26, జూన్ 2021, శనివారం

విస్తరాకులో అన్నం ఎలా వడ్డిస్తారు

 విస్తరాకులో అన్నం ఎలా వడ్డిస్తారు 


పైభాగంలో పండు కాయగూరల తాళింపులు 

కింద భాగంలో అన్నం చారు వంటివి 


ఎందుకు ఇలా అని తెలుసా 

ఏదో పెడుతున్నారు తినేస్తున్నాం ఆకలి తీరింది అనుకుంటున్నారా 


ఈరోజు ఆ కథేంటో తెలుసుకుందాం రండి 


రాముడు తన పదనాలుగేళ్ళ వనవాసం తరువాత సీత లక్ష్మణుడు సుగ్రీవుడు విభీషణుడు హనుమంతుడితో కలిసి అయోధ్యకు పయనమయ్యాడు 


రాజ్యం ఆశతో కాదు కానీ వనవాసం ముగిశాక రాకపోతే ప్రాణాలు వదిలేస్తానని భరతుడు చెప్పాడు 

భరతుడు చెప్పినంత పని చేస్తాడని రాముడు అయోధ్యకు బయలుదేరాడు 


వనవాసం మొదలెట్టినప్పుడు భరధ్వాజ ముని ఆశీర్వాదంతో మొదలుపెట్టారు ఇప్పుడు ముగిసాక ఆయన ఆశీర్వాదం తీసుకుని అయోధ్య కు వెళ్ళాలని రాముడు ఆశపడ్డాడు 


రాముడిని సీతమ్మతో కలిసి చూసిన భరధ్వాజ ముని ఆనందంతో పొంగిపోయి ఆరోజు తమ ఆతిథ్యం స్వీకరించి విందు ఆరగించాల్సిందిగా కోరారు 


ఆయన మాటకు ఎదురుచెప్పక ఒప్పుకున్నారు రామయ్య కానీ గుండెల్లో భరతుడి గురించి ఆలోచన 

అందుకు హనుమను పిలిచి భరతుడి దగ్గరకు వెళ్ళి మేము వస్తున్నాం అనే సమాచారాన్ని చేరవేయమని ఆజ్ఞాపించాడు రాముడు 


ముని అక్కడ వచ్చిన అందరికీ విందు ఏర్పాటు చేసి వారికందరికి విస్తరాకులు వేసి భోజనానికి సిద్ధం చేసారు 

హనుమంతుడు రాడనుకుని ఆయనను మరిచాడు 

కానీ విందు ఆరగించే సమయంలో హనుమంతుడు రావడంతో ఏం చేయాలో అర్థం కాకుండా ముని ఆలోచిస్తుంటే 


అప్పుడు రాముడు 

హనుమా నువ్వు నా ఎదురుగా కూర్చుని నా ఆకులోనే బోంచేయి 

పైభాగంలో హనుమా తినేటువంటి పండ్లు కాయగూరలు ఉంచండి 

కింద భాగంలో అన్నం చారు పెట్టండి అన్నారు 


ఆరోజు నుండి అదే ఆచారంగా ఇప్పటివరకు హిందువులంతా పాటిస్తున్నాం 


తండ్రీ మాట జవదాటని రామయ్య మాటను మనమూ జవదాటకుండా 


ఇప్పుడు తెలిసిందా ఆకులో భోజనం ఎలా వడ్డించాలో 


🌹నా హృదయం 🌹

కామెంట్‌లు లేవు: