26, జూన్ 2021, శనివారం

శివ శబ్ద శక్తిని ప్రకృతి

 శివ శబ్ద శక్తిని ప్రకృతి యని సృష్టి మూల జీవ లక్షణమని సులువుగా అవగాహన కలుగుటకు అనగా ఋక్కులవలన తెలియు కాంతిని తెలుపు ప్రయత్నమే రుద్ర ప్రశ్న. నమకం చమకంచైవ పురుష సూక్తంచ యద్విదుః మహాదేవంచ తత్తుల్యం తన్మేమనః శివ సంకల్ప మస్తు. నమకం చమకం చ ఏవం పురుషసూక్తమని అది వివరంగా తెలియుట విదు వేద లక్షణము. విదు క్షుణ్ణంగా శక్తిని గ్రహించుట విదు విద్వన్లక్షణము.విద్వాంసుల లక్షణము. తెలిసి దానినిలో లీనమగుట వేద నిర్వచనము. పురుష అనగా అగ్ని రూపమును చైతన్యము వలన కాంతి దాని పరిభ్రమణం,లక్ష

ణము తెలియుట.కాంతిని పదార్ధ రూపముగా మార్చు తత్వము. అగ్నియే సమస్త ప్రపంచ సృష్టికి మూలమని ప్రతీ వస్తు మూల ప్రకృతికి తత్వము శివ రూపంలో గల అగ్ని రూప శక్తి లక్షణము. దీనికి సోమ చంద్రుని ద్వారా సూర్యుని తెలియాలి. సోమ ప్రకృతి జీవ శక్తి, దీని మూల ప్రకృతి సూర్య శక్తి. సూర్య శక్తితో బీజ రూపం. బీజ మార్పు వలన పదార్ధ రూపము సోమ తత్వం. వీటికి ఉపాధి పదార్ధరూపమైన ఆశ్రయము భూమి. సృష్టికి తగు ప్రకృతి లక్షణము సమ పాళ్ళలో గల సూత్ర తత్వము భూమి. ఏదైనా ఎవరైనా భూమి పైనే పంచభూతాత్మకమైన ప్రకృతి వలననే ప్రకృతి తత్వాన్ని తెలియగలరు. యిలా తెలియుటయే విదు ఙ్ఞానము. యిదే మహా దేవ లక్షణము. మహా అనే శబ్దము వక్క శక్తికే తప్ప యితర పదార్ధ రూపమునకు లేదు. మహా అనే శబ్దం మామూలు వ్యక్తులు లేక సమూహమునకు అన్వయం కుదరదు. నమకం చమకం మంత్ర శక్తి పురుషసూక్తం లో వివరంగా అన్వయం జరిగినా ప్రకృతి దాని పరిణామ సూత్రములు తెలియవు. ప్రకృతి లక్షణము ద్వారానే అదియును పదార్ధ రూపమై రస లక్షణమై అనుభవించిన గానీ దాని గురించి యిది యని తెలియదు. దానినే వేదం తత్ సత్ యని ప్రతిపాదన. తత్ అనగా ఏదైతే తెలియబడినదో అది సత్ ఎల్లవేళలా పదార్ధ రూపముగా మార్పు చెందుతూ తెలియుచున్నది. దట్ తత్ వకటే  that  దట్ తెలిసినది సత్ అయినది. Sath శనికి రూపం. సత్ శని వలననే సమస్త జీవ లక్షణము. సూర్య శక్తిని తెలియుటకై శని ద్వారానే సమస్త పరిణామం చెందినదని తెలియుచున్నది.ప్రధమ పరిణామ క్రమంలో శని ఆవిర్భావం. నమకం చమకం మంత్రములయందు  గల శబ్ద లక్షణము గ్రహించుటయే సృష్టి ధర్మం వివరణ. యిది శని వలననే ఆది చైతన్యమునకు మూలం. సూర్య శక్తితో సమాన ప్రవృత్తి శనికి మాత్రమే కలదు. ఆ తరువాతనే మిగిలిన కాంతి తత్వం తెలిసినది. దీని సూత్రమును గమనించిన ౦ పూర్ణము విసర్గగా రెండు పూర్ణ ములుగా మారినది.అప్పుడు ఆ రెండింటి తత్వం తెలిసి వాటి రెండు కలిసి మెుదటి తత్వము తోగూడి మూడు తత్వములు గుణములుగా మూడు పూర్ణములుగా తెలిసినది.ప్రధమ తక్వం ౦ పూర్ణము సమాంతర ముగా రెండుగా మారి మూడవది కూడా అదియును మూడు గోళ తత్వములు గల కోణ ప్రకృతి త్రిమూర్య్త రూపకమైన గుణ తత్వమైనదని తెలియుచున్నది. 

దీనిని సవివరంగా రుద్ర మంత్రం తెలుపుతున్నది.గ్రహ నక్షత్ర మండలంలో శనికి యున్న ప్రాధాన్యత వేరు గ్రహములకు లేదు. యిది సూర్య సంబంధమైన ప్రకృతి చంద్ర శక్తికి శని వలననే అపరిమిత లక్షణము గల అజేయమైన ప్రకృతి గా ధర్మంగా వున్నదని మనకు ఖగోళ,జ్యోతిష విజ్ఞానము తెలుపుచున్నది. అదే ప్రకృతి ధర్మంగా తెలియుచున్నది.దీని నిర్ణయము కూడా సమాంతర రేఖలు పుష్యమి శ్రవణం మకర కర్కాటక తత్వము లుగా అనగా శని చంద్ర గ్రహ రాశి తకేవములుకు అధిపతులుగా శని చంద్రుల లక్షణములుకు మూలమైన శివ శివానీ లక్షణములుగా తెలియును. శని యనగా అమ్మ తత్వం అది విష్ణు తత్వం. వేంకటేశ తత్వం. అందుకే అటువంటి వేంకటేశ తత్వరూపంలో గల శివారాధన సగుణారాధ విధానమని తెలియుచున్నది. అదే మనకు జీవ లక్షణముగా ప్రకాశించుచున్నది. అనంతమైన ఙ్ఞానమును తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: