు ఉంటే 90 రోజుల తరువాత అప్పీల్ చేసుకోవచ్చు.
*33* కేంద్ర రాష్ట్ర కమీసనర్లకు ఏ సెక్షన్ ప్రకారం పిర్యాదు చేయాలి*
◆సెక్షన్18(1) ప్రకారం కమీషన్లకు పిర్యాదు చేయాలి.
*34. సమాచారం కోరిన సమయంలో మీ దరఖాస్తును అయిన అర్థక పరమైన నష్టాలు వచ్చి ఉంటే వాటిని చెల్లించమని అడవచ్చు?*
◆సెక్షన్-19(8)(b) ప్రకారం ధరాఖస్తుదారు తనకు కలిగిన ఆర్థికపరమైన కష్టనష్టలపై కమిషన్ ఆధారాలు సమర్పించాలి సక్రమంగా ఉంటే నష్టపరిహారం మంజూరు చేయాలి.
*35.తప్పుడు సమాచారం ఇచ్చిన సమాచారం ఇవ్వకపోయినా సంబంధిత అధికారిపైకమిసనర్లను చర్యలు తీసుకోమని ఏ సెక్షన్ కింద కొరవచ్చు?*
◆సెక్షన్20(1) ప్రకారం సమాచారం ఇవ్వకపోతే (తప్పుడు సమాచారం ఇస్తే రోజుకు రూ 250 చొప్పున రూ 25,000 వరకు జరిమానా. విధించమని కోరవచ్చు.
*36.సమాచారం ఇవ్వకుంటే వినియోగదారుల పోరంకు వెళ్ళవచ్చు?*
*సెక్షన్20(2)* ప్రకారం క్రమక్షణ చర్యలకు సిపారసు
గడువులోగా సమాచారం ఇవ్వకపోతే వినియోగదారుల పొరనికి వెళ్ళవచ్చు.
*37.సమాచార దరఖాస్తుదారులు ఎటువంటి పరిస్థితుల్లో హైకోర్టు/సుప్రీంకోర్టు వెళ్ళవచ్చు?*
◆ 1)ప్రజా సమాచార అధికారి (ipo) తప్పుడు సమాచారం ఇస్తే రాష్ట్ర కమిసనర్ లేకుంటే డైరెక్టుగా న్యాయస్థానానికి వెళ్ళవచ్చు.
2)సమాచార కమిషన్లు సమాచారం ఇవ్వమని ఆదేశించిన సమాచారం ఇవ్వకుండా ఉంటే హైకోర్టు/సుప్రీంకోర్టులకు వెళ్ళవచ్చు.